మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం
భీమవరం : భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ అండ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెట్ ఆధ్వర్యంలో సోమవారం రూ.1,01,116ను విరాళంగా అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తికి ఈ మొత్తం చెక్కు అందించారు. ధర్మకర్తల మండలి సభ్యులు అడ్డగర్ల ప్రభాకరగాంధీ, శిరిగినీడి చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.