ఇంబ్రహీంపూర్ భేష్
- గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ ఉన్నతాధికారి
- మొక్కలు, ఇంకుడు గుంతల పరిశీలన
సిద్దిపేట రూరల్:అటవీ సంరక్షణ రాష్ట్ర ముఖ్య అధికారి పి.కేజా బుధవారం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారంలో భాగంగా ఇటీవల గ్రామంలో నాటిన 2లక్షల మొక్కలను పరిశీలించారు. వాటిని సంరక్షిస్తున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా పి.కేజా మాట్లాడుతూ.. గ్రామంలో మొక్కలు నాటిన తీరు, ఇంకుడు గుంతల తీరును ప్రశంసించారు. ఆయన వెంట విజిలెన్స్ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి డోబ్రియల్, డీఎఫ్‌ఓలు శ్రీధర్‌రావు, రాములు, అటవీక్షేత్రాధికారులు వెంకట్ రామారావు, శ్యామ్‌సుందర్‌రావు, ఉప అటవీ క్షేత్రాధికారి కుత్బుద్దీన్, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, నగేష్‌రెడ్డి, రాజు, బాలకృష్ణ, చంద్రం తదితరులు పాల్గొన్నారు.