హోల్ సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిధర కిలో రూపాయి స్థాయికి పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్‌గామ్ వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి ధర భారీగా పడిపోయింది. గత రెండు నెలల కాలంలో ధర ఏకంగా 91శాతం ధర క్షీణించింది. దీంతో రవాణా ఖర్చులు కూడా తమకు దక్క లేదని రైతులు వాపోతున్నారు. అయితే ఉల్లి ధర తగ్గడంతో గోదాముల్లో నిల్వ చేసుకోవాలని రైతులకు మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.
అకస్మాత్తుగా ఉల్లి సప్లయ్ మార్కెట్‌ను ముంచెత్తడంతో రెండు నెలల క్రితం 21 రూపాయిలు పలికిన ధర అక్టోబర్ రూ.17స్థాయికి దిగి వచ్చింది. డిసెంబర్ 24నాటికి ఏకంగా ఒక రూపాయికి పడిపోయింది. గత ఏడాది జులైలో ఒక రూపాయికి చేరిగా, 2016లో కిలో 5పైసలు స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment