ఆరోజు గర్ల్ఫ్రెండ్ను కామెంట్ చేశాడనే..! | Somali teen refugee shot by Utah police awakens from coma | Sakshi
Sakshi News home page

ఆరోజు గర్ల్ఫ్రెండ్ను కామెంట్ చేశాడనే..!

Published Tue, Mar 15 2016 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

ఆరోజు గర్ల్ఫ్రెండ్ను కామెంట్ చేశాడనే..!

ఆరోజు గర్ల్ఫ్రెండ్ను కామెంట్ చేశాడనే..!

సాల్ట్ లేక్ సిటీ(అమెరికా): పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సోమాలియాకు చెందిన శరణార్థి అబ్ది మహ్మద్ అనే యువకుడు తిరిగి స్పృహలోకి వచ్చాడు. అయితే, అతడు కదల్లేని స్థితిలో ఉన్నాడు. భరించలేని నొప్పులు అతడిని వేధిస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 2004లో అబ్ది తన కుటుంబంతో కలిసి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్ది మహ్మద్, మరో వ్యక్తి కలిసి మెటల్ స్టిక్ తో గత ఫిబ్రవరి 27న ఓ వ్యక్తిని చితకబాదుతున్నారు.

ఆ సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్ర కిందపడేయాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. పైగా ఆ వ్యక్తిని చంపేంత కసిగా దాడి స్థాయిని పెంచారు. దీంతో పోలీసులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబ్ది మహ్మద్ కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే, అబ్ది మహ్మద్ స్నేహితుడు సేలం మహ్మద్ ఈ విషయంపై వివరణ ఇస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆరోజు అబ్ది గర్ల్ ఫ్రెండ్ను కామెంట్ చేశాడని, పైగా ఆయుధంతో దాడికి ప్రయత్నించాడని, అందుకే ప్రతిదాడి జరిగిందని తెలిపారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement