
న్యూఢిల్లీ: వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తోడుగా వెళ్లనున్నారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. అయితే, సోనియా ఏ దేశం వెళుతున్నారు, ఎప్పుడు వేళ్తున్నారనే వివరాలను మాత్రం తెలపలేదు.
మరోవైపు.. సెప్టెంబర్ 4న నిర్వహించే మెహంగాయ్ పార్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. ‘వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తిరిగి ఢిల్లీకి వచ్చే ముందు ఆమె తన తల్లిని కలవనున్నారు.’ అని జైరాం రమేశ్ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 7 ప్రారంభం కానున్న కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో విదేశాలకు వేళ్తున్నట్లు ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సైతం దగ్గరపడుతుండటం గమనార్హం.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల
Comments
Please login to add a commentAdd a comment