
సిద్దిపేట రూరల్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. బుధవారం మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ను హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందు తున్న నూతన సర్పంచ్‌లు, ట్రైనీ అధికారులు సందర్శించారు. ఇంకుడు గుంతలు, ఉపాధి హమీ పను ల్లో భాగంగా నిర్మించిన సామూహిక గొర్రెల షెడ్లు, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, బాలవికాస నీటి శుద్ధీకరణ పథకం, ఫాం పాండ్స్, గోదాం, పార్క్, పందిరి సాగు వంటి అభివృద్ధి పనులను పరిశీలించి అబ్బుర పడ్డారు. హరితహారం, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులు అవలంభిస్తున్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు గ్రామం అంతటా తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతోపాటు, గ్రామస్తుల ఐక్యత ఎంతో బాగుందని, ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచడం చాలా గొప్పవిషయమని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న ప్రణాళికలను తమ గ్రామాల్లో అవలంభిస్తామన్నారు. కార్యక్రమంలో సుమారు 35 మంది ప్రతినిధులు, అధికారుతోపాటు గ్రామ సర్పంచ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment