
తమకు ప్రియాతి ప్రియమైన వారి గొంతు విన్నప్పుడు రోగి కోమా నుంచి బయటకు రావడం మనం చాలా సినిమాల్లో చూశాం. అది సినిమాటిక్ వ్యవహారం కాదనీ, చాలావరకు వాస్తవమే అంటున్నారు పరిశోధకులు. కోమాలో ఉన్న కొందరి కుటుంబ సభ్యుల గొంతులను పరిశోధకులు రికార్డు చేశారు. ఆ రికార్డును రోగికి వినిపిస్తారు. ఈ ప్రక్రియకు ‘ఫెమిలియల్ ఆడిటరీ సెన్సరీ ట్రైనింగ్’ (ఫాస్ట్) అని పేరు. రోగికి ప్రియమైన వారి గొంతులను కోమాలో ఉన్న సమయంలో హెడ్‌ఫోన్స్ పెట్టి వారికి వినిపించినప్పుడు చాలామంది కోమా నుంచి బయటకు వచ్చేశారట.
ఆ సమయంలో రోగుల మెదళ్లలోని ప్రకంపనలను రికార్డు చేసినప్పుడు వారి మెదడు నరాల కణాలు బాగా స్పందించాయని, (మంచి న్యూరల్ యాక్టివిటీ కనిపించిందని) ఫలితంగా వారు వేగంగా కోలుకున్నారని పరిశోధకులు చెప్పారు. ఈ విషయాలను చాలాకాలం కిందటే ‘న్యూరో–రీహ్యాబిలిటేషన్ అండ్ న్యూరల్ రిపేర్’ అనే జర్నల్‌లో పొందుపరచారు. చాలాకాలంగా ఈ ప్రక్రియను కోమా రోగుల విషయంలో అనుసరిస్తున్నారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment