salt lake
-
తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
ప్రకృతి అద్భుతాల్లో ఒకటి.. మహర్లూ సరస్సు. దక్షిణ ఇరాన్ లోని షిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఉప్పు నీటి సరస్సు. ఓ పక్క తెలుపు, మరో పక్క లేత గులాబీ రంగుతో.. సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగును మార్చుకుంటుంది.షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల (16.8 మైళ్ళు) వరకూ ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఆ సమయంలోనే ఇది పింక్ కలర్లోకి మారి.. ప్రకృతి ప్రియుల్ని ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే.. ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడటానికి.. దిమ్మలా, ఒడ్డులా మారుతుంది.ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయ్యింది. ఆ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్ట్ సమయంలో.. సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్
విదేశాల్లో ఉండే అందమైన రైల్వేస్టేషన్టు, మంచి సాంకేతికతో కూడిన రైళ్లను గురించి విన్నాం. వావ్..! అంటూ అబ్బురపడ్డాం. మన దేశంలో కూడా అంతలా అద్భుతంగా ఉండే రైళ్లు ఉన్నాయనిగానీ, సుందరమైన ప్రదేశాల్లో తిరిగే రైళ్ల గురించి గానీ తెలియదు. అయితే అలాంటి రైళ్లు మనదేశంలో కూడా ఉన్నాయని గుర్తు చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. మన దేశంలో కూడా అబ్బురపరిచేలా సుందర ప్రదేశాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో..భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సుగా పేరుగాంచిన రాజస్తాన్‌లోని సంభార్ సరస్సు గుండా ప్రయాణించే ఓ రైలు దృశ్యం కనిపించింది. ఈ వీడియోని ఏరియల్ ఫోటోగ్రఫీకీ పేరుగాంచిన ట్రావెట్ ఫోటోగ్రాఫర్ రాజ్‌మోహన్ క్లిక్ మనిపించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ అందుకు సంబంధించిన వీడియోని.."భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు మీదుగా సుందరమైన రైలు ప్రయాణం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంతవరకు మనం యూరప్ వంటి దేశాల్లోనే ఇలాంటి విజువల్స్చూశాం. మన సొంతగడ్డలోనే ఇలాంటి అద్భతాలు ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇక ఆ సంభార్ సాల్ట్ లేక్ తూర్పు మధ్య రాజస్థాన్‌లో ఉన్న అతిపెద్ద సెలైన్ సరస్సు. ఇది నేచర్ ప్రేమికులకు ప్రకృతిలో దాగున్న గొప్ప రత్నం. దీన్ని దూరం నుంచి చూస్తే..మంచును పోలి ఉండే ఉప్పు షీట్లు సరస్సుని కప్పి ఉంచినట్లు పరుచుకుని ఉంటుంది. సాధారంణంగా వేడి నెలల్లో ఇది పొడిగా ఉంటుంది. ఇక ఈ సరస్సు ఆరవ శతాబ్దంలో పరమశివుని భార్య దుర్గాదేవి అంశమైన శాకంబరి దేవతచే సృష్టించబడిందని పురాణ వచనం. ఈ సరస్సులో ఉప్పు సరఫరా మొఘల్ రాజవంశం నిర్వహించేది. ఆ తర్వాత జైపూర్, జోధపూర్ వంటి రాచరిక రాష్టాలు సంయుక్తంగా దీన్ని సొంతం చేసుకున్నాయి. కాగా మంత్రి అశ్విని వైష్ణవ్ తరుచుగా రైళ్లకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ అధ్భుతమైన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. Scenic rail journey over India's largest inland salt lake. 📍Rajasthan pic.twitter.com/ibiq9rwFWW — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 14, 2024 (చదవండి: లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!) -
‘‘ఏం సాధించారని ఫొటోలకు ఫోజులు? సిగ్గులేదా?’’
వైరల్: ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్లతోనే కాలం గడిపేస్తుంటారు కూడా. తాజాగా డురాండ్ కప్ ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆదివారం కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ 2-1తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్. దీంతో ‘‘ఫుట్‌బాల్ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వవా? సిగ్గులేదా?. ఏం సాధించారని ఫొజులు’’ అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు. దీంతో ఏం ఒరగపెట్టారని ఫొటోల కోసం అంత తాపత్రయమంటూ మండిపడుతున్నారు పలువురు నెటిన్స్. ఫుట్‌బాల్ అభిమానులే కాదు మరోవైపు ఆటగాళ్లు సైతం ఈ చర్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Ladies & gentlemen, bringing you Shri La. Ganeshan, honorable Governor of West Bengal. #DurandCup The high-headedness is audacious. Not expected of a respectable figure, @LaGanesan. A public apology surely won't be too much to ask for. #IndianFootballpic.twitter.com/aEq4Yq6a6R — Debapriya Deb (@debapriya_deb) September 18, 2022 This is what happened with shivshakti minutes before Chhetri. pic.twitter.com/TZmLP93Sdj — Akansh (@AkanshSai) September 18, 2022 -
మృత వలయం చుట్టూ నగ్నప్రదర్శన
Spencer Tunick Dead Sea Naked Photo Shoot Viral: వందల మంది. ఆడా మగా తేడా లేకుండా అంతా నగ్నంగా మారిపోయారు. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం వైట్ పెయింట్‌తో ఎక్కడి నుంచో వస్తున్న ఆదేశాల్ని పాటిస్తూ.. ముందుకు నడుస్తున్నారు. ఆ ఆదేశాలు ఇస్తున్న వ్యక్తి పేరు స్పెన్సర్ ట్యూనిక్. అమెరికన్ ఫొటోగ్రఫీ ఆర్టిస్ట్ అయిన ట్యూనిక్ పేరు, ఆ ఫొటోలు గత రెండోరోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే అలా వాళ్లతో నగ్న ప్రదర్శన చేయించడానికి ఓ ప్రత్యేకమైన కారణం అంటూ ఉంది కూడా.. ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్ మధ్యనున్న డెడ్‌సీ(మృత సముద్రం) ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. గత రెండు దశాబ్దాల్లో 30 శాతం ఎండిపోయిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అట్లాస్) తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్ సీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా డెడ్‌సీ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలనే స్పెన్సర్ ట్యూనిక్ అలా 200 మందితో నగ్నంగా ఫొటోషూట్ చేయించాడు. అఫ్కోర్స్.. ఈ ఫొటోషూట్‌పై ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కూడా. కానీ, ఆయనకు వివాదాలు-విమర్శలు కొత్తేం కాదు. 1992 నుంచి కెమెరా పట్టిన ట్యూనిక్.. పర్యావరణహితం కోసం ఎంతదాకా అయినా తెగిస్తూ వస్తున్నాడు. నగ్నత్వాన్ని.. దానికి ఓ మంచి పనికోసం ఉపయోగించడాన్ని గౌరవంగా భావిస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన్ని బహిష్కరించాలనే పిలుపు కూడా చట్టసభ్యుల నుంచి వినిపిస్తోంది. డెడ్‌సీ గురించి.. భూగోళంపై అత్యంత దిగువన, అంటే సముద్రమట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఉంది డెడ్‌సీ. డెడ్‌సీ అంటే ఓ సరస్సు. ఈ సరస్సు నీటిలో 34 శాతం ఉప్పు ఉండటం వల్ల ఇందులో మనుషులు మునగరు.. తేలుతారు. మామూలు సముద్రాల్లో ఉండే ఉప్పుకన్నా 9.6 శాతం ఈ నీటిలో ఎక్కువ. ఈ నీటిని నోట్లో పోసుకుంటే ఉప్పులాగా కాకుండా విషంలా ఉంటుంది. ఈ సరస్సు చుట్టుపక్కల చెట్లు, జంతువులేవీ బతకవు కనుక దీనికి డెడ్‌సీ అని పేరు వచ్చింది. అయితే ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ పోతాయన్నది వారి నమ్మకం. ఒడ్డున బురదను ఒంటికి రాసుకుని మర్దనా చేసుకుంటారు. డెడ్‌సీ చేసే బిజినెస్ కూడా భారీగానే ఉంటోంది. కాస్మోటిక్స్‌లో, ఆయుర్వేద ఔషధాల్లో ఈ జలాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎరువుల్లో ఉపయోగించే పొటాష్ కూడా ఈ జలాల నుంచి తయారుచేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు అది చావుకు దగ్గరవుతోంది. సమస్య ఏంటంటే.. ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా దేశాల మూకుమ్మడి చేష్టల వల్లే డెడ్‌సీకి ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఈ సరస్సు తరిగిపోవడానికి ప్రధాన బాధ్యత జోర్డాన్ దేశానిదని చెప్పొచ్చు. డెడ్‌సీ సరస్సుకు నీరు వచ్చి చేరేది ఎక్కువగా జోర్డాన్ రివర్ నుంచే!. అయితే కొన్నేళ్ల క్రితం ఆ దేశ ప్రజల మంచినీటి అవసరాల కోసం జోర్డాన్ నది నుంచి పైప్‌లైన్ వేసి నీటిని మళ్లించడం వల్ల ఆ నది నుంచి డెడ్‌సీకి నీరొచ్చే మార్గం నిలిచిపోయింది. దానికితోడు మధ్యప్రాచ్యంలో ఉండే వేడి, పొడి వాతావరణం కూడా నీరు ఎక్కువగా ఆవిరై పోవడానికి కారణం అవుతోంది. దీన్ని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాల మధ్య 1994లోనే 90 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పనులు ఎంతదూరం వచ్చి ఆగిపోయాయో ప్రపంచ దేశాలకు తెలియదు. ఇక పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య జగడం కూడా మృత సముద్రం.. మృత్యువు ఒడిలోకి జారడానికి మరో కారణంగా చెప్పొచ్చు. చదవండి: అవాక్కయేలా చేద్దాం అనుకుంటే.. అదిరిపోయే ట్విస్ట్! -
అద్భుతం: ఇది గ్రాఫిక్ కాదు.. అచ్చంగా ఒరిజినలే!
కొన్ని చూస్తే.. మన కళ్లను మనం నమ్మలేం.. అలాంటిదే ఈ చిత్రం కూడా.. ఇది గ్రాఫిక్ కాదు.. కెమెరా ఎఫెక్ట్ అసలే కాదు.. అచ్చంగా ఒరిజినలే. దక్షిణ ఆస్ట్రేలియాలోని పెనాంగ్‌కు వెళ్తే.. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడవచ్చు. ఇది లేక్ మెక్‌డోనెల్. ఇదో ఉప్పునీటి సరస్సు. ఒకరకమైన నాచు, అలాగే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల దీనికి ఈ రంగు వస్తుంది. ముఖ్యంగా ఈ హాలోబ్యాక్టీరియా ఎర్రరంగు పిగ్మెంట్స్(కణాలు)ను విడుదల చేస్తుంది. అందుకే ఈ సరస్సు ఇలా గులాబీ రంగులో కనిపిస్తుంది. చదవండి: WHO-Covid 19 MU Variant: టీకాలకు లొంగని కోవిడ్ ఎంయూ వేరియంట్! -
భయానక వీడియో.. నడి రోడ్డుపై కాల్చేశారు
-
ఆరోజు గర్ల్‌ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడనే..!
సాల్ట్ లేక్ సిటీ(అమెరికా): పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సోమాలియాకు చెందిన శరణార్థి అబ్ది మహ్మద్ అనే యువకుడు తిరిగి స్పృహలోకి వచ్చాడు. అయితే, అతడు కదల్లేని స్థితిలో ఉన్నాడు. భరించలేని నొప్పులు అతడిని వేధిస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 2004లో అబ్ది తన కుటుంబంతో కలిసి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్ది మహ్మద్, మరో వ్యక్తి కలిసి మెటల్ స్టిక్ తో గత ఫిబ్రవరి 27న ఓ వ్యక్తిని చితకబాదుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్ర కిందపడేయాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. పైగా ఆ వ్యక్తిని చంపేంత కసిగా దాడి స్థాయిని పెంచారు. దీంతో పోలీసులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబ్ది మహ్మద్ కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే, అబ్ది మహ్మద్ స్నేహితుడు సేలం మహ్మద్ ఈ విషయంపై వివరణ ఇస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆరోజు అబ్ది గర్ల్ ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడని, పైగా ఆయుధంతో దాడికి ప్రయత్నించాడని, అందుకే ప్రతిదాడి జరిగిందని తెలిపారు. -
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
కోల్‌కతా : కోల్‌కతాలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్ఫినిటీ బెంచ్‌మార్క్ కార్యాలయంలో ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఉదయం 7.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా కిచెన్‌లో మంటలు చెలరేగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందనే దానిపై సమాచారం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.