ఒకటా.. రెండా.. ఈ రోజైతే అరవై.. | Ðbrokers cash the curency ban | Sakshi
Sakshi News home page

ఒకటా.. రెండా.. ఈ రోజైతే అరవై..

Published Sun, Nov 13 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

Ðbrokers cash the curency ban

పెద్దనోట్ల కోడ్‌ భాష ఇది 
 దళారుల హల్‌ చల్‌ 
 
తాడేపల్లిగూడెం : ’ఒకటా.. రెండా.. ఈ రోజైతేనే 60. ఒకటికి కంటే తక్కువా కుదరదు. ఒకటి పైనే అయితేనే మాట్లాడండి. ఉందా.. ఎక్కడికి రమ్మంటారు. ఎక్కడ ఇవ్వమంటారు’.. ఇదేదో క్రికెట్‌ బుకీలు ఫస్ట్‌ ఫ్యాన్సీ.. సెకండ్‌ ఫ్యాన్సీ.. బాల్‌ టు బాల్‌ వేసుకునే పందాలు కాదు. పెద్ద నోట్ల రద్దుతో ఫోన్ల సంభాషణలు ఇవి.పేరుకుపోయిన నల్లధనాన్ని తెల్లవిగా మార్చుకునేందుకు కొందరు.. అందినకాడికి దోచుకుందామని మరికొందరు.. ఇదే ఆసరాగా చేసుకుని కమీషన్‌ దండుకునేందుకు ఇంకొందరు తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు.  
 
డీల్స్‌ ఇలా..
ప్రధాని మోదీ ప్రకటనతో పెద్ద నోట్ల వ్యవహారం పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు మాదిరిగా డబ్బును మార్చే దళారులు తయారయ్యారు. మొదటిరోజు లక్ష బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చేందుకు దళారులు రూ.5 వేలు కమీషన్‌ తీసుకోగా ఆదివారం నాటికి అది రూ.40 వేలకు చేరింది. అంటే పాత నోట్లు లక్ష ఇస్తే రూ.60 వేలు ఇస్తారు. సోమవారం నాటికి మరికొద్దిగా తగ్గుతుందని, బుధవారం నాటికి మరింత తగ్గుతుందంటూ డబ్బున్నవారితో ఫోన్లలో సంప్రదింపులు జరిపే వారు బిజీబిజీగా ఉన్నారు.

డిసెంబర్‌ 30 తర్వాత ఎందుకూ కొరగాని చిత్తుకాగితాలుగా లెక్కల్లో లేని రద్దు చేసే ప్రమాదం ఉంది. దీంతో అక్రమంగా లెక్కలకు చిక్కకుండా కాస్త సక్రమంగా , ప్రజలను వివిధ రూపాల్లో జలగలుగా పీలుస్తూ సంపాదించిన సొమ్ములను ఇలా వదిలించుకొనే క్రమంలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కోటి లెక్కనే ఈ లెక్కల సర్ధుబాటు తతంగం సాగుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement