FAST
-
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్జీవోకు చెందిన డాక్టర్ అవతార్ సింగ్ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(జీఎఫ్ఆర్)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. దీంతో, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్‌ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. -
క్షీణిస్తున్న మంత్రి ‘ఆతిషి’ ఆరోగ్యం
న్యూఢిల్లీ: తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీకి హర్యానా ప్రభుత్వం మరింత నీటిని విడుదల చేయాలన్న డియాండ్‌తో ఢిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం(జూన్24) ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా ఆతిశీ మీడియాతో మాట్లాడారు. తన రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని చెప్పారు. బరువు తగ్గానని తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అయినా తాను ఢిల్లీ ప్రజల తరపున పోరాడతానన్నారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి మరింత నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా ఢిల్లీకి విడుదల చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఢిల్లీలో 28 లక్షల మంది ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఆతిశీ దీక్షకు మద్దతుగా క్యాండిల్‌లైట్ మార్చ్ నిర్వహిస్తామని ఆప్ తెలిపింది. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లో ప్రకాష్ రాజ్ బర్త్‌డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్‌చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
ముస్లిం మహిళలకు ప్రత్యేక వ్రతాలు, ఉపవాసాలు ఉంటాయా?
ఉత్తరాదిన కర్వా చౌత్ పండుగ నాడు స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరిస్తారు. ఇదేవిధంగా దక్షిణాదిన కూడా భర్త దీర్ఘాయుష్షు కోసం భార్యలు పలు వత్రాలు ఆచరిస్తుంటారు. అయితే కొందరు ముస్లిం స్త్రీలు తమ భర్త క్షేమం కోసం కర్వాచౌత్ ఉపవాసం పాటించినట్లు పలు ఫొటోలు వైరల్ అవుతుంటాయి. నిజానికి ముస్లిం మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ ఉపవాసం పాటిస్తారా? ఇటువంటి నియమమేమైనా ఇస్లాంలో ఉందా? ఇంతకీ ఇస్లాంలో ఉపవాసానికి సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాంలో సాధారణంగా మూడు రకాల ఉపవాసాలు ఉంటాయి. వీటిలో పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాలు చాలా ముఖ్యమైనవి. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇందుకు చాలా నియమాలు ఉన్నాయి. కొంతమంది ముస్లింలు రంజాన్ ఉపవాసానికి భిన్నమైన రీతిలో మొహర్రం సమయంలో కూడా ఉపవాసం ఉంటారు. వీటితో పాటు కొందరు ముస్లింలు నఫిల్ ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఈ ఉపవాసాలు పాటించేందుకు వేర్వేరు నియమాలు ఉన్నాయి. నఫిల్ ఉపవాసం రంజాన్ లేదా ముహర్రం కాకుండా ఇతర సమయాల్లో పాటించే ఉపవాసం. దీనిని ఏ సాధారణ రోజున అయినా పాటిస్తారు. అయితే ముస్లిం మహిళలు ఉపవాసాన్ని ఆచరించాలంటే భర్త నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా వ్రతాలు, ఉపవాసాలు లాంటివి లేవు. ముస్లిం మహిళలు తమ భర్త లేదా పిల్లల కోసం ఎటువంటి ఉపవాసాలు పాటించరు. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి? -
బీజేపీ ఉపవాస దీక్షలో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం బీజేపీ చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం అయ్యింది. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తీసుకెళ్లే క్రమంలో కిషన్‌రెడ్డి సొమ్మసిల్లిపడి పోయారు. ఆ తర్వాత ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. బుధవారం ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టింది. కిషన్‌రెడ్డి నేతృత్వంలో.. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలపరంపరతో సాయంత్రం దాకా గడిచింది. అయితే సాయంత్రం ఆరు దాటగానే.. దీక్షా సమయం ముగిసిందని పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేసి వెళ్లిపోవాలని బీజేపీ నేతలకు సూచించారు. అయితే ఇది 24 గంటల దీక్ష అని.. తెల్లవారు దాకా దీక్ష చేసి తీరతానని కిషన్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆయనతో చాలాసేపు సంప్రదింపులు జరిపారు. ఈలోగా దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. అక్కడున్నవాళ్లను బయటకు పంపించే యత్నం చేశారు. కిషన్‌రెడ్డి మాత్రం లిఫ్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయడానికి కిషన్‌రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రూల్స్ ప్రకారం గడువు ముగిసినా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. -
ఫలించని టీ దౌత్యం : నిరాహార దీక్ష
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్ష సభ్యుల నిరవధిక నిరసన కొనసాగుతుండగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని పచ్చిక బయళ్లలో రాత్రంతా నిరసన కొనసాగించిన ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం పరామర్శించారు. టీకప్పులతో దౌత్యం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులకోసం ఉద్యమిస్తాం.. పార్లమెంటు హత్యకు గురైందనే ప్లకార్డులతో నిరసన కొనసాగిస్తున్న ఎంపీలు మాత్రం "టీ దౌత్యాన్ని" నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ ఆయనను దుయ్యబట్టారు. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించడం విశేషం. (ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్) వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని హరివంశ్ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్టలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. మరోవైపు తనపై దాడిచేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ ఆఫర్ చేయడం గొప్ప విషయమంటూ హరివంశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన ఔదార్యం, శైలి ఆదర్శప్రాయం, ప్రజా స్వామ్యానికి ఇది చక్కటి సందేశం అంటూ ట్వీట్ చేశారు. यह हरिवंश जी की उदारता और महानता को दर्शाता है। लोकतंत्र के लिए इससे खूबसूरत संदेश और क्या हो सकता है। मैं उन्हें इसके लिए बहुत-बहुत बधाई देता हूं। — Narendra Modi (@narendramodi) September 22, 2020 -
అన్నా హజారే దీక్ష విరమణ
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర) : అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం దీక్షను విరమించారు. తన డిమాండ్లను నెరవేర్చేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన హామీతో దీక్ష విరమిస్తున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. లోకాయుక్త నియామకంపై ఫిబ్రవరి 13న మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దీక్ష విరమణ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హజారే వెల్లడించారు. సీఎంతో చర్చలు సంతృప్తికరంగా సాగడంతో తాను సంతోషంగా దీక్ష విరమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. లోక్‌పాల్ అమలు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ దిశగా ఈనెల 13న నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. లోకాయుక్త కోసం జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తారని, రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం స్వయంగా అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధి గ్రామానికి చేరుకుని ఆయనతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర స్ధాయిలో లోక్‌పాల్, రాష్ట్రాల పరిదిలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని అన్నా హజారే చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ముగిసిన హార్ధిక్ పటేల్ ఆమరణ దీక్ష
అహ్మదాబాద్ : పటేళ్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బుధవారం తన ఆందోళన విరమించారు. భవిష్యత్ పోరాటాల కోసం బతికిఉండాలని అనుచరులు నచ్చచెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నేత హార్థిక్ పటేల్ ఆగస్ట్ 25 నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. పటేళ్లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు రుణమాఫీ డిమాండ్లను నెరవేర్చేవరకూ తన ఆందోళన కొనసాగుతుందని హార్థిక్ అంతకుముందు ప్రకటించారు. కాగా పటేల్ దీక్షకు కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది -
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హెదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరపతి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో పాటు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. పలు పరీక్షలు జరిపిన రామ్‌మనోహర్‌లోహియా వైద్యులు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, దీక్ష వెంటనే విరమించాలని వరప్రసాద్‌కు సూచించారు. రక్తంలో షుగర్ లెవల్స్ 72కు పడిపోయాయని, దీక్ష కొనసాగించడం ప్రమాదకరం అని డా. భల్లా వైద్య బృందం తెలిపింది. ఈ పరిస్థితులపై ఏపీ భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పందించారు. వైస్సార్ సీపీ ఎంపీలు దీక్ష విరమించాలని కోరారు. ఇప్పటికే మేకపాటి ఆరోగ్యం క్షీణించిందని తాజాగా వరప్రసాద్ సైతం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే వైద్యుల విన్నపాన్ని వరప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దీక్షాస్థలికి చేరుకున్నారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
‘ఫాస్ట్’తో కోమా నుంచి ఫాస్ట్‌గా బయటకు...
తమకు ప్రియాతి ప్రియమైన వారి గొంతు విన్నప్పుడు రోగి కోమా నుంచి బయటకు రావడం మనం చాలా సినిమాల్లో చూశాం. అది సినిమాటిక్ వ్యవహారం కాదనీ, చాలావరకు వాస్తవమే అంటున్నారు పరిశోధకులు. కోమాలో ఉన్న కొందరి కుటుంబ సభ్యుల గొంతులను పరిశోధకులు రికార్డు చేశారు. ఆ రికార్డును రోగికి వినిపిస్తారు. ఈ ప్రక్రియకు ‘ఫెమిలియల్ ఆడిటరీ సెన్సరీ ట్రైనింగ్’ (ఫాస్ట్) అని పేరు. రోగికి ప్రియమైన వారి గొంతులను కోమాలో ఉన్న సమయంలో హెడ్‌ఫోన్స్ పెట్టి వారికి వినిపించినప్పుడు చాలామంది కోమా నుంచి బయటకు వచ్చేశారట. ఆ సమయంలో రోగుల మెదళ్లలోని ప్రకంపనలను రికార్డు చేసినప్పుడు వారి మెదడు నరాల కణాలు బాగా స్పందించాయని, (మంచి న్యూరల్ యాక్టివిటీ కనిపించిందని) ఫలితంగా వారు వేగంగా కోలుకున్నారని పరిశోధకులు చెప్పారు. ఈ విషయాలను చాలాకాలం కిందటే ‘న్యూరో–రీహ్యాబిలిటేషన్ అండ్ న్యూరల్ రిపేర్’ అనే జర్నల్‌లో పొందుపరచారు. చాలాకాలంగా ఈ ప్రక్రియను కోమా రోగుల విషయంలో అనుసరిస్తున్నారు కూడా. -
వారిని విడుదల చేసేవరకు దీక్ష!
-
వారిని విడుదల చేసేవరకు దీక్ష!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తన నివాసంలోనే టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం గురవారం దీక్షకు దిగారు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాము తలపెట్టిన ఆందోళనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఆ విషయం తెలియగానే తాము ఆందోళన విరమించుకున్నామని కోదండరాం తెలిపారు. అయినా తమ ఆందోళనకు మద్దతు తెలిపిన రైతులను చాలాచోట్ల పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్టయిన రైతులందరినీ విడుదల చేసేవరకు తాను దీక్ష కొనసాగిస్తానని కోదండరాం స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం భూనిర్వాసితులకు హక్కుల కల్పించగా.. తాజాగా ప్రభుత్వం చేసిన చట్టం ఏకపక్షంగా ఉందని ఆయన ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని కోదండరాం పేర్కొన్నారు. కాగా, దీక్ష చేస్తున్న కోదండరాంకు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కులో భూనిర్వాసితులతో దీక్ష చేయాలని టీజేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షను జేఏసీ వాయిదా వేసింది. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా తలపెట్టిన దీక్షకు అనుమతి లభించకపోవడంతో తన నివాసంలోనే కోదండరాం దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కోదండరాం నివాసంలో టీజేఏసీ అత్యవసర భేటీ నిర్వహించింది. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఈ క్రమంలో కోదండరాం నివాసానికి జేఏసీ నేతలు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. టీజేఏసీ తలపెట్టిన భూనిర్వాసితుల హక్కుల సాధన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ జేఏసీ నేతల్ని అరెస్టు చేయడంపై జేఏసీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో జేఏసీ శ్రేణులు పెద్ద ఎత్తున కోదండరాం నివాసానికి చేరుకుంటుండగా.. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. -
బ్రేకింగ్ న్యూస్: ఇంట్లోనే కోదండరాం దీక్ష!
-
విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం
* డిస్కమ్ సీఎండీ హెచ్‌వై దొర ఆదేశం * వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన గుంటూరు (నగరంపాలెం): జిల్లాలో భారీవర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సంస్ధ చైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ హెచ్ వై దొర సంస్థ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. వర్షాల ధాటికి జిల్లాలో ఇప్పటివరకు 1750 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 387 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, 2180 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించటానికి అధికారులు, సిబ్బంది నిర్విరామంగా పనిచేయాలని సూచించారు. బలమైన గాలి, వర్షం వున్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా వుండాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపడడం జరిగితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ టోల్‌ఫ్రీ నంబరు 1800 425 155333 లేదా 1912 నంబరుకు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో అన్ని సర్వీసులకు విద్యుత్ సరఫరా.. –ఎస్ఈ జయభారతరావు భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రెండురోజుల్లో అన్ని సర్వీసులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందిస్తామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు బి.జయభారతరావు సీఎండీకి తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎక్కువ శాతం అంతరాయం ఏర్పడిన సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడు, రెంటపాళ్ళ, క్రోసూరు మండలంలోని పీసపాడు, రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం, గణపవరం, అంచుపాలెం గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. రాజుపాలెం, సత్తెనపల్లిలలో అదనంగా ఇద్దరు డీఈలు, సుమారు 200 మంది సిబ్బందితో, తగిన సామగ్రిని అందుబాటులో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామన్నారు. గత నాలుగు రోజులుగా రాజుపాలెంలోనే ఉండి పనులను స్వయంగాపర్యవేక్షిస్తూ వేగవంతం చేయడానికి సిబ్బందికి సహాయపడుతున్నామని వివరించారు. సీఎండీతో పాటు సీఈ కె.రాజబాపయ్య, డీఈఈలు ఆంజనేయులు, భాస్కర్‌బాబు, పిచ్చయ్య, వసంతరావు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది ఉన్నారు. -
అసలైన ఏలియన్స్ అన్వేషణ మొదలైంది!
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ తన పని ప్రారంభించింది. నైరుతి చైనా గిజూ ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ టెలిస్కోప్ ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిని ప్రారంభించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. విశ్వంలో జీవం కోసం మానవులు సాగిస్తున్న అన్వేషణను ఈ రేడియో టెలిస్కోప్ మరింత ప్రభావవంతంగా చేపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్(ఎఫ్ఏఎస్టీ) పేరుతో నిర్మితమైన దీని కోసం చైనా 1.2 బిలియన్ యువాన్లను ఖర్చుచేసింది. ఇప్పటివరకూ ప్రపంచంలో పెద్ద టెలిస్కోప్‌గా పేరున్న ప్యూర్టోరికో లోని అరెసిబో టెలిస్కోప్‌ను ఎఫ్ఏఎస్టీ ద్వితీయ స్థానంలోకి నెట్టేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుందంటే ఎఫ్ఏఎస్టీ ఎంత భారీ టెలీస్కోపో అర్థం చేసుకోవచ్చు. చైనా తన అభివృద్ధిని చాటుకునేలా సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2020 నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునే దిశగా చైనా అడుగులేస్తోంది. ఎఫ్ఏఎస్టీ నిర్మాణాన్ని 2011లో చైనా ప్రారంభించింది. టెలిస్కొప్ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేందుకు గాను ఆ ప్రాంతంలో 5 కిమీ పరిధిలో ఉన్న సుమారు 10 వేల మందిని స్థానిక ప్రభుత్వం ఖాళీ చేయించింది. -
ఇరోం షర్మిల భద్రత కట్టుదిట్టం
ఆస్పత్రిలో ఇంకా ద్రవాహారమే.. ఇంఫాల్ : మణిపూర్‌లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దుచేయాలంటూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసి మంగళవారం దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల ఇంఫాల్‌లోని ఆస్పత్రిలో కట్టదిట్టమైన పోలీసుల భద్రత మధ్య గడుపుతున్నారు. దీక్ష విరమణను కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద సాయుధ పోలీసు బలగాను మోహరించారు. షర్మిల ప్రస్తుతం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఏళ్లపాటు నిరశన కొనసాగినందువల్ల శరీరం ఒక్కసారిగా ఘన ఆహారానికి మారే పరిస్థితి లేదని, ప్రస్తుతానికి ప్రత్యేక ద్రవాహారాన్ని అందజేస్తున్నామని వైద్యులు చెప్పారు. దీక్షను విరమించినప్పటికీ సైనికచట్టం రద్దు చేసేవరకూ గోళ్లను కత్తిరించుకోరాదన్న, తల దువ్వుకోరాదన్న, ఇంటికెళ్లి తన తల్లిని కలుసుకోరాదన్న నిర్ణయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. దృఢ సంకల్పం, యోగా సాధన 16 ఏళ్ల నిరహార దీక్ష చేసినప్పటికీ షర్మిల ఆరోగ్యం దాదాపు నిలకడగానే ఉండటానికి కారణం తెలిసింది. దృఢ సంకల్పం, నిత్య యోగా సాధన అలవాటే ఆమె ఇంతకాలం జీవించడానికిగల కారణమని షర్మిల సోదరుడు సింఘాజిత్ చెప్పారు. దీక్షకు దిగే రెండేళ్ల ముందే (1998లో) షర్మిల యోగా నేర్చుకున్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ప్రకృతి చికిత్సపై మక్కువతో షర్మిల ఆ కోర్సును ఎంపిక చేసుకోగా అందులో యోగాభ్యాసం కూడా ఉన్నట్లు వివరించారు. -
'మహా దీక్షకు గుడ్‌బై'
-
'మహా దీక్షకు రేపు గుడ్‌బై'
ఇంపాల్: ఎట్టకేలకు తన పదహారేళ్ల అకుంటిత దీక్షకు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ముగింపుపలుకుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తన దీక్షను విరమించేందుకు సర్వం సిద్థం చేసుకున్నారు. ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ షర్మిల నాజల్ ట్యూబ్ ద్వారా మాత్రమే ద్రవ పదార్థం ఆహారంగా తీసుకుంటూ వచ్చారు. మణిపూర్ లో అమలుచేస్తున్న ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఆమె 2000 సంవత్సరం నుంచి ఈ దీక్షను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల అదుపులోనే ఓ ఆస్పత్రిలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆమెను జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె తన దీక్షను విరమించినట్లు ప్రకటించగానే కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటించనుంది. అనంతరం ఆమె తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే వార్తా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. -
కేసుల పరిష్కారంలో వేగం తప్పనిసరి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత గుంటూరు లీగల్: జిల్లాలోని న్యాయమూర్తులు తమ కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత సూచించారు. జిల్లా న్యాయమూర్తుల సమీక్ష సమావేశం ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో నిర్వహించారు. జిల్లాలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పనితీరును స్వయంగా ప్రధాన న్యాయమూర్తి సుమలత సమీక్షించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల పనితీరును అదనపు జిల్లా జడ్జిలు సమీక్షించారు. జూన్, జులై మాసంలో నమోదైన కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన పలు తీర్పులను ఉటంకిస్తూ కేసుల పరిష్కారంలో ఆయా తీర్పులను ప్రామానింగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో జూన్, జూలై మాసాల్లో ఎక్కువ కేసులు పరిష్కరించిన ఒకటో అదనపు జిల్లా జడ్జి గుమ్మడి గోపీచంద్, మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి కె.చింరజీవులు, పిడుగురాళ్ళ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.సుజాతను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా న్యాయమూర్తుల సమీక్ష సమావేశం పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం ఇదే ప్రథమం. పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని వివిధ కోర్టులలో ఉన్న కేసుల వివరాలు, పరిష్కార మైన కేసుల వివరాలను చూపించారు. సమావేశంలో మానవత్వం గురించి తెలిపే సన్నివేశాలు, కుటుంబ సభ్యుల పట్ల చూపే ప్రేమ, అనురాగాలు తదితర సన్నివేశాలను వీడియో ద్వారా చూపారు. సీనియర్ న్యాయమూర్తులు, జూనియర్ న్యాయమూర్తులతో అనుసంధానమై వారికి ఉన్న అనుమానాలను నివత్తి చేస్తూ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బోధించారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి జిల్లాలో కేసుల పరిష్కారంలో వేగం పెంచి జిల్లా న్యాయవ్యవస్థకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మంచి పేరు తెస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చారు. -
‘డబుల్బెడ్రూం’ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆర్డీవో చంద్రశేఖర్ చిగురుమామిడి : డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ సూచించారు. మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా వర్కర్లను నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం మండలంలోని ఇందుర్తిలో నిర్వహిస్తున్న ఆర్ఓఆర్ మోటేషన్ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను పరిశీలించి తక్షణమే అమలు చేయాలని తహసీల్దార్ రాజాగౌడ్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ అక్బర్, ఉపసర్పంచ్ చింతపూల నరేందర్, వార్డు సభ్యుడు బందెల శ్రీనివాస్, తదితరులున్నారు. కాగా ఇందుర్తి జెడ్పీ పాఠశాలలో కొన్నేళ్లుగా ఒకటే గ్రూపు వంట చేస్తుందని, వారిని తక్షణమే తొలగించాలని కొందరు మహిళలు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు
క్రిమినల్ కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులకు కలెక్టర్ క్లాస్ సివిల్ కేసుల్లో రెవిన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణలో పోలీసు యంత్రాంగం అవలంబిస్తున్న వైఖరిపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసుల విచారణలోనూ నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తున్న పలువురు డీఎస్పీలకు ఆయన క్లాస్ తీసుకున్నారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరుతెన్నులపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల విచారణలో పోలీసు శాఖ వేగవంతంగా స్పందించాల్సి ఉండగా, విచారణ పేరుతో వివిధ కేసులను సంవత్సరాల తరబడి సాగదీస్తుండటం సరికాదన్నారు. 2012లో నమోదైన ఓ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కమిటీ ముందు ఉంచని కారణంగా డీఎస్పీల తీరును తప్పుబట్టారు. 4 సంవత్సరాలుగా కేసు విచారణ కొనసాగిస్తూనే ఉంటే, ఇక బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సమావేశం దృష్టికి పలు కేసులు... పెదనందిపాడులో ఐలా మాణిక్యరావు ఇందిరమ్మ ప«థకం కింద నిర్మించిన ఇంటిని రెవిన్యూ అధికారులు కూల్చేశారని కమిటీ సభ్యుడు అంకం శ్యాం ప్రసాద్ సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, గుంటూరు ఆర్డీవోదే తప్పిదమని నిర్ధారించిన హైకోర్టు తిరిగి ఇంటిని నిర్మించాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన 12 ఏళ్ల యాదిద్యరాజును డబ్బు కోసం అపహరించి దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు మరింత వేగవంతంగా స్పందించి ఉంటే బాలుడి ప్రాణాలు కాపాడి ఉండే వారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అన్నారు. గుంటూరు విద్యానగర్‌లో నివశిస్తున్న దళితుడైన యరమాల విజయ్ కుమార్‌పై అక్కడి అగ్ర వర్ణాలు దాడి చేసిన సంఘటనపై గుంటూరు ఆర్డీవో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై కమిటీ సభ్యుడు కొర్కపాటి చెన్న కేశవులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాపట్లలో మోడల్ స్కూల్స్ పేరుతో ఎస్సీ, ఎస్టీ కాలనీలోని పాఠశాలలను విద్యాశాఖాధికారులు విలీనం చేస్తున్న విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయా పాఠశాలలను విలీనం చేయరాదని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పోలీసు, రెవిన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలో 2012 నుంచి నమోదైన 44 కేసులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో 2010 నుంచి నమోదైన 143 కేసులపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో కె. నాగబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లిఖార్జునరావు, అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, రామాంజనేయులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పనులు వేగంగా పూర్తి చేయండి
విజయపురి సౌత్: పుష్కరఘాట్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. విజయపురి సౌత్‌లోని దేశాలమ్మ గుడి, కృష్ణవేణి ఘాట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. ఈ మేరకు డీఈ Ðð ంకటేశ్వరరావును పనులపై ప్రశ్నించారు. భక్తులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని కోరారు. -
కంప్యూటరీకరణతో సేవలు వేగవంతం
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కరీంనగర్‌అగ్రికల్చర్ :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణతో సేవలు వేగవంతమవుతున్నాయని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుస్నాబాద్, గట్టుదుద్దెనపల్లి, చొప్పదండి, గంభీరావుపేట, రాయికల్, సుల్తానాబాద్ సంఘాల కంప్యూటరీకరణ సేవలు, అభివృద్ధిపై శనివారం సమీక్షించారు. హైదరాబాద్ నుంచి టెస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సురేందర్, సీఐవో ఎం.శ్రీనివాస్‌రావు, జిల్లా నుంచి డీసీవో అంబయ్య, డీఏసీవో చంద్రప్రకాశ్ సమీక్షించారు. త్వరలోనే మరిన్ని సంఘాలను కంప్యూటరీకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మెుక్కలు నాటారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, సీఈవో ఎన్.సత్యనారాయణ, డీజీఎంలు నారాయణ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వీడని సంకెళ్లు
► 13 రోజులుగా పోలీసు వలయంలో జిల్లా ► కర్ఫ్యూని తలపించే వాతావరణం ► కాపు ప్రజాప్రతినిధులు, నేతల నిర్బంధాలు ► ఆందోళనకారుల అరెస్టు ► రోడ్లపై బారికే డ్లు, ముళ్లకంచెలతో ఆంక్షలు ► వేలాది మంది పోలీసుల మోహరింపు ► ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నేపథ్యంలో 13 రోజులుగా జిల్లా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. కర్ఫ్యూను తలపించేలా భారీ స్థాయిలో పోలీసులు మోహరింపుతో జనజీవనం స్తంభించింది. తుని ఘటన సందర్భంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 9 నుంచి ముద్రగడ దీక్ష చేపట్టడం, అదే రోజు సాయంత్రం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి బలవంతంగా తరలించడం తెలిసిందే. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. అప్పటినుంచీ రాజమహేంద్ర వరంలో పోలీసు ఆంక్షలు కొనసాగతూండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యమంపై ఉక్కుపాదం... సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేయడంతో సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు వేలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించింది. ఏపీఎస్పీ, ఏఆర్, సీఆర్పీఎఫ్, సివిల్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన సుమారు ఐదు వేల మంది పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్లపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ముద్రగడకు మద్దతుగా శాంతియుతంగా ర్యాలీలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టిన ఆందోళనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. కాపు నేతలు, యువత బయటికి రాకుండా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పలువురు కాపునేతలు, ప్రతిపక్ష కాపు నేతలకు గృహనిర్బంధం విధించారు. దీనిని నిరసిస్తూ మహిళలు పిల్లాపాపలతో రోడ్లపైకి వచ్చి ఆందోనలు చేయడంతో పోలీసులకు వారిపై లాఠీచార్జ్ చేశారు. మహిళల స్ఫూర్తితో యువత రోడ్లపైకి వచ్చి ముద్రగడకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. స్తంభించిన జనజీవనం... ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రోడ్లపై బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడంతో రోజులతరబడి జనజీవనం స్తంభించిపోతోంది. కార్యాలయాలు, ఇళ్లకు వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలతో విసుగెత్తిపోతున్నారు. ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించడంపై మండిపడ్డారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసు వాహనాల సైరన్, మైకుల్లో ప్రచారంతో పోలీసులు హల్చల్ చేస్తున్నారు. దీంతో వ్యాపారాలు లేక వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. రోజూ రాత్రి 10 గంటల వరకూ తెరచి ఉంచే దుకాణాలను ముందుగానే మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. -
జైలులో సాధ్వి ఆమరణదీక్ష
భోపాల్: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో క్లీన్ చీట్ పొందిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ జైలులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు వెల్లేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి దీక్షకు దిగారు. దీనిపై స్పందించిన దేవాస్ లోని న్యాయస్థానం మే 21 లోగా సాధ్విని కుంభమేళాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని సోమవారం పోలీసులను ఆదేశించింది. సాధ్వితో సహా మరో 12 మందిని 2008లో మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మెకా చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2008 అక్టోబర్ నుంచి సాధ్వి జైలులో ఉంటున్నారు. అయితే సాధ్వి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని ఎన్ఐఏ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో పేర్కొంది. -
నిజాం షుగర్స్ దీక్షలో వందమంది..
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్)ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న కార్మికుల నినాదాలతో దీక్షాశిబిరం దద్దరిల్లింది. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం వందరోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు , ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం వంద మంది దీక్షలో కూర్చున్నారు. దీక్షలకు మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ వి.రాఘవులు, బీఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిశంకర్ సంఘీభావం తెలిపారు. -
దారుణం
జిల్లావ్యాప్తంగా రుణాల కోసం 11,904 మంది కాపుల వినతి 53 మందికే యూనిట్ల కేటాయింపు 20,269 బీసీ దరఖాస్తుల్లో 334 మందికే మంజూరు కాపు కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరికీ రుణాలిస్తామని నిరాహారదీక్ష సందర్భంగా కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభానికి హామీ ఇచ్చిన తెలుగుదేశం సర్కారు ఇప్పుడు మాట తప్పింది. దరఖాస్తుదారుల్లో కేవలం 20 శాతం మందికే రుణాలివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రుణాలు కూడా పూర్తిస్థాయిలో ఇచ్చే పరిస్థితి కానిపించడం లేదు. అదేవిధంగా బీసీ కొర్పొరేషన్ కింద వినతులిచ్చినా వారికీ చుక్కెదురవుతోంది. చిత్తూరు: కాపులందరికీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని నట్టేట ముంచారు. కాపు కార్పొరేషన్‌కు రూ. వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని తక్షణం రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది. అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేసింది. 50 శాతం సబ్సిడీ లభిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా సోమవారం నాటికి 11,904 మంది కాపులు రుణాల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి రూ.73 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకున్న వారిలో కేవలం 2,462 మందికి మాత్రమే రుణాలివ్వాలని ఈ నెల 12 నసమావేశమైన బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రూ.14.72 కోట్లను కేటాయించింది. జిల్లావ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో ఈ సంఖ్య 20 శాతం మంది మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరానికి మరో నెల మాత్రమే గడువుంది. గడువు లోపు ప్రభుత్వం చెప్పిన మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేయడం అసాధ్యం. ఇప్పటివరకు 53 మందికి రూ.37 లక్షల రుణాన్ని కాపు కార్పొరేషన్ మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముందు ప్రకటించినట్లు జిల్లా కేంద్రంలో కాపు కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంతవరకు కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దానికి ప్రత్యేక అధికారులను నియమించలేదు. కేవలం బీసీ కార్పొరేషన్ అధికారులే కాపు కార్పొరేషన్ రుణాల మంజూరు వ్యవహారాలను చూస్తున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలన సైతం సక్రమంగా ముందుకు సాగడం లేదు. దీంతో అధికారులు వివిధ రకాల కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పినవారికే రుణాలు ఇవ్వాలి కాపు రుణాలను తాము చెప్పినవారికే ఇవ్వాలంటూ జన్మభూమి కమిటీలు బ్యాంకర్లను బెదిరిస్తున్నాయి. అర్హులను గుర్తించి రుణాలిస్తామని అధికారులు చెప్పినా వారు వినడంలేదు. ఏకంగా కాపు కార్పొరేషన్, బ్యాంకులకు వెళ్లి అధికారులను బెదిరిస్తున్నారు. మంగళవారం పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకుకు వెళ్లిన జన్మభూమి కమిటీసభ్యులు తాము చెప్పినట్లు రుణాలివ్వకపోతే ఉద్యోగం మానుకుని వెళ్లమంటూ అక్కడి మేనేజర్‌ను బెదిరించడం గమనార్హం. బీసీ రుణాలూ హుళక్కే అర్హులైన బీసీలందరికీ రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రుణాల మంజూరులో బీసీలను వంచిం చింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లావ్యాప్తంగా 20,269 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు కేవలం 334 మందికి రూ.3.8 కోట్ల బ్యాంకు రుణాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులో మిగి లిన వారికి రుణాలిచ్చే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 8,377 మంది రూ.75.78 కోట్లు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో కేవలం 334 మందికి మాత్రమే రుణాలిచ్చారు. ఇక బీసీ ఫెడరేషన్ పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను 411 రూట్ల పరిధిలో 6,165 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ కింద రుణాలిస్తామని చెప్పిన బ్యాంకులు కేవలం 221 గ్రూపులకు మాత్రమే మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకున్నాయి. -
కాపు ఉద్యమాన్ని అడ్డుకోలేరు
దోమలగూడ: పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో కాపు ఉద్యమాన్ని అడ్డుకోలేరని, ఆమరణ దీక్ష జరుపుతున్న ముద్రగడ దంపతులకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు హెచ్చరించారు. ముద్రగడ దంపతుల ఆమరణ నిరాహారదీక్షకు సంఘీబావంగా జంటనగరాల కాపు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం కాపుల రిలే నిరాహారదీక్ష లు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఓబీసీ ఎం పీల ఫోరం కన్వీనర్ అయినప్పటికీ కాపుల డిమాండ్ న్యాయసమ్మతమైనది కాబట్టే మద్దతు ఇస్తున్నానన్నారు. కాపు సంఘాల జేఏసీ ఛైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్రావు, నాయకులు శేషాద్రినాయుడు, బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. -
కాపు నాయకుల దీక్ష భగ్నం..!
పీ గన్నవరం: కాపు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా కాపు యువత నేతలు చేస్తున్న దీక్షను అధికారులు భగ్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం సెంటర్లో నిరాహర దీక్ష చేస్తున్న ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆదివారం క్షీణించింది. దీంతో వారి దీక్షను భగ్నం చేసి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాపు రిజర్వేషన్ల కోసం మొత్తం ఎనిమిది మంది ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఆదివారం రాత్రి రెవెన్యూ అధికారులు దీక్షా స్థలికి వద్దకు చేరుకుని దీక్షలో ఉన్న బోడపాటి తాతాజీ, పొలిశెట్టి నాగబాబు, అప్పన సురేష్బాబులను ఆస్పత్రికి తరలించారు. నలుగురు కాపు నాయకుల ఆమరణదీక్ష నర్సాపురం: కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కుప్పర్రు గ్రామంలో నలుగురు ఆదివారం సాయంత్రం ఆరమణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అంకం బన్ను, యాదవరెడ్డి సూరిబాబు, యాదవరెడ్డి రఘుతోపాటు మరొకరు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించేవరకు తమ దీక్ష కొనసాగుతుందని వారు అన్నారు. -
ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు
కాకినాడ (తూర్పు గోదావరి) : కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు శుక్రవారం సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 150/100, షుగర్ లెవల్స్ 123 ఉండగా.. పల్స్ రేట్ 80గా ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 130/80, షుగర్ లెవల్స్ 81గా ఉండగా.. పల్స్ రేటు 88గా ఉందని వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ మాట్లాడుతూ.. పద్మావతికి షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నట్టు తెలిపారు. నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి కాకినాడ సమీపంలోని కిర్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆయన ఇంటిగేట్లను పోలీసులు మూసివేశారు. -
దీక్ష చేస్తున్న విద్యార్థుల పరిస్థితి విషమం!
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లేవల్స్ పడిపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో శుక్రవారం రాత్రి ఏ క్షణంలోనైనా విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన హర్షకుమార్
రాజమండ్రి: క్రైస్తవుల శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలన్న డిమాండ్ తో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేపట్టిన రెండు రోజుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తొలుత హర్షకుమార్ దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించినా.. ఆయన అనుచరులు పోలీసుల్ని అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే హర్షకుమార్ తన వద్దనున్నతుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కాగా, హర్షకుమార్ దీక్షను ఎట్టకేలకు భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించారు. -
మంగళగిరిలో జగన్ నిరాహార దీక్ష
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడి అనకాపల్లి: చంద్రబాబు హామీలు బూటకమయ్యాయని, ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై జూన్ మొదటివారంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల నిరాహారదీక్షకు పూనుకుంటున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖజిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులో గురువారం పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో జగన్ దీక్ష చేపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలముందు, తరువాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, దీనిపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి తీసుకొస్తామన్న నేతలు ఇప్పుడు మాటల గారడీ ప్రదర్శిస్తున్నార న్నారు. -
ఈనెల 10న పొంగులేటి ఒక రోజు రైతుదీక్ష
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 10వ తేదీన ఒక రోజు నిరాహారదీక్ష కు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పొంగులేటి రైతు దీక్ష చేయనున్నట్లు పార్టీ నేతలు ఎడ్మా కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 నెలల కాలంలో 800 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. రైతులకు భరోసా కల్పించడంలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయన్నారు. ఈ దీక్ష కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సూచించారు. -
ఎట్టకేలకు ఆగిన నిరాహార దీక్ష...
సంతకవిటి(శ్రీకాకుళం జిల్లా): కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ గత నాలుగురోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన కూన రాములు తన దీక్షను విరమించాడు. మంగళవారం ఉదయం అక్కడకు చే రుకున్న రాజాం ఎమ్మేల్యే కంబాల జోగులు.. రాముల దీక్షకు మద్దతు పలకడంతో పాటు గ్రామస్తులు ఉన్నతాధికారులు కోరిక మేరకు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళారు. అక్కడ కలెక్టర్ లక్ష్మీనరసింహతో చర్చించిన అనంతరం ఆయన పాలకొండ ఆర్డీఓ సల్మాన్‌రాజ్‌తో కలసి దీక్షా శిబిరం వద్దకు మంగ ళవారం రాత్రి చేరుకున్నారు. మే నెలాఖరులోగా * 5 లక్షలు అంచనా వ్యయంతో తాత్కాలికంగా వంతెన నిర్మాణం జరుగుతుందని, ఈ మేరకు తన కోటాలో నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ జూన్ రెండవ వారంలోగా పూర్తీ స్ధాయిలో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇందుకు పూర్తీ బాధ్యత వహిస్తామని పాలకొండ ఆర్డీఓ తెలిపారు. ఇందుకు గూన రాములు అంగీకరించడంతో కొబ్బరికాయ నీళ్ళు ఇచ్చి ఆర్డీఓ దీక్షను విరమింపజేశారు. -
చావైనా....రేవైనా..
సంతకవిటి(శ్రీకాకుళం జిల్లా): 'చావైనా..రేవైనా..నాతోనే తేలిపోవాలి... ఎక్కడో ఒక మనిషి చనిపోతే కోట్లరూపాయలు వెచ్చిస్తున్నారు. ఇక్కడ కళ్ల ముందే ప్రమాదాలు జరుగుతున్నాయి. గర్బిణీలు, వృద్ధులు, నాలాంటి వికలాంగులు ఇక్కడ వంతెన లేక గతంలో ఉండే చెక్క వంతెన మీద నుంచి వెళ్ళలేక కాలువలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరగుతున్నా కనీసం పుట్‌పాత్ వంతెన కూడా ఎందుకు నిర్మించడంలేదు.. ఉన్న చెక్క వంతెన కూడా కూలీపోయింది. నాకు కుష్టు వ్యాధి ఉంది..నేను జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఇలానే వెళ్లాలి..ఇక్కడ వంతెన లేకపోవడంతో అది కూడా సాధ్యపడదు... చావైనా..రేవైనా..ఈ దీక్షను ఆపను..నా ప్రాణం వంతెన కోసం పోతే..నేతలకు బుద్ది వస్తుంది..అధికారులు అలసత్వం ఆగుతుంది..దయ చేిసి నాకు వైద్యపరీక్షలు వంటివి వద్దు. మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదములు. నాకోరిక మన్నించి వంతెనకు ఇక్కడ శంకుస్ధాపన జరిగితేనే నేను లేచేది. గాలి వచ్చినా..వాన వచ్చినా..ప్రళయం..జరిగినా . ఈ పట్టు వదలను. అని గారన్నాయుడుపేట గ్రామానికి చెందిన కూన రాములు నిరాహార దీక్ష ప్రారంభించాడు. మంగళవారం నాటికి ఆయన చేపట్టిన దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్తితి దిగజారింది. ఆయన కుష్టువ్యాధిగ్రస్తుడుతో పాటు షుగర్ వ్యాధి ఉండడంతో శరీరంసహకరించక కూర్చోలేని పరిస్తితి ఏర్పడింది. చేతులుకు, కాళ్ళుకు చుట్టూ చీమలు, ఈగలు చేరుతున్నాయి. మందులు వాడ కపోవడంతో మనిషి నీరశించడమే కాకుండా చేతులు కాళ్లుబిగుతుగా మారి పరిస్తితి ఆందోళన కరంగా మారింది. నాల్గవరోజు దీక్షకు గారన్నాయుడుపేట గ్రామానికి చెందిన మహిళలు, వృద్దులు, చిన్నారులుతో పాటు పోడలి, చిత్తారిపురం, గుజ్జన్నపేట, పనసపేట, వాల్తేరు, కావలి, జీఎన్‌పురం తదితర గ్రామాలు పలువురు ప్రజలు అక్కడకు చేరుకున్నారు. కూనరాములు దీక్షా శిబిరంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. సిగ్గులేని ప్రభుత్వం.. దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న రాజాం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కంబాల జోగులు మాట్లాడుతూ కూన రాములు దీక్షకు తాను మద్దతుపలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సమయంలో కూడా ఇక్కడ వంతెన నిర్మాణం విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం తన వద్ద నిధులు లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం అదికార పార్టీ అనవసర ఖర్చులకు నిధులు వెచ్చిస్తుందని, ఇటువంటి సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తాను జిల్లా కేంద్రానికి వెళ్ళి కలెక్టర్‌తో మాట్లాడి వంతెన నిర్మాణానికి తన వంతు కృషిచేస్తానని అన్నారు. దీక్షా శిబిరంలో నాలుగు గంటలు పాటు కూర్చున్నారు. ఉద్రిక్తత వాతావరణం.. ఇదిలా ఉండగా అంతకు ముందు దీక్షా శిబిరం వద్దకు రాజాం సీఐ ఎంవీవీ రమణ, సంతకవిటి ఇన్చార్జ్ ఎస్ఐ జి. భాష్కరరావు, ఏఎస్ఐ బీవీ రమణ, సంతకవిటి పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ భార్గవి, నలుగురు ఏఎన్ఎంలు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. రాములు ఆరోగ్య పరిస్తితిని సమీక్షించేందుకు డాక్టర్ బార్గవి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో అక్కడ కొద్దిసేపు ఉద్రికత్త వాతావరణం నెలకుంది. గ్రామస్తులు ససేమిరా అనడంతో పోలీసులు వెనక్కుతగ్గడంతో యధా పరిస్తితి నెలకుంది. అనంతరం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు కొంతమంది గ్రామస్తులును తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్ళారు. -
ఆనాడు అన్న మాటలు గుర్తులేవా?: చెవిరెడ్డి
హైదరాబాద్: గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరెంట్ చార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో నిరాహార దీక్ష చేసిన చంద్రబాబు తాము అధికారంలోకొస్తే ఒక్క రూపాయి కూడా పెంచనని చెప్పిన విషయం గుర్తులేదా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను విస్మరించి చంద్రబాబు ఒక్క కలంపోటుతో కరెంట్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.వెయ్యి కోట్ల భారం మోపారని దుయ్యబట్టారు. కరెంటు చార్జీలను పెంచడాన్ని శాసనసభలో తమ పార్టీ వ్యతిరేకిస్తే.. అధికారపక్షం బరితెగించిందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ కేటగిరీకి ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆయన గుర్తుచేశారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే దాకా పోరాటం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు 115వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బి.వై.రామయ్య మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తూ కంటి తుడుపు చర్యగా చాలీచాలని నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రత్యేక హోదాపై పోరాడే శక్తి టీడీపీకి లేదని, అలా చేస్తే బీజేపీకి దూరమవుతామనే భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రానికి హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని, పోలవరం ప్రాజెక్టుకు రూ. 10 వేలు మంజూరు చేయాలని కోరారు. రిలే నిరాహార దీక్షల్లో జెడ్పీ మాజీ ఛైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఆదోని మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ దేవిశెట్టి ప్రకాశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, వై.రాంబాబురెడ్డి, ఎస్.సలాం, శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.పి.తిప్పన్న, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మజరుల్‌హక్, కార్యదర్శులు ఎ.నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఆర్.ఇమాంపటేల్, రాజ్‌కుమార్, ఖలీల్‌బాష, కాంగ్రెస్ నాయకులు టేకూరు, శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, జి.ఎ.కలాం, జోహరాపురం శేఖర్, అబ్బినాయుడు, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సారమ్మ పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి బండి లాగి నిరసన వ్యక్తం చేసిన మాజీ మేయర్ బంగి కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై నగర మాజీ మేయర్ బంగి అనంతయ్య నగరంలో బండి లాగి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం బుధవారపేటలోని తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు బండి లాగారు. ఈ సందర్భంగా బంగి అనంతయ్య మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్యాబినేట్లో కింగ్‌మేకర్ అయిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెప్పించడంలో విఫలమయ్యారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన వెంకయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్ధానాలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని, నూతన రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకారం అందిస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చినా, ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని నినాదాలు చేశారు. -
'విభజనహామీల్ని తక్షణం అమలు చేయాలి'
తూర్పుగోదావరి : విభజన చట్టంలోని హామీలను కేంద్రం తక్షణం అమలు చేయాలని, లేని పక్షంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. హామీల అమలుకు అవసరమైన పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడేది లేదన్నారు. హామీల అమలుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళితులు అన్ని కులాలు, వర్గాలతో కలిసి రాజ్యాధికారసాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతోద్యోగాలు పొందిన వారంతా తమ పిల్లలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతో ప్రజల్లోకి రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కోటి పంగనామాలు పేరిట కాంగ్రెస్ నాయకులు యాత్ర చేస్తే ప్రజలు హర్షిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు కృష్ణమాదిగ కుయుక్తులు పన్నడం ఇకనైనా మానుకోవాలన్నారు. లేని పక్షంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన వర్గీకరణను కృష్ణమాదిగ భుజాన వేసుకోవడం తన ఉనికిని కాపాడుకునేందుకేనని, దాని వల్ల ప్రయోజనం లేదన్న సత్యాన్ని అందరూ గ్రహించాలని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొండాడ నూకరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నల్లి రాజేష్, సీమాంధ్ర ఇన్చార్జ్ కొంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. (మామిడికుదురు) -
హంద్రినీవా పూర్తయ్యేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తా'
-
'హంద్రినీవా పూర్తయ్యేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తా'
అనంతపురం:హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గురువారం నిరహారదీక్ష విరమించిన అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తానని తెలిపారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. హంద్రినీవా ప్రాజెక్టు చేయాలనే డిమాండ్ తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆయన 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. -
జగన్ దీక్షకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభం
ఉరవకొండ: పశ్చివు గోదావరి జిల్లా తణుకులో ఈనెల 31 నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టే 48 గంటల దీక్షకు, అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేయూలని కోరుతూ ఈ నెల 28, 29 తేదీల్లో ఉరవకొండలో తన సోదరుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే 25 గంటల దీక్షకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. వుధుసూదన్‌రెడ్డి సోవువారం ఉరవకొండ నుంచి పాదయూత్ర చేపట్టారు. అనంతపురంలో ఈ యూత్ర ముగుస్తుంది. -
జగన్ దీక్షను జయప్రదం చేయండి
గురజాల: ప్రజల సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ైవె ఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్షను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గురజాల మాజీ శాసనసభ్యుడు జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అన్ని రకాల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మొదటి విడత జాబితాలో 20శాతం మందికి కూడ పూర్తిగా రుణమాఫీ కాలేదని ,రెండో విడత జాబితా అసంపూర్తిగా విడుదల చేసి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు మొదట్లో ఇచ్చిన పత్రాలనే పదేపదే బ్యాంకుల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వమని కాళ్లరిగేలా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన ప్రతిసారి మాట్లాడనీయకుండా తెలుగుతమ్ముళ్లు అడ్డుకున్నారన్నారు. తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్ష కు పార్టీ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివెళ్లాలని సూచించారు. -
జగన్ దీక్ష విజయవంతం చేయండి
వైఎస్సార్ సీపీ నేతలకు త్రిసభ్య కమిటీ సూచన కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలి సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటి తేదీల్లో తణుకులో జగన్మోహన్రెడ్డి దీక్ష చేస్తున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొనాలని సూచించారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు సమావేశం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అధికార తెలుగుదేశం పార్టీ రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులు, డ్వాక్రా మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పాలన ప్రారంభించి ఏడు నెలలైనా వాటిని అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం పాలకులు అన్నింటికీ సింగపూర్ జపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో రెండు రోజులు దీక్ష చేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు... రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకోవడం దారుణమని విజయసాయిరెడ్డి అన్నారు. అక్కడి ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. తమ పార్టీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. అయితే రైతులను ఇబ్బంది పెట్టకుండా రాజధాని నిర్మించాలనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు మంజూరు చేయకపోగా, పాత రుణాలు చెలిచాలని వరుస నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి జిల్లాలో సగటున రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు రుణాలు మాఫీ కావాల్సి ఉందని వివరించారు. ప్రభుత్వం మాత్రం మొదటి విడత మాఫీ పేరుతో కనీసం వడ్డీకి కూడా సరిపోని విధంగా నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే దీక్షకు పెద్ద సంఖ్యలో రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా వచ్చేలా ఈ కార్యక్రమం గురించి నియోజకవర్గాల్లో నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పర్యవేక్షించాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో రైతులు, మహిళలు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని, పార్టీ నేతలు వారి తరఫున పోరాటం సాగించాలని సూచించారు. సాగి దుర్గా ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీని నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. సభ్యత్వ నమోదుపై చర్చ... త్రిసభ్య కమిటీ సభ్యులు పార్టీ సభ్యత్వ నమోదుపై ముఖ్య నాయకులతో చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు దృష్టి సారించాలని సూచించారు. కృష్ణా జిల్లాలోని 16, గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో నూరు శాతం పార్టీ సభ్యత్వ నమోదు జరిగేలా కృషిచేయాలని చెప్పారు. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి విధివిధానాలు రూపొందించి సభ్యత్వ నమోదు కార్యక్రమ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో వేర్వేరుగా సమావేశమై నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించారు. రెండు జిల్లాల నేతల హాజరు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు (సత్తెనపల్లి), దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), విజయవాడ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), కోన రఘుపతి (బాపట్ల), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ (రేపల్లె), పార్టీ ముఖ్యనేత ఆళ్ల పేరిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు అన్నాబత్తుని శ్రావణ్‌కుమార్ (తెనాలి), కత్తెర క్రిస్టీనా (తాడికొండ), జోగి రమేష్ (మైలవరం), డాక్టర్ దుట్టా రామచంద్రరావు (గన్నవరం), సింహాద్రి రమేష్‌బాబు (అవనిగడ్డ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), నియోజకవర్గ నాయకుడు ఉప్పాల రాంప్రసాద్, కృష్ణా జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు ప్రజలకు చంద్రబాబు నమ్మకద్రోహం
సర్కారు వైఫల్యాలను వివరించేందుకే ఈనెల 31, ఫిబ్రవరి 1న తణుకులో జగన్ దీక్ష వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయకుండా, ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీ ల్లో తణుకులో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. దీక్ష విజయవంతం కోసం పార్టీ త్రిసభ్య కమిటీకి చెందిన విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు శనివారం గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరచిన హామీలను సాధించుకోవడంలో బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ సర్కారు ఘోరంగా విఫలమైందని చెప్పారు. సీఎంగా ఎనిమిది నెలల్లో పదిసార్లు ఢిల్లీ వెళ్లిన బాబు ఏం సాధించారని సాయిరెడ్డి ప్రశ్నించారు. పునర్విభజన సమయంలో ఏపీ బడ్జెట్లో రూ.16 వేల కోట్ల లోటును కేంద్రం భరించేలా ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. రైతులను, ప్రజలను దగా చేసి ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ర్టంలో చేతగాని, అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా కృష్ణా, గోదావరి డెల్టాల రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కదలివస్తారని చెప్పారు. ‘చంద్రన్న సంక్రాంతి కానుక’లో ప్రభుత్వ ప్రచారం ఎక్కువైందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సైతం చెప్పారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై టీడీపీ వర్గీయుల దాడి విషయాన్ని గవర్నర్‌కు, డీజీపీకి వివరించామన్నారు. దాడుల విషయమై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు. కృష్ణా, గుంటూరు నేతలతో సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డిసెంబర్ 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేసేలా కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ ముఖ్యులతో త్రిసభ్య కమిటీ నేతలు సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులు సమావేశమై పలు సూచనలు చేశారు. మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణలు పాల్గొన్నారు. -
సీఎంవోలో కదలని ఫైళ్లు
భారీగా పేరుకుపోతున్న వైనం విధానపరమైన వాటితోపాటు, రొటీన్ ఫైళ్లకూ మోక్షం లేదు రోజువారీ సమీక్షలతో సీఎం బిజీబిజీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. వేయికిపైగా ఫైళ్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వద్ద సాధారణ పరిపాలనతోపాటు పురపాలక శాఖ, పలు సంక్షేమ శాఖలు ఉన్నాయి. సీఎం ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లను చూడకుండా సమీక్షా సమావేశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం పలువురు టెండర్లు దాఖలు చేయగా.. సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతస్థాయి కార్యదర్శుల కమిటీ ధర నిర్ణయించింది. ఈ ఫైలు పెండింగ్‌లో ఉందని సమాచారం. భారీ స్పంద న వచ్చిన నేపథ్యంలో 500 మెగావాట్లు కాకుం డా వెయ్యి మెగావాట్లు తీసుకోవడానికి ముఖ్యమంత్రి అనుమతి కోరుతూ డిస్కమ్‌లు మరో ఫైలు పంపించినా... దానికీ మోక్షం లభించలేదు. ఇక వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ వినియోగించుకునేందుకు ఉద్దేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన పథకం టెండర్లలో అధిక ధర వచ్చిందంటూ ఆ టెండర్లను రద్దు చేశారు. ఆ తరువాత తిరిగి ఏమి చేయాలన్న దానిపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల తెలంగాణ ఇంక్రిమెంట్ ఫైలుపై ఆయన సంతకం చేయలేదని సమాచారం. బహుళ అంతస్తుల నిర్మాణానికి అవసరమైన చోట సడలింపులు ఇచ్చే ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం లేదని తెలిసింది. యాదగిరిగుట్ట పట్టణాభివృద్ధి సంస్థ ఫైలు, ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగ్‌ల ఫైలు కూడా పెండిం గ్లో ఉంది. ‘ఫాస్ట్’ మార్గదర్శకాల ఫైలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు రాలేదు. సీఎం కార్యదర్శులు కూడా ఫైళ్లను క్లియర్ చేయించడంలో చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. -
బరువు తగ్గడానికైతే ఓకే!
దీక్ష చేస్తానన్న నాగంపై మంత్రి లక్ష్మారెడ్డి వ్యంగ్య వ్యాఖ్య ‘కల్వకుర్తి ఎత్తిపోతల’ మూడోదశ పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బరువు తగ్గడానికి మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నిరాహారదీక్ష చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ విద్యుత్‌శాఖ మం త్రి సి.లక్ష్మారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో దశ పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ సంక్రాంతి పండుగ తరువాత నిరాహారదీక్ష చేస్తానన్న నాగం ప్రకటనపై మంత్రి పైవిధంగా స్పందించారు. ఆదివారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీనే కల్వకుర్తి పథకం మూడోదశ పనులు ప్రారంభమయ్యాయని, ఇందుకోసం కాంట్రాక్టర్‌కు రూ.పది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా విడుదల చేశామని చెప్పారు. తన నిరాహారదీక్ష వల్లే పనులు ప్రారంభమయ్యాయని చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందడానికి నాగం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాగం మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈ నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి అవసరాలు తీరాకే మిగిలిన నీటిని జూరాల-పాకాల ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాకు తరలిస్తారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అప్పటిదాకా ఈ పథకాన్ని ప్రారంభించబోమన్నారు. అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం తెలంగాణలోని అన్ని గిరిజన తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, టీపీఆర్టీయూ నేత హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఫాస్ట్’పై సర్కారు మీనమేషాలు
కోర్టుకు కౌంటర్ దాఖలు చేయని తెలంగాణ ప్రభుత్వం నామమాత్రంగానే బకాయిల విడుదల ఇంకా చెల్లించాల్సింది రూ.3,200 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పథకానికి మార్గదర్శకాల విడుదలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం మూడు, నాలుగు సార్లు మొట్టికాయలు వేసినా, తాజాగా కోర్టుకు సమర్పించాల్సిన కౌంటర్‌ను కూడా దాఖలు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా, మంత్రుల ఇళ్లను ముట్టడించినా,చివరకు బంద్‌లకు పిలుపునిచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో విద్యార్థి సంఘాలు ఉమ్మడి నిరసనలకు సిద్ధమవుతున్నాయి. మరో 2 నెలల్లోనే వార్షిక పరీక్షలు జరగాల్సి ఉండగా, దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం తేలక ఆందోళనలకు గురవుతున్నారు. స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఉపకారవేతనాలు అందుతాయో.. లేదో.. అన్న మీమాంస నెలకొంది. రూ.460 కోట్ల మేర ఫీజుల బకాయిలను విడుదల చేసినా, అవి అరకొరే అయ్యాయి. పాతబకాయిల చెల్లింపునకే ఇంకా రూ.600 కోట్లపైగా కావాల్సి ఉండగా, గత ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు, పాత విద్యార్థుల రెన్యూవల్స్‌కు రూ.2600 కోట్ల వరకు చెల్లించాలి. అన్నీ కలిపి రూ.3,200 కోట్లకు పైగా చెల్లించాలి. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీలు ఒత్తిడి తెస్తుండడంతో విద్యార్థులు విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తమ డిగ్రీ చదువు పూర్తయినా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకపోవడంతో వీరు పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. ఈ విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటుందని విద్యార్థిసంఘాలు అంచనావేస్తున్నాయి. కర్కశంగా వ్యవహరిస్తోంది ‘‘ఫాస్ట్ పథకంపై తేల్చాలని, ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సంక్రాంతి తర్వాత విద్యార్థి సంఘాల ఉమ్మడి ఆందోళనలకు సిద్ధ మవుతున్నాం.’’ - శోభన్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు 22న ఫీజు దీక్ష ‘‘ఫీజుల రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఈ నెల 22న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, నేను ఒకరోజు దీక్ష చేస్తాం. తరువాత జిల్లాల్లో రిలే దీక్షలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తాం. సమస్యపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం’’ - శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు -
‘ఫాస్ట్’ ఇంత జాప్యమా?
ఇంకా విడుదల కాని గైడ్ లైన్స్ ఎటూతేల్చని తెలంగాణ ప్రభుత్వం సమీపిస్తున్న పరీక్షలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకంపై సర్కార్ ఎటూ తేల్చకపోవడంతో దాదాపు 16 లక్షల మందికి పైగా విద్యార్థులు(ట్యూషన్ ఫీజు, స్కాలర్షిపై చదివేవారు) త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. పాతవారి రెన్యువల్స్‌కు కూడా అవకాశం కల్పించలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంతరవకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పథకంపై ఆశలు పెట్టుకుని కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. మరో మూడునాలుగు నెలల్లో వార్షిక పరీక్షలు జరగనుండడంతో యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో ట్యూషన్ ఫీజులను కూడా చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. చదువుపైనా సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. స్పష్టత వచ్చేదెప్పుడో? ఫాస్ట్‌కు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాకపోవడం తల్లితండ్రులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్ట్‌లో 1956 స్థానికతపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై ప్రభుత్వ వివరణను కోర్టు కోరింది. అయితే ఫాస్ట్‌పై అధికారులతో కమిటీని వేశామని, ఆ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇక ఈ కేసు తదుపరి విచారణకు వచ్చినపుడు స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఎంతసమయం పడుతుందనేది ఎవరికీ తెలియదు. రెన్యువల్స్వారేఎక్కువమంది.. తెలంగాణలో ప్రస్తుతం వివిధ కోర్సుల్లో ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు, స్కాలర్‌షిప్‌పై ఆధారపడి ఇంటర్, డిగ్రీ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులే 14.29 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో చేరిన వారు మరో లక్షన్నరకు పైగా ఉంటారు. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న వారికి కూడా ఫీజు రెన్యూవల్స్‌కూ అవకాశం కల్పించకపోవడంతో వారిని యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. గత ఏడాది బకాయిలను కూడా సర్కార్ పూర్తిగా చెల్లించకపోవడంతో యాజమాన్యాల ఒత్తిడి అధికమైంది. అప్పులు చేస్తూ, వడ్డీలు కడుతూ నిర్వహిస్తున్నాం నిరుద్యోగులమైన మేము ఉపాధికోసం అప్పులు తెచ్చి కళాశాల ఏర్పాటు చేశాం. ప్రతీనెల రూ. నాలుగు లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ బకాయిలు రాలేదు. దీంతో నిర్వహణ కష్టంగా మారింది. మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది. - మహిపాల్‌రెడ్డి, కరస్పాండెంట్,శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల, హుజూరాబాద్ మమ్మల్నే చెల్లించమంటున్నారు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఫస్టియర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు రాలేదు. యాజమాన్యాం ఫీజు చెల్లించాలని అడుగుతోంది. మాది నిరుపేద కుటుంబం. ఫీజు చెల్లించే పరిస్థితి లేదు. - నరేశ్ నాయక్, నల్లగొండ ఫీజు రాక.. అప్పు చేసి చెల్లించాం తమకు ప్రభుత్వంపై నమ్మకం లేదని, ప్రభుత్వం ఇవ్వకపోతే మీరే చెల్లించాలని యాజమాన్యం మాతో ఒప్పంద పత్రం రాయించుకుంది. అది రాసిచ్చినా ఫీజు రాకపోవడంతో తరువాత ఒప్పుకోలేదు. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించాకే హాల్‌టికెట్ ఇచ్చారు. - మహిపాల్, ఆర్మూర్ గత ఏడాది ఫీజులే రాలేదు కరవు పరిస్థితుల్లో మేము ఫీజులు చెల్లించే పరిస్థితి లేదు. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో ఫీజు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. - పి.శ్రావణి, మిర్యాలగూడ -
ప్రియుడి ఇంటి ముందు నిరాహార దీక్ష
పగిడ్యాల (కర్నూలు) : ప్రేమించి.. పెళ్లి చేసుకుని తనను వంచించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ సోమవారం కర్నూలు జిల్లా పగిడ్యాల మండలంలోని పడమర ప్రాతకోట మైనార్టీ కాలనీలోని ప్రియుడి ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టింది. బాధితురాలు భావన కథనం మేరకు.. పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన షేక్ జబివుల్లా నాలుగేళ్ల క్రితం పని నిమిత్తం రంగారెడ్డి జిల్లా ఘట్కేసరి మండలం బోడుప్పల్‌కు వెళ్లాడు. అక్కడ హోటల్ నిర్వాహకుడి కుమార్తె భావనతో పరిచయమైంది. కొంతకాలానికి అతడు ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. తాను వివాహితనని, తనకు భర్త, పిల్లలు ఉన్నారని చెప్పినా జబివుల్లా చెప్పినా వినిపించుకోలేదు. జబివుల్లాతో భావనకు ఉన్న పరిచయాన్ని చూసి ఆమెను భర్త వదిలేశాడు. ఈ నేపథ్యంలో జబీవుల్లా, భావన 2011 ఏప్రిల్‌లో భువనగిరిలోని ఎల్లమ్మ దేవాలయంలో స్నేహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో రెండున్నరేళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో జబివుల్లా ప్రాతకోటకు వెళ్లాడు. అయితే, ఆరు నెలలుగా ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి భావన ప్రాతకోటలో ఆరా తీసింది. మరొక యువతిని జబివుల్లా పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయింది. తనకు న్యాయం చేయాలని ఆవాజ్ కమిటీ సభ్యుల వద్ద పంచాయితీ పెట్టింది. అయితే, న్యాయం లభించకపోవడంతో జబివుల్లా ఇంటిముందు నిరాహారదీక్ష చేపట్టింది. తనను భార్యగా జబివుల్లా అంగీకరించకపోతే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని విలేకరులకు తెలిపింది. తాను ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని తన తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడం లేదని, మరోవైపు డబ్బుల కోసం వచ్చానని జబివుల్లా తల్లిదండ్రులు తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని కన్నీటిపర్యంతమైంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. తన దృష్టికి కూడా ఈ సమస్య వచ్చిందని, అయితే బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామన్నారు. -
ఇది తెలంగాణ ప్రభుత్వానికి అవమానకరం!
హైదరాబాద్: ఫాస్ట్ పథకాన్ని హైకోర్టు ఆక్షేపించడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్మే డా. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ఇప్పటికే 5 సార్లు కోర్టులు తప్పబట్టాయని ఎద్దేవా చేశారు. అయినా సీఎం కేసీఆర్ వంటెద్దు పోకడలను, ఏకపక్ష వైఖరిని తగ్గించుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. బేషజాలు, పట్టింపులకు పోకుండా స్థానికత అంశాన్ని రాద్దాంతం చేయకుడదన్నారు. ఇందుకు అన్ని పార్టీల వారిని విశ్వాసంలోకి తీసుకుని ఫాస్ట్ పథకానికి స్పష్టతనివ్వాలన్నారు. కాలేజీ బకాయిలను చెల్లించి విద్యార్థుల అడ్మిషన్లలో ఉన్న గందరగోళానికి తొలగించాలన్నారు. -
సీఎంకు పాలనా అనుభవం లేదు: పొన్నాల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలనా అనుభవం ఏమాత్రం లేదన్న విషయం మరోసారి తేలిపోయందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఫాస్ట్ పథకంతో పాటు నెంబరు ప్లేట్ల మార్పు అంశంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో ఈ విషయం స్పష్టం అయ్యిందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగానే ఫాస్ట్ పథకం ఉండాలని అన్నారు. రుణమాఫీ విషయంలో షరతులు విధించకూడదని, కుటుంబానికి ఒక రుణమే మాఫీ చేస్తామనడం సరికాదని తెలిపారు. అలాగే ఆదర్శ రైతుల వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సరిచేయాలి గానీ, ఏకంగా ఆ వ్యవస్థనే రద్దుచేయడం సరికాదని పొన్నాల తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కేసీఆర్ వ్యవహరించాలని సూచించారు. -
కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ
మన రాష్ట్రం.. మన విధానాలు.. మన నిర్ణయాలు.. అనుకుంటూ ఎడాపెడా జీవోలు ఇచ్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుసపెట్టి రెండు ఎదురుదెబ్బలు ఒకేసారి తగిలాయి. ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ గురించి హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో 1956 నుంచి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజులు ఇచ్చేలా 'ఫాస్ట్' అనే పథకాన్ని రూపొందించిన తెలంగాణ సర్కారుతీరును హైకోర్టు తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న వాహనాలన్నింటి నెంబర్ల సిరీస్‌ను 'ఏపీ' నుంచి 'టీఎస్'కు మార్చాలన్న ఉత్తర్వులపైనా మండిపడింది. వాస్తవానికి నెంబర్ ప్లేట్ల విషయంలో ప్రజల నుంచి మరీ అంత ఎక్కువ స్థాయిలో వ్యతిరేకత రాకపోయినా.. 'ఫాస్ట్' పథకం విషయంపై మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి గట్టిగానే నిరసన వ్యక్తమైంది. తెలంగాణ స్థానికత అంటూ కొంతమంది విద్యార్థులకు ఫీజులు ఇచ్చేది లేదని చెప్పడం సరికాదని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందినవారే అయినా.. 1956 నుంచి స్థానికత అంటే అందుకు ఆధారాలు తేవడం కష్టమని చెప్పారు. ఇలాంటి వాటివల్ల అందరికీ ఇబ్బంది అవుతుందన్నారు. అయినా టీఆర్ఎస్ సర్కారు మాత్రం.. తాను అనుకున్నట్లే దీనిమీద నిర్ణయం తీసేసుకుంది. దీన్ని కొంతమంది హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయని, ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారని ప్రశ్నించింది. మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుందని నిలదీసింది. మరోవైపు వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఇదే తరహాలో ఘాటుగా వ్యాఖ్యానించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొన్న వాహనాలను 'టీఎస్' సిరీస్‌లో రిజిస్టర్ చేయడమంటే అందులో అర్థం ఉంది గానీ.. ఉమ్మడి రాష్ట్రంలోని వాహనాలను కూడా తిరిగి రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. సర్కారు నిర్ణయాలు ఎంత మాత్రం హేతుబద్ధంగా లేవని, దీనర్థం తెలంగాణ ప్రజలు మాత్రమే రాష్ట్ర ప్రజలని కాదు. రాష్ట్రంలో ఉన్న వారంతా కూడా రాష్ట్ర ప్రజలే అవుతారని తెలిపింది. -
కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు మొదటి దశ కౌన్సెలింగ్ కన్వీనర్ కోటా సీట్లను శనివారం కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి 575 కళాశాలల్లో 1,16,029 మంది విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఈ సీట్లను కేటాయించింది. ఈ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 1,89,088 సీట్లు అందుబాటులో ఉండగా.. 73,059 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 57,372 సీట్లు మిగిలిపోగా, తెలంగాణలో 15,677 సీట్లు మిగిలినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలో యాజమాన్య కోటాలో కూడా భారీగా సీట్లు మిగిలిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంసెట్ సీట్ల కేటాయింపు వివరాలు https://eamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంసెట్ ప్రవేశాల కోసం 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహించారు. ఎంసెట్ అర్హులు మొత్తంగా 2,03,450 మంది ఉండగా.. 1,22,389 మంది మాత్రమే తనిఖీకి హాజరయ్యారు. ఇందులో 1,20,098 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను (మొత్తంగా 36 లక్షల ఆప్షన్లు) ఇచ్చుకున్నారు. వారిలో 1,16,029 మందికి సీట్లను కేటాయించగా... మిగతా వారికి ఆప్షన్లు ఇచ్చుకున్న కాలేజీల్లో సీట్లు రాలేదు. ఈ వివరాలను విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేశారు. యాజమాన్య కోటా పరిస్థితి ఏమిటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి యాజమాన్య కోటాలో మరో 81,037 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు మిగిలిపోగా... యాజమాన్య కోటాలో ఎన్ని మిగిలిపోతాయోనని యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రముఖ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లు సులువుగానే భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగతా కాలేజీల పరిస్థితి కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాజమాన్య కోటాలో తెలంగాణలో 29,364 సీట్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో 51,673 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి భర్తీకి ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ కూడా జారీ చేసి.. సెప్టెంబరు 15లోగా ఆ ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది. రెండో దశ కౌన్సెలింగ్‌పై త్వరలో నిర్ణయం.. ఇంజనీరింగ్, ఫార్మసీ రెండో దశ కౌన్సెలింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాల కమిటీ సమావేశమై ఆ తేదీలను ఖరారు చేస్తుందని వెల్లడించారు. అడ్మిషన్ విధానం ఇదీ.. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబరు, లాగిన్ ఐడీ, పుట్టినతేదీ, పాస్వర్డ్ ఉపయోగించి తమ సీటు కేటాయింపు ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజు వర్తించే విద్యార్థులు ఉంటే.. ఇండియన్ బ్యాంకు, రెండు రాష్ట్రాల్లోని ఏదేని ఆంధ్రా బ్యాంకు శాఖలో చలానా రూపంలో చెల్లించాలి. సీటు కేటాయింపు ఆర్డర్, ఫీజు చెల్లించిన చలానాలను రెండు సెట్ల కాపీలు తీసుకుని సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్టు చేయాలి. 1వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు.. 2వ తేదీన 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకు.. 3వ తేదీన 1,00,001 నుంచి 1,50,000 ర్యాంకు వరకు.. 4వ తేదీన 1,50,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీల్లో రిపోర్టు చేయని వారు 5వ తేదీన రిపోర్టు చేయవచ్చు. హెల్ప్‌లైన్ కేంద్రం వారు కౌంటర్ సైన్ చేసి అలాట్మెంట్ ఆర్డర్‌పై తమ స్టాంపు వేసి, విద్యార్థులకు అందజేస్తారు. విద్యార్థి సంబంధిత కాలేజీలో 6వ తేదీలోగా రిపోర్టు చేయాలి. విద్యార్థులు తరువాతి దశ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనవచ్చు. అయితే చివరి దశ కౌన్సెలింగ్ తరువాతే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, చలానాలను కాలేజీల్లో అందజేయాలి. చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవద్దు. ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దు. హెల్ప్‌లైన్ కేంద్రంలో కౌంటర్ సైన్ చేసిన అలాట్మెంట్ ఆర్డర్‌ను మాత్రమే తీసుకొని విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకోవాలి. అయితే ఒకటో తేదీన చేరిన వారికి ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభమైనట్లు పరిగణిస్తారని, 7వ తేదీ నుంచి మొదటి దశలో కాలేజీల్లో చేరిన వారందరికీ తరగతులు ప్రారంభిస్తారని ఓ అధికారి వెల్లడించారు. సీట్ల కేటాయింపు ఆర్డర్లో ఫీజుల వివరాలు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు లభించిన విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన వివరాలు సదరు విద్యార్థి సీటు కేటాయింపు ఆర్డర్లో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి ర ఘునాథ్ వెల్లడించారు. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉన్నందున... విద్యార్థికి కేటాయించిన కాలేజీకి సంబంధించిన ఫీజు వివరాలు, అర్హతలు, చెల్లింపు నిబంధనలను అందులోనే పొందుపరిచినట్లు చెప్పారు. 10 వేల ర్యాంకు దాటితే రూ. 35 వేలే! ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉన్నందున ఆయా నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాలని రఘునాథ్ వెల్లడించారు. దాని ప్రకారం.. 10 వేల ర్యాంకులోపు విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థుల్లో 10 వేల ర్యాంకుపైన వచ్చినవారికి రూ. 35 వేల కనీస ఫీజును మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని సదరు విద్యార్థే భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో ‘ఫాస్ట్’ మేరకు.. ఇక తెలంగాణలో 1956 స్థానికత ప్రామాణికంగా ‘ఫాస్ట్’ పథకాన్ని అమలు చేయనున్నందున .. ఆ నిబంధనల మేరకు ఫీజుల విధానం ఉంటుంది. అయితే తెలంగాణలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యేందుకు 3 నెలలు సమయం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి వరకు విద్యార్థులను ఫీజులు అడుగవద్దని ఫాస్ట్ మార్గదర్శకాల కమిటీ యాజమాన్యాలను కోరింది. దీనికి వారు అంగీకరించారు కూడా. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జారీ అయ్యాక తెలంగాణలో ఫీజుల చెల్లింపుపై తదుపరి చర్యలు ఉంటాయి. -
షర్మిల విడుదల
ఇంఫాల్: మణిపూర్‌లో అమల్లో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించాలంటూ 14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల (41) బుధవారం తాత్కాలిక జైలు (ప్రభుత్వాస్పత్రిలోని ఓ గది) నుంచి విడుదలయ్యారు. తూర్పు ఇంఫాల్‌లోని పోరంపట్లో ఉన్న ఆస్పత్రి నుంచి ఆమె చెమర్చిన కళ్లతో బయటకు వచ్చారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ గతంలో కేసు పెట్టిన ప్రభుత్వం దాన్ని నిరూపించడంలో విఫలమైనందున షర్మిలను విడుదల చేయాలని తూర్పు ఇంఫాల్‌లోని సెషన్స్ కోర్టు మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పును దేవుని దయగా అభివర్ణించారు. తాను విడుదల కావడం సంతోషంగా ఉన్నప్పటికీ వివాదాస్పద ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని ఉపసంహరించే వరకూ నిరాహారదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. న్యాయం కోసం తాను చేస్తున్న ఉద్యమానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. అనంతరం ఆమె ఆస్పత్రి ప్రాంగణంలో నిరాహారదీక్షను కొనసాగించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థుల ఇక్కట్లు
ఫాస్ట్... పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం సంగతేమో గానీ, విద్యార్థులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారోనని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. స్థానికత అంశం తేలే వరకు ఫీజులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫాస్ట్ మార్గదర్శకాలు ఖరారు అయితే తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. నీలగిరి ఫాస్ట్(తెలంగాణ విద్యార్థులకు ఆర్థికసాయ పథకం) కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదు. స్థానికత అంశం తేలే వరకు ఫీజులు విడుదల చేయడం సా ధ్యంకాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఈ పథకం అమలు ఎప్పుడు అవుతుందో ఏమోకానీ గతేడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నేటికీ విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోం ది. ఫీజు బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిచేస్తున్నాయి. కోర్సు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. 2013-14కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ చార్జీలు కలిపి జిల్లాలో మొత్తం రూ.107.50 కోట్లు బకాయిలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఫాస్ట్ పథకం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. స్థానికత అంశం తేలే వరకు ఫీజులు విడుదల చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఫాస్ట్ పథకం మార్గదర్శకాలు రూపొందిం చాల్సి ఉంది. 1956 స్థానికతను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం గతేడాది ఫీజులు విడుదల చేయాలని భావిస్తే మాత్రం చాలా మంది విద్యార్థులు నష్టపోవాల్సి ఉంటుంది. ఇది లావుంటే ఈ ఏడాది కొత్తగా ప్రవేశాలకు సంబంధించి ఫీజులు, ఉపకార వేతనాల కోసం ద రఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆన్లైన్ ప్రక్రియ మొదలుకాలేదు. ఫాస్ట్ మార్గదర్శకాలు ఖరారు అయితే తప్ప ఆన్లైన్ నమోదు చేసుకోవడం కుదరదని అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళన... గతేడాది ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెన్యువల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కోర్సు పూర్తి చేసిన వారు తదనంతర చదువుల కోసం మరొక ప్రాం తానికి వెళ్లాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించకపోడంతో కళాశాలల యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు మొండి కేస్తున్నాయి. బకాయిలు ఇవీ.. జిల్లాలో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మా ఇతర కాలేజీలు కలిపి మొత్తం 570 ఉన్నాయి. 2013-14 సంవత్సరానికి సంబంధించి ఎస్టీ విద్యార్థులకు రూ.31 కోట్లకు గాను రూ.22 కోట్లు విడుదల అయ్యాయి. ఇంకా రూ.11 కోట్లు రావాల్సి ఉంది. దీంట్లో రూ.10 కోట్లు ఫీజులు కాగా, మెస్ చార్జీలు కోటి రూపాయలు. బీసీ విద్యార్థులకు రూ.83 కోట్లు , ఎస్సీ విద్యార్థులకు రూ. 14.50 కోట్లు రావాల్సి ఉంది. ఇవిగాక మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బకాయిలు కూడా ఉన్నాయి. -
'తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంలేదు'
-
'తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంలేదు'
హైదరాబాద్: మీరు ఏ పథకమైనా పెట్టుకోండి ఏ రోజు అడ్మిషన్ అయితే ఆ రోజే ఫీజులు చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద నమ్మకం లేకనే అడ్మిషన్ రోజునే ఫీజులు చెల్లించాలని అడుగుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 31లోపు పాత బకాయిలన్నీ చెల్లించాలని ఆయన కోరారు.ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో పాత విధానాలే కొనసాగించాలన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) కమిటీ ప్రశ్నలకు రమేష్ ఘాటుగా స్పందించారు. మీరు కాలేజీలు వ్యాపారంలాగా పెట్టుకున్నారా? అని కాలేజీ యాజమాన్యాలను ఫాస్ట్ కమిటీ ప్రశ్నించింది. తాము వ్యాపారం చేయడం కాదు, తమ డబ్బులతోనే జెఎన్టియు, ఎంసెట్ ఆఫీసులు నడుస్తున్నాయని రమేష్ పేర్కొన్నారు. -
ఊహించని విధంగా పితానిని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఆచంగ టిడిపి శాసనసభ్యుడు పితాని సత్యనారాయణకు హైకోర్టులో ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పథకానికి వ్యతిరేకంగా పితాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫాస్ట్ పథకంతో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా మీరేమైనా స్థానిక ఎమ్మెల్యేనా అని కూడా కోర్టు పిటిషనర్ పితానిని ప్రశ్నించింది. ఈ విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోర్టు వివరణ కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయిబర్స్మెంట్కు సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించింది. ఈ జీవో వివాదస్పాదమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పేదవిద్యార్థులు అనేకమంది ఉన్నారు. స్థానికత సమస్య తీసుకువచ్చి ఒక్క తెలంగాణ విద్యార్థులకే ఫీ రియింబర్స్‌మెంట్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని సవాల్ చేస్తూ పితాని సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాం దాఖలు చేశారు. -
తెలంగాణ వాసులూ ఆధారాలు చూపలేరు!
విద్యార్థులకు ఫీజులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకానికి 1956 నుంచి స్థానికులై ఉండాలన్న ప్రాతిపదిక సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఫీజుల చెల్లింపునకు స్థానికత నిర్ధారించడానికి 1956 ప్రాతిపదిక అయితే.. నిజమైన తెలంగాణ వాసులు కూడా ఆధారాలు చూపించలేరని ఆయన అన్నారు. తమిళనాడులో తల్లిదండ్రులు స్థానికులు అయితేనే పిల్లలకు ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందుతున్నాయని, అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా స్థానికత విధానం ఉంటే బాగుంటుందని జానారెడ్డి చెప్పారు. -
ఏపీ మంత్రులది అజ్ఞానం
1956 కటాఫ్ ‘ఫాస్ట్’ పథకానికే పరిమితం: విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ అనే పథకానికి మాత్రమే స్థానికతను నిర్ధారించేందుకు ‘1956’ ఏడాదిని కటాఫ్‌గా పరిగణనలోకి తీసుకుంటామని, దాని ఆధారంగానే ఫీజులను చెల్లిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై మార్గదర్శకాల రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఆ కమిటీ రూపొందించే మార్గదర్శకాలతో త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల్లోనూ స్థానికత నిర్ధారణకు ఈ కటాఫ్‌ను ప్రాతిపదికగా తీసుకుంటారేమోనని ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెబుతున్నారని ప్రశ్నించగా... ‘ఫాస్ట్’ పథకానికి మాత్రమే దానిని వర్తింపజేస్తామని చెప్పారు. సినిమాల్లోలాగా కథలు చెప్పడం ఏపీ మంత్రులకు అలవాటని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు కేసీఆర్‌తో పోటీయా? ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను నిలబెట్టుకునేందుకు కేసీఆర్ కేబినెట్లోనూ తీర్మానం చేశారు. అదే చంద్రబాబు మాత్రం విమర్శలు, ప్రకటనలు, కోర్టు కేసులు, అవీ ఇవీ అంటూ చిల్లర తగాదాలు పెట్టుకుంటూ.. అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. చేతనైతే ఏపీ ప్రజలకు మంచి పనులు చేయండి.. చేతకాకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేమని చెప్పుకోండి..’’ అని మంత్రి సూచించారు. ఏపీ సీఎం, మంత్రులకు జ్ఞానం ఉన్నట్లు కనిపించడం లేదని... వారు ప్రగల్భాలు, తెలంగాణపై విమర ్శలతో పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ‘‘అసలు వారు రాజధానిని ఎక్కడ పెట్టుకుంటారో ఇప్పటికీ తేల్చలేదు. ఇక్కడే ఉండి ప్రభుత్వం నడుపుకొంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో బ్రెయిలీ లిపిలో పాఠ్యపుస్తకాలు భవిష్యత్తులో అంధ విద్యార్థుల కోసం బ్రెయిలీ లిపిలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వపరంగా అందుబాటులోకి తేనున్నట్లు విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న యాదేశ్వరీ.. అంధుల కోసం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలో రూపొందించారు. ఆ పుస్తకాలను గురువారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. అంధుల కోసం ఈ పుస్తకాలను రూపొందించినందుకు ఆమెను అభినందించారు. అన్ని స్కూళ్లకు వీటిని ఉచితంగా అందించేందుకు ఆమె ముందుకు వచ్చారన్నారు. ఈ పుస్తకాల కోసం అంధ పాఠ శాలల ప్రిన్సిపాళ్లు.. ఆమెను సంప్రదించాలని చెప్పారు. -
వ్యవసాయం చేస్తోంది!
దీక్ష సంపాదించిన వాడికే ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది, అది దాతృత్వంతో ఇచ్చే విరాళమైనా సొంతంగా సంపాదించింది అయితే ఆ ఆనందమే వేరు... అని అంటుంది కేటీ . అనాథల ఆకలిని తీర్చడానికి పాటు పడుతోంది ఈ యువతి. ఏడేళ్ల కిందట తొమ్మిదేళ్ల వయసులో కేటీ సేవా దృక్పథం చిగురు తొడిగింది. ఇప్పుడు మొగ్గగా విరిసింది. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. దాతృత్వం కొద్దీ తమ దగ్గర ఉన్న డబ్బును విరాళంగా ఇచ్చిన వారిని చూసి ఉంటాం. వ్యక్తిగతంగా కష్టపడి వలంటీర్లుగా పేరు తెచ్చుకొన్నవారిని కూడా చూస్తున్నాం. అయితే ఈ రెండింటికీ భిన్నంగా సొంతంగా పంటలు పండించి, ఆ పంటను విరాళంగా ఇస్తోంది కేటీ స్టాగ్లియానో(16). కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రాంతానికి చెందిన కేటీ ఇప్పటి వరకూ లెక్కలేనన్ని రోజులపాటు కొన్ని వందల మంది ఆకలిని తీర్చింది. వివిధ అనాథ ఆశ్రమాలకు నిత్యం కాయగూరలను సరఫరా చేస్తూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొంది. ఖాళీ స్థలమే సేవకు పెట్టుబడి... ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న జాగాను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కేటీ తల్లిదండ్రులది. అందులో భాగంగా వారు స్థలాన్ని చదును చేసి క్యాబేజీ పండించాలని అనుకొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాలుపంచుకొంది కేటీ. ఖాళీ సమయంలో కలిసి పనిచేసి క్యాబేజీ సాగు చేశారు. మంచి దిగుబడి సాధించారు. అప్పటికే కేటీలో స్థానిక అనాథ ఆశ్రమంపట్ల అపారమైన జాలి ఉంది. తనకంటే తల్లిదండ్రులు ఉన్నారు అన్నీ చూసుకొంటారు. మరి వారికోసం ఎవరున్నారు? వారి కోసం ఏదైనా చేస్తే బావుటుందనేది ఆమె భావన. ఈ నేపథ్యంలో తాము పండించిన క్యాబేజీని మార్కెట్‌కు తరలించి అమ్మడం కన్నా, అనాథాశ్రమానికి డొనేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మాటే కేటీ తల్లిదండ్రులను అడిగింది. ఆమె తల్లిదండ్రులు కూడా సరదాగా పనిచేశాం, ఖాళీ స్థలంలో సాగు చేశాం... అనే భావనతో కేటీ మాటకు సరేనన్నారు. ఆ క్యాబేజీని అనాథాశ్రమాలకు ఇచ్చారు. ఆ విషయంలో కలిగిన తృప్తి కేటీని అమితానందపరిచింది. పరోపకారంలో ఉన్న ఆనందాన్ని మరింతగా ఆస్వాధించాలన్న ఆలోచనకు కారణమైంది. అంతే అదే జాగాలో మరో పంటను పెట్టే విధంగా తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ సారి తనే ఎక్కువ బాధ్యతలు తీసుకొంటూ ఉత్సాహంతో పనిచేసింది. క్యాబేజీతో పాటు కాప్సికం, టమాటో, బీర జాతికి చెందిన వివిధ పంటలను సాగు చేయించింది. యథాతథంగా స్థానిక అనాథాశ్రమాలకు కాయగూరలను ఇచ్చింది. అక్కడ నుంచి అదే తీరున దూసుకెళ్తోంది కేటీ. చేస్తున్న పని గురించి చెప్పి క్లాస్మేట్లను కలసిరమ్మని కోరింది. ఈమె పిలుపునందుకొని అనేక మంది టీనేజర్లు ఈ సాగుబడిలో పాలుపంచుకొన్నారు. మంది ఎక్కువయ్యాక తమ వ్యవసాయాన్ని మరింతగా విస్తరించింది. స్థానికుల అనుమతి తీసుకొని సమీపంలోని ఖాళీ స్థలాల్లో పంటలు సాగు చేయసాగింది. డొనేషన్ల రూపంలో కొంత డబ్బును సేకరించి యంత్రాలతో పనులు చేయించింది. ఇప్పుడు కేటీ ఆధ్వర్యంలో చాలా ఎకరాల భూమి సాగవుతోంది. అన్ని చోట్లా ఆహారపంటలే... అలా కొన్ని వందల కేజీల కాయగూరలను అనాథాశ్రమాలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు కేటీ శ్రమను, ఆమె దృక్పథాన్ని మెచ్చుకోనివారంటూ లేరు. స్వయంగా ఉత్పాదనకు పూనుకొని ఇలా సేవా నిరతిని కొనసాగిస్తున్న ఆమెను అనాథల ఆకలిని తీరుస్తున్న వ్యక్తిగా గుర్తించాయి అనేక స్వచ్ఛంద సంస్థలు.‘నో హంగ్రీ చిల్డ్రన్’ పేరుతో సేవా ఉద్యమాన్ని కొనసాగిస్తూ సాగును మరింత విస్తరిస్తూ అనాథలకు ఆహారాన్ని అందిస్తున్న కేటీ సేవలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా లభించదని అంటోంది. ఆ ఆనందం జీవితకాలం పొందాలన్నదే తనకోరిక అంటోంది. మంచికోరికే! *************** ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న జాగాను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కేటీ తల్లిదండ్రులది. అందులో భాగంగా వారు స్థలాన్ని చదును చేసి క్యాబేజీ పండించాలనే అనుకొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాలుపంచుకొంది కేటీ. ఖాళీ సమయంలో కలిసి పనిచేసి క్యాబేజీ సాగు చేశారు. మంచి దిగుబడినా సాధించారు. అప్పటికే కేటీలో స్థానిక అనాథ ఆశ్రమంపట్ల అపారమైన జాలి నిండి ఉంది. -
గజరాజుల కంట కన్నీరు
రామకుప్పం, న్యూస్‌లైన్ : ఇరవై ఏళ్లుగా తమ ఆలనపాలన చూస్తున్న మావటీలు బదిలీ కావడంతో రెండు ఏనుగులు దిగులుపడ్డాయి. ఆహారం ముట్టకుండా, ఎవర్నీ దగ్గరకి రానీయకుండా ఆవేదనతో కన్నీరు కారుస్తున్నాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియూల ఎలిఫెంట్ శాంక్చురీలో ఈ దృశ్యం మూడురోజులుగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువ. జనావాసాలపైకి వచ్చే అడవి ఏనుగులను వెనక్కి తరిమేందుకు అటవీశాఖ అధికారులు 2006లో తిరుపతి నుంచి జయుంత్, గణేష్ అనే రెండు ఏనుగులను కౌండిన్య అభయూరణ్యంలోని ఈ శాంక్చురీకి తీసుకువచ్చారు. వాటితోపాటు నలుగురు మావటీలు కూడా వచ్చారు. అయితే ఈ నలుగురు మావటీలను ఆదివారం తిరుపతికి బదిలీ చేశారు. వారు తిరుపతికి వెళ్లినప్పటినుంచి ఆ రెండూ బెంగపెట్టుకుని ఆహారం తినడం లేదు. -
లోక్‌పాల్ ఆమోదంతో అన్నా శిబిరంలో సంబరం
-
మైలేజీ కోసమే చంద్రబాబు దీక్ష
-
వైద్యుల విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన జగన్
-
జగన్‌కు మద్దతుగా కడపలో దీక్షలు
-
వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ
గుంటూరు: వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నగరంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు విజయమ్మకు మద్దతు ప్రకటిస్తుంటడంతో రోడ్లన్నీ జన సందోహమైయ్యాయి. ఆమె చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటూ నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి వైఎస్సార్సీపీ ర్యాలీ ఆరంభించారు. శంకర్ విలాస్, ఓవర్ బ్రిడ్జ్, ఏసీ కాలేజీ సెంటర్, మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్లు మీదుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంది. రోడ్లన్నీ సమైక్య నినాదం మార్మోగింది. -
5వ రోజుకు చేరుకున్న విజయమ్మ దీక్ష
-
మూడోరోజుకు చేరిన విజయమ్మ ఆమరణ దీక్ష
-
మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష చేపట్టారు. తన తమ్ముడు దయానంద్ అరెస్టును నిరసిస్తూ శంకర్రావు మౌనదీక్షకు దిగారు. భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. దీనిని నిరసిస్తూ శంకర్రావు మంగళవారం మౌనదీక్షకు పూనుకున్నారు. సీమాంధ్రలో ఇందిర, రాజీ వ్ విగ్రహాల ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని శంకర్రావు తెలిపారు. ఆ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఎవర్నీ అరెస్ట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను, నా కుటుంబసభ్యులను సీఎం, డీజీ పీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు, చెల్లెల్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో తన ఇంటిపై దాడి విషయంలో సభాహక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డీజీ పీ ఆస్తులు, సీఎం ఎర్రచందనం కేసులో సీబీఐ విచారణ చేయించాలన్నారు. తనపై సీబీఐ విచారణ కూడా సిద్ధంగా ఉన్నట్లు శంకర్రావు తెలిపారు. -
‘చిత్తశుద్ధి ఉంటే దీక్షలో కూర్చోండి’
హైదరాబాద్: పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టే దీక్షలో కూర్చోవాలని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన రేపు విజయమ్మ చేపట్టబోయే దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. ‘మా నాయకురాలు చిత్తశుద్దితో దీక్షకు పూనుకున్నారని, మిగతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దీక్షలో కూర్చోవాలని’ మైసూరా తెలిపారు. రాష్ట్ర విభజనకు అంశంపై నాయకులు స్పందిస్తే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు దిగిరాదో చూద్దామని సవాల్ విసిరారు. ముప్పైకు పైగా సీట్లను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సోనియా విభజించాలని చూస్తోందన్నారు. కేవలం 10 సీట్లు కోసమే విభజన చేస్తున్నామని తెలుగు ప్రజలను అడుక్కుంటే.. ఆ సీట్లను తెలుగు ప్రజలు ఇచ్చే వారని మైసూరా విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రూ.4లక్షల కోట్లు ఇవ్వాలంటూ చెబుతున్నారని, మిగులు జలాల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. -
ఫాస్ట్‌గా పాస్‌పోర్ట్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు అమలు ద్వారా పౌరులకు సకాలంలో పారదర్శక సేవలను అందించగలుగుతున్నామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి పీఎస్. కార్తికేయన్ తెలిపా రు. తద్వారా పోలీసు పరిశీలన సమయాన్ని మినహాయిస్తే 14 రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ను పంపిణీ చేయగలుగుతున్నామని వెల్లడించా రు. మంగళవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు ద్వారా 11 లక్షల పాస్‌పోర్ట్‌లను పంపిణీ చేశామని, ఒక్క జూలైలోనే 40 వేల మందికి పంపించామని వివరించారు. పౌరుల పట్ల స్నేహయుతంగా వ్యవహరించే చర్యల్లో భాగంగా పాస్‌పోర్ట్ మేళాలను నిర్వహించడం ద్వారా రద్దీని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. పాస్‌పోర్ట్ అర్జీదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా నగరంలోని లాల్బాగ్, మారతహళ్లి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వసతులను పెంచామని తెలిపారు. లాల్‌బాగ్‌లో 45 రోజుల్లో, మారతహళ్లిలో 30 రోజుల్లో అపాయింట్మెంట్లను విడుదల చేస్తునామని చెప్పారు. ఈ రెండు కేంద్రాల్లో ఏటీఎంలను నెలకొల్పడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పోలీసు పరిశీలన కోసం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ పరిధిలోని 102 పోలీసు స్టేషన్లలో ‘డెరైక్ట్ టు ఠాణా’ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పౌరుల ప్రయోజనార్థం తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలు ప్రతిపాదనలు చేశా మని ఆయన వివరించారు. ఇందులోని ముఖ్యాంశాలు.. = పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ఏటా 30 వేల అదనపు అపాయింట్మెంట్లకు అవకాశం ఉంటుంది. = పోలీసు శాఖ సహకారంతో పోలీసు పరిశీలన కాలాన్ని తగ్గించాలి. దీని వల్ల పాస్‌పోర్ట్ అందించే కాలాన్ని బాగా తగ్గించడానికి వీలవుతుంది. = కర్ణాటక ఈ-గవర్నెన్స్ శాఖ సహకారంతో బెంగళూరు వన్, కర్ణాటక వన్ కేంద్రాల సేవలను కూడా వినియోగించుకోవాలి. -
ఈ నెల 14,15 తేదీల్లో విజయమ్మ నిరాహార దీక్ష