రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
భీమవరం : చదరంగం ద్వారా మేధోసంపత్తిని పెంపొందించుకునే అవకాశం ఉందని, ఈ క్రీడ పట పిల్లలను ప్రోత్సహించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తల్లిదండ్రులకు సూచించారు. భీమవరం వెస్ట్‌బెర్రీ స్కూల్లో నాలుగు రోజలపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి బాలబాలికల చదరంగం పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోటీల నిర్వహణకు అనసూయ చెస్ అకాడమీ, జిల్లా చెస్ అసోసియేషన్, వెస్ట్‌బెర్రీ స్కూల్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. తోట సీతారామలక్ష్మి రాష్ట్ర చెస్ అసోసియేషన్‌అధ్యక్షుడు వైడీ రామారావు పావులను కదిపి క్రీడను ప్రారంభించారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రమేష్, ఆర్గనైజర్ మాదాసు కిశోర్, అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు గమిని రవి పవన్‌కుమార్, స్కూల్ డైరెక్టర్ ఎన్.మహేష్, స్కూల్ ప్రిన్సిపాల్ గుజ్జుల సునీత, కిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ కె.శ్రీలతాదేవి, గమిని రమ్య, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.