wednesday
-
మహారాష్ట్ర పోలింగ్ బుధవారమే ఎందుకు?
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నగారా మోగించింది.నామినేషన్లు, పోలింగ్, ఫలితాల తేదీల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ తేదీ,పోలింగ్ జరిగే వారం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు.నవంబర్ 20 (బుధవారం) మహారాష్ట్రలో ఉన్న మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తాం. పోలింగ్ కోసం బుధవారాన్ని మేం కావాలనే ఎంచుకున్నాం. వారం మధ్యలో పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనే బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నాం.వీకెండ్లో పోలింగ్ ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’అని రాజీవ్‌కుమార్ చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
భీమవరం : చదరంగం ద్వారా మేధోసంపత్తిని పెంపొందించుకునే అవకాశం ఉందని, ఈ క్రీడ పట పిల్లలను ప్రోత్సహించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తల్లిదండ్రులకు సూచించారు. భీమవరం వెస్ట్‌బెర్రీ స్కూల్లో నాలుగు రోజలపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి బాలబాలికల చదరంగం పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోటీల నిర్వహణకు అనసూయ చెస్ అకాడమీ, జిల్లా చెస్ అసోసియేషన్, వెస్ట్‌బెర్రీ స్కూల్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. తోట సీతారామలక్ష్మి రాష్ట్ర చెస్ అసోసియేషన్అధ్యక్షుడు వైడీ రామారావు పావులను కదిపి క్రీడను ప్రారంభించారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రమేష్, ఆర్గనైజర్ మాదాసు కిశోర్, అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు గమిని రవి పవన్‌కుమార్, స్కూల్ డైరెక్టర్ ఎన్.మహేష్, స్కూల్ ప్రిన్సిపాల్ గుజ్జుల సునీత, కిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ కె.శ్రీలతాదేవి, గమిని రమ్య, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
తాడేపల్లిగూడెం : ఆకాశంలో ఉదయం నుంచీ కారుమబ్బులు.. బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఒక్కసారిగా కురిసిన వాన, హోరుగాలులకు ప్రజలు పులకించిపోయారు. ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకంటూ ఆనందం వ్యక్తం చేశారు. చల్లగాలుల తాకిడిని ఆస్వాదించారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. రోహిణి కార్తె చివరి దశలో కురిసిన భారీవర్షానికి భూమి చల్లబడింది. జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. భీమవరంలో సాయంత్రం ప్రారంభమైన వాన రెండు గంటల పాటు ఏకధాటిన కురిసింది. జంగారెడ్డిగూడెంలో పది నిమిషాలపాటు చిరుగాలితో కూడిన జల్లులు పడ్డాయి. తాడేపల్లిగూడెంలో రెండు గంటల పాటు వాన పడుతూనే ఉంది. కొవ్వూరు, పోలవరం, గోపాలపురం నియోజకవర్గంలోని పలుచోట్ల, ఏలూరు నగరంలో వర్షం పడింది. ఉక్కపోతకు ఉపశమనం కలుగ చేసింది. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు జిల్లాలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివి జన్ల వారీగా ఇప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందరు మరణించారు అనే వివరాలు సేకరించారు. రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు తోడు మరో 13 వాహనాలను సమకూర్చిందని వాటిని ఎవరు మోనిటర్ చేస్తున్నారని, వాహనాలు వచ్చిన తర్వాత ప్రమాదాలను ఎంత మేరకు తగ్గించారని అడిగి తెలుసుకున్నారు. ఆయా వివరాలను డీఐజీ, ఎస్పీ గణాంకాలతో వివరించారు. -
మద్దిలో ముగిసిన హనుమద్ జయంతి
జంగారెడ్డిగూడెం రూరల్ : హనుమద్ నామ స్మరణతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆల యం మార్మోగింది. ఈ క్షేత్రంలో జరుగుతున్న హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమత్ దీక్షధారులు బుధవారం స్వామి సన్నిధిలో తమ ఇరుముళ్లను సమర్పించారు. మహా పూర్ణాహుతి హోమ గుండంలో తమ ఇరుముళ్లలోని నెయ్యిని సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకుల బృందం, వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పంచామృతాలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, పసుపు, కుంకుమ, సింధూరంతో అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, ఆలయ కార్వనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలను తిలకించారు. బుధవారంతో క్షేత్రంలో హనుమద్ జయంతి ఉత్సవాలు నేత్ర పర్వంగా ముగిశాయి. హంసవాహనంపై అంజన్న బుధవారం రాత్రి మద్ది ఆంజనేయస్వామి, సువర్చలాదేవి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. హంస వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గుర్వాయిగూడెం పుర వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవం నేత్ర పర్వంగా సాగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
నేత్ర పర్వం.. శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల : సమ్మోహిత రూపంతో భక్తులకు అభయహస్తమిస్తూ చినవెంకన్న ఉభయదేవేరులతో రథవాహనంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవిలతో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వైభవోపేతంగా రథరంగ డోలోత్సవం శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రథవాహనం ద్వారా భక్తులు స్వామికి సేవచేసుకునే అవకాశం లభించింది. బుధవారం రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాటభజనలతో శ్రీవారి రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సమర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈఓ త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మురళీకృష్ణుడిగా మురళీకృష్ణుడి అలంకారంలో చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారు పిల్లనగ్రోవి ధరించి, గోవులను సంరక్షించే మురళీకృష్ణుడిగా భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 10 గంటలకు భక్తి రంజని ఉదయం 10.30 గంటలకు అపబృదోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజారోహణ రాత్రి 8 గంటల నుంచి బుర్రకథ ప్రదర్శన రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం -
ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రమశిక్షణ, నిబద్ధత వంటి పర్యాయ పదాలకు నిర్వచనమైన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత, స్పృహ కలిగి ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించవలసిన సమయం వారికి వినియోగించకుండా అవమానాల పాలుకావద్దని హితవు పలికారు. బయోమెట్రిక్ హాజరు అమలుపై మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమయానికి బడికి వెళ్లమనడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం మీ ఊరు– మీ మంత్రి కింద నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోరే వ్యక్తి జవహర్ అని పేర్కొన్నారు. డీఈవో ఆర్ఎస్ గంగా భవానీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మంత్రి జవహర్ మార్గదర్శకులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు మాట్లాడుతూ 1997లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మంత్రి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీటీఎఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందుకు వెళ్లారన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎన్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు కృష్ణ, జేఏసీ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీఎన్ జీవో సంఘ ఉపాధ్యక్షుడు రమేష్, ఆర్‌యూపీపీ జిల్లా అ«ధ్యక్షుడు టి.గిరిరాజు, వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధీర్, టీఎన్ యూఎస్ జిల్లా అధ్యక్షుడు టీవీ రామకృష్ణ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం మంత్రి జవహర్ దంపతులను వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సత్కరించాయి. డిప్యూటీ డీఈవో డి. ఉదయ్‌కుమార్, సర్వశిక్షాభియాన్ సీఎంవో రూజ్వెల్ట్ పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం
ద్వారకా తిరుమల :శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన గర్రే రాఘవగుప్తా ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన భవనంలో ఈ విరాళాన్ని జమచేశారు. దాతకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్‌ను అందజేసి, అభినందించారు. -
భీమవరంలో వాలీబాల్ శిక్షణ శిబిరం
భీమవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, సరికొత్త ఆలోచనలకు దోహదపడతాయని భీమవరం డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు. కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సమ్మర్ రెసిడెన్షియల్ వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్, వసు«ధ ఫౌండేష న్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వసుధా ఫౌండేష న్ కార్యదర్శి మంతెన వెంకటరామరాజు మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఇలాంటి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా కార్యదర్శి జి.నారాయణరాజు, వసుధాఫౌండేష న్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, శివరామరాజు, ఎంసీహెచ్ ఆర్కే రాజు, సుదర్శన వర్మ, శ్రీనివాసరాజు, జీవీ పవ న్ కుమార్రాజు పాల్గొన్నారు. -
87 సిలిండర్లు స్వాధీనం
తణుకు టౌన్: తణుకులో డివిజనల్ సివిల్ సప్లయీస్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 87 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు డీటీ డి.అశోక్‌వర్మ తెలిపారు. బుధవారం కొవ్వూరు డివిజనల్ ఏఎస్ఓ ఆనందబాబు ఆధ్వర్యంలో తణుకులోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బడ్డీ వ్యాపారులు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేశామన్నారు. 87 గృహావసరాల సిలిండర్లను గుర్తించి 50 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వీటిలో 38 ఇండేన్ గ్యాస్, 49 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. వీఆర్ఓలు ఉన్నారు. -
డీఈడీ కళాశాలలో ఫుడ్ మేళా
దెందులూరు: ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమేనని దెందులూరు విజయ్ నగేష్ డీఈడీ కళాశాల కాలి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు అధ్యక్షతన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. డీఈడీ విద్యార్థులు ఐదు గ్రూపులుగా ఏర్పడి ఐదు విభాగాల్లో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి ఆడిటోరియం హాల్లో ప్రదర్శించారు. పిండి పదార్థాలు, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు కలిగి ఉన్న వివిధ రకాలు ఆహార పదార్థాలను తయారు చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సుగ్గిశెట్టి సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
కేసుల్లో సొత్తు రికవరీ పెంచాలి
ఏలూరు అర్బన్: జిల్లాలో ప్రస్తుతం తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్న నేపథ్యంలో నేరాలను నియంత్రించడంతో పాటు అపహరణకు గురైన సొత్తు రికవరీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని క్రైం డీఎస్పీ టి.సత్యనారాయణ సూచించారు. స్థానిక కోటదిబ్బ ప్రాంతంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన ఏలూరు డివిజన్లోని ఏలూరు టౌన్, ఏలూరు టూటౌన్, ఏలూరు రూరల్, భీమడోలు, గణపవరం సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. చాలా నేరాల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా సొత్తు రికవరీ పూర్తిస్థాయిలో ఉండటం లేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారని చెప్పారు. పోగొట్టుకున్న సొత్తును పూర్తిస్థాయిలో అందిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సొత్తు రికవరీ పూర్తిస్థాయిలో జరపాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. మహిళా డీఎస్పీ రవికృష్ణకుమార్ మాట్లాడుతూ సమాజంలో ఇటీవల ఆడవారిపై వేధింపులు పెరిగాయన్నారు. అయితే బాధితులు చాలా కేసుల్లో వివిధ కారణాలతో స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చినప్పుడు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఇటీవల మహిళలపై వరకట్న, లైంగిక వేధింపులతో పాటు చిన్నారులపై అత్యాచారయత్నాలు పెరగడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేసేలా చొరవ చూపాలని సూచించారు. సీఐలు ఎన్.రాజశేఖర్, ఉడతా బంగార్రాజు, అడపా నాగమురళి, ఎన్.దుర్గాప్రసాద్, సి. Ðð ంకటేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఈ ఆఫీస్‌లో జిల్లా ప్రథమం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈ ఆఫీస్ విధానంలో పశ్చిమగోదావరి జిల్లా సేవలు ప్రథమ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర ఖజానా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్రస్థాయి ఖజానా శాఖ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ ఆఫీస్, ఈ కార్యాలయం, ఈ ఫైలింగ్ వంటి అంశాల్లో పశ్చిమ ముందంజలో ఉందన్నారు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని చెప్పారు. బయోమెట్రిక్ హాజరు వేసి సదరు ఉద్యోగి కార్యాలయంలో లేకుంటే చర్యలు తప్పవని, అవసరమైతే సస్పెండ్ చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మూడేళ్లు దాటిన ప్రతి ఉద్యోగి బదిలీ కావాలని, అప్పుడే ప్రజలకు సరైన సేవలు అందుతాయన్నారు. దీని వల్ల ఉద్యోగులకు అంకితభావం పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఉద్యోగి సామాన్యుడిగా భావించుకుని విధులు నిర్వహించాలని సూచించారు. నిబద్ధతతో పనిచేయాలి ఉద్యోగుల కుటుంబ పోషణకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రజలకు సేవ చేయాలనే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి విధులు నిర్వర్తించాలన్నారు. ఖజానా శాఖ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సహకరించాలన్నారు. గతేడాది 40 శాతం బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని, ఈ ఏడాది మరింతగా పెరగాలని ఆయన కోరారు. ఖజానా శాఖ డైరెక్టర్ కె.కనవల్లి మాట్లాడుతూ ఉద్యోగులందరూ నిబద్ధతతో విధులు నిర్వహించి ఖజానా శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యదర్శి రవిచంద్ర అంకితభావంతో ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఖజానా శాఖ అధికారి లలిత, డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఏజెంట్లను నిర్బంధించిన పెరల్స్ బాధితులు
యర్నగూడెం (దేవరపల్లి) : డిపాజిట్లు కాలపరిమితి దాటినా చెల్లించడం లేదని యర్నగూడెంలో పెరల్స్ బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏజెంట్లను చుట్టుముట్టి సుమారు రెండు గంటల పాటు నిర్బంధించారు. డిపాజిట్లు చెల్లించే వరకు కదలనీయమని పట్టుపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. యర్నగూడెంకు చెందిన సుమారు 150 మంది కూలీ, నాలీ చేసుకుని పొట్టపోసుకుంటున్న కార్మికులు పెరల్స్ సంస్థలో సుమారు రూ. 2 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిట్ కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీతో సహా డిపాజిట్లు చెల్లించాలని సంబంధిత ఏజెంట్లను కోరారు. అదిగో వస్తాయి. ఇదిగో వస్తాయంటూ ఏజెంట్లు కాలయాప చేస్తూ వస్తున్నారు. ఏజెంట్లపై నమ్మకం లేకపోవడంతో కొందరు డిపాజిట్ దారులు రాజమండ్రిలోని సంస్థ కార్యాలయాలని పలుమార్లు తిరిగారు. అక్కడ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో అయోమయంలో పడ్డారు. అప్పటి నుంచి ఏజెంట్లు కూడా జాడలేక పోవడంతో మోసపోయామని గ్రహించిన డిపాజిట్ దారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడుతున్నారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏజెంట్లను చుట్టుముట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్భంధించి తమ డిపాజిట్లు చెల్లించాలని పట్టుపట్టారు. అయితే సంస్థ కొన్ని ఇబ్బందుల్లో ఉందని, త్వరలో డిపాజిట్లు చెల్లిస్తుందని ఏజెంట్లు నచ్చజెప్పారు. బాధితులు ముంగర మహంకాళి, గణుసుల పాపమ్మ, ముంగర వీరాస్వామి, టి. సాంబమూర్తి, గణుసుతల చంటియ్య మట్లాడుతూ గ్రామంలో సుమారు 200 మంది వరకు బాధితులు ఉన్నామని తెలిపారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్లు చేశామని చెప్పారు. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని డిపాజిట్లు చేశామని, ఈ విధంగా మోసం జరుగుతుందని ఊహించలేదని బాధితులు వాపోయారు. కాగా గ్రామస్తులు జోక్యం చేసుకుని బాధితుల నుంచి ఏజెంట్లను విడిపించారు. -
ప్రాజెక్టు పరిధిలో చేపల సంచారంపై పరిశీలన
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గోదావరి నదిలో చేపల సంచారానికి ఇబ్బందులు లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రాజెక్టు ఇంజినీరింగ్, మత్స్యశాఖ అధికారులు బుధవారం సాంకేతికంగా పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ అతిథి గృహంలో సమావేశం నిర్వహించి, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ బాషా మాట్లాడుతూ కొన్ని రకాల చేపలు కాలువల నుంచి నదిలోకి మైగ్రేషన్ ఉంటుందన్నారు. ఏ నెలల్లో ఏఏ రకాల చేపలు అందుబాటులో ఉంటాయి? సంచరిస్తాయి? అనేది ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. చేపల సంచారానికి వీలుగా స్పిల్‌వేలో ఎక్కడ డిజైన్ చేయాలనేది ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో చర్చించటం జరిగిందన్నారు. స్పిల్‌వే ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్నారు. స్పిల్‌వే 1, 2 బ్లాక్‌ల మధ్య చేపల సంచారానికి వీలుగా ఏర్పాట్లు చేయటంపై ఇంజినీరింగ్ అధికారులు చర్చించారన్నారు. ప్రధానంగా బొచ్చె, శీలావతి, మోసు, గండుమేను, ఇసుకదొందులు, జెల్ల, పులస, వాలుగు, కొర్ర మేను, రొయ్యలు, బొమ్మిడాయి జాతులు ఉంటాయన్నారు. సైజును బట్టి అవి ప్రయాణం చేస్తాయన్నారు. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వి.సురేష్, డాక్టర్ మాన్సన్, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీలు పి.రామ్మోహన్, డి.గోపిరెడ్డి, పోలవరం అథారిటీ సీఈ ఎ.పరమేశ్వరన్, ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్.రమేష్‌బాబు సమావేశంలో పాల్గొన్నారు. -
త్వరలో 453 ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో రూ.76.73 కోట్ల వ్యయంతో 453 ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను నాబార్డు నిధులతో నిర్మిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. రూ.575 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన 223 అభివృద్ధి పనుల ప్రగతి తీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యసేవలు విస్తృతం చేసి ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు పటిష్టమైన భవన నిర్మాణ పనులు చేపడతామన్నారు. నాబార్డు ఆర్థిక సహాయం రూ.100 కోట్ల వ్యయంతో 948 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఎన్జీ రంగా యూనివర్సిటీలకు కేటాయించిన నిధుల పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం రామప్రభు, ఆర్అంఽడ్బీ ఎస్ఈ నిర్మల, పంచాయతీరాజ్ ఎస్ఈ ఈ.మాణిక్యం, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కోటేశ్వరి పాల్గొన్నారు. మల్బరీ తోటలకు ప్రోత్సాహం ఏలూరు సిటీ : జిల్లాలో మల్బరీతోటలను ప్రోత్సహించి తక్కువ ఖర్చుతో లాభాల పంట సాధించేలా రైతులను చైతన్యపరచడానికి మల్బరీపై ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో మల్బరీతోటల పెంపుపై ఆన్లైన్లో రైతులకు సేవలందించేందుకు అనువుగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 2 వేల ఎకరాల్లో మల్బరీతోటలు పెంచాలని ఒక ప్రణాళికను చేపట్టామని ఇందుకోసం 4 వేల మంది రైతుల పేర్లను 15 రోజుల్లో ఈ యాప్ ద్వారా నమోదు చేయాలని చెప్పారు. -
మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
నరసాపురం: మొగల్తూరు ఆనందా రొయ్యల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఘటనలో మృతిచెందిన కార్మికులకు నష్టపరిహారంగా ఫ్యాక్టరీ ప్రకటించిన రూ.15 లక్షల నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు బుధవారం నరసాపురం మండలం సీతారామపురంలో మంత్రి పితాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనపై ఐఏఎస్ అధికారితో కూడిన బృందంతో విచారణ జరిపిస్తామని, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్, మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీల విషయంలో తాను మాట మార్చలేదన్నారు. జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్‌లో వ్యర్థాలు కలుపుతున్న ఫ్యాక్టరీలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా ట్రీట్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని, ఆరు నెలల్లో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఘోరాన్ని రోడ్డు ప్రమాదంతో పోల్చిన మంత్రి మొగల్తూరు ఘటన మంత్రి పితాని రోడ్డు ప్రమాదంతో పోల్చారు. ఫ్యాక్టరీల యాజమాన్యం నిబంధనలు పాటించాలని, కార్మికుల రక్షణపై చర్యలు తీసుకోవాలని చెబుతూనే ఆనందా ఫ్యాక్టరీలో ప్రమాదం అనుకోకుండా జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా ఎలా జరుగుతాయో, ఇదీ అలాగే జరిగిందని వ్యాఖ్యానించడంతో పలువురు నోరెళ్లబెట్టారు. ఊరేగింపుగా సీతారామపురం నరసాపురం ఇరిగేషన్ అతిథి గృహం నుంచి సీతారామపురం వరకూ మంత్రి పితానిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనందా ఫ్యాక్టరీ ఘటన మృతుల బంధువులను అధికారులు సీతారామపురం రప్పించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి మంత్రి పరామర్శిస్తారని, అక్కడే నష్టపరిహారం కూడా ఇస్తారని అంతా భావించారు. ఫ్యాక్టరీని కూడా మంత్రి పరిశీలిస్తారని అనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా సీతారామపురంలో కార్యక్రమం ఏర్పాటుచేసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఐదుగురి మృతుల్లో నల్లం ఏడుకొండలు బంధువులు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారానికి సంబంధించి రూ.20 లక్షలు అందించామని, మిగిలిన రూ.5 లక్షలు త్వరలో అందజేస్తామని మంత్రి పితాని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, మున్సిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, చినమిల్లి సత్యనారాయణ, అండ్రాజు చల్లారావు, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ పాల్గొన్నారు. -
విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి
రాజంపేట టౌన్ : విద్యార్థులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి సీ.చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ‘అంబేడ్కర్ జీవితం’ అనే అంశంపై వ్యాసరచన పోటీలతో పాటు చిత్రలేఖనం, క్విజ్‌పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చెన్నయ్య ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగానే భారతదేశ ప్రజలు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను అనుభవిస్తున్నారన్నారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని చెన్నయ్య తెలిపారు. ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎన్.శివరామయ్య, ధర్మరాజు నాయక్, ఎం.రాజయ్య, జీ.పెంచలయ్య, డి.చెంగల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల స్టెప్పులు అదిరే..
ఏలూరు సిటీ : స్ధానిక ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ 13వ వార్షి కోత్సవం బుధవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో స్ఫూర్తి అవార్డులు కైవసం చేసుకోవడం అభినందనీయమని, విద్యా సంస్థల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. పాఠశాల డైరెక్టర్ కె.మదనమోహనరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని సీహెచ్ సత్య శారద, విద్యావేత్త బొమ్మి అచ్యుతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ సేవలతో దళితుల అభ్యున్నతి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేశంలో అణగారిన, దళిత వర్గాల అభివృద్ధికి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ ఎనలేని సేవలు చేశారని, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. జగ్జీవన్‌రామ్ 110వ జయంతిని బుధవారం ఏలూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆళ్ల నాని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉప ప్రధానిగా జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు తదనంతర కాలంలో వచ్చిన నాయకులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అణగారిన వర్గాలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు, విధానాలు ఉండాలని భావించి అంబేడ్కర్ రాజ్యాంగంలో వీటిని పొందుపరిస్తే అమలు చేయడంలో జగ్జీవన్‌రామ్ కీలక ప్రాత పోషించారన్నారు. అంబ్కేర్, జగ్జీవన్‌రామ్ పోరాటాలే స్ఫూర్తిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని నియంతృత్వ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. జాతీయ నాయకుల ఆశయాలను నెరవేర్చడానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆయన మార్గదర్శకులు సీనియర్ నాయకుడు పటగర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ దేశంలోనే వెనుకబడిన బిహార్ నుంచి దళితుల అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన జగ్జీవన్‌రామ్ ఎందరో దళిత నాయకులకు మార్గనిర్దేశంగా నిలిచారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ నగర కన్వీనర్ మున్నుల జాన్ గురునాథ్ అధ్యక్షత వహించగా పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి దిరిశాల వరప్రసాద్, జిల్లా నాయకుడు మామిళ్లపల్లి జయ ప్రకాష్, కార్పొరేటర్లు కర్రి శ్రీను, బండారు కిరణ్, నాయకులు వేగి లక్ష్మి ప్రసాద్, పైడి భీమేశ్వరరావు, దుర్గారావు, మహ్మద్ ఖైసర్, పల్లెం ప్రసాద్, శిరిపల్లి ప్రసాద్,మట్టా రాజు, బోడా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. స్థానిక ఏపీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బాబూ జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ లలిత, ఎం.వెంకటేశ్వరరావు, కె.శ్రీను, ఎల్ జయశ్రీ,. టి.రమ్య, సీహెచ్ రాఘవ పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా బలుసులమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ
తాడేపల్లిగూడెం : తాడేపల్లి గూడెం పట్టణ ఇలవేలుపు బలుసులమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 9.06 గంటలకు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం మంత్రోచ్చారణల మధ్యసాగింది. స్వర్ణయంత్ర, విగ్రహ, శిఖర స్థాపనలు, కళాన్యాసం, దృష్టి గోవు, కుంభ నివేదన, కూష్మాండచ్ఛేదన తదితర పూజలు జరిగాయి. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచి ఆలయం వద్ద వేచి ఉన్నారు. అమ్మవారి పుట్టింటి చీరను పాశం వారి ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఆలయంలో బలుసులమ్మ విగ్రహం ఎదుట ప్రతిష్ట మూర్తిని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికి ముందు శ్రీచక్రాన్ని ఉంచారు. అనంతరం కర్రిగోవుతో దృష్టిగోవు కార్యక్రమం నిర్వహించారు. గోపురంపై శిఖర ప్రతిష్ట చేసి భక్తులు తీసుకువచ్చిన బూరెలను పై నుంచి పోశారు. ఇదే సమయంలో పూర్ణాహుతి జరిగింది. అగ్ని ఉద్వాసన, అవభృదం, బలిహరణ, కంకణ విమోచన కార్యక్రమాలు జరిగాయి. పారవశ్యంలో భక్తులు కోర్కెలు తీర్చే కల్పవల్లి, గ్రామ దేవత, పట్టణ ఇలవేలుపు అయిన బలుసులమ్మ వారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. కేరళ సాంప్రదాయ రీతిలో ఆలయాన్ని అలంకరించారు. శివస్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. యీవని సత్యనారాయణ అవధాని, యీవని వెంకట రామాచంద్రరావు, బాదంపూడి ఫణిశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ, వేద ఆగమన పండితులు పర్యవేక్షణలో పూజలు జరిగాయి. దేవాదాయశాఖ జ్యోతిషులు పూజ్యం విశ్వనాథ్, కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి బాబు, శ్రీరంగం సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, వలవల సూరిబాబు, నంద్యాల కృష్ణమూర్తి, వడ్డి రఘురామనాయుడు, పాలడుగు అయ్యన్న, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతకు ప్రత్యేక వాహనాలు
ఏలూరు అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 13 హైవే పెట్రోలింగ్ వాహనాలను అందించిందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని నివారించే లక్ష్యంతో ప్రభుత్వం బ్లాక్ స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)లు గుర్తించగా జిల్లాలో 39 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని చెప్పారు. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లాలో ఎన్‌హెచ్–16కు సమీపంలోని 13 పోలీస్స్టేషన్లకు 13 వాహనాలు అందించారన్నారు. వాహనాల్లో వైర్లెస్, జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటాయని, పెట్రోలింగ్ కోసం వాహనానికి ఏఎస్సై, హెచ్‌సీ, కానిస్టేబుల్‌ను కేటాయిస్తామని చెప్పారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అంబులెన్స్ లు అందుబాటులో లేకుంటే బాధితులను పెట్రోలింగ్ వాహనాల్లో తరలిస్తారన్నారు. వాహనాలను ఏఆర్ డీఎస్పీ పర్యవేక్షిస్తారన్నారు. కోడిపందేలపై దాడులు పెదవేగి రూరల్: పెదవేగి మండలంలోని కోడిపందేల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయన్నపాలెం గ్రామంలో పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని రెండు పందెంకోళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొండలరావుపాలెం గ్రామంలో పందేల స్థావరంపై దాడి చేసి ఏడుగురి నుంచి రూ.3,300 నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
పొగాకు బ్యారన్ దగ్ధం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గొల్లగూడెంలో బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో వర్జీనియా పొగాకు బ్యారన్ దగ్ధమైంది. బ్యారన్‌తో పాటు పొగాకు అగ్నికి ఆహుతైంది. వివరాలిలా ఉన్నాయి.. కౌలు రైతు బుట్టా చంద్రం అనే రైతుకు చెందిన బ్యారన్ క్యూరింగ్ దశలో ఉండగా, రేషన్కర్ర విరిగి పొగ గొట్టంపై పడటంతో ప్రమాదం జరిగింది. దీంతో బ్యారన్లో కూరింగ్ చేస్తున్న పొగాకు కొంత మేర కాలిబూడిదైంది. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్షన్నర నష్టం వాటిల్లినట్టు సర్పంచ్ గొడ్డటి రాణి తెలిపారు. tobbaco byaren burned -
ఉగాది ఉత్సవాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: ప్రజల ఇలవేల్పు, వరాలిచ్చే దేవత బలుసులమ్మ ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రజక ఆసాదులతో గరగల సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం గోదావరి ఏలూరు కాలువ వద్ద ఉన్న పెద్ద శివాలయం వద్ద నుంచి గరగలను బలుసులమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఆలయం వద్ద డాక్టర్ శశి కుమార్, డాక్టర్ శైలజ దంపతులతో కలశస్థాపన చేయించారు. అనంతరం గోపూజ జరిగింది. భీమవరం మావుళ్లమ్మ దేవాలయ పండితుడు ఘనాపాటి పరిమెళ్ల వాస్తవ్యులు బాదంపూడి ఫణిశర్మ, బలుసులమ్మ ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్‌శర్మ, గోపీనా«థ్ శర్మ ల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఉగాది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది ఉత్సవాల తర్వాత నూతన ఆలయంలో అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగనుండటం శుభసూచకంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శ్రీరంగం అంజి, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, టీడీపీ నాయకులు వలవల సూరిబాబు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ , కల్యాణం రామచంద్రరావు, పాలడుగుల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.