రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
Published Sat, Oct 15 2016 1:41 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
తాడేపల్లిగూడెం : రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం గూడ్స్‌షెడ్ వద్ద జరిగింది. 30 ఏళ్ల ఓ యువకుడు విజయవాడ వైపు వెళ్లే రైలు కింద పడి మరణించాడు. అతను ఆకుపచ్చరంగు గడులు కలిగిన పొడవు చేతుల చొక్కా, సిమెంటు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. గిరజాల జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యచేసుకున్నాడో తెలియరాలేదు. మృతుని వివరాలు తెలిసిన వారు 9989076365 నంబరుకు తెలియజేయాలని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎ.వెంకన్నబాబు కోరారు
Advertisement
Advertisement