న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు.
గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment