
ములుగు ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు
జయశంకర్‌జిల్లా: మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలపునిచ్చిన సందర్భంగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. జయశంకర్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రకటన దృష్ట్యా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నరు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వాజేడు మండలం కృష్ణాపురం శివారులో బుధవారం తెల్లవారుజాము నుంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.