ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నగారా మోగించింది.నామినేషన్లు, పోలింగ్, ఫలితాల తేదీల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ తేదీ,పోలింగ్ జరిగే వారం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు.
నవంబర్ 20 (బుధవారం) మహారాష్ట్రలో ఉన్న మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తాం. పోలింగ్ కోసం బుధవారాన్ని మేం కావాలనే ఎంచుకున్నాం. వారం మధ్యలో పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనే బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నాం.
వీకెండ్‌లో పోలింగ్ ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’అని రాజీవ్‌కుమార్ చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment