health check up
-
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే.. -
డాక్టర్లు లేకుండానే ఆరోగ్య పరీక్షలు... ఏఐ మహత్యం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కొత్త పుంతలు తొక్కుతుంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మనిషి చేసే దాదాపు అన్ని పనులను యంత్రాలు చేయగలిగేలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వైద్య రంగంలోనూ సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది ఏఐ. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. బీపీ, షుగర్ నుంచి స్కానింగ్ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్లను కృత్రిమంగా అందిస్తుంది. మనకు ఏదైనా జ్వరం వచ్చినా, అనారోగ్యంగా అనిపించినా ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ వద్దకు పరుగులు తీస్తాం. సమస్యను బట్టి ఆయా డాక్టర్‌ను ఎంచుకుంటాం. కానీ ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొభైల్లోనే మన హెల్త్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన వినూత్న హెల్త్ క్లినిక్ ఫ్లాట్ఫారమ్ను ఇప్పుడు పరిశోధకులు అభివృద్ది చేశారు. జిమ్, మాల్స్, ఆఫీసుల్లో ఏఐ ఆధారిత కేర్పాడ్స్ను అమెరికాలో ఈమధ్యే ప్రారంభించారు. పేషెంట్స్ లోపలికి అడుగుపెట్టగానే రొబాటిక్ వాయిస్ మెసేజ్‌తో గైడెన్స్ లభిస్తుంది. మన మొబైల్లో లాగిన్ అయ్యి స్క్రీన్‌పై చూపిస్తున్న ఫీచర్లలో మన అనారోగ్యానికి సంబంధించిన వాటిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీకు బాడీ స్కానింగ్ చేయించుకోవాలనిపిస్తే స్క్రీన్‌పై కనిపించే ఆఫ్షన్‌ను ఎంచుకొని చెకప్ చేయించుకోవచ్చు. మన బాడీలో సూది గుచ్చకుండానే బ్లాడ్ సాంపిల్స్ కలెక్ట్ తీసుకొనే అరుదైన ఫీచర్ ఇందులో ఉంది. హార్ట్ హెల్త్, బ్రెయిన్, బీపీ.. ఇలా మీ సమస్యకు సరిపోయే వైద్య సహకారం క్షణాల్లో లభిస్తుంది. కేర్ పాడ్స్‌లో నమోదైన పేషెంట్ డేటాను డాక్టర్‌కు పంపిస్తుంది. నిమిషాల్లో మీ పరిస్థితిని సమీక్షించి మొభైల్లో రిపోర్ట్స్‌ను పంపిస్తారు. ప్రైమరీ డాక్లర్ల కొరతను కేర్ పాడ్స్ రిప్లేస్ చేస్తుందన్నమాట. నెలకు 8200 మెంబర్ షిప్ కట్టి ఎప్పుడైనా మీ హెల్త్ అప్డేట్ను తెలుసుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో కొన్ని మాల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో చాండ్లర్, అరిజోనా,చికాగో సహా మరిన్ని ప్రాంతాల్లో చేరువ చేసేందుకు ప్రణాళికులు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ డాక్టర్ కేర్‌ను కొందరు కొట్టిపారేస్తున్నారు. ప్రత్యక్షంగా డాక్టర్‌ను కలిసినప్పుడే పేషెంట్స్ చెప్పే కొన్ని విషయాలను బట్టి సమస్యను తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా బయటకొచ్చిన సందర్భాలు ఎన్నో. కానీ ఇలా మెషీన్ సహాయంతో పేషెంట్ పరిస్థితి పూర్తిగా అంచనా వేయకపోవచ్చు అనే కొందరు విమర్శిస్తున్నారు. -
వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా.. తోడుగా రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ: వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తోడుగా వెళ్లనున్నారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. అయితే, సోనియా ఏ దేశం వెళుతున్నారు, ఎప్పుడు వేళ్తున్నారనే వివరాలను మాత్రం తెలపలేదు. మరోవైపు.. సెప్టెంబర్ 4న నిర్వహించే మెహంగాయ్ పార్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. ‘వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తిరిగి ఢిల్లీకి వచ్చే ముందు ఆమె తన తల్లిని కలవనున్నారు.’ అని జైరాం రమేశ్ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 7 ప్రారంభం కానున్న కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో విదేశాలకు వేళ్తున్నట్లు ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సైతం దగ్గరపడుతుండటం గమనార్హం. ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల -
వైద్య పరీక్షల కోసం అమెరికాకు పయనమైన రజనీకాంత్
సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న తలైవా సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా పయనమయ్యారు. ఈ క్రమంలో శనివారం చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ కెమెరా కంటించి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కొన్ని సంవత్సరాల క్రితంరజనీ అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత సంవత్సరం కోవిడ్ -19 ఆంక్షల కారణంగా, ఆయన అమెరికా వెళ్లలేకపోయారు. అయితే ఈ సారి కోవిడ్ వేవ్ కారణంగా విదేశాలకు వెళ్ళేందుకు ఆంక్షలు ఉండటంతో రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అమెరికా వెళ్ళడానికి అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం రజనీకాంత్‌కు అనుమతి ఇవ్వడంతో శనివారం ఉదయం తన భార్యతో కలిసి చెన్నై నుంచి స్పెషల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరారు. ఈ స్పెషల్ ఫ్లైట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నారు. కొన్ని వారాల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఆయన తిరిగి జూలై 8 న భారత్ కు వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లుడు ధనుష్ కూతురు ఐశ్యర్య అమెరికాలోనే ఉన్నారు. సినిమాల విషయానికొస్తే..రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో రజనీ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న. ఈ సినిమాలో తెలుగు నటుడు సత్యదేవ్ ఓ కీలకపాత్రలో నటిస్తునున్నారు. దీపావళీ పండుగ సందర్భంగా నవంబర్ 4న అన్నాత్తే విడుదల కానుంది. చదవండి: శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్ Superstar @rajinikanth left to #USA earlier today for regular health checkup. #Thalaiva #Rajnikanth pic.twitter.com/BXYmkhsYeR — VamsiShekar (@UrsVamsiShekar) June 19, 2021 -
విదేశాల్లోని భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చే ప్రక్రియను 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. విమానాలు, నౌకల ద్వారా దశలవారీగా వారిని తీసుకువస్తామని, డబ్బులు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే అనుమతిస్తామని, భారత్ వచ్చాకా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సోమవారం హోం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల తర్వాత 2 వారాల పాటు వారు ఆసుపత్రిలోగానీ క్వారంటైన్‌లోగానీ డబ్బులు చెల్లించి ఉండాలి. 14 రోజుల తర్వాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలకనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఆయా దేశాల్లోని భారతీయ ఎంబసీలు భారత్‌కు వచ్చేవారి జాబితాను రూపొందిస్తాయి. భారత్‌కొచ్చాక ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలను విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ వెబ్సైట్లలో త్వరలో పొందుపరుస్తారు. మార్చి 23న అన్ని అంతర్జాతీయ ప్రయాణాలను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. -
క్యాన్సర్ – చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు అన్నవి వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కూడా ఈ చికిత్స విధానాలు మారుతూ ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, ఫొటోడైనమిక్, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికి ఇవి ఖరీదైనవే అయినా మున్ముందు కొంతవరకు తగ్గవచ్చు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు సరిగా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ మందుల ప్రభావం మిగతా అవయవాల మీద కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు, నిర్ణీత కాల వ్యవధిలో బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలతో పాటు, ఆయా అవయవాల పనితీరును తెలుసుకునేందుకు అవసరమైన ఇతర పరీక్షలూ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే క్యాన్సర్ చికిత్సతో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని, అవి ఫెయిల్యూర్ స్థితికి వెళ్లి, ఒక్కోసారి రోగి మరణించడం కూడా జరగవచ్చు. అందుకే క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై వీటి దుష్ప్రభావం ఉండకుండా చూసేందుకు, వీలైనంతగా తగ్గించేందుకు ఇప్పుడు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స : రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలను ముందే తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ : పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. ఇవన్నీ ముందే అనుమానించి జాగ్రత్తపడటానికి చేసే శస్త్రచికిత్సలు. క్యూరేటివ్ సర్జరీ : క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో థెరపీ లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. పాలియేటివ్ సర్జరీ : క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. ఒక్కోసారి ఇతర చికిత్సలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేలా కూడా, ఈ తరహా సర్జరీలను... సపోర్టివ్ సర్జరీలుగా కూడా చేస్తారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగించడం జరుగుతుంది. కానీ బయటకు కనిపించే అవయవాలైన రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, ఆయా అవయవాల పనితీరు మెరుగుపడటానికీ, దాంతోపాటు రోగుల్లో ఆత్మన్యూనతా భావం రాకుండా ఉండటానికి శరీరంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్నీ, ఎముకలనూ సేకరించి, అలాగే వాటికి ఇతర మెటల్, ప్లాస్టిక్స్‌తో చేసిన ప్రోస్థటిక్స్ను ఉపయోగించి, ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. వీటిని వెంటనే చేయవచ్చు లేదా చికిత్స పూర్తయ్యాక కూడా చేయవచ్చు. కీమోథెరపీ : క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, గొంతు రంగుమారడం, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో థెరపీ అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ తాత్కాలికమే. ఒక్కోసారి చికిత్స పూర్తయ్యాక పూర్తిగా ఇంతకు ముందులాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఈ థెరపీని 1950వ సంవత్సరం నుంచి చేస్తున్నారు. దాదాపు వందరకాలకు పైగా ఉన్న ఈ క్యాన్సర్ మందులను పిల్స్, లిక్విడ్స్, రక్తనాళంలోకి ఇచ్చే మందులు (ఐవీ), ఇంజెక్షన్స్, చర్మంపైన రుద్దేమందులు, వెన్నులోకి, పొట్టలోకి ఇచ్చే ఇంజెక్షన్లు... ఇలా అనేక రకాలుగా ఇస్తుంటారు. క్యాన్సర్ కణాలను చంపడానికి, మళ్లీ మళ్లీ అది తిరగబెట్టకుండా ఉండటానికి ఈ మందులను రకరకాల కాంబినేషన్లలో కూడా ఇస్తారు. ఇటీవలి కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఈ చికిత్సలు అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ : వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక్కో క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్సల వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. పై చికిత్సలే గాక... స్టెమ్‌సెల్ థెరపీలో, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనోథెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
నిలకడగా వైఎస్ జగన్ ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు శనివారం మరోసారి పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి ఎండీ సాంబాశివారెడ్డి తెలిపారు. గాయం తీవ్రత కారణంగా వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. కత్తిపోటు గాయం నుంచి సేకరించిన రక్త నమూనాలు ల్యాబ్‌కు పంపించగా.. ఆ రిపోర్టులు వచ్చాయని, బ్లడ్ శాంపిల్స్‌లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో గుర్తించామని సాంబాశివారెడ్డి తెలిపారు. విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ని శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. కత్తిపోటుకు గురై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్లో చేర్పించగా.. డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయన ఎడమచేతి భుజానికి తొమ్మిది కుట్లు వేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతి రోజంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గాయానికి వేసిన కుట్లు చిట్లిపోకుండా ఉండేందుకు ఎడమ చేతికి సర్జికల్ బ్యాగ్ అమర్చారు. -
ఎయిమ్స్‌లో వాజ్‌పేయి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావటంతో ఎయిమ్స్‌కు తరలించారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్ నోట్ మీడియాకు విడుదల చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వాజ్‌పేయి గురించి కొన్ని ఫేక్ న్యూస్‌లు వైరల్ కాగా, కొన్ని మీడియా ఛానెళ్లు ఇప్పుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బ్రేకింగ్‌లు ఇవ్వటం గమనార్హం. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదో ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే. వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు ఆయన అందుకున్నారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు సందేశాలు పెడుతున్నారు. Former PM AB Vajpayee admitted in AIIMS. @ThePrintIndia pic.twitter.com/mSzVh0z0wt — Pragya Kaushika (@pragyakaushika) 11 June 2018 -
ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు
కాకినాడ (తూర్పు గోదావరి) : కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు శుక్రవారం సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 150/100, షుగర్ లెవల్స్ 123 ఉండగా.. పల్స్ రేట్ 80గా ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 130/80, షుగర్ లెవల్స్ 81గా ఉండగా.. పల్స్ రేటు 88గా ఉందని వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ మాట్లాడుతూ.. పద్మావతికి షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నట్టు తెలిపారు. నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి కాకినాడ సమీపంలోని కిర్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆయన ఇంటిగేట్లను పోలీసులు మూసివేశారు. -
రోగం బెంగతో బలవన్మరణం
హైదరాబాద్(పటాన్చెరు): నయంకాని రోగంతో బాధపడుతున్న వ్యక్తి పటాన్‌చెరులోని సాకి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు...కరీంనగర్ మిట్టపల్లికి చెందిన నాగేళ్ల జీరయ్య(55) పదేళ్లుగా పటాన్‌చెరులోని గొల్లబస్తీలో ఉంటున్నారు. పాషమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. పరిశ్రమలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో నయంకాని వ్యాధిఉన్నట్లు తేలింది. అది తగ్గదని భావించి మనోవేదనకు గురై సాకిచెరువులో పడి మృతిచెందాడని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆదివారం సాకిచెరువులో శవమై కనిపించారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
‘ఖని’లో ఆగని శిశు మరణాలు
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : గోదావరిఖనిలో శిశు మరణాలు ఆగడం లేదు. వరుస సంఘటనలతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. మాతాశిశు మరణాల నివారణకు ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితం రావడం లేదు. రికార్డుస్థాయిలో ప్రసావాలు జరుగుతున్న స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నాలుగు రోజులుగా శిశువులు కడుపులోనే మృతి చెందుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. బుధవారం ఆస్పత్రిలో మరో శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. మంథని మండలంలోని కాకర్లపల్లికి చెందిన పైడాకుల సంపత్, స్వరూప(22) దంపతులు. స్వరూప రెండోసారి గర్భందాల్చడంతో ‘ఖని’ శారదానగర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కడుపునొప్పిగా ఉందనడంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం వరకు స్వరూపను పట్టించుకోని వైద్యులు, పరిస్థితి విషమంగా ఉందని థియేటర్లోకి తీసుకుపోయారని భర్త సంపత్ తెలిపారు. ఉదయం కడుపులో బిడ్డ మంచిగానే ఉందని చెప్పి, బిడ్డ గుండె కొట్టుకోవడం లేదని చనిపోయిన మగ బిడ్డను చేతిలో పెట్టారని రోదించాడు. థియేటర్లోకి వచ్చేటప్పటికే కడుపులో శిశువు చనిపోయి ఉందని, కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాతనే ఆపరేషన్ చేశామని వైద్యులు వెల్లడిస్తున్నారు. వరుస సంఘటనలు.. గోదావరిఖనిలో నాలుగు రోజులుగా వరుసగా కడుపులోనే శిశువులు మృతి చెందుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. వైద్యుల పర్యవేక్షణలోపమా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే విషయాలు తెలియక గర్భిణులు, వారి కటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. స్థానిక కళ్యాణ్‌నగర్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న స్థానిక చంద్రబాబుకాలనీకి చెందిన పోగుల ప్రమీళ కడుపులోనూ ఆరునెలల శిశువు మృతి చెందాడు. శారదానగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంథని మండలానికి చెందిన కీరా అనే గర్భిణీకి ఆది వారం ఆపరేషన్ చేయగా కడుపులో శిశువు మృతి చెంది ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆల్లపల్లికి చెందిన ఆవుల నాగలక్ష్మి కూడా ఇదే ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి ప్రసవం కోసం చేరగా, మంగళవారం క డుపులోనే మరణించిన శిశువుకు జన్మనిచ్చింది. కమాన్‌పూర్ మండ లం రొప్పికుంటకు చెందిన శ్యామల కూడా మంగళవారం ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో శిశువు మృతి చెందిందని కరీంనగర్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తిరిగి ఆస్పత్రిలో చేర్చుకున్నప్పటికీ, ఆందోళనతో బుధవారం వారు మరో ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిశు మరణాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వణికిస్తున్న ఏవియన్ ఇన్‌ప్లుయెంజా!
సాక్షి, హైదరాబాద్: స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్‌లతో సతమతమవుతున్న భారత్‌ను ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా-హెచ్7ఎన్9 వైరస్ భయపెడుతోంది. ప్రమాదకరమైన ఈ వైరస్ లక్షణాలు దేశంలో కనిపిస్తున్న సంకేతాలు అందడంతో సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలతో కూడిన హోర్డింగ్‌లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేశారు. పక్షుల ద్వారా సంక్రమించే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ తీవ్రత చైనా, తైవాన్ దేశాల్లో ఎక్కువగా ఉంది. ఈ వైరస్ సోకితే గొంతు వాపు, శ్వాస సరిగా అందకపోవడం, జ్వరం, నిస్సత్తువ తదితర ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతూ ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ లక్షణాలున్న రోగిని గుర్తిస్తే, ఆ వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. హజ్ యాత్రికులకు అవగాహన: మధ్యప్రాచ్య దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా కనిపించింది. సౌదీ అరేబియాతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ దేశాలకు మన దేశం, రాష్ట్రం నుంచి చాలా మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతూ ఉండడం ఆందోళనకు కారణమవుతోంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 7వేల మంది హజ్ యాత్రకు అనుమతించింది. మరో ఆరు వేల మంది కూడా అక్కడికి ప్రైవేటుగా వెళ్లి వస్తుంటారు. దీంతో హజ్ యాత్రికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధవహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. యాత్రికులకు అవగాహన కలిగించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సౌదీలో రాష్ట్ర వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచనున్నారు. హజ్ యాత్రికులకు తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్ట్‌లోనే వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సేకరించిన నమూనాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఢిల్లీలోని వ్యాధి నిర్ధారణ కేంద్రం లేదా పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి గానీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
జగన్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు
-
జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు
హైదరాబాద్ : జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం జైలు అధికారులు డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం మరోసారి ఆయనకు వైద్యులు పరీక్షలు చేయనున్నారు. అనంతరం జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సమన్యాయం చేయాలంటూ జగన్ చంచల్‌గూడ జైలులో నిరాహార దీక్షకు దిగి 30 గంటలు దాటింది. నిన్న ఉదయం ఆరు గంటలకు ఆయన తన దీక్ష మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆయన ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఆయనకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు కోరినప్పుడు జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తాను ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో జైలు అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.