గత నెలలో ఓ నల్లజాతి పౌరుడిని అత్యంత పాశవికంగా కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన వీడియోను సాల్ట్ లేక్ నగర పోలీసులు విడుదల చేశారు. విచారణలో భాగంగా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ వీడియోను ఈ వారం సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఆ రోజు కాల్పులు జరిగిన సమయంలో ఉన్న ముగ్గురు పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయి ఉంది. ప్యాట్రిక్ హార్మన్ (50) అనే నల్ల జాతి పౌరుడిని గత ఆగస్టు 13న రాత్రి సాల్ట్ లేక్ పోలీసులు కాల్చి చంపేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే, ఆరోజు తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము అలా చేయాల్సి వచ్చిందంటూ ఈ వీడియోను విడుదల చేశారు. హార్మన్‌పై అప్పటికే కేసులు ఉన్నాయని, ఓపెన్ అరెస్టు వారెంట్‌లు కూడా చాలా ఉన్నాయని తెలిపారు. ఆ రోజు సిగ్నల్ పడినా లెక్కచేయకుండా హర్మన్ తన సైకిల్‌పై వెళ్తుండటమే కాకుండా రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లాడని, తాము ఆపి ప్రశ్నించగా సమాధానం సరిగా చెప్పలేదన్నారు. దాంతో తాము అరెస్టు చేస్తున్నామని అందుకు సహకరించాలని బేడీలు తగలించే క్రమంలో ఆఫీసర్లను తోసి పరుగెత్తాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై కత్తితో దాడి చేశాడని, ఓ అధికారిని కిందపడేశాడని అందుకే ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడని అన్నారు.
భయానక వీడియో.. నడి రోడ్డుపై కాల్చేశారుసాల్ట్ లేక్ నగరం, పోలీసుల కాల్పులు
Published Sat, Oct 7 2017 6:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement