న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీమరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీగతేడాది చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది.
భారత్ జోడో యాత్ర తరహాలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయల్దేరనున్నారు. ముందుగా దీనికి భారత్ ‘న్యాయ్ యాత్ర’ అని నామకరణం చేశారు. అయితే, ఇప్పుడు యాత్ర పేరులో స్పల్ప మార్పులు చేశారు. . రాహుల్ చేపట్టే ఈ రెండో విడత యాత్రకు 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'గా పేరు మార్చారు. ఈ మేరకు యాత్ర వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు.
Here is the route map of the Bharat Jodo Nyay Yatra being launched by the Indian National Congress from Manipur to Mumbai on January 14, 2024. @RahulGandhi will cover over 6700 kms in 66 days going through 110 districts. It will prove as impactful and transformative as the… pic.twitter.com/ZPxA5daZEb
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలోనే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేశ్ వెల్లడించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?
కాగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. . ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం అవుతుండగా, మార్చి 30న ముగియనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 15 రాష్ట్రాలు, 66 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. 6700 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటిస్తారు.
దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారని జైరాం రమేశ్ వెల్లడించారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో సాగనుంది.
అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment