
సాక్షి, ములుగు: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటిక ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. దీంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, సీతక్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి ఇంటా వెలుగులే. బీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఆడబిడ్డగా ములుగు ప్రజలు ఆదిరించారు. చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. నా జీవితానికి ఇంకేం కావాలి. నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు. నేనెప్పుడూ మీ సేవకురాలినే.
నేను ములుగు ప్రజల వెంటే ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను. నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నాను. వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు. వారికి ఆడబిడ్డ ఉసురు తగులుతుంది. నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నా కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటాను. పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తాను. ఎన్నికల్లో కష్టపడ్డ అందరికీ కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment