tp gudem
-
గూడెంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రైతు బజార్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తాడేపల్లిగూడెంలో రూ.2.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైతుబజార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రాధాన్యతా రంగాల ప్రగతి తీరుపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. తాడేపల్లిగూడెంతో పాటు 45 మండలాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో భారీ కోల్డ్ స్టోరేజీ యూనిట్‌తో పాటు ఆధునిక సౌకర్యాలతో హోల్‌సేల్ రైతు బజార్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆరు నెలల్లో ఈ ఆధునిక రైతు బజారును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన తోటల పెంపకం, పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. ప్రతి రైతు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే 20 శాతం అదనపు ఆదాయం అర్జించుకోగలుగుతాడని అన్నారు. యంత్ర సాయంతో పంట ఉత్పత్తులను కటింగ్ చేస్తే పాడవకుండా తాజాదనంతో ఉంటాయన్నారు. అపరాల సాగు పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సబ్సిడీ సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. పాలసేకరణలో ముందంజ వేయాలి ప్రైవేటు డెయిరీలకు దీటుగా పాలసేకరణ ధరను పెంచామని, ఇటువంటిస్థితిలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాలసేకరణ ముమ్మరం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం లక్ష లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకరణ కేంద్రాలను సిద్ధం చేశామని, మరో లక్ష లీటర్ల సామర్థ్యం గల శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటులో ఉన్నామని తెలిపారు. పశుగ్రాసం కొరత లేకుండా పశువులకు అవసరమైన గడ్డిని పెంచేందుకు 5 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి, ఉద్యానవన శాఖ ఏడీ విజయలక్ష్మి, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
బలుసులమ్మకు మహా నివేదన
తాడేపల్లిగూడెం : గ్రామదేవత బలుసులమ్మ తల్లి ఆలయ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అమ్మవారికి మహాకుంభ నివేదన కార్యక్రమం జరిపారు. వారం రోజులుగా క్రతువులు, యాగాలు, ఆ«ధ్యాత్మిక ప్రవచనాలతో అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు ఘనంగా సాగాయి. దివ్యమంగళ రూపంలో నూతన ఆలయంలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రతిష్ఠామూర్తి, శ్రీచక్రానికి పూజాధికాలు నిర్వహిచారు. మహాకుంభనివేదనతో అమ్మను శాంతమూర్తిగా చేశారు. పులిహోర, బూరెలు, గారెలతో అమ్మ ప్రతిరూపాన్ని తయారు చేసి భక్తిని చాటుకున్నారు. బూందీ, తొక్కుడు లడ్డూలు, జాంగ్రీలు. మైసూర్‌పాక్‌లు వంటి స్వీట్లను అమ్మకు నైవేద్యంగా నివేదించారు. అనంతరం జరిగిన భారీ అన్న సమారాధనలో భక్తులకు వీటిని వడ్డించి అమ్మ అనుగ్రహంను అందించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ భాధ్యులు శ్రీరంగం అంజి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మ ఆవహించెను బలుసులమ్మ ఆవహించడంతో ఒక మహిళ నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించారు. పెద్దగా హావభావాలను ప్రదర్శిస్తూ శ్రీచక్రంపై ఉన్న కుంకుమను చేతితో తీసుకొని, అదే సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి మాణిక్యాలరావు నుదుటిన దిద్దింది. ఇదే సమయంలో మరికొంత మంది మహిళలు అమ్మ ఆవహించడంతో కాస్త హడావుడి చేశారు. శుక్రవారం మహానివేదనతో బలుసులమ్మ ఆలయ పున:ప్రతిష్ఠ కార్యక్రమాలు ముగిశాయి. -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ ఉగాది నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. సముద్ర తీరంలోని సైకత శిల్పం అందంగా ఉంటుంది. అలల తాకిడికి కరిగిపోతుంది. అలల్లో కలిసిపోతుంది. అలానే యువతీ యువకులు భ్రమల్లో బతుకుతున్నారు, వివాహబంధాలను వినాశనం చేసుకుంటున్నారు. ఆకర్షణలకు పోయి వాస్తవాలను విస్మరించి అపోహలతో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే సందేశంతో కళా రాధన (నంద్యాల) కళాకారులు ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శించారు. వివాహ బంధం అలలకు కరిగిపోయే సైకత శిల్పంలా కాకుండా సజీవ శిల్పంలా దృఢంగా నిలవాలని చాటిచెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు చూపే ప్రేమలో పరిమితి ఉండదనే సందేశంతో సాయి ఆర్ట్స్ (కొలుకులూరు) కళాకారులు ‘చాలు–ఇక చాలు’ నాటిక ద్వారా చాటిచెప్పారు. ముందుగా కర్నూలు జిల్లా బనగానపలి్లకి చెందిన కె.అంజలీనాథ్ ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నంద్యాలకు చెందిన సుంకర రాజశేఖర ప్రసాద్‌కు జీవన సాఫల్య ఉగాది పురస్కారాన్ని అందజేశారు. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చీడ
-
అవినీతి చీడ
తాడేపల్లిగూడెం : గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.1.85 లక్షలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ గునుపూడి రాజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన వ్యవహారం కలకలం రేపింది. రిజిస్ట్రేషన్ల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న అవినీతి వ్యవహారాన్ని ఈ ఘటన మరోసారి బట్టబయలు చేసింది. పట్టణ శివారు తాళ్లముదునూరుపాడుకు చెందిన వెలగల పట్టాభి రామిరెడ్డికి అతని వదిన 2013లో ఇచ్చిన గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజు రూ.1.85 లక్షలు డిమాండ్ చేయగా, పట్టాభిరావిురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ రాజుకు ఆ మొత్తం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రిజిస్ట్రార్ నుంచి రూ.1.85 లక్షలు, బడే సాహెబ్ అనే కమీషన్ ఏజెంట్ నుంచి నుంచి రూ.90 వేలు కలిపి రూ.2.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వేణుగోపాలరెడ్డి వెల్లడించారు. అవినీతికి చిరునామాగా.. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం అవినీతికి చిరునామాగా మారింది. పైరవీలు చేసినా ప్రోత్సహిం చేవారు, దోపిడీలో భాగస్వాములయ్యే వారికి ఇక్కడ కొదవ లేదు. తేడాలొస్తే సామాజిక వర్గం కార్డును ప్రయోగిస్తుంటారు. బినామీ రిజిస్ట్రేషన్లకు ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారింది. చివరకు చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను దస్తావేజులపై వేయించి రిజిస్ట్రేషన్లు చేయించే స్థాయికి ఇక్కడ అవినీతి ఎదిగిపోయింది. ఏసీబీ అయితే మాకేంటి, తేడాలొస్తే ఎవరిపైనైనా మేమే ఏసీబీ దాడి చేయించగలమంటూS ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు అవినీతి దందా నడిపిన ఘటనలు ఉన్నాయి. పై అధికారులకు సంతృప్తికర సేవలు అందించటం, వారి ఆశీస్సులతో అవినీతి వ్యవహారాలను చక్కబెట్టడం ఇక్కడ పనిచేసే వారి ప్రత్యేకత అనే అపప్రద ఉంది. అందువల్ల అవినీతి వ్యవహారాలు వెలుగుచూసినా, తదనంతర ఫలితాలు ఇక్కడ వారికి అనుకూలంగా ఉంటాయనే ప్రచారం ఉంది. మూడేళ్లలో రెండు దాడులు 2014 సెప్టెంబర్ 29న రాత్రి ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వ్యక్తిని, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ సెలవు పెట్టిమరీ కార్యాలయంలో ఉన్న అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. భీమడోలు ప్రాంతంలోని 30 ఎకరాల భూముల రిజిస్ట్రేష¯ŒSకు సంబంధించి పెద్ద మొత్తంలో చేతులు సొమ్ములు మారాయని ఏసీబీకి అందిన పక్కా సమాచారం మేరకు ఆ రోజు ఏసీబీ అధికారులు దాడి చేశారు. రికార్డుల్లో నమోదు చేయని రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇక్కడకు వచ్చిన సబ్‌రిజిస్ట్రార్ గునుపూడి రాజు పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక పొలం వ్యవహారానికి సంబంధించి తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వ్యక్తి సబ్‌రిజిస్ట్రార్ అవినీతి వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఇక్కడ కార్యాలయంపై ఏసీబీ దాడి తప్పదనే ప్రచారం జరిగినా ఆ తర్వాత కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్టు అనిపించింది. శుక్రవారం గునుపూడి రాజు రూ.1.85 లక్షలను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే కార్యాలయంలో దళారిగా వ్యవహరిస్తున్న బడే సాహెబ్ అనే వ్యక్తి నుంచి రూ.90 వేలు స్వాధీనం చేసుకున్నారు. అతడే చీడ రెండక్షరాల పేరు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులపై ఆజమాయిషీ. అతడు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నతాధికారి అనుకునేరు. అతనికి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అధికారికం గా ఎలాంటి సంబంధం లేదు. రికార్డు రూమ్ పర్యవేక్షణ నుంచి అవినీతి దందాల వరకు అతడే సేనాధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఎప్పుడు ఏసీబీ దాడి జరిగినా ఆ వ్యక్తి మాత్రం లాఘవంగా తప్పించుకుంటాడు. ఇందులో కిటుకేమిటో ఎవరికీ తెలియదు. శుక్రవారం కూడా అదే జరిగింది. ఆడిట్ అధికారులు వచ్చిన రెండు రోజుల్లోనే.. రెండు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలలో ఏం గుర్తించారనే విషయాలు తెలియలేదు గానీ.. రెండు రోజుల తర్వాత ఏసీబీ దాడి జరిగింది. 15 రోజుల పక్కా స్కెచ్‌తో సబ్ రిజిస్ట్రార్ బుక్ అయినట్టు ప్రచారం ఉంది. -
సర్కారీ గ‘మత్తు’
’సుప్రీం’ ఉత్తర్వుల నేపథ్యంలో మద్యం దుకాణాల తరలింపుపై దృష్టి షిఫ్టింగ్ చార్జీల వసూలుకు కసరత్తు 20న నూతన మద్యం విధానం విడుదల 22 నుంచి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ తాడేపల్లిగూడెం : ప్రజల అవసరాలను తీర్చడంలో వెనుక వరుసలో ఉండే ప్రభుత్వం కాసులు వచ్చే మార్గాలను వెతకడంలో మాత్రం ముందుంటోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం ఆదాయ వనరుగా మార్చుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది. జిల్లాలో మొత్తంగా 458 మద్యం దుకాణాలు ఉండగా.. వాటిలో 375 దుకాణాలను జాతీయ, ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీటిని ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంగా మార్చాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలను అనుసరించి ఆయా దుకాణాల యజమానులపై దుకాణం తరలింపు (షిఫ్టింగ్) చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిస్థితుల్లో మద్యం దుకాణానికి సంబంధించిన లైసెన్స్‌దారు దుకాణాన్ని మరో చిరునామాకు మార్చాల్సి వస్తే.. ఆ విషయాన్ని ఎక్సైజ్ శాఖకు తెలియజేసి వార్షిక లైసెన్స్ ఫీజుపై 1 శాతం మొత్తాన్ని షిఫ్టింగ్ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న 375 దుకాణాలను ఈ నెలాఖరులోగా దూరంగా తరలించడంతోపాటు వాటి నిర్వాహకుల నుంచి షిఫ్టింగ్ చార్జీల వసూలుకు ఏర్పాట్లు చేస్తోంది. కేటగిరీని బట్టి ఒక్కొక్క మద్యం షాపు నుంచి రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వార్షిక లైసెన్స్ ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ లెక్కన ప్రధాన రహదారి నుంచి తరలించాల్సిన ప్రతి మద్యం దుకాణ లైసెన్స్‌దారు నుంచి సగటున రూ.40 వేల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలల ముందే ముచ్చట మరోవైపు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుంది. అయితే.. ఇందుకు భిన్నంగా కొత్త లైసెన్స్‌లు ఇవ్వడానికి మూడు నెలల ముందుగానే ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈనెల 20న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని విడుదల చేయనుంది. ఆ రోజు రాత్రికి మార్గదర్శకాలు విడుదల అవుతాయని సమాచారం. కొత్త విధానంలోనూ 24 నెలలకే లైసెన్స్‌లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు భోగట్టా. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలను జాతీయ రహదారి, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల అవతల ఏర్పాటు చేస్తామని లైసెన్స్‌దారులు ప్రభుత్వానికి హామీ పత్రాలు రాసివ్వాల్సి ఉంటుంది. నూతన మద్యం పాలసీలో జిల్లావ్యాప్తంగా బార్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాపారుల్లో గుబులు లైసెన్స్ గడువు ముగియనున్న చివరి త్రైమాసికంలో మద్యం వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను వదిలించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అమ్మకాలకు సంబంధించి లైసెన్స్‌దారులకు ఇబ్బడిముబ్బడిగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేరకు మద్యాన్ని సరఫరా చేసింది. అమ్మకాలను పెంచే బాధ్యతను ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై ఉంచింది. దీంతో అమ్మకాలు ఉన్నా లేకున్నా అధికారుల ఒత్తిడి మేరకు దుకాణదారులు పెద్దఎత్తున మద్యం నిల్వలు ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు మద్యం దుకాణదారులకు చెంపపెట్టులా మారింది. చివరి మూడు నెలల పాటు వచ్చే కష్టనష్టాల నుంచి ప్రభుత్వం తమను ఒడ్డున పడేస్తుందని మద్యం వ్యాపారులు భావించారు. లైసెన్సుల కాలపరిమితి మరో మూడు నెలలు ఉండటంతో అప్పటివరకు వ్యాపారం చేయించుకోనిస్తారని ఆశించారు. వ్యాపారుల తరపున రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాడుతుందని భావించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. చివరి మూడు నెలలు ఎలాగోలా గడుపుకొద్దామని, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తారని భావించగా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటోందని దుకాణదారులు వాపోతున్నారు. ఇదే తరుణంలో ఉరమని ఉరుముగా కొత్త లైసెన్స్‌లకు నోటిఫికేషన్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం అనధికారికంగా తెలియచేసింది. -
వెంకన్న సన్నిధికి ఇంకో రైలు
నూతన సంవత్సర కానుకగా తిరుమలకు డబుల్ డెక్కర్ ట్రైన్ ఏసీ బోగీల్లో ప్రయాణం ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో హాల్ట్ తాడేపల్లిగూడెం : తిరుమలేశుడిని దర్శించుకునే భక్తుల కోసం ప్రధాన రైలు మార్గంలో నూతన సంవత్సర కానుకగా మరో కొత్త రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇక నుంచి డబుల్ డెక్కర్ రైలులో ఏసీ బోగీల్లో తిరుపతి వెళ్లే అవకాశం కలగనుంది. తిరుపతివిశాఖపట్నం మ«ధ్య శుక్రవారం నుంచి డబుల్ ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి 12.10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇదే రైలు 31వ తేదీన అర్ధరాత్రి ఒంటిగంటకు విశాఖ నుంచి బయలుదేరి జనవరి 1న మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రస్తుతానికి తాత్కాలిక నంబర్ కేటాయించారు. తిరుపతి నుంచి విశాఖ బయలుదేరే రైలుకు 02708, విశాఖ నుంచి తిరుపతి బయలుదేరే రైలుకు 02707 నంబరు ఇచ్చారు. జిల్లాలోని ఏలూరు. తాడేపల్లిగూడెం స్టేషన్లలో దీనికి హాల్ట్ కల్పించారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ఈ రైలు వెళుతుంది. వారానికి మూడుసార్లు జనవరి ఒకటో తేదీ నుంచి వారానికి మూడుసార్లు తిరుపతి నుంచి విశాఖకు ఆది, బుధ, శుక్ర వారాలలో బయలుదేరుతుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరే ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా 3.50కు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు. తాడేపల్లిగూడెం. రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్టణానికి చేరుకుంటుంది. విశాఖ వైపు వెళ్లే రైలు తాడేపల్లిగూడెం స్టేషన్‌కు ఉదయం 6.30కు వస్తుంది. తిరుపతి వెళ్లడానికి రాత్రి 10.25కు విశాఖ నుంచి బయలుదేరుతుంది. సోమ, గురు, శనివారాలలో తిరుపతి వెళుతుంది. తాడేపల్లిగూడెం స్టేషన్‌కు అర్ధరాత్రి 2.45 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. మరుసటి రోజున ఉదయం 11.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అన్నీ ఏసీ బోగీలే.. ఈ డబుల్ డెక్కర్ రైలులో మొత్తం 10 బోగీలుంటాయి. అన్నీ ఏసీ బోగీలే. 8 చైర్‌కార్ కోచ్‌లు, రెండు పవర్ కార్ కోచ్‌లు ఉంటాయి. స్లీపర్ సదుపాయం ఉండదు. కూర్చొని మాత్రమే ప్రయాణం చేయాలి. ఏసీ రైలు కావడంతో టికెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. తాడేపల్లిగూడెం నుంచి తిరుపతికి ఈ రైలులో ప్రయాణం చేయాలంటే రూ.700 చెల్లించాలి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో అయితే ఇక్కడి నుంచి స్లీపర్‌లో కోచ్‌లో ప్రయాణించడానికి రూ.350 కాగా, ఈ రైలులో మాత్రం రెట్టింపు చార్జీ వసూలు చేస్తారు. తిరుగు ప్రయాణానికి మేలు జిల్లా వాసులకు ఈ రైలు తిరుగు ప్రయాణానికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరి.. మరునాడు ఉదయం 6.30 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుంది., తిరుపతికి వెళ్లిన వారు కొండపైనుంచి కిందకు రావడానికి ఆలస్యమైతే.. తిరుమల ఎక్స్‌ప్రెస్ అప్పటికే బయలుదేరిపోతే ఉంటే ఈ రైలు ఉపయోగపడుతుంది. ఈ రైలు వేగంగా ఉదయానికి తిరుపతి చేరుకునే అవకాశం లేదు. గుంటూరు మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణ సమయం ఎక్కువ. తెల్లారి 11గంటలు దాటాక తిరుపతి వెళుతుంది. భక్తులు ఈ రైలులో వెళ్లి వెంకన్నను దర్శించుకోవాలంటే ఒక రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిఫార్సు లేఖలతో వెళ్లే వారు ఆ లేఖలను దర్శనానికి ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోగా ఎంబీసీ34 లో ఇవ్వాలి. రైలు ఉదయం 11 గంటలు దాటాక తిరుపతి చేరుకుంటే అక్కడి నుంచి బస్సులో తిరుమలకు వెళ్లి లేఖలు ఇవ్వాలంటే కుదరని పని. రైలు ప్రారంభమయ్యాక ఇలాంటి సమస్యలను, రైలు వేళల్లో మార్పులు చేసే అవకాశాలు ఉండొచ్చు -
పోరు ఆగదు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆకలికేకలతో హోరెత్తిన జిల్లా మిన్నంటిన నిరసనలు కాపులు కదం తొక్కారు. ఆదివారం ఆకలికేకలు కార్యక్రమంతో జిల్లాను హోరెత్తించారు. కంచాలపై గరిటెలతో మోగిస్తూ.. మానవహారాలు నిర్వహించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం/తణుకు : రిజర్వేషన్లు సాధించేవరకూ కాపుల ఆకలి పోరు ఆగదని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ఆయన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కాపులు ఆకలికేకలు కార్యక్రమం నిర్వహించారు. అన్ని మండలాల్లో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీసు ఐలాండ్ సెంటర్లో జరిగిన కాపుల ఆకలికేకలు కార్యక్రమంలో ముద్రగడ సతీసమేతంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు. గాంధేయమార్గంలోనే రిజర్వేషన్లు సాధిద్దామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేక ఇప్పటికే కాపులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, నిజాం పాలనలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని గుర్తుచేశారు. మండల కమిషన్ కూడా కాపులకు రిజర్వేషన్లు అవసరమని నివేదికలు ఇచ్చిందని, దామోదరం సంజీవయ్య హయాంలో ఆరేళ్లపాటు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్లతో కాలయాపన చేయొద్దని, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కంచంపై గరిటెల శబ్దం చేసి నిద్రలేపాలని పిలుపునిచ్చారు. ముద్రగడ గాంధీ మార్గంలో పాదయాత్ర ప్రారంభిస్తే నిరంకుశవైఖరితో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, అధికారం చేపట్టాక కాపులను మోసం చేసిందని విమర్శించారు. కాపు ఉద్యమాన్ని నీరు కార్చాలని, ఉద్యమానికి తూట్లు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆవేదన చెందారు. ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్లు సాధించడం ఖాయమన్నారు. అన్ని విధాలుగా ముద్రగడకు మద్దతు నిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు మాకా శ్రీనివాసరావు, ఈతకోట తాతాజీ. నరిశే సోమేశ్వరరావు, గుండుమోగుల నాగు, ఆకుల ధనశేఖర్ , మారిశెట్టి అజయ్, యెరుబండి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వలవల బాబ్జీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి అబ్బులు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, కాంగ్రెసు నాయకులు దుర్గా రామచంద్రరావు, కాపునాడు జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మాలమహానాడు, మైనార్టీ అసోసియేషన్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముద్రగడకు ఘనస్వాగతం అంతకుముందు ముద్రగడ పద్మనాభానికి 16వ జాతీయ రహదారి పొడవునా కాపులు పెద్దసంఖ్యలో మోటారు సైకిళ్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం చేరుకున్న అనంతరం ఆయన అంబేడ్కర్, శ్రీకృష్ణ దేవరాయలు, ఈలి ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటుగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ రాకకు ముందు టీబీఆర్ సైనిక స్కూలు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆలరించాయి. గుర్రాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. -
పోరు ఆగదు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆకలికేకలతో హోరెత్తిన జిల్లా మిన్నంటిన నిరసనలు కాపులు కదం తొక్కారు. ఆదివారం ఆకలికేకలు కార్యక్రమంతో జిల్లాను హోరెత్తించారు. కంచాలపై గరిటెలతో మోగిస్తూ.. మానవహారాలు నిర్వహించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం/తణుకు : రిజర్వేషన్లు సాధించేవరకూ కాపుల ఆకలి పోరు ఆగదని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ఆయన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కాపులు ఆకలికేకలు కార్యక్రమం నిర్వహించారు. అన్ని మండలాల్లో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీసు ఐలాండ్ సెంటర్లో జరిగిన కాపుల ఆకలికేకలు కార్యక్రమంలో ముద్రగడ సతీసమేతంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు. గాంధేయమార్గంలోనే రిజర్వేషన్లు సాధిద్దామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేక ఇప్పటికే కాపులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, నిజాం పాలనలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని గుర్తుచేశారు. మండల కమిషన్ కూడా కాపులకు రిజర్వేషన్లు అవసరమని నివేదికలు ఇచ్చిందని, దామోదరం సంజీవయ్య హయాంలో ఆరేళ్లపాటు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్లతో కాలయాపన చేయొద్దని, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కంచంపై గరిటెల శబ్దం చేసి నిద్రలేపాలని పిలుపునిచ్చారు. ముద్రగడ గాంధీ మార్గంలో పాదయాత్ర ప్రారంభిస్తే నిరంకుశవైఖరితో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, అధికారం చేపట్టాక కాపులను మోసం చేసిందని విమర్శించారు. కాపు ఉద్యమాన్ని నీరు కార్చాలని, ఉద్యమానికి తూట్లు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆవేదన చెందారు. ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్లు సాధించడం ఖాయమన్నారు. అన్ని విధాలుగా ముద్రగడకు మద్దతు నిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు మాకా శ్రీనివాసరావు, ఈతకోట తాతాజీ. నరిశే సోమేశ్వరరావు, గుండుమోగుల నాగు, ఆకుల ధనశేఖర్ , మారిశెట్టి అజయ్, యెరుబండి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వలవల బాబ్జీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి అబ్బులు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, కాంగ్రెసు నాయకులు దుర్గా రామచంద్రరావు, కాపునాడు జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మాలమహానాడు, మైనార్టీ అసోసియేషన్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముద్రగడకు ఘనస్వాగతం అంతకుముందు ముద్రగడ పద్మనాభానికి 16వ జాతీయ రహదారి పొడవునా కాపులు పెద్దసంఖ్యలో మోటారు సైకిళ్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం చేరుకున్న అనంతరం ఆయన అంబేడ్కర్, శ్రీకృష్ణ దేవరాయలు, ఈలి ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటుగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ రాకకు ముందు టీబీఆర్ సైనిక స్కూలు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆలరించాయి. గుర్రాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. -
విశిష్ట రక్షిత సాగు ప్రాజెక్టు ప్రారంభం
అందుబాటులోకి రానున్న సేవలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాక్షి, అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో దేశంలో రెండవ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన విశిష్ట రక్షిత సాగు (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ప్రాజెక్టును శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంత్రికి పూర్ణకుంభంతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లాంఛనంగా ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పుల్లారావు, వర్సిటి పాలకమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతరులకు ఉద్యానవర్సిటి అధికారులు ప్రాజెక్టులో జరిగే ప్రక్రియల గురించి వివరించారు. రైతు విత్తనం తీసుకొస్తే 30 నుంచి 35 రోజుల వ్యవధిలో మొక్కగా చేసి రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా మొక్కలను అందించవచ్చని వర్సిటి ఉపకులపతి డాక్టర్ బిఎంసిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆటోమెషీన్ ప్రక్రియ, క్వాయర్ బెల్ట్ పనితీరు, నీరు ఎరువులు, యాజమాన్య పద్దతులు గురించి వివరించారు. కేవలం 40పైసలు వెచ్చిస్తే మిరప మొక్కను ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అందించవచ్చని తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రొటెక్టెడ్ కల్టీవేషన్ తరహాలో రూపొందించిన ఆర్కిడ్స్ ప్రాజెక్టులోని కొన్నింటిని ప్రాజెక్టులో ప్రదర్శనగా ఉంచారు. వీటి గురించి వి.సి మంత్రికి వివరించారు. అనంతరం క్యాప్సికమ్, చెర్రీ టమాట మొక్కలను మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టులో వాతావరణ నియంత్రణ తదితర విషయాల గురించి మంత్రికి యూనివర్సిటి అధికారులు వివరించారు. రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి ఉద్యానవర్సిటి అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కలిగితేనే ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, గూడెం ఎంపిపి గన్నమని దొరబాబు, ఏఎంసి చైర్మన్లు పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, పాతూరి విజయ్‌కుమార్, శాస్త్రవేత్తలు, పాలకమండలి సభ్యులు సత్యనారాయణ, శివరామకృష్ణ, బోణం నాగేశ్వరరావు, వర్సిటి విస్తరణ సంచాలకులు, ప్రాజెక్టు ఇన్ఛార్జ్ ఆర్‌విఎస్‌కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ మూగబోయింది
తాడేపల్లిగూడెం కేజీ పది.. కేజీ పది ... రావాలి....రావాలి ... అనే కేకలు లేవు... ఆక్కయ్యగారు రండి. టమాటాలు చౌక. నేతిబీర లాంటి బీర మరింత చౌక. క్యాబేజీ ఊరుకొనే తీసుకెళ్లండి. అన్నయ్య గారు అల్లం , కొత్తిమిర కొత్తిమిర.. లాంటి కేకలతో ఆదివారం వస్తే చాలు ఇక్కడి మార్కెట్ సందడిగా ఉండేది. కొర్రమీనులున్నాయి. బొమ్మిడాలు వచ్చాయి. గుడ్డు పీతలున్నాయనే పిలుపులతో చేపల మార్కెట్ రద్దీగా ఉండేది. ఆ పిలుపులు లేవు. పెద్దనోట్ల రద్దు ప్రభావం మార్కెట్‌ను వెంటాడుతుంది. కాసుల గలగల లేదు. సరుకు కొనే వారు కరువయ్యారు. దించుకున్న సరుకులు దిగాలుగా వ్యాపారుల వంక చూసే వాతావరణం మార్కెట్లో కనపడింది. జిల్లాకు తల్లిసంతగా పేర్కొనే తాడేపల్లిగూడెం సంత పరిస్దితి ఇది. ఐదు వారాలుగా ఇదే తంతు. రూపాయి వ్యాపారానికి పావలా వ్యాపారం సాగుతోంది. కొన్న సరుకులు దుకాణాలపై వదిలే సంకటస్దితి పెద్దనోట్ల రద్దు. కొత్త రెండువేల రూపాయల నోట్లు మాత్రమే చలామణిలోకి రావడం, కొత్త 500, 100 రూపాయల నోట్లు చలామణిలో లేక వినియోగదారులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మ«ధ్యాహ్నం 12 గంటల సమయానికి సంతలో తప్పుకొనే వీలులేకుండా రద్దీగా ఉండేది. అలాంటిది ఆదివారం సంత బోసిపోయి కనిపించింది కూరగాయలు. చేపలు. మాంసం. ఎండు చేపల మార్కెట్ వెలవెలబోయి కనిపించింది. సరుకులు కొనే వారు రావడంలేదు. కొనడానికి వచ్చినా కూడా రెండు వేల రూపాయల నోటు తీసుకు వస్తున్నారు. చిల్లర ఇవ్వాలంటే నరకం కనిపిస్తోంది. సంత అవసరాలకు చిల్లర నోట్లు సమకూర్చి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. నిండుగా ఉండే సంత నీరసించి కనపడింది. పరిస్దితి ఇలాగే ఉంటే సంతకు సెలవు ప్రకటించాలేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. -
నేడు అమిత్‌షా రాక
తాడేపల్లిగూడెంలో రైతు మహాసభ ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రానున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రైతు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఇందుకోసం బీజేపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ప్రజా వ్యతిరేకత లేదని చెప్పేందుకు భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనంతో చేస్తున్న వ్యాఖ్యలను సరైన సమాధానం ఈ వేదిక ద్వారా ప్రజలకు ఇవ్వాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. సుమారు లక్ష మంది రైతులు వస్తారని అంచనా వేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావుతోపాటు పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే ఈ సమావేశాన్ని తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఈ సభను విజయవంతం చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. అమిత్‌షా శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చేరుకుని అక్కడ రైతు ప్రతినిధులతో వారి సమస్యలపై చర్చిస్తారన్నారు. అనంతరం నాలుగు గంటలకు సభాస్థలి చేరుకుని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. -
పాత నోట్లు తీసుకుంటాం
తాడేపల్లిగూడెం : ఏం కొనడానికి వెళ్లినా.. ’చిల్లర ఉందా’ 13 రోజులుగా జిల్లాలో ఏ దుకాణానికి వెళ్లినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. తాడేపల్లిగూడెంలోని ఓ వ్యాపారి మాత్రం రండి బాబూ.. రండి. పాత నోట్లు ఎన్నయినా తీసుకురండి. మీకు నచ్చిన సరుకులు కొనుక్కెళ్లండని బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. పెద్దనోట్లు ఇచ్చాక అందుకు సరిపడే సరుకులను ఒకే రోజున కొనక్కర్లేదని.. నాలుగు రోజులపాటు వాటిని తీసుకోవచ్చంటూ సందడి చేస్తున్నాడు. రైల్వే స్టేషన్ రోడ్డులో కల్యాణి కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తున్న కుమార్ అనే వ్యాపారి ఓ బోర్డు పెట్టిమరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. రూ.500, రూ.1000 రూపాయలకు సరిపడా డ్రింక్స్, పాలు, పెరుగు, బిస్కెట్లు, రీచార్జ్ కూపన్లు, రిఫండ్ ఆయిల్, పామాయిల్, బియ్యం (25 కిలోల బస్తా) తీసుకెళ్లాలంటూ బోర్డు పెట్టాడు. పాత నోట్లను మీరేం చేస్తారని అడిగితే ’బ్యాంకులో ఖాతాలో వేసుకుంటాం.ఽ బ్యాంక్ ఖాతాలో సొమ్ము రూ.2.50 లక్షలు దాటితే ఏమవుతుంది. మహాఅయితే నోటీసు ఇస్తారు. పోనీ.. అరెస్ట్ చేస్తారా. చేసుకోమనండి. నేనేమీ తప్పు చేయడం లేదు. నోట్ల రద్దుతో కష్టాల్లో ఉన్న వినియోగదారులకు సేవ చేస్తున్నా. ప్రధాని మోదీయే కాదు. నేను, నా భార్య కల్యాణి ఇలా సేవ చేస్తున్నాం’ అని సగర్వంగా చెబుతున్నాడు. భలే ఆఫర్ కదూ. ఇంకెందుకు ఆలస్యం మీ వద్ద పాతనోట్లు ఇంకా ఉంటే.. చలో తాడేపల్లిగూడెం. -
నిలకడగా కూరగాయల ధరలు
తాడేపల్లిగూడెం : ఉల్లిపాయలు మార్కెట్లో కాస్త ఘాటెక్కించినా, కూరగాయలు ధరల విషయంలో వినియోగదారుల పక్షాన నిలిచాయి. నగదులావాదేవీలపై కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభావం పడినా సరుకులు భారీగానే మార్కెట్‌కు వచ్చాయి. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. కర్నూలు రకం ఉల్లిపాయలు 80 లారీల సరుకు మార్కెట్‌కు వచ్చింది.క్వింటాల్ రూ.900 వరకు అమ్మారు. మహారాష్ట్ర ఉల్లిపాయలు కేవలం మూడు లారీలు మాత్రమే వచ్చాయి. వీటి ధర క్వింటాల్ రూ.1,200 పలికింది. విడిగా కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిపాయల లావాదేవీలకు బ్రేక్ పడింది.నాలుగు రోజుల పాటు అక్కడ యార్డులకు సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో కూరగాయల ధరలు కూరగాయల ధరలు ఈ వారం అందుబాటులోనే ఉన్నాయి. వంకాయలు కిలో రూ.30, నల్లవంకాయలు రూ.24, బెండకాయలు రూ.24, బీరకాయలు రూ.30, దోసకాయలు రూ.20, దొండకాయలు రూ.12, కంద రూ.30, కాకరకాయలు రూ.20 విక్రయించారు. ఆకాకరకాయలు రూ.32లకు అమ్మారు. క్యారట్ రూ.40, బీట్రూట్ రూ.30, క్యాప్సికం, బీన్స్ రూ.60, కీరా రూ.30, చిలకడదుంపలు కిలో రూ.24కు విక్రయించారు. క్యాబేజీ రూ.20, టమాటాలు కిలో రూ.15 నుంచి రూ. 20 చేసి అమ్మారు. -
ఒకటా.. రెండా.. ఈ రోజైతే అరవై..
పెద్దనోట్ల కోడ్ భాష ఇది దళారుల హల్ చల్ తాడేపల్లిగూడెం : ’ఒకటా.. రెండా.. ఈ రోజైతేనే 60. ఒకటికి కంటే తక్కువా కుదరదు. ఒకటి పైనే అయితేనే మాట్లాడండి. ఉందా.. ఎక్కడికి రమ్మంటారు. ఎక్కడ ఇవ్వమంటారు’.. ఇదేదో క్రికెట్ బుకీలు ఫస్ట్ ఫ్యాన్సీ.. సెకండ్ ఫ్యాన్సీ.. బాల్ టు బాల్ వేసుకునే పందాలు కాదు. పెద్ద నోట్ల రద్దుతో ఫోన్ల సంభాషణలు ఇవి.పేరుకుపోయిన నల్లధనాన్ని తెల్లవిగా మార్చుకునేందుకు కొందరు.. అందినకాడికి దోచుకుందామని మరికొందరు.. ఇదే ఆసరాగా చేసుకుని కమీషన్ దండుకునేందుకు ఇంకొందరు తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. డీల్స్ ఇలా.. ప్రధాని మోదీ ప్రకటనతో పెద్ద నోట్ల వ్యవహారం పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాదిరిగా డబ్బును మార్చే దళారులు తయారయ్యారు. మొదటిరోజు లక్ష బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు దళారులు రూ.5 వేలు కమీషన్ తీసుకోగా ఆదివారం నాటికి అది రూ.40 వేలకు చేరింది. అంటే పాత నోట్లు లక్ష ఇస్తే రూ.60 వేలు ఇస్తారు. సోమవారం నాటికి మరికొద్దిగా తగ్గుతుందని, బుధవారం నాటికి మరింత తగ్గుతుందంటూ డబ్బున్నవారితో ఫోన్లలో సంప్రదింపులు జరిపే వారు బిజీబిజీగా ఉన్నారు. డిసెంబర్ 30 తర్వాత ఎందుకూ కొరగాని చిత్తుకాగితాలుగా లెక్కల్లో లేని రద్దు చేసే ప్రమాదం ఉంది. దీంతో అక్రమంగా లెక్కలకు చిక్కకుండా కాస్త సక్రమంగా , ప్రజలను వివిధ రూపాల్లో జలగలుగా పీలుస్తూ సంపాదించిన సొమ్ములను ఇలా వదిలించుకొనే క్రమంలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కోటి లెక్కనే ఈ లెక్కల సర్ధుబాటు తతంగం సాగుతోంది -
అక్రమ కేసుల్ని సహించం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీ ఏర్పాటు సందర్భంగా తలెత్తిన చిన్నపాటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తున్న నేపథ్యంలో వైఎస్సా ర్ సీపీ నాయకుల బృందం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను గురువారం ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసింది. బృందంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు తదితరులు ఉన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై చోటుచేసుకున్న ఘర్షణ విషయంలో ప్రతిపక్షంపై కక్షగట్టినట్టు వ్యవహరించడం సరికాదని వారు ఎస్పీకి వివరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడలేని వ్యక్తితో ఫిర్యాదు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని ఎస్పీకి వివరిం చారు. అక్కడ పోలీసులకు సంబంధించిన సీసీ కెమేరాలు ఉన్నాయని, ఘటనను పూర్తిగా పరిశీలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మంత్రి మాణిక్యాలరావు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో అందచేశారు. ఇంత దారుణమా అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేపైనే అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధపడితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హోదాను మరిచి చిన్న వివాదంలో తలదూర్చి మాజీ ఎమ్మెల్యే కొట్టుపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయిం చడం దారుణమన్నారు. కొట్టు సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని పోలీసు శాఖను కోరామన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్జగ¯ŒSమోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తే భయపడి పారిపోయేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి ఘటనా స్థలంలోనే లేడని, చిన్నపాటి ఘటనను 307, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల వరకూ తీసుకువెళ్లారన్నారు. ఇలా అరాచకాలు చేసిన వారు చరిత్రలో చాలామంది గతించిపోయారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదని, అధికార పార్టీ కేసు పెడితే మాత్రం క్షణాల్లో స్పందిస్తోందని అన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలడం దురదృష్టకరమన్నారు. -
అక్రమ కేసుల్ని సహించం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీ ఏర్పాటు సందర్భంగా తలెత్తిన చిన్నపాటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తున్న నేపథ్యంలో వైఎస్సా ర్ సీపీ నాయకుల బృందం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను గురువారం ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసింది. బృందంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు తదితరులు ఉన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై చోటుచేసుకున్న ఘర్షణ విషయంలో ప్రతిపక్షంపై కక్షగట్టినట్టు వ్యవహరించడం సరికాదని వారు ఎస్పీకి వివరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడలేని వ్యక్తితో ఫిర్యాదు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని ఎస్పీకి వివరిం చారు. అక్కడ పోలీసులకు సంబంధించిన సీసీ కెమేరాలు ఉన్నాయని, ఘటనను పూర్తిగా పరిశీలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మంత్రి మాణిక్యాలరావు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో అందచేశారు. ఇంత దారుణమా అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేపైనే అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధపడితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హోదాను మరిచి చిన్న వివాదంలో తలదూర్చి మాజీ ఎమ్మెల్యే కొట్టుపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయిం చడం దారుణమన్నారు. కొట్టు సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని పోలీసు శాఖను కోరామన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్జగ¯ŒSమోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తే భయపడి పారిపోయేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి ఘటనా స్థలంలోనే లేడని, చిన్నపాటి ఘటనను 307, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల వరకూ తీసుకువెళ్లారన్నారు. ఇలా అరాచకాలు చేసిన వారు చరిత్రలో చాలామంది గతించిపోయారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదని, అధికార పార్టీ కేసు పెడితే మాత్రం క్షణాల్లో స్పందిస్తోందని అన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలడం దురదృష్టకరమన్నారు. -
వెండి రథంపై వాసవీ మాత
తాడేపల్లిగూడెం రూరల్ : శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా తాడేపల్లిగూడెంలో వాసవీ మాత రథోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు శిరమున కలశాలు ధరించి వెంటరాగా, వాసవీ మాత వెండి రథంపై పుర వీధుల్లో ఊరేగారు. పట్టణంలోని వాసవీ మాత రోథత్సవం గురువారం కనుల పండువగా సాగింది. సాయంత్రం స్థానిక ఏలూరు రోడ్డులోని వాసవి మాత పంచాయతన క్షేత్రం నుంచి పురవీధుల్లోకి రథం బయల్దేరింది. తొలుత రథంలో అమ్మవారిని ఉంచి వేద పండితులు పూజలు నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గమిని సుబ్బారావు వెండి రథాన్ని లాగి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఉత్సాహంగా సాగింది. -
కార్పొరేట్ స్థాయిలో గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతాం
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మండలంలోని ఆరుగొలను ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల జోన్–2 క్రీడామహోత్సవం–2016 కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని ప్రపంచ స్థాయిలో క్రీడా కళాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నాబార్డు ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారి అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఆరుగొలను గురుకుల పాఠశాల అభివద్ధికి రూ.30 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆరుగొలను సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 650 మంది విద్యార్థులు ఐదు నుంచి ఇంటర్ వరకు ఉన్నారని, నూతనంగా భవనం నిర్మాణం చేపట్టి 1500మంది విద్యార్థులు చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాత భవనాలు మరమ్మత్తులు నిమిత్తం రూ38కోట్లు కేటాయించినట్ల చెప్పారు. ఇటీవల రజిత పతకాన్ని సాధించిన సింధూ ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ విద్యార్థి భారతదేశం గర్వించదగ్గ మహోన్నత స్థాయికి ఎదగాలని అభిలషించారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్ మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకుని పేరు తెచ్చుకోవాలన్నారు. ఆరుగొలను గురుకుల, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ మూడ్రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో పశ్చిమ, తూర్పు, కష్ణా జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. గతంలో జరిగిన ఎన్నో పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు అవార్డులు సాధించినట్లు తెలిపారు. తొలుత మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కబడ్డీ ఆడి పోటీలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపిపి గన్నమని దొరబాబు, సర్పంచ్ మలకా వెంకట్రావు, ఎమ్పీటిసి సహదేవుడు, కొత్తూరు సర్పంచ్వెంకటలక్ష్మి, ఆరుగొలను సొసైటి అధ్యక్షులు నూకల బుల్లియ్య, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎస్కె.సోమయాజులు, కైండ్‌నెస్ సొసైటి అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు, బిజేపి ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, తహసిల్దార్ పాశం నాగమణి, గురుకుల సంస్థ ఓఎస్డి పి.రాజారావు, బిజేపి యువ నాయకులు నవీన్, పేరిచర్ల మురళీకష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రెస్ మేనేజ్మెంట్ పై వర్కుషాపు
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): స్థానిక శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెంలో ఎస్ఎస్ఎస్ రెగ్యూలర్ యాక్టివిటీలో భాగంగా కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం స్ట్రెస్ మేనేజ్మెంట్పై వర్కుషాపును నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్లీనికల్ సైకాలజిస్ట్ వి.హిమ బిందు హాజరైయారు. పరీక్షలను ఏ విధంగా ఎదుర్కొవాలి, ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి తదితర విషయాలను విశ్లేషణంగా వివరించారు. సుమారు 20 మంది విద్యార్థినీ విద్యార్థులకు పర్సనల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ.రమేష్‌బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాను ప్రసాద్, కళాశాల డీన్స్ ఎం.వెంకటేశ్వరరావు, కె.వెంకట్రావు, జోడి, టీవీ రఘు ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర బందం పాల్గొన్నారు. -
ప్రజల నెత్తిన శనగ బాంబు
తాడేపల్లిగూడెం: ప్రజల నెత్తిన శనగపప్పు ధరల బాంబు పడింది. ఏకంగా కిలో ధర రిటైల్ మార్కెట్లో 150 రూపాయలకు చేరింది., గత ఏడాది అక్టోబరులో కిలో శనగపప్పు ధర 70 రూపాయలు మాత్రమే ఉంది. పప్పుల ధరలు వినియోగదారులతో దోబూచులాడుతూ ఉన్నాయి. ప్యూచర్ ట్రేడింగ్ పుణ్యాన సిండికేట్‌గా ఏర్పడిన గుత్త వ్యాపారులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కేంద్రంగా అపరాల మార్కెట్‌ను శాసిస్తున్నారు. వారు చెప్పింది ధర అన్నట్టుగా హవా సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 28 వ తేదీన పప్పుల మార్కెట్లో 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ధరలు తగ్గి ప్రకంపనలు సష్టించాయి. మార్కెట్ బద్దలు కావడంతో కొందరు వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. కిలోకు ఏకంగా 20 నుంచి 30 రూపాయలు గుత్త మార్కెట్లో ధరలు తగ్గి మార్కెట్ పతనమైంది. ఆ ప్రభావం రిటైల్మార్కెట్లో కనపడలేదు. యధారీతిగా చిన్న వ్యాపారులు వినియోగదారులను దోచుకున్నారు. అపరాల మార్కెట్ మరింతపతనమవుతుందని అప్పట్లో వ్యాపార వర్గాలు భావించాయి. దీనికి భిన్నంగా గత 15 రోజులుగా శనగపప్పు ధర ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తుంది. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు శనగపప్పు అవసరాలను తీరుస్తాయి. డిమాండ్ మేరకు ఈ పప్పును వ్యాపారులు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. వాతావరణ అననుకూల పరిస్ధితుల నేపధ్యంలో ఈ ఏడాది శనగల దిగుబడులు 50 శాతం పడిపోయాయి. ఇదే ఆసరాగా గుత్త వ్యాపారులు విజంభించారు. క్వింటాలు 1350 రూపాయలు చెల్లిస్తేనే . పప్పు డెలివరీ అంటూ కూర్చున్నారు. వచ్చేది దీపావళి పండుగ, కార్తీక మాసం. పండుగలు రావడంతో పాటుగా వివాహాలు జరుగుతున్నాయి. దీంతో శనగపప్పుకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో శనగపప్పు ఆకాశానికి ఎగబాకింది. కిలో గుత్త మార్కెట్లో 110 రూపాయలకు చేరింది. అక్కడి నుంచి 115 రూపాయలకు పెరిగింది. అక్కడి నుంచి 120 , అక్కడి నుంచి ఏకంగా 135 రూపాయలకు చేరుకుంది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో 150 రూపాయలకు శనగపప్పు అమ్ముతున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఏడాది వ్యవ«ధిలో శనగపప్పు ధర ఏకంగా వంద శాతానికి పైగా పెరిగింది. రానున్న రోజుల్లో ఈ పప్పు ధర మరింతపెరిగే సూచనలు కనపడుతున్నాయి. కందిపప్పు విషయానికొస్తే నాగపూర్ కందిపప్పు కిలో 130 రూపాయలకు రిటైల్ మార్కెట్లో ఉంది. గుత్త మార్కెట్లో 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. సాధారణ రకం కందిపప్పు కిలో గుత్త మార్కెట్లో వంద రూపాయలు ఉండగా, విడిగా కిలో 110 రూపాయలకుఅమ్ముతున్నారు. గుంటూరు. మాచర్ల, వినుకొండ ప్రాంతాల నుంచి రకరకాల బ్రాండ్ల పేర్లతో మినపప్పు మార్కెట్లోకి వస్తుంది. నాణ్యతలో ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటంతో వినియోగదారులు ఈ పప్పులను కొంటున్నారు. గుత్త మార్కెట్లో కిలో 95 రూపాయలుండగా, విడిగా కిలో 100 నుంచి 110 రూపాయలకు అమ్ముతున్నారు. బొబ్బరపప్పు మషాలావడలు వేసుకోమన్నట్టుగా చౌకగా దొరుకుతుంది. గుత్త మార్కెట్లో కిలో 70 రూపాయలుండగా, విడిగా 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. మిగిలిన పప్పులు, గోధుమ ఆధారిత ఉత్పత్తుల ధరలు స్దిరంగా ఉన్నాయి. -
ఉల్లి బంధం తెగుతోంది
– తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రాకుండా ప్రతిబంధకాలు – కర్నూలు ప్రజాప్రతినిధుల రాజకీయాలు – అక్కడి మార్కెట్లోనే విక్రయించాలని ఆదేశాలు – సీజన్లో తగ్గిన ఉల్లిపాయల రాక తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో ఉల్లిపాయలకు పుట్టిల్లు కర్నూలు అయితే మెట్టిల్లు తాడేపల్లిగూడెం. ఇది ఈనాటిది కాదు 50 ఏళ్లకు పైనుంచి కొనసాగుతున్న వాణిజ్య బంధం. ఉల్లి అక్కడ పండితే పంటంతా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రావాల్సిందే. ఇది వ్యాపార సూత్రంగా కాకుండా రైతు నమ్మకానికి ప్రతీకగా కర్నూలు ఉల్లివ్యాపారం అనాధిగా సాగుతోంది. తాము పడ్డ కష్టానికి తగ్గ ప్రతి «ఫలం గూడెం మార్కెట్లో వస్తుందనేది అక్కడి ఉల్లి వ్యాపారుల విశ్వాసం. తాడేపల్లిగూడెంలోని గుత్త వ్యాపారులు కర్నూలులోని ఉల్లి రైతులకు వడ్డీ లేకుండా పెట్టుబడులు సమకూరుస్తారు. రైతులు పండించిన సరుకును లారీలలో గూడెం మార్కెట్‌కు తీసుకువస్తారు. ఇక్కడ బహిరంగ పాట ద్వారా ఉల్లిపాయలను వ్యాపారులు విక్రయిస్తారు. విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములో కమీషన్ తీసుకుని మిగిలిన సొమ్మును రైతులకు ఇస్తారు. కర్నూలులో ఈ తరహా పద్ధతిలేదు. పైగా గూడెం వ్యాపారులకు కర్నూలు రైతులపై నమ్మకం ఎక్కువ. వెయ్యి బస్తాల సరుకు తెస్తే ఒక బస్తా కిందపోసి నాణ్యతను చూసి మిగిలిన 999 బస్తాలలో అదే తరహా నాణ్యతను ఉంటుందని నమ్మి పాట పెడతారు. కర్నూలు యార్డుకు వెయ్యిబస్తాల ఉల్లిని రైతులు తీసుకెళితే ఆ బస్తాలలోని సరుకును కింద పోస్తారు. నాణ్యతను బట్టి ధర ఇస్తారు. గూడెం మార్కెట్‌కు ఉల్లిపాయలను తీసుకురావడం వల్ల మరో వెసులుబాటు కూడా రైతులకు ఉంది. సరుకులు తీసుకొచ్చే సమయంలో మార్కెట్లో అననుకూల పరిస్థితుల కారణంగా ధర రాక, కిరాయిలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే కిరాయి సొమ్మును, అవసరమైతే రైతులకు అవసరమైన డబ్బును ఇక్కడి వ్యాపారులు ఇచ్చి పంపుతారు. అక్కడి రైతులపై నమ్మకంపై ఇక్కడి వ్యాపారులు ప్రతి సీజన్లో రూ.100 కోట్ల వరకు పెట్టుబడులుగా రైతులకు సమకూరుస్తున్నారు. రెండేళ్లుగా సంక్షోభం కర్నూలు ఉల్లిపాయల వ్యాపారంతో గూడెం వ్యాపారులు లాభపడుతున్నారని భావించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశాలతో ఉల్లిపాయలను కర్నూలులోనే విక్రయించాలనే ఆదేశాలు ఇచ్చారు. దీనిని అమలుచేయడానికి అధికారులు పక్కా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ విధానంలో గూడెం వ్యాపార విధానానికి, కర్నూలు యార్డు వ్యాపార విధానానికి వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోతూ వస్తున్నారు. దీంతో రెండు రకాల సెస్‌లు కట్టి ఉల్లి రైతులు సరుకును గూడెం మార్కెట్‌కు తెస్తున్నారు. అయ్యినా ఉల్లి వ్యాపారంలో రెండేళ్లుగా సంక్షోభం నెలకొంది. ఈ ఏడాది ఉల్లి రైతుల శ్రమ అక్కరకు రాకుండా పోయింది. సాగు విస్తీర్ణం పెరగడం, ఇక్కడి ఉల్లిపాయకు నిల్వ ఉండే గుణం లేకపోవడంతో గుత్త మార్కెట్లో క్వింటాలు ఉల్లి రూ.100కి పడిపోయింది. నెలరోజులు ఇదే విధంగా ధర కొనసాగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.600 మద్దతు ధర ఇస్తామని ఓ ప్రకటన చేసింది. ఈ కారణంగా కర్నూలు వ్యాపారులు తాడేపల్లిగూడెంకు ఉల్లి తీసుకురాకుండా అక్కడి యార్డుకే సరకు తరలించారు. అయితే అక్కడ డిమాండ్ లేకపోవడంతో సరుకు విక్రయించుకోలేకపోతున్నారు. ఆ సరుకు కుళ్లిపోవడంతో నేలపై పారబోసుకుంటున్నారు. గూడెంకు నిలిచిన ఉల్లి రవాణా కర్నూలు ఉల్లిపాయలను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రైతులు తరలించకుండా అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకుంటున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఇక్కడి గుత్త మార్కెట్‌కు 20 లారీల సరుకు కూడా రాలేదు. వాస్తవానికి ఈ సీజన్లో కర్నూలు ఉల్లిపాయలు వారానికి 1,500 లారీలు రావాలి. అలాంటిది 40 లారీల సరుకు మాత్రమే వస్తోంది. ఈ ఆదివారం ఆ పరిస్థితి కూడా లేదు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి బంధం పూర్తిగా తెగిపోయినట్టే. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన రాహిత్యంతో తీసుకున్న చర్యలు కారణంగా ఇక్కడి వ్యాపారులు కోట్లలో నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ సీజన్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో అమ్మకాల ద్వారా కనీసం 25 శాతం సొమ్ములు కూడా రాలేదు. ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో కర్నూలు ఉల్లిపాయల ధర పతనమైంది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. కనీసం పది టన్నుల దిగుబడి వస్తే పెట్టుబడులు పోను కొంచెం లాభం మిగులుతుంది. ఈ సీజన్లో క్వింటాల్ నాణ్యమైన ఉల్లి రూ.800 మించి పలకలేదు. ఇదే సమయంలో మహారాష్ట్ర ఉల్లిపాయలు కూడా అదే ధరకు లభిస్తుండడం, వాటికి నిల్వ ఉండే గుణం ఉండడంతో వాటినే వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామన్న మద్దతు ధర ఇచ్చినా రైతులకు రెక్కల కష్టం కూడా రాని పరిస్థితి. దీంతో కర్నూలు రైతులు ఉల్లిని వదిలి ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. -
చుక్కల్లో వంకాయ ధరలు
తాడేపల్లిగూడెం : వంకాయల ధర ఘాటెక్కించింది. గడచిన ఐదారు వారాల ధరలతో పోల్చుకుంటే ఒక్కసారిగా పెరిగింది. కిందటి వారం కిలో రూ.40 నుంచి రూ.50 వరకు ఉన్న ధర ఆదివారం ఒక్కసారిగా రూ.80కి చేరింది. నల్ల వంకాయలు కిలో రూ.60కి ఎగబాకాయి. దొండకాయలు రూ.24, ఆ కాకరకాయలు రూ.50, చిక్కుళ్లు రూ.60, దోసకాయలు రూ.24, బీరకాయలు రూ.40, బెండకాయలు రూ.40, కంద రూ.40 చేసి విక్రయించారు. క్యాబేజీ రూ.20కి లభ్యమైంది. చామదుంపలు కిలో రూ.30, టమాటాలు కిలో రూ.30, క్యారెట్ రూ.40, బీట్రూట్ రూ.30, కీరాదోసకాయలు రూ.30, క్యాప్సికం రూ.60కి లభించాయి. బీన్స్ రూ.60 చేసి విక్రయించారు. మిర్చి కిలో రూ.16 పలకగా గోరుచిక్కుళ్లు రూ. 32 పలికాయి. ములగకాడలు జత పది రూపాయలు, మామిడి కాయలు జత రూ.30 చేసి విక్రయించారు. ఉల్లిపాయలు కర్నూలు రకం కిలో పది రూపాయలు, మహారాష్ట్ర రకం రూ.15 చేసి అమ్మకాలు సాగించారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం : రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం గూడ్స్‌షెడ్ వద్ద జరిగింది. 30 ఏళ్ల ఓ యువకుడు విజయవాడ వైపు వెళ్లే రైలు కింద పడి మరణించాడు. అతను ఆకుపచ్చరంగు గడులు కలిగిన పొడవు చేతుల చొక్కా, సిమెంటు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. గిరజాల జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యచేసుకున్నాడో తెలియరాలేదు. మృతుని వివరాలు తెలిసిన వారు 9989076365 నంబరుకు తెలియజేయాలని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎ.వెంకన్నబాబు కోరారు -
ఉద్యాన వర్సిటీ కొత్త వీసీపై చర్చ
తాడేపల్లిగూడెం : డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ కొత్త ఉపకులపతి నియామకంపై వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఉపకులపతి బాధ్యతలు స్వీకరించి త్వరలో మూడేళ్లు కావస్తోంది. వీసీ పదవీకాలం నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలు. ఈ గడువు ముగిశాక కూడా వీసీని ప్రభుత్వం కొనసాగించవచ్చు. కొత్త వీసీ వచ్చేవరకు అన్నట్టుగా ఫర్దర్ అన్టిల్ ఆర్డర్ అనే ఆదేశాలను ఇచ్చే అవకాశాలూ ఉంటాయి. 2007లో వెంకట్రామన్నగూడెంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత తొలి ఉపకులపతిగా ఎస్డీ.శిఖామణి, రిజిస్ట్రార్‌గా డాక్టర్ పి.సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరి ఉద్యోగ కాలం ముగిసిన తర్వాత కొంతకాలం పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీ టు గవర్నమెంట్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి శర్మ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్ సూర్యనారాయణరెడ్డి తర్వాత ఇప్పటివరకు ఈ సీటు ఇన్చార్జిల ఏలుబడిలో ఉంది. డాక్టర్ బి.శ్రీనివాసులు ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఐఏఎస్ అధికారి శర్మ తర్వాత 2013 డిసెంబర్లో వర్సిటీ రెండో ఉపకులపతిగా ఐసీఏఆర్‌లో దీర్ఘకాలం పనిచేసిన డాక్టర్ బీఎంసీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్లో ముగియనుంది. ఆయననే మరికొంతకాలం కొనసాగిస్తారా లేదంటే ఆయన ఉద్యోగకాలం ఇక్కడ ముగిసిన తర్వాత కొత్తవారిని వీసీగా నియమిస్తారా అనే విషయంపై వర్సిటీ స్నాతకోత్సవం తర్వాత చర్చ ప్రారంభమైంది. వివాదరహితుడిగా పేరొందిన బీఎంసీ రెడ్డిని మరికొంతకాలం వీసీగా కొనసాగించాలని స్నాతకోత్సవం తర్వాత వర్సిటీ వర్గాలు కోరినట్టు సమాచారం. వీసీ రేసులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గతంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆలపాటి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. గతంలో వీసీ నియామక ప్రక్రియ సమయంలో కూడా ఆలపాటి తెరమీదకు వచ్చారు. ఆయనకు సీనియారిటీతో పాటు, గతంలో కాంగ్రెస్ ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసి తర్వాత బీజేపీలో చేరిన నేతకు బంధుత్వం ఉందని సమాచారం.