విదేశాల్లో ఉండే అందమైన రైల్వేస్టేషన్టు, మంచి సాంకేతికతో కూడిన రైళ్లను గురించి విన్నాం. వావ్..! అంటూ అబ్బురపడ్డాం. మన దేశంలో కూడా అంతలా అద్భుతంగా ఉండే రైళ్లు ఉన్నాయనిగానీ, సుందరమైన ప్రదేశాల్లో తిరిగే రైళ్ల గురించి గానీ తెలియదు. అయితే అలాంటి రైళ్లు మనదేశంలో కూడా ఉన్నాయని గుర్తు చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. మన దేశంలో కూడా అబ్బురపరిచేలా సుందర ప్రదేశాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
ఆ వీడియోలో..భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సుగా పేరుగాంచిన రాజస్తాన్‌లోని సంభార్ సరస్సు గుండా ప్రయాణించే ఓ రైలు దృశ్యం కనిపించింది. ఈ వీడియోని ఏరియల్ ఫోటోగ్రఫీకీ పేరుగాంచిన ట్రావెట్ ఫోటోగ్రాఫర్ రాజ్‌మోహన్ క్లిక్ మనిపించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ అందుకు సంబంధించిన వీడియోని.."భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు మీదుగా సుందరమైన రైలు ప్రయాణం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు.
ఇంతవరకు మనం యూరప్ వంటి దేశాల్లోనే ఇలాంటి విజువల్స్‌చూశాం. మన సొంతగడ్డలోనే ఇలాంటి అద్భతాలు ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇక ఆ సంభార్ సాల్ట్ లేక్ తూర్పు మధ్య రాజస్థాన్‌లో ఉన్న అతిపెద్ద సెలైన్ సరస్సు. ఇది నేచర్ ప్రేమికులకు ప్రకృతిలో దాగున్న గొప్ప రత్నం. దీన్ని దూరం నుంచి చూస్తే..మంచును పోలి ఉండే ఉప్పు షీట్లు సరస్సుని కప్పి ఉంచినట్లు పరుచుకుని ఉంటుంది.
సాధారంణంగా వేడి నెలల్లో ఇది పొడిగా ఉంటుంది. ఇక ఈ సరస్సు ఆరవ శతాబ్దంలో పరమశివుని భార్య దుర్గాదేవి అంశమైన శాకంబరి దేవతచే సృష్టించబడిందని పురాణ వచనం. ఈ సరస్సులో ఉప్పు సరఫరా మొఘల్ రాజవంశం నిర్వహించేది. ఆ తర్వాత జైపూర్, జోధపూర్ వంటి రాచరిక రాష్టాలు సంయుక్తంగా దీన్ని సొంతం చేసుకున్నాయి. కాగా మంత్రి అశ్విని వైష్ణవ్ తరుచుగా రైళ్లకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ అధ్భుతమైన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు.
Scenic rail journey over India's largest inland salt lake.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 14, 2024
📍Rajasthan pic.twitter.com/ibiq9rwFWW
Comments
Please login to add a commentAdd a comment