పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: ఉల్లి ధరలు గత వారంతో పోల్చుకుంటే మరింత పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి సీజన్ తగ్గిన తర్వాత ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత వారం కొంత వరకు తగ్గిన ఉల్లి ధర బుధవారం జరిగిన వేలంలో మరింత పెరిగాయి. వర్షాలు లేకపోవడంతో రైతులు నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చారు. దాదాపు 500 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. దీంతో వ్యాపారులు వేలం వేసి ఉల్లిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మార్కెట్‌లో వేలం పాటలు పోటీపోటీగా సాగాయి. స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.2,510 చొప్పున పలికాయి. గత వారంతో పోల్చితే గరిష్టంగా రూ.200, కనిష్టంగా రూ.310 వరకు ధరలు పెరిగాయి. అలాగే 45 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,550, కనిష్టంగా రూ.1,250 చొప్పున విక్రయించారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,459
దేవరకద్ర మార్కెట్‌లో జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,459 ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడంతో కొద్దిపాటిగా వచ్చిన ధాన్యానికి టెండర్లు వేశారు.
● గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.2,510
Comments
Please login to add a commentAdd a comment