coma
-
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండేని కలిసేందుకు ఆమె తండ్రి తానాజీ షిండేకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ వీసా ఇచ్చేలా శుక్రవారం ఉదయం 9 గంటలకు అమెరికా ఎంబసీ (U.S. Embassy) కార్యాలయం ఇంటర్వ్యూ చేయనుంది. ఇందుకోసం షెడ్యూల్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే(35) తీవ్రంగా గాయపడింది. అనంతరం, కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదని నీలం తండ్రి తానాజీ షిండే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే కేంద్రాన్ని కోరారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే (35) గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ ఏడాదితో చదువు పూర్తి కానుంది. అయితే, ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం కారణంగా బాధితురాలి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో, ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగినట్లుగా తమకు తెలిసిందని తండ్రి తనాజీ షిండే పేర్కొన్నారు. అప్పటి నుంచి అత్యవసర వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదన్నారు.Neelam Shinde, 35, a resident of Maharashtra's Satara district, was allegedly hit by a car on February 14. She is currently in the ICU. pic.twitter.com/7O2X0dYO8W— The Brief (@thebriefworld) February 27, 2025ఈ వీసా విషయం ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే దృష్టికి రావడంతో ఆమె తాజాగా స్పందించారు. వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను త్వరగా కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని, తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.Student Neelam Shinde has met with an accident in the USA and is hospitalized in a local hospital. Her father, Tanaji Shinde, from Satara, Maharashtra, India, urgently needs to visit his daughter due to a medical emergency. Tanaji Shinde has applied for an urgent visa to the USA…— Supriya Sule (@supriya_sule) February 26, 2025ఈ నేపథ్యంలో భారత్.. తానాజీ షిండేకి వీసా మంజూరు చేయాలని కేంద్రం.. అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. భారత్ విజ్ఞప్తి మేరకు అమెరికా తానాజీ షిండేకి ఎమర్జెన్సీ వీసా ఇవ్వనుంది. -
షేవింగే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది, నెల రోజులు కోమాలో!
ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది.. వివరాలు ఇలా ఉన్నాయి న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్షాక్కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్‌పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్‌మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది. (ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.) -
ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి
ఢిల్లీ: ఉగ్రదాడిలో గాయపడి ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ నట్ ప్రాణాలు కోల్పోయారు. టెరిటోరియల్ ఆర్మీ విభాగానికి చెందిన కరణ్‌బీర్ సింగ్ 2015లో చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. టెరిటోరియల్ విభాగాని కంటే ముందు ఆయన 160 ఇన్ఫెంట్రీ విభాగానికి సెకండ్ ఇన్ కమాండ్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. Army Officer, Who Was In Coma For 8 Years After Gunshot Injuries, Dies https://t.co/9AaAfXz7Vy — NDTV (@ndtv) December 26, 2023 2015 నవంబర్ 17న 41 రాష్ట్రీయ రైఫిల్స్ కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టింది. దీనికి నాయకత్వం వహించిన కల్నల్ సంతోష్ మహదిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరణ్‌బీర్ సింగ్ తలకు తూటా గాయం అయింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఇన్నేళ్ల చికిత్స తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. తల్లిని చూడగానే.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!
ఇది సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతున్న వీడియో. ఒక చిన్నపిల్లోడు తన తల్లితోపాటు ఆగకుండా రోదిస్తున్న దృశ్యం దీనిలో కనిపిస్తుంది. దీనిని చూసినవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక తల్లి తన కుమారుడిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తుంటుంది. 16 రోజుల పాటు కోమాలో ఉన్న తన కుమారుడు ఇప్పడే మేలుకున్నాడని అమెకు తెలియడంతో పరుగుపరుగున వచ్చింది. పిల్లాడిని కావలించుకుని రోదించింది. ఆ పిల్లాడి పేరు గుడ్. ఆ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ అనే అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా పిల్లాడు 16 రోజుల పాటు కోమాలోకి జారుకున్నాడు. కోమా నుంచి మేల్కొన్న తరువాత ముందుగా తల్లిని చూడాలని పరితపించాడు. వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని ఆగకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. పిల్లాడు కోమా నుంచి లేచాడని తెలియగానే, ఆ తల్లి పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకుంది. పిల్లాడిని చూడగానే తల్లి... అమ్మను చూడగానే పిల్లాడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాధితులను అనుక్షణం కనిపెట్టుకోవాలి.. ఈ పోస్టు క్యాప్షన్‌లో..‘ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ స్థితి టైప్-VII కొలోజన్ లేమి కారణంగా తలెత్తుతుంది. ఇది ఒక ప్రొటీన్. ఇది చర్మంలోని ఎపిడర్మిస్ను అనుసంధానిస్తుంది. దీనిని బైండింగ్ ప్రొటీన్ అని అంటారు. ఇటువంటి స్థితిలోఉన్న గుడ్ను అతని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. గుడ్‌కు ఏ చిన్న దెబ్బ తగిలినా, చర్మానికి ఎంటవంటి ఇబ్బంది కలిగినా వ్యాధి మరింత తీవ్ర మవుతుంది. తాజాగా గుడ్ 16 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. దీనిలో 14 రోజులు ఇంట్యుబేషన్లోనే ఉన్నాడు. వీడియోను చూసినవారు ఏమంటున్నారంటే.. ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ వీడియోను చూసినవారు కంటతడి పెడుతున్నారు. గుడ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘పిల్లాడికి తీవ్రస్థాయిలో నిమోనియా సోకింది. అందుకే కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడి తల్లి రోజూ అతని దగ్గరే ఉంటుంది. అయితే ఆ పిల్లాడు కోమాలోంచి లేచిన రోజే బయటకు వెళ్లింది’ అని రాశారు. మరో యూజర్ ఈ వీడియోను చూశాక ‘నా హృదయం కల్లోలంగా మారిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. -
విషాదం: ప్రాణం తీసిన చేపల కూర.. భార్య మృతి.. కోమాలో భర్త!
విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మార్చి 25న మలేషియాలో వెలుగుచూసింది. జపాన్‌లో ఎక్కువగా తినే పఫర్ ఫిష్ రుచికరంగా ఉండటంతోపాటు అత్యంత విషపూరితమైనది. ఇది తెలియక జోహోర్కు చెందిన ఓ వ్యక్తి స్థానిక మార్కెట్ నుంచి పఫర్ ఫిష్‌ను కొనుగోలు చేశాడు. వాటిరి ఇంటికి తీసుకురాగా అతని భార్య లిమ్ సీవ్ గ్వాన్ (83) చేపలను శుభ్రం చేసి కూర చేసింది. ఇద్దరు కలిసి తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్వాన్‌కు ఒంట్లో వణుకు పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఇవే లక్షణాలు కొంత సమయానికి అతనిలో కూడా ప్రారంభమయ్యాయి. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్ సీవ్ గ్వాన్ మరణించింది. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని అతడు వాపోయింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. దంపతులు తిన్న చేపల వివరాలు సేకరించినట్లు తెలిపారు. కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. పఫర్ చేపల నుంచి ఈ విష పదార్థాలను ఎలా తొలగించి.. వండాలనే దానిపై శిక్షణ పొంది అత్యంత నిపుణత కలిగిన చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. చదవండి: హిజాబ్ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్ -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్‌గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
స్ట్రోక్‌తో కోమాలోకి నటి.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై!
పొట్టి జుట్టు.. చందమామ లాంటి రూపంతో కనిపించే ఆ ముద్దుగుమ్మ.. మామూలు యోధురాలు కాదు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించింది. అదీ ఒక్కసారి కాదు.. రెండుసార్లు!. పూర్తిగా కోలుకుని నటనలోకి మళ్లీ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందనగా.. పిడుగులాంటి వార్త. ఆమె ఆరోగ్యం మరోసారి తిరగబడింది. ఈసారి పరిస్థితి విషమించి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం, హోమ్లీ క్యారెక్టర్లతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ విశేష అభిమానుల్ని సంపాదించుకుంది. జుమూర్, భోలే, బాబా పర్ కరేగా లాంటి పలు చిత్రాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మరోవైపు సీరియల్స్‌లోనూ నటిస్తూ బుల్లితెర గుర్తింపూ దక్కించుకుంది. క్యాన్సర్ సోకపోయి ఉంటే ఆమె ఖాతాలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉండేవే. రెండుసార్లు క్యాన్సర్‌ను జయించిన ఐంద్రీలా శర్మ.. తాజాగా స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. క్రమంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించడంతో.. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని అంతా భావించారు. అయితే ఆమె ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. వెంటిలేటర్‌పై ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టిందని తెలుస్తోంది. దిగ్గజ నటి సుచిత్ర సేన్ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐంద్రీలా శర్మ.. చిన్నవయసులోనే ఇలా ప్రాణాంతక స్థితికి చేరకోవడంపై బెంగాలీ ప్రేక్షకులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అద్భుతం జరిగి ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కీమోథెరపీల ద్వారా, సంక్లిష్టమైన సర్జరీల ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి రెండుసార్లు కోలుకున్నారు. బెంగాలీలో పలు చిత్రాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతోనూ ఆమె అలరించారు. టీవీ షోలతోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తోటి నటుడు(జుమూర్ సీరియల్లో లీడ్ పెయిర్) సవ్యసాచి చౌదరితో డేటింగ్ చేస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా ఒక్కసారిగా ఆస్పత్రి పాలైంది. ఇదీ చదవండి: వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్: జాన్వీ కపూర్ -
7 నెలలుగా కోమాలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీ యువతి గత వారం బిడ్డకు జన్మనిచ్చినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ట్రామాకేర్ విభాగం వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఆ యువతి అచేతన స్థితిలోనే ఉందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి కళ్లు తెరిచి చూస్తోందని, కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు 10-15 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భార్యాభర్తలు హెల్మెట్ ధరించలేదు. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్తకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో ఆయన కోలుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బూలంద్శహర్లో జరిగింది. తొలుత బాధితురాలికి బులంద్‌శహర్‌లోని అబ్దుల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 1న తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు మార్చారు. తలకు తీవ్ర గాయాలవగా మెదడులో ఎముక ఉండిపోయినట్ల వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 రకాల న్యూరోసర్జికల్ ఆపరషన్లు నిర్వహించారు. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన సమయానికి ఆమె 40 రోజుల గర్భిణీ. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. నెలలు నిండిన ఆమెకు అక్టోబర్ 22న ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 2.5 కిలోలు ఉంది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం. ’ అని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ -
18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగా జలం చల్లుతూ..!
తిరువనంతపురం: కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో వైద్యులు సైతం చెప్పలేరు. అందుకు రోజుల నుంచి సంవత్సరాలు పడుతుంది. అలా.. ఓ వ్యక్తి మరణించినప్పటికీ కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి స్పృహలోకి వస్తాడని నమ్మిన ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసింది. దాదాపు 18 నెలలుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసి.. ప్రతిరోజు గంగా జలం చల్లుతున్న ఈ సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది. ఏం జరిగింది? ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తోన్న విమలేశ్ దీక్షిత్ అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్‌లో గుండె పోటుతో మరణించాడు. కానీ, అతడు కోమాలో ఉన్నాడని భావించిన కుటుంబం అంత్యక్రియలను నిర్వహించేందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచేశారు. ఈ క్రమంలోనే కుటుంబానికి అందాల్సిన పింఛన్ దస్త్రాలు ముందుకు కదలటం లేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో పోలీసులతో కలిసి ఆరోగ్య విభాగం అధికారులు రావత్‌పుర్‌లోని దీక్షిత్ ఇంటికి శుక్రవారం వెళ్లారు. ఆయన కోమాలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో దీక్షిత్ బాడీని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. మృతి చెందినట్లు నిర్ధరించారు. మరోవైపు.. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త మరణంతో మానసిక రోగిగా మారిన అతడి భార్య.. ప్రతిరోజు ఉదయం మృతదేహంపై గంగాజలం చల్లుతున్నట్లు చెప్పారు. కోమా నుంచి బయటపడేందుకు గంగా జలం దోహదపడుతుందని ఆమె నమ్ముతున్నారని తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. గుండె పోటుతో 2021, ఏప్రిల్ 22న దీక్షిత్ మరణించాడని వెల్లడించారు. చుట్టుపక్కల వారికి సైతం దీక్షిత్ కోమాలోనే ఉన్నాడని చెప్పేవారని, కొన్ని సార్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లటం గమనించినట్లు స్థానికులు తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
ఫొటోలు లీక్..ప్రియురాలు రౌద్రరూపం.. ప్రియుడు ఖతం
బొమ్మనహళ్లి: ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడనే ఆగ్రహంతో ప్రియురాలు రౌద్రరూపం దాల్చింది. ముగ్గురు మగ స్నేహితులతో కలిసి ప్రియున్ని ఇష్టానుసారం కొట్టడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన బెంగళూరులో బేగూరు పరిధిలో చోటుచేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో చదివి వచ్చి వివరాలు... చెన్నై నగరానికి చెందిన వికాస్ (27), ప్రతిభ ప్రేయసీ ప్రియులు. ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్ చెన్నైలో డాక్టర్‌గా పని చేసేవాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభతో వికాస్‌కు రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. వికాస్ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేసుకుందామని జంట అనుకుంది. ఇన్ స్టాలో ఫొటోల పోస్టింగ్‌తో గొడవ ప్రతిభ నగ్న చిత్రాలను వికాస్ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది ఆమె కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్‌తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. (చదవండి: మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు) -
కోమాలో నుంచి కోలుకున్నానని వెరై‘టీ’ విందు
సాక్షి, చిల్పూరు: కోమలోనుంచి కోలుకున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు వెరై‘టీ’ విందు ఇచ్చారు. 12 రోజులపాటు రోజుకు వంద మందికి ఇస్తానని ప్రకటించాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు భిక్షపతి ఉప్పరి పని మేస్త్రీ. జూలై 13న ఇంట్లో సజ్జపైనున్న వస్తువును తీస్తూ జారిపడ్డాడు. తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరు రోజుల తరువాత కోమానుంచి తేరుకున్నాడు. 51 రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయి అతను స్వగ్రామం చేరుకున్నాడు. ఇది తనకు పునర్జన్మని, దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు 12 రోజుల పాటు రోజుకు వందమందికి చాయ్ అందిస్తానని ప్రకటించాడు. గ్రామంలోని రవి హోటల్ వద్ద ఈ ‘టీ’ విందును సర్పంచ్ రూప్లానాయక్ చేతుల మీదుగా ప్రారంభించాడు. (క్లిక్: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి) -
కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి
Actress Anne Heche In Coma After Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి, దర్శకురాలు అన్నే హెచే కోమాలోకి వెళ్లారు. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో అన్నే హెచే తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 'ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఎక్కువగా కాలడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఇందుకోసం మెకానికల్ వెంటిలేషన్ అవసరం ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె స్పృహలోకి రాలేదు. ఇప్పటికీ కోమాలోనే ఉంది' అని వైద్యులు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోరుకోవాలని అన్నే హెచే కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అలాగే ఇలాంటి సమయంలో ఆమె వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. కాగా 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసే క్రమంలో ఓ ఇంటిని ఢీ కొట్టింది. దీంతో కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 'అనెదర్ వరల్డ్' అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది అన్నే హెచే. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. చదవండి: మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా సహానటి.. నా వయసు 21, న్యాయం చేయగలనా?: హీరోయిన్ తొలి సినిమాకే నాగ చైతన్య అంత డిమాండ్ చేశాడా? -
ప్రమాదాల్లో మెదడుకు గాయమైతే!
ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలితే... మెలకువగా ఉండటం లేదా దెబ్బ బలంగా తగిలితే స్పృహ తప్పిపడిపోవడం... ఈ రెండే అందరికీ తెలిసిన పరిస్థితులు. అయితే ఇలా జరిగినప్పుడు బాధితులు ఏ మేరకు స్పృహలో ఉన్నారనే అంశం ఆధారంగా ఐదు రకాల కండిషన్లలోకి వెళ్లవచ్చు. అవి... స్టూపర్ అనే కండిషన్లోనా, కోమాలోనా, జీవించే ఉన్నప్పటికీ ఎలాంటి స్పందనలూ లేని జీవచ్ఛవ (వెజిటేటవ్ స్టేట్ అనే) స్థితిలోనా, లాక్డ్–ఇన్ సిండ్రోమ్ అనే దశలోనా... ఇలాంటి పరిస్థితుల్లో చివరిదైన బ్రెయిన్‌డెడ్ కండిషన్లలో దేనిలో ఉన్నాడని చూస్తారు. తలకు దెబ్బతగిలిన బాధితులు ఎంత త్వరగా కోలుకుంటారు, ఏ మేరకు బాగవుతారు వంటి అంశాలు... అతడు ఏ స్థితిలో ఉన్నాడనే అంశంపై ఆధారపడి ఉంటాయి. ఆ స్థితులపై అవగాహనతో పాటు, తలకు దెబ్బతగిలి మెదడుకు గాయమైందని భావించినప్పుడు చేయాల్సిన పనుల గురించి తెలిపే కథనం. తలకు దెబ్బ తగిలి, దాని ప్రభావం ఎంతోకొంతైనా మెదడు మీద పడితే ఆ ప్రమాదాన్ని ‘ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (టీబీఐ)’ అంటారు. అప్పుడు తలకు తగిలిన దెబ్బ తీవ్రత ఆధారంగా బాధితులు వెళ్లే ఐదు రకాల తీవ్ర పరిస్థితులివి... స్టూపర్ దశ: ఈ స్థితిలో కొద్దిగా మాత్రమే కదులుతూ... ఒకవేళ నొప్పికలిగినా, లేదా గిల్లడం వంటివి చేసినా కాస్త స్పందిస్తారు. వెజిటేటివ్ స్టేట్ : జీవచ్ఛవంగా ఉంటే దశనే వెజిటేటివ్ స్టేట్‌గా చెబుతారు. వీరికీ కోమాలో ఉన్న బాధితులకు తేడా ఏమిటంటే... కోమా ఉన్న రోగులకు నిద్ర, మెలకువ దశలు ఉండవు. వెజిటేటివ్ స్థితిలో ఉన్నవారిలో కొందరు అకస్మాత్తుగా సాధారణంగా స్పందించవచ్చు. కోమాలో ఉన్న రోగులు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కాగా జీవచ్ఛవంలా ఉన్న రోగులు కళ్లు మూస్తూ తెరుస్తూ ఉండవచ్చు. శబ్దాలు చేయవచ్చు. చేతులు–కాళ్లు కూడా కదపగలరు. బాధితులు కంటిన్యువస్‌గా నెల (30 రోజుల) పాటు జీవచ్ఛవంలా ఉంటే దాన్ని ‘శాశ్వత జీవచ్ఛవ స్థితి’ (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్–పీవీఎస్) అంటారు. ఇలాంటి వారిలో రోగి మెరుగుపడే పరిస్థితి అన్నది వారి మెదడుకు అయిన గాయం తీవ్రతను బట్టి, బాధితుల వయసును బట్టి ఉంటుంది. చిన్నవయసు వారైతే కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఇక గుండెపోటు వచ్చిన కొందరిలో మెదడుకు రక్తం (ఆక్సిజనేటెడ్ బ్లడ్) అందక వారు జీవచ్ఛవ (వెజిటేటివ్) స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. కోమా : ఇది పూర్తిగా స్పృహ లేని స్థితి. అయితే బాధితులు కొన్నిసార్లు కొద్దిసేపు మాత్రమే కోమాలో ఉండి, మళ్లీ కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చే అవకాశాలూ ఉంటాయి. వారు కోమాలో ఉండే వ్యవధి కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాలూ లేదా నెలల వరకూ ఉండవచ్చు. కోమాలో ఉన్నవారు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కోమాలో ఉన్నవారికి నిద్ర, మెలకువ వంటి స్థితులు కలగవు. కోమా నుంచి బయటపడ్డా... కొందరిలో ఎలాంటి స్పందనలూ లేకుండా జీవచ్ఛవం (వెజిటేటివ్ స్టేట్)లోనూ ఉండవచ్చు లేదా ఇప్పుడున్న వైద్యవిజ్ఞానం వల్ల చాలామంది మునపటి చైతన్యాన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి. లాక్డ్–ఇన్ దశ : ఈ కండిషన్లో బాధితుడు మెలకువగానే ఉంటాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా తన శరీరాన్ని కదిలించలేడు. అంటే శరీరం పూర్తిగా పారలైజ్ అవుతుంది. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (పీవీఎస్)లో బాధితుడికి మెదడు పైభాగం పూర్తిగా దెబ్బతిని, కింది భాగం మామూలుగానే ఉంటుంది. కానీ లాక్డ్–ఇన్ దశలో పై భాగం మామూలుగానే ఉండి, కింది భాగం (అంటే బ్రెయిన్ స్టెమ్) దెబ్బతింటుంది. లాక్డ్ ఇన్ సిండ్రోమ్‌లో ఉన్న చాలామంది రోగులు తమ కనురెప్పల కదలికల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. వీళ్లలోని కొందరిలో ముఖంలోని కొన్ని కండరాల్లోనూ కదలికలు ఉండవచ్చు. చాలామందిలో కాళ్లూ–చేతులపై నియంత్రణ (మోటార్ కంట్రోల్) ఉండకపోవచ్చు. అయితే ఇటీవల ఇలాంటి వారితో సంభాషించడానికీ / సమాచారాన్ని పంచుకోవడాని (కమ్యూనికేషన్)కి అనేక రకాల ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ డెడ్ : ఈ స్థితిలో బాధితులకు మెదడులోని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్తో పాటు బ్రెయిన్ స్టెమ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా మెదడు మరణిస్తుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు ఇక ఏమాత్రం చక్కదిద్దలేరు. శరీరం బతికి ఉండి... మెదడు పూర్తిగా మరణించిన స్థితి ఇది. ఇలాంటి స్థితిలో కృత్రిమశ్వాసపై శ్వాసప్రక్రియ కొనసాగుతుంటే... అది తొలగించగానే బాధితుడు మరణిస్తాడు. బతికే అవకాశం ఏమాత్రమూ ఉండదు. అందుకే బ్రెయిన్‌డెడ్ పరిస్థితిలో ఉన్నవారి నుంచి డాక్టర్లు అవయవమార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) కోసం అవసరమైన అవయవాలను సేకరిస్తారు. ∙ తలకు గాయం కాగానే పొరుగువారు చేయాల్సిన పనులు ♦తలకు గాయమైన వారిని సమతలంగా ఉండే పడకపై మెడ కదలకుండా పడుకోబెట్టాలి. ♦తరలించే సమయంలో తలకు, వెన్నుకు అయిన గాయం మరింత రేగకుండా, తీవ్రం కాకుండా చూడాలి. చికిత్స విషయానికి వస్తే... ఏదైనా ప్రమాదంలో తలకు గాయం అయినప్పుడు మెదడుకు నష్టం జరిగిందా లేదా అన్న విషయం తక్షణం తెలియకపోవచ్చు. కాబట్టి ప్రమాదం జరిగిన గంటలోనే బాధితులను హాస్పిటల్‌కు తరలించగలిగితే... చాలావరకు ప్రాణాల కాపాడవచ్చు. దాంతో పాటు దుష్ప్రభావాలను (కాంప్లికేషన్స్‌ను) చాలావరకు అరికట్టవచ్చు. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అదే అరగంటలోపే తరలించగలిగితే... ఇంకా సమర్థమైన చికిత్స అందించవచ్చు. అందుకే ఆ సమయాన్ని ‘ప్లాటినమ్’ సమయంగా చెబుతారు. బాధితులకు ముందుగా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి తక్షణ వైద్య సహాయం అందాలి. ఇది ప్రమాద సంఘటన స్థలం నుంచే లేదా కనీసం ఆసుపత్రికి తరలించగానే క్యాజువాలిటీలోనైనా ప్రారంభం కావాలి. ఎందుకంటే గాయం కారణంగా మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం చాలా సందర్భాల్లో పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం చేయగలిగేది మెదడుకు మరింత నష్టం జరగకుండా చూసుకోవడం. ఒకవేళ గుండె స్పందనలు ఆగినట్లయితే వెంటనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీఆర్పీ) చేయాలి. దాంతో గుండె స్పందనలు మళ్లీ మొదలై... మెదడుకు రక్తం అందేలా చూడాలి. ఫలితంగా మెదడుకు జరిగే నష్టమూ తగ్గుతుంది, ప్రాణమూ నిలబడుతుంది. ఇక ఆ తర్వాత చేయాల్సిన వివిధ చికిత్సలను డాక్టర్లు హాస్పిటల్లో కొనసాగిస్తారు. చదవండి: Health Tips: పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు! -
ప్రత్యర్థి పంచ్‌కు ఊహించని అనుభవం; ఆపై కోమాలోకి
బాక్సింగ్ రింగ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పంచ్‌లకు బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో మరొక బాక్సర్ కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు.. అతను ప్రవర్తించిన తీరు ఉద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో బుటెలేజీ, సిప్సిలే నుంటుగ్వాల మధ్య జూన్ 5న(ఆదివారం) వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆల్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది. ఇద్దరు మంచి టఫ్ ఫైట్ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. 10వ రౌండ్ బౌట్ మొదలయ్యే వరకు సిమిసో, నుంగుట్వాలు ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. పదో బౌట్ మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు నుంటుగ్వా ఇచ్చిన పంచ్ సిమిసో బుటెలేజీ తలలో బలంగా తగిలింది. దీంతో కళ్లు బైర్లు కమ్మిన సిమిసోకు ఏం చేస్తున్నాడో ఒక్క క్షణం ఎవరికి అర్థం కాలేదు. రిఫరీ ఉన్న వైపు దూసుకొచ్చిన సిమిసో బుటెలేజీ అతనికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థి వెనకాల ఉంటే.. అది గమనించకుండా తన ముందువైపు ఎవరు లేనప్పటికి గాలిలో పంచ్‌లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన రిఫరీ సిమిసో పరిస్థితిని అర్థం చేసుకొని బౌట్‌ను నిలిపేసి మెడికోను పిలిచాడు. దీంతో సిప్సిలే నుంటుగ్వా లైట్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించాడు. వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే డర్బన్‌లో కింగ్ ఎడ్వర్డ్-8 ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన సిమిసో బెటెలేజీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో కోమాలో ఉన్నాడని.. రెండురోజులు గడిస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వైద్యులు తెలిపారు. అయితే కొద్దిరోజుల్లోనే అతను మాములు పరిస్థితికి వచ్చేస్తాడని.. ప్రాణాలకు ఏం భయం లేదని తెలిపారు.. కాగా సిమిసో బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసిన ఆఖరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని Rabat Diamond League 2022: అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు Very scary in South Africa please 🙏🏼 for Simiso Buthelezi (4-1). At 2:43 of the 10th & final round, Siphesihle Mntungwa (7-1-2) falls through the ropes but then Buthelezi appears to lose his understanding of the present situation. Mntungwa takes the WBF African lightweight title pic.twitter.com/YhfCI623LB — Tim Boxeo (@TimBoxeo) June 5, 2022 I was at the #boxing in KZN yesterday and this is one of the strangest and saddest things I've seen in the sport. Thoughts and prayers with Simiso Buthelezi who is now in an induced coma in hospital 🙏🏿🙏🏿 @SABC_Sport #SizenzaZonke pic.twitter.com/1097yFtKmY — Tracksuit (@ThabisoMosia) June 6, 2022 -
కోమాలోనే సౌతాఫ్రికా యువ క్రికెటర్.. అండగా నిలబడిన క్రికెట్ బోర్డు
గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోకు ఆ దేశ క్రికెట్ బోర్డు(క్రికెట్ సౌతాఫ్రికా) అండగా నిలబడింది. ఖుమాలో కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బోర్డు తన పెద్ద మనసు చాటుకుంది. ''యూకేలో దుండగుల చేతిలో గాయపడిన మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అతని కుటుంబసభ్యులకు మా అండ ఎప్పటికి ఉంటుంది.'' అని పేర్కొంది. కాగా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ఇప్పటికి కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం యూకేలోని సౌత్‌మెడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు బుధవారం మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. బ్లడ్‌ప్రెషర్ కూడా ఎక్కువగా ఉందన్నారు. దీంతో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కాగా మే29(ఆదివారం) తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాగా ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ మిస్టర్ యూనివర్స్
బాడీ బిల్డర్, మాజీ మిస్టర్ యూనివర్స్ కాలమ్ వాన్ మోగర్ ప్రాణాలతో పోరాడుతున్నారు. మోగర్ ప్రమాదం నుంచి బయటపడాలని, తర్వాగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారు. కోమాలో నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వివరాల ప్రకారం.. మాజీ మిస్టర్ యూనివర్స్ కాలమ్ వాన్ మోగర్ ఇటీవల రెండవ అంతస్థుల భవనంలోని కిటికీ నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయమైంది. ప్రమాదం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మోగర్ కోమాలోకి వెళ్లిపోయాడని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది. కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారని మోగర్ స్నేహితుడు యూట్యూబర్ నిక్ ట్రిగిల్లి చెప్పారు. ఇదిలా ఉండగా.. మిస్టర్ వాన్ మోగర్ 2018లో ‘బిగ్గర్’ చిత్రంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ పాత్ర చేసి ఎంతో ఫేమస్ అయ్యాడు. దీంతో నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు ఇలా ప్రమాదంలో మోగర్ గాయపడటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు.. -
పెళ్లై 24 గంటలు: కోమాలోకి వెళ్లిన వధువు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శేరిలింగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లై ఒక్క రోజు కూడా పూర్తవ్వకముందే.. వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వారిని వెక్కిరించింది. వివాహమైన 24 గంటలకే కారు యాక్సిడెంట్లో పెళ్లి కుమారుడు చనిపోగా.. తీవ్ర గాయాలపాలైన నవవధువు కోమాలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. (చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ) మృతుడు శ్రీనివాస్ వివాహం మంగళవారం తిరుపతిలో జరిగింది. అనంతరం నూతన దంపతులు చెన్నైలోని అత్తగారింటికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు సమీపంలో నవ దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో శ్రీనివాస్ మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన పెళ్లి కుమార్తె కోమాలోకి వెళ్లిపోయింది. నూరేళ్లు పచ్చగా సాగాల్సిన వైవాహిక జీవితం.. 24 గంటల వ్యవధిలో ఇలా విషాదంతం కావాడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా -
కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!!
ఏవైనా అనుకోని ఘోర ప్రమాధాలు జరిగితే కోమాలోకి వెళ్లడం మామూలే! ఐతే కొంతకాలానికి స్పృహలోకి రావడం, మళ్లీ ఆరోగ్యంగా తిరగడం ఇలాంటివి చాలానే చూసి ఉంటాం.. విని ఉంటాం. సాధారణంగా కోమాలోకి వెళ్తే.. ఒక్కోసారి గతాన్ని మరచిపోవడమో, అంతవరకూ లేని ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడమో జరుగుతుంది. ఏ సమస్యలేకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్లు కూడా లేకపోలేదు. అమెరికాకు చెందిన ఓ యువతికి మాత్రం ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె కోమాలోంచి బయటికి వచ్చాక తెలిసింది. తను మరచిపోయింది గతాన్ని కాదు.. ఏకంగా మాతృభాషనే.. అనే విషయం! అసలేంజరిగిందంటే.. సమర్ డియాజ్ 24 యేళ్లు. ఐతే గత ఏడాది అనుకోకుండా జరిగిన ఓ భయానక ప్రమాధంలో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లింది. రెండు వారాల తర్వాత సమర్ సృహలోకొచ్చాక స్పష్టంగా మాట్లాడలేకపోయింది. అనేక స్పీచ్ థెరపీల తర్వాత ఆమె మాట్లాడటం ప్రారంభించింది. వైద్యం అందించేవారికి ఎందుకో అనుమానం వచ్చి ఏ దేశానికి చెందిన పౌరురాలని సమర్‌ను ప్రశ్నించగా.. ఆమె ఇచ్చిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియా నివాసినని చెప్పింది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. అమెరికా నివాసి ఐన సమర్ డియాజ్ తన మాతృభాషకాకుండా అసలు పరిచయమేలేని న్యూజిలాండ్ భాష మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ యువతి తను ఎప్పుడూ న్యూజిలాండ్ వెళ్లలేదని కూడా చెప్పింది. దీని గురించి సన్నిహితులు వెద్యులను ప్రశ్నించగా ఆమె ఓ అరుదైన వ్యాధి బారీన పడ్డట్టు ధృవీకరించారు. వైద్యపరిభాషలో ఈ డిసీజ్‌ను ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్ అని అంటారు. ఇది వస్తే అప్పటివరకూ మాట్లాడే మాతృభాషకాకుండా వేరే ఇతర భాషను మాట్లాడుతారని వైద్యులు వివరించారు. ఎవరికైనా ప్రమాధాలు జరిగితే గుండెపోటు రావడం నుంచి పరిస్థితి విషమించి మరణించడం వరకు జరుగుతాయి. ఐతే కొన్ని సార్లు మరణాన్ని జయించి బతుకుతారు కూడా. ఏదిఏమైనప్పటికీ సమర్ డియాజ్ మృత్యువును జయించినా.. మాతృభాషకు బదులు న్యూజిలాండ్ భాష మాట్లాడటం అనేది ప్రస్తుతం టాక్ఆఫ్ది టౌన్‌గా మారింది. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! -
Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..
ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని భర్య, బావమరిది హత్యచేశారనే అనుమానంతో కోర్టులో కేసు కూడా ఫైల్ అయ్యింది. ఇంతలో చనిపోయిన వ్యక్తి తిరిగిరావడంతో అందరూ షాక్!! అసలేంజరిగిందంటే.. బీహార్‌లోని కఠారీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 5 యేళ్ల క్రితం హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. సదరు వ్యక్తి సోదరుడు ఎంతవెతికినా ప్రయోజనం లేకపోయింది. సోదరుడిని అతని భార్య, బావమరిది హత్య చేశారనే అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఐతే పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో 2016లో తన సోదరుడు హత్య చేయబడ్డాడని, భార్య,బావమరిది హత్యచేశారనే నెపంతో కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కోర్టులో కేసు నడుస్తుండగా చనిపోయాడనుకుంటున్న సదరు వ్యక్తి సొంతూరుకు వచ్చాడు. గుజరాత్‌లోని ఒక నూలు పరిశ్రమలో పనిచేసేవాడని, ఇంటికి తిరిగొస్తూ ఉండగా ఒక పెద్ద ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్లానని, ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ ప్రమాదంలో గత జ్ఞాపకాలు చాలామటుకు మరచిపోయానని తెలియజేశాడు. దీంతో ఈ హత్య మిస్టరీ వీడింది. ఈ అరుదైన సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
కోమాలో బుల్లితెర నటుడు
Venu Arvind: ప్రముఖ బుల్లితెర నటుడు వేణు అరవింద్ ఆస్పత్రిలో కోమా స్థితిలో వున్నట్లు వైద్యులు తెలిపారు. టీవీ సీరియల్ నటుడు వేణు అరవింద్. కొన్ని సినిమాల్లో నటించిన ఈయన శభాష్ సరియాన పోటీ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే వేణు అరవింద్ సినిమాలకంటే బుల్లితెరలోనే పాపులర్ అయ్యారు. కాగా ఆయన ఇటీవల కరోనా బారిన పడి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే కరోనా నుంచి బయటపడ్డ ఆయనకు మెదడులో గడ్డ ఉండడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం వేణు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. -
జూడో క్లాస్; బాలుడిని 27 సార్లు నేలకేసి కొట్టాడు
తైపీ: జూడో క్లాస్ ఏడేళ్ల బాలుని నిండు ప్రాణాలు తీసింది. జూడోక్లాస్ అంటూ కోచ్ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. 70 రోజుల పాటు కోమాలో ఉన్న ఆ బాలుడికి కొన్ని రోజులగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఉన్నట్టుండి బాలుడి శరీరంలో కొన్ని కీలక అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో తల్లిదండ్రుల అనుమతితో వైద్యులు బాలుడిని వెంటిలేటర్ పైనుంచి తొలగించారు. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. ఏడేళ్ల హువాంగ్ జూడో నేర్చుకోవడానికి ఏప్రిల్ నెలలో హో అనే కోచ్ వద్ద చేరాడు. జూడో బాగా రావాలంటే శారీరకంగా బలంగా ఉండాలని అక్కడికి వచ్చే పిల్లలకు చెబుతూ వారిపై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వేధించేవాడు. గత ఏప్రిల్ 21న హువాంగ్ను టార్గెట్ చేసిన కోచ్ హో వాడిని పిలిచి జూడో మూమెంట్స్ అంటూ నేలకేసి కొట్టడం ప్రారంభించాడు. 12సార్లు కిందపడేసిన తర్వాత హువాంగ్ తల నొప్పిగా ఉందంటూ వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా కోచ్ కనికరించలేదు. మొత్తంగా 27 సార్లు నేలకేసి కొట్టడంతో ఆ బాలుడు సృహతప్పి పడిపోయాడు. దీంతో హువాంగ్ ప్రాణాలు పోయాయేమోన్న భయంతో హో అక్కడి నుంచి పారిపోయాడు. క్లాస్‌లో ఉన్న మిగతా పిల్లలు పోలీసులకు సమాచారం అందించడంతో హువాంగ్ను ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలుడు 72 రోజలు పాటు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. కాగా బుధవారం హువాంగ్‌కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో పాటు అవయవాలు పనిచేయకపోవడంతో వెంటిలేటర్ నుంచి తొలగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. కోచ్ హోపై కేసు నమోదు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
మొసలి నుంచి తప్పించుకొని కోమాలోకి ; ఆ తర్వాత
సాధారణంగా మొసలి నీళ్లలో ఉంటే వెయ్యి ఎనుగులంత బలం అంటారు. నీళ్లలో మొసలికి చిక్కామంటే మన ప్రాణాలు పోవడం ఖాయం. ఒక యువతి మాత్రం తన కవల సోదరి సాయంతో మొసలి పంజా నుంచి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.. కానీ పదిరోజుల పాటు కోమాలో ఉంది. తాజాగా కోమాలో నుంచి లేచిన ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూస్తానని అనుకోలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వివరాలు.. లండన్‌కు చెందిన 28 ఏళ్ల మెలిస్సా లౌరి, జార్జియా లౌరిలు కవలలు. ఇద్దరికి బోటింగ్ అంటే మహాప్రాణం. పదిరోజల కిందట మెక్సికోలోని మానియాల్టెపెక్ లగూన్ తీర ప్రాంతానికి బోటింగ్ వెళ్లారు. ప్యూర్టో ఎస్కాండిడో ఐలాండ్‌లో రాత్రికి బస చేశారు. ఆ రాత్రి సరదాగా ఐలాండ్ నుంచి పది మైళ్ల దూరంపాటు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మెలిస్సా ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. ఆమెకు కొంచెం దూరంలో ఉన్న జార్జియా మెలిస్సా కనిపించకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. ఏ రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ప్రమాదంలో పడిందని గ్రహించిన జార్జియా ఆమె దగ్గరికి వెళ్లింది. అప్పటికే మెలిస్సా కాలును బలంగా పట్టుకున్న మొసలి ఆమెను నీటి అడుగుభాగంలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే జార్జియా చాకచక్యంగా వ్యవహరించి రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న వస్తువును మొసలిపై పదేపదే దాడికి పాల్పడంతో మొసలి తన పట్టును విడవడంతో వారిద్దరు నీటిపైకి వచ్చారు. అయితే మొసలి మరోసారి దాడిచేయడంతో ఈసారి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా ఎలాగోలా మెలిస్సాను మొసలి బారీ నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చింది. కానీ మెలిస్సా అప్పటికే సృహ కోల్పోయి కోయాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బయటపడిన వీరిద్దరు ఆసుపత్రిలో చేరారు. జార్జియా గాయాలనుంచి కోలుకోగా.. పది రోజల పాటు కోమాలో ఉండిపోయిన మెలిస్సా రెండు రోజుల క్రితం కళ్లు తెరవడంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గింది. కోమా నుంచి బయటపడినా ఊపిరి తీసుకోవడంలో మెలిస్సాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఇప్పడిప్పుడే తనంతట తాను ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో డాక్టర్లు ఆక్సిజన్ పైప్‌ను తీసేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. కాగా 2019లో 54 ఏళ్ల వ్యక్తి తన బొటనవేలితో మొసలి కంట్లో పొడిచి తన ప్రాణాలను దక్కించుకోవడం సంచలనంగా మారింది. చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు -
అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి
రోమ్: గత ఆదివారం నార్త్ ఇటలీలోని మాగ్గియోర్ సరస్సు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కేబుల్ కార్ బ్రేక్ ఫెయిల్ అయి కొండల్లో పడిపోవడంతో క్యాబిన్‌లోని 14 మంది చనిపోయారు.. కానీ ఒక్కడు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతనే ఐదేళ్ల పిల్లాడు ఈతాన్ బిరాన్.. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి కోమాలో ఉన్న ఈతాన్ బిరాన్ శుక్రవారం సృహలోకి వచ్చాడు. కళ్లు తెరిచిన మరుక్షణం.. అమ్మ, నాన్న ఎక్కడ.. వారిని చూడాలి అంటూ ఈతన్ అడిగాడు. కానీ ఆ ప్రమాదంలో అతని పేరెంట్స్‌తో పాటు తమ్ముడు, తాతను కోల్పోయినట్లు అతనికి తెలియదు. ఆ విషయం ఆ పిల్లాడికి ఎలా చెప్పాలో ఆసుపత్రి సిబ్బందికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం బిరాన్‌ను చూసుకోవడానికి పిల్లాడి ఆంటీ ఆయా తోడుగా ఉంది. విషయంలోకి వెళితే.. ఈతన్ బిరాన్.. తండ్రి అమిత్(30), తల్లి తాల్(26),తమ్ముడు టామ్(2)తో పాటు తాత, నానమ్మ కోహెన్(81), కోనిస్కి(71) తో కలిసి నార్త్ ఇటలీలో టూర్‌కి వచ్చాడు. మాగ్గియోర్ సరస్సు వద్ద ఉన్న కేబుల్ కార్లో ఎక్కడానికి వారంతా సిద్దమయ్యారు. ఈ కుటుంబంతో పాటు మరో 8 మంది కూడా క్యాబిన్లో ఎక్కారు. కొద్దిదూరం వరకు బాగానే వెళ్లినప్పటికి మధ్యలో సడెన్‌గా బ్రేక్ డౌన్ అయింది. అయితే దురదృష్టవశాత్తూ కేబుల్ తెగింది. దీంతో కొండ మధ్యలో ఉన్న వాళ్లు దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోగా.. చెట్ల మధ్యలో క్యాబిన్ ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఈతా బిరాన్ ఫ్యామిలీతో సహా మిగతా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. కానీ బిరాన్ మాత్రం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయినవారిని క్యాబిన్లో నుంచి బయటికి తీశారు. కాగా సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. బ్రేక్స్ సరిగా ఉన్నాయోల ఏదో చూసుకోకుండానే ఆపరేషన్ నిర్వహించినట్లు తేలింది. కాగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి.. ప్రమాదానికి కారణమైన ముగ్గురి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
వ్యాక్సిన్ వేసుకున్న కాసేపటికే కోమాలోకి
సాక్షి, ఉప్పల్ (హైదరాబాద్): కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న పారిశుధ్య కార్మికురాలు కొద్ది సేపట్లోనే కోమాలోకి వెళ్లింది. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ సెంటర్లో ఈ సంఘటన జరిగింది. పీర్జాదిగూడలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎన్.లత(30) శనివారం సాయంత్రం స్థానిక హెల్త్ సెంటర్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుంది. తర్వాత కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దీంతో లతను అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. చదవండి: (తెలంగాణ: సాయంత్రం 6.30 వరకే ఆ దుకాణాలు) -
కోమా నుంచీ బయటపడవచ్చు!
సినిమాల్లో కోమా కేసులను చూసి చూసి మనలో చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. కోమాలోకి వెళ్తే... అది దాదాపు గా మరణానికి ముందు దశ అనీ... అలా కోమాలోకి వెళ్లినవాళ్లు ఒక పట్టాన వెనక్కు రారని! కానీ... కోమాలోకి వెళ్లిన దాదాపు గా 80 శాతం కేసుల్లో మనుషులు వెనక్కు సురక్షితంగా వస్తుంటారు. ఇక కోమా గురించి మరో అపోహ కూడా ఉంది. అదేదో యాక్సిడెంట్ అయి... తలకూ, మెదడుకు తీవ్రమైన గాయం అయినవారిలోనే చాలామంది కోమాలోకి వెళ్తుంటారని!! కానీ... ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం మొదలుకొని, ఓ సాయంత్రంవేళ ఆల్కహాల్ ఎక్కువగా తాగేసినా కోమాలోకి వెళ్తుంటారని. ఇలా కోమాపై ఎన్నెన్నో అపోహలు. అలాంటి అపోహలు తొలగిస్తూ... స్పృహతప్పిన స్థితి మరింత గాఢంగా ఉండటమే కోమా అనీ... ఏ 20 శాతం కేసులు మినహా మిగతా వాళ్లంతా బయటపడేందుకు అవకాశముందని చెబుతూ ‘కోమా’పై అవగాహన పెంచే కథనం ఇది. స్పృహ కోల్పోవడం మనందరికీ తెలిసిందే. కోమా అంటే కూడా స్పృహ లేని స్థితే. కాకపోతే మరింత గాఢమైన స్థితి. అంటే ‘ప్రొఫౌండ్ అన్కాన్షియస్’ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ, దెబ్బకూ లేదా మరే ఇతర అంశాలకూ స్పందన లేకుండా నిద్రా, మెలకువలు... ఈ రెండింటికీ అతీతమైన స్థితే... ‘కోమా’. కోమాకు నూరు కారణాలంటూ వైద్యుల మాటల్లో ఓ వాడుక ఉంది. అయితే సాధారణంగా కోమాకు మూడంటే మూడు ప్రధాన కారణాలుంటాయని చెప్పుకోవచ్చు. 1. మెదడుకు సంబంధించిన జబ్బులవల్ల కోమాలోకి జారిపోవడం. 2. శరీరంలోని ఇతర అవయవాల వల్ల కోమాలోకి వెళ్లడం. 3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్, డ్రగ్స్, విషపదార్థాలు ఓరల్‌గా తీసుకోవడం వల్లగానీ, కార్బన్డయాక్సైడ్, సయనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్లగానీ లేదా ఒక్కోసారి వడదెబ్బ సింపుల్ వంటి కారణాలతోనూ కోమాలోకి వెళ్లడం. కోమా – కారణాలు: మెదడుకు సంబంధించని కారణాలతో కోమాలోకి వెళ్లడమన్నది సాధారణ వడదెబ్బ నుంచి మొదలుకొని దేహంలోని కీలకమైన అవయవాలకు (వైటల్ ఆర్గాన్స్) వచ్చే రకరకాల సమస్యల వరకు దేని కారణంగానైనా జరగవచ్చు. కార్డియాక్ అరెస్ట్ – సాధారణంగా కార్డియాక్ అరెస్ట్‌తో గుండె ఆగినప్పుడు కార్డియోపల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియ ద్వారా గుండెపై మసాజ్ చేసినట్లుగా కొంత ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి పనిచేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీపీఆర్ చాలాసేపు కొనసాగినప్పుడు వెళ్లే కోమా నుంచి బయటపడేసేందుకు రోగికి ‘హైపోథెర్మియా’ అనే ప్రక్రియతో చికిత్స చేస్తారు. డయాబెటిస్తో – సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ దేహంలో చక్కెర పెరగడం వల్ల కలిగే అనర్థాలు రాకుండా ఉండేందుకంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సరిగ్గా ఆహారం తీసుకోకుండానూ మందులు మాత్రం వేళకు వేసుకుంటూ ఉంటారు. దాంతో అదనపు చక్కెరమీద పనిచేయాల్సిన మందులు... అన్నం తినని కారణంగా ఉన్న కొద్దిపాటి చక్కెరపైనా పనిచేసి, వాటినీ తగ్గించడంతో శరీరంలో చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతాయి. అంటే సాధారణంగా 100–140 వరకు ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 30–20 కంటే తక్కువకు పడిపోతాయి. అలాంటప్పుడు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని ‘హైపోగ్లైసీమిక్ కోమా’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో చక్కెర రోగులకు డాక్టర్లే చెప్పిమరీ చాక్లెట్ వంటి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఇక ‘డయాబెటిక్ కోమా’ అని మరోటి ఉంది. చక్కెర రోగులు వారు తీసుకోవాల్సిన మందుల్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలాగే సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చక్కెరపాళ్లు విపరీతంగా పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందులోనూ మళ్లీ రెండు రకాలు... 1. చక్కెర పాళ్లు 500 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా పెరగడంతో కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని హైపర్ ఆస్మోలార్ కోమా అంటారు. 2. దేహంలోని వ్యర్థాలు (కీటోన్స్, యాసిడ్స్) పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని ‘కీటో అసిడోటిక్ కోమా’ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్సులిన్, సెలైన్ ఇచ్చి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గించడం వల్ల కోమా స్థితి నుంచి వెనక్కు తీసుకురావచ్చు. హైపో న్యాట్రీమిక్ కోమా: మన శరీరంలో చక్కగా పనిచేయడానికి ఎన్నో లవణాలు అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు మనం తీసుకునే ఉప్పు ద్వారా మనకు ఒంట్లోకి సోడియం చేరుతుంది. ఇది 140–150 మిల్లీ ఈక్వివాలెంట్స్ పరిమాణంలో ఉండటం అన్నది సాధారణమైన కొలత. ఆ పరిమాణం 110 కంటే తగ్గితే మనిషి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. బీపీకి చికిత్స తీసుకుంటున్నవారిలో మందుల వల్ల ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం... బీపీని నియంత్రించడానికి డాక్టర్లు ఉప్పు తగ్గించమంటారు. దాంతో కొందరు ఉప్పు పూర్తిగా మానేస్తారు. ఫలితంగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ. ఐవీ ఫ్లుయిడ్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక ఎవరైనా రోగి పొటాషియం లవణాల లోపం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తే ముందే కాసిన్ని కొబ్బరినీళ్లు తాగించడం వల్ల కోమాను నివారించవచ్చు. హైపర్ న్యాట్రీమిక్ కోమా: ఇది దేహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య. ఉదాహరణకు సోడియం పాళ్లు 165 మిల్లీ ఈక్వివలెంట్స్ కంటే ఎక్కువ కావడం వల్ల కూడా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. లివర్ కోమా: కాలేయం చాలా జబ్బుల వల్ల దెబ్బతింటుంది. ఎక్కువగా కొవ్వుండే ఆహారపదార్థాలు తినేవారి నుంచి మొదలుకొని... హెచ్‌బీసీ, హెచ్‌బీబీ వంటి వైరస్ల వల్ల లివర్ దెబ్బతిన్నప్పుడు కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కిడ్నీ కోమా: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇందులో 99% డయాబెటిస్ కారణంగా కిడ్నీలు దెబ్బతిని, కోమాలోకి వెళ్లే కేసులే ఎక్కువ. ఇలాంటివారికి డయాలసిస్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లాస్గో కోమా స్కేల్ కోమా తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను ‘గ్లాస్గో కోమా స్కేల్’గా చెబుతారు. ఇందులో స్కేల్ అంటూ ఏదీ ఉండదుగానీ.. రోగికి ఇస్తున్న సూచనల ఆధారంగా వారు స్పందించే ఒక్కోరకమైన స్పందనకూ ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు కనురెప్పలు కదిలించమంటూ సూచన ఇస్తే వారు కనబరిచే కంటి కదలికలకూ, నోటిమాటకు స్పందించే తీరుకు, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అలాగే డాక్టర్ ఆదేశాలకు రోగినుంచి స్పందనలు పెరుగుతున్న కొద్దీ స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట. అదే స్కోర్ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. అంటే గ్లోస్గో స్కేల్ ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ కోమా నుంచి దూరం అవుతున్నాడన్నాడని అర్థం. కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రోగిని బాగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా ఒకవైపునకు తిరిగి ఉండేలా పడుకోబెట్టాలి. నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేయవద్దు. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం వంటివి సరికాదు. స్పృహలోకి తెప్పించేందుకు చేసే ఈ పనులు రోగులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఓ వ్యక్తికి ప్రమాదంలో మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఇలా కోమా చాలా పెద్దకారణాల వల్లనే కాకుండా, చిన్న చిన్న కారణాల వల్ల కూడా కలగవచ్చు. వాటిని చక్కదిద్దితే దాదాపు 80 శాతం రోగుల్లో కోమాను నివారించవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ...కోమాలో రోగికి చేయాల్సిన ప్రథమ చికిత్సను ఏబీసీగా చెప్పవచ్చు. ►ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకోడానికి నోట్లో గల్ల వంటిది ఉంటే గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. ►బి – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా, ఊపిరి తీసుకోగలిగేలా చూడాలి. ►సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడం వల్ల. ఈ మూడు ప్రాథమిక విషయాలను కాస్తంత విపులీకరించి చూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఈ ప్రథమ చికిత్సల తర్వాత తప్పనిసరిగా రోగిని వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. -
లాక్డౌన్ ముందే కోమాలోకి : రెండు సార్లు కరోనా
ఇంగ్లాండ్: గత ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్డౌన్ కష్టాలు ఇవేవీ తెలియకుండానే సంవత్సరం పాటు గడిపేశాడు బ్రిటన్‌కు చెందిన ఒక యువకుడు. తన దేశంలో 110,000 మందికి పైగా మరణాలు, దాదాపు నాలుగు మిలియన్ల కేసులతో కోవిడ్-19 సృష్టించిన విలయం...ఇవేవీ అతగాడికి నిజంగా తెలియదు. ఎందుకంటే, లాక్‌డౌన్‌కు మూడువారాల ముందు స్టేజ్-2 కోమాలోకి జారుకున్న అతగాడు ఇపుడిపుడే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. అంతేకాదు ఈ కాలంలో తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాడు. రెండుసార్లు కరోనా వైరస్ బారిన పడ్డాడు కూడా. చివరకు కోమా నుంచి బైటపడి క్రమంగా కోలుకుంటూ ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన జోసెఫ్ ఫ్లావిల్ (19) గత ఏడాది మార్చి 1న బర్టన్-ఆన్-ట్రెంట్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కారు అతడ్ని బలంగా ఢీకొట్టడంతో మెదడుకు తీవ్ర గాయమైంది. దీంతో జోసెఫ్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఇంతలో దేశలో కరోనా మహమ్మారి విస్తరించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు సహా ఎవరినీ ఆసుపత్రి అనుమతించలేదు. కేవలం వీడియోల ద్వారా అతనితో కమ్యూనికేట్ చేస్తూ, ధైర్యం చెప్పారు. అలా ఏడాదిపైగా ఆసుపత్రిలో ఒంటరి పోరాటం చేసి జోసెఫ్ మెల్లగా కోటుకుంటూ ఉండటంతో బంధువులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. జోసెఫ్ ప్రస్తుతం సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లోని ఒక సంరక్షణా కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు వైద్య ఖర్చుల నిమిత్తం నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కుటుంబ సభ్యులు కాగా, జోసెఫ్ కోమా నుంచితేరుకుని బయటపడి మెల్లగా కోలుకుంటున్నాడని, ఇది తమకెంతో ఆనందాన్ని కలిగించిందని సమీప బంధువు సాలీ ఫ్లావిల్ తెలిపారు. తమ మాటల్ని వినగలుగుతున్నాడని, తమ సైగలను అర్థం చేసుకుంటూ కళ్లతోనే ప్రతిస్పందిస్తున్నాడని ఆమె తెలిపారు. అయితే జోసెఫ్ తిరిగి సాధారణ స్థితికిరావడానికి మాత్రం ఇంకా చాలా టైం పడుతుందన్నారు. కాగా మంచి క్రీడాకారుడైన జోసెఫ్ హాకీ, కౌంటీ క్రికెట్, స్కైడ్, సర్పింగ్లో ప్రావీణ్యుడు. ఈ నేపథ్యంలో మే 2020 లో బకింగ్‌హామ్ ప్యాలెస్ ‘గోల్డ్ డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ అవార్డును అందుకోవలసి ఉంది. కానీ ప్రమాదం కారణంగా అందుకోలేకపోయాడు.. -
‘చికెన్’ మిరాకిల్.. కోమా నుంచి కోలుకున్నాడు
తైపీ: ‘ఫేవరెట్ ఫుడ్’ పిల్లల ఏడుపుని.. ఆకలిని, అలకని తగ్గిస్తుందని తెలుసు. కానీ ఏకంగా మెడిసిన్‌గా పని చేసి కోమా నుంచి కోలుకునేలా చేస్తుందని ఎప్పుడైనా విన్నారా.. లేదు కదా. కానీ ఇలాంటి సంఘటన ఒకటి తైవాన్‌లో చోటు చేసుకుంది. దాదాపు రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పగానే కోలుకున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. వివరాలు.. తైవాన్‌కు చెందిన చియు అనే యువకుడు రెండు నెలల క్రితం స్కూటర్ మీద నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లీహం, కుడి మూత్ర పిండం, లివర్ దారుణంగా దెబ్బ తిన్నాయి. అంతర్గత గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆస్పత్రిలో చేర్చిన చియుకు ఆరు ఆపరేషన్లు జరిగాయి. ప్రాణాపాయం తప్పింది కానీ అతడు కోమాలోకి వెళ్లాడు. ఇక చియు ఎప్పుడు కోలుకునేది తాము చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. (చదవండి: కోమా నుంచి బయటకు.. పదేళ్ల తర్వాత శిక్ష) ఈ క్రమంలో చియు కుటుంబ సభ్యులు అతడు కోలుకోవాలని.. దేవుడిని ప్రార్థించారు. ఏదైనా అద్భుతం జరిగి.. చియు కోలుకుంటాడేమోనని బెడ్ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకునేవారు. ఇలా 62 రోజులు గడిచిపోయింది. ఈ క్రమంలో చియు సోదరుడు అతడిని చూడటానికి ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా.. చియు నేను నీ ఫేవరెట్ చికెన్ ఫిల్లెట్స్ తినబోతున్నాను అని తెలిపాడు. ఆశ్చర్యం.. రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న చియుకి చికెన్ ఫిల్లెట్స్ పేరు వినగానే స్పృహ వచ్చింది. పల్స్ రేటు పేరిగింది. విషయం తెలుసుకున్న వైద్యులు చియు పరీక్షించి అతడు కోలకున్నాడని తెలిపారు. నిజంగా ఇది అద్భుతం అన్నారు. ఆ తర్వాత చియు పూర్తిగా కోలుకున్నాక అతడిని డిశ్చార్జ్ చేశారు. తాజాగా అతడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ తీసుకెళ్లి ఇచ్చాడు. -
కోమా నుంచి బయటకు.. పదేళ్ల తర్వాత శిక్ష
బెంగళూరు : హత్యాయత్నం కేసులో ఇద్దరి నిందితులకు పదేళ్ల తర్వాత ఏడేళ్ల జైలు శిక్ష పడింది. బాధితుడు ఏడాది పాటు కోమాలోకి వెళ్లడం.. తర్వాత అసలు విషయం చెప్పడం.. విచారణ ఆలస్యం కావడంతో దాదాపు పదేళ్ల తర్వాత నిందితులకు ఏడేళ్ల శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన శౌవిక్ ఛటర్జీ, అతని స్నేహితులు శశాంక్ దాస్ (అసోం), జితేంద్ర కుమార్(ఒడిశా) బెంగళూరులోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చేశారు. ఆ సమయంలో ఓ యువతితో బాధితుడు ఛటర్జీ చనువుగా ఉండేవాడు. ఆ యువతినే దాస్ కూడా ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో ఛటర్జీ అడ్డుతొలగించుకోవాలని దాస్ కుట్ర పన్నాడు. మరో స్నేహితుడు జితేంద్రతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. ఛటర్జీని తమ ఇంటికి రప్పించారు. టెర్రస్ పైకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి.. అక్కడకు వెళ్లగానే ఛటర్జీని కొట్టి కిందకు తోసేశారు. 2010 డిసెంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. (చదవండి : అమ్మ దొంగా! చిల్లర అడిగి మరీ..) ఏడాది పాటు కోమాలోకి తీవ్రంగా గాయపడిన ఛటర్జీ కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది తర్వాత 2011 ఆగస్ట్‌లో ఛటర్జీ కోమా నుంచి బయటకు వచ్చి అసలు విషయం చెప్పారు. దీంతో బెంగళూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 2012లో ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత కేసు విచారణ పూర్తయింది. నిందితులకు ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోల్‌కతా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం నిందితుల్లో ఒకడైన శశాంక్ దాస్ ఢిల్లీలోని ఓ ప్రయివేట్ బ్యాంకులో పనిచేస్తుండగా.. ఒడిశాకు చెందిన జితేందర్ కుమార్ బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. -
కోమాలోకి వెళ్తే ఏం చేయాలంటే..
కోమా అనేది మరణం వంటి కండిషన్. అందుకు కోమాలోకి వెళ్తే వెనక్కి రారనేది చాలామంది అపోహ. కానీ అది వాస్తవం కాదు. కోమాలోంచి వెనక్కి వచ్చిన కేసులూ చాలా ఎక్కువే. కాకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే రోగి కోమాలోకి వెళ్తే కొన్ని ప్రథమ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ, బీ, సీ అంటూ సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ... ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకునే మార్గంలో అంటే ముక్కు / నోరు దారుల్లో తెమడ / గల్ల వంటిది ఏదైనా ఉంటే దాన్ని గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. బీ – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా చూడాలి. రోగికి ఊపిరి బాగా అందేలా జాగ్రత్తతీసుకోవాలి. సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలి. ఈ మూడు అంశాలతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే... అది కట్టుబడేలా మరీ ఒత్తిడి పడకుండా చూస్తూనే గట్టిగా పట్టుకుని రక్తస్రావం ఆగేలా చూడాలి. కోమాలోకి వెళ్లిన రోగిని గాలి ధారాళంగా వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం చేయవద్దు. ఈ చర్య ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రోగి మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఆల్కహాల్‌తోనూ ‘కోమా’లోకి... మద్యపానం మితిమీరితే కోమాలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది. అందుకే ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఒక్కోసారి ఆల్కహాల్ వల్ల వచ్చే ఫిట్స్‌తో కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల కొన్ని సార్లు కొన్ని విటమిన్లు (ప్రధానంగా థయామిన్) లోపించడం వల్ల కోమాలోకి వెళ్తారు. ఈ కండిషన్‌ను ‘వెర్నిక్స్ ఎన్‌కెఫలోపతి’ అంటారు. వీరికి కేవలం థయామిన్ ఇస్తే చాలు కోమా నుంచి బయటకు వచ్చేస్తారు. ఆల్కహాల్ తాగాక తూలి పడిపోయి తలకు దెబ్బ తగలడం, దాని వల్ల రక్తస్రావం కావడం లేదా రక్తం గడ్డకట్టి కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఇలా కోమాలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఆల్కహాల్ కావడం వల్ల దాన్ని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. -
‘సెప్టిక్ షాక్’లోకి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నిన్నటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రణబ్ డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: ఆస్పత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్) సాధారణంగా ‘సెప్టిక్ షాక్’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్‌లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. ఇక ప్రణబ్ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని.. కానీ అతని కీలకమైన పారామీటర్స్ అన్ని స్థిరంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు. I urge all my friends here to pray for the recovery of My father #PranabMukherjee . He is a fighter & with all your good wishes & prayers , He will surely recover ! At the moment he is critical but all his vital parameters are stable ! — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020 -
డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. డీప్ కోమాలోకి ప్రణబ్ వెళ్లారని ప్రకటించారు. ఇప్పటి వరకు అందించిన వైద్య చికిత్సతో ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ప్రణబ్‌కు చికిత్స కొనసాగుతోందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ప్రణబ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. (క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) -
కిమ్‌కి ఏమీ కాలేదు
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కోమాలోకి వెళ్లి పోయారని వచ్చిన వదంతులకి తెర పడింది. కరోనా వ్యాప్తి, తుపాన్ ఎదుర్కొనే ఏర్పాట్లపై బుధవారం పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ సమీక్ష జరుపుతున్నట్లు ఫొటోలను యంత్రాంగం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఉన్న లోటుపాట్లను కిమ్ అధికారులతో చర్చించినట్టుగా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సమావేశంలో కిమ్ పొగతాగుతూ కనిపించారని తెలిపింది. కిమ్‌పై అనారోగ్యం వార్తలు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ కిమ్ మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వీడియో బయటకి వచ్చింది. ఇప్పుడు కూడా కిమ్ కోమాలోకి వెళ్లారని సోదరి కిమ్ యో జాంగ్‌కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరిగింది. -
రష్యా ప్రతిపక్ష నేతపై విషప్రయోగం?
మాస్కో: రష్యా ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని ఆయన అనుచరులు వెల్లడించారు. ఆయన కోమాలో వెళ్ళడంతో, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి, చికిత్స చేస్తున్నారు. నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలోని కేఫ్‌లో టీ తాగారని, అనుమానాస్పదమైన పదార్థం ఏదైనా టీలో కలిపి ఉంటారని ఆమె వెల్లడించారు. విమానంలో నావల్నీకి చెమటలు పట్టడం ప్రారంభమైందనీ, బాత్రూంలోకి వెళ్ళి స్పృహ కోల్పోయారని వెల్లడించారు. తీవ్ర వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పుతిన్, ఘోరంగా వ్యవహరిస్తున్నారని నావల్నీ సన్నిహితుడు వ్లాదిమిర్ మిలో ట్వీట్ చేశారు. నావల్నీపై విషప్రయోగం జరిగిందనే విషయాన్ని పోలీసులు అంగీకరించడం లేదని అధికార మీడియా సంస్థ టాస్ పేర్కొంది. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు. -
వెంటిలేటర్‌పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి గురువారం తెలిపింది. ప్రణబ్ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ‘నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను’అని అభిజిత్ ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్ మరణించారన్న వదంతులు ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్ వాటిని కొట్టిపారేశారు. ‘‘మా తండ్రి శ్రీ ప్రణబ్ బతికే ఉన్నారు. పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది’’అని ట్వీట్ చేశారు. ‘‘మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్ను సంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ట్వీట్ చేశారు. -
ఆపరేషన్‌కు ఆర్థిక చేయూత అందించండి
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన తన భర్త ఆపరేషన్‌కు ఆర్థిక చేయూత అందించి ఆదుకోవాలని భార్య స్వరూపరాణి, కుమారుడు వికాస్ దాతలను వేడుకుంటున్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జూలూరు శ్రీనివాస్‌కు యాక్సిడెంట్లో తలకు బలమైన గాయమై మెదడుపై ప్రభావం చూపింది. నిరుపేద కుటుంబం అప్పు చేయడంతోపాటు కొందరు దాతలు సాయం చేయడంతో సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించారు. మరో ఆపరేషన్ అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సుమారు రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుంది. దాతలు ఆదుకోవాలని బాధితుడి భార్య, కుమారుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్: 96034 19501 గూగుల్ పే ద్వారా తోచిన సాయం చేయాలని కోరుతున్నారు. -
‘తను లేని చోట నేనుండలేను’
వాషింగ్టన్: లారెన్స్ నోక్స్(69) మేరిల్యాండ్లోని ప్లీజంట్ వ్యూ నర్సింగ్ హోంలో నర్సింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించాడు. అతని రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి వారం రోజుల ముందు వరకు కూడా అతడు విధులు నిర్వహించాడు. ఈ ఏడాది మార్చి 30న లారెన్స్ అనారోగ్యం పాలయ్యాడు. దాంతో కటుంబ సభ్యులు లారెన్స్‌ను కారోల్ హాస్పిటల్ సెంటర్లో చేర్పించారు. అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన లారెన్స్ వారం తర్వాత కోలుకున్నారు. ఇక అతడికేం పర్వాలేదని వైద్యులు చెప్పారు. కోమాలో నుంచి కోలుకున్న వెంటనే లారెన్స్ అడిగిన మొదటి ప్రశ్న మిన్నేట్ నోక్స్(71) ఎక్కడ అని. ఆ ప్రశ్న వినగానే కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయ్యింది. నిజం చేప్తే ఎంత ప్రమాదమో వారికి తెలుసు. అందుకే సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ లారెన్స్ పదే పదే అడగటంతో సమాధనం చెప్పక తప్పలేదు. మిన్నేట్ ఇక లేరనే చేదు విషయాన్ని లారెన్స్‌కు చెప్పారు. ఆ సమాధానం విన్న లారెన్స్ క్షణం పాటు స్తంభించిపోయారు. తాను విన్నది అబద్దం అయితే బాగుండని దేవుడిని ప్రార్థించారు. అసలు కోమా నుంచి ఎందుకు కోలుకున్నానా అని రోదించారు. అవును మరి గత 24 ఏళ్లుగా కష్ట సుఖాల్లో తనతో కలసి జీవించిన మనిషి ఇక లేదని తెలిస్తే ఆ బాధ వర్ణణాతీం. అది జీవిత చరమాంకంలో. ఈ విషాదం లారెన్స్‌ను కృంగదీసింది. మిన్నేట్ లేని చోట తను ఉండలేను అనుకున్నాడు. అందుకే పిల్లల్ని పిలిచి ఇక తనకు ఎలాంటి వైద్యం అందించ కూడదని చెప్పారు. ఆ బాధతో ఏప్రిల్ 15న చివరి శ్వాస విడిచారు లారెన్స్. (కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం) ఈ విషయం గురించి లారెన్స్ కుమార్తె మాట్లాడుతూ.. నాన్నకు కరోనా పాజిటీవ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేర్పించాం. నాన్న ఆరోగ్యం గురించి అమ్మ చాలా దిగులుపడింది. ఆ బాధతోనే ఏప్రిల్ 7న గుండెపోటుతో నిద్రలోనేమరణించింది. తర్వాత డాక్టర్లు అమ్మకు కరోనా పాజిటీవ్ అని తేల్చారు. కోమా నుంచి బయటకు వచ్చిన నాన్న అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. అందుకే ఆమె చనిపోయిన వారం రోజులకే తను ఈ లోకం నుంచి వెళ్లి పోయాడు అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది. చదవండి: ఇక 'కోవిడ్' లైఫ్ -
కోమాలోకి అజిత్ జోగి
రాయ్‌పూర్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (79) ఆదివారం కోమాలోకి వెళ్లారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఇక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు తెలిపారు. గుండె పనితీరు బాగానే ఉందని, బీపీ కూడా అదుపులోకి వచ్చిందని చెప్పారు. అయితే శ్వాసకోస వ్యవస్థ పనిచేయకపోవడంతో మెదడు స్పందించడం లేదని, వైద్య పరిభాషలో దీన్ని హైపాక్సియా అంటారని తెలిపారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. రానున్న 48 గంటలు కీలకమని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. -
విషమం.. కోమాలోకి మాజీ సీఎం
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లారని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశముందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ సునిల్ ఖేమా తెలిపారు. కాగా శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్‌జోగి ఎన్నికైన విషయం తెలిసిందే. 74 ఏళ్ల అజిత్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేసి గెలుపొందారు. (మాజీ సీఎం అజిత్ జోగికి గుండెపోటు) -
విధి విషాదం
బంజారాహిల్స్: ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మూడు నెలల క్రితం కూతురు డెంగీ జ్వరంతో కోమాలోకి వెళ్లి మరణించింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సైతం కోమాలోకి వెళ్లి రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్– 10లో వాకింగ్ చేస్తున్న యువకుడిని మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిన బాధితుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. కర్ణాటకకు చెందిన కురువ అశోక్ (30) కారు డ్రైవర్‌గా పని చేస్తూ భార్య మంజుతో కలిసి బోరబండ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ బీజేఆర్ నగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రతిరోజూ తెల్లవారుజామునే బీజేఆర్నగర్ నుంచి వాకింగ్‌చేస్తూ జూబ్లీహిల్స్ వరకు వచ్చి తిరిగి వెళ్తుంటాడు. ఈ నెల 19న తెల్లవారుజామున 5.30 గంటలకు జూబ్లీహిల్స్‌లో వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్నాడు. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో అశోక్ కోమాలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ సుశీల్ ఈసీఐఎల్‌లో నివసిస్తాడని కన్సల్టేషన్ వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. సుశీల్‌పై ఐపీసీ సెక్షన్ 304(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిని అరెస్ట్ చేయాలంటూ మృతుడు అశోక్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలల క్రితం కూతురు సైతం.. అశోక్, మంజు దంపతులకు కూతురు అనన్య (3) ఉండేది. మూడు నెలల క్రితం చిన్నారికి డెంగీ జ్వరం సోకింది. మూడు రోజుల పాటు కోమాలోకి వెళ్లి నిలోఫర్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆ ఘటన నుంచి తేరుకోకముందే అశోక్ సైతం మూడు రోజుల పాటు కోమాలోకి వెళ్లి మృతి చెందడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
పాపం పసివాడు
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: చిట్టిపొట్టి మాటలతో తడబడుతూ, నడుస్తూ తల్లిదండ్రులను ఆనందింపచేస్తున్న ఆ బాలుడికి అనుకోని కష్టం వచ్చింది. దీంతో బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కార్పెంటర్ వృత్తి చేస్తున్న దార్ల సత్యనారాయణకు నాలుగు సంవత్సరాల జ్ఞానదీప్, కుమార్తె ఉన్నారు. జ్ఞానదీప్కు కొద్దిరోజుల క్రితం జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. అక్కడ మెరుగుపడకపోవడంతో జంగారెడ్డిగూడెం, అక్కడ నుంచి విజయవాడకు తీసుకువెళ్లారు. అయితే జ్ఞానదీప్కు లివర్ సంబంధిత వ్యాధి సంక్రమించిందని, తద్వారా కిడ్నీలు, బ్రెయిన్ మొద్దుబారి కోమాలోకి జారుకున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. జ్ఞానదీప్ మెరుగుపడటానికి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని తెలపడంతో ఇప్పటికే చికిత్స నిమిత్తం సత్యనారాయణ ఉన్నవన్నీ అమ్ముకుని కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలుడిని ఆదుకోవాలంటే రోజుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారని, కట్టుబట్టలతో మిగిలిన తమకు బాలుడు వైద్యచికిత్సను అందించడం కష్టంగామారిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున గానీ, దాతల తరఫున గానీ తమకు ఆర్థిక సహాయం అందించాలని దాతలు 9701705312 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. -
స్ప్రే వాసనకి.. కోమాలోంచి బయటకు
లండన్: ‘ఒక వ్యక్తి కోమాలో ఉంటాడు... అప్పుడు డాక్టర్ సదరు రోగి బంధువులకు తనకు ఇష్టమైన పాటలు పాడడం, కొన్ని సంఘటనలను వినిపించడం లాంటివి చేయండని చెబుతారు. దాంతో రోగి కోమాలో నుంచి బయటకు వస్తాడు’. ఇలాంటివి మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి ఇంగ్లండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో జరిగింది. కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు కొన్ని రోజుల క్రితం చలికి గడ్డకట్టి ఉన్న నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత క్రూజ్‌ని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని అంతా భావించారు. కానీ గుండె కొట్టుకోవడాన్ని గమనించిన వైద్యులు అతడు కోమాలోకి వెళ్లినట్లు ధ్రువీకరించారు. దాదాపు 21 రోజులపాటు క్రూజ్‌ని కోమాలో నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో క్రూజ్ ఇంట్లో స్నానానికి ఉపయోగించే సోప్స్‌తోపాటు డియోడ్రెంట్ ఇతరత్ర ఇష్టమైన వస్తువులను తీసుకురావాలని క్రూజ్ తల్లికి ఓ నర్సు సూచించింది. ఆమె సూచనల మేరకు క్రూజ్ శరీరాన్ని శుభ్రం చేసిన తల్లి అతడికి ఇష్టమైన డియోడ్రెంట్‌ను స్ప్రే చేసింది. దీంతో క్రూజ్ వెంటనే కళ్లు తెరిచాడు. ఆ డియోడ్రెంట్ అంటే క్రూజ్‌కు చాలా ఇష్టమని, అదే అతడిలో కదలిక తీసుకువస్తుందని తాము అస్సలు ఊహించలేకపోయామని క్రూజ్ తల్లి పేర్కొంది. ఇది చాలా అరుదైన ఘటన అని వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. -
27 ఏళ్ల తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ
అబుదాబి: ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగిన కొన్నింటిని మాత్రమే మనం గుర్తించగలం. అలాంటి ఓ ఘటనే యూఏఈలో జరిగింది. దుబాయ్‌కు చెందిన ఓ మహిళ 27 ఏళ్ల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చింది. బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సదురు మహిళను ఆమె కుమారుడు కంటికి రెప్పల చూసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత ఆ మహిళ స్పృహలోకి రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే.. 1991లో 32 ఏళ్ల మునీరా తన కుమారుడు ఒమర్‌ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకువస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో మునీరా తన కుమారుడిని గట్టిగా అలుముకోవడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 4 ఏళ్ల ఒమర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే మునీరా బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చేర్పించారు. కాగా, వైద్యులు మాత్రం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. మళ్లీ కళ్లు తెరిచే అవకాశం లేదని తెలిపారు. కానీ మునీరా కుటుంబ సభ్యులు నమ్మకం కోల్పోలేదు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు యూఏఈ ప్రభుత్వం ఆమెను చికిత్స నిమిత్తం లండన్‌కు పంపింది. చికిత్స అనంతరం ఆమెను తిరిగి స్వదేశానికి తరలించారు. అక్కడి హాస్పిటల్లో మునీరాకు చాలా ఏళ్ల పాటు ట్యూబ్ ద్వారా ఫీజియోథెరపి నిర్వహించారు. తల్లి చికిత్స కోసం ఒమర్ ఎంతగానో శ్రమించారు. చివరకు 2017 ఏప్రిల్‌లో మునీరా పరిస్థితిని సమీక్షించిన క్రౌన్ ప్రిన్స్ కోర్టు ఆమెను జర్మనీ తీసుకెళ్లి చికిత్స చేయించడానికి అవకాశం కల్పించింది. అక్కడ కొన్ని సర్జరీలు నిర్వహించిన వైద్యులు, మెరుగైన చికిత్స అందించారు. ఇలా ఒక ఏడాది గడిచిన తర్వాత ఇంకో వారంలో జర్మనీలో మునీరా ట్రీట్మెంట్ ముగుస్తుందన్న సమయంలో అద్భుతం జరిగింది. 2018 జూన్‌లో ఆమె చికిత్స పొందుతున్న గదిలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే ఇదే సమయంలో మునీరాలో కదలిక ప్రారంభమైంది. ఆమె గొంతు నుంచి వింత శబ్దాలు రావడంతో.. ఒమర్ వెంటనే వైద్యుల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత మునీరాను పరీక్షించిన వైద్యులు అంత నార్మల్‌గానే ఉందని తెలిపారు. ఇది గడిచిన మూడు రోజులకు ఒమర్‌కు తన పేరును ఎవరో పిలిచినట్టు వినబడింది. తీరా చూస్తే పిలిచింది మునీరానే కావడంతో ఒమర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 27 ఏళ్లుగా తను దేని కోసమైతే కల కన్నాడో అది నిజం కావడంతో పట్టరాని సంతోషంతో పొంగిపోయారు. తర్వాత కుటుంబంతో కలిసి తిరిగి అబుదాబి చేరుకున్న మునీరాకు ప్రస్తుతం ఫీజియోథెరపి చేస్తున్నారు. ఒమర్ అప్పుడప్పుడు మునీరాను వీల్‌చైర్‌లో ఉంచి మసీదులకు కూడా తీసుకుని వెళ్తున్నారు. మునీరా నెమ్మదిగా కోలుకుంటున్నట్టు ఆమె చికిత్స పొందుతున్న హాస్పిటల్ యాజమాన్యం గత నెలలో విడుదల చేసిన మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయాల్ని ఒమర్ ‘ది నేషనల్’తో పంచుకున్నారు. ‘ఇప్పుడు అమ్మ కథను చెప్పడానికి ఓ కారణం ఉంది. ఎవరైనా సరే తమకు ఇష్టమైన వారిమీద ఆశలు వదలుకొవధ్దు. ప్రమాదం జరిగిన సమయంలో నా తల్లి వెనుక సీటులో కూర్చుని ఉంది. ప్రమాదం జరుగుతున్న సమయంలో వెంటనే నన్ను గట్టిగా హత్తుకుని కాపాడింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా నేను ఏ రోజు కూడా అమ్మ మీద ఆశ వదులుకోలేదు. ఆమె ఏదో ఒక రోజు కోలుకుంటుందనే నమ్మకం నాలో ఎప్పుడు ఉండేది. నాకు అమ్మ బంగారం లాంటిది. ఎంతో విలువైన అమ్మకోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. దీనికి నేను బాధపడటం లేద’ని తెలిపారు. -
బస్సు నుంచి జారిపడిన విద్యార్థి
విజయనగరం, మెంటాడ: బస్సు నుంచి జారిపడి ఒకరు కోమాలోకి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తల్లి, గ్రామస్తులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జగన్నాథపురానికి చెందిన రామవరపు సాయి గజపతినగరం మండలం పురిటిపెంట గాయత్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సాయి తండ్రి పదేళ్ల కిందటే మరణించడంతో ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఈ క్రమంలో చదువు ఆగకూడదనే ఉద్దేశంతో సాయి సమవి ప్రైవేట్ కళాశాల బస్సులో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తూ గాయత్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరయ్యాడు. ఆండ్ర నుంచి బస్సు వస్తుండగా జగన్నాథపురం, పిట్టాడ గ్రామాల మధ్య సాయి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే సాయిని విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే డ్రైవర్ బి. శ్రీను నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ పడిపోయాని బాధిత విద్యార్థి తల్లి తిరుపతమ్మ ఆరోపించింది. ఎటువంటి లైసెన్స్ లేని వ్యక్తిని డ్రైవర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించింది. ఆండ్ర పోలీసులు విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. -
మూడు రోజులు.. ఇంకా కోమాలోనే మాధవీలత !
ఒంగోలు /చీమకుర్తి: మండల పరిధిలో మూడురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిడసల మాధవీలత, కుమారుడు జనార్దన్‌లు ఇంకా కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం రిమ్స్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 8న పేర్నమిట్ట శాంతినగర్‌కు చెందిన మాధవీలత, కొడుకు, కూతురు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందును కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కూతురు విజయలక్ష్మి అప్పుడే మృతిచెందగా మాధవీలత, జనార్దన్ మృత్యువుతో పోరాడుతున్నారు. శరీరంలో పురుగుల మందు ప్రభావం కనీసం వారం రోజుల వరకు ఉంటుందని వైద్యం చేస్తున్న డాక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని వారం రోజులు గడిస్తేగాని వారి ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నట్లు తాలూకా సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌నోట్‌ను నిపుణులచే పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మాధవీలత ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొంతమందికి ఇవ్వాల్సిన చిన్న అప్పులను కూడా పిలిచి ఇచ్చినట్లు, అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ముందే అనుకుని ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు సీఎంను, కలెక్టర్‌ను అడ్రెస్ చేస్తూ తన భర్త చనిపోవడానికి గల కారకుల పేర్లను సూసైడ్‌నోట్‌లో రాసి ఉంచటమే కాకుండా మాధవీలత చేతుల మీదకూడా వారి పేర్లు రాసినట్లు చెప్పుకుంటున్నారు. -
మానవత్వమా నీవెక్కడ?
ఒంగోలు టౌన్: ఊరుగాని ఊరు. నా అని పలకరించేవారు లేరు. ఒక్కసారిగా ఆమె భర్త ఆరోగ్యం క్షీణించింది. రిమ్స్‌లో చేర్పిస్తే.. ఇరవై రోజులు చికిత్స చేసి చేతులెత్తేసి తీసుకువెళ్లాలంటూ చెప్పారు. ఎటు వెళ్లాలో తెలియక నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్లోని ఫుట్‌పాత్‌పైనే భర్తను పడుకోబెట్టి రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని భిక్షాటనకు వెళుతోందా తల్లి. మొదటిరోజు కొంచెం కళ్లు తెరిచి చూసినా మూడు రోజుల నుంచి పూర్తిగా కోమాలోనే ఉన్నాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే కలెక్టరేట్ వద్ద ఇలా మూడు రోజులుగా ఓ వ్యక్తి అచేతనంగా పడిఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం పరిస్థితి మరింత విషమించింది. భర్త చనిపోయాడనుకుని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం అతని భార్య వెళ్లింది. తోడుగా ఉంటున్న మామ తాగునీటి కోసం వెళ్లాడు. ఆ సమయంలో రెండేళ్ల చిన్నారి తన తండ్రి తల, చేతులను పట్టుకొని అటూ ఇటూ కదిలిస్తున్నాడు. సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి 1098కు సమాచారం ఇచ్చారు. హెల్ప్ ప్రోగ్రాం ఆఫీసర్ బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి డి.దేవకుమారి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కోమాలో ఉన్న వ్యక్తిని లేపేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి చలనం లేదు. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకొని కొద్దిసేపు ఇటూ ఇటూ చూశారు. చివరకు ఆ బిడ్డ తల్లి వచ్చింది. తన దీనగాథను వారి వద్ద వెళ్లబోసుకుంది. తన పేరు నీలం అనూష అని, తన భర్త పేరు దుర్గాప్రసాద్ అని చెప్పింది. రాజమండ్రిలోని మండపేటలో ఉంటున్న తాము ఐదారేళ్ల క్రితం కాగితాలు ఏరుకుంటూ ఒంగోలు వచ్చామని తెలిపింది. ‘ఇక్కడ నా అనేవారు లేకపోయినా నా భర్త, రెండేళ్ల కుమారుడు, మామతో కలిసి ఫుట్‌పాత్‌పైనే ఉంటున్నాం. భర్త మద్యం దుకాణంలో పనిచేశాడు. నేను కాగితాలు ఏరుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. నా భర్త లివర్, గుండె చెడిపోవడంతో ఇరవై రోజుల క్రితం రిమ్స్ హాస్పిటల్లో చేర్పించాను. నాలుగు రోజుల క్రితం ఇక బతకడు తీసుకువెళ్లమంటే, కలెక్టరేట్ ఫుట్‌పాత్‌పైనే పడుకోబెట్టా...మూడు రోజుల నుంచి నా భర్తను పిలిచినా పలకడం లేదు.. కదలడం లేదు..’ అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం వెళ్లానని అనూష తెలిపింది. స్పందించిన సాగర్ తన వద్ద ఉన్న రూ.500 ఇచ్చి..రెండేళ్ల చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచిన అనంతరం శిశుగృహలో చేర్పించాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో కూడా దుర్గాప్రసాద్ కోమాలోనే ఉన్నాడు. -
కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చి..
టెన్నెస్సీ : కోమాలో ఉండగా మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఉదంతం అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రంలో వెలుగు చూసింది. కారు ప్రమాదం కారణంగా కోమాలోకి పోయిన ఓ గర్భిణి కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చింది. కోమాలోంచి బయటకు వచ్చిన ఆమె బిడ్డను చూసుకున్న కొన్ని రోజులకు కన్నుమూసింది. ఈ ఉదంతం టెన్నెస్సీలోని నాక్స్విలే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. శారిష్టా గెలస్ అనే మహిళ 2014 సంవత్సరంలో తన స్నేహితురాళ్లతో కలసి ఓ వేడుకకు వెళ్లి కారులో తిరిగి వస్తోంది. అప్పుడు జరిగిన కారు ప్రమాదంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో శారిష్టా నాలుగు నెలల గర్భవతి. ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేదని ఆమె బతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు అన్నారు. కోమాలో ఉన్న ఆమె 26 వారాల తర్వాత ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత కొద్ది నెలలకే ఆమె కళ్లు తెరచి బిడ్డను చూసుకుంది. అలా మంచంపై నుంచే మూడు సంవత్సరాల పాటు కన్న కొడుకు ఎదుగుదలను చూసుకున్న ఆమె పిల్లాడి మూడో పుట్టిన రోజు వేడుక జరిగిన కొద్ది రోజులకే మరణించింది. -
పింఛన్ కోసం తల్లి శవాన్ని..
వారణాసి: కన్నతల్లి చనిపోతే ఎటువంటి వ్యక్తులైనా కంటతడి పెడతారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి కొడుకులుగా పుట్టినందుకు తమ రుణం తీర్చుకుంటారు. కానీ తల్లి చనిపోయినా ఆమెకు వచ్చే పింఛన్‌పై కన్నేశారు నలుగురు సుపుత్రులు. ఆమె మృతదేహాన్ని ఐదు నెలలపాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి విషయం బయటపడడంతో జైలు పాలయ్యారు. ఈ విచారకర ఘటన వారణాసిలోని కబీర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబీర్ నగర్‌కు చెందిన అమరావతి దేవి(70)కి ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె. ఆమె తన నలుగురు కుమారులు, కుమార్తెతో కలిసి ఒకే చోట నివాసం ఉంటుండగా, ఒక కొడుకు మాత్రం వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం కస్టమ్స్ శాఖలో ఉద్యోగం చేస్తున్న అమరావతి భర్త చనిపోయాడు. దీంతో ఆమె నెలకు రూ.13000 పింఛన్ తీసుకుంటుంది. ఈ ఏడాది జనవరిలో అమరావతి దేవి ఆరోగ్యం క్షీణించడంతో నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. దీంతో జనవరి 13న అమరావతి కన్నుమూశారు. తొలుత అమె మరణాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. కానీ అంతలోనే చిన్నకుమారుడు అమ్మ చేతులు కదులుతున్నాయని చెప్పి చనిపోలేదని కోమాలోకి వెళ్లిందని అబద్దం చెప్పారు. దీంతో ఆమె శవాన్ని ఇంట్లోనే ఉంచి వాసన రాకుండా రసాయనాలు చల్లారు. ఆమె పేరు చెప్పి ప్రతి నెల పింఛన్ డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై భేలుపూర్ సర్కిల్ ఆఫీసర్ ఏపీఖాన్ మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంట్లో అమరావతి సంతకం చేసి ఉంచిన ఐదు బ్లాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా తమ తల్లి కోమాలోకి వెళ్లిందని, రోజూ పాలు తాగుతుందని అమారావతి దేవి కొడుకొకరు చెప్పారు. పోస్ట్ మార్టం వివరాలు వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
పాప్ సాంగ్ మ్యాజిక్
-
మ్యాజిక్ చేసిన పాప్ సాంగ్...
సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందంటారు. ఆ మాట ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. 4 నెలలుగా కోమాలో ఉన్న ఓ అమ్మాయిని స్పృహలోకి వచ్చేలా చేసింది మాత్రం ఒక పాటే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుచేసే..ఈ అరుదైన సంఘటన చైనాలో చోటుచేసుకుందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. ఇంతకీ విషయమేమిటంటే.. చైనాకు చెందిన 24 ఏళ్ల యువతి గత నవంబర్‌లో కోమాలోకి వెళ్లింది. రక్తంలో ఆక్సీజన్ సరఫరా సరిగా లేనందున మెదడు పనిచేయకపోవడంతో ఆమెకు ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఓ నర్స్ సేవలు అందిస్తోంది. ఎలాగైనా ఆమెలో చలనం కలిగించాలనుకున్న నర్స్.. ప్రతీరోజూ జోకులు చెప్తూ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేది. అందులో భాగంగానే ఓ రోజు తనకెంతో ఇష్టమైన.. తైవాన్ పాప్‌స్టార్ జే చో ‘రోజీమేరీ’ పాటను ప్లే చేసింది. ఆ పాట వినగానే యువతి నెమ్మదిగా కళ్లు తెరిచింది. ఈ విషయాన్ని గమనించిన నర్స్.. డాక్టర్‌ను పిలుచుకొని వచ్చింది. నాలుగు నెలలుగా జీవచ్చవంలా పడి ఉన్న పేషెంట్ ఇలా స్పృహలోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆమెకు మెరుగైన చికిత్సను అందించి తిరిగి మామూలు మనిషయ్యేలా చేశారు. -
అతిగా నీళ్లు తాగుతున్నారా?, బీ కేర్‌ఫుల్..
క్యాన్బెరా: అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత అవసరం లేకున్నా నీరు తాగించారు. మరొక గ్రూపు చేత అవసరం ఉన్నంత మేరకే నీరు తాగించారు. అనంతరం రెండు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. అవసరానికి మించి నీరు తాగిన వారిలో వాంతులు, వికారం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. రెండో గ్రూపులో అలాంటివి కనిపించలేదు. మొదటి గ్రూపు వారిలో కనిపించిన లక్షణాలను ఏ మాత్రం ఆలస్యం చేసినా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. water, coma, body, danger -
‘ఫాస్ట్’తో కోమా నుంచి ఫాస్ట్‌గా బయటకు...
తమకు ప్రియాతి ప్రియమైన వారి గొంతు విన్నప్పుడు రోగి కోమా నుంచి బయటకు రావడం మనం చాలా సినిమాల్లో చూశాం. అది సినిమాటిక్ వ్యవహారం కాదనీ, చాలావరకు వాస్తవమే అంటున్నారు పరిశోధకులు. కోమాలో ఉన్న కొందరి కుటుంబ సభ్యుల గొంతులను పరిశోధకులు రికార్డు చేశారు. ఆ రికార్డును రోగికి వినిపిస్తారు. ఈ ప్రక్రియకు ‘ఫెమిలియల్ ఆడిటరీ సెన్సరీ ట్రైనింగ్’ (ఫాస్ట్) అని పేరు. రోగికి ప్రియమైన వారి గొంతులను కోమాలో ఉన్న సమయంలో హెడ్‌ఫోన్స్ పెట్టి వారికి వినిపించినప్పుడు చాలామంది కోమా నుంచి బయటకు వచ్చేశారట. ఆ సమయంలో రోగుల మెదళ్లలోని ప్రకంపనలను రికార్డు చేసినప్పుడు వారి మెదడు నరాల కణాలు బాగా స్పందించాయని, (మంచి న్యూరల్ యాక్టివిటీ కనిపించిందని) ఫలితంగా వారు వేగంగా కోలుకున్నారని పరిశోధకులు చెప్పారు. ఈ విషయాలను చాలాకాలం కిందటే ‘న్యూరో–రీహ్యాబిలిటేషన్ అండ్ న్యూరల్ రిపేర్’ అనే జర్నల్‌లో పొందుపరచారు. చాలాకాలంగా ఈ ప్రక్రియను కోమా రోగుల విషయంలో అనుసరిస్తున్నారు కూడా. -
అపస్మారక స్థితిలోనే జయ తరలింపు!
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. గత ఏడాది సెప్టెంబర్ 22న జయలలితను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించినప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ఓ వైద్య నివేదిక స్పష్టంచేస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. ఆ రోజు రాత్రి పదింటికి పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం నుంచి ఆస్పత్రికి అంబులెన్స్ కోసం ఫోన్ వెళ్లింది. రాత్రి 10.20 గంటలకు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తరలిస్తున్నప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆమె గుండె వేగం, రక్తపోటు, చక్కెరస్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నాయని అత్యవసర విభాగంలో చేసిన పరీక్షల్లో తేలింది. న్యూమోనియా, థైరాయిడ్ సమస్యలనూ వైద్యులు గుర్తించారు. అత్యవసర విభాగంలో అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. ఓ తమిళ మీడియా ఈ నివేదికను బహిర్గతం చేసింది. తొలుత సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, ఈ నివేదిక అందుకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. జయలలిత మరణంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నివేదిక కలకలం రేపింది. -
కోమాలో ప్రసవించింది.. 4 నెలల తర్వాత!
కోమాలో ఉండగానే పండంటి బిడ్డను ప్రసవించిన ఓ మహిళా పోలీసు అధికారి నాలుగు నెలల తర్వాత.. కోమాలోంచి బయటకు వచ్చి తొలిసారి తన కన్నబిడ్డను చూసుకుంది. ఈ అరుదైన ఘటన అర్జెంటీనాలో జరిగింది. 34 ఏళ్ల మహిళా పోలీసు అధికారి అయిన అమేలియా బన్నన్ గత ఏడాది నవంబర్ 1న ప్రమాదానికి గురైంది. ఆమె పోలీసు అధికారి అయిన తన భర్త, సహోద్యోగులతో కలిసి సర్వీసు వాహనంలో ప్రయాణిస్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బన్నన్ కోమాలోకి వెళ్లారు. అప్పటికే గర్భవతి కావడంతో ప్రసవానికి ఆలస్యం కాకుండా వైద్యులు జాగ్రత్త తీసుకున్నారు. దీంతో నాలుగు నెలల కిందట కోమాలో ఉండగానే బన్నన్ మగబిడ్డకు జన్మనిచ్చారు. గత కొన్ని రోజులుగా ఆమెలో కదలికలు కనిపిస్తున్నాయని, గత గురువారం అనూహ్యంగా ఆమె కోమాలోంచి బయటకొచ్చి.. తన కన్నబిడ్డను తొలిసారి కళ్లారా చూసుకుందని బంధువులు తెలిపారు. -
కోమా నుంచి కోలుకున్న వీర జవాన్
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి పోరాడి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలై కోమాలోకి వెళ్లిన సీఆర్పీఎఫ్ కమాండెంట్ చేతన్ కుమార్ చీతా తిరిగి లేచాడు. దాదాపు నెల రోజులపాటు కోమాలో ఉన్న ఆయన వైద్యానికి స్పందించి ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. ఈ రోజు సాయంత్రం ఆయనను డిశ్చార్జి చేయనున్నట్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ వైద్యుడు అమిత్ గుప్తా తెలిపారు. చేతన్ మెదడుకు పలు చోట్ల గాయాలు అయ్యాయని, మెదడులో పలుచోట్ల నిలిచిపోయిన వ్యర్థాలను తొలగించామని ప్రస్తుతానికి అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. గత ఫిబ్రవరి 14న బందిపోరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భారత సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోగా చేతన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోమాలోకి వెళ్లాడు. అతడి కంటికి, దవడకు, చేతికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. -
మృత్యువుతో పోరాడి ఓడిన నాగరత్నమ్మ
* 17 రోజులపాటు కోమాలో * దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతులు * భార్య మృతి,భర్త పరిస్థితి విషమం తెనాలి రూరల్: దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతుల్లో భార్య మృతి చెందింది. ఇంట్లో ఉన్న సొత్తును అపహరించుకెళ్లేందుకు వచ్చిన దుండగులు ఒంటరిగా ఉన్న దంపతులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చారు. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన భార్యను మృత్యువు కబళించింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ (85) తమ స్వగృహంలో నివసిస్తుండేవారు.మే నెల 29వ తేదీన వీరిపై గుర్తు తెలియని దుండగులు విచక్షనా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు 30వ తేదీ మధ్యాహ్నం వీరికి బట్టలు ఉతికేందుకు వచ్చే బాజి ఇంటికి వచ్చి చూడగా, గ్రిల్స్ లోపలి వైపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడికి సమీపంలో నివసించే దంపతుల కుమారుడి కుటుంసభ్యులకు తెలియజేసింది. వారు వచ్చి పిలిచినా ఫలితం లేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకకు వెళ్లి చూడగా, తలుపు తీసి ఉంది. లోపల వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న దంపతులు ఇద్దర్నీ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు సమగ్ర వైద్యశాలకు వైద్యులు పంపారు. ఘటన జరిగిన నాటి నుంచి దంపతులిరువురూ కోమాలో ఉన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు మార్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగరత్నమ్మ మృతి చెందింది. మృతదేహానికి గుంటూరు సమగ్ర వైద్యశాలలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, సాయత్రం నాలుగు గంటల ప్రాంతంలో స్వగ్రామం నందివెలుగుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దుండుగల దాడిలో గాయపడిన వెంకటనారాయణ శాస్త్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కళ్లు తెరచి చూడటం మినహా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు సవాలుగా మారిన కేసు.. 17 రోజులు గడిచినా కేసులో పురోగతి లేదు. దంపతుల్లో ఎవరైనా పూర్తి స్పృహలోకి వచ్చి సమాచారం చెబితే గానీ కేసు ముందుకు కదలని పరిస్థితి. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావును దర్యాప్తు చేసేందుకు నియమించారు. మరో వైపు తెనాలి డీఎస్పీ జీవీ రమణమూర్తి, తాలూకా సీఐ యు. రవిచంద్ర కేసు గురించి ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. గ్రామంలో బేలుదారి పనికి వచ్చిన వారే చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. -
నలుగురి జీవితాల్లో అశోక దీపం
అతడు జీవితాన్ని ఎంత ఆరాధించాడో తెలియదు కానీ, చనిపోతూ ఆరిపోతున్న దీపాలకు ఆరో ప్రాణమయ్యాడు. అతడు అతడ్ని ఎంతగా ప్రేమించాడో తెలియదు గానీ, నలుగురికి పునర్జన్మ ప్రసాదించి ప్రాణానికి అసలైన అర్థం చెప్పాడు. కళ్ల ముందు తిరుగుతున్న బిడ్డ కుప్పకూలిపోతే.. మరణానికి చేరువైతే.. కూలబడి కూర్చోకుండా కన్నీటిని దిగమింగుతూనే కొడుకు అవయవాలను దానంచేసి ఆదర్శమూర్తులుగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. కన్నీటికే కన్నీరు తెప్పించే ఈ విషాద గాథ గుంటూరు నెహ్రూనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నెహ్రూనగర్ తొమ్మిదో లైనుకు చెందిన సూరగాని శివలక్ష్మయ్య, గోవర్ధన లక్ష్మికి ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు మహేష్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు అశోక్‌కుమార్ (25) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కుమారులిద్దరూ మంచి భవిష్యత్తు పొందడం ఆ తల్లిదండ్రులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ, ఇంతలోనే విధి వక్రించింది. గత మంగళవారం తమ చిన్న కుమారుడు నిద్రలోనే పెద్దగా గురకపెడుతూ అపస్మారక స్థితిలోకి చేరు కున్నాడు. భయాందోళనతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రులు చేదువార్త విన్నారు. అశోక్ కోమాలోకి వెళ్లిపోయాడని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే, మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల అనంతరం శస్త్ర చికిత్సల వల్ల స్పందన లేదని, అశోక్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని అవయవదానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. ఈ క్రమంలో జీవన్ దాన్ను ఆశ్రయించారు. జీవన్ దాన్లో అప్పటికే అవయవాల కోసం నమోదు చేసుకున్న వారి జాబితాను అనుసరించి అశోక్ అవయవాలను దానం చేశారు. ఆదివారం వేకువజామున ఈ అవయవ దాన ప్రక్రియను మణిపాల్ వైద్యులు పూర్తిచేశారు. లివర్, ఒక కిడ్నీ మణిపాల్ ఆస్పత్రిలోని ఇద్దరు రోగులకు అమర్చగా, కళ్లు శంకర్ కంటి ఆస్పత్రికి, మరొక కిడ్నీ ఆయుష్ ఆస్పత్రికి అందజేశారు. తాను చనిపోతూ నలుగురిలో తిరిగి జీవించాడు అశోక్. ఈ సందర్భంగా అశోక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పడం విశేషం. - తాడేపల్లి రూరల్ -
ప్రాణాలతో వ్యాపారం
హాలీవుడ్ సినిమా / కోమా విజయవాడ ఊర్వశి థియేటర్లోనో, మేనక థియేటర్లోనో గుర్తులేదు. ఓ కొత్త సినిమా పోస్టర్... తీగలకి వేలాడుతున్న శరీరాలు చూడటానికే చాలా భయానకంగా! 1978లో విడుదలైన ఆ సినిమా పేరు ‘కోమా’. సినిమా చూసి, థ్రిల్లవ్వడం తప్పితే, ఆ సినిమా గురించి పెద్ద వివరాలు తెలియలేదు. ఆ తర్వాత ఎప్పుడో హైదరాబాద్ అబిడ్స్‌లో ఫుట్‌పాత్ మీద దొరికిన ఆ నవల కవర్‌పేజీ అదే. రకరకాల తాళ్లతో బందీ అయి, గాలిలో తేలుతున్న ఓ శరీరం... 1977లో రాబిన్ కుక్ రాసిన నవల ‘కోమా’ అది. ఎక్కడో చదివాను - రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నియంత ముస్సోలినిని చంపేసి, మాంసం కొట్లో మేకని వేలాడదీసినట్లు ముస్సోలిని శవాన్ని వేలాడదీశారని. అంత దారుణానికి ఒడిగట్టారంటే - చంపినవాళ్లు దుర్మార్గులైనా అయ్యుండాలి, అలా వేలాడదీయబడ్డవాడు కిరాతకుడు అయినా అయి ఉండాలి. మరి ‘కోమా’ సినిమాలో అలా వేలాడుతున్నవాళ్లెవరు? దుర్మార్గులా? అమాయకులా? రాబిన్ కుక్ ఓ సర్జన్. అమెరికన్ నేవీలో సబ్ మెరైన్‌లో డాక్టర్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో 1972లో ఓ నవల రాశాడు. ఫ్లాప్. ఓ కొత్త రచయితని ప్రపంచం వెంటనే గుర్తించాలంటే ఏం చేయాలి? మిస్టరీ థ్రిల్లర్ నవల రాయాలి. (హాలీవుడ్ రచయితల నుంచి ఇప్పటి కొత్తతరం తెలుగు దర్శకులు ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే!) వెంటనే రాబిన్ కుక్ ఓ మెడికల్ థ్రిల్లర్ నవల రాశాడు. అదే ‘కోమా’. అప్పటికే ‘జాస్’ నవల (స్పీల్బర్గ్ సినిమా ఈ నవల ఆధారంగానే తీశాడు) ఓ సెన్సేషన్. ఆ ప్రభావం రాబిన్ కుక్ మీద ఉంది. దయ్యాలు, గ్రహాంతరవాసులు, షార్క్ చేపలు... ఇవి మనుషులని భయపెడుతున్న సినిమా ముడిసరుకులు. సినిమాల్లో తప్పితే, ఏ వ్యక్తి ఈ సమస్యలని ప్రత్యక్షంగా ఎదుర్కోడు. కాని కోటీశ్వరుడి నుంచి పేదవాడి వరకూ - అందర్నీ భయపెట్టగలిగేది ఏదన్నా ఉంటే అది హాస్పిటల్. అంతే రాబిన్ కుక్ వైద్య రంగం నేపథ్యంలో తనకంటూ ఓ ఒరవడి సృష్టించుకుని నవలలు రాయడం ప్రారంభించాడు. ‘కోమా’ నవల మొదట్లో ఏ పబ్లిషర్ ప్రచురణకి తీసుకోలేదు. చివరికి ఓ ప్రచురణ సంస్థ (లిటిల్ బ్రౌన్) పదివేల డాలర్లు అడ్వాన్స్‌గా ఇచ్చి, నవల ప్రచురించింది. నవలా ప్రపంచంలో ఓ సంచలనం ప్రారంభమైంది. రాబిన్ కుక్ ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రిక 100 బెస్ట్ పాపులర్ నవలల్లో ‘కోమా’ని ఒకటిగా ఎన్నుకుంది. (రాబిన్ కుక్ ‘ఫీవర్’ నవల ఆధారంగానే మన పాపులర్ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ‘ప్రార్థన’ నవల రాసినట్లు పేర్కొన్నారు.) మైఖేల్ క్రీటన్ అనే మరో రచయిత ఉన్నాడు. అతనికి మెడికల్, సైన్స్ ఫిక్షన్ కథలంటే ప్రాణం. ‘జురాసిక్ పార్క్’, ‘లాస్ట్ వరల్డ్’ అంటూ స్పీల్బెర్గ్ తీసిన సినిమాలు మైఖేల్ క్రీటన్ నవలల ఆధారంగా తీసినవే. ఇక ‘కోమా’ విషయానికొస్తే - అప్పటికే రెండు సినిమాలు తీసినా మైఖేల్‌కి తగినంత గుర్తింపు రాలేదు. ‘కోమా’ నవల విశేషంగా ఆకట్టుకుంది మైఖేల్ క్రీటన్ని. ఆ తరహా సబ్జెక్ట్‌లంటే అతనికి ఇష్టమే. రాబిన్ కుక్, మైఖేల్ క్రీటన్ అభిరుచులు ఒకటే - 1978 నాటికి ఇద్దరి వయసు ఒకటే - పైగా ఇద్దరూ మంచి మిత్రులు. ఈ సినిమాని మంచి థ్రిల్లర్‌గా రూపొందించాలని మైఖేల్ ముందుగానే నిర్ణయించాడు (కౌబోయ్ ధోరణిలో అంటే - ఒక వృత్తిలో ఉండే మంచి, చెడూ చెప్పాలని మైఖేల్ భావించాడు) నవల ఓ స్త్రీ ప్రధాన పాత్రగా నడుస్తుంటుంది కాని సినిమాగా వచ్చేటప్పటికి స్టూడియో అధినేతలు స్త్రీ బదులు పురుష పాత్రగా మారుద్దామనుకున్నారు. మైఖేల్ క్రీటన్ అడ్డంపడిపోయాడు. ఓ స్త్రీ అడ్డంకుల్ని ఎదుర్కొంటూ విజయం సాధిస్తే వచ్చే థ్రిల్ - పురుష పాత్రతో రాదనేది మైఖేల్ వాదన. చివరికి నిర్మాతలు మైఖేల్ ముందు తలదించక తప్పలేదు. ఇక కథ విషయానికొస్తే - డాక్టర్ సుసాన్ వీలర్ బోస్టన్ మెమోరియల్ హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. సుసాన్ బెస్ట్ ఫ్రెండ్ అదే హాస్పిటల్లో చేరి, ఓ చిన్న ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అయితే ఆపరేషన్ వికటించి, ఫ్రెండ్ కోమాలోకి జారుకోవడం సుసాన్ మనసుని కలిచి వేస్తుంది. అదే ధ్యాసలో ఉన్న సుసాన్‌కి అనుకోకుండా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎదురవుతాయి. గత కొన్నేళ్లుగా ఆ హాస్పిటల్లో చేరిన ఆరోగ్యవంతులు - చిన్న చిన్న కారణాలకే కోమా బారినపడ్డారు. ఆ పేషెంట్స్ అందరూ ఆపరేషన్ థియేటర్ ఎయిట్ (8)లో ఆపరేషన్ చేయించుకున్నవాళ్లే. ఆ తర్వాత వాళ్లందరినీ ఓ మారుమూలన ఉండే జెఫర్సన్ ఇన్స్టిట్యూట్కి తరలించారు. ఈ రెండు విషయాలు సుసాన్లో అనుమానాన్ని రేకెత్తించాయి. ఆ పేషెంట్స్ అందరూ ఎందుకు కోమాలోకి వెళ్లిపోతున్నారు? ఏమైపోతున్నారు? సుసాన్ రహస్యంగా తన పరిశోధన కొనసాగిస్తుంది. ఓ దశలో తన బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ మార్క్ బెల్లోస్ని కూడా నమ్మలేని పరిస్థితి. నిజానికి ఆ పేషెంట్స్‌కి ఆక్సిజన్ పైప్ లైన్ నుంచి కార్బన్ డయాక్సైడ్ పంపిస్తారు. దానితో బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. వాళ్లందరిని డెత్ బెడ్ మీద నుంచి, వాళ్ల అవయవాలు (గుండె, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు లాంటివి) మార్కెట్లో అమ్ముకుంటుంది బోస్టన్ మెమోరియల్ హాస్పిటల్. ఈ దారుణం వెనక ఉన్నది హాస్పిటల్ చీఫ్ సర్జన్ డాక్టర్ జార్జి హేరిస్. సుసాన్‌కి నిజం తెలిసిపోయిందని గ్రహించిన డాక్టర్ జార్జి, సుసాన్ కూడా ఇదే గతి పట్టించడానికి ప్లాన్ చేశాడు. సుసాన్‌కి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయబోతుండగా, ఆమెకి ఆక్సిజన్ పైప్‌లైన్ నుంచి కార్బన్ డయాక్సైడ్ పంపించే కుట్ర పన్నాడు. చివరి నిమిషంలో ఈ ప్రమాదం తెలుసుకున్న సుసాన్ బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ మార్క్ ఆ పైప్‌లైన్ కట్ చేసి, ప్రియురాలిని కాపాడుకుంటాడు. డాక్టర్ జార్జి హేరిస్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. - తోట ప్రసాద్ * 4 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 50 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. * ఆ మధ్య తమిళంలో వచ్చిన ‘బ్రదర్స్’, ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘రాజుగారి గది’ని మెడికల్ థ్రిల్లర్స్‌గా చెప్పుకోవచ్చు. -
ఆరోజు గర్ల్‌ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడనే..!
సాల్ట్ లేక్ సిటీ(అమెరికా): పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సోమాలియాకు చెందిన శరణార్థి అబ్ది మహ్మద్ అనే యువకుడు తిరిగి స్పృహలోకి వచ్చాడు. అయితే, అతడు కదల్లేని స్థితిలో ఉన్నాడు. భరించలేని నొప్పులు అతడిని వేధిస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 2004లో అబ్ది తన కుటుంబంతో కలిసి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్ది మహ్మద్, మరో వ్యక్తి కలిసి మెటల్ స్టిక్ తో గత ఫిబ్రవరి 27న ఓ వ్యక్తిని చితకబాదుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్ర కిందపడేయాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. పైగా ఆ వ్యక్తిని చంపేంత కసిగా దాడి స్థాయిని పెంచారు. దీంతో పోలీసులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబ్ది మహ్మద్ కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే, అబ్ది మహ్మద్ స్నేహితుడు సేలం మహ్మద్ ఈ విషయంపై వివరణ ఇస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆరోజు అబ్ది గర్ల్ ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడని, పైగా ఆయుధంతో దాడికి ప్రయత్నించాడని, అందుకే ప్రతిదాడి జరిగిందని తెలిపారు. -
కోమాలో ఉన్నా.. ప్రేమ ఆగలేదు
ముఫ్ఫై ఏళ్ళుగా ఆమెకు భర్తే లోకం... అతడికి సపర్యలు చేయడమే ఆమె జీవితం. మోకాలి నొప్పితో సర్జరీ చేయించుకున్న మాజీ ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఆటగాడు జీన్ ఫిర్రే ఆడమ్స్ జీవితం.. అనూహ్యంగా తల్లకిందులైంది. సర్జరీ తర్వాత బుద్ధి మందగించి, కోమాలోకి జారుకున్న అతడు నేటికీ మంచానికే పరిమితమయ్యాడు. అయితేనేం ఆయన భార్య బెర్నెడెట్ మాత్రం అతడి సేవే జీవితంగా గడుపుతోంది. అన్యోన్య దాంపత్యానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. భర్త మంచాన పడిన నాటినుంచి బెర్నాడెట్ అతనిని వీడింది లేదు. పంచ ప్రాణాలు అతనిపైనే పెట్టుకొని రేయింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 1982 లో తలకిందులైన జీన్ పిర్రే.. నేటికీ కోలుకోలేదు. ముఫ్ఫై మూడేళ్ళ క్రితం మోకాలినొప్పితో సాధారణ సర్జరీకోసం ఆస్పత్రిలో చేరిన జీన్ పిర్రే తిరిగి కోలుకోలేదు. కానీ ఆయన భార్య బెర్నాడెట్ మాత్రం ముఫ్ఫై ఏళ్ళుగా అత్యంత ప్రేమతో ఆయనకు సేవలు అందిస్తూనే ఉంది. పుట్టినరోజైనా, క్రిస్మస్ పండుగైనా, ఫాదర్స్ డే అయినా జీన్ పిర్రేకు అందరితో సమానంగా బహుమతులను అందిస్తుంది. కోమాలో ఉండి, ఏమాత్రం స్వవిషయాలు పట్టని అతడిపట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం చూపకుండా అత్యంత ప్రేమతో, ఆప్యాయంగా సేవలు అందిస్తోంది. జీన్ ఫిర్రేకు ఇప్పుడు అరవై ఏడేళ్ళు. ఆస్పత్రిలో ఉండేలాంటి మాడిఫైడ్ బెడ్ పై తన రూమ్ లో పడుకొని, ఒక్క ఊపిరి మాత్రం స్వయంగా తీసుకుంటాడు. ఆయనకు సంబంధించిన మిగిలిన పనులన్నీ భార్య బెర్రాడెట్ చూసుకోవలసిందే. విసుగూ విరామం లేకుండా.. ముఫ్ఫై ఏళ్ళుగా ఆమె అదే ప్రేమతో జీన్ కు సేవలు అందించడం... భార్యాభర్తల బంధానికి నిలువెత్తు నిరద్శనంగా నిలుస్తుంది. ఆ దంపతుల అమితమైన ప్రేమకు తార్కాణంగా కనిపిస్తుంది. ఫ్రాన్స్ నిమెస్ సమీపంలో నివాసం ఉంటున్న బెర్నెడెట్.. ఏ వేడుకైనా జీన్ పెర్రె కు బహుమతిగా ఓ టీ షర్లు కొంటుంది. అతడికి ప్రతిరోజూ బెడ్ పైనే టీ షర్లు మారుస్తుంటుంది. ఎప్పుడూ ఆయన రూమ్ శుభ్రంగా ఉండేట్టు చూసుకుంటుంది. గదిని అందంగా అలకరించడంతోపాటు, సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను కూడ జీన్ ఫెర్రే కోసం కొనుగోలు చేస్తానని చెప్పడం ప్రేమైక జీవనానికి మచ్చుతునకగా చెప్పాలి. 1970ల్లో ఫ్రాన్స్ అంతర్జాతీయ ఆటగాడైన జీన్ పెర్రే మోకాలి శస్త్ర చికిత్స తెచ్చిన అనంతమైన మార్పుతో మంచానికే పరిమితమైపోయాడు. ఆహారం అరుగుదలతోపాటు, కళ్ళు తెరవడం మూయడం తప్ప ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నాడు. అయితేనేం అతని భార్య బెర్నాడెట్ ఏమాత్రం అతన్ని నిర్లక్ష్యం చేయలేదు. జీవిత భాగస్వామి అంటే అర్థాన్ని చెబుతూ ప్రతిరోజూ స్నాన పానాదులు చేయించడం, బట్టలు తొడగడం, భోజనం పెట్టడంతోపాటు అతనికి బెడ్ సోర్స్ వంటి ఇతర వ్యాధులు సోకకుండా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఒక్కోసారి అతడు మేల్కొనే సమయాన్ని గుర్తించడంకోసం ఆమె నిద్రపోకుండా రాత్రంగా మెలకువగానే ఉంటుంది. జీన్ ఫెర్నే ను వదిలి బెర్నాడెట్ అత్యంత అవసరమైతేగాని బయటకు వెళ్ళదు. తప్పని పరిస్థితిలో ఒకరోజు గడపాల్సి వచ్చినపుడు కేర్ టేకర్లకు అప్పగించి వెడుతుంటుంది. అయితే ఆ సమయంలో అతని మానసిక స్థితిలో తీవ్రమైన మార్పు ఉంటుందని వారు చెప్పడం... ఆ దంపతుల మధ్య సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. జీన్ ఫెర్రేకు సపర్యలు చేస్తున్నపుడు, ఆహారం తినిపిస్తున్నపుడు అతనిలోని భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్తుంది బెర్నాడెట్. 46 ఏళ్ళ బెర్నడెట్ గత ముఫ్ఫై ఏళ్లుగా తన భర్త ఏ క్షణంలోనైనా కోలుకుంటాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది. ఒక్క క్షణం కూడ అతన్ని విడవకుండా కనిపెట్టుకొని ఉంటోంది. తాను సపర్యలు చేస్తుంటే జీన్ స్పర్శను ఫీలౌతున్నారని, అలాగే తన స్వరాన్ని కూడ జీన్ తప్పక గుర్తిస్తాడని ఆశతో ఎదురు చూస్తోంది. -
వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు
జోజుహాంగ్: పెళ్లి వేడుకలో సరదా కోసం చేసిన విన్యాసం కాస్తా విషాదంగా మారింది. ఈ సంఘటన చైనాలోని జోజుహాంగ్లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన వరుడి తరఫు బంధువులు అమ్మాయిని గాల్లోకి ఎగిరేసి.. పట్టుకోవాలని కోరారు. దీంతో వివాహ విందు కార్యక్రమానికి వచ్చిన వధువును హోటల్ గేట్ దగ్గరికి వెళ్లి వరుడు ఆహ్వానించాడు. అప్పుడే ఆమెని ఎత్తుకొని గాల్లోకి విసిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ గాల్లో నుంచి కిందికి వచ్చే సమయంలో వరుడు పట్టుకోవడంలో విఫలం అవ్వడంతో ఆ అమ్మాయి కింద పడింది. తల కిందులుగా పడటంతో మెదడుకు బలమైన గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న ఆ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. -
మృత్యువుతో మోడల్ పోరాటం
న్యూయార్క్: ప్రముఖ డచ్ మోడల్ ఫ్కేస్టర్మ్ ప్రాణాలకోసం పోరాడుతోంది. ఇటీవల పడవ ప్రమాదానికి గురైన ఆమె ప్రస్తుతం కోమాలో ఉండి తిరిగి ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె విక్టోరియా సీక్రెట్ చానెల్, మార్క్ జాకబ్స్, టీవీ షో హాలాండ్ సంస్థలకు మోడల్‌గా నటిస్తున్న ఆమె భవిష్యత్తులో మోడల్‌గా అగ్రస్థానంలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ఇటలీ ఐలాండ్ తీరంలో ఘోర పడవ ప్రమాదానికి గురై ఫ్కేస్టర్మ్ పుర్రెభాగం బాగా దెబ్బతిన్నది. దీంతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ప్రస్తుతం కోమాలోకి జారుకున్నారు. ఆమె వెన్నెముక భాగానికి కూడా దెబ్బతగిలిందని, ఆమెకు పక్షవాతం వచ్చే అవకాశం కూడా లేకపోలేదని వైద్యులు చెప్తున్నారు. -
అరుణ ఊపిరి ఆగిపోయింది..
-
అరుణ ఊపిరి ఆగిపోయింది..
ముంబై : గత 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా షాన్ బాగ్ (68) ఎట్టకేలకు తుదిశ్వాస విడిచింది. ముంబైలోని కింగ్ అడ్వర్డ్స్ మెమోరియల్ (కెఇఎమ్) ఆస్పత్రిలో ఆమె సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి డీన్ అవినాష్ సుపే వెల్లడించారు. 26 ఏళ్ల వయసులో అరుణా షాన్ బాగ్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తుండగా అత్యాచారానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై ఆస్పత్రి వార్డ్బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో షాక్ తిన్న అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది. ఆస్పత్రిలో మందులను దొడ్డిదారిన అమ్ముకుంటున్న సోహన్ లాల్‌ను అరుణ ప్రశ్నించటంతో పాటు అధికారుల దృష్టికి తీసుకు వెళతానని హెచ్చిరించడంతో ఆమె అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను నిర్బంధించిన వార్డు బాయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాంతో మెదడు పని చేయక పోవటంతో కోమాలోకి జారుకుంది. అప్పటి నుంచి కెఇఎమ్ ఆసుపత్రిలోనే అరుణా షాన్ బాగ్ జీవచ్ఛవంగా బతుకుతోంది. ఈ నేపథ్యంలో అరుణకు కారుణ్య మరణాన్ని అర్ధిస్తూ ఆమెపై పుస్తకం రాసిన రచయిత్రి పింకీ విరానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే అరుణా షాన్ బాగ్ సహజ మరణం ఆసన్నమయ్యేవరకూ కంటికి రెప్పలా చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆమెకు కారుణ్య మరణాన్ని నిరాకరించింది. -
42 ఏళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న నర్సు
ముంబై: నాలుగ దశాబ్దాల క్రితం ఓ మహిళపై జరిగిన అత్యాచార ఘటన ఆమె జీవితంలో తీవ్ర అలజడిని రేకెత్తించింది. నర్సుగా విధులు నిర్వహించడమే ఆ మహిళకు శాపంగా మారింది. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయాల్సిన ఆమె.. అదే ఆస్పత్రి బెడ్ పై నిర్జీవంగా పడి ఉంది. గత 42 ఏళ్లుకు ఆమెది ఇదే పరిస్థితి. ఇంతటి దీన పరిస్థితి కారణం ఆమెపై అప్పట్లో జరిగిన అత్యాచారం. వివరాల్లోకి వెళితే.. అరుణా షాన్ బాగ్(68) అనే మహిళ సరిగ్గా 26 ఏళ్లప్పుడు అత్యాచారానికి గురైంది. ముంబైలోని కేవీఎమ్ ఆస్పత్రిలో షాన్ బాగ్ నర్సుగా విధులు నిర్వహించే సమయంలోవార్డ్ బాయ్ సోహన్ లాల్ వాల్మికి ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్డాడు. దీంతో షాక్ తిన్న ఆమె ఆపై కోమాలోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఆమె అదే స్థితిలో కొనసాగుతోంది. ప్రస్తుతం కేవీఎమ్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా అంతటి దయనీయ స్థితిలో ఉన్న ఆమెను మందుల ద్వారానే ప్రాణాన్ని తీయాలనే వాదన కూడా వినిపిస్తోంది. దీన్ని కేవీఎమ్ ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. -
రాగనయని
మిణుగురులు సమాజానికి దివిటీలు కీర్తిరాణి మునివేళ్లు కాసేపైనా సితార తీగలను మీటకుండా విశ్రమించవు. ఈమె వేలి స్పర్శ తగలనిదే ఆ సితారకు మెలకువరాదు. చపులేని కీర్తిరాణికి సితారతో చూపులు కలిసిన అనుబంధం వయసు పాతికేళ్లు. అలా సితారకీర్తిగా గుర్తింపు పొందుతున్న కీర్తిరాణి స్ఫూర్తిదాయక జీవితమే ఈవారం మిణుగురులు. పాతికేళ్లుగా కీర్తిరాణి ఎన్నో వేదికల మీద సితార ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సితార తన ప్రాణం అని చెప్పే కీర్తిరాణితో కాసేపు ముచ్చటిస్తే అంచెలంచెలుగా ఆమె పెంపొందించుకుంటూ వచ్చిన ఆత్మస్థయిర్యం ఆద్యంతం మన కళ్లకు కనిపిస్తుంది. కీర్తిరాణి వయసు ముప్పై ఐదేళ్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం. పాండురంగారావు (ఏడాది క్రితం మరణించారు), సావిత్రిబాయిల ముగ్గురు సంతానంలో ఒకరు కీర్తిరాణి. ఆరేళ్ల వయసులో కీర్తికి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. అప్పుడు ఆమె రెండో తరగతి చదువుతోంది. జబ్బు కారణంగా మూడు నెలల పాటు కోమాలోనే ఉండిపోయింది. తల్లీతండ్రీ తల్లడిల్లిపోయారు. బిడ్డను బతికించమని వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. వారి మొక్కులు ఫలించాయి. కీర్తి కోమా నుంచి బయట పడింది. కానీ, తనకేమీ కనిపించడం లేదని, అంతా చీకటిగా ఉందని చెప్పింది! ఎవరినీ గుర్తుపట్టలేని స్థితి. వైద్యులను అడిగితే ‘జబ్బు వల్ల చూపు పూర్తిగా పోయింది. గతం కూడా మర్చిపోయింది. ఆమెకు ఇది పునర్జన్మ’ అని చెప్పారు. బాలభవన్‌లో సంగీతం కూర్చోవడం, నిల్చోవడం, నడక.. అన్నీ పసిపాపకు నేర్పించినట్టే కీర్తికి మళ్లీ నేర్పారు ఆమె తల్లిదండ్రులు. నాటి రోజుల గురించి కీర్తి తల్లి సావిత్రిబాయి మాట్లాడుతూ- ‘‘మా ఇల్లు ఎప్పుడూ బంధువులు, వారి పిల్లలతో కళకళలాడుతుండేది. పిల్లలందరూ ఆడుకుంటుంటే కీర్తి వెళ్లి ఒక చోట దిగులుగా కూర్చునేది. పిల్లలు బడి గురించి మాట్లాడుకుంటుంటే, ‘అక్కడెలా ఉంటుంది?’ అంటూ ప్రశ్నలు వేసేది. రెండో తరగతి వరకు బడికి వెళ్లినా, ఆ జ్ఞాపకాలేవీ తనకు లేవు. కీర్తి తాతగారు ఆ వివరాలన్నీ తన కళ్లకు కట్టినట్టు చెప్పేవారు. కీర్తికి జబ్బు నయం అయిన మూడేళ్ల దాకా ఆమెకు ఎలాంటి దారి చూపాలో మాకూ అర్థం కాలేదు. బడిలో ఇబ్బంది పడుతుందేమోనని స్కూల్‌కి కూడా పంపించలేదు. అయితే చక్కగా పాటలు పాడుతుండటంతో బాలభవన్‌లో సంగీతం నేర్పించడానికితీసుకెళ్లేదాన్ని’’ అని చెప్పారు. అమ్మ మాటలను కీర్తి అందుకుంటూ - ‘‘మా అమ్మ నాకోసం బ్రెయిలీ కూడా నేర్చుకున్నారు. పుస్తకాలు తెప్పించి తను చదువు నేర్చుకుని మరీ నాకు చెప్పేవారు. సంగీతం క్లాసులకు తనే తీసుకెళ్లేవారు. పెద్దయ్యాక వంట పని, ఇంటి పని.. ఇలా అన్నీ ఎవరి సాయమూ లేకుండా నేనే సవ్యంగా ఎలా చేసుకోవాలో నేర్పించారు. మా అమ్మ అండ లేకపోతే ఈ రోజుకు నేనిలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు అమ్మను హత్తుకుంటూ. స్కూల్కైతే వెళ్లలేదు కాని, ట్యూషన్లు పెట్టించుకొని చదివి, పదవతరగతిలో ఇంటి నుంచే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది కీర్తి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ చేసింది. హైదరాబాద్ కస్తూర్బా డిగ్రీ కళాశాలలో చదివే సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సహకార శాఖలో జూనియర్ ఇన్స్పెక్టర్గా విధులను నిర్వర్తిస్తున్నారు కీర్తి. సితార శృతి చేసింది సితారతో కీర్తి పరిచయం గురించి సావిత్రిబాయి మాట్లాడుతూ - ‘‘ఊళ్లోనే సితార వాయించే మాస్టారు శంకర్‌గారు ఉన్నారని తెలిసింది. వారి వద్దకు తీసుకెళితే, వారం రోజుల్లోనే ఆ సంగీత పాఠాలు కీర్తి వంట పట్టించుకుంది. మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి కాని మాకు అర్థం కాలేదు కీర్తికి సంతోషం కలిగించే వ్యాపకం ఏదో! అలా సితారను ఆమెకు కానుకగా ఇచ్చాం’’ అని తెలిపారు. అలా ఎన్నో వేదికల మీద సితారతో ప్రదర్శనలు ఇచ్చిన కీర్తి... సర్టిఫికెట్ కోర్సు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని భక్తరామదాసు సంగీత కళాశాలలోలో చేరి డిప్లమా పూర్తి చేశారు. పుణె యువ ఉత్సవ్‌లో తన ప్రతిభతో సత్కారాలు అందుకున్నారు. 2008లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు పండిట్ రవిశంకర్ వెయ్యి మంది సితార వాయిద్యకారులతో నొయిడాలో బ్రహ్మనాథ్ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమంలో కీర్తి సితారతో తన సంగీత పటిమను ప్రదర్శించారు. గ్రూపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం మారిషస్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సితారప్రదర్శనతో ప్రత్యేక అభినందనలను అందుకున్నారు. విధుల్లోనూ రాణింపు కీర్తిరాణి రోజూ వేకువ జామునే సితార సాధన చేస్తారు. ఇంటి పనులు ముగించుకుని విధుల్లోకి వెళతారు. విధి నిర్వహణ పూర్తయ్యాక తిరిగి సితారతో సంగీత సాధన మొదలుపెడతారు. ‘‘నేను పనిచేసేది ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సిస్టమ్‌ని ఎలా ఆపరేట్ చేయాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే ముఖ్యమైన పాయింట్స్ ఉంటే ముందుగానే అవి బ్రెయిలీ లిపిలో రాసుకుంటాను. ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేసి, ప్రింట్స్ తీసి నా పై అధికారులకు ఇస్తాను. ‘కనపడదు కదా, ఏం తెలుస్తుంది ఈమెకు’ అనుకుంటారు కొంతమంది. కానీ, ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకోవడంలో నేనే ముందుంటాను. పని చేసే చోట నా సహోద్యోగులూ ఎంతో సహాయకారిగా ఉంటారు. మనం బాగుంటే అందరూ మనతో బాగుంటారు’’ అని అంటున్న కీర్తి ‘‘భృతి కోసం ఉద్యోగం సంపాదించుకున్నాను. సంతృప్తిగా జీవనం కొనసాగించేందుకు సితార అక్కున చేరాను. అందుకే వైవాహిక జీవితం వద్దనుకున్నాను’’ అని చెప్పారు. జీవన గమనంలో అనుకోకుండా ఒక విపత్తు వచ్చిపడితే, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. మరో దారిలో గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. కీర్తిరాణి అలాగే తన జీవితాన్ని మలుచుకున్నారు. చూపున్నవారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఫొటోలు: జె.మురళీమోహన్ -
నాలుగు నెలలుగా కోమాలోనే కేంద్ర మాజీమంత్రి
తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్.. నాలుగు నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని వైద్యులు చెబుతున్నారు. జస్వంత్ ఆరోగ్యం అలాగే ఉందని, ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ప్రతిరోజూ వైద్యుల బృందం ప్రతిరోజూ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. న్యూరోసర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు ఆయనను చూస్తున్నారని, జస్వంత్ సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆయన ప్రస్తుతం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్.. ఆగస్టు 8వ తేదీన తమ ఇంట్లో స్పృహలేని పరిస్థితిలో నేలమీద పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. -
కోమా నుంచి బయటపడిన స్వప్నాలి
సాక్షి, ముంబై: నాలుగు నెలలుగా కోమాలో ఉన్న స్వప్నాలి లాడ్ ఆదివారం స్ఫృహలోకి వచ్చింది. ఆమె ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోందని వైద్యం చేస్తున్న డాక్టర్లు వెల్లడించారు. ఠాణేకి చెందిన స్వప్నాలి ఆగస్టు ఒకటో తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలు దేరింది. ఠాణే రైల్వే స్టేషన్ బయట ఆటో ఎక్కింది. కాని డ్రైవర్ తను రోజు వెళ్లే రూట్లో కాకుండా మరో రోడ్డు మీదుగా ఆటోను పోనిచ్చాడు. దీనిపై నిలదీసినప్పటికీ అతడు సమాధానమివ్వలేదు. దీంతో తనను అపహరిస్తున్నట్లు గుర్తించిన స్వప్నాలి వేగంగా వెళుతున్న ఆటోలో నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆపస్మారక స్థితిలోనే ఉంది. ప్రస్తుతం ఆమె శరీరం సహకరిస్తోందని, వెంటిలేటర్ అవసరం లేదన్నారు. ఇక ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులు వెల్లడించారు. అయితే మనుషులను ఇంకా గుర్తించడం లేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటే అసలు ఆ రోజు ఏం జరిగింది...? ఆ ఆటో డ్రైవర్ ఎవరు..? అనేది వివరాలు బయటపడతాయి. దీంతో నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులకు మార్గం సుగమం కానుంది. -
కోమా నుంచి బయటకు..
జపాన్ గ్రాండ్ ప్రి రేసులో గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ మరూసియా జట్టు డ్రైవర్ జూల్స్ బియాంచి ఏడు వారాల తర్వాత స్పృహలోకి వచ్చాడు. అక్టోబర్ 5వ తేదీన తన కారు నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురైన బియాంచి ఆ తరువాత సృహ కోల్పోయాడు. అతని తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు బియాంచికి శస్త్ర చికిత్స నిర్వహించారు. గత నెల్లో గాయపడిన బియాంచి కోమా నుంచి బయటకు వచ్చినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఇప్పటికీ సృహలోకి రాలేదని తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. కోమాలోకెళ్ళిన రోగి!
-
రీల్ గజనీ కాదు... రియల్‌గానే..!
ఓ వ్యక్తి ఉంటాడు. అతనికి సడెన్‌గా ఏదో ప్రమాదం సంభవిస్తుంది. కోమాలోకి వెళ్లిపోతాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ లోకంలోకి వస్తాడు. కానీ తనకి గతానికి సంబంధించిన విషయాలు ఎంతకీ గుర్తు రావు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. కానీ నిజజీవితంలో అలాంటిది జరిగితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! అందుకే మరి బెన్ మెక్ మెహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన ఇరవై రెండేళ్ల యువకుడు బెన్ మెక్ మెహాన్. చాలా హుషారైన వాడు. స్నేహితులతో షికార్లు, అల్లర్లు, పార్టీలు... అందరిలానే సంతోషంగా ఉండేవాడు. కానీ 2012లో అతడి జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. చనిపోవాల్సినవాడే... కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. మూసిన కన్ను తెరవకుండా మంచం మీదే పడి వున్నాడు. బహుశా అతడు ఇక కోమాలోంచి బయట పడకపోవచ్చేమోననుకున్నారు వైద్యులు. కానీ ఓ వారం పదిరోజుల తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోమాలోంచి బయటపడ్డాడు బెన్. కానీ అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఒకటి జరిగింది. కళ్లు తెరచినప్పటి నుంచీ బెన్ మాండరిన్ భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటివరకూ అతడికి ఆ భాష రాదు. ఆంగ్లంలోనే మాట్లాడేవాడు. కానీ ఉన్నట్టుండి ఆ భాషను అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థమవ్వలేదు అతడి కుటుంబ సభ్యులకి. మాండరిన్ అనేది చైనాలోని ఓ సమూహం మాట్లాడే భాష. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందు చైనాకు వెళ్లినా, అక్కడి భాష మాత్రం రాదు బెన్కి. అందుకే తమ కొడుకు ఆ భాష ఎలా మాట్లాడుతున్నాడో అంతు పట్టలేదు వారికి. వైద్యులు కూడా ఎంతగా ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు. కట్ చేస్తే... బెన్ ఓ చైనీస్ చానెల్లో యాంకర్‌గా చేరాడు. మాండరిన్ భాషను గలగలా మాట్లాడేస్తూ మతులు పోగొట్టేస్తున్నాడు. ‘ఇదెలా సాధ్యం బెన్’ అంటే... ‘ఏమో... నాకా భాష అంత బాగా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు, ఎలాగూ వచ్చింది కాబట్టి క్యాష్ చేసుకుంటున్నా’ అంటున్నాడు నవ్వుతూ. వైద్యులు మాత్రం ఈ అద్భుతం ఎలా జరిగిందా అని ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉండటం కొసమెరుపు! -
కోమాలో జశ్వంత్
కోమాలో జశ్వంత్ కాలుజారి పడటంతో తలకు తీవ్రగాయం న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కృత్రిమ శ్వాసను అందిస్తున్నారని రక్ష ణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జస్వంత్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు -
షుమాకర్ మెడికల్ రిపోర్టులు చోరి
జెనీవా: ఫార్మూలా వన్ స్టార్ మైఖేల్ షూమాకర్ మెడికల్ రిపోర్టులు చోరికి గురైన సంఘటన జెనీవాలో సంచలనం రేపుతోంది. గత డిసెంబర్ లో ఫ్రాన్స్‌లోని మెరిబెల్లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కోమాకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు చోరికి గురయ్యాయని షుమాకర్ మేనేజర్ తెలిపారు. చోరికి గురైన డాక్యుమెంట్లను గత కొద్దిరోజులుగా వేలానికి పెట్టారు. షూమాకర్ కు సంబంధించిన మెడికల్ రిపోర్టులని వేలానికి పెట్టిన వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు. అయితే వేలానికి పెట్టిన మెడికల్ రిపోర్టులు నిజమైనవా లేదా అనే విషయంపై సందేహాలున్నాయాన్నారు. మెడికల్ రిపోర్టులు చోరికి గురైన విషయం వాస్తవమేనని జర్మనీ కి చెందిన అధికారి సబైన్ కెమ్ ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్ రిపోర్టులు పూర్తిగా వ్యక్తిగతమైనవి. పబ్లిక్ కు అందుబాటులో ఉండకూడనివి. అలాంటి వాటిని ఎవరూ కొనుగోళు చేయకూడదు అని హెచ్చరించారు. Follow @sakshinews -
‘షుమాకర్ స్పృహలోనే ఉన్నాడు’
జెనీవా: కోమాలో నుంచి బయటపడిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌ను ఫ్రెంచ్ ఆసుపత్రి నుంచి తరలిస్తున్న సమయంలో స్పృహలోనే ఉన్నాడని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ అంబులెన్స్‌లో స్విట్జర్లాండ్‌లోని లుసానే ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు కళ్లు తెరిచే ఉన్న షుమీ మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయలేదని తెలిపాయి. అయితే కళ్లతోనే సైగలు చేస్తూ తలను అటూ ఇటూ తిప్పినట్లు సమాచారం. షుమాకర్ తరలింపు వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా చేపట్టారు. షుమీ గురించి కనీసం అంబులెన్స్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు. సహాయక సిబ్బందికి సంబంధించిన మొబైల్స్‌ను తీసేసుకున్నారు. -
కోమాలోంచి బయటకు షుమాకర్
లియోన్: ఆరు నెలల పాటు కోమాలో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఎట్టకేలకు బయటపడ్డాడు. దీంతో ఇప్పటిదాకా చికిత్స పొందుతున్న ఫ్రాన్స్‌లోని ఆస్పత్రి నుంచి అతడిని సోమవారం స్విట్జర్లాండ్‌లో లుసానేలోని ఆస్పత్రికి తదుపరి చికిత్స కోసం తరలించారు. ఈ విషయాన్ని షుమాకర్ తరపు ప్రతినిధి సబినే కెమ్ అధికారికంగా ప్రకటించారు. భార్య, పిల్లలతో కలిసి షుమాకర్ స్విట్జర్లాండ్‌లోనే ఓ చిన్న పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 29న ఫ్రాన్స్‌లోని మెరిబెల్లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్రెనోబుల్‌లో అతనికి చికిత్సనందించిన డాక్టర్లు.. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు రెండు శస్త్రచికిత్సలు చేశారు. షుమాకర్లో కదలికలు కనిపించినట్లు పలుమార్లు వార్తలు రాగా, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. అయితే అతడు తప్పక కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. సోమవారం షుమాకర్ తరలింపు సందర్భంగా మీడియా దృష్టంతా గ్రెనోబుల్ పైనే ఉన్నా.. ఎటువంటి హడావిడి లేకుండా, మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా అతడిని తీసుకెళ్లారు. అయితే గాయపడిన నాటి నుంచి షుమాకర్‌కు చికిత్సనందించిన వైద్యులకు, అతడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పినట్లు సబినే కెమ్ తెలిపారు. షుమాకర్ ప్రస్తుత ఆరోగ్యస్థితిపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. పూర్తిగా కోలుకునే దాకా ప్రపంచానికి దూరంగా ఉంచనున్నట్లు చెప్పారు. -
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
-
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకేల్ షుమాకర్ కోమా నుంచి బయటపడ్డాడు. గ్రెనోబుల్ ఆసుపత్రి నుంచి అతడు ఇంటికి చేరుకున్నాడని షుమాకర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అతడికి వైద్యపరమైన సపర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. షుమాకర్ చికిత్స చేసిన వైద్యులు, సేవలు అందించిన నర్సులు, ప్రాథమిక చికిత్స చేసిన వారిని అతడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. షుమాకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. 45 ఏళ్ల మైకేల్ గతేడాది డిసెంబర్ 29న ఫ్రాన్సులో స్కీయింగ్ చేస్తూ పడిపోయాడు. బండరాయికి తల బలంగా మోదుకోవడంతో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. -
కొద్దికొద్దిగా స్పృహలోకి వస్తున్న షుమాకర్
స్కీయింగ్ ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకెల్ షుమాకర్ అప్పుడప్పుడు కోమా నుంచి బయటకి వస్తున్నారు. ఈ మేరకు షుమాకర్ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోంది. 'ఆయన కళ్లు తెరిచి చూస్తున్నారు. కొద్దిగా కదులుతున్నారు' అని ఆయన మేనేజర్ సబీన్ కెహ్మ్ చెప్పారు. గత డిసెంబర్ 29 న ఒక ఫ్రెంచి రిసార్టులో స్కీయింగ్ కోసం వెళ్లిన షుమాకర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వైద్యులు ఆయన్ను కృత్రిమంగా కోమాలోకి పంపించారు. ఫార్ములా వన్ రేసింగ్ లో ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన షుమాకర్ అప్పట్నుంచీ కోమాలోనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు గ్రెనోబుల్ హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. అయితే షుమాకర్ పరిస్థితికి సంబంధించిన అదనపు వివరాలు ఇవ్వడానికి ఆయన మేనేజర్ నిరాకరించారు. షుమాకర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రైవసీని కాపాడేందుకే ఇలా చేస్తున్నామని ఆయన చెప్పారు. -
జనం జబ్బుల పై దాడి