కాకినాడ (తూర్పు గోదావరి) : కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు శుక్రవారం సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 150/100, షుగర్ లెవల్స్ 123 ఉండగా.. పల్స్ రేట్ 80గా ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 130/80, షుగర్ లెవల్స్ 81గా ఉండగా.. పల్స్ రేటు 88గా ఉందని వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ మాట్లాడుతూ.. పద్మావతికి షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నట్టు తెలిపారు.
నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి కాకినాడ సమీపంలోని కిర్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆయన ఇంటిగేట్లను పోలీసులు మూసివేశారు.
ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు
Published Fri, Feb 5 2016 7:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement