సాక్షి,వరంగల్: ములుగు జిల్లాలో ఆదివారం(డిసెంబర్1) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఏటూరునాగారం చల్పాక సమీపంలో కూంబింగ్ చేస్తుండగా గ్రేహౌండ్స్ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది వీళ్లే..
1. కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, టీఎస్‌సీఎమ్ కార్యదర్శి ఇల్లందు-నర్సంపేట
2. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్
3. ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్
4. ముస్సాకి జమున
5. జైసింగ్, మావోయిస్టు పార్టీ సభ్యుడు
6.కిషోర్, మావోయిస్టు పార్టీ సభ్యుడు
7.కామేష్, మావోయిస్టు పార్టీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment