ఇంకుడు గుంతలు ఇంకేప్పుడు..? | when Inkudu potholes? | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలు ఇంకేప్పుడు..?

Published Sat, Jul 16 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

ఇంకుడు గుంతలు ఇంకేప్పుడు..?

ఇంకుడు గుంతలు ఇంకేప్పుడు..?

ఆదిలాబాద్  కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపాలిటిలో నిధులున్న రాజకీయ పరిణామాలు, అధికారుల బదిలీలు, ఇంచార్జీ కమిషనర్ల బదిలీల ఇబ్బందులతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం మున్సిపాలిటిలో కంటికి క నిఫించకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఇంకుడు గుంతలు తవ్వించకున్నవారికి రూ. 4 వేల ప్రభుత్వం అందజేస్తుంది. కాగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటిలో తమ నిధులతో టెండర్లను ఆహ్వనించి ఇంకుడు గుంతలను తవ్వించాల్సి ఉంటుంది.  గత మూడు నెలల కిందట ఇంకుడు గుంతలకు టెండర్లు ఆహ్వనించి ఖరారు చేసిన ఇప్పటి వరకు అది కౌన్సిల్ ఆమోదానికి నోచుకోవడం లేదు. నెలల తరబడి మున్సిపాలిటి ఖాతాలో నిధులు ములుగుతున్నాయి.
 
ఇంకెప్పుడు ఇంకుడు గుంతలకు మోక్షం..
వేసవికాలంలోనే చాలా ఇంకుడు గుంతలకు తవ్వకాలు ప్రభుత్వం చేపట్టింది. ఆయా జిల్లా కార్యాలయాలు , ఇండ్లలోనూ కొందరు సోంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఇటువంటి కన్నెతైన చూడటం లేదు. మున్సిపాలిటిలలో రెగ్యులర్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెళ్లిన నాటి నుంచి ఇంచార్జీ కమిషనర్‌లుగా వ్యవహరించిన ఆర్డీలో సుధాకర్‌రెడ్డి సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో పాటు ఆర్వో, ఈఈ , అసిస్టెంట్ కమిషనర్, టీ పీవోలు అనివార్య కారణాలలో లీవ్‌లు పెట్టుకోవడంతో అప్పటి నుంచి పాలన అస్తవ్యస్తంగా మారింది.  

కాగా ఆర్డీవో సుధాకర్‌రెడ్డి బదిలీపై వెళ్లగా , ఇంచార్జీ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్న రెండు రోజులతో రెగ్యులర్ కమిషనర్‌గా కె. అలువేలు మంగతాయారు బాధ్యతలను స్వీకరించారు. కాగా ఇప్పుడైన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతాయా లేదా వేచి చూడాల్సి ఉంది.  కౌన్సిల్ సమావేశంలో  ఈ పనులకు ఆమోదం తెలిపి పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ వర్షాకాలంలో ఇంకుడు గుంతలు నిర్మించక పోతే వృథాప్రయాసగా మిగుతుంది. నిధులు వృథా అవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కౌన్సిల్‌లో ప్రవేశపెడుతాం..
-రంగినేని మనీశ , మున్సిపల్ చైర్‌పర్సన్
ఇంకుడు గుంతల నిర్మాణాల కోసం ప్రవేశ పెట్టిన టెండర్ల అంశాన్ని కౌన్సిల్‌లో ప్రవేశపెట్టెవిధంగా చూస్తాం. గతంలోనూ ఇంకుడుగుంతల నిర్మాణం పై ప్రజలకు అవగాహన కల్పించాం. త్వరలో కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పనులు వేగవంతంగా పూర్తయ్యేటట్లు చూస్తాం.  ఈ విషయం మా దృష్ఠిలో ఉంది ముందుగానే ఆ విషయం అధికారులతో చర్చిచాం. మరోసారి అధికారులతో మాట్లాడి అందరి సహకరంలో కార్యక్రమాలను చేపడతాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement