సోనియాను అంబులెన్స్లో తీసుకెళ్లాల్సింది: మోడీ
కాంగ్రెస్ పార్టీపై నిరంతరం కత్తులు దూసే బీజేపీ అగ్రనాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలను కాసేపు పక్కనపెట్టారు. కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను అన్ని సౌకర్యాలు గల అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాల్సిందని అభిప్రాయపడ్డారు.
సోనియా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను అన్ని సౌకర్యాలు గల అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాల్సింది. సోనియాను ఆస్పత్రికి తరలించడంలో అత్యవసర వైద్య విధానాలు పాటించలేదు. లోక్సభ నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చేటపుడు వీల్ చైయిర్ లేదా స్టైటర్ వాడాల్సింది' అని మోడీ ట్విటర్లో పోస్ట్ చేశారు. సోనియా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఆహార భద్రత బిల్లుపై సోమవారం రాత్రి లోక్‌సభలో ఓటింగ్ కొనసాగుతుండగా సోనియా గాంధీ అస్వస్థకు గురైయ్యారు. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కుమారి సెల్జా ఆమెను కారులో ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి అయ్యారు.