నయంకాని రోగంతో బాధపడుతున్న వ్యక్తి పటాన్‌చెరులోని సాకి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది.
హైదరాబాద్(పటాన్‌చెరు): నయంకాని రోగంతో బాధపడుతున్న వ్యక్తి పటాన్‌చెరులోని సాకి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు...కరీంనగర్ మిట్టపల్లికి చెందిన నాగేళ్ల జీరయ్య(55) పదేళ్లుగా పటాన్‌చెరులోని గొల్లబస్తీలో ఉంటున్నారు. పాషమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. పరిశ్రమలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో నయంకాని వ్యాధిఉన్నట్లు తేలింది. అది తగ్గదని భావించి మనోవేదనకు గురై సాకిచెరువులో పడి మృతిచెందాడని పోలీసులు భావిస్తున్నారు.
శనివారం రాత్రి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆదివారం సాకిచెరువులో శవమై కనిపించారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని సీఐ తెలిపారు.