ఉల్లిధర మరింత కిందకు..
Published Sun, Oct 9 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల ధర మరింత కిందకు వచ్చింది. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్తమార్కెట్‌లో ఉల్లిపాయల గత వారం కంటే తక్కువగా అమ్మారు. కిలో రూ.10కే నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిపాయలు లభించాయి. మార్కెట్‌కు 60 లారీల సరుకు వచ్చినప్పటికీ మహారాష్ట్ర నుంచి వచ్చిన పాత రకం ఉల్లిపాయలనే కొనుగోలు చేయడానికి వ్యాపారులు మొగ్గుచూపారు. గుత్త మార్కెట్‌లో పాత రకం ఉల్లిపాయలు కిలో రూ.5 నుంచి రూ.9 వరకు పలికాయి. విడిగా కిలో రూ.10కి, రూ.12కి విక్రయించారు. కర్నూలు రకం ఉల్లిపాయలు ధర గుత్త మార్కెట్‌లో కిలో రూ.1 నుంచి రూ.5.50 వరకు విక్రయించారు. విడిగా కిలో రూ.5 నుంచి రూ.8 వరకు అమ్మారు. కూరగాయల ధరలు వారం రోజుల క్రితం ధరలతో పోలిస్తే కొంచెం అటుఇటుగా ఉన్నాయి. తెల్లవంకాయలు కిలో రూ.60, బీర, బెండ, దొండకాయులు కిలో రూ.40కి విక్రయించారు. దోసకాయల ధర కిలో రూ.24 వరకు ఉంది. చిక్కుళ్లు రూ.80, ఆకాకరకాయలు రూ.60, క్యారెట్, బీట్‌రూట్ కిలో రూ. 40 వంతున అమ్మారు. కంద కూడా ఇదే ధరకు లభించింది. చామదుంపల ధర కిలో రూ.40, టమాటాలు కిలో రూ. 30, బీన్స్ రూ.60, క్యాబేజీ రూ.16, కీరా దోస రూ.30, క్యాప్సికమ్ రూ.60 చేసి అమ్మారు. పునాస మామిడి ధర కిలో రూ.70 ఉండగా విడిగా కాయ రూ.15 చేసి విక్రయించారు.
Advertisement
Advertisement