rs.1
-
కిలో రూపాయికే ఉల్లి
హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధర మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిధర కిలో రూపాయి స్థాయికి పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్‌గామ్ వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధర భారీగా పడిపోయింది. గత రెండు నెలల కాలంలో ధర ఏకంగా 91శాతం ధర క్షీణించింది. దీంతో రవాణా ఖర్చులు కూడా తమకు దక్క లేదని రైతులు వాపోతున్నారు. అయితే ఉల్లి ధర తగ్గడంతో గోదాముల్లో నిల్వ చేసుకోవాలని రైతులకు మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా ఉల్లి సప్లయ్ మార్కెట్‌ను ముంచెత్తడంతో రెండు నెలల క్రితం 21 రూపాయిలు పలికిన ధర అక్టోబర్ రూ.17స్థాయికి దిగి వచ్చింది. డిసెంబర్ 24నాటికి ఏకంగా ఒక రూపాయికి పడిపోయింది. గత ఏడాది జులైలో ఒక రూపాయికి చేరిగా, 2016లో కిలో 5పైసలు స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. -
రూ.1 కే విమాన టికెట్
సాక్షి, ముంబై: దేశీయ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ డెక్కన్ విమాన ప్రయాణీకులకు బంపర్ఆఫర్ ఇచ్చింది. భారీ రుణ ఎగవేత దారుడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వినీం, సంక్షోభం, 2012లో కార్యకలాపాలు మూసివేత అనంతరం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా తమ కస్టమర్లకు రూ.1 కే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బడ్జెట్ క్యారియర్ తొమ్మిది సంవత్సరాల తర్వాత దాని కార్యకలాపాలను పునఃప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తొలి విమానం డిసెంబర్ 22 న గాల్లోకి ఎగరనుంది. నాసిక్ నుంచి ముంబయికి ఈ సర్వీసును ప్రారంభించనున్నామని కెప్టెన్ గోపినాథ్ తెలిపారు. ప్రారంభ అదృష్టవంతులైన కొంతమంది ప్రయాణీకులు ఒక రూపాయికే టికెట్ పొందవచ్చని చెప్పారు. కాగా ఉడాన్ పథకం కింద విమాన సర్వీసులను నడిపేందుకు అనుమతి పొందిన వాటిల్లో ఎయిర్ డెక్కన్ కూడా ఒకటి. ఈ పథకం కింద ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించేందుకు దేశంలోని లాభాపేక్షలేని, విమానాశ్రయాలను అనుసంధానించే విమానాల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో స్పైస్‌జెట్, ఎయిర్ ఒడిషా, ఎయిర్ ఇండియా అనుబంధ ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్, ఎయిర్ డెక్కన్, టర్బో మెఘా అనుమతి పొందాయి. ఇవి దేశవ్యాప్తంగా 70 విమానాశ్రయాలను కలిపే 128 మార్గాల్లో విమాన సేవలు నిర్వహిస్తాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, షిల్లాంగ్ లలో తన సర్వీసులను ప్రారంభిస్తోంది. -
ఆరోగ్య పథకాలకు రూ.1,196 కోట్లు
ఎన్హెచ్ఎం కింద నిధుల కోరిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కార్యక్రమాలకు అవసరమైన నిధులు కోరుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) ఎన్హెచ్ఎం ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు రూ.1196.04 కోట్లు కావాలని కోరుతూ నివేదిక పంపింది. 2016–17లో తెలంగాణకు ఎన్హెచ్ఎం కింద కేంద్రం రూ.750 కోట్లు కేటాయించిన సంగతి విదితమే. ఈసారి రూ.400 కోట్లకుపైగా అధికంగా ప్రతిపాదించారు. కేంద్రం అంత మొత్తం కేటాయిస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.750 కోట్లు కేటాయించగా అందులో కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయన్న విమర్శలున్నాయి. ఎన్హెచ్ఎం నిధుల్లో కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంది. -
ధాన్యానికి ధర దగ
తాడేపల్లిగూడెం : ప్ర స్తుత సార్వా సీజన్ రైతులకు కొంత ఊరటనిచ్చేలా కనిపిస్తోంది. సీజన్ ఆరంభంలోనే ధాన్యానికి ఆశాజనకమైన ధర లభిస్తోంది. మెట్ట ప్రాంతంలో వరి కోతలు, ధాన్యం మాసూళ్లు ఊపందుకోగా.. ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు అప్పటికప్పుడే కళ్లాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. 28 శాతం తేమగల ధాన్యం బస్తా (75 కేజీలు)కు రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఆరుదల ధాన్యాన్ని (తేమ శాతం 16 ఉంటే) బస్తాకు రూ.1,250 చెల్లిస్తున్నారు. సాధారణంగా కొట్టుపొట్టు (28 శాతం తేమ ఉండే) ధాన్యాన్ని రూ.850 నుంచి రూ.900కు కొనుగోలు చేసేవారు. ఈసారి బస్తాకు రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా చెల్లిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెట్టలో ముమ్మరం మెట్ట ప్రాంతాల్లో సార్వా మాసూళ్లు ఊపందుకున్నాయి. సాధారణంగా దీపావళి నాటికి గాని వరి పంట చేతికి రాదు. ఈసారి మెట్టలో వ్యవసాయ పంపుసెట్ల కింద నాట్లు ముందుగా వేశారు. దీంతో పది రోజులుగా మాసూళ్లు సాగుతున్నాయి. వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి ఆరబెట్టని ధాన్యాన్ని అప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో తేమ శాతం 28 ఉన్నప్పటికీ కొనుగోలు చేయడానికి వ్యాపారులు వెనుకంజ వేయడం లేదు. ఆరుదల ధాన్యానికి బస్తాకు రూ.1,250 పలుకుతున్నప్పటికీ.. వాతావరణం రోజుకో రకంగా మారుతుండటంతో రైతులు కోసిన ధాన్యాన్ని కోసినట్టే విక్రయిస్తున్నారు. ధాన్యంలో తేమ 17 శాతం వచ్చేవరకు ఆగడం కంటే వెంటనే అమ్మేసుకోవడమే బాగుందని పలువురు రైతులు చెబుతున్నారు. మెట్టలో ఎక్కువగా 1010 రకం ఊడ్చారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో రోజుకు 25 లారీల ధాన్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఎగుమతుల నేపథ్యంలోనే.. దక్షిణాఫ్రికా దేశాలు 1010 రకం బియ్యాన్ని పెద్దఎత్తున దిగుమతి చేసుకునేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎగుమతి దారులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లు ఇచ్చాయి. దీంతో ఇక్కడి వ్యాపారులంతా దక్షిణాఫ్రికాకు బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితుల్లో ధాన్యం ధరలు మెరుగుపడ్డాయి. పాత ధాన్యం విషయానికొస్తే 1010 రకం బస్తా (75 కేజీలు) రూ.1,250 వద్ద స్థిరపడింది. పీఎల్ రకం రూ.1,400, సోనా రకం రూ.1,750 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. -
వట్టిసీమ
‘పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేశాం. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని పెన్నా నది వరకూ తీసుకువెళ్తాం. రాయలసీమకు నీళ్లిస్తాం’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చేస్తున్న ప్రకటన ఇది. ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నామని ముఖ్యమంత్రి ఘనంగా చెప్పుకుంటున్నారు. పథకాన్ని ప్రారంభించి రెండు నెలలు గడచిపోయింది. అయినా ఇప్పటివరకు పట్టుమని 12 టీఎంసీల నీటిని కూడా కృష్ణా నదిలోకి మళ్లించలేకపోయారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు :గోదావరిలో వరద ప్రవాహం ఉండే 110 రోజుల్లో 80 టీఎంసీల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం కుడికాలువ పనులు, దానిపై ఉన్న బ్రిడ్జిలు, అండర్ టన్నెల్స్, అక్విడెక్టుల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఇప్పటివరకూ 5 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. గోదావరి నదిలో ఆగస్టు నెలాఖరు వరకే వరద ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత వరద వచ్చే అవకాశాలు లేవు. వరద లేనప్పుడు నీటి తరలింపు సాధ్యం కాదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ఖరీఫ్‌లో 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించే పరిస్థితి కనిపించడం లేదు. రోజుకు పూర్తి సామర్థ్యంతో కనీసం 120 రోజులపాటు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా పంపితేగాని లక్ష్యం పూర్తి కాదు. గోదావరిలో వరద ఉండే రోజులు ఎన్ని, ఎన్ని రోజులు నీరు ఇస్తారన్నది అనుమానమే. గత ఏడాది తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటిని సైతం గోపాలపురం మండలం గుడ్డిగూడెం రెగ్యులేటర్ దిగువన పోలవరం కుడి కాలువలో కలిపినా నాలుగు టీఎంసీలు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది 20 టీఎంసీలు మించే అవకాశం కనిపించడం లేదు. నీరు వదిలిన కొద్ది రోజులకే కృష్ణాజిల్లా రామిలేరు వద్ద గండి పడటంతో నీటి విడుదలను ఆపేశారు. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలకు ప్రకాశం బ్యారేజి వద్ద నీటిమట్టం 12 అడుగులు ఉండేలా చూడటం కోసం నీటిని నిల్వ చేశారు. ఆ తర్వాత కృష్ణాలో వరద రావడంతో మరికొన్ని రోజులు పట్టిసీమ నీటిని ఆపేశారు. ఇవన్నీ లెక్కేసుకున్నా కృష్ణా డెల్టాకు 7నుంచి 8 టీఎంసీల నీరు కూడా వెళ్లలేదని సమాచారం. మధ్యలో డెల్టాకు నీరు లేక ఎండిపోతున్నాయంటూ జానంపేట వద్ద పైపులు వేసి 300 క్యూసెక్కుల వరకూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దొడ్డిదారిన తరలించుకుపోయారు. పట్టిసీమలో మొత్తం 24 మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటార్ సామర్థ్యం 350 క్యూసెక్కులు. అన్ని మోటార్లను ఆన్ చేస్తే 8,400 క్యూసెక్కుల నీటిని ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ గరిష్టంగా ఇచ్చింది 5 వేల క్యూసెక్కులకు మించి లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ నీటిని విడుదల చేస్తే పోలవరం కాలువకు గండ్లు పడటం ఖాయమని చెబుతున్నారు. గుడ్డిగూడెం–గోపాలపురం మధ్య నాలుగు ప్రదేశాల్లో యూటీల నిర్మాణం పూర్తికాలేదు. గోపాలపురం–చిట్యాల మధ్య పోలవరం కాలువపై వంతెనల నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. యూటీలు నిర్మించాల్సిన ప్రదేశాల్లో మట్టితో పూడ్చి గట్లు పనులు చేస్తూనే ఉన్నారు. పెదవేగి మండలంలో 12 కిలోమీటర్ల మేర ఏటిగట్లు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ముండూరు నుంచి జానంపేట వరకూ ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. జానంపేట అక్విడెక్ట్ వద్ద పనులు పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో కృష్ణాలో ఖరీఫ్‌కు పట్టిసీమ నుంచి మరో 7 నుంచి 8 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణా డెల్టాకు 20 టీఎంసీల నీటిని మాత్రమే తరలించే అవకాశం ఉన్న పట్టిసీమ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచుతూ వచ్చిన ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు రూ.1,600 కోట్లు ముట్టజెప్పింది. ముడుపులపై ఉన్న మోజు పనులపై లేకపోవడంతో భారీఎత్తున నిధులు వెచ్చించినా లక్ష్యం నెరవేరలేదు. -
మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం
భీమవరం : భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ అండ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెట్ ఆధ్వర్యంలో సోమవారం రూ.1,01,116ను విరాళంగా అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తికి ఈ మొత్తం చెక్కు అందించారు. ధర్మకర్తల మండలి సభ్యులు అడ్డగర్ల ప్రభాకరగాంధీ, శిరిగినీడి చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి విరాళం
భీమవరం: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి నిత్యాన్నదాన పథకానికి భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వేణుగోపాలరాజు, సుభద్రస్వాతి దంపతులు సోమవారం రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ధర్మకర్తల మండల సభ్యులు అడ్డగర్ల ప్రభాకరగాంధీ, కట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భయం వద్దు.. భరోసాగా మేమున్నాం
-
'భయం వద్దు.. భరోసాగా మేమున్నాం'
చెన్నై: భారీ వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడులోని దుర్భర పరిస్థితులను, జరిగిన నష్టాన్ని తాను స్వయంగా చూశానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ ఆపత్కాలంలో తమిళనాడు ప్రజలతో భుజం భుజం కలిపి.. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. సహాయ కార్యక్రమాల కోసం స్వతరమే రూ. వెయ్యి కోట్లు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. గతంలో వర్షాల సందర్భంగా కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సహాయం అందజేసిందని, దానికి అదనంగా ప్రస్తుతం ఈ మొత్తాన్ని ఇస్తున్నామని ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. వర్షాలకు ఛిన్నాభిన్నమైన తమిళనాడులోని చెన్నై, కంచిపురం, తిరువళ్లూరు జిల్లాల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ రాష్ట్రంలోని బీభత్సంపై అడిగి తెలుసుకున్నారు. -
26న రూ.1,500 కోట్ల అప్పు
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యురిటీల విక్రయం ద్వారా ఈ నెల 26వ తేదీన రూ.1,500 కోట్ల రుణాన్ని సేకరించనుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,650 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది.