Inkudu potholes
-
ఇంబ్రహీంపూర్ భేష్
గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ ఉన్నతాధికారి మొక్కలు, ఇంకుడు గుంతల పరిశీలన సిద్దిపేట రూరల్:అటవీ సంరక్షణ రాష్ట్ర ముఖ్య అధికారి పి.కేజా బుధవారం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారంలో భాగంగా ఇటీవల గ్రామంలో నాటిన 2లక్షల మొక్కలను పరిశీలించారు. వాటిని సంరక్షిస్తున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పి.కేజా మాట్లాడుతూ.. గ్రామంలో మొక్కలు నాటిన తీరు, ఇంకుడు గుంతల తీరును ప్రశంసించారు. ఆయన వెంట విజిలెన్స్ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి డోబ్రియల్, డీఎఫ్ఓలు శ్రీధర్‌రావు, రాములు, అటవీక్షేత్రాధికారులు వెంకట్ రామారావు, శ్యామ్‌సుందర్‌రావు, ఉప అటవీ క్షేత్రాధికారి కుత్బుద్దీన్, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, నగేష్‌రెడ్డి, రాజు, బాలకృష్ణ, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలు ఇంకేప్పుడు..?
ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపాలిటిలో నిధులున్న రాజకీయ పరిణామాలు, అధికారుల బదిలీలు, ఇంచార్జీ కమిషనర్ల బదిలీల ఇబ్బందులతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం మున్సిపాలిటిలో కంటికి క నిఫించకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇంకుడు గుంతలు తవ్వించకున్నవారికి రూ. 4 వేల ప్రభుత్వం అందజేస్తుంది. కాగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటిలో తమ నిధులతో టెండర్లను ఆహ్వనించి ఇంకుడు గుంతలను తవ్వించాల్సి ఉంటుంది. గత మూడు నెలల కిందట ఇంకుడు గుంతలకు టెండర్లు ఆహ్వనించి ఖరారు చేసిన ఇప్పటి వరకు అది కౌన్సిల్ ఆమోదానికి నోచుకోవడం లేదు. నెలల తరబడి మున్సిపాలిటి ఖాతాలో నిధులు ములుగుతున్నాయి. ఇంకెప్పుడు ఇంకుడు గుంతలకు మోక్షం.. వేసవికాలంలోనే చాలా ఇంకుడు గుంతలకు తవ్వకాలు ప్రభుత్వం చేపట్టింది. ఆయా జిల్లా కార్యాలయాలు , ఇండ్లలోనూ కొందరు సోంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఇటువంటి కన్నెతైన చూడటం లేదు. మున్సిపాలిటిలలో రెగ్యులర్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెళ్లిన నాటి నుంచి ఇంచార్జీ కమిషనర్లుగా వ్యవహరించిన ఆర్డీలో సుధాకర్‌రెడ్డి సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో పాటు ఆర్వో, ఈఈ , అసిస్టెంట్ కమిషనర్, టీ పీవోలు అనివార్య కారణాలలో లీవ్‌లు పెట్టుకోవడంతో అప్పటి నుంచి పాలన అస్తవ్యస్తంగా మారింది. కాగా ఆర్డీవో సుధాకర్‌రెడ్డి బదిలీపై వెళ్లగా , ఇంచార్జీ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్న రెండు రోజులతో రెగ్యులర్ కమిషనర్‌గా కె. అలువేలు మంగతాయారు బాధ్యతలను స్వీకరించారు. కాగా ఇప్పుడైన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతాయా లేదా వేచి చూడాల్సి ఉంది. కౌన్సిల్ సమావేశంలో ఈ పనులకు ఆమోదం తెలిపి పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ వర్షాకాలంలో ఇంకుడు గుంతలు నిర్మించక పోతే వృథాప్రయాసగా మిగుతుంది. నిధులు వృథా అవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కౌన్సిల్లో ప్రవేశపెడుతాం.. -రంగినేని మనీశ , మున్సిపల్ చైర్పర్సన్ ఇంకుడు గుంతల నిర్మాణాల కోసం ప్రవేశ పెట్టిన టెండర్ల అంశాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టెవిధంగా చూస్తాం. గతంలోనూ ఇంకుడుగుంతల నిర్మాణం పై ప్రజలకు అవగాహన కల్పించాం. త్వరలో కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పనులు వేగవంతంగా పూర్తయ్యేటట్లు చూస్తాం. ఈ విషయం మా దృష్ఠిలో ఉంది ముందుగానే ఆ విషయం అధికారులతో చర్చిచాం. మరోసారి అధికారులతో మాట్లాడి అందరి సహకరంలో కార్యక్రమాలను చేపడతాం. -
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయని వారిపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోని వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపై ఆలోచన చేయాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నిచోట్ల ఇంకుడు గుంతలున్నాయి? ఎన్నిచోట్ల లేవో పరిశీలించాలని పేర్కొంది. ఇంకుడు గుంతలు లేని చోట్ల వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా శాశ్వత ప్రాతిపదికన ఒక కమిటీ వేయాలని స్పష్టం చేసింది. ఇంకుడు గుంతల ఏర్పాటుకు కొంత గడువునిచ్చి, అప్పటికీ ఏర్పాటు చేసుకోకుంటే నీటి కనెక్షన్లు రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీ పరిశీలించాలంది. రెండు వారాల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తరఫు న్యాయవాదులు చెప్పడంతో దాన్ని రికార్డ్ చేస్తూ తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ప్రభుత్వం అన్ని సూచనలు, సలహాలతో దీనిపై ఓ నివేదిక తయారు చేసి దానిని కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నగరంలో భవన నిర్మాణ నిబంధనలు, జీవో 350ల ప్రకారం ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన ఎస్.వైదేహిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం మరోసారి విచారించింది. -
కళ్లకు గంతలు కట్టి..
పాత పథకాలను తవ్వితీస్తున్న టీడీపీ ప్రభుత్వం నీటి నిల్వకు 4500 పనులకు ప్రణాళికలు {Xన్కవర్ పేరిట పండ్ల తోటల పెంపకం కార్యకర్తల కోసమే మార్పులంటూ విమర్శలు కొత్త ప్రభుత్వం పాత పథకాలకు ఊపిరిలూదుతోంది. తన పాలనలో తవ్విన పచ్చ గుంతలకు చంద్రబాబు మళ్లీ ప్రాణం పోయబోతున్నారు. దీని కోసం వేల సంఖ్యలో పనులు చేపట్టి తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికల సిద్ధం చేయిస్తున్నారు. ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారు. నూతన ప్రభుత్వం కొలువు తీరడంతోనే తన మార్కు పథకాలను తెరమీదకు తెస్తోంది. గతంలో ప్రాధాన్యం ఇచ్చిన ‘ఇంకుడుగుంతలు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ తెర పైకి తెచ్చింది. దీనికి సంబంధించిన ప్రణాళికను సత్వరం తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు జిల్లాలోని ఆరు క్లస్టర్లలో నీటిని నిల్వ చేసే పనులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట ఇలా ఆరు క్లస్టర్లలో నీటి నిల్వ చేసే కార్యక్రమంలో భాగంగా 4,500 పనులను చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇందులో రూ.50 వేల మొదలు రూ.5 లక్షల లోపు పనులు ఉన్నట్లు సమాచారం. గ్రీన్ కవర్ పేరుతో.... పండ్ల తోటల పెంపకం పేరు కాస్తా మార్చి గ్రీన్ కవర్ పేరిట మొక్కల పెంపకం చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రభుత్వం రెండవ ప్రాధాన్యం ఇచ్చింది.దీనికి సంబంధించి అధికారులు ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వెయ్యి ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టనున్నారు.24 మండలాలు, 106 గ్రామ పంచాయతీల్లో రైతులకు లబ్ధి కలగనుంది. పొలాల గట్ల వెంట 8 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. 3.72 లక్షల విస్తీర్ణం కవర్ కానుంది.మూడవ ప్రాధాన్యం కింద వ్యక్తిగతంగా లబ్ధి కలిగే పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఏడాది నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద 30 వేల వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించనున్నారు.కొత్త ప్రభుత్వం తన మార్కు ఉండేలా పథకంలో మార్పులు తెస్తుండటంతో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై వీటి ప్రభావం పడుతుందేమోననే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది.దీనికి తోడు టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే పథకంలో మార్పులు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంచనాలు రూపొందించాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరానికి పనులకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేశాం. నీటిని నిల్వ చేసే పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. రెండో ప్రాధాన్యం కింద గ్రీన్‌కవర్ పేరుతో పచ్చదనాన్ని పెంపొందించే పనులు చేపట్టనున్నాం. వ్యక్తిగత పనులకు మూడో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ పనులన్నీటి కీ అంచనాలు రూపొందించాం. - ఢిల్లీరావు, డ్వామా పీడీ