Sonia Gandhis health
-
ఆసుపత్రికి సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా.. సాధారణ పరీక్షల కోసం ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియా గాంధీని చుట్టుముట్టాయి. ఇటీవలే మెడకల్ చెకప్ కోసం విదేశాలకు సైతం వెళ్లొచ్చారు సోనియా. మరోవైపు.. సోనియా గాంధీకి తోడుగా ఉండేందుకు ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నారని, యూపీలో భారత్ జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చనే వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా? -
వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా.. తోడుగా రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ: వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తోడుగా వెళ్లనున్నారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. అయితే, సోనియా ఏ దేశం వెళుతున్నారు, ఎప్పుడు వేళ్తున్నారనే వివరాలను మాత్రం తెలపలేదు. మరోవైపు.. సెప్టెంబర్ 4న నిర్వహించే మెహంగాయ్ పార్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. ‘వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తిరిగి ఢిల్లీకి వచ్చే ముందు ఆమె తన తల్లిని కలవనున్నారు.’ అని జైరాం రమేశ్ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 7 ప్రారంభం కానున్న కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో విదేశాలకు వేళ్తున్నట్లు ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సైతం దగ్గరపడుతుండటం గమనార్హం. ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల -
సోనియాను అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సింది: మోడీ
కాంగ్రెస్ పార్టీపై నిరంతరం కత్తులు దూసే బీజేపీ అగ్రనాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలను కాసేపు పక్కనపెట్టారు. కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను అన్ని సౌకర్యాలు గల అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాల్సిందని అభిప్రాయపడ్డారు. సోనియా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను అన్ని సౌకర్యాలు గల అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాల్సింది. సోనియాను ఆస్పత్రికి తరలించడంలో అత్యవసర వైద్య విధానాలు పాటించలేదు. లోక్‌సభ నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చేటపుడు వీల్ చైయిర్ లేదా స్టైటర్ వాడాల్సింది' అని మోడీ ట్విటర్లో పోస్ట్ చేశారు. సోనియా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆహార భద్రత బిల్లుపై సోమవారం రాత్రి లోక్‌సభలో ఓటింగ్ కొనసాగుతుండగా సోనియా గాంధీ అస్వస్థకు గురైయ్యారు. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కుమారి సెల్జా ఆమెను కారులో ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి అయ్యారు.