rail
-
ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే..
న్యూఢిల్లీ: నమో భారత్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని, సౌకర్యాలను అందించేందుకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(ఎన్సీఆర్టీసీ)(National Capital Region Transport Corporation) ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ ఎన్సీఆర్టీసీ ఘజియాబాద్ నమో భారత్ స్టేషన్లో కో-వర్కింగ్ స్పేస్ ‘మెట్రో డెస్క్’ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ అత్యాధునిక కార్యస్థలం ఘజియాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న నిపుణులు, వ్యవస్థాపకులు చిన్న వ్యాపారులకు ఉపయుక్తమవుతుంది.ఈ కో-వర్కింగ్ స్పేస్(Co-working space)లో 42 ఓపెన్ వర్క్స్టేషన్లు, 11 ప్రైవేట్ క్యాబిన్లు, రెండు సమావేశ గదులు ఉంటాయి. ఒకేసారి 42 మంది కూర్చొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 11 కంపెనీలకు ఆఫీసు వసతి అందనుంది. ఘజియాబాద్ .. మీరట్ మార్గంలో ఉన్న ప్రముఖ స్టేషన్. ఢిల్లీ మెట్రోకు ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఘజియాబాద్‌కు వస్తుంటారు. ఈ కో-వర్కింగ్ స్పేస్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దనున్నారు. బయోమెట్రిక్ ఎంట్రీ, డిజిటల్ కీ కార్డుల ద్వారా స్మార్ట్ యాక్సెస్ కల్పించనున్నారు.ఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సెటప్, వైర్లెస్ స్క్రీన్ షేరింగ్, అధునాతన చర్చా వేదికలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీనితో పాటు, హాట్ డెస్క్‌లు, వెండింగ్ మెషీన్లు, ఫీడ్‌బ్యాక్ సేకరణ కోసం క్యూఆర్-ఆధారిత స్కాన్-అండ్-యూజ్ ఎంపికలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. సాంప్రదాయ కార్యాలయాలతో పోలిస్తే కో-వర్కింగ్ స్పేస్‌లు మంచి ఎంపిక అని నిపుణులు చెబుతుంటారు. ఖరీదైన వాణిజ్య స్థలాలను అద్దెకు తీసుకునే బదులు ప్రొఫెషనల్ వాతావరణంలో పని చేయడానికి ఇవి వీలు కల్పిస్తాయని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: లీలావతి ఎవరు? ఆమె పేరుతో ఉన్న ఆస్పత్రి ఎందుకు చిక్కుల్లో పడింది? -
రైల్వే అంతటా ‘కవచ్’ అమలు
వచ్చే ఆరేళ్లలో మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ‘కవచ్’ టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను పెంచడానికి, స్టేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి, సురక్షితమైన రైల్వే వ్యవస్థను నిర్ధారించడానికి తోడ్పడుతుందని చెప్పారు. రైల్వే రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయితే మౌలిక సదుపాయాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా కవచ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రైల్వే భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థనే కవచ్‌గా పిలుస్తారు. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు రైల్వే బోర్డు గతంలో అనుమతించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024 నాటికి దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1,548 కిలోమీటర్లకు పైగా కవచ్‌ను విస్తరించారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అధిక ప్రాధాన్యత గల మార్గాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లను కవర్ చేయాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందనప్రయాణికుల భద్రత, స్టేషన్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైల్వేకు రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అందులో భద్రతకు రూ.1.16 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంలో భాగంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10,000 లోకోమోటివ్ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. చాలాచోట్ల వ్యవస్థలో లోపం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు తాత్కాలిక ఉపశమనం కింద ఆర్థిక, వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదనేది వాస్తవం. ప్రమాదాల మూలాలను గమనించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్‌తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్‌తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్‌ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?సౌకర్యవంతమైన లెగ్స్పేస్ ఉంటుంది.దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్‌లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి. -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టులో మార్పులు చేసింది. స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే రూట్లను కూడా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైర్ కార్ వందేభారత్ రైళ్లతోపాటు స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూరప్రాంతాలకు స్లీపర్ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో ప్రవేశపెట్టాలనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.స్లీపర్ కోచ్‌ల నిర్వహణ వ్యయం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమతుల్యత లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్ వందేభారత్ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూట్లలో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పరంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతుందని అంచనాకు వచ్చింది.దాంతో స్లీపర్ కోచ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రాక్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), భారతహెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు సవరించిన కాంట్రాక్టును ఖరారు చేసింది. -
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్‌పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు
రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.రిషికేశ్‌లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు. -
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. విచిత్రమైన భయాలు ‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. రైల్ సిక్నెస్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్బాంక్రాన్కీట్’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్ సిక్నెస్’ అని అర్థం. ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. బుల్లెట్ రైలు ఇంగ్లండ్ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లకు చేరుకున్నాం. -
అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్
విదేశాల్లో ఉండే అందమైన రైల్వేస్టేషన్టు, మంచి సాంకేతికతో కూడిన రైళ్లను గురించి విన్నాం. వావ్..! అంటూ అబ్బురపడ్డాం. మన దేశంలో కూడా అంతలా అద్భుతంగా ఉండే రైళ్లు ఉన్నాయనిగానీ, సుందరమైన ప్రదేశాల్లో తిరిగే రైళ్ల గురించి గానీ తెలియదు. అయితే అలాంటి రైళ్లు మనదేశంలో కూడా ఉన్నాయని గుర్తు చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. మన దేశంలో కూడా అబ్బురపరిచేలా సుందర ప్రదేశాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో..భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సుగా పేరుగాంచిన రాజస్తాన్‌లోని సంభార్ సరస్సు గుండా ప్రయాణించే ఓ రైలు దృశ్యం కనిపించింది. ఈ వీడియోని ఏరియల్ ఫోటోగ్రఫీకీ పేరుగాంచిన ట్రావెట్ ఫోటోగ్రాఫర్ రాజ్‌మోహన్ క్లిక్ మనిపించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ అందుకు సంబంధించిన వీడియోని.."భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు మీదుగా సుందరమైన రైలు ప్రయాణం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంతవరకు మనం యూరప్ వంటి దేశాల్లోనే ఇలాంటి విజువల్స్చూశాం. మన సొంతగడ్డలోనే ఇలాంటి అద్భతాలు ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇక ఆ సంభార్ సాల్ట్ లేక్ తూర్పు మధ్య రాజస్థాన్‌లో ఉన్న అతిపెద్ద సెలైన్ సరస్సు. ఇది నేచర్ ప్రేమికులకు ప్రకృతిలో దాగున్న గొప్ప రత్నం. దీన్ని దూరం నుంచి చూస్తే..మంచును పోలి ఉండే ఉప్పు షీట్లు సరస్సుని కప్పి ఉంచినట్లు పరుచుకుని ఉంటుంది. సాధారంణంగా వేడి నెలల్లో ఇది పొడిగా ఉంటుంది. ఇక ఈ సరస్సు ఆరవ శతాబ్దంలో పరమశివుని భార్య దుర్గాదేవి అంశమైన శాకంబరి దేవతచే సృష్టించబడిందని పురాణ వచనం. ఈ సరస్సులో ఉప్పు సరఫరా మొఘల్ రాజవంశం నిర్వహించేది. ఆ తర్వాత జైపూర్, జోధపూర్ వంటి రాచరిక రాష్టాలు సంయుక్తంగా దీన్ని సొంతం చేసుకున్నాయి. కాగా మంత్రి అశ్విని వైష్ణవ్ తరుచుగా రైళ్లకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ అధ్భుతమైన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. Scenic rail journey over India's largest inland salt lake. 📍Rajasthan pic.twitter.com/ibiq9rwFWW — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 14, 2024 (చదవండి: లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!) -
40వేల నార్మల్ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు పెంచుతాం
-
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్‌లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్‌ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్‌లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు. పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది. 160కి పైగా రైల్వే స్టేషన్లలో.. దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్‌బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. -
జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
G20 Summit: న్యూడిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ప్రపంచ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ప్రకటించే అవకాశం ఉందని వైట్ హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ తెలిపారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ భాగస్వామ్యంలో భాగంగా బిడెన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. G20 సమ్మిట్‌లో ప్రకటించబడే ప్రపంచ వాణిజ్యానికి సాధ్యమయ్యే గేమ్ ఛేంజర్‌గా దీన్ని అంచనావేస్తున్నారు. ఈ కారిడార్ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యం, చివరికి యూరప్‌తో అనుసంధానించే షిప్పింగ్ కారిడార్ కోసం శనివారం ప్రణాళికలను రూపొందించాలని యోచిస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో కొత్త సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ డీల్ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కారిడార్ రైల్వేల నెట్వర్క్ ద్వారా మధ్యప్రాచ్యంలోని దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఓడరేవుల నుండి షిప్పింగ్ లేన్ల ద్వారా కూడా ఈ నెట్వర్క్ భారతదేశానికి అనుసంధానించబడుతుందని అంచనా. కాగా ఈ ఒప్పందంపై చర్చించేందుకు నాలుగు దేశాల ఉన్నత జాతీయ భద్రతా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL — Narendra Modi (@narendramodi) September 9, 2023 -
స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పనుల కోసం రైల్వే ఛార్జీల ధరలు పెంచుతారనే ఊహాగానాలు పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల నీవకరణకు కావాల్సిన నిధుల కోసం టికెట్టు ధరలు పెంచుతారనే అనుమానాలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కావాల్సిన రూ.25 వేల కోట్లను బడ్జెట్ నుంచే కాటాయించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టు పేరుతో ఛార్జీలను పెంచడం జరగదని వెల్లడించారు. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచస్థాయి స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ల అభివృద్ధిలో ఏ రాష్ట్రంలో వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు?
మనదేశంలోని అన్ని రైళ్ల చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు కనిపిస్తుంది. దీనిని భద్రతా నియమాలను అనుసరిస్తూ రూపొందిస్తారు. ఈ ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. అయితే వందేభారత్ రైలు చివరి బోగీకి మాత్రం ఈ ‘X’ గుర్తు కనిపించదు. వందేబారత్ ట్రైన్.. హై స్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ అంతా అటాచ్డ్గా ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల నుంచి పరుగులు పెడుతుంది. అందుకే ఈ రైలుకు ‘X’ గుర్తు ఉండదు. రైల్వే విభాగం పలు భద్రతా చర్యలు చేపడున్న దృష్ట్యా పలు సిగ్నళ్లు, సైన్లను రూపొందించి, ఉపయోగిస్తుంది. ఈ కోవలోనే రైలు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు రూపొందిస్తారు. ఇది రైల్వే అధికారులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. రైలు ఏదైనా స్టేషన్ మీదుగా వెళ్లినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రైలు చివరి బోగీపై ఉన్న ‘X’ గుర్తును చూస్తారు. దానిని గమనించాక ఆ రైలుకు అది చివరి బోగీ అని స్పష్టం చేసుకుంటారు. ఒకవేళ ‘X’ గుర్తు అనేది లేకపోతే.. ఆ రైలుకు వెనుకవైపు గల బోగీలు రైలు నుంచి విడిపోయాయని అర్థం. ఇలా జరిగితే వెంటనే రైల్వే సిబ్బంది కంట్రోల్ రూమ్‌కు పోన్ చేసి, ఆ రైలుకు గల వెనుక బోగీలు ఎక్కడో విడిపోయాయనే సమాచారాన్ని అందిస్తారు. అందుకే ఏ రైలుకైనా చివరి బోగీ వెనక ‘X’ గుర్తు ఉండటం ఎంతో ముఖ్య విషయమని రైల్వే సిబ్బంది భావిస్తారు. వందేభారత్ విషయానికొస్తే దీనికి ‘రైల్వే సురక్షా కవచ్’ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ అనుకోని విపత్తుల నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్పీడు అధికారికంగా గంటకు 160 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటెలిజంట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు!
రైలు నడుస్తున్నప్పుడు ఆ రైలులోని లైట్లన్నింటినీ ఆర్పివేయడమనేది ఎక్కడైనా చూశారా? టెక్నికల్ ప్రోబ్లం కాకుండా అలా ఎప్పుడైనా జరుగుతుందా? సాధారణంగా ఇలా జరగదు. అయితే వీటికి భిన్నంగా ఆ ప్రాంతంలోకి రైలు రాగానే దానిలోని లైట్లన్నీ బంద్ అయిపోతాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో? అటువంటి ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకిలా చేస్తారంటే.. చైన్నైలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా జరుగుతుంది. చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కొంత దూరంలోకి లోకల్ రైలు రాగానే దానిలోని లైట్లు ఆరిపోతాయి. అయితే ఇలా లోకల్ రైళ్ల విషయంలోనే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక లోకోపైలెట్ సమాధానమిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొద్దిదూరం వరకూ మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కాస్త దూరంలో ఓహెచ్‌ఈలో కరెంట్ ఉండదు. ఓహెచ్ఈ అనేది లోకోమోటివ్‌కు విద్యుత్‌ను అందిస్తుంది. అక్కడి ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌లో విద్యుత్ ఉండదు. ఇటువంటి ప్రాంతాన్ని నేచురల్ సెక్షన్ అని అంటారు. కట్ కరెంట్ ప్రాంతంగా.. ఇటువంటి స్థలాలను రైల్వేనే రూపొందిస్తుంది. దీనిని ఓవర్ హెడ్ వోల్టేజ్, విద్యుత్ నిర్వహణ కోసం తయారు చేస్తారు. దీనిని కట్ కరెంట్ అని పిలుస్తారు. ఇది నూతన విద్యుత్ జోన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీని వల్ల కొంత దూరం వరకు కరెంటు ఉండదు. లోకల్ రైళ్ల లైట్లు డ్రైవర్ క్యాబిన్ నుండి పనిచేస్తాయి. వాటి పవర్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో ప్రభావితమవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లలో కోచ్‌లకు వేర్వేరుగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. దీని కారణంగా ఆ రైళ్లలో ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తదు. నూతన జోన్ కారణంగా ఇక్కడ నుండి వెళ్ళే లోకల్ రైళ్లలోని లైట్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇది కూడా చదవండి: పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ! -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్‌పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
మరో ప్రమాదం తప్పిందా? ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. రైల్వే శాఖ క్లారిటీ!
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు. Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w — Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023 -
గుడ్‌న్యూస్! గద్వాల మీదుగా జైపూర్‌కు మరో రైలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల మీదుగా జైపూర్ వరకు మరో రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన మహబూబ్‌నగర్– విశాఖ రైలును కిషన్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జిల్లాకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేలా, నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. రైలు ప్రారంబోత్సవం సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో రైల్వేస్టేషన్ ప్రాంగణం, పరిసరాలు మార్మోగాయి. తెలంగాణలో పంటల బీమా పథకం ఎక్కడ?: కిషన్‌రెడ్డి తెలంగాణలో కనీసం పంటల బీమా పథకం అమలు చేయడం లేదని.. ఇక్కడ వర్షాలకు పంటలు నష్టపోతే సాయం చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నాందేడ్ వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్నారని అని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదోడికి ఇల్లు కట్టే సోయిలేదు గానీ.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డు సమయంలో కడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు వస్తోందని, రైతులకు పెరిగిన ఎరువుల ధరల భారం పడకుండా రూ.లక్ష కోట్ల సబ్సిడీని ఇస్తోందని ఆయన వివరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18,254 సబ్సిడీ.. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల సాయం అందజేస్తోందని వివరించారు. దేశ భవిష్యత్ కోసమే రూ.2వేల నోట్ల ఉపసంహరణ ‘రూ.2 వేల నోట్ల ముద్రణ 2018 మార్చి 31 నుంచే బంద్ అయింది.. ఈ నోటు ఉపసంహరణపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. సెపె్టంబర్ 30 వరకు బ్యాంకుల్లో బదలాయింపు చేసుకోవచ్చు.. దేశ భవిష్యత్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందని...
సికింద్రాబాద్: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని భావించిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మహబుబాబాద్ వెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన దారావత్ సంతోష్(17) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. 18 ఏళ్లు వయస్సు నిండిన తరువాత పెళ్లి చేస్తామని సంతోష్‌కు వారి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో సంతోష్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 13న రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ హైదరాబాద్ ఎండ్ పిట్‌లైన్ వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతుని జేబులో లభ్యమైన సెల్‌ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు) -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. భారత్‌లో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రా రంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొం దించిన 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్ కంటైనర్స్‌ను కంపెనీ వినియోగించింది. వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్ సిమెంట్‌తో కూడిన రైలు శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ఈ విధానంలో సిమెంట్ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్ టెర్మినల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యాయం.. రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని సక్సేనా తెలిపారు. ‘కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించే వీలు అవుతుంది. భారతి సిమెంట్ మొదటిసారిగా స్వీకరించిన ఈ మోడల్ దేశంలో సిమెంట్ రవాణాలో విప్తవాత్మక మార్పులతోపాటు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని వివరించారు. ఎర్రగుంట్ల ప్లాంటు నుంచి తొలి రైలును జెండా ఊపి సక్సేనా ప్రారంభించారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ డైరెక్టర్లు ఎం.రవీందర్ రెడ్డి, జి.బాలాజీ, జె.జె.రెడ్డి, హరీష్ కామర్తి, ఎరిక్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, కాంకర్ ఈడీ శేషగిరి రావు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్ మెంబర్ ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్ సంజయ్ మహంతి, కాంకర్ ఎండీ వి.కళ్యాణ రామ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాలుపంచుకున్నారు. వేగంగా సిమెంట్ రవాణా .. ప్రత్యేక కంటైనర్లలో బల్క్ సిమెంట్ రవాణా వల్ల తయారీ కంపెనీలతోపాటు తమ సంస్థకు మేలు చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు వేగంగా సిమెంట్ రవాణా సాధ్యపడుతుందని అన్నారు. -
త్వరలో అక్కన్నపేట-మెదక్ మధ్య నడవనున్న రైలు
-
టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!
ఆగ్రా: టీ అమ్ముతూ, సైకిళ్లను రిపేర్ చేసే త్రిలోకి ప్రసాద్ గాలి శక్తితో నడిచే ఇంజన్ని తయారు చేశాడు. అతను ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి నివాసి. పైగా అతను తయారు చేసిన ఇంజిన్‌ను కారు, ఆటోమొబైల్స్‌కు సరిపోయేలా రీ డిజైన్ చేస్తే అధిక మొత్తంలో వాహన కాలుష్యం నియంత్రించగలం అని చెబుతున్నాడు. అంతేకాదు పైగా త్రిలోకి తయారు చేసిన న్యూమాటిక్ ఇంజిన్ ద్విచక్ర వాహనం నుండి రైలు వరకు ఏదైనా నడపగలదు. (చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....) ఈ ఇంజిన్ వాహనం అవసరాలకు అనుగుణంగా ఇంజిన్ ఆకారాన్ని మాత్రమే మార్చితే సిపోతుందని అంటున్నాడు. ఈ మేరకు 50 ఏళ్ల త్రిలోక్ మాట్లాడుతూ....నేను చిన్న వయసులోనే ట్యూబ్‌వెల్ ఇంజిన్‌ను తయారు చేయడం నేర్చుకున్నాను. అయితే నేను 15 ఏళ్ల క్రితం టైర్లకు పంక్చర్లు రిపేరు చేసేవాడు. ఇలా నేను చేస్తూ ఉండగా ఒకరోజు పంక్చర్ అయిన ట్యూబ్‌లో గాలిని నింపుతున్నప్పుడు ఎయిర్ ట్యాంక్ వాల్వ్ లీక్ అయ్యి , గాలి ఒత్తిడి కారణంగా ట్యాంక్ ఇంజిన్ రివర్స్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి గాలి శక్తిని ఇంజిన్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో నేను యంత్రాన్ని గాలితో ఆపరేట్ చేయగలిగితే ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని భావించాను. ట్యాంక్‌లో గాలి నింపే ఖర్చును తగ్గించే ప్రయత్నంతో మొదలైన ఆలోచన చివరకు పూర్తి స్థాయి ఆటోమోటివ్ ఇంజిన్‌గా రూపాంతరం చెందింది. అని చెప్పారు. ఈ క్రమంలో త్రోలోకి భాగస్వామి సంతోష చౌహర్ మాట్లాడుతు తమ బృందంలో తానొక్కడే గ్రాడ్యుయేట్ అని మిగిలిన వారంతా పది కూడా పూర్తిచేయలేదు. మా బృందం అంతా కలిసి ఊపిరితిత్తుల ఆకారంలో రెండు బెల్లోలను తయారు చేసి వాటిని యంత్రంలో అమర్చాం. ఆ తర్వాత యంత్రానికి ఉన్న మీటను తిప్పడం ద్వారా బెలోస్లో గాలి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంజిన్ మానవుని ఊపిరితిత్తుల మాదిరిగానే గాలిని పంపింగ్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు యంత్రంలోని భాగాల్లో ఘర్షణను తగ్గించేందుకు లూబ్రికెంట్ అయిల్ అవసరం. పైగా పెట్రోల్-డీజిల్ ఇంజిన్ల వలే కాకుండా మేము తయారు చేసిన లిస్టర్ ఇంజన్లో లూబ్రికెంట్ ఆయిల్ వేడిగా లేదా నల్లగా మారదు. అని చెప్పాడు. అయితే త్రిలోకి తనకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, పొలం అమ్మి ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తమ బృందం పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
ఏం కష్టమొచ్చిందో పాపం.. రైలులో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాంపల్లి: హుబ్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ఓ రైలులోని ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్లాట్ఫారం మీదకు వచ్చిన రైలు బోగీలో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని నాంపల్లి (హైదరాబాదు) రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్ఫారం–1 మీద నిల్చున్న రైలులోని ప్రయాణికులందరూ దిగిపోయారు. కానీ వస్తు రవాణా కోసం ఉంచిన పార్శిల్ బోగీలో 60 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైదరాబాదు రైల్వే స్టేషన్లో ఆగిన రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించే ముందు రైల్వే సిబ్బంది బోగీలను పరిశీలించారు. ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో వేలాడుతూ మృతదేహం కనిపించడంతో రైల్వే సిబ్బంది స్థానిక జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి భద్రపరిచారు. -
9న ఢిల్లీకి కిసాన్ రైలు
సాక్షి, అనంతపురం: ‘అనంత’ నుంచి ఢిల్లీకి ఈ నెల 9న కిసాన్ రైలు ప్రారంభమవుతుందని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంత ఉద్యాన రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాజధాని నుంచి జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిసాన్‌రైలు అంశంపై బుధవారం స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో పీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ పి.పద్మలత, ఏడీలు జి.సతీష్, జి.చంద్రశేఖర్, మార్కెటింగ్‌శాఖ ఏడీ ఎ.నారాయణమూర్తి, సెర్ఫ్ అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి రైల్వే వ్యాగన్‌ను సీఎం ప్రారంభించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి అక్టోబర్ నుంచి ప్రతిరోజూ కిసాన్‌రైలు నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. అనంత నుంచి హస్తినకు వెళుతున్న తొలి కిసాన్‌రైలులో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌కోచ్ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఒక బృందం ముందే ఢిల్లీకి చేరుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఉద్యాన రైతులు, అధికారులు సహకరిస్తే ‘అనంత’ కిసాన్‌రైలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమీక్ష అనంతరం రైల్వేస్టేషన్లో వసతులు పరిశీలించారు. అనంతరం కక్కలపల్లి టమాట మండీని పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. -
పట్టాలపైకి తొలి కిసాన్ రైలు
ముంబై : రైతుల దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చేలా కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల రవాణాకు కిసాన్ రైలు ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు తమ దిగుబడులకు సరైన ధర పొందేలా తక్కువ చార్జీలతోనే ఈ రైలు సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆహారోత్పత్తుల సరఫరా కోసం భారత రైల్వేలు 96 రూట్లలో 4610 రైళ్లను నడుపుతున్నాయని చెప్పారు. రైతులు స్వయంసమృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు చర్యలు చేపడుతున్నారని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దియోలలి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరే కిసాన్ రైల్ మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు దనాపూర్ చేరుకుంటుంది. ఇక తిరుగుప్రయాణంలో భాగంగా ప్రతి ఆదివారం రాత్రి 12 గంటలకు దనాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45 గంటలకు దియోలలి చేరుకుంటుంది. ఈ రైలు ఒక ట్రిప్‌లో 31.45 గంటల ప్రయాణంలో 1519 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. కిసాన్ రైలు నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, భుసావల్, బుర్హాన్పూర్, ఖండ్వా, ఇటార్సి, జబల్పూర్, సత్నా, కట్ని, మాణిక్పూర్, ప్రయాగరాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్ స్టేషన్లలో ఆగుతుంది. కాగా, కిసాన్ రైల్ రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని, స్ధానిక రైతులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీలతో కలిసి రైల్వేలు రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాయని కేంద్ర రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రైతు పెన్షన్ స్కీమ్‌కు శ్రీకారం.. -
‘రైలు కొనాలి.. రూ.3000 కోట్లు ఇస్తారా?’
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయిన జనాలకు సోషల్ మీడియా మంచి కాలక్షేపంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని పాత జోక్‌లు మరోసారి సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాంటి ఓ పాత ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. బ్యాంకులో పని చేసే ఓ టెలికాలర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగే సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఇది. దీనిలో టెలీకాలర్, ఓ వ్యక్తికి ఫోన్ చేసి లోన్ కావాలా అని అడుగుతుంది. తమ బ్యాంక్ కార్ లోన్, ఇంటి రుణం వంటి వాటి వేర్వేరు సేవలు అందిస్తుందని చెప్తుంది. అందుకు ఆ వ్యక్తి ‘నాకు లోన్ కావలి.. రైలు కొనాలనుకుంటున్నాను. నేను సమోసా, చిప్స్ చేస్తూ రోజుకు 1500 వందల రూపాయలు సంపాదిస్తున్నాను. నాకు బ్యాంక్ ఖాతా లేదు. కానీ రైలు కొనడానికి నాకు రూ.3000 కోట్లు లోన్ కావాలి. ఇస్తారా’ అని అడుగుతాడు. దాంతో కాల్ కట్ అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ జోక్ ప్రస్తుతం మరోసారి వైరల్‌గా మారింది. This is hilarious.https://t.co/0FgHoHyka0 — governorswaraj (@governorswaraj) May 28, 2020 -
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా: విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్ద ప్యాసింజర్ రైలు, పట్టాలపై ఉన్న గేదెలను ఢీకొట్టడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టం బాగుండి ప్రయాణికులకు ఏంకాలేదు. రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. -
బాలికపై అత్యాచారయత్నం..పోలీస్‌పై కేసు
తిరువనంతపురం: కదులుతున్న రైల్లో పదిహేడేళ్ల బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన ఓ పోలీసుపై రైల్వే పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిందితుడు కేరళ రాష్ట్రం విజిలెన్స్ డిపార్ట్మెంటులో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న దిన్షాద్(38)గా గుర్తించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితం రైలు తిరువనంతపురం సరిహద్దున ఉన్న సష్టంకొట్టా వద్దకు వచ్చినపుడు బాలిక పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలిసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం నిందితుడు దిన్షాద్ పరారీలో ఉన్నాడు. -
స్త్రీలోక సంచారం
హైదరాబాద్ మెట్రో రైళ్లలో స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చునే మగాళ్ల బెడదను వదలించుకోడానికి మహిళా ప్రయాణికులు సోషల్ మీడియాలో సమాలోచనలు జరుపుతున్నారు. స్త్రీలు కళ్లెదుట నిలబడి ఉన్నప్పటికీ స్త్రీల సీట్లలో భీష్మించుకుని కూర్చొనే పురుషులపై చర్య తీసుకోవడం జరుగుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో స్త్రీలే ఇక తమ ‘హక్కు’ను పొందడం కోసం ట్విట్టర్లో, ఫేస్బుక్లో.. మార్గాలను అన్వేషిస్తున్నారు. మొద్దుమొహాలైన మగాళ్లు వెంటనే గ్రహించేలా ఉండడం కోసం ‘లేడీస్ కోచ్’కు, లేడీస్ సీట్లకు గులాబీ రంగును వేయించడం ఒక మార్గం అని ఒకరు సూచించగా.. ఆ పనేదో ఎన్నికలు అయ్యాక చేస్తే బాగుంటుందనీ, లేకుంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి లబ్ది పొందుతుందని ఒకరు అభిప్రాయపడ్డారు. మరొకరు.. ఉన్న మూడు కోచ్‌లలో ఒకటి స్త్రీలకు, ఒకటి పురుషులకు, మిగతా కోచ్‌ను ఉమ్మడిగా స్త్రీ, పురుషులకు కేటాయించడం ఫలితాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్త్రీల సీట్లలో కూర్చునే మగాళ్లకు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 500 రూ. జరిమానా విధిస్తోంది. అయినప్పటికీ మగాళ్లలో మార్పు రాకపోవడంతో చివరికి మహిళా ప్రయాణికులే మార్గాన్వేషణలో పడ్డారు. -
కష్టాలకు కితకితలు
ఒక ఉద్యోగానికి వెళ్లి వస్తేనే ప్రాణం సొమ్మసిల్లుతుంది. కుటుంబం ఆర్థికంగా సొమ్మసిల్లకుండా ఉండేందుకు తన బతుకు బోగీని రైలు బండికి తగిలించి దీపిక అనేక ఉద్యోగాలను చేస్తున్నారు! స్టాండప్ కమెడియన్‌గా కష్టాలకు కితకితలు పెడుతున్నారు. ముంబైలో లోకల్ ట్రైన్లు నిరంతరం సందడిగా ఉంటాయి. సందడి అంటే ‘రద్దీ’గా అని కాదు. ఆ ట్రైన్లలో ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు పనిలోపనిగా ప్రయాణంలో పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం, కూరలు కట్ చేయడం, ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం.. అదో చిన్న ప్రపంచం. వీటితో పాటు వస్తు విక్రయాలూ జోరుగానే సాగుతాయి. కష్టపడి పనిచేసుకునేవారికైతే ఈ ట్రైన్లలో లోటే ఉండదు. మరికొందరు మంచి మాట తీరుతో జోరుగా అమ్మకాలు సాగిస్తుంటారు. అలాంటి వారిలో 45 ఏళ్ల దీపికా మాత్రే ఒకరు. ప్రయాణికులతో ఆమె ఎంతో ఆప్యాయంగా, సరదాగా మాట్లాడుతూ ఇమిటేషన్ జ్యూయలరీని అమ్ముతుంటారు. అయితే దీపిక దైనందిన జీవితంలో ఇదొక్కటే వ్యాపకం కాదు. దీపిక గురించి తెలిసి, ఆమెతో ఫోనులో సంభాషించినప్పుడు ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ఉదయం ట్రైన్లో గంట సేపు నాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా భర్త అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. నేను ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి, ఐదున్నరలోగా ఇంటి పని పూర్తి చేసుకుని, రెండు బ్యాగుల నిండా ఇమిటేషన్ జ్యూయలరీ సర్దుకుని, లోకల్ ట్రైన్ ఎక్కేస్తాను. ముంబైలో కొన్ని లక్షల మంది ప్రతిరోజూ తెల్లవారుజామునే ప్రయాణిస్తారు. వారికి విడిగా షాపింగ్ చేసుకునే తీరిక ఉండదు. అటువంటి వారికి నా దగ్గర కొనడం వల్ల చాలా సమయం సేవ్ అవుతుంది. అందరిలాగే ఎక్కువ ధర చెప్పి, వారు అడిగిన ధరలకు ఇస్తుంటాను. అలా ఇస్తే, వారు కావలసిన ధరకు కొనుక్కున్న ఆనందం పొందుతారు. అయితే ప్రతిరోజూ ఈ బేరాలు చేస్తూ సమయం వృథా చేసుకోవడం ఎందుకు అనుకున్నాను. ఒక ఆలోచన తట్టింది. నగల మీద ధరల స్టికర్ వేసేశాను. బేరం అడగడం మానేశారు. దాని మీద ఉన్న ధర చూసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలా వాటిని అమ్ముకుంటూ, ఆరున్నరకల్లా మలాడ్ స్టాపులో రైలు దిగేస్తాను. మధ్యాహ్నం వరకు వంట పని గిల్టు నగలు అమ్మితే వచ్చిన డబ్బుతో కుటుంబం నడవదు కదా. అందుకే ఐదుగురి ఇళ్లలో వంట పని చేస్తున్నాను. మధ్యాహ్నం దాకా ఆ పనితోనే సరిపోతుంది. అక్కడ పనులు ముగించుకుని, మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వస్తాను. భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు స్టాండప్ కామెడీ షోలు చేస్తున్నాను. రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరుకుంటాను. ఇది నా దినచర్య. నగలు అమ్ముతూనే కామెడీ కుటుంబ పోషణం కోసం నేను ఇన్ని పనులు చేస్తున్నానని, ఎన్నడూ బాధపడలేదు. నా కుటుంబానికి నేనే ఆధారం అనే ఆలోచనే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేం నివసించే ‘నాలా సోపారా’ నుంచి ‘మలాడ్’ వరకు అనునిత్యం ట్రైన్లలో ప్రయాణిస్తుంటాను. జ్యూయలరీ అమ్మకాలతో పాటు అప్పుడప్పుడు స్టాండప్ కామెడీ షోలు చేస్తూ అందరికీ ఆనందం కలిగిస్తుంటాను. గ్రామీణ వాతావరణంలో పెరిగిన నేను నా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కొన్నాను. ఆ అనుభవాలు ఈ కామెడీ షోలు ఇవ్వడంలో పనికొస్తున్నాయి. జీవితమే జోక్స్ చెప్పిస్తోంది వయసు మీద పడుతోంది. దానికి తోడు డయాబెటిస్ కూడా వచ్చింది. ఇంటి పనులతో పాటు కామెడీ షోలు చేయలేకపోతున్నాను. అయినా ధైర్యం విడిచిపెట్టకుండా, షోలు చేస్తూనే ఉన్నాను. చాలామంది కమెడియన్లు భార్యాభర్తల గురించి జోక్‌గా చెబుతుంటారు. ఇప్పుడు అలాంటివి నేను చెబుతున్నాను. నా జీవితంలో తారసపడిన సంఘటనలను హాస్యరూపంలో ప్రదర్శనలు ఇస్తున్నాను. నేను నటిస్తున్నంతసేపు ప్రేక్షకులను చూసి నవ్వుతూ ఉంటాను. నా పంచ్‌లకు ప్రతిస్పందన వచ్చేవరకు నిరీక్షిస్తాను. నా అదృష్టం ఏమిటంటే, ఈ షోలు మొదలుపెట్టిన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూనే ఉన్నాను. సంగీతా మేడమ్ వల్లే..! ఇళ్లలో వంట పనిచేయడం నుంచి, స్టాండప్ కమెడియన్‌గా ఎలా మారానా అని చాలామందికి సందేహం. వాస్తవానికి నేను వంట పనులు మానలేదు. అవి చేస్తూనే, లోకల్ ట్రైన్లలో నగలు అమ్ముతూనే ఉన్నాను. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను వంట చేస్తున్న ఇంటివారు నాతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. నేను వంట చేస్తున్న సంగీత మేడమ్, నా కోసం ఒక టాలెంట్ షో ఏర్పాటు చేశారు. ఈ మాత్రం సహాయం కూడా చేయని రోజులు ఇవి. కాని ఆవిడ నా టాలెంట్‌ని చూపడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. నేను నా జోకులను ప్రదర్శించడం ప్రారంభించాను. అలా నెమ్మదిగా చిన్న చిన్న ప్రదేశాలలో, రైళ్లలో ఈ ప్రదర్శనలు ఇస్తూ, ఏడాది క్రితం స్టేజీ మీద కామెడీ షో చేశాను ఈ కార్యక్రమానికి వచ్చిన ‘రచేల్ లోపెజ్’ అనే ఒక జర్నలిస్టు, నాకు మంచి భవిష్యత్తు ఉందని నన్ను ప్రశంసించారు. అప్పటికే సుపరిచితురాలైన అదితి మిట్టల్ అనే యాంకర్‌ను రేచల్ పరిచయం చేశారు నాకు. వీరిద్దరినీ సంగీత మేడమ్ ఇంట్లోనే కలిశాను. అప్పుడే రచేల్ నన్ను ‘నువ్వు ప్రొఫెషనల్‌గా మారతావా’ అని అడిగారు. నేను ఎన్నడూ పెద్ద స్టేజీ మీద ప్రదర్శన ఇవ్వలేదు. అందువల్ల అదితి నా మెంటర్‌గా ఉండి, నా ప్రదర్శన ఏర్పాటుచేశారు, ‘బ్యాడ్ గర్ల్’ పేరున మేం ఒక ప్రదర్శన ఇచ్చాం. కొన్ని ఇళ్లలో వేరుగా చూస్తారు సంగీత మేడమ్‌లా చేయూత ఇచ్చేవారు ఒకరో ఇద్దరో ఉంటారు. ఇప్పటికీ నేను వంట పనులు చేస్తూనే ఉన్నాను. కొందరు మేడమ్స్ నన్ను ఇంకా పనిమనిషిగానే చూస్తున్నారు. వారు నన్ను కుర్చీలో కూర్చోనివ్వరు. నేల మీద కూర్చోవాలి. ప్రత్యేకమైన గ్లాసులలో మంచినీళ్లు, టీ ఇస్తారు. అవేవీ నేను పట్టించుకోను. నా పని మీద దృష్టి పెట్టి, పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోతాను. మేం పనిచేస్తున్న బిల్డింగ్‌లో నా వంటివారిని కొంచెం దూరంగా చూస్తారు. మాకు ప్రత్యేకమైన లిఫ్ట్ ఉంటుంది. మాకు ఇచ్చే వస్తువులన్నీ విడిగానే ఉంచుతారు. పనివారంతా వేరే లిఫ్ట్‌లో వెళ్లాలని రూల్ కూడా ఉంది. మా పాత్రలను కూడా దూరంగా ఉంచాలి. చిత్రం ఏమిటంటే, మేం చేసిన రోటీలు చక్కగా తింటారు. ఇదంతా షోలో చెబుతున్నప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. నేను చెప్పేవి జోకులే కాని అన్నీ వాస్తవాలే. అయితే ఇవి ఏవీ ఇతరులను నొప్పించేవిగా ఉండవు. వారి పనుల గురించి వారు ముచ్చటించుకున్నట్లుగానే ఉంటాయి’’ అంటారు దీపిక.ప్రస్తుతం దీపిక షోలన్నీ ఉచితంగానే చేస్తున్నారు. తనకు ఎంతోకొంత ఆర్థిక సహాయం అందితే తన జీవితం బాగుంటుంది అంటున్నారు. దీపికతో మాట్లాడినంతసేపు ఆమె మాటల్లో బాధ కాని, నిట్టూర్పు కాని వినిపించలేదు. తన పని గురించి ఎంతో గర్వంగా భావిస్తున్నట్టుగానే అనిపించింది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ఎలా అమ్మాలో తెలిసేది కాదు నా భర్త ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇప్పుడు నాకు హై బ్లడ్ సుగర్ వచ్చింది. అందువల్ల మేం ఇద్దరమూ పని చేసే స్థితిలో లేము. మా పెద్దమ్మాయి ‘మిడ్ డే’ వారు చేసిన ఇంటర్వ్యూలో ఉద్యోగానికి అర్హత సంపాదించింది. నాకు ఓపిక ఉన్నంతవరకు వేదికల మీద అందరినీ నవ్విస్తూనే ఉంటాను. మొదట్లో నాకు గిల్టు నగలు అమ్మకం చేత కాదు, అవసరమే నాకు అన్నీ నేర్పింది. ఇలాగే మిగతావీ నేర్చుకుంటాను. – దీపికా మాత్రే – సంభాషణ: వైజయంతి పురాణపండ -
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
కొమురం భీం ఆసిఫాబాద్: పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నుంచి రద్దు చేసింది. పెద్దంపేట నుంచి మంచిర్యాల వరకు రైల్వే మరమ్మతులు జరుగుతుండటంతో ఈ నెల 8 వరకు రద్దు చేస్తున్నట్లు స్థానిక రైల్వే అధికారులకు ఉత్తర్వులు అందాయి. కరీంనగర్ నుంచి సిర్పూర్( రైలు నెంబర్ 77255), సిర్పూర్ నుంచి కరీంనగర్(77256), కాజీపేట్ నుంచి బల్లర్ష(77121), సిర్పూర్ నుంచి కాజీపేట్(57122), అజ్ని నుంచి కాజీపేట్(57135), కాజీపేట్ నుంచి అజ్ని(57136) మధ్యలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రమే నడుస్తుంది. -
1500 కిలోమీటర్లు ప్రయాణించిన శవం
పాట్నా : రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుకు గురై మరణించిన ఓ వ్యాపారి శవం ఎవరూ గుర్తించకపోవడంతో ఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు 72 గంటల తర్వాత శవాన్ని గుర్తించటంతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యాపారి ఈ నెల 24న పాట్నా-కోట ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రాకు బయలుదేరాడు. ఉదయం 7-30 గంటల సమయంలో తన భార్యకు ఫోన్ చేసి ఆరోగ్యం సరిగాలేదని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అతని భార్య ఫోన్ చేసినప్పటకీ భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భార్యకు ఫోన్ చేసిన తర్వాత టాయ్‌లెట్‌కు వెళ్లిన సంజయ్ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. టాయిలెట్లో శవం ఉన్న సంగతి ఎవరూ గుర్తించకపోవడంతో అలా 1500 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నా చేరుకుంది. పాట్నా చివరి స్టేషన్ కావడంతో ప్రయాణికులు దిగిన తర్వాత రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించారు. బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బందికి టాయిలెట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. టాయిలెట్ తలుపులు తెరచి చూడగా అందులో శవం ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. శవం దగ్గర ఉన్న ఐడీ కార్డు సహాయంతో మృతుడిని సంజయ్ కుమార్ అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు. బోగిలోని టాయ్‌లెట్ లోపలి నుంచి లాక్ అయ్యిందని 1500 కిలోమీటర్లు ప్రయాణించినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
25 సెకన్లు.. క్షమాపణ చెప్పించాయి!
జపాన్‌లోని ఓ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. ఓ రైలు ప్లాట్‌ఫాం మీదికి వచ్చింది.. ప్రయాణికులు ఎక్కారు.. రైలును లొకోపైలట్ ముందుకు కదిపాడు.. ప్లాట్‌ఫాం నుంచి వెళ్లిపోయింది. మరి ఇందులో అంత ఘోరం ఏముంది? అనుకుంటున్నారా.. సాధారణంగా ఏ దేశంలోనైనా ఇలాగే జరుగుతుంది కదా.. జపాన్‌లో ఏమైనా తేడాగా జరుగుతుందా అని అవాక్కవుతున్నారా? ఇందులో ఘోరం ఏంటో తెలుసా.. ఆ రైలును లొకోపైలట్ నిర్ధిష్ట సమయం కన్నా 25 సెకన్లు ముందు తీసుకెళ్లాడు. నిజంగా 25 సెకన్లే.. 25 నిమిషాలు కాదు.. అది అక్కడ జరిగిన ఘోరం.. ఏంటీ రైలు 25 సెకన్లు ముందు వెళితే ఘోరం ఏంటి అని మళ్లీ ఆశ్చర్యపోకండి. జపాన్‌లో రైళ్లు సమయపాలనకు మారుపేరు. అక్కడ సెకన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అసలేం జరిగిందంటే.. రైలు వెళ్లాల్సిన సమయం 7.12 గంటలకు.. అయితే లొకోపైలట్ 7.11 గంటలకు అనుకున్నాడు. దీంతో సరిగ్గా 7.11 గంటలకు రైలును స్టార్ట్ చేసి 7.11.35 సెకన్లకు ప్లాట్‌ఫాం నుంచి రైలు తలుపులు మూసేసి వెళ్లిపోయాడు. అంటే 25 సెకన్లు ముందుగా వెళ్లిపోయాడు. దీంతో ఓ ప్రయాణికుడు ఆ రైలును అందుకోలేకపోయాడు. పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపించగా.. లొకోపైలట్ తప్పిదం నిరూపణ అయింది. పశ్చిమ జపాన్ రైల్వే అధికారులు ఆ ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని క్షమాపణలు చెప్పింది. అయితే గతేడాది నవంబర్‌లో కూడా 20 సెకన్ల ముందే ఓ రైలు వెళ్లిపోయినప్పుడు కూడా రైల్వే శాఖ క్షమాపణలు చెప్పింది. -
చుక్ చుక్ రైలు
కూ చుక్ చుక్‌మంటూ రైలొచ్చింది.. ఈ రైలు వెళ్లేలోపు మీకో ప్రశ్న.. ఈ రైలులో ఇంకా ఎంత మంది ఎక్కడానికి జాగా ఉంది?? సివిల్స్ ఇంటర్వూ్యలో అడిగినా దీనికి జవాబు చెప్పడం కొంచెం కష్టమేనేమో.. చూశారుగా.. రైలులో జనం.. రైలు ముందు జనం.. రైలు మీద జనం.. ఇటు ప్లాట్‌ఫాం మీద.. పైకప్పు పైన.. చుట్టూరా జనమే జనం.. ఎవరికీ డ్రైవింగ్ రాదు కాబట్టి సరిపోయింది.. లేకుంటే ఆ రైలు డ్రైవర్‌ను కూడా దించేసేవారే.. బంగ్లాదేశ్‌లో ఓ పండుగ కోసం జనం తమతమ ఊళ్లకు వెళ్తున్నప్పుడు ఉండే రద్దీ దృశ్యాన్ని యూసఫ్ తుషార్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. 2018 నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో ‘పీపుల్స్’ విభాగంలో వచ్చిన వేలాది ఎంట్రీల్లోనుంచి ఎడిటర్ చాయిస్ కింద కొన్ని చిత్రాలను ఎంపిక చేశారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ పోటీ విజేతలను త్వరలో ప్రకటించనున్నారు. -
ఏసీ కోచ్‌లో నాగు పాము
భువనేశ్వర్: రైలు ప్రయాణం అడుగడుగునా ప్రమాదకరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. నిన్న మొన్నటి వరకు రైలు బోగీల్లో బొద్దింకలు, ఎలుకలు వంటి సాధారణ కీటకాలు, చిరు జంతువులు ప్రత్యక్షం కావడంపట్ల ప్రయాణికులు అలవాటు పడ్డారు. తాజాగా రైలు ఎయిర్ కండిషన్ ద్వితీయ శ్రేణి బోగీలో నాగుపాము ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ దుమారం కథనం ఇలా ప్రసారంలో ఉంది. ఈ సంఘటన పూర్వాపరాల్ని రైల్వే శాఖ పర్యవేక్షిస్తోంది.18507 విశాఖపట్నం–అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వితీయ శ్రేణి ఎయిర్ కండిషన్ బోగీలో నాగుపాము గలాటా సృష్టించింది. ఎ–1 బోగీ 32వ నంబరు బెర్తు కింద పాము తారసపడింది. ఈ బెర్తులో భువనేశ్వర్ నుంచి అంబాలా వెళ్లేందుకు ఓ యువతి బయల్దేరింది. రైలు ఢిల్లీ నుంచి బయల్దేరిన తర్వాత తనపైకి ఏదో పాకుతున్నట్లు అనిపించి చూడబోతే సాక్షాత్తు నాగు పాము కావడంతో పిడికిట్లో ప్రాణాలు పెట్టుకుని తనకి అందుబాటులో ఉన్న కంబళిని నాగుపాముపై రువ్వి హఠాత్తుగా బెర్తు నుంచి కిందకు దూకి మిగిలిన ప్రయాణం పూర్తి చేసింది. వేరే చోట తోటి ప్రయాణికులతో సర్దుకుని అంబాలా గమ్యం చేరింది. గమ్యం చేరిన భయంతో బిక్కచచ్చిన యువతి కిందకు దిగలేని పరిస్థితిలో డీలాపడినట్లు కుటుంబీకులు గుర్తించారు. ఆమెకి చేయూతనిచ్చి రైలునుంచి దించాల్సి వచ్చిందని యువతి తండ్రి సోషల్ మీడియాలో ఆదివారం ప్రసారం చేశాడు. -
రైల్లో నుంచి జారిపడి చిన్నారి మృతి
నెల్లూరు జిల్లా : కావలిలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి రోహిత అనే ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. కావలి, వెంకటేశ్వరపురం స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. గాయపడిన చిన్నారిని మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. ఈ ఘటనతో చిన్నారి రోహిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలులో వాష్ రూంకు వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. రైలు రెండు కిలోమీటర్లు వెళ్లాక ఈ విషయం గుర్తించినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్–నేపాల్–చైనాల మధ్య ఆర్థిక కారిడార్
బీజింగ్: హిమాలయ దేశమైన నేపాల్‌పై మరింత పట్టు బిగించేందుకు చైనా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చైనా–నేపాల్–భారత్‌ల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని డ్రాగన్ దేశం ప్రతిపాదించింది. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఈ మేరకు స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చల అనంతరం కుమార్ బుధవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేపాల్–చైనాలు బహుళార్థక ప్రయోజనాలున్న హిమాలయ అనుసంధాన వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించాయి’ అని చెప్పారు. అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పందిస్తూ.. నేపాల్ ఇప్పటికే వన్‌బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిందన్నారు. ఇందులో భాగంగా నేపాల్‌లో రైలు, రోడ్డు మార్గాలు, విమానాశ్రయాలు, విద్యుత్, సమాచారం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. దీనివల్ల చైనా–నేపాల్–భారత్‌లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ను నిర్మించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధికి భారత్, చైనాలు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ధర్మశాలలో ఉన్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలుసుకునేందుకు టిబెట్ శరణార్థులు తమ దేశం గుండా వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు నేపాల్ ఒప్పుకుందన్నారు. -
వివాహేతరం సంబంధం..యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చోడవరానికి చెందిన ఇలిశెట్టి రాజశేఖర్(30)గా గుర్తించారు. వివాహేతర సంభంధమే ఈ ఆత్మహత్యకు కారణమని రాజశేఖర్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు చోడవరానికి చెందిన మిత్రులకు పంపిన సెల్ఫీ వీడియో ద్వారా తెలిసింది. రాజశేఖర్‌కు 5 సంవత్సరాల క్రితం రాణి అనే యువతితో వివాహం జరిగింది. పిల్లలు లేరు. ఆరు నెలల క్రితం నుంచి చోడవరం అంబేరుపురానికి చెందిన ఓ మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భర్త వదిలివేసిన ఆమెకు ఒక పాప ఉంది. శుక్రవారం ఉదయం 5గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మిత్రులకు వాట్సప్ ద్వారా తెలియపర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్కసారి ఆలోచించరూ..
గజపతినగరం రూరల్ : మండల పరిధిలోని పురిటిపెంట రైల్వే గేట్ వద్ద విద్యార్థులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారే ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పురిటిపెంట వద్ద రైల్వే గేట్ ఉంది. రైళ్లు వచ్చేటప్పుడు సిబ్బంది ఠంచన్‌గా గేట్ వేస్తుంటారు. అయితే గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు గేట్ వేసినా ఆగకుండా ట్రాక్‌పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ కళాశాలల ప్రారంభ సమయంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ట్రాక్‌పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కోసారి రెండు ట్రాక్‌లపై కూడా రైళ్లు వస్తుంటాయి. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థుల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కళాశాలల సిబ్బంది అయినా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
రైలు కింద పడి టీఆర్ఎస్ నాయకుడి మృతి
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : రైలుకింద పడి మండల కేంద్రానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బొంగు శంకరయ్య(68) గురువారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి వెళ్తూ మలక్‌పేట వద్ద మెట్రోరైల్ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారికింద పడి అక్కడక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాత్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బొంగు శంకరయ్య 10 ఏళ్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అన్న తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరో 10 ఏళ్లు పనిచేశారు. అలాగే సింగిల్‌విండో చైర్మన్‌గా రైతులకు సేవలందించారు. పలువురి సంతాపం... ఈయన మృతి పట్ల ఎంపీపీ సార సరస్వతీబాలయ్య, వైఎస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రం, నాయకులు కె. భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, రామాంజనేయులు, పొనమోని శ్రీశైలం, బొంగు అయిలయ్య, మైసగోని వెంకటేశం, కొంక లక్ష్మినారాయణ, దారెడ్డి మల్లారెడ్డి, సోమలింగం, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు బడుగు దానయ్య, పట్టణ అధ్యక్షుడు గుండ్ల రాంచంద్రం, రామేశ్వర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
పవన్ కల్యాణ్ అభిమాని ఆత్మహత్య
కావలి: పట్టణంలోని సబ్‌కోర్టు వీధిలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న పసుపులేటి నరేంద్ర (24) అనే పవన్ కల్యాణ్ అభిమాని సోమవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన నరేంద్ర కావలి పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అవివాహితుడైన నరేంద్ర ప్రేమించిన యువతి వ్యవహారంలో మనస్థాపం చెంది నాలుగు రోజులుగా మద్యం తాగుతూ సన్నిహితుల వద్ద తన ప్రేమ విఫలంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. తాను ప్రేమించిన యువతిని ఇంటికి తీసుకువస్తానని తండ్రికి చెప్పాడు. అందుకు ఆయన అంగీకరించలేదు. ఈ విషయాన్ని బాబాయ్‌కి చెప్పగా, ఆయన మీ నాన్నాతో నేను మాట్లాడుతాను, ఎక్కడున్నవో చెప్పు అని నరేంద్రను ఫోన్లో ప్రశ్నించాడు. ఎందుకులే బాబాయ్... అని సమాధానం చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఈ క్రమంలో సోమవారం ముసునూరు దాటిన తర్వాత చెంచుగానిపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రామచంద్రాపురం గ్రామంలో విషాదం అలముకొంది. -
ఏడాదిలో గజ్వేల్‌కు రైలు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రైలు మొహం చూడని సిద్దిపేట ప్రాంతం కేవలం ఏడాదిలో రైలు కూత వినబోతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి గజ్వేల్ వరకు డెమో రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. తెలంగాణలో కీలకమైన కరీంనగర్ పట్టణాన్ని సికింద్రాబాద్ స్టేషన్‌తో రైల్వే మార్గం ద్వారా అనుసంధానించే ప్రాజెక్టు మనోహరాబాద్–కొత్తపల్లి మార్గంలో తొలిదశను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది మార్చిని రైల్వే అధికారులు లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ వరకు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న పనులను బేరీజు వేసుకున్న అధికారులు సరిగ్గా ఏడాదిలో రైలు నడిపేందుకు వీలుగా సిద్ధం చేయనున్నట్టు గుర్తించారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. తొలి దశను సకాలంలో పూర్తి చేయనున్నట్టు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం వంతెనలు, కల్వర్టుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పట్టాలు పరిచే పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మనోహరాబాద్ నుంచి లింక్ నిజామాబాద్ రైలు మార్గంలో బొల్లారం దాటాక వచ్చే మనోహరాబాద్ నుంచి కొత్త లైను మొదలవుతుంది. నేరుగా సికింద్రాబాద్ నుంచే మార్గం నిర్మిద్దామనుకున్నప్పటికీ మధ్యలో రక్షణ శాఖకు చెందిన స్థలాలు ఉండటంతో మనోహరాబాద్ నుంచి లింక్ కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి గజ్వేల్ 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పనులు చేపట్టేందుకు అవసరమైన 600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సేకరించారు. మరో 150 ఎకరాలు కావాల్సి ఉంది. దాన్ని కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్షిణ మధ్య రైల్వే కోరింది. రెండు నెలల్లో పట్టాల పనులు గజ్వేల్ వరకు 50 కల్వర్టులు అవసరం. ప్రస్తుతం వాటి నిర్మాణం వేగంగా సాగుతోంది. దీంతోపాటు మట్టికట్ట పని దాదాపు పూర్తి కావచ్చింది. దానిపై పట్టాలు పరిచేందుకు అవసరమైన ఏర్పాటు జరుగుతోంది. మరో రెండు నెలల్లో పట్టాలు పరిచే పని మొదలుకానుంది. నాచారం, వీరనగరం, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. గజ్వేల్ సమీపంలో ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్‌తో సమావేశమై చర్చించారు. కుదిరితే జనవరి నాటికే పనులు పూర్తి చేసి రైలు నడిపేలా చూడాలని కోరారు. స్టేషన్ భవనాలను ఆధునిక పద్ధతిలో నిర్మించాలని సూచించారు. అర గంటలో గజ్వేల్ హైదరాబాద్ నగరానికి చేరువగా ఉన్నప్పటికీ గజ్వేల్‌కు ఇప్పటి వరకు రైలుతో అనుసంధానం లేదు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూరగాయలు, పళ్లను రైతులు నగరానికి తరలించి విక్రయిస్తారు. ప్రస్తుతం వారికి రోడ్డు మాత్రమే దిక్కు. ప్రజ్ఞాపూర్ మీదుగా రావాల్సి ఉంటుంది. ఇది రామగుండం వరకు విస్తరించిన రాజీవ్ రహదారి కావటంతో నిరంతరం వాహన రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. అల్వాల్ వరకు వచ్చాక సిటీ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తుండటంతో రోడ్డు మార్గం గుండా ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళ్లేందుకు 2 గంటల సమయం పడుతోంది. అదే రైలు మార్గం ఏర్పాటైతే అర గంటలోనే చేరుకునే వీలు కలగనుండటం రైతులు, ఇతర ప్రయాణికులకు ఎంతో కలిసొచ్చే అంశం. ప్రాజెక్టు వివరాలివీ.. ప్రాజెక్టు: మనోహరాబాద్–కొత్తపల్లి(కరీంనగర్) నిడివి: 151.36 కి.మీ. అంచనా వ్యయం: రూ.1,160 కోట్లు భూ సేకరణ: 2,020 ఎకరాలు 2017 బడ్జెట్లో రైల్వే కేటాయింపు: 350 కోట్లు తాజా బడ్జెట్ నిధులు: రూ.125 కోట్లు ప్రాజెక్టు తీరు: రాష్ట్ర ప్రభుత్వంతో కలసి రైల్వే చేపడుతున్న భాగస్వామ్య ప్రాజెక్టు యాన్యుటీ: ఐదేళ్ల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. దాన్ని యాన్యుటీ రూపంలో రైల్వే శాఖకు చెల్లించాలి. -
బంగారాన్ని స్క్రూ డ్రైవర్ రూపంలో తరలిస్తూ..
తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుకున్నారు. బంగారాన్ని టూల్ కిట్‌లోని స్క్రూ డ్రైవర్ రూపంలో తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయినా గానీ పోలీసులకు చిక్కాడు. పట్టుబడిన బంగారం రెండున్నర కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. గుహాహటి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.77 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం మయన్మార్ నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడిని డైరెక్టరేట్ ఆప్ రెవిన్యూ(డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గూడ్సు రైలులో అగ్నిప్రమాదం
గుంటూరు : తాడేపల్లి సమీపంలో గూడ్స్ రైలులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బొగ్గు నుంచి మంటలు వ్యాపించటాన్ని గుర్తించిన అధికారులు గూడ్సు రైలును నిలిపి వేశారు. ఫైరింజన్ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగడంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాద సమయంలో గూడ్సు రైలు ఒడిశా నుంచి చెన్నైకు వెళ్తోంది. అధికారులు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. -
పట్టాలు తప్పిన రైలు ఇంజన్
సాక్షి, మహానంది : కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి రైల్వేస్టేషన్లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఆదివారం ఉదయం రైలు ఇంజన్‌ను ట్రాక్ మారుస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. ఇంజన్‌కు బోగీలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. జరిగిన ప్రమాదం ప్రధాన ట్రాక్‌పై కాకపోవడంతో రైళ్లు యధాతథంగా నడుస్తున్నాయి. -
రైలు సీటుకింద రెండు నెలల పాప
సాక్షి, గుంటూరు : రెండు నెలల వయస్సున్న పాపను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రైలులో సీటు కింద వదిలి వెళ్లారు. విజయవాడ - ఒంగోలు ప్యాసింజర్ రైలులో సీటు కింద ఉన్న పాపను దుగ్గిరాల స్టేషన్ వచ్చాక ప్రయాణికులు గమనించారు. కాగా... తెనాలి రైల్వే పోలీసులకు పాపను అప్పగించగా వారు గుంటూరులోని చైల్డ్ వెల్ఫేర్ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. -
పొగమంచు కారణంగా పలు రైళ్ల రద్దు
న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీని మంగళవారం పొగమంచు కప్పేయడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో దారి కనిపించక 18 రైళ్లను రద్దు చేశారు. మరో 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో పాక్షికంగా వాతావరణం మేఘావృతం అయిందని ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఉదయం ఎనిమిదిన్నర సమయానికి గాలిలో తేమ 78 శాతంగా నమోదైందని, అలాగే విసిబిలిటీ 1500 మీటర్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు 25.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపారు. -
మంత్రాలయం రైల్వే లైన్‌కు రీసర్వే
– ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(రాజ్‌విహార్): మంత్రాలయం నుంచి కర్నూలు వరకు కొత్త రైల్వే లైను నిర్మాణానికి రీ సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై పార్లమెంటులో ప్రశ్నించానన్నారు. అయితే కర్నూలు – మంత్రాలయం మధ్య రోడ్డు ట్రాఫిక్ అంతంత మాత్రంగానే ఉందని, ఈ క్రమంలో రైల్వే లైను వేస్తే ప్రయాణికుల రద్దీ లేక తమ శాఖకు నష్టం వాటిల్లుతుందనే సమాధానం వచ్చిందన్నారు. అయితే ఇది వరకే చేసిన సర్వే 2010 సంవత్సరం నాటిదని, ప్రస్తుతం ఏడేళ్లు గడిచాయని.. మంత్రాలయానికి భక్తుల రద్దీ పెరిగడంతో పాటు పశ్చిమ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరోసారి సర్వే చేయాలని ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు. -
కోనసీమ రైలుకు పచ్చజెండా
నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏళ్ల తరబడి ఊరిస్తున్న నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ సాకారమయ్యే రోజులొచ్చాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొనడంతో పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించి, స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్‌ల భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించగా.. అందులో ఇది రెండవది. ఇది పూర్తయితే అన్నపూర్ణగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం నుంచి ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ నరసాపురం నుంచి కోనసీమలోని అమలాపురం మీదుగా కోటిపల్లి వరకూ వెళ్తుంది. కోటిపల్లి నుంచి కాకినాడ వరకు ఇప్పటికే రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం మీదుగా చెన్నై పోర్టులను కలుపడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం విశాఖవిజయవాడ చెన్నై ప్రధాన రైల్వే చాలా రద్దీగా ఉంది. నరసాపురంకోటిపల్లి లైన్ నిర్మాణం పూర్తయితో సరకు రవాణాకు ఉపయోగపడుతుంది. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి పెట్రోలియం, సహజవాయు ఉత్పత్తులు తరలించడానికీ పనికొస్తుంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి 199798లో అమలాపురం మీదుగా నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మొదట కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45 కిలోమీటర్ల మార్గాన్ని రూ.74 కోట్లతో వేసి 200304లో ప్రారంభించారు. ప్రస్తుతం కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తారు. దీని కోసం భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయ్యిది. గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఎట్టకేలకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం అయ్యే అవకాశం ఏర్పడింది. బ్రాంచ్‌లైన్‌కు రూ.122 కోట్లు విజయవాడభీమవరం నిడదవోలు వరకూ ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ రైల్వేలైన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. 221 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. -
కోనసీమ రైలుకు పచ్చజెండా
నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏళ్ల తరబడి ఊరిస్తున్న నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ సాకారమయ్యే రోజులొచ్చాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొనడంతో పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించి, స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్‌ల భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించగా.. అందులో ఇది రెండవది. ఇది పూర్తయితే అన్నపూర్ణగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం నుంచి ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ నరసాపురం నుంచి కోనసీమలోని అమలాపురం మీదుగా కోటిపల్లి వరకూ వెళ్తుంది. కోటిపల్లి నుంచి కాకినాడ వరకు ఇప్పటికే రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం మీదుగా చెన్నై పోర్టులను కలుపడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం విశాఖవిజయవాడ చెన్నై ప్రధాన రైల్వే చాలా రద్దీగా ఉంది. నరసాపురంకోటిపల్లి లైన్ నిర్మాణం పూర్తయితో సరకు రవాణాకు ఉపయోగపడుతుంది. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి పెట్రోలియం, సహజవాయు ఉత్పత్తులు తరలించడానికీ పనికొస్తుంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి 199798లో అమలాపురం మీదుగా నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మొదట కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45 కిలోమీటర్ల మార్గాన్ని రూ.74 కోట్లతో వేసి 200304లో ప్రారంభించారు. ప్రస్తుతం కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తారు. దీని కోసం భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయ్యిది. గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఎట్టకేలకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం అయ్యే అవకాశం ఏర్పడింది. బ్రాంచ్‌లైన్‌కు రూ.122 కోట్లు విజయవాడభీమవరం నిడదవోలు వరకూ ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ రైల్వేలైన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. 221 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
నరసరావుపేటటౌన్ : రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వేపోలీసుల కథనం ప్రకారం రైల్వేఫ్లాట్‌ఫాం–1 మరుగుదొడ్ల వద్ద గల రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న ౖరైల్వే ఎస్ఐ సత్యన్నారాయణ, హెడ్‌కానిస్టేబుల్ పీరాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తెల్లవారుజామున రైలుకింద పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి ఉండి 5.2అడుగుల ఎత్తు ఉన్నాడు. ఒంటిపై పాచిరంగు మోకాళ్ళవరకు చినిగిన జీన్స్‌పాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియావైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్ళు తెలిసినవారు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు అర్బ¯ŒS : రైలు పట్టాలపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఏలూరు రైల్వే స్టేష¯ŒS సమీపంలోని టింబర్ డిపో వద్ద మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారించినా ఫలితం లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీ కొట్టడంతో మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వయసు 45 సంవత్సరాల వరకూ ఉంటుందని చెబుతున్నారు. -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
ఏలూరు అర్బన్ : రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడొకరు మరణించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెరవలి మండలం కాకరపర్రు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సంగీత వీర రాఘవులు (75) ద్వారకాతిరుమల వెళ్లేందుకు మంగళవారం తాడేపల్లిగూడెం నుంచి రైలులో భీమడోలు జంక్షన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమల వెళ్లేందుకు బస్ ఎక్కేందుకు పట్టాలు దాటే క్రమంలో అదే సమయంలో అటుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడ్ని రైల్వే పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆయన ఆసుపత్రిలోనే మృతిచెందారని రైల్వే హెచ్‌సీ జాన్సన్ తెలిపారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం : రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం గూడ్స్‌షెడ్ వద్ద జరిగింది. 30 ఏళ్ల ఓ యువకుడు విజయవాడ వైపు వెళ్లే రైలు కింద పడి మరణించాడు. అతను ఆకుపచ్చరంగు గడులు కలిగిన పొడవు చేతుల చొక్కా, సిమెంటు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. గిరజాల జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యచేసుకున్నాడో తెలియరాలేదు. మృతుని వివరాలు తెలిసిన వారు 9989076365 నంబరుకు తెలియజేయాలని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎ.వెంకన్నబాబు కోరారు -
అన్ని సేవలు ఒకే యాప్ తో..త్వరలో
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని మిగిల్చేందుకు రైల్వే శాఖ తన యాప్ ను సరికొత్తగా సిద్ధం చేస్తోంది. తన ప్రయాణీకుల అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు మొబైల్ అప్లికేషన్ ను పునరుద్ధరిస్తోంది. టికెట్ బుకింగ్ దగ్గర్నుంచి, భోజనం, క్యాబ్ లతో పాటు పోలీస్, వైద్యం లాంటి అత్యవసర సేవలను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం ఒక సమగ్ర (ఇంటిగ్రేడెట్) మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ ఫేర్ డైరెక్టరేట్ అధికారి ఒకరు తెలిపారు. టాక్సీ, టికెట్ బుకింగ్ నుంచి మొదలు భోజనం ఆర్దరింగ్, పోర్టర్ సేవలు, రిటైర్ రూం లాడ్జింగ్, బెడ్ రోల్ ఆర్డర్, కోచ్ లో అపరిశుభ్రత పై ఫిర్యాదు, డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్, హోటల్ రిజర్వేషన్లు, వెయిటింగ్ లిస్ట్ రైలు టికెట్ విషయంలో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ తదితర ఇతర సేవలు ఈ యాప్ ద్వారా లభించనున్నాయని ఆయన తెలిపారు. రైల్వేల కోసం ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఈ యాప్ ను ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే వైద్య సౌకర్యాలను, అత్యవసర విషయంలో పోలీసులకు ప్రయాణీకులు కనెక్ట్ అయ్యేలా మూడు దశల్లో ఈ అప్లికేషన్ విస్తరించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా సంవత్సరానికి సంస్థ డిజిటల్ ఆస్తుల విలువ రూ.500 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నామన్నారు. కాగా రైల్వేల మొత్తం ఆదాయంలో 5 శాతంగా ఉ న్న నాన్ ఫేర్ ఆదాయాన్ని 10 -20 శాతానికి పెంచే లక్ష్యంతో ఉన్నట్టు బడ్జెట్ ప్రసంగంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మారిన రైళ్ల రాకపోకల వివరాలు
ఏలూరు అర్బన్ : ఏలూరు రైల్వేస్టేçÙన్ మీదుగా వెళ్లే మూడు రైళ్ల రాకపోకల వేళలు శనివారం నుంచి మారినట్టు ఏలూరు రైల్వేస్టేçÙన్ మేనేజర్ ఏవీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లే 22416 నంబర్ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి మధ్యాహ్నం 1.10కి వచ్చి 1.12కి బయలుదేరుతుందన్నారు. హౌరా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే 18645 నంబర్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.15కి ఏలూరు వచ్చి 9.17కి వెళుతుందని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే 12806 నంబర్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 2.15 నిమిషాలకు వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
గేట్ మధ్యలో నిలిచిన గూడ్స్
యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లి రైల్వే గేట్ వద్ద ఓ గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో గేట్ గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మధ్యాహ్నాం 2.55 గంటలకు వంగపల్లి స్టేషన్‌కు చేరుకునే క్రమంలో సాంకేతిక లోపంతో గేట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో వరంగల్ జిల్లా నుంచి యాదాద్రికి వచ్చే వాహనాలన్నీ గేట్ వద్దే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించి సాయంత్రం 5.30 గంటలకు రైలును అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో రాకపోకలు పునప్రారంభం అయ్యాయి. -
92 పైసలకే రూ.10 లక్షల బీమా
సాక్షి.సిటీబ్యూరో: రైలు ప్రయాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా....ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా... అయితే టిక్కెట్‌తో పాటే ప్రయాణ బీమాను సైతం నమోదు చేసుకోవడం మరిచిపోవద్దు. రైల్వేశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బీమా సదుపాయం వల్ల ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది. కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుతో ఈ బీమా సదుపాయాన్ని పొందవచ్చు. ఈ నెల 1నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకొనే సమయంలో టిక్కెట్ రిజర్వేషన్ బుక్ అయిన వెంటనే 92 పైసల ప్రీమియం చెల్లిస్తే చాలు. రైల్వేశాఖ అమల్లోకి తెచ్చిన బీమా పరిధిలో చేరిపోతారు. ట్రైన్ ఎక్కే సమయం నుంచి గమ్యస్థానానికి చేరుకొని ట్రైన్ దిగే వరకు బీమా వర్తిస్తుంది. ఒక టిక్కెట్‌పై ఎంతమంది ప్రయాణికులు బుక్ అయితే అంతమందికి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు బీమా కోసం నమోదు చేసుకోవడం గమనార్హం. లక్షలాది మందికి ప్రయోజనం... తరచుగా ఎక్కడో ఒక చోట రైలుప్రమాదాలు, బోగీల దహనం, రైలెక్కబోతూ,దిగబోతూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. ప్రమాద దుర్ఘటనల్లో రైల్వేశాఖ స్వతహాగా పరిహారం చెల్లిస్తున్నప్పటికీ ప్రయాణికులు సైతం స్వయంగా బీమా చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు మినహా అన్ని వయస్సుల ప్రయాణికులు ఈ బీమా పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ టిక్కెట్లు తీసుకొనే వాళ్లకు ఇది వర్తిస్తుంది. కనీస టిక్కెట్ చార్జీలతో కానీ, గరిష్ట చార్జీలతో కానీ నిమిత్తం లేకుండా ఆన్లైన్లోనే టిక్కెట్ బుక్ చేసుకొన్న వెంటనే ‘ఇన్సూరెన్స్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రయాణికులు తమ ఖాతాలోంచి 92 పైసలు సదరు బీమా సంస్థ ఖాతాలోకి బదిలీ చేయాలి. వెంటనే ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. బీమా వివరాలు ఈ మెయిల్‌కు చేరుతాయి. బీమా ఎంపిక చేసే సమయంలో ఒక టిక్కెట్ పీఎన్ఆర్ నెంబర్‌పైన ఎంత మంది ప్రయాణికులు ఉంటే అంతమందికి బీమా ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తాన్ని చెల్లించవలసి వస్తే ఎవరికి అందజేయాలో తెలిపే నామిని వివరాలను కూడా నమోదు చేయాలి. 40 శాతం ఆన్లైన్ రిజర్వేషన్లే.. దక్షిణమధ్య రైల్వేలో ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తారు. వీరిలో 40 శాతానికి పైగా ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్లు నమోదు చేసుకుంటారు. ఈ ఆన్లైన్ ప్రయాణికులు ‘ఇన్సూరెన్స్’ ప్రీమిం చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 17 బీమా కంపెనీలో ఈ పథకం కోసం పోటీ పడగా 3 కంపెనీలకు మాత్రమే అవకాశం లభించింది. శ్రీరాం జనరల్ ఇన్సూ్యరెన్స్, రాయల్ సుందరం, ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఐఆర్సీటీసీకి అనుసంధానమై ఉన్నాయి. ప్రమాదం జరిగితే... దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే 4 నెలలోపు బీమా సొమ్మును రాబట్టుకోవాలి. 15 రోజుల్లోపు ఈ ప్రక్రియ ముగిస్తారు. ప్రమాదం జరిగిన నాలుగు నెలలు దాటిన తరువాత వెళితే సదరు బీమా పథకం వర్తించదు. ప్రయాణికులు ఏ ప్రమాదం వల్ల గాయపడ్డారో, చనిపోయారో తెలిపే ఆధారాలను బీమా క్లెయిమ్ చేసుకొనే సమయంలో అందజేయాలి. సంఘటన వివరాలను తెలియజేసే ఎలాంటి ఆధారాలనైనా పరిగణనలోకి తీసుకొని బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షలు లభిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు చెల్లిస్తారు. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చేరితే రూ.2 లక్షలు లభిస్తుంది. మృతులకు బీమా మొత్తంతో పాటు, రవాణా ఖర్చుల కోసం రూ.10 వేల వరకు చెల్లిస్తారు. ప్రమాద ఘటనల్లో రైల్వేశాఖ చెల్లించే పరిహారానికి, బీమాకు ఎలాంటి సంబంధం ఉండదు. -
రైలు ప్రమాదంలో యువకుడు మృతి
ఉద్యోగం కోసం వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం శోక సంద్రంలో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం క్రైం : కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉవ్విళ్ళూరుతూ ఇంటికి చేరాల్సిన యువకుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న వాడే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరం సిద్దార్థ నగర్ కు చెందిన దాడి శివ(30) హోమ్ గార్డుగా ట్రైనింగ్ పొందేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగ నియమక పత్రంతో ఇంటికి చేరి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తుండగా సోమవారం ఉదయం గోదావరి రైల్వే స్టేషన్లో రైలు నెమ్మదిగా వెళ్తుండగా రన్నింగ్ లో దిగిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొని వేగంగా వెనక్కు వచ్చి రైలు కింద పడిపోయి ఎడమ చేయి తెగిపోయి తీవ్ర గాయాలపాలైయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్త స్రావం కావడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వద్ద బ్యాగ్‌లో ఉన్న సర్టిఫికెట్లు, టికెట్ ఆధారంగా చిరునామా గుర్తించారు. ప్రమా దంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శోక సముద్రంలో కుటుం సభ్యులు మృతుడు దాడి శివకు భార్య, ఒక పాప ఉన్నారు. ఉద్యోగం సంపాదించి తమ కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుటుంబ సభ్యుల ఆశలు అడి ఆశలయ్యాయి. ఉద్యోగ నియామక పత్రం చూపించి తమ కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకోవాలని సంతోషంతో వచ్చిన శివ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది. కుటుంబ సభ్యుల రోదనలతో ప్రభుత్వ ఆస్పత్రి మారుమ్రోగింది. -
28 వరకు విజయవాడ రైలు గుంటూరు వరకే
నూనెపల్లె: విజయవాడ రైల్వే స్టేషన్లో చేపడుతున్న రూట్‌లింక్ ఇంటర్నల్ లాకింగ్ మరమ్మతుల కారణంగా నంద్యాల నుంచి విజయవాడ వరకు వెళ్లే రైళ్లను గుంటూరు వరకే నడుపుతున్నట్లు రైల్వే సీపీఐ జయరాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ హుబ్లీ–విజయవాడ, యశ్వంత్‌పూర్–విజయవాడ రైళ్లు గుంటూరు వరకే వెళ్తాయని తెలిపారు. మరమ్మతు పనులు ఈనెల 28వ వరకు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు మార్పును గమనించాలని కోరారు. -
రైలులో ఏం జరిగింది?
‘ధనుష్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తొడరి’ని ‘రైల్’ పేరుతో బేబి రోహిత రజ్న సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. నేడు రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు జరిగే రైలు ప్రయాణమే ఈ చిత్రం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ధనుష్, కీర్తిల నటన హైలెట్. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్ మహేంద్రన్, సంగీతం: డి.ఇమ్మాన్, దర్శకత్వం: ప్రభు సాల్మన్. -
లింక్ తెగి.. ముందుకెళ్లిన రైలింజన్
డోన్ టౌన్: లింక్ తెగిపోవడంతో డోన్ నుంచి గుత్తికి వెళ్లే ప్యాసింజర్ రైలింజన్..బోగీలు లేకుండా వంద మీటర్లు ముందుకు వెళ్లింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కాసేపు ఆందోళనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం గ్రహించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇంజిన్‌ను వెనక్కు తెచ్చి బోగీలతో లింక్‌ను సరిచేయడంతో 30 నిమిషాలు ఆలస్యంగా ప్యాసింజర్ రైలు గుత్తికి బయలుదేరింది. -
పార్సిల్ బిజినెస్‌పై ఇండియా పోస్ట్, రైల్వే దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని పార్సిల్ బిజినెస్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇండియా పోస్ట్, రైల్వేలు సంయుక్తంగా ముందుకెళ్లనున్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై అధిక దృష్టి కేంద్రీకరించనున్నాయని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇటీవలే రైల్వే, ఇండియా పోస్ట్ మధ్య ఒక సంయుక్త సమావేశం జరిగిన విషయం విదితమే. ‘రైల్వేకు ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇండియా పోస్ట్‌కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ రెండు కలిసి ముందుకెళితే పార్సిల్ వ్యాపారంలో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు’ అని మనోజ్ సిన్హా తెలిపారు. గ్రామీణ ప్రాంతాలోని పార్సిల్ బిజినెస్‌లో ఇండియా పోస్ట్‌కి కొద్దిగా, రైల్వేకి 3-4 శాతం వాటా ఉందన్నారు. పోస్టల్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ.. దీని బోర్డు ఏర్పాటు జరిగిందని, సీఈవో నియామకం కోసం వెతుకులాట ప్రారంభమైందని చెప్పారు. కాగా, పోస్టల్ విభాగం(డీవోపీ) 57 ఇంటిగ్రేటెడ్ పార్సిల్ బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. డీవోపీ ఇప్పటికే రూ.101-రూ.151 ధర శ్రేణిలో గంగాజల్(గంగోత్రి, రిషికేశ్‌లోని నీరు) బాటిళ్లను విక్రయిస్తోంది. -
రైలు నుంచి జారిపడి అనంత లోకాలకు..
ఏలూరు అర్బన్ : గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నూజివీడు రైల్వేస్టేçÙన్కు కొద్దిదూరంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం పట్టాలపై పడి ఉందని ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై రాము సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుడి వయసు 25 ఏళ్లు ఉండవచ్చని గులాబీ, నలుపు, తెలుపు గళ్ల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి, చామన చాయతో ఉన్నాడని ఎస్సై చెప్పారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94408 27572 నంబర్లో తెలియజేయాలని కోరారు. -
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
డోన్ టౌన్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్మామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గోపినాథ్ మాల్యా అన్నారు. డోన్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సీనియర్ సెక్షన్ ఇంజినీరింగ్ కార్యాలయాన్ని మాల్యా దంపతులు సోమవారం ప్రారంభించారు. తర్వాత నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ రైల్వే డీఈ సూరబ్ కుమార్, ఏడీఏ గౌతమ్, ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి ఖాజా, రైల్వే సిబ్బంది శశిధర్, మల్లిఖార్జున, దామోదర్,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి పడి ప్రయాణికుడికి గాయాలు
కాజీపేట : రైలులో తలుపు వద్ద కూర్చొని పరిసరాలను చూస్తుండగా ఓ యువకుడు పట్టాలపై పడి తీవ్ర గాయాలపాలైన సంఘటన రఘునాథపల్లి స్టేషన్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. కాజీపేట జీఆర్పీ ఎస్సై దయాకర్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముల్కపల్లి మండలం పాటూర్‌కు చెందిన సాద్యమ్ బోజి(40) మిత్రులతో కలిసి ఇటీవల కూలీ పనుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. వర్షాకాలం కావడంతో అక్కడ ఆశించిన పనులు దొరకలేదు. దీంతో స్వగ్రామానికి చేరుకునేందుకు సికింద్రాబాద్‌లో కాకతీయ ప్యాసిం జర్ ఎక్కాడు. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో గేట్ వద్ద కూర్చున్నాడు. ఈక్రమంలో రఘునాథపల్లి స్టేషన్ దాటిన తర్వాత వచ్చిన క్రాసింగ్‌లో కింద పడిపోయాడు. దీంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తిం చిన మిత్రులు కాజీపేట జీఆర్పీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతడిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
ముంబైలో భారీ వర్షాలు.. హై అలర్ట్..!
ముంబైః భారీవర్షాలు ముంబైని ముంచెత్తాయి. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాణిజ్యనగరంలో జన జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్ లు, ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ళు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచీ పడుతున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ఉదయం ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రైల్వే ట్రాక్ లపై నీరు నిలిచిపోవడంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పశ్చిమ, మధ్య రైల్వే కు చెందిన అనేక సబర్బన్ రైళ్ళు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సియాన్-కుర్లా మధ్య రైల్వే ట్రాక్ లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, కారణంగా ముంబైనుంచీ బయల్దేరాల్సిన, ముంబైకి రావాల్సిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సైతం అరగంట నుంచీ గంట వరకూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే మార్గాలు మళ్ళించడం, కాన్సిలేషన్స్ వంటి మార్పులేమీ లేవని, కేవలం ఆలస్యం మాత్రమే అవుతున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముంబైకి దగ్గరలోని థానె, పాల్ఘర్, రాయ్ ఘడ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో అహ్మదాబాద్, పూనె, నాసిక్, గోవాలనుంచి ముంబైకి చేరే మార్గాలన్నింటిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రాగల 48 గంటల్లో ముంబైతోపాటు, కొంకణ్ తీరప్రాంతాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా రాష్ట్రంలోని పోలీస్, అగ్నిమాపక, ఎన్డీ ఆర్ ఎఫ్ విభాగాలకు హై అలర్ట్ ప్రకటించింది. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. -
ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ
నరసరావుపేటటౌన్: ఎక్స్‌ప్రెస్ రైల్లో బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. రైల్వేపోలీసుల కథనం ప్రకారం నంద్యాలకు చెందిన జి.రత్నకుమారి గుడివాడలో జరిగే ఆమె తమ్ముడి నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు గురువారం రాత్రి నంద్యాలలో కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు రైలు నరసరావుపేట స్టేషన్లో ఆగింది. రైలు బయలుదేరే సమయంలో బ్యాగ్ చూసుకోగా వెనుకభాగం బ్లేడ్‌తో కత్తిరించి ఉండటాన్ని గమనించింది. అందులో ఉండాల్సిన సుమారు మూడు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన రత్నకుమారి కేకలు వేస్తూ చైన్ లాగగా రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యన్నారాయణ , సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని బాధితురాలిని విషయం అడిగి తెలుసుకొన్నారు. మార్కాపురంలో రైలెక్కిన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా సంచరిస్తూ నరసరావుపేటలో దిగినట్లుగా ఆమె తెలిపింది. దీంతో ఆ ఇద్దరు మహిళలకోసం పోలీసులు రైల్లో గాలింపు చర్యలు చేపట్టగా ఎటువంటి ఫలితం దక్కలేదు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రైలు నుంచి జారిపడిన వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్ : నౌపడ గ్రామ సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... బరంపురానికి చెందిన సంజయ్ కూలి పనుల నిమిత్తం ఆదివారం రైలులో బరంపురం నుంచి చెన్నై రైలులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో సంతబొమ్మాళి మండల సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడుని టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నంద్యాల– ఎర్రగుంట్ల మార్గంలో రైళ్ల రాకపోకలు
– రెండు డెమో రైళ్లు మంజూరు – మరో పదిరోజుల్లో పట్టాలెక్కే అవకాశం నూనెపల్లె: నంద్యాల నుంచి ఎర్రగుంట్ల (కడప)కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు డెమో రైళ్లను వేశారు. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు (77401, 77403), ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు (77402, 77404) రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రారంభించాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో మరో పదిరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 163 కిలోమీటర్ల దూరాన్ని 3.55 గంటల సమయం పడుతుందన్నారు. రైళ్లు నంద్యాల నుంచి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, యు. ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, గంగాయిపల్లె, కష్ణాపురం మీదుగా కడపకు చేరుకుంటాయి. -
ఎర్రగుంట్ల.. నంద్యాల రైలు నడిచేనా!
♦ రేపు జిల్లాకు రానున్న సీఆర్ఎస్ ♦ సీఆర్ఎస్ ఓకే అంటే రైలు కూత మొదలు ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకు రైలు మార్గం పూర్తయింది. ఇక సీఆర్ఎస్( కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ) పరిశీలించి ఓకే అంటే ఈ మార్గంలో రైళ్లను నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఆర్ఎస్ ఈ నెల 20వ తేదిన ఎర్రగుంట్ల- నంద్యాల రైల్వే ట్రాక్ పరిశీలనకు రానున్నట్లు తెలిసింది. ఈ రైలు మార్గాన్ని ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో కొత్త బ్రాడ్ గేజ్ లైన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.950 కోట్లు ఖర్చు చేయునుంది. ఈ లైన్ మధ్య ఎనిమిది రైల్వే స్టేషన్లు వస్తాయి. ఎర్రగుంట్ల నుంచి మొదలుపెడితే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్లు వస్తాయి. ఇప్పటికే ఆయా స్టేషన్లకు సంబంధిత సిబ్బందిని గతంలోనే నియమించారు. ఈ రైల్వేలైన్ మధ్య ప్రధాన వంతెనలు 4, మేజర్ వంతెనలు 27, చిన్న వంతెనలు 436 దాకా ఉన్నాయి. సాధించిన ప్రగతి.. ఈ లైన్ మొత్తం 123 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే ఇందులో ఎర్రగుంట్ల-నొస్సంల మధ్య 48 కిలోమీటర్లు పూర్తయింది. ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక నొస్సం- బనగానపల్లె మధ్య 45 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బనగానపల్లె- నంద్యాల మధ్య సుమారు 30 కిలో మీటర్ల దాకా నిర్మాణంలో ఉంది. ఈ లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్ వల్ల లాభాలు .. ఈ రైలు మార్గం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కర్నూలు, కడప జిల్లాలతో అనుసంధానం చేయనుంది. అంతేకాక జిల్లాలో పుణ్యక్షేత్రాలయిన దేవుని కడప, కడప పెద్ద దర్గా, ప్రొద్దుటూ రు శ్రీ కన్యాక పరమేశ్వరీ ఆలయం, గండికోట తదితర దర్శనీయ ప్రదేశాలు దేశానికి పరిచయమవుతాయి. ఇంకా చెప్పాలంటే ఎర్రగుంట్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమల వృద్ధితో పాటు రవాణా సౌకర్యం, ఉపాధి కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే లైన్లో త్వరగా రైలు నడిపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాని ప్రజలు కోరుతున్నారు. -
నేపాల్ రైలు.. బీహార్ వరకు!
బీజింగ్ః ఇప్పటికే టిబెట్ ద్వారా తన రోడ్ అండ్ రైల్వే నెట్వర్క్ ను నేపాల్ వరకు విస్తరించిన చైనా ఇప్పుడు భారత దేశంపై దృష్టి సారించింది. భారత్ తో వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నంలో భాగంగా రైల్ లింకును ఇండియాలోని బీహార్ వరకూ పొడిగించేందుకు చైనా ఆలోచన చేస్తోంది. నేపాల్ కొత్త రాజ్యాంగం ప్రభావంతో భారత్ నేపాల్ కు సరకు రవాణా నిలిపేసింది. ఈ నేపథ్యంలో చైనాతో నేపాల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే చైనానుంచి నేపాల్ వరకు రైల్, రోడ్డు నిర్మాణాలకు సన్నాహాలు చేస్తోంది. చైనా రైల్ రోడ్ నిర్మాణం 2020 నాటికి నేపాల్ సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఆ దేశ అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ కొత్త రైల్వే లైన్ చైనా నుంచి భారత్ కు కలిపేందుకు కేవలం 240 కిలోమీటర్లు అంటే... రసువగధి నుంచి బిర్ గంజ్ వరకు నిర్మిస్తే సరిపోతుందని కూడ వెల్లడించింది. రైల్ లింక్ వల్ల బీహార్ కు చైనాతో వాణిజ్యం సులభం అవుతుందని, కలకత్తా ద్వారా జరిపేకంటే ఈ మార్గం ద్వారా వాణిజ్యం సులభం కావడంతోపాటు దూరం, ఖర్చు కూడ కలసి వస్తుందని పత్రికా కథనంలో తెలిపింది. చైనా రైల్ రోడ్ కనెక్షన్ వల్ల నేపాల్, నేపాలీ ప్రజల అభివృద్ధి మాత్రమే కాదని, దక్షిణాసియా మొత్తాన్ని అనుసంధానం చేయడంతోపాటు, నేపాల్ ప్రభుత్వం చరిత్ర సృష్టించే అవకాశం ఉందని కథనం వెల్లడించింది. ఇందుకు నేపాలీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని చైనా అభిప్రాయపడుతోంది. -
మన మెట్రో
-
ఒకప్పుడు చెన్నై..మరి ఇప్పుడు
-
మౌంట్ ఎవరెస్ట్ మీదుగా నేపాల్‌కు రైలు
బీజింగ్ : భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటున్న డ్రాగన్ మరో ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. భారత్ మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు చైనా రంగంలోకి దిగింది. చైనా నుంచి నేపాల్‌కు ప్రపంచంలో అత్యంత ఎతైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ మీదుగా రైలు మార్గం వేయాలని నిర్ణయించినట్లు ఆ దేశ రైల్వే రంగం నిపుణుడు వాంగక మెంగ్ష్ స్థానిక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. టిబెట్ ప్రాంతంలోని మౌంట్ ఎవరెస్ట్ కొమలంగ్మా శిఖరం అడుగు భాగాన సొరంగం తవ్వనున్నట్లు తెలిపారు. భారీ పొడవైన సొరంగం నిర్మించవలసి ఉంటుందన్నారు. పర్వత ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ... ఈ నేపథ్యంలో రైలు వేగం 120 కిలోమీటర్లు మించకూడదని వాంగక మెంగ్ష్ పేర్కొన్నారు. చైనా గతంలో నేపాల్‌తో వ్యాపారం బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వింగ్హై - లాసా మార్గంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అయితే కొత్తగా సొరంగ మార్గం ద్వారా నేపాల్‌కు రైల్వే లైన్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన భారత్‌లో ప్రవేశించేందుకు నేపాల్ రైలు మార్గాన్ని చైనా ఉపయోగించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ వాదన మోసపూరితం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర రాజధాని అన్ని జిల్లాలకు మధ్యలో ఉండాలనే వాదన మోసపూరితమని రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్ఎస్ఎఫ్) కన్వీనర్ భాస్కర్, కో-కన్వీనర్ దస్తగిరి, నగర కన్వీనర్ కల్యాణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు వీరు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలనడం విజయవాడ-గుంటూరుకు తీసుకెళ్లే కుట్రలో భాగమేనని విమర్శించారు. సమైక్యాంధ్ర రాజధానిగా ఉన్న హైదరాబాదు, తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగుళూరు అలాగే మరెన్నో రాష్ట్రాల రాజధానులు మధ్యభాగంలో లేవనే విషయం నాయకులకు తెలీదా అని ప్రశ్నించారు. అసలు దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉందా అంటూ వారు నిలదీశారు. విశాలాంధ్ర విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్చించడమే అనవసరమన్నారు. 1937 నాటి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని ‘సీమ’లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి విరుద్ధంగా రాజధానిని కోస్తాకు తరలించుకుపోతున్నా ‘సీమ’లో అడిగే నాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడిన పాలకులు నేడు రాజధాని, పారిశ్రామిక కారిడార్, ఎయిమ్స్, మెట్రో రైలు, రైల్వేజోన్ వంటి ప్రాజెక్టులన్నిటినీ కోస్తాకే తరలిస్తున్నారని తెలిపారు. ఇకనైనా రాయలసీమ ప్రజలు మేల్కొని ఉద్యమించకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఆందోళనలో రాయలసీమ విద్యార్థి వేదిక వైవీయూ కన్వీనర్ నాగార్జున, కో-కన్వీనర్ నాగరాజు, సభ్యులు ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ఛార్జీల పెంపుపై మండిపడ్డ విపక్షాలు