వివాహేతరం సంబంధం..యువకుడి ఆత్మహత్య | Illegal affair..young committed suicide | Sakshi
Sakshi News home page

వివాహేతరం సంబంధం..యువకుడి ఆత్మహత్య

Published Fri, Mar 30 2018 10:34 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Illegal affair..young committed suicide - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చోడవరానికి చెందిన ఇలిశెట్టి రాజశేఖర్(30)గా గుర్తించారు. వివాహేతర సంభంధమే ఈ ఆత్మహత్యకు కారణమని రాజశేఖర్‌ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు చోడవరానికి చెందిన మిత్రులకు పంపిన సెల్ఫీ వీడియో ద్వారా తెలిసింది.

రాజశేఖర్‌కు 5 సంవత్సరాల క్రితం రాణి అనే యువతితో వివాహం జరిగింది. పిల్లలు లేరు. ఆరు నెలల క్రితం నుంచి చోడవరం అంబేరుపురానికి చెందిన ఓ మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భర్త వదిలివేసిన ఆమెకు ఒక పాప ఉంది. శుక్రవారం ఉదయం 5గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మిత్రులకు వాట్సప్‌ ద్వారా తెలియపర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement