Rajiv Kumar
-
ప్రజాస్వామ్య దేవాలయమిది
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య దేవాలయంగా పరిఢవిల్లుతోందని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. 2022 మే 15వ తేదీన సీఈసీగా బాధ్యతలు చేపట్టి అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలుసహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను సీఈసీ హోదాలో సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్ మంగళవారం సాయంత్రం రిటైర్ అయ్యాక నిర్వాచన్ సదన్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ నా దృష్టిలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రజాస్వామ్య దేవాలయం.గత 75 ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమున్నత శిఖరాలపై నిలిపింది. తీరా ఎన్నికలప్పుడే ఎన్నికల ప్రక్రియపై పలు పార్టీలు, నేతలు అనుమానాలు వ్యక్తం చేయడమనేది కేవలం ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసేందుకు వేసే ఎత్తుగడలు. ఎన్నికలకు సంబంధించి చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ కోర్టులో ప్రత్యక్ష ప్రసారాలు కావడం కొన్నిసార్లు అపనమ్మకాలకు దారితీయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఆర్థికభారం కావొద్దు ‘‘అనుచిత ఉచిత వాగ్దానాలు, స్థాయికి మించిన వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఎప్పటికప్పుడు అప్రమత్త ధోరణితో వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్రాలకు ఆర్థికభారం కాకుండా ఉచిత పథకాలు, హామీలు ఇస్తే మంచిది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడను’’అని ఆయన అన్నారు. ‘‘ ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలను అమాంతం పెంచేసి వాస్తవ పరిస్థితుల నుంచి ఓటర్లను దూరంగా తీసుకెళ్తాయి. ఈ విషయంలో మీడియా మరీముఖ్యంగా ఎల్రక్టానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు పూర్తి అజమాయిషి, నియంత్రణ లేదు.అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ చేపట్టే సంస్థలే స్వీయనియంత్రణ కల్గిఉండాలి. సర్వేకు శాంపిల్ సైజు ఎంత? అసలు ఎంత విస్తృత స్థాయిలో సర్వే చేశారు?. సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలను ఏ మేరకు ప్రతిబింబిస్తాయి?. అనేవి చూసుకోవాలి’’ అని రాజీవ్ అన్నారు. ‘‘ కొత్త సారథి నాయకత్వంలో ఈసీ మరింతగా సమర్థవంతంగా ఎన్నికలు చేపట్టాలని ఆశిస్తున్నా. భారతీయ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఓటర్లు, రాజకీయపార్టీలు తమ వంతు కృషిచేయాలి.ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్న ఓటర్లందరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. 2020 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ అదే ఏడాది సెపె్టంబర్ ఒకటిన ఎలక్షన్ కమిషనర్‌గా ఈసీలో చేరారు. 2022 మే 15న 25వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సీఈసీగా ఆయన అన్ని రకాల ఎన్నికలను నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు, 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు సమర్థవంతంగా చేపట్టారు.నేడే సీఈసీగా జ్ఞానేశ్ బాధ్యతల స్వీకరణకేంద్ర ఎన్నికల సంఘానికి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 జనవరిలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా రిటైర్ అయిన జ్ఞానేశ్ ఆ తర్వాత రెండు నెలలకే కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్‌గా కొత్త పాత్రలో కొలువుదీరారు. ఈసీ సభ్యుల నియామకానికి సంబంధించి మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చాక సీఈసీగా బాధ్యతలు చేపడుతున్న తొలి వ్యక్తి జ్ఞానేశ్ కావడం విశేషం. కేంద్ర సహకార మంత్రి అమిత్ షాకు అత్యంత ఆప్తునిగా పేరొందారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయడంలో జ్ఞానేశ్ కీలకపాత్ర పోషించారు. సీఈసీగా జ్ఞానేశ్ 2029 జనవరి 27వ తేదీన రిటైర్ అవుతారు. -
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
టోటలైజర్ విధానం తేవాలి
న్యూఢిల్లీ: ఓటరు గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పదవీ విరమణ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దీనివల్ల, బూత్‌ల వారీ ఓటింగ్ సరళిని బయటకు తెలియదని చెప్పారు. ప్రవాస భారతీయులు స్థానికంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో కమిషన్‌పై తప్పుదోవ పట్టించే ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన పదవీ విరమణ చేయనున్న సీఈసీ రాజీవ్ కుమార్ సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఈవీఎం నుంచి పోలైన ఓట్లను సేకరిస్తున్నాం. ఇందులో ఒక్కో అభ్యర్థికీ పడిన ఓట్లను కలిపి ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఇందులో లోపమేమంటే..ఏ ప్రాంతం నుంచి తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు అభ్యర్థులకు తెలిసిపోతాయి. ఎన్నికల అనంతర హింసకు ఇదే కారణంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను వేధించడం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి వారిని దూరంగా పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీనిని నివారించడానికి టోటలైజర్ విధానాన్ని తేవాలి. దీనిని ఇప్పటికే ఎన్నికల సంఘం అభివృద్ధి పరిచింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పోలింగ్ బూ త్ల వారీగా పడిన ఓట్లను వెల్లడించబోరు. రాజకీ య ఏకాభిప్రాయంతో ఈ విధానాన్ని అమ ల్లోకి తేవాలి. ఓటరు గోప్యతను కాపాడేందుకు, ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను పెంచేందుకు ఇది ఎంతో అవసరమని నమ్ముతున్నా’అని ఆయన అన్నారు. రిమోట్ ఓటింగ్ విధానం రావాలికోట్లాది మంది వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రిమోట్ ఓటింగ్ విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలన్నారు. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తి పలుమార్లు ఓటేసే వ్యవహారాలను సమర్థంగా అడ్డుకునేందుకు పోలింగ్ బూత్‌లలో బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిధులు, ఖర్చు వివరాలను ఆన్లైన్లో వెల్లడించే ప్రక్రియ మొదలైందన్నారు. ఆర్థిక పారదర్శకత, విశ్లేషణల కోసం ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని సూచించారు. ఆరోపణలు ఆందోళనకరంఓటర్లు ఉత్సాహంగా, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న చోట కూడా ఫలితాల అనంతరం రాజకీయ పార్టీలు ఈసీ, అధికారులపై సందేహాలను వ్యక్తం చేయడం ఖండించాల్సిన అంశమని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘పోలింగ్ లేదా కౌంటింగ్ ముమ్మరంగా జరుగుతున్న వేళ తప్పుడు ఆరోపణలు, వదంతులు మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఒక్కసారిగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని అయోమయానికి గురి చేయడమే వీటి లక్ష్యం. అయితే, ఎన్నికల సమగ్రతను కాపాడటం, ప్రశాంతంగా ఎన్నికలు జరపడాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ ఇటువంటి వాటిని పట్టించుకోలేదు’అని అన్నారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసే ధోరణులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే వారిని ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాలపై ఎన్నికల కమిషన్ సంయమనం పాటిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి కొమ్ముకాస్తోందని, ఓటింగ్‌లో అవకతవకలపై తాము చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నియంత్రణలు లేని సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు తీవ్ర ప్రమాదకరంగా మారాయంటూ రాజీవ్‌కుమార్.. ఇవి చేసే నిరాధార, ఉద్దేశపూర్వక విమర్శలను ఎదుర్కోవడానికి ఎన్నికల సంఘం సామర్థ్యాలను పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు. -
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్‌సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఆరోపణలు గుప్పించారు. -
యమున నీటిని తాగే దమ్ముందా?..ఈసీకి కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ సవాల్ విసిరారు. ఇప్పుడే నేను మీకు ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని పంపిస్తా. ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ప్రెస్మీట్లో ఆ నీటిని తాగండి. అలా చేస్తే .మేం తప్పు చేశామని ఒప్పుకుంటామని స్పష్టం చేశారు.హర్యానా ప్రభుత్వం యమునా నధిలోకి వ్యర్థాలను వదులుతోందని క్రేజీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే ఈసీ నిర్ణయంపై కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని ఉంచారు.आम आदमी पार्टी की सरकार बनने पर दिल्ली में काम करने वाले सर्वेंट्स वर्ग के लिए नई योजनाएँ लाएँगे— जैसे रजिस्ट्रेशन पोर्टल, सरकारी कार्ड, सर्वेंट हॉस्टल, EWS मकानों में प्राथमिकता, मोबाइल क्लीनिक और तय काम के घंटे इत्यादि। सर्वेंट्स वर्ग ना सिर्फ़ हमारे घरों की देखभाल करते हैं,… https://t.co/9Fxoi5w4PC— Arvind Kejriwal (@ArvindKejriwal) January 30, 2025 ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బుల్ని వెదజల్లుతున్నాయి. కానీ వాటిని ఈసీఐ గుర్తించడం లేదు. రాజకీయాలు చేయడంలో బిజీగా ఉంది. ఎందుకంటే? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ త్వరలో రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు చేయానుకుంటున్నారేమో? ఈ సందర్భంగా చరిత్ర ఎప్పటికీ క్షమించదని ఈసీఐకి గుర్తు చేస్తున్నాను.ఎన్నికల కమిషన్‌ను నేను నమ్మును. ఈసీఐ ఎప్పుడో అపఖ్యాతి పాలైంది. త్వరలో అరెస్టు అవ్వొచ్చు. అయినా నేను భయపడను. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఎన్నికలు జరగలేదు.‘అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉన్న మూడు యమునా నది వాటర్ బాటిళ్లను కేంద్ర ఎన్నికల సంఘానికి, కమిషనర్‌కు పంపుతా. ఆ నీటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశంలో తాగాలి. అలా తాగితే మేము మా తప్పును ఒప్పుకుంటాము’అని కేజ్రీవాల్ అన్నారు.అమోనియం స్థాయి పెరిగికేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు.ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హర్యానాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు.కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హర్యానా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. విధుల నిమిత్తం రాజీవ్ కుమార్‌తో పాటు ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయ్‌కుమార్ జోగ్దండ్లు హెలికాప్టర్లో మున్సియరికి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం మధ్యలో అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణం గతితప్పింది. దీంతో పైలెట్ హెలికాప్టర్‌ను ఉత్తరఖండ్‌లోని మున్సియరీకి సమీపంలోని మారుమూల ప్రాంతమైన రాలంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
మహారాష్ట్ర పోలింగ్ బుధవారమే ఎందుకు?
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నగారా మోగించింది.నామినేషన్లు, పోలింగ్, ఫలితాల తేదీల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ తేదీ,పోలింగ్ జరిగే వారం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు.నవంబర్ 20 (బుధవారం) మహారాష్ట్రలో ఉన్న మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తాం. పోలింగ్ కోసం బుధవారాన్ని మేం కావాలనే ఎంచుకున్నాం. వారం మధ్యలో పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనే బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నాం.వీకెండ్లో పోలింగ్ ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’అని రాజీవ్‌కుమార్ చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల -
సీనియర్ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్, మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన. -
Lok Sabha elections 2024: 21 రాష్ట్రాల పరిధిలో పోలింగ్ @ 102 నేడే!
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానే‹Ùకుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తొలి దశలో బరిలో నిల్చిన నేతలు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్‌పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్‌నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. భారీగా ఏర్పాట్లు తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు. తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్ ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్‌కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి. సమస్యాత్మక బస్తర్‌లోనూ.. మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్‌లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్‌లో 61 పోలింగ్‌బూత్‌లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్‌ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్‌లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్‌లనూ ఏర్పాటుచేశారు. -
తెలంగాణలో నాలుగు స్థానాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే?
సాక్షి ఢిల్లీ/హైదరాబాద్: దేశంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృషి సారించింది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలో తక్కువ శాతం పోలింగ్ నమోదవుతున్న నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. ఇక.. దేశవ్యాప్తంగా 50 పార్లమెంట్ నియోజకవర్గాలలో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్టు ఈసీ గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణలో తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణలో హైదరాబాద్(44), సికింద్రాబాద్(46), మల్కాజ్గిరి(49), చేవెళ్ల (53) స్థానాల్లో 2019లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యింది. దీంతో, ఈ నియోజకవర్గాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. మహానగరంలో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్లకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కల్పించాలని ఈసీ ఆదేశించారు. ఓటు హక్కు వినియోగంపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వివిధ కార్యక్రమాల పేరుతో ఓటర్లలో చైతన్యం పెంచాలని సూచించారు. -
Lok sabha elections 2024: సార్వత్రిక సమరం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే 13 న నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచి్చనట్టు సీఈసీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. షెడ్యూల్ నుంచి ఫలితాల వెల్లడి దాకా చూసుకుంటే ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏకంగా 82 రోజుల సాగనుండటం విశేషం! 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల 119 రోజుల పాటు జరిగాయి. తర్వాత అత్యంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఇదే కానుంది. తమిళనాడుతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతోంది. మొత్తమ్మీద 23 రాష్ట్రాలు, యూటీల్లో ఒకే విడతలో; యూపీ, పశి్చమబెంగాల్, బిహార్లలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సుపరిపాలన, అన్ని రంగాలకూ అందించిన అభివృద్ధి ఫలాల ప్రాతిపదికన అధికార పక్షం ఎన్నికల బరిలో దిగుతుండటం గత పదేళ్ల బీజేపీ పాలనలో భారత్ సాధించిన అద్భుత మార్పు’’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం బారినుంచి కాపాడేందుకు ఈ ఎన్నికలు బహుశా చివరి అవకాశమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రపంచానికే తలమానికంగా... ప్రపంచానికే ప్రామాణికంగా నిలిచిపోయేలా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లుండగా 61.5 కోట్ల మంది, అంటే 67.4 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని ఇతోధికంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈసీ వివరించారు. అందుకోసం వయోవృద్ధ, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు సదుపాయం వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలని కోరారు. రీ పోలింగ్ తదితరాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. 2022–23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు జప్తు చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గుజరాత్లో రూ.802 కోట్లు, తెలంగాణలో రూ.778 కోట్లు, రాజస్థాన్‌లో రూ.704 కోట్లు జప్తు చేశారు. ఈసీ ఇంకేం చెప్పారంటే... ► జాతుల హింస బారిన పడ్డ మణిపూర్‌లో శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అక్కడే ఓటేసేలా చర్యలు తీసుకున్నాం. ► సూర్యాస్తమయం తర్వాత బ్యాంకు వాహనాల రాకపోకలు నిషిద్ధం. ► నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా, తనిఖీ ఉంటాయి. ► అక్రమ ఆన్లైన్ నగదు బదిలీలపై ఆద్యంతం డేగ కన్నుంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తారు. ► ప్రచారంలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియోగించరాదు. ఆ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్! ఈసీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక విశేషం చోటుచేసుకుంది. మొత్తం లోక్‌సభ స్థానాలు 543 కాగా 544 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు సీఈసీ వివరణ ఇచ్చారు. ‘‘మణిపూర్‌లో జాతుల హింసతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందుకే మొత్తం స్థానాలు 543 అయినా 544గా కనిపిస్తున్నాయి’’ అని వివరించారు. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 19న తొలి దశలో, మిగతా 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 26న పోలింగ్ జరగనుంది. ‘4ఎం’ సవాలుకు సిద్ధం ‘‘స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈసీ ముందు ప్రధానంగా నాలుగు రకాల సవాళ్లున్నాయి. అవే మజిల్ (కండ బలం), మనీ (ధన బలం), మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), మోడల్ కోడ్ వయోలేషన్స్ (కోడ్ ఉల్లంఘన). వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈసీ సర్వసన్నద్ధంగా ఉంది’’ అని సీఈసీ ప్రకటించారు. గత ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ‘‘1.5 కోట్ల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియోగిస్తున్నాం. జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద డ్రోన్ ఆధారిత తనిఖీలు, నాన్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా ఉంటాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వార్తలు, ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపుతాం. కండబలానికి చెక్ పెట్టి, అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు వీలుగా కలెక్టర్లు, ఎస్పీలు అనుసరించాల్సిన పలు నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశాం. ప్రతి జిల్లాలోనూ సమీకృత కంట్రోల్ రూములు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనను, ఎన్నికల హింసను సహించబోమన్నారు. వాటికి పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘గతంలో గట్టిగా మందలించడంతో సరిపెట్టేవాళ్లం. ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19 న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13, మే 20, 25న, జూన్ 1ల్లో నాలుగు విడతల్లో పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తెలంగాణలో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నిక జరుగనుంది. హోరాహోరీ తలపడండి, కానీ... ఎన్నికల బరిలో పార్టీలు హోరాహోరీగా తలపడవచ్చని, అయితే ఆ క్రమంలో గీత దాటకుండా చూసుకోవాలని సీఈసీ సూచించారు. విద్వేష ప్రసంగాలకు, కుల, మతపరమైన విమర్శలు, ప్రకటనలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. నేతలు కూడా వ్యక్తిగత దాడికి, దిగజారుడు భాషకు నేతలు ఉండాలన్నారు. ఈ డిజిటల్ యుగంలో మాట్లాడే ప్రతి మాటా కనీసం వందేళ్ల పాటు రికార్డై ఉండిపోతుందని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘కావాల్సినంత ద్వేషించుకుందాం. కానీ తర్వాతెప్పుడైనా మిత్రులం కావాల్సొస్తే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుందాం’’ అన్న ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తిని ఈ సందర్భంగా సీఈసీ చదివి విని్పంచారు! ‘‘ప్రకటనలను వార్తలుగా చిత్రించడం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రత్యర్థులను అవమానించడం, వేధించడం వంటివి కూడదు. స్టార్ ప్రచారకులు ఎన్నికల ప్రచారంలో హుందాతనాన్ని కాపాడాలి’’ అన్నారు. తప్పుడు వార్తల సృష్టికర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు. విరాళాలపై నిఘా పారీ్టలకు అందే విరాళాలపై నిఘాకు యంత్రాంగం ఉండాలని సీఈసీ అన్నారు. ‘‘అదేసమయంలో దాతల గోప్యతను కాపాడాలి. వారిని వేధించకూడదు. పారీ్టలకు అనధికార మార్గాల గుండా అందే లెక్కలోకి రాని నిధులకు అడ్డుకట్ట వేసే ఉత్తమ వ్యవస్థ రావాలి. చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలి’’ అన్నారు. -
ఎన్నికల షెడ్యూల్ 2024
-
ఎన్నికల్లో అలాంటి వాటికి తావులేదు.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ జెండా ఎగురవేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలకు సరైన ప్రాధాన్యత ఉండేలా పశ్చిమ బెంగాల్ బ్యూరోక్రసీకి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి హింసాకాండకు తావు లేదని, ఆలా జరిగితే సహించేది లేదని చీప్ ఎలక్షన్ కమిషనర్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహిత ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని.. ఎన్నికల్లో భయానికి, బెదిరింపులకు తావు లేదని, అధికార యంత్రాంగం పక్షపాత ధోరణిని సహించేది లేదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి పశ్చిమ బెంగాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరిస్తామని, దీంతో తప్పకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆయన అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు చెప్పినట్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే.. ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజీవ్ అన్నారు. కాబట్టి పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం: CEC రాజీవ్ కుమార్
-
Microsoft: త్వరలో మైక్రోసాఫ్ట్ ఐడీసీ సంచలన ప్రాజెక్ట్‌లు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్ కేక్ కట్‌చేసి మాట్లాడారు. ‘భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్ ఫార్మాట్లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్బంది అనే కోపైలట్ టూల్ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: తెలంగాణను దాటేసిన ఏపీ..! మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్బందీ, అజూర్ స్పెషలైజ్డ్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
Telangana: ఎన్నికలొచ్చాయ్..
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. అదే నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం శాసనసభలకు ఎన్నికల ఏర్పాట్లు, ఇతర వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్,ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఒకే దశలో.. : వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగిసే తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి ఒకే విడతలో జరుగనుంది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలుకు నవంబర్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 13న దరఖాస్తుల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇస్తారు. అదే నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో, మిగతా మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది. ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ వేర్వేరు తేదీల్లో ఉన్నా.. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మాత్రం డిసెంబర్ 3వ తేదీనే చేపట్టి, ఫలితాలను ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాలు.. 16.14 కోట్ల మంది ఓటర్లు ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2,900కు పైగా పోలింగ్ కేంద్రాలను యువత నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపు, ఉచితాలు, బహుమతులు, మద్యం, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేపట్టనున్నామని.. ఈ మేరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 940 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మొదటిసారిగా ‘సీజర్ మేనేజ్మెంట్ సిస్టం’ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ను ఎవరైనా అతిక్రమించినట్టు గుర్తిస్తే.. సీవిజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు తప్పనిసరిగా కేసులకు సంబంధించి పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటిసారిగా ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం’ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఖర్చుపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలతోపాటు రైల్వే, పోస్టల్ కార్గోలను క్షుణ్నంగా తనిఖీ చేస్తామని చెప్పారు. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తామన్నారు. -
ప్రలోభాలపై పక్కా నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎలాంటి ప్రలో భాలకు తావులేకుండా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రలోభాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రకటించారు. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర కానుకలు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించాలని, వీటిపట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. వారు కఠిన చర్యలు తీసుకునేలా తాము చేస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రలోభాల గురించి తాము విన్నామని, ఇలాంటి విషయంలో తమ చర్యలు ఎలా ఉంటాయో ఈసారి చూడబోతున్నారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే అధికార యంత్రాంగం యావత్తూ డెప్యుటేషన్‌పై ఈసీ పరిధిలోకి వస్తుందని వివరించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయడం, వాటికి ఫైనాన్స్ చేయడం, నిర్మూలించాల్సిన బాధ్యతల్లో ఉండి అవకాశం కల్పించడం నేరమేనని, ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హులని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సన్నద్ధతను పరిశీలించడానికి మూడురోజుల రాష్ట్ర పర్యటనకు వచి్చన ఆయన.. గురువారం చివరిరోజు సహచర ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీకి, ఆర్బీఐకి ప్రత్యేక ఆదేశాలు ‘బ్యాంకులు నగదు రవాణా వాహనాలను నిర్దేశిత సమయాల్లోనే నడిపించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)ని ఆదేశించాం. ఎన్నికల్లో అక్రమ నగదు రవాణాకు ఆ వాహనాలను వినియోగించే అవకాశం ఉందని గుర్తించాం. అంబులెన్సులు, ప్రభుత్వ వాహనాల్లో డబ్బు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేయాలని సంబంధిత యంత్రాంగాలను కోరాం. చీరలు, కుక్కర్లు వంటి ఎన్నికల్లో పంపిణీ చేసే కానుకలను నిల్వ చేసే ప్రైవేటు గోదాముల వద్ద గట్టి నిఘా పెట్టాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థలను కోరాం. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు ఎయిర్‌పోర్టులు, కార్గో ఫ్లయిట్లు, ప్రైవేటు ఎయిర్్రస్టిప్లు, రాజకీయ నేతలు వినియోగించే వాణిజ్యేతర విమానాలు, ప్రత్యేక విమానాలు సైతం తనిఖీ చేయాలని కోరాం. పేమెంట్ వ్యాలెట్ల ద్వారా జరిగే ఆన్లైన్ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆర్బీఐ, ఎస్ఎల్బీసీకి సూచించాం. ఒకే ఖాతా నుంచి వందల సంఖ్యలోని ఖాతాలకు ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ జరిగితే గుర్తించి విచారణ జరపాలని ఆదేశించాం. చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్లపై చర్యలతోనే సరిపెట్టరాదని, పెద్ద మొత్తంలో మద్యం, మాదక ద్రవ్యాల సరఫరా, ఇతర అక్రమాలకు పాల్పడే కింగ్‌పిన్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. రాష్ట్ర సరిహద్దులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 148 చెక్‌పోస్టులను సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా పర్యవేక్షిస్తాం..’ అని సీఈసీ తెలిపారు. ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు స్పందించాలి ‘రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి వారికి సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పాం. పోలింగ్ రోజుకి రెండు రోజుల కన్నా ముందే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, ఈవీఎంలు/వీవీ ప్యాట్లను అధికారిక వాహనాల్లోనే రవాణా చేయాలని కోరాం. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమిస్తాం. ఫిర్యాదుల స్వీకరణ కోసం వారి చిరునామాలు సైతం తెలియజేస్తాం. సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తాం..’ అని రాజీవ్‌కుమార్ చెప్పారు. ఫిర్యాదుల కోసం సీ–విజిల్ యాప్ ‘ఎన్నికల్లో ప్రలోభాలు, ఇతర అక్రమాలపై ‘సీ–విజిల్’ యాప్ ద్వారా అక్కడికక్కడే ఫోటోలు తీసి పంపిస్తే 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుదారుల గోప్యతను పరిరక్షిస్తాం. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటరుగా నమోదు, జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం పరిశీలన వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు జరపాలని, ధన, మద్య ప్రవాహం లేకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలను నియమించాలని, విద్వేష ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశాయి. అభ్యర్థుల ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని పెంచాలని ఓ పార్టీ కోరింది. త్వరలో వీటికి బదులిస్తాం..’ అని సీఈసీ తెలిపారు. ధ్రువీకరణ తర్వాతే ఓట్ల తొలగింపులు ‘ఓటర్ల తొలగింపు కోసం వచ్చిన ఫామ్–7 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్లను తొలగించాం. మా అంతట మేముగా ఎలాంటి ఓట్లు తొలగించలేదు. మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించిన తర్వాతే రిజిస్టర్డ్ మృతుల ఓట్లను తొలగించాం. 10 శాతం తొలగించిన ఓట్లను ఎంపిక చేసి పునఃపరిశీలన జరిపాం. 2022, 2023లో మొత్తం 22 లక్షల ఓట్లను తొలగించాం. చెంచు, కోలం, తోటి, కొండారెడ్డి వంటి గిరిజన తెగలవారిని 100 శాతం ఓటర్లుగా నమోదు చేశాం..’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. అభ్యర్థులు తమ నేర చరిత్రపై ప్రకటన ఇవ్వాలి అభ్యర్థులు తమ నేరచరిత్రపై 3 వేర్వేరు సమయాల్లో ప్రముఖ పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేశారు. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారన్న అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు తెలపాల్సి ఉంటుందన్నారు. కారణాలను ఒక జాతీయ, మరో ప్రాంతీయ పత్రికలో ప్రచురించాల్సి ఉంటుందని చెప్పారు. -
Telangana: అక్టోబర్ 5 తర్వాత నగారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం శాసనసభల ఎలక్షన్లకు అక్టోబర్ తొలి వారం తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3న రాష్ట్ర పర్యటనకు రానుంది. 5 వరకు అంటే మూడురోజులపాటు విస్తృత సమీక్షలు, వరుస సమావేశాలు నిర్వహించనుంది. మిగతా చోట్ల ఇప్పటికే ముగియడంతో.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు సంసిద్ధతను స్వయంగా పరిశీలించడానికి సీఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను.. తెలంగాణ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఇప్పటికే సీఈసీ బృందం పర్యటనలు ముగిశాయి. అక్టోబర్ 5వ తేదీ నాటికి తెలంగాణలోనూ పర్యటన ముగుస్తుంది. అంటే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గత శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను 2018 అక్టోబర్ 6న ప్రకటించగా.. అదే ఏడాది డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కొన్ని రోజులు అటూఇటూగా షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒక్కో దఫాలోనే పూర్తి చేశారు. అలాగే ఈసారి కూడా ఒకే దఫాలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగుస్తుంది. ఆలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా.. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దానితో ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సీఈసీ బృందం షెడ్యూల్ ఇదీ.. ► కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. అక్టోబర్ 3న జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వివిధ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర ప్రలోభాలు, అక్రమాల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తుంది. తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి (ఎస్ఎన్పీఓ), కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి తమ సన్నద్ధతను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ► అక్టోబర్ 4న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు/పీసీలు ప్రజెంటేషన్ ఇస్తారు. ► అక్టోబర్ 5న ఓటర్లలో చైతన్యం కల్పించడానికి అమలు చేస్తున్న ‘స్వీప్’ కార్యక్రమం తీరు తెన్నులను సీఈసీ బృందం పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగ సెలబ్రిటీలతో సమావేశం అవుతుంది. దివ్యాంగ, యువ ఓటర్లతో ముఖాముఖీగా మాట్లాడుతుంది. చివరిగా ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం, భద్రత సంస్థలను సమన్వయం పర్చే అంశంపై సమీక్షిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తమ పర్యటన విశేషాలను వెల్లడిస్తుంది. -
సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ షురూ..
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఓటింగ్‌పై అవగాహన పెంచే క్రమంలో ప్రచారకర్తగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచిన్ సిద్ధమయ్యారు. తప్పనిసరిగా ఓటేయాలి! ఈ మేరకు కీలక బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సచిన్ టెండూల్కర్.. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలి’’ అంటూ తన కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. ఇక కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వంద సెంచరీల వీరుడు క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండుల్కర్‌కు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మనసుల్లో స్థానం సంపాదించిన ఈ లెజెండరీ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించారు. ఎన్నెన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సచిన్.. ఎంపీగానూ పనిచేశారు. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఎన్నికల సంఘం తాజాగా నేషనల్ ఐకాన్‌గా నియమించింది. సచిన్ క్రేజ్‌ను ఉపయోగించి ఓటింగ్‌పై అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహా మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రచారకర్తలుగా పనిచేశారు. అదే విధంగా బాలీవుడ్ మిస్టర పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సహా పంకజ్ త్రిపాఠి కూడా ఈ బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్ -
National Voters Day 2023: ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం
ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి. పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్‌లో పాల్గొనలేదని చెప్పవచ్చు. 2022 నవంబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా. ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్‌గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది. ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య) - రాజీవ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం) -
Gujarat: రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. తేదీలివే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మరో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 1న, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 8 న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 182 శాసనసభ స్థానాలున్నాయని.. తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ చెప్పారు. ► నవంబర్ 5 న తొలిదశ ఎన్నికలకు నోటిషికేషన్ ► నవంబర్ 10న రెండోదశ ఎన్నికలకు నోటిఫికేషన్ ► నవంబర్ 14 వరకు తొలిదశ నామినేషన్ల స్వీకరణ ► నవంబర్ 15న తొలిదశ నామినేషన్ల పరిశీలన ► నవంబర్ 17 వరకు తొలిదశ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ► నవంబర్ 17 వరకు రెండోదశ నామినేషన్ల స్వీకరణ ► నవంబర్ 18న రెండోదశ నామినేషన్ల పరిశీలన ► నవంబర్ 21 వరకు రెండోదశ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ► డిసెంబర్ 10తో ముగియనున్న ఎన్నికల షెడ్యూల్ మోదీ, షాకు కీలకం ఫిబ్రవరి 18తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుతం బీజేపీకి 111, కాంగ్రెస్‌కు 62 సభ్యులున్నారు. ఇక తాజా ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య ఉండనుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆప్ ప్రచారంలో దూకుడు పెంచింది. మరోవైపు 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఈ ఎన్నిక కీలకం కానుంది. సొంత రాష్ట్రంలో పట్టు కోల్పోకూడదని వీరిద్దరూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4.90 లక్షల ఓటర్లున్నారు. 51,782 పోలింగ్ కేంద్రాలున్నాయి. -
Himachal Pradesh: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
-
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. వీటి ప్రకారం నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి. ♦ మొత్తం నియోజకవర్గాలు: 68 ♦ నోటిఫికేషన్ : అక్టోబర్ 17 ♦ నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 25 ♦ నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 27 ♦ నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 29 ♦ పోలింగ్ : నవంబర్ 12 ♦ ఫలితాలు : డిసెంబర్ 8 ♦ హిమాచల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261 ♦ ఓటర్లు పురుషులు – 27,80,208 ♦ మహిళలు – 27,27,016 ♦ మొదటిసారి ఓటర్లు – 1,86,681 ♦ 80+ వయస్సు ఉన్న ఓటర్లు – 1,22,087 ♦ వందేళ్లపై ఉన్న ఓటర్లు – 1,184 ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కరోనా గురించి ఆందోళన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈమేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది. గుజరాత్ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవలే పర్యటించారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత హిమాచల్ షెడ్యూల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలుకు బీజేపీ 99 కైసవం చేసుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 77 స్థానాలకే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు బీజేపీ 45 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 20 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలువలేదు. చదవండి: జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు -
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు. -
ఎన్నికల హామీలపై పర్యవేక్షణ ఉండాలి
మన దేశ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో కొన్ని మార్పులను ప్రజలు ఆకాంక్షి స్తున్నారు. ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల నియమావళి, ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం వంటి వాటిలో మార్పులు రావాలని ఆశిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆలోచనలు ఉన్నా, అమలు వాయిదా పడుతూ వస్తున్నది. కొత్త కమిషనర్ సారథ్యంలో ఈ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయని ఆశిద్దాం. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఉన్నప్పటికీ... నియంత్రణ వైఫల్యం కనిపిస్తోంది. ‘ఓటుకు నోటు’, మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవడాన్ని నివారిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం మెరుగవుతుంది. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషనర్ నియంత్రణ కలిగి ఉండాలని చాలామంది బలంగా కోరుతున్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అమలుకు సాధ్యంకాని, ప్రజాకర్షక హామీలను తొలగించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉండాలి. ఎన్నిక తరువాత కూడా, మేనిఫెస్టోలోని హామీల అమలు ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ బాధ్యతను ఎన్నికల కమిషన్ చేపడితే ప్రజాస్వా మ్యంపై ప్రజల నమ్మకం, కమిషన్ ప్రతిష్ఠ తప్పకుండా పెరుగుతాయి. ఇక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే... ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలు నిరంతరం నిష్పాక్షికంగా, అత్యంత పారదర్శకంగా జరగాల్సి ఉంది. బోగస్ ఓటర్ల ఏరివేత, అర్హుల చేర్పు జనామోదంగా ఉండాలి. ఓటర్ల గుర్తింపును ‘ఆధార్’తో అనుసంధానం వేగిరపర్చాలి. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎం (ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై ఉన్న అపోహలను, ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పారద్రోలి, ప్రజల విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలి. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?) ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటింగ్ శాతం తగ్గితే, ఎన్నికలు అత్యధిక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవు. ఎన్నో సవాళ్లు, సంస్కరణలు కొత్త ఎన్నికల కమిషన్‌కు స్వాగతం పలుకుతున్నా... సమర్థవంతంగా పరిష్కరిస్తూ ప్రజామోదం పొందాలని ఆకాంక్షిద్దాం. చరిత్రలో నిలిచిపోయేలా పనితీరు ఉండాలని కోరుకోవడం అత్యాశ ఎంతమాత్రం కాబోదు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) – ఏఎల్ఎన్ రెడ్డి, హైదరాబాద్ -
‘ప్రకృతి’ సాగుకు జైకొడదాం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు మళ్లిన రైతన్నను దేశానికి గొప్ప సేవకుడిగా భావించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సేంద్రీయ సేద్యంపై రైతులను ప్రోత్సహిస్తూ ఒక విధానాన్ని తేవాలని నీతి ఆయోగ్‌ను కోరారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వల్ల రసాయన ఎరువుల సబ్సిడీ భారం తగ్గుతుందన్నారు. ఇలాంటి విధానాలను అనుసరించే అన్నదాతలకు రివార్డులు అందచేసే విధానం తేవాలని సూచించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం. హరిత విప్లవం వల్ల వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు సాధించాం. రసాయన ఎరువులు, విషపూరిత పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించాలి. పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల నివారణ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రాష్ట్రాలు దేశానికి సహాయకారిగా నిలుస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ పద్ధతులు స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలి. 90 శాతం నిధులివ్వాలి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లే రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. నిధుల కేటాయింపులో భిన్నమైన విధానాలు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రస్తుతం 60 శాతం నిధులిస్తుండగా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి సేద్యాన్ని అనుసరించే రాష్ట్రాలకు 90 శాతం నిధులివ్వాలి. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించే ఖర్చుతో పోలిస్తే రసాయన ఎరువుల సబ్సిడీ కోసం వెచ్చించే ఖర్చు చాలా ఎక్కువ. వ్యవసాయ వర్శిటీల్లో పాఠ్యాంశాలు ప్రకృతి సాగు విధానాలపై వ్యవసాయ యూనివర్సిటీ కోర్సుల్లో పాఠ్యాంశాలను పొందుపరచి వ్యవస్థీకృత పరిశోధనలు కొనసాగాలి. సహజ ఉత్పత్తులు, రసాయనాల ద్వారా పండించిన పంటల మధ్య వ్యత్యాసం, ఆరోగ్యంపై ప్రభావాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. రసాయన ఉత్పత్తులను విడనాడాలి రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉన్న ఆహారాన్ని ఉత్పత్తులను విడనాడి ప్రజలందరికీ ఆహార భద్రత, పౌష్టికాహారాన్ని అందించాలి. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో నేల పునరుత్పత్తి ప్రక్రియ అన్నిటికంటే ముఖ్యం. నీటి పరిరక్షణ, పర్యావరణ హితం మనం లక్ష్యం కావాలి. భవిష్యత్తు తరాలకు కూడా ఆరోగ్యకరమైన జీవితం, చక్కటి జీవనోపాధి అందించేలా ‘సతత హరిత విప్లవం’ (ఎవర్గ్రీన్ రివల్యూషన్) దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సమున్నత లక్ష్యాలు 2021–22లో ఆంధ్రప్రదేశ్‌లో 6.3 లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించారు. 3,009 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం అమలవుతోంది. రాష్ట్రంలోని సాగు భూమిలో దాదాపు 5 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న భూమిలో ఇప్పటికిప్పుడే రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్రమంగా, సజావుగా ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లేగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేసేందుకు రైతుకు కనీసం 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది కాబట్టి సుస్థిర విధానాల ద్వారా జీవనోపాధి మెరుగుపరిచేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇష్టపూర్వకంగా... స్వచ్ఛందంగా రసాయన ఎరువులు, పురుగు మందులతో గత 30–50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతన్నలు వాటిని విడనాడి పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో సేద్యం చేయడం అంత సులభమైన పనికాదు. ఇప్పటికిప్పుడు అలా చేయాలని కూడా మనం కోరలేం. కానీ ప్రకృతి సాగు విధానాల వైపు మళ్లడం అత్యంత ఆవశక్యం. సాంకేతిక సంస్థలు, శాస్త్రవేత్తల సహకారంతో దశలవారీగా అడుగులు వేయాలి. ఈ ప్రక్రియ మొత్తం ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా జరగాలి. ప్రకృతి సాగుకు జర్మనీ సహకారం మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు, ప్రకృతి సాగు విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నిధులు ఇచ్చేందుకు జర్మనీ ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ప్రాజెక్టుకు అనుమతులు చివరి దశలో ఉన్నాయి. ఐదేళ్లలో 20 మిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిధులతో ఇండో–జర్మనీ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీజీఏఏఆర్‌ఎల్) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్ కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం భూములు, భవనాలను సమకూరుస్తుంది. మా ప్రయత్నాలకు సహకరిస్తున్నందుకు నీతిఆయోగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎఫ్ఏఓ, యు.ఎన్.ఇ.పి, ఐసీఆర్‌ఏఎఫ్, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, సీఐఆర్‌ఏడీ (ఫ్రాన్స్), జీఐజెడ్, కె ఎఫ్ డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, ఆర్బీకేల స్థాయిలో ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయాన్ని నిర్మాణాత్మంగా విస్తరించడంలో ఎంతో కీలకం. మూడేళ్లుగా సానుకూలత గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో చాలా సానుకూల పరిస్థితి ఉందని వెల్లడవుతోంది. పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుత సగటు దిగుబడులతో సమానంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉంటున్నాయి. వరదలు, కరువు, చీడపీడలను సమర్థంగా తట్టుకుంటున్నట్లు స్వతంత్ర పరిశోధనల ద్వారా వెల్లడవుతోంది. జీవ వైవిధ్యంతోపాటు మంచి పౌష్టికాహారం లభిస్తోందని, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. – సీఎం జగన్ ఆర్బీకేలు.. అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు బాగున్నాయి. వాటి పనితీరును స్వయంగా పరిశీలించి చెబుతున్నాను. ప్రకృతి వ్యవసాయ విధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. సీఎం జగన్ అద్భుతమైన చర్యలు తీసుకున్నారు. – డాక్టర్ రాజీవ్ కుమార్,నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తిచేశారు నేచురల్ ఫార్మింగ్‌పై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. సహజ, పకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ఏపీ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సేవలు రైతుల ముంగిటకే అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు జరుగుతోందని చెప్పారు. దీనిని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నాని సీఎం జగన్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై సదస్సులో రైతు భరోసా కేంద్రాలపై ప్రశంసలు కురిపించారు.. నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని.. అక్కడ అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటాం: బొత్స -
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆకస్మిక రాజీనామా
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్‌కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కొత్త వైస్ చైర్మన్‌గా సుమన్ కే బెరీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1న బెరీ నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. వాస్తవానికి రాజీవ్‌కుమార్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీనికి కేవలం కొన్ని రోజులు ముందు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదించినట్టు, ఏప్రిల్ 30న బాధ్యతల నుంచి వైదలగొనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. సుమన్ కే బెరీ లోగడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగానూ పనిచేశారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన కుమార్ 2017 ఆగస్ట్‌లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వరకు అరవింద్ పనగరియా ఈ బాధ్యతలు చూశారు. ఆయన తిరిగి అధ్యాపక వృత్తి వైపు వెళ్లిపోవడంతో రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలు కట్టబెట్టింది. చదవండి: (నా భుజానికున్నది భారతీయ టీకానే!: బోరిస్ జాన్సన్) -
ఆత్మనిర్భర్‌తో భారత్ స్వయం సమృద్ది: రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన ఆత్మనిర్భర్(స్వావలంబన) కార్యక్రమం వల్ల భారత్‌తో ప్రపంచ ఎకానమీకి సంబంధాలు తెగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఉద్ఘాటించారు. భారత్ స్వయం సంమృద్ధికి దోహదపడే మిషన్ ఇదని ఆయన అన్నారు. ప్రపంచ సరఫరా, విలువల చైన్లకు సంబంధించి అంతర్జాతీయంగా పటిష్ట బంధాన్ని కలిగి ఉండడం వల్ల దేశం తన ప్రజలకు మెరుగైన ఫలితాలను సాధించగలుగుతుందని అన్నారు. ప్రపంచ సరఫరాలు, వ్యాల్యూ చైన్ విషయంలో ఆత్మ నిర్భర్ కార్యక్రమం దేశాన్ని ప్రపంచ ఆర్థిక చిత్రంలో కీలక స్థానంలో ఉంచుతుందని పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల కింద భారత్‌లో భారీ స్థాయిలో కంపెనీలను స్థాపించాలని ఆయన జపాన్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణలు, ఎటువంటి అడ్డంకులు లేని అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార రంగం విషయంలో ప్రాంతీయ అనుసంధానం వంటి విషయాలకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు. భారతదేశం-జపాన్లలో కోవిడ్-19ను ఎదుర్కొన్న పద్దతులు, రెండు దేశాల మధ్య ముందుకు సాగుతున్న ఆర్థిక సహకారం... అవకాశాల కోసం అన్వేషణ’ అనే అంశంపై 10వ ఐసీఆర్ఐఈఆర్-పీఆర్ఐ వర్క్‌షాప్ సందర్భంగా జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు.. పీఎల్ఐ పథకం కింద జపాన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు దేశాన్ని ఎగుమతి కేంద్రంగా మార్చాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకు అనుగుణమైన పరిస్థితులు భారత్‌కు ఉన్నాయని భావిస్తున్నాం. భారతదేశంలోకి జపాన్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏది అవసరమో ఆయా చర్యలన్నింటినీ తీసుకోడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఆత్మనిర్భర్, స్వావలంబన భారత్ మిషన్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటివి కోవిడ్-19 పరిస్థితిని ఎదుర్కొని, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పాటును అందించే ప్రధాన చర్యలు. ఆత్మనిర్భర్ మిషన్ దేశాన్ని క్లోజ్డ్ ఎకానమీ వైపు నడిపిస్తుందనే భయాన్ని తొలగించడం అవసరం. గ్లోబల్ ఎకానమీ, వాణిజ్యం, సేవలు, ఆర్థిక, సాంకేతిక అంశాలకు సంబంధించి భారతదేశం తన దృఢచిత్తం నుండి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల సరళీకరణ.. సరళీకృత, గ్లోబల్ ఆర్థిక విధానాల పట్ల భారత్ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి జపాన్ సహకారం అందించగలిగే పరిస్థితి ఉంది. ప్రపంచ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎగుమతులను వృద్ధి చేయడంలో భారత్‌కు జపాన్ నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయని భావిస్తున్నాం. ప్రపంచ వాణిజ్యం, సంబంధిత సేవల వృద్ధిలో అధిక వాటాను సాధించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఇది భారత్ వృద్ధి ఊపందుకోవడానికి, ఉపాధి కల్పన భారీగా పెరగడానికి దోహదపడుతుంది. రాబోయే సంవత్సరాల్లో భారత్ దీనిని సాధించడానికి(భారత్‌కు సహాయం చేయడానికి) జపాన్ కంపెనీలు తగిన సహకారం అందిస్తాయని భావిస్తున్నాను. ఇక సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహం, ఎలక్ట్రిక్ వాహనాల దిశగా పురోగతి ప్రస్తుత కీలక అంశాలు. జపాన్ ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉంది. హైడ్రోజన్ ఇంధనాన్ని తయారీలో కీలకమైన గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి భారత్ కంపెనీల సహాయ సహకారాలను తీసుకునే అవకాశాలను జపాన్ పరిశీలించవచ్చు. భారత్ కూడా హైడ్రోజన్ ఫ్యూయెల్ మిషన్‌లో పురోగమించడంపై దృష్టి పెట్టింది. హైడ్రోజన్ ఎకానమీలో జపాన్ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని నాకు తెలుసు. టొయోటా తన స్వంత వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ విషయంలో భారత్‌కు సహాయసహకారాలు అందించాలని జపాన్ను నేను అభ్యర్థిస్తున్నాను. రాబోయే పదేళ్లలో 10 మెట్రిక్ మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉన్నాము. గ్రీన్ అమ్మోనియా హైడ్రోజన్(పర్యావరణ సానుకూల) ఆర్థిక వ్యవస్థకు ఆధారం. అందువల్ల ఈ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 5 ట్రిలియన్ యన్లు(రూ.3,20,000 కోట్లు) లేదా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని జపాన్ ప్రకటించింది. అంతక్రితం భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా మధ్య కీలక చర్చలు జరిగాయి. (చదవండి: ఐపీఎల్ అభిమానులకు బుక్ మై షో శుభవార్త..!) -
‘ప్రైవేటు’తోనే ఉద్యోగావకాశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పెట్టుబడులే ఆర్థికాభివృద్ధికి చోదకాలని, ఆర్థికాభివృద్ధి లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించ లేమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి చర్యలతో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే దిశగా కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు వెల్ల డించారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సమ్మిళిత అభివృద్ధి, రవాణా వనరుల అనుసంధానం బడ్జెట్‌కు 4 మూల స్తంభాలన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు బడ్జెట్లో భారీగా రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించామన్నారు. ప్రజలపై భారం మోపేలా ఎలాంటి పన్నులను పెంచలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో ఆహార పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణం దిగి వస్తోందన్నారు. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని జారీ అవకాశాలపై ఇప్పుడు మాట్లాడడం తొందరపాటు అవుతుందని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రగతిశీల బడ్జెట్‌ను కేంద్రం తీసుకొచ్చిందని ఆస్కీ చైర్మన్ కె.పద్మనాభయ్య అన్నారు. -
వచ్చే 25 ఏళ్ల వృద్ధికి బడ్జెట్ పునాదులు
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్ వచ్చే 25 సంవత్సరాలకు వృద్ధికి పునాదులు వేసిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతికి కీలకమైన ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి కేంద్ర బడ్జెట్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కరోనా వైరెస్‌తో అతలాకుతలం అయిన ఎకానమీ పురోగతికి 2022–23 వార్షిక బడ్జెట్ దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో నెలకొన్న సంక్లిష్ట ప్రక్రియను సరళతరం చేయడం జరిగిందని, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రక్రియ మరింత క్రమబద్ధీకరిణ జరుగుతుందని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సముపార్జనకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే 2047లో భారత్ సమోన్నత స్థితి లక్ష్యంగా 2022–23 బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. అప్పటికి భారత్ అన్ని సాంకేతిక విభాగాల్లో అగ్ర స్థానంలో ఉంటుందని, వృద్ధి ప్రయోజనాలు ప్రజలందరికీ ప్రత్యేకించి నిరుపేదలకూ అందుబాటులోకి వస్తాయని రాజీవ్ కుమార్ తెలిపారు. మౌలిక పరిశ్రమల నుంచి అభివృద్ధిలోకి వస్తున్న రంగాల వరకూ పటిష్ట పురోగతి, సాంకేతికాభివృద్ధి తాజా బడ్జెట్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పన్ను కోతల రూపంలో మధ్య తరగతికి ఎటువంటి ప్రయోజనాలూ కల్పించలేదన్న విమర్శకు సమాధానమిస్తూ ఈ విషయంలో ప్రస్తుత రేట్లు సజావుగానే ఉన్నాయని రాజీవ్ కుమార్ అన్నారు. -
పారిశ్రామిక ప్రగతికి పూర్తి సహకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం, పారిశ్రామిక కార్యకలాపాలను పెంచడం, ఎగుమతుల వృద్ధి లాంటి అంశాల్లో తోడ్పాటు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ బృందం బుధవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలతో ఇష్టాగోష్టి నిర్వహించింది. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను రాజీవ్ కుమార్ కోరారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్)లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, నిబంధనలను మరింత సరళీకృతం చేయడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. సులభతర వ్యాపారానికి దాదాపు 1,300 నియమ, నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, ఇందులో 397 నిబంధనలను పూర్తిగా లేదా సరళీకృతం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, సంఘాలు చేసిన సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటిని క్రోడీకరించి నీతి ఆయోగ్‌కు అందచేస్తారని, వాటిని ఆయా మంత్రిత్వ శాఖలకు పంపి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తెలిపారు. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలకు గత ఐదేళ్ల బకాయిలను చెల్లించడంతోపాటు వైఎస్సార్ నవోదయం ద్వారా రుణాలను పునర్వ్యవస్థీకరించి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ చర్యలతో కోవిడ్ సమయంలో కూడా దేశ సగటు కంటే జీఎస్డీపీ, ఎగుమతుల్లో రాష్ట్రం అధిక వృద్ధి రేటు నమోదు చేసిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నామన్నారు. విభజన హామీ ప్రకారం పెట్రోలియం కారిడార్ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. ప్రభుత్వ సాయంతో నిలబడ్డాం పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆదుకోవాలని పారిశ్రామికవేత్తలు, సంఘాలు నీతి ఆయోగ్‌ను కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాత బకాయిలను చెల్లించడంతో నిలదొక్కుకున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి నీతి ఆయోగ్ మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ కె.రాజేశ్వరరావు, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఏపీఐఐసీ వీసీఎండీ జవ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయాలు, ఆర్బీకేలు భేష్
సాక్షి, అమరావతి/గన్నవరం: సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ఆలోచన అని అభినందించారు. గత రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామసీమల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో గ్రామ సచివాలయం, ఆర్బీకేని సందర్శించి వాటి ద్వారా అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. తిరిగే తిప్పలు లేకుండా అన్ని సేవలు.. పౌర సేవలను ప్రజల చెంతకు చేర్చడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించిందని, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఏర్పాటయ్యాయన్నారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా గ్రామ సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లేవారని, ఇప్పుడు వారి గ్రామాల్లోనే సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందుతున్నాయన్నారు. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తొలగిపోయి వేగంగా పనులు జరుగుతున్నట్లు పలువురు నీతి ఆయోగ్ బృందానికి తెలియచేశారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా ఇస్తున్నారని, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేవడం బాగుందని చెప్పారు. మహిళా సంఘాల భాగస్వామ్యం అభినందనీయం ప్రకృతిసాగులో మహిళా సంఘాల భాగస్వామ్యం అభినందనీయమని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు సాగు చేస్తున్న పెరటి తోటల క్షేత్రాన్ని నీతి అయోగ్ బృందం సందర్శించింది. తనకున్న ఐదు సెంట్ల స్థలంలో పసుపుతో పాటు 18 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నానని, ఇంట్లో వినియోగం, ఖర్చులు పోనూ మిగిలిన వాటిని విక్రయించి నెలకు రూ.1,000 సంపాదిస్తున్నానని పొదుపు సంఘం మహిళ జన్యావుల ధనలక్ష్మి తెలిపింది. కార్యక్రమంలో నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వరరావు, సీనియర్ సలహాదారులు డాక్టర్ నీలం పటేల్, సీహెచ్‌పీ శరత్‌రెడ్డి, అవినాష్మిశ్రాతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకేల పనితీరు చాలా బాగుంది ఆర్బీకేల వ్యవస్థ చాలా బాగుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్ టీవీ, కియోస్క్, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ కిట్లతో పాటు రైతుల కోసం అందుబాటులో ఉంచిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆయన పరిశీలించారు. ఆర్బీకేల ద్వారా ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సొంతూరిలోనే రైతులకు అందించడం, ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సున్నా వడ్డీకే పంట రుణాలు, బ్యాంకింగ్ సేవలు ఇలా ఆర్బీకేల ద్వారా అంది స్తోన్న సేవలన్నీ బాగున్నాయన్నారు. -
YS Jagan: అండగా నిలవండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురోగతికి కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ కూడా అన్ని విధాలుగా అండగా నిలిచి పూర్తి సహకారాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. తీవ్ర రుణభారంతో ఉన్న విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడానికి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపట్టి స్కూళ్లను ఆరు రకాల కేటగిరీలుగా విభజించామని, సబ్జెక్టుల వారీగా బోధన, పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించేలా చర్యలు తీసుకున్నామని వివరించగా.. రాజీవ్ ప్రశంసించారు. సుపరిపాలన కోసం తెచ్చిన మార్పులు, నవరత్నాలు, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు నీతి ఆయోగ్ బృందానికి సమగ్రంగా వివరించారు. సేంద్రియ ఉత్పత్తులపై దృష్టి ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్ పంటల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, రైతులకు మంచి ఆదాయం వస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సూచించగా.. ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు అధికారులన్నారు. ఆరోగ్యశ్రీపై ఆసక్తిగా.. వైద్య, ఆరోగ్య రంగంలో తీసుకున్న పలు చర్యలను నీతి ఆయోగ్ బృందానికి అధికారులు వివరించారు. వైఎస్సార్ విలేజ్ అర్బన్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, కొత్తగా మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు, నాడు – నేడు ద్వారా ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల పెంపు, భారీగా వైద్య సిబ్బంది నియామకాలు, తల్లులు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియచేశారు. మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ అమలు తీరును నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఒడిపై పూర్తి వివరాలు.. విద్యా రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, అమలు చేస్తున్న పథకాలను అధికారులు వివరించగా అమ్మ ఒడి పూర్తి వివరాలపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆరా తీశారు. మహిళా సాధికారత.. మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని చేయూత, ఆసరా, పెన్షన్లు తదితర కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. ఆసరా, చేయూత ఉద్దేశాలు, సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అమలు చేస్తున్న ఉపాధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ నీతి ఆయోగ్ చైర్మన్‌కు తెలియచేశారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం గురించి అధికారులు వివరించారు. దిశ యాప్‌పై ప్రశంసలు ‘దిశ’ కింద మహిళల భద్రత కోసం తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. దిశ యాప్‌ను ప్రశంసించిన నీతి ఆయోగ్ చైర్మన్ దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి వివరాలు సేకరించాలని తన బృందానికి సూచించారు. విద్యుత్ రంగం – విభజన సమస్యలు రాష్ట్ర విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారులు నీతి ఆయోగ్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. రెవెన్యూ లోటు కింద కాగ్ నిర్ధారించిన విధంగా ఇంకా రావాల్సిన రూ.18,969 కోట్ల నిధులు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడిందని గణాంకాలతో సహా వివరించారు. ప్రఖ్యాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కోల్పోయామని, సహజ వనరుల విషయంలోనూ ఇబ్బంది తలెత్తిందన్నారు. పలు పథకాలపై బృందానికి వివరాలు... వైఎస్సార్ ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ పంట రుణాలు, పంటల బీమా, ధరల స్థిరీకరణ, ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లింపు, అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్, అమూల్‌తో చేపట్టిన ప్రాజెక్టు వివరాలు, రూ.3,176.61 కోట్లతో నిర్మించనున్న 8 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఆక్వా హబ్స్, ప్రాసెసింగ్ యూనిట్లు, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ, చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సహాయం తదితరాల గురించి అధికారులు తెలియచేశారు. కడప స్టీల్ ప్లాంట్, పోర్టులు, ప్రాజెక్టులు.. విభజన హామీ ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ కోసం అనంతపురంలో నాలుగు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని, జీఎస్టీ రీయింబర్స్ సహా మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులు నీతి ఆయోగ్‌కు నివేదించారు. రాష్ట్రంలో నిర్మించనున్న పోర్టులకు ఆర్థిక సహాయం అందించాలని, పోలవరం సకాలంలో పూర్తయ్యేలా సవరించిన అంచనా వ్యయం ఆమోదం పొందేలా సహకరించాలని కోరారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు తగిన విధంగా నిధులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. అప్పర్ సీలేరులో కొత్తగా నిర్మించ తలపెట్టిన 1,350 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సహాయం అందించాలని విన్నవించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేకపోవడంతో రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని వివరించారు. -
ఆదర్శ ఆంధ్ర.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కితాబు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో వినూత్న ఆలోచనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చర్యలు తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఈ విషయంలో తనకు బాగా నమ్మకం ఉందని చెప్పారు. అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, ఇందుకు అవసరమైన సామర్ధ్యం, శక్తి రాష్ట్రానికి ఉందని తెలిపారు. డాక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ కె.రాజేశ్వరరావు (స్పెషల్ సెక్రటరీ), డాక్టర్ నీలం పటేల్ (సీనియర్ అడ్వైజర్), సీహెచ్.పి.సారధి రెడ్డి (అడ్వైజర్), అవినాష్‌మిశ్రా (అడ్వైజర్) తదితరులు ఇందులో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి చెబుతున్నా.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టారని, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అభినందించారు. అభివృద్ధి కార్యక్రమాలు, వినూత్న చర్యలను క్షేత్రస్థాయి పర్యటనలో తాను స్వయంగా చూడటమే కాకుండా గణాంకాలను కూడా సేకరించానని వివరించారు. ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసించారు. సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా తాము అన్ని రాష్ట్రాలకు వెళ్లి విజన్, అభివృద్ధిపై పరస్పరం ఆలోచనలు పంచుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టే ప్రతి పనిలోనూ నీతి ఆయోగ్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాయని హామీ ఇచ్చారు. రాజీవ్‌కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి... ► గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు, వ్యవసాయానికి తోడ్పాటు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ చర్యలు బాగున్నాయి. ► రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తోంది. వారి రక్షణ కోసం దిశ యాప్ రూపొందించడం అభినందనీయం. దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తున్నాం. ► కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం ఎంతో ఉదాత్త నిర్ణయం. దీన్ని కూడా ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని కోరతాం. ► సీఎం జగన్ ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఫలాలను అందజేస్తున్నారు. ఇది అభినందనీయం. ► రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. దీర్ఘకాలిక భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో కూడా మీరు ముందున్నారు. ఇది ప్రశంసనీయం. ► కోస్టల్ ఎకనామిక్ జోన్స్, ఎగుమతులు తదితర రంగాల్లో ఏపీ వృద్ధికి సహాయపడతాం. మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాల్లో రాష్ట్రానికి చేయూతనిస్తాం. ► సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా చేస్తోంది. ► వ్యవసాయ రంగంలో రాష్ట్రం బాగా రాణిస్తోంది. ముఖ్యంగా ప్రకృతి సేద్యం, ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ► రెవెన్యూ లోటు పూడ్చడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం.. వీటన్నింటి కోసం ప్రయత్నిస్తాం. విభజన వల్ల హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిందన్న విషయం మాకు తెలుసు. ► పోలవరం ఎత్తుకు సంబంధించి మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే బాగుంటుంది. తద్వారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మార్పులు వస్తాయి. ► మీకు విశాల తీర ప్రాంతం ఉంది. వాటిలో ఎకనామిక్ జోన్లు, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు ముఖ్యం. ► పర్యాటక రంగం వల్ల కూడా ఆదాయం వస్తుంది. ► అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయం. దీనివల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండదు. -
2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు. వచ్చే ఐదేళ్లూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్ తెలిపారు. -
టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లోకి వచ్చేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్‌లో టెస్లా తన కార్లను ప్రవేశపెట్టడానికి సిద్దమైనా..ఇంపోర్ట్ టాక్స్ భారత్‌లో ఎక్కువగా ఉండటంతో కంపెనీ ఊగిసలాడిపోతుంది. ఇప్పటికే టెస్లా పలుమార్లు ఇంపోర్ట్ టాక్స్‌లను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని విన్నవించింది. దిగుమతి సుంకాల తగ్గింపుపై గత నెలలో పీఎం కార్యాలయంలో టెస్లా ఎగ్జిక్యూటివ్స్ సంబంధింత అధికారులతో చర్చలు జరిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలన్‌మస్క్ కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌లో అవకాశాలను సొంతం చేసుకోండి ఇక్కడే తయారుచేయండి..: నీతి ఆయోగ్ భారత్‌లో టెస్లా కార్ల వ్యవహారంపై తాజాగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పందించారు. టెస్లా తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లోనే తయారు చేయాలని కోరారు. అదే సమయంలో టెస్లాకు ప్రభుత్వం నుంచి కావలసిన పన్ను ప్రయోజనాలను కచ్చితంగా పొందే అవకాశం ఉందని రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (PAFI) వర్చువల్ కాన్ఫరెన్స్‌లో గురవారం రోజున రాజీవ్ కుమార్ ఈ వ్యాఖ్యలను చేశారు. అమెరికా నుంచి టెస్లా తన ఉత్పత్తులను భారత్‌కు రవాణా చేసే బదులుగా ఇక్కడే తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే...ఏకకాలంలో టెస్లాకు, ఇక్కడి వారికి కూడా ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా...ఈ నెల ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా భారత్‌లోనే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయమని టెస్లాను అనేకసార్లు కోరారు. చదవండి: కేంద్రం టఫ్ కండిషన్స్.. ఏకంగా ప్రధానినే బతిమాలుతున్న ఎలన్ మస్క్! -
నవ ప్రపంచ ఆవిర్భావానికి ఇది సరైన సమయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టమవుతోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. దేశాల మధ్య పూర్తి సమన్వయంతో కూడిన కొత్త ప్రపంచ ఆవిర్భావానికి ఇది సరైన సమయమని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్ ఎటువంటి అవరోధాలూ లేకుండా ప్రతిదేశానికి అందుబాటులో ఉండే వాతావరణం ఉంటేనే నవ ప్రపంచం ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన విశ్లేషించారు. ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. (చదవండి: యువత మెచ్చే ఖరీదైన కలల బైక్స్!) ప్రపంచ దేశాల ప్రజలకు సరళీకృత, బహుళవిధ సేవలు అందుబాటుకు భావసారూప్యత కలిగిన దేశాలతో కొత్త సంకీర్ణం ఒకటి ఏర్పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రస్తుత బహుళజాతి సంస్థలను మరింత పటిష్టం చేసే చర్యలను చేపట్టాలి. ప్రపంచ యుద్ధాల అనంతర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కొంత పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమన్వయ, పారదర్శకత లోపించిన పరిస్థితి ఉంది. ఆయా లొసుగులను సరిదిద్దడానికి ప్రపంచ దేశాల నాయకులు అందరూ కలసికట్టుగా సమన్వయ, సహకార చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవంలో ఇది ఎంతో కీలకం. ప్రపంచ యుద్ధాల అనంతరం అంతర్జాతీయ వ్యవస్థ మార్పులో ప్రభుత్వాలు ఎంతో చేశాయి. అయితే కార్పొరేట్ రంగం నుంచి ఈ విషయంలో అంత సహకారం అందలేదు. దేశాల మధ్య సమన్వయం, సహకారం సాధనలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి బహుళజాతి సంస్థలు సాధించిందిసైతం అంతంతమాత్రమే. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్లను కూడా ఇప్పుడు పటిష్టం చేయాల్సి ఉంది. ఆయా బహుళజాతి సంస్థల ద్వారానే దేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయా సంస్థలే మనముందు ఉన్న ఏకైక మార్గం. ప్రస్తుతం ప్రపంచం పరివర్తనకు సంబంధించిన క్లిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో మనకు అతి చురుకైన, సున్నితమైన ప్రపంచ సంస్థలు అవసరం. క్రియాశీలత విషయంలో ఆయా సంస్థలు జడత్వం బాటను అనుసరించకూడదు. ఎంత క్లిష్టతరమైన సమస్యపైనైనా ప్రతిస్పందించి, తగిన చర్యలు తీసుకోగలిగిన స్థాయిలో బహుళజాతి సంస్థలు ఉండాలి. భారత్‌కు సంబంధించి మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు (20.1 శాతం వృద్ధి) వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను (ప్రస్తుతం 10– 8 శాతం శ్రేణిలో అంచనా) పలు రేటింగ్, విశ్లేషణ సంస్థలు ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది. -
వృద్ధి రేటుపై కీలక వ్యాఖ్యలు చేసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్...!
సాక్షి, న్యూ ఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రెండంకెల వృద్ధి రేటును నమోదుచేస్తోందని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ కూగా సాఫీగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా మొదటి, రెండో వేవ్‌లో రాష్ట్రాలు ఎదుర్కొన్న తీరు రాబోయే కాలంలో వచ్చే కోవిడ్-19 వేవ్‌లను దేశం, రాష్ట్రాలు ఎదుర్కొనే స్థితి వస్తోందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కోవిడ్-19 సెకండ్‌వేవ్ నుంచి ఇబ్బందులను అధిగమించామని, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఎకనామిక్ రికవరీ చాలా బలంగా ఉందని తెలిపారు. ఫిచ్ లాంటి పలు రేటింగ్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తగ్గించాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న రికవరీతో అదే సంస్థలు తిరిగి వృద్ధి రేటును సవరించే అవకాశాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 2021 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం కుదించింది. ప్రముఖ రేటింగ్ ఏజన్సీలు ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగా, ఫిచ్ రేటింగ్స్ అంతకుముందు జీడీపీ వృద్ధి రేటు 12.8 శాతం నమోదు చేస్తోందని తెలుపగా తిరిగి వృద్ధిరేటును 10 శాతానికి సవరించింది. ఉక్కు, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కొన్ని రంగాలలో సామర్థ్య విస్తరణలో గణనీయమైన పెట్టుబడులు ఇప్పటికే జరుగుతున్నాయాని పేర్కొన్నారు. కన్యూసమర్ డ్యురాబుల్ సెక్టార్లో కరోనాతో వినియోగదారుల్లో అనిశ్చితి నెలకొలడంతో పెట్టుబడులను పెట్టేందుకు కాస్త సంకోచాలకు గురవౌతున్నారని తెలిపారు. పూర్తిస్తాయి ప్రైవేట్ పెట్టుబడి రికవరీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అదనంగా 23,123 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. దీంతో కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వారి ప్రకటనలు ప్రస్తుతానికి ద్రవ్యోల్బణ అంచనాలను అధిక స్థాయిలో ఉంచలేదని చాలా స్పష్టంగా తెలియజేశాయి. ప్రస్తుతం ఇది తాత్కాలికమైన, ఆర్బిఐ నిర్ధేశించిన ద్రవ్యోల్భణ స్థాయి లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటామని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు, -
Covid-19: ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే
న్యూఢిల్లీ: నోబల్ బహుమతి అవార్డ్ గ్రహిత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకునేలా పలు సూచనలిస్తున్నారు. దేశ ఆర్ధిక స్థితిగతులపై ఆయన మాట్లాడుతూ.. మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు దారిద్య్రరేఖ దిగువకు వెళ్లిపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేదంటే దేశాభివృద్ధికి తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిజిత్ వ్యాఖ్యానించారు. కోవిడ్-19 మహమ్మారితో సంభవించిన ఆర్ధిక సంక్షోభం నుంచి పేదల్ని రక్షించాలంటే ప్రభుత్వ ప్రధాన పథకాల ద్వారా పని దినాల సంఖ్యను 100 నుంచి 150 రోజులకు పెంచాలని అభిజిత్ బెనర్జీ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) కింద కనీసం 100 రోజుల నుంచి 150 రోజుల పాటు ఉపాధి ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత కల్పించవచ్చన్నారు. కానీ ఇది ప్రజలు సాధారణ స్థితికి చేరుకునేందుకు సహాయ పడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో పాటు "కార్మికులు పనిచేసే హోటల్, తయారీ, నిర్మాణ రంగాలు త్వరగా పునరుద్ధరించబడితే పరిస్థితి మెరుగుపడవచ్చు" అన్నారు. భారతదేశంలో నగదు బదిలీ కార్యక్రమాలను ఇతర దేశాలతో పోల్చి చూస్తే అమెరికాలో చాలా మంది నిరుద్యోగులు వారానికి 600 డాలర్లు నగదు పొందుతున్నారని, ఫ్రాన్స్‌లో ఉద్యోగం కోల్పోయిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని చెప్పారు. కాగా, గత సంవత్సరం మహమ్మారి కారణంగా 230 మిలియన్ల మంది భారతీయులు పేదరికంలో పడిపోయినట్లు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ పేదరికం మరింతగా పెరిగే అవకాశం ఉందని బెంగళూరుకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ తెలిపింది. గత మార్చి నుండి నెలరోజుల లాక్డౌన్ సుమారు 100 మిలియన్ల మంది ఉపాది కోల్పోయారని, ఈ సంవత్సరం చివరినాటికి 15 శాతం మంది ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అధ్యయనం తెలిపింది. వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ -
మరో దఫా ‘ఉద్దీపన’ చర్యలు: రాజీవ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇటు వినియోగదారులు, అటు ఇన్వెస్టర్ల సెంటిమెంటుపరంగా ’మరింత అనిశ్చితి’ నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తగు సమయంలో ద్రవ్యపరమైన చర్యలు తీసుకోగలదని కుమార్ పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో పరిస్థితి గతంలో కన్నా మరింత కష్టతరంగా మారిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎకానమీ 11 శాతం మేర వృద్ధి సాధించగలదని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19ని భారత్ దాదాపు తుదముట్టించే దశలో ఉండగా బ్రిటన్, ఇతర దేశాల నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్స్ కారణంగా పరిస్థితి దిగజారిందని ఆయన పేర్కొ న్నారు. ‘సర్వీసులు వంటి కొన్ని రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతో పాటు వివిధ ఆర్థిక కార్యకలాపాలపైనా సెకండ్ వేవ్ పరోక్షంగా ప్రభావం చూపడం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరగ వచ్చు. ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అన్నారు. -
12 శాతానికి భారత ఆర్థిక వృద్ధి రేటు!
న్యూఢిల్లీ: భారత జీడీపీ 2021లో 12 శాతం మేర వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. సమీప కాలంలో పరిస్థితులు భారత్‌కు ఎంతో సానుకూలంగా ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ మైనస్ 7.5 శాతానికి పడిపోయిన తర్వాత.. డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిలోకి చేరుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు అంచనాలకు మించి ఉన్నట్టు మూడీస్ పేర్కొంది. ‘‘ప్రైవేటు వినియోగం, నివాసేతర పెట్టుబడులు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకుంటాయి. ఇది 2021లో దేశీయ డిమాండ్ పుంజుకునేందుకు సాయపడుతుంది’’ అని మూడీస్ తన తాజా నివేదికలో వివరించింది. క్రితం సంవత్సరంలో జీడీపీ కనిష్టాలకు పడిపోయినందున.. అక్కడి నుంచి చూసుకుంటే 2021 సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 12 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనాకు ముందున్న వృద్ధితో (2020 మార్చి త్రైమాసికం) పోలిస్తే ఇది 4.4 శాతం ఎక్కువ. ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి అనుకూలంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది అదనపు రేట్ల కోతలను అంచనా వేయడం లేదని పేర్కొంది. దేశీయ వినియోగాన్ని చూసి అవసరమైతే ద్వితీయ అర్ధ సంవత్సరంలో కొంత ద్రవ్యపరమైన మద్దతు అవసరం కావచ్చని అంచనా వేసింది. అయితే, 2021లో రికవరీ కరోనా కేసుల మలివిడత తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా రెండో విడత కేసుల తీవ్రత కొన్ని రాష్ట్రాల పరిధిలోనే ఎక్కువగా ఉన్నందున కట్టడికి అవకాశం ఉంటుందని పేర్కొంది. 11 శాతం వృద్ధి అవసరం: నీతి ఆయోగ్ భారత్ రానున్న ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10.5–11 శాతం స్థాయిలో వాస్తవ వృద్ధి రేటును చేరుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. మరోసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. నేషనల్ సీఎస్ఆర్ నెట్వర్క్ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజీవ్‌కుమార్ మాట్లాడారు. -
భారత్ ఆవిష్కరణల సూచీలో పైపైకి ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆవిష్కరణల సూచి (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)–2020లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచి 3 స్థానాలు ఎగబాకింది. ఈ ఇండెక్స్‌ను బుధవారం ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు విడుదల చేశారు. 2019 అక్టోబర్ 17న తొలిసారి వెల్లడించిన ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకుల్లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఈ రెండో ఎడిషన్‌లో 7వ ర్యాంకు సాధించింది. టాప్–10లో నిలిచిన రాష్ట్రాల్లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది. నీతి ఆయోగ్, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ సంస్థ సంయుక్తంగా ఈ సూచిని రూపొందించాయి. నూతన ఆవిష్కరణలకు అందించిన సహకారం, ఆవిష్కరణల పాలసీలను మెరుగుపరచడం వంటి విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును పరిగణనలోకి తీసుకుని 36 సూచికల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రాలను 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు, 9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు. తొలిస్థానం నిలబెట్టుకున్న కర్ణాటక.. ఇండెక్స్–2020లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి స్థానంలో కర్ణాటక నిలిచింది. గత ఎడిషన్ సాధించిన తొలి ర్యాంకును తిరిగి నిలబెట్టుకుంది. తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ, పంజాబ్, పశి్చమ బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్ నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు, నగరాలు రాష్ట్రాలుగా ఉన్న కేటగిరీలో ఢిల్లీ, చండీగఢ్, డామన్ అండ్ డయ్యూ తొలి మూడుస్థానాల్లో నిలవగా.. ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏపీ ప్రతిభ ఇలా.. ఆంధ్రప్రదేశ్ ఇండెక్స్–2020లో ఓవరాల్‌గా 24.19 స్కోరు సాధించింది. సాధికారత అన్న అంశంలో 2019 ఇండెక్స్‌లో 18.8 స్కోరు ఉండగా ఇప్పుడు 33.14 స్కోరు సాధించింది. పనితీరు అంశంలో 2019లో 10.21 స్కోరు ఉండగా.. ఇప్పుడు 15.25 స్కోరు సాధించింది. నాలెడ్జ్ అవుట్‌పుట్‌లో 2019లో 6.11 స్కోరు ఉండగా.. ఈసారి 9.35కు పెరిగింది. విజ్ఞాన విస్తరణ అంశంలో 2019లో 14.31 స్కోరు ఉండగా.. ఇప్పుడు 21.14 స్కోరు సాధించింది. -
15 నెలల్లో కోవిడ్ ముందు స్థాయికి ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) చివరినాటికి కోవిడ్–19 ముందస్తు స్థాయికి మెరుగుపడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 8%లోపే ఉంటుందన్నది కూడా తమ అంచనా అని ఒక వార్తా సంస్థతో పేర్కొన్నారు. భారత్ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి సారించిందనీ, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ)తన వాటా అమ్మకం ద్వారా రూ.1.20 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం. బ్యాంకింగ్ సేవల విస్తరణ జరగాలి బ్యాంకింగ్ సేవల విస్తరణ మరింతగా జరగాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జీడీపీలో ప్రైవేటు రుణ నిష్పత్తి ప్రస్తుతం 50 శాతంగానే ఉన్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి 100 శాతానికిపైగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లాడుతూ, రసాయనాల రహిత సహజ సాగు కార్యక్రమాల పురోగతిపై నీతి ఆయోగ్ దృష్టి సారిస్తోందన్నారు. ఈ దిశలో ముందడుగు వేయడానికి తన వంతు కృషి చేస్తుందన్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని అన్నారు. అలాగే పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు. వ్యవసాయ రంగంలో పోటీతత్వం, అలాగే రైతుల ఆదాయాల పెరుగుదల వంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్ కోసం స్వీయ నియంత్రణ సంస్థ నీతి ఆయోగ్ సిఫార్సు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి ఒక స్వీయ–నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను స్వతంత్ర బోర్డుకు అప్పగించాలని సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్ ఆడేలా, మైనర్లను దూరంగా ఉంచేలా ఆంక్షలు ఉండాలని ఒక ముసాయిదా నివేదికలో పేర్కొంది. గవర్నెన్స్, చట్టాలు, పాలన తదితర రంగాల్లో పేరొందిన వ్యక్తులను స్వతంత్ర పర్యవేక్షణ బోర్డులో నియమించాలని అందులో సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలి నివేదిక ప్రకారం ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య 2016 జూన్‌తో పోల్చితే, 2019 డిసెంబర్ నాటికి 212 శాతం వృద్ధి చెంది 9 కోట్ల మందికి పెరిగింది. 2023 నాటికి దీని ద్వారా 150 కోట్ల మేర ఆన్లైన్ లావాదేవీలు జరగొచ్చని అంచనా. -
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షపదవికి ఆగస్టులో రాజీనామా చేసిన ఆయనను అంతకుముందున్న ఎన్నికల కమిషనర్ అశోక లవాసా స్థానంలో నియమించారు. ఈ సందర్బంగా రాజీవ్ కుమార్‌కు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏప్రిల్ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆయనను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు(పీఈఎస్బీ) ఆసియా అభివృద్ధి బ్యాంకు చైర్మన్‌గా నియమించింది. అయితే రాజీవ్ కుమార్ 1984లో జార్ఖ్ండ్ కేడర్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయనకు అనేక రంగాలైన పబ్లిక్ పాలసీ, అడ్మినిస్టేషన్‌గా 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అదే విధంగా ఆయన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ సస్టెనబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్ఎల్బీ డిగ్రీల్లో ఆయన పట్టభద్రులు. -
విశాఖ : ప్రత్యేక బృందంతో కమిటీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పరిపాలనా రాజధానిగా ఆమోదముద్ర పడిన నేపధ్యంలో పోలీస్ శాఖ ఆవశ్యకత, మౌలిక సదుపాయాల కల్పనపై తమ కమిటీ పరిశీలన చేయనున్నట్లు విశాఖ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా అన్నారు. ఆరుగురు అధికారుల ప్రత్యేక బృందంతో కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే ఒకసారి సమావేశమైన ఈ బృందం మరో మూడుసార్లు సమావేశమయ్యి తుది నివేదికను 15 రోజుల్లో డీజీపీకి అందిస్తామని సీపీ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికలను అందజేశామన్నారు. దీంతో పాటు క్రైం, విఐపిల సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ పూర్తిగా పరిశీలన జరుపుతుందని వెల్లడించారు. -
విశాఖ కేంద్రంగా పసికందుల విక్రయం
-
సృష్టి హాస్పటల్దే కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ ప్రాంతంలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నమ్రతను ఆమెకు సహకరించిన మరో వైద్యురాలు తిరుమల, ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ, పసికందును కొనుగోలు చేసిన తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. (ఆస్పత్రి మాటున అరాచకం) ► విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన జలుమూరి సుందరమ్మ(34) అనే మహిళకు భర్త చనిపోయాడు. మరొకరితో సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ► ఈ విషయం తెలుసుకున్న అదే మండలానికి చెందిన ఆశా కార్యకర్తలు, ఏజెంట్ అర్జి రామకృష్ణ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు. ► సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను ఈ ఏడాది మార్చి 9న యూనివర్సల్ సృష్టి హాస్పిటల్లో చేర్చగా.. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ► ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసిన తరువాత ఆస్పత్రి ఎండీ నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు విక్రయించారు. ► సుందరమ్మ గర్భవతిగా ఉండగా వి.మాడుగుల మండలంలో ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందేది. అక్కడి అంగన్వాడీ టీచర్ సరోజినికి సుందరమ్మ బిడ్డ విషయమై అనుమానం వచ్చి మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చింది. ► చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకొచ్చి శిశు గృహలో చేర్పించారు. ► అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పసికందుల విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ► డాక్టర్ నమ్రతను కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో అరెస్ట్ చేశామని, ఏజెంట్ అర్జి రామకృష్ణ, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులతోపాటు ముఠాలో మిగిలిన నలుగురినీ అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ చెప్పారు. -
కార్మికుల చట్టాలపై రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ కుమార్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్యారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాగా వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఇటీవల ప్రణాళికబద్దమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్మికులు, వ్యాపార సంస్థలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల చట్టాలను సంస్కరించడమంటే రద్దు చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం వినియోగదారుల డిమాండ్‌ను పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి బ్యాంక్‌లు, ఎంఎస్ఎమ్ఈ లు(సూక్క్ష్మ మద్య స్థాయి పరిశ్రమలు) కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా విశాఖలో సాగుతున్న డ్రగ్స్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. విశాఖ టుటౌన్ పరిధిలో డాబాగార్డెన్స్ లో డ్రగ్స్ విక్రయాలపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల్లో నరేంద్ర అలియాస్ విక్కీ విజయవాడ ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్కీ.. తమిళనాడులో ఆర్ఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మధురాయ్‌లో మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. గతంలో విక్కీ డ్రగ్స్ సరఫరా కేసులో 9 నెలలు రిమాండ్‌లో సైతం ఉన్నాడు. ఆ సమయంలో డ్రగ్స్ సరఫరాదారుడు ఆంటోనీతో పరిచయం ఏర్పడి డ్రగ్స్ దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బెంగుళూరు, ముంబయి, గోవా నుంచి గంజాయి తీసుకుని విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిర్థారణకు వచ్చారు. అదుపులోకి తీసుకున్న మిగతా ముగ్గురిలో విక్కీ గర్ల్ ఫ్రెండ్ సీతా అలియాస్ సిరి, విశాఖకు చెందిన చింతలపూడి రాజు, వెన్నెల వెంకటరావు ఉన్నారు. నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితులను విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా ముందు హాజరు పరిచారు. -
9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: పండుగుల సీజన్లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇందులో నూతనంగా జారీ చేసిన రుణాలు రూ.34,342 కోట్లు అని చెప్పారు. తదుపరి రుణ మేళా కార్యక్రమం ఈ నెల 21 నుంచి 25 వరకు ఉంటుందని రాజీవ్‌కుమార్ తెలిపారు. బ్యాంకుల వద్ద తగినంత నిధుల లభ్యత ఉందని, అసలైన రుణ గ్రహీతలకు అవి నిబంధనల మేరకు రుణాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి చేయాల్సిన చెల్లింపులు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి బిల్ డిస్కౌంటింగ్ సదుపాయం అందించాల్సిందిగా బ్యాంకులను కోరినట్టు తెలిపారు. రూ.40,000 కోట్లు పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు జరగాల్సి ఉన్నట్టు చెప్పారు. పీఎంసీ పరిణామాలపై సునిశిత పర్యవేక్షణ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నామని, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీలైనంత తొందరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.బ్యాంకుల్లో గరిష్టంగా రూ.లక్ష డిపాజిట్ వరకే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బీమా ఉండగా, ఈ పరిమితి పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీన్ని పా ర్లమెంటు ద్వారా చేపడతామని చెప్పారు. ఒప్పందాలను గౌరవిస్తాం.. ఇంధన రంగంలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఒప్పందాలను భారత్ గౌరవిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందొద్దని కోరారు. -
ఆంధ్రప్రదేశ్‌కు సహకరించండి
సాక్షి, అమరావతి: వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ గత ప్రభుత్వం రూ. 2.27 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ను అంతే ఉంచి అంతర్గతంగా కొన్ని మార్పులు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. నాలుగు రకాలుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, రాష్ట్ర రెవెన్యూ నుంచి వచ్చే ఆదాయం ఒకటైతే కేంద్రం పన్నుల నుంచి వచ్చే వాటా మరొకటన్నారు. ఒక విధానం ప్రకారం కేంద్ర పన్నుల నుంచి వాటా వస్తుందని, రుణాల విషయంలో కూడా ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితులున్నాయని, ఈ నేపథ్యంలో కేంద్ర నుంచి గ్రాంట్లు తగ్గకుండా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. శుక్రవారం సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగాల వారీగా రాష్ట్రం పరిస్థితిని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 44,000కిపైగా స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ఏపీలో నిరక్షరాస్యతను అధిగమించేందుకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ నీతి ఆయోగ్ బృందానికి తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 44 వేలకు పైగా స్కూళ్లను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, మొదటి దశలో 15 వేల స్కూళ్లలో తొమ్మిది రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని, ఆపై వచ్చే సంవత్సరం 9, 10వ తరగతుల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల వల్ల చాలామంది పేదలు పిల్లలను స్కూళ్లకు పంపించలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో చక్కటి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని చెప్పారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు ఏటా రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నామని, జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. మొదట పేదల కడుపు నింపితే పిల్లలను స్కూళ్లకు పంపటంపై దృష్టి పెడతారని, నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని స్పాన్సర్ చేస్తే దేశానికి మోడల్‌గా నిలుస్తుందని నీతి ఆయోగ్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఆహార లోపం ఒకటైతే పారిశుధ్యం, తాగునీరు, అనారోగ్య వాతావరణం మరో కారణమని, వీటిని నివారించడానికి అన్ని చర్యలూ చేపడుతున్నామన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించడానికి వాటర్‌గ్రిడ్ తెస్తున్నామని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉందని, అంగన్వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న ఆహారం నాణ్యతను బాగా పెంచుతున్నామని, ఇప్పటికే పంపిణీ చేస్తున్న బియ్యంలో నాణ్యత పెంచామని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేరుస్తున్నామని, దీన్ని డిసెంబర్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని సీఎం చెప్పారు. డెంగీ, మలేరియాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, స్కూళ్లు, ఆస్పత్రులు విషయంలో శరవేగంగా ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. నాడు – నేడు కింద వీటిని అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా వీటిని తయారు చేస్తున్నామని, తద్వారా ప్రజలకు వైద్య చికిత్స ఖర్చులు తగ్గిస్తున్నామని సీఎం వివరించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా పది చొప్పున ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆక్వా కల్చర్‌లో నాణ్యమైన ఉత్పాదనల కోసం అత్యుత్తమ విధానాలను అనుసరించే ప్రయత్నాలు చేస్తున్నామని, కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాములుతోపాటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచన.. విజన్.. ప్రణాళికల్లో సీఎం భేష్
ఆంధ్రప్రదేశ్‌కు చేయదగ్గ సహాయం అంతా చేస్తాం. తగిన రీతిలో సహకారం అందిస్తాం. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటునిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకితభావం, విజన్ నన్ను ఆకట్టుకున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే సీఎం చక్కటి పనితీరు చూపారు. – నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన, దూరదృష్టి, ప్రణాళికలు చాలా బాగున్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వచ్చినప్పుడు తనతో సుదీర్ఘంగా చర్చించారని, నవరత్నాల గురించి వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, రెవెన్యూ రంగాల్లో చేపట్టిన చర్యలు, వివిధ రంగాల్లో అవకాశాలపై రాజీవ్‌కుమార్ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకితభావం, విజన్ తనను ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి పనితీరు చూపారని అభినందించారు. అక్షరాస్యతలో వెనుకబాటు ఆంధ్రప్రదేశ్‌కు తాము చేయదగ్గ సహాయం అంతా చేస్తామని, తగిన రీతిలో సహకారం అందిస్తామని రాజీవ్‌కుమార్ చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ఏపీ పారిశ్రామిక వాటా కూడా తక్కువగా ఉందని చెప్పారు. ఏపీ బడ్జెట్లో సగానికిపైగా మానవ వనరుల వృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని, పారిశుధ్య కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నారని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ముందడుగు వేయాలని సూచించారు. జీరో బడ్జెట్ నేచరల్ ఫార్మింగ్‌కు తాను అనుకూలమని, దీన్ని పోత్సహించాలన్నారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటికి సరైన మద్దతు ధర లభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రెవిన్యూ లోటు ఎక్కువే.. రాష్ట్ర రెవిన్యూ లోటు కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని రాజీవ్‌కుమార్ చెప్పారు. పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏపీ మహిళల్లో ఆందోళనకర స్థాయిలో ఎనీమియా మహిళల్లో రక్తహీనత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉందని రాజీవ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా, శిశుసంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. బియ్యం, వంటనూనెల్లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలని, దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిసారించాలని సూచించారు. -
సీఎం జగన్ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు..
-
సీఎం జగన్ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు. సచివాలయంలో నీతి ఆయోగ్ బృందంతో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. వాటి పరిస్థితులపై రంగాల వారీగా అధికారులు...నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నిరక్షరాస్యతను అధిగమించడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వారికి తెలిపారు. దీనికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మెరుగైన పనితీరును కనబర్చారని, జగన్ ఆలోచన విధానం, అంకితభావం, విజన్ తనను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తమ వంతు సహయం అందిస్తామని తెలిపారు. రాష్టంలో నిరక్ష్యరాసత్య జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో మానవ వనరుల వృద్ధి కోసం సగానికి పైగా కేటాయించడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై, పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై.. సీఎం దృష్టి పెట్టాలని రాజీవ్ కుమార్ కోరారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగును పెంచడానికి తాము ప్రయత్నిస్తున్నామని, వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోని మహిళా, శిశుసంక్షేమంపై దృష్టి సారించాలని రాజీవ్ కుమార్ సూచించారు. చదవండి: సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నిరక్ష్యరాస్యతను జీరో స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా ఉన్న పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, మొదటి దశలో 15వేల పాఠశాలల్లో 9 రకాల కనీస సదుపాయలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చేఏడాది నుంచి ఒకటి నంచి ఎనిమిదవ తరగతి వరకు, తరువాత సంవత్సరంలో 9, 10 తరగతుల్లో.. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తన్నట్లు స్పష్టం చేశారు. ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామని, అలాగే పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉందని, పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి చేపడుతున్న చర్యలను నీతి ఆయోగ్ అధికారులకు వివరించారు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగు నీటిని అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, మధ్యాహ్నా భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఆహారంలో నాణ్యతను పెంచి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం స్పష్టం చేశారు. అమ్మ ఒడిని కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ స్పాన్సర్ చేస్తే ఈ పథకం దేశానికి స్పూర్తిగా నిలుస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, దీనికోసం ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేర్చుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటిని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, వీటిని నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నమని తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.‘‘రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం. విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది. దాన్ని అధిగమించేందుకు నీతి ఆయోగ్ సహకారం అవసరం. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే రాష్ట్ర అభివృద్ధికి చోదకాలు. 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రాభివృద్ధితో రాష్ట్రాన్ని మోడల్ స్టేట్‌గా తయారు చేయాడానికి సీఎం సంకల్పించారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కడప స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోపాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్, గుమ్మనూరు జయరాములు, ఇతర ప్రధాన అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీ నాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానిం చారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటింన సంగతి తెలిసిందే. నవ భారత ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్ పేర్కొన్నారు. పంజాబ్ నేషనన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో ఆరు బ్యాం కులను విలీనం చేయడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో ఉన్న 27 నుంచి ప్రస్తుతం 12కు పరిమితం తగ్గను న్నాయి. దీంతో ప్రపంచస్థాయిలో ఆరు మెగా బ్యాంకులు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారంలో భాగంగానే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నారని కుమార్ చెప్పారు. ‘ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే భారీ స్థాయి బ్యాంకులు అవసరం. తాజా మెగా విలీన నిర్ణయం ఈ దిశగా అడుగులు వేయడం కోసమే. భారీ మూలధన నిధులతో మనకు ఇప్పుడు ఆరు మెగా బ్యాంకులు ఉంటాయి’ అని అన్నారు. -
ఏపీ సీఎంను కలవనున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
సాక్షి, అమరావతి: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈ నెల 13న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమరావతికి రానున్న రాజీవ్ కుమార్ ఎటువంటి పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) పరిశీలించనున్నారు. -
అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనడానికి అసాధారణ చర్యలు అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కేంద్రానికి సూచించారు. ఫైనాన్షియల్ రంగంలో ముందెన్నడూ లేనంత తీవ్ర ఒత్తిడి నెలకొందనీ, ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రతకూ ఇదీ ఒక కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో ఒకరినొకరు విశ్వసించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్టుబడులు పెట్టడంపై ఆందోళనలూ ఉన్నాయన్నారు. ఆయా భయాలను పోగొట్టి, పెట్టుబడులకు వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ♦ 70 యేళ్లలో లేనంత ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడి ఉంది. ఎవరు ఎవ్వరనీ విశ్వసించడంలేదు. ప్రైవేటు రంగంలో రుణాలు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్దంగా లేదు. ఎవరికివారు పెట్టుబడులు పెట్టకుండా, ఎవరి డబ్బు వారి దగ్గరే ఉంచుకుంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తగిన చర్యలు అవసరం. ♦ ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడిని నిరోధించడానికి, 2018–19లో ఐదేళ్ల కనిష్టస్థాయి 6.8 శాతానికి పడిపోయిన వృద్ధిని పెంపొందించడానికి 2019–2020 బడ్జెట్లో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. త్వరలో అవి ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తున్నా. ♦ మందగమనంలోకి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా జారిపోవడానికి ఫైనాన్షియల్ రంగం కూడా ఒక కారణం. 2009–2014లో విచక్షణా రహితంగా రుణాలు జారీ చేయడంతో తొలుత ఫైనాన్షియల్ రంగంలో సమస్యలు ప్రారంభమైనాయి. తరువాతి కాలంలో ఈ రుణాల్లో అధిక భాగం మొండిబకాయిలు (ఎన్పీఏ)గా మారాయి. ఎన్పీఏల పెరుగుదలతో బ్యాంకులు తాజా రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెల కొంది. బ్యాంకింగ్యేతర ఆర్థిక కంపెనీలూ ద్రవ్య లభ్యత సమస్యల్లో పడ్డాయి. ♦ వస్తు, సేవలకు సంబంధించి ప్రైవేటు రంగానికి ప్రభుత్వ, ప్రభుత్వ శాఖల నుంచి చెల్లింపులల్లో ఆలశ్యం కూడా మందగమన పరిస్థితులు నెలకొనడానికి ఒక కారణమై ఉండచ్చు. అయితే చెల్లింపుల ప్రక్రియ వేగవంతానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్యాకేజీలతో ఆర్థిక వ్యవస్థకు చేటు: సుబ్రమణియన్ మందగమనంతో తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న వివిధ రంగాలు.. ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతుండటంపై ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ స్పందించారు. ఇలాంటి ప్యాకేజీలు ప్రకటించడం ‘నైతికంగా హాని’ చేస్తాయని, మార్కెట్ ఎకానమీకి ఇవి శాపంగా పరిణమిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘1991 నుంచి మనది మార్కెట్ ఎకానమీగా మారింది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థల్లో కొన్ని రంగాలు వృద్ధి దశలో ఉంటే.. కొన్ని క్షీణ దశలో ఉంటాయి. కొంత క్షీణ దశ ఎదురైన ప్రతిసారీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ప్రజాధనాన్ని వెచ్చించాలని ఆశిస్తే సరికాదు. ఇలాంటి వాటి వల్ల నైతికంగా హాని జరుగుతుంది. లాభాలు వస్తే నావి, నష్టాలు వస్తే మాత్రం అందరూ భరించాలనే ధోరణికి దారి తీస్తుంది. మార్కెట్ ఎకానమీ పనితీరుకు ఇలాంటివి శాపంగా పరిణమిస్తాయి‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుబ్రమణియన్ పేర్కొన్నారు. మరోవైపు, విద్యుత్ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చి మార్కెట్ నుంచి నిధులను ఖాళీ చేయడం కన్నా.. వడ్డీ రేట్లను తగ్గించి, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యతను పెంచడమనేవి సరైన విధానాలనే ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్థిక కార్యకలాపాలపై సార్వత్రిక ఎన్నికల ప్రబావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గణాంకాలు కొంత తక్కువ స్థాయిలో నమోదు కావొచ్చని చెప్పారు. -
‘పీపీపీ’ ఇంకా బలపడాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి భారీ మెజారిటీని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఎజెండా నిర్దేశించింది. ఆయా అంశాలపై రాజీవ్ కుమార్ మీడియాతో పంచుకున్న అంశాలను క్లుప్తంగా చూస్తే... పెట్టుబడిదారు విశ్వాసం పెరగాలి వృద్ధి వేగం పుంజుకోవాలి. ముఖ్యంగా వచ్చే మూడు దశాబ్దాల కాలంలో వృద్ధి రేటు రెండంకెల్లో స్థిరపడాలి. ఇందుకు సంబంధించి గడచిన ఐదేళ్ల కాలంలో పటిష్ట పునాదులే పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, పాలనా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ సేవల విస్తృతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్న తీవ్ర ఆందోళన ఇప్పుడు లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ వంటి అంశాలు వ్యవస్థలో సానుకూల మార్పులకే దోహదపడ్డాయి. ఇదే ఒరవడి కొనసాగాలి. ఇది జరగాలంటే పలు అంశాల పట్ల ప్రైవేటు పెట్టుబడిదారు విశ్వాసం మరింత మెరుగుపడాలి. వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇన్వెస్టర్లో ఏర్పడాలి. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వృద్ధి బాగుంది... స్పీడ్ పెరగాలి... గడచిన ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడింది. స్థిరత్వాన్ని సాధించింది. వరుసగా ఐదు సంవత్సరాలు సగటున 7% వృద్ధి రేటును సాధించిన కాలాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. అదే సమయంలో ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో కేవలం 3 శాతంగా కొనసాగింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం పట్ల నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు పూర్తి నియంత్రణలో ఉంది. ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి ప్రతి అంశమూ అదుపులోనే ఉంది. దేశం వృద్ధి స్పీడ్ మున్ముందు మరింత పెరగడానికి ఈ అంశాలు అన్నీ దోహదపడతాయి. ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇకపై ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి. ప్రతి ఒక్కదానినీ ప్రభుత్వం ఒక్కటే చేయలేదన్న విషయం ఇక్కడ గుర్తెరగాలి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పటిష్ట పునరుద్ధరణ జరగాలి. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాలి. ఉదాహరణకు భూ సేకరణ విషయంలో ప్రైవేటు రంగానికి కొంత ఇబ్బందులు ఎదురవవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఈక్విటీ హోల్డర్‌గా ఈ వెంచర్లో ఉంటే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో మనం చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలో కూడా విశ్వసనీయత ప్రాతిపదికన ప్రభుత్వ–ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి. ఎగుమతులు పెరగాలి ఎగుమతుల విషయంలోనూ గణనీయమైన మార్పులు రావాలి. ఎగుమతుల ఆధారిత విదేశీ పెట్టుబడులు అవసరం. ఎగుమతుల పెరుగుదలకు ఈ తరహా చర్యలు దోహదపడతాయి. వృద్ధికి దోహదపడతాయి. పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట పరోక్ష పన్నుల విషయానికి వస్తే, జీఎస్టీ వసూళ్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో బాగున్నాయి. భవిష్యత్తులోనూ మరింత పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లూ బాగున్నాయి.మౌలికరంగం అభివృద్ధి, పెట్టుబడులు, ద్రవ్యలోటు కట్టడి వంటి విషయాల్లో మరిన్ని నిధులు కేంద్రానికి అవసరం. పెట్టుబడుల ఉపసంహరణ ఇందులో కీలకమైనది. 40 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ ప్రతిపాదనలు చేసింది. దీనికి క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ దిశలో తదుపరి చర్యలు అవసరం. ఎయిర్ ఇండియా వంటి రంగాల్లో మెజారిటీ వాటాల అమ్మకాన్నీ ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. త్వరలో విధానపరమైన చర్యలు ఉంటాయి. వ్యవసాయంలో సాంకేతికత ఇక వ్యవసాయ రంగం విషయంలో తీవ్ర ప్రతికూలత ఉందని భావించకూడదు. అదే నిజమైతే ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఇక తృణ ధాన్యాలు, వరి, గోధుమలకు సంబంధించి వినియోగంకన్నా ఉత్పత్తి అధికమైంది. అందువల్ల మనకు మిగులు ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉన్నందువల్ల ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో వికేంద్రీకరణ జరగాలి. వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయం పెరగాలి. ఆగ్రో పాసెసింగ్ ఇందులో ఒకటి. ఆగ్రో ప్రాసెసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడులు మరింత పెరగాలి. మన ఆహార ఉత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోంది. ఇక వ్యవసాయ రంగంలో సాంకేతికత మరింత పెరగాలి. ఆయా అంశాల ద్వారా వ్యవసాయ రంగంలో వ్యయాలు తగ్గుదల, ఎగుమతులు పెంపు, రైతు ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించవచ్చు. -
నామినేషన్ వేయబోతే జైలుకు పంపారు!
పుర్ణియా: మద్యం సేవించి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని పోలీసులు కటకటాలవెనక్కు నెట్టిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పుర్ణియా స్థానం నుంచి రాజీవ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. పూటుగా మద్యం సేవించి మంగళవారం నామినేషన్ వేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో రాజీవ్ ప్రవర్తనపై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా, ఆయన పూటుగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో మద్య నిషేధ చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. బిహార్‌లో ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది. కాగా, పుర్ణియా లోక్‌సభ స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 11 మంది చివరిరోజున నామినేషన్ వేయడం గమనార్హం. -
ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ
షిల్లాంగ్: శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫంట్ కేసుల్లో కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌కుమార్, టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్‌లను సీబీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా విచారించారు. తొలుత వీరిని వేర్వేరు గదుల్లో విచారించిన అధికారులు, ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై విచారణకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆయన యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శారదా కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు ఇద్దరు సీబీఐ అధికారుల బృందం రాజీవ్‌కుమార్, కునాల్ ఘోష్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీడియో రికార్డింగ్‌కు సీబీఐ నో.. ఈ విషయమై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్‌ను రెండో రోజు విచారించామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి ముగిసిందన్నారు. తన విచారణను వీడియో తీయాలన్న రాజీవ్‌కుమార్ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించిందని వెల్లడించారు. కస్టోడియల్ విచారణ సందర్భంగా మాత్రమే వీడియో రికార్డింగ్ చేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకూ రాజీవ్ కుమార్, ఘోష్‌ను వేర్వేరు గదుల్లో విచారించామనీ, ఆతర్వాత మాత్రం ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ సాగించామని పేర్కొన్నారు. మరోవైపు షిల్లాంగ్‌లోని సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కునాల్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కునాల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్లు చేయదల్చుకోలేదు. మొదటినుంచి నేను సీబీఐ అధికారులకు సహకరిస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరయ్యా’ అని తెలిపారు. శారదా కుంభకోణానికి సంబంధించి 2013లో కునాల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొద్దికాలానికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. -
కోల్‌కతా పోలీస్ బాస్‌ను విచారించిన సీబీఐ
షిల్లాంగ్: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం విచారణ జరిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన విచారణ 9 గంటలపాటు కొనసాగింది. మధ్యలో విరామం సమయంలో బయటకు వచ్చిన ఆయన టీఎంసీ నేత, లాయర్ విశ్వజిత్ దేవ్, సీనియర్ ఐపీస్ అధికారులు జావెద్ షమీమ్, మురళీధర్ వర్మలతో మాట్లాడారు. శారదా చిట్‌ఫండ్ స్కాంకు చెందిన కీలక పత్రాల అదృశ్యంపై ఆదివారం రాజీవ్‌ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా ఆదివారం విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. చిట్‌ఫండ్ కుంభకోణంపై మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐపీఎస్ అధికారి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు బాధ్యతలను చేపట్టిన సీబీఐ..కుంభకోణంలోని కీలక ఆధారాలు కనిపించకుండాపోయినట్లు గుర్తించింది. వాటిపై విచారణకు సీబీఐ యత్నించగా కుమార్ సహకరించలేదు. గత వారం కుమార్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతా బెనర్జీ ఆందోళనకు దిగడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తటస్థప్రాంతమైన షిల్లాంగ్‌లో సీబీఐ అధికారులు రాజీవ్‌కుమార్ నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కోల్‌కతా పోలీస్ బాస్ అదృశ్యం
న్యూఢిల్లీ: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కనిపించకుండా పోయారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రోజ్ వ్యాలీ, శ్రద్ధా పోంజి భారీ కుంభకోణాలపై దర్యాప్తునకు గతంలో రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆ కుంభకోణాలకు సంబంధించిన పలు కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. వాటి కోసం పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదు. రాజీవ్ సెల్ఫోన్సహా ఏ ఇతర నంబర్ పనిచేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అరెస్టు చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. -
‘పీఎం–కిసాన్’ లబ్ధిదారుల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు. చిక్కులు తప్పవు: నిపుణులు పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు. -
బ్యాంకులకు మూలధనం జోష్!!
న్యూఢిల్లీ: మొండిబాకీలు, నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం మరింత మూలధనం సమకూర్చనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న దానికి అదనంగా రూ.41,000 కోట్లు ఇవ్వనుంది. దీంతో పీఎస్బీలకు ఈ ఏడాది మొత్తం మీద రూ.1.06 లక్షల కోట్లు ఇచ్చినట్లవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఈ విషయాలు తెలియజేశారు. వాస్తవానికి 2018–19లో పీఎస్బీలకు రూ. 65,000 కోట్లు అదనపు మూలధనం ఇవ్వాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో ఇప్పటిదాకా రూ. 23,000 కోట్లు సమకూర్చగా మరో రూ.42,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, అదనంగా ఇవ్వబోయే రూ.41,000 కోట్లు కూడా దీనికి కలిపితే కొత్తగా రూ. 83,000 కోట్లు సమకూర్చినట్లవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో ఈ మొత్తాన్ని పీఎస్బీలకు అందించనున్నట్లు జైట్లీ చెప్పారు. పీఎస్‌బీల రుణ వితరణ సామర్థ్యం మెరుగుపడేందుకు, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బయటకు వచ్చేందుకు రీక్యాపిటలైజేషన్ తోడ్పడగలదని పేర్కొన్నారు. రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ద్వారా రూ.41,000 కోట్లు బ్యాంకులకు సమకూర్చే ప్రతిపాదనకు సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కింద పార్లమెంటు ఆమోదం కోరినట్లు జైట్లీ వివరించారు. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికకు ఇది అదనమని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులను గుర్తించే ప్రక్రియ పూర్తయిందని, మొండిబాకీలు క్రమంగా తగ్గుతున్నాయని అరుణ్ జైట్లీ వివరించారు. ‘ఇకపై ఇవ్వబోయే రూ.83,000 కోట్లతో పాటు మొత్తం రూ.1.06 లక్షల కోట్లను నాలుగు వేర్వేరు అంశాలుగా వినియోగించడం జరుగుతుంది. ముందుగా, నియంత్రణ నిబంధనలకు తగ్గ స్థాయిలో బ్యాంకులకు మూలధనం అందేలా చూస్తాం. కాస్త మెరుగుపడిన బ్యాంకులు సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో నుంచి బైటపడేందుకు కావాల్సిన స్థాయిలో అదనంగా నిధులు అందించడం రెండో అంశం. పీసీఏ అంచుల్లో ఉన్న బ్యాంకులు.. ఆ పరిధిలోకి వెళ్లకుండా అవసరమైన మూలధనాన్ని ముందుగానే సమకూర్చడమనేది మూడో అంశం. విలీనమయ్యే బ్యాంకులకు తగినంత స్థాయిలో మూలధనాన్ని అందించడం నాలుగో అంశం’ అని జైట్లీ పేర్కొన్నారు. మూడు బ్యాంకులు సేఫ్.. ప్రస్తుతం మూడు బ్యాంకులు పీసీఏ అంచున ఉన్నాయని, తాజాగా అదనపు మూలధనం లభిస్తే అవి గట్టెక్కుతాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మొత్తం 21 పీఎస్బీల్లో 11 బ్యాంకులు పీసీఏ చర్యలు ఎదుర్కొంటున్నాయి. మొండిబాకీలు పేరుకుపోయి పీసీఏ పరిధిలోకి చేరిన పీఎస్‌బీల కార్యకలాపాలపై ఆంక్షలు వర్తిస్తాయి. అయితే, దేశీయంగా ఇందుకు సంబంధించిన నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆయా బ్యాంకులు పూర్తి స్థాయిలో కఠినతర నియంత్రణ నిబంధనలు అందుకోగలవని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అదనపు మూలధనం అందుకోబోయే బ్యాంకుల్లో.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్‌లకు నిధుల అవసరం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఎస్‌బీలు రూ. 60,726 కోట్ల మొండిబాకీలు వసూలు చేసుకోగలిగాయని, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది రెట్టింపని కుమార్ చెప్పారు. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండేళ్ల వ్యవధిలో పీఎస్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని 2017 అక్టోబర్‌లో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన కింద బడ్జెటరీ కేటాయింపుల ద్వారా రూ. 18,139 కోట్లు, రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రూ. 1.35 లక్షల కోట్లు సమకూరుస్తోంది. ప్రభుత్వ వాటాలను విక్రయించడం ద్వారా బ్యాంకులు మరో రూ. 58,000 కోట్లు మార్కెట్ల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది. బాసెల్ త్రీ నిబంధనలను చేరేందుకు పీఎస్‌బీలు 2019 మార్చి నాటికి రూ. 58,000 కోట్లు మార్కెట్ల నుంచి సమకూర్చుకోగలవని కేంద్రం ముందుగా భావించింది. అయితే మార్కెట్లు అస్తవ్యస్తంగా మారడంతో బ్యాంకులు ఇప్పటిదాకా ఈ మార్గం ద్వారా రూ. 24,400 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగాయి. పైపెచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో బ్యాంకుల మొండిబాకీలు భారీగా ఎగిశాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు ముందుగా నిర్దేశించుకున్న దానికన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మూలధనం సమకూర్చేందుకు ప్రభుత్వమే సిద్ధమైంది. రూ. 85,948.86 కోట్ల అదనపు వ్యయాలకు ఆమోదం కోరుతూ సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2018–19 రెండో విడత ప్రతిపాదనలను కేంద్రం గురువారం పార్లమెంటు ముందుంచింది. ఇందులో సగభాగం పీఎస్బీలకు అదనపు మూలధనం కింద పోనుంది. నగదు రూపంలో వ్యయాలు నికరంగా రూ. 15,065.49 కోట్లు ఉండనున్నాయి. ఎయిరిండియాకు రూ. 2,345 కోట్లు.. ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం మరిన్ని నిధులు అందించనుంది. ఎయిరిండియాకు ఈక్విటీ రూపంలో రూ. 2,345 కోట్లు, ఎయిరిండియా అసెట్ హోల్డింగ్‌కు మరో రూ. 1,300 కోట్లు సమకూర్చనుంది. ప్రస్తుతం ఎయిరిండియా రుణభారం దాదాపు రూ. 55,000 కోట్ల మేర ఉంది. -
అవినీతి అంతం కోసమే.. నోట్ల రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి కోసం కాదని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) హెల్త్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘సుబ్రమణియన్ నివేదిక చదివాను. అందులో ఆర్థిక వికాసానికి నోట్ల రద్దు వ్యతిరేకంగా ఉందని రాశారు. అయితే సుబ్రమణియన్ ఈ పదాన్ని ఎందుకు వాడారో నాకు తెలియదు. ఇది కేవలం అవినీతిపరులకు, అక్రమంగా నగదు దాచుకున్నవారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య మాత్రమేఆర్థిక వికాసం గురించి తెలిసినవారు నిజాయతీపరులై ఉంటారు, చట్టానికి కట్టుబడి ఉంటా’రని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దు దారుణమని, ఇది ఆర్ధిక వృద్ధికి పెనుప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన అరవింద్...నోట్లరద్దు తదనంతర పరిణామాలపై ఆరు నెలలు అధ్యయనం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోయిందన్నారు. గతంలో ఇది ఎనిమిది శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
కార్డుల భద్రతపైనే దృష్టి
సాక్షి, అమరావతి : పెద్ద నోట్ల రద్దు తర్వాత డెబిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు 10 శాతంపైగా పెరిగినట్లు అంతర్జాతీయ పేమెంట్, టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డు చెపుతోంది. ఇప్పటీకి 95 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతుండటంతో ఇండియాకి మరిన్ని పేమెంట్ సొల్యూషన్స్ సంస్థల అవసరం ఉందని మాస్టర్ కార్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో... తాము తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇండియాలో డిజిటల్ లావాదేవీలు తదితర అంశాలను ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు... పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డు లావాదేవీలు పెరిగినట్లే పెరిగి, మళ్లీ నగదు లావాదేవీలు యథాస్థానానికి వచ్చాయని పలు సర్వేలు చెపుతున్నాయి? ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరగటం నిజం. అప్పటి వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి కొనసాగుతోంది. గతంలో డెబిట్ కార్డులను 95 శాతం ఏటీఎంల నుంచి నగదును తీసుకోవడానికే వాడేవారు. 5 శాతమే పాయింట్ ఆఫ్ సేల్ (పాస్) మెషీన్ల వద్ద స్వైప్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్‌డ్రాయల్స్ 85 శాతం లోపే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో పాస్ మెషీన్లు పెరిగాయి. అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థల ప్రవేశంతో డిజిటల్ లావాదేవీలూ పెరిగాయి. అంతెందుకు! అందరం కలిసి 40 ఏళ్లలో 15 లక్షల పాస్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తే కేవలం ఈ రెండేళ్లలో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికిది 50 లక్షలు దాటొచ్చు. ప్రభుత్వం రూపే కార్డును ప్రోత్సహిస్తుండటం, గూగుల్ పే, పేటీఎం వంటి సంస్థల ప్రవేశంతో మాస్టర్ కార్డుకు పోటీ పెరిగిందా? ప్రభుత్వం రూపే, భీమ్ యాప్, భారత్ క్యూఆర్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇవే కాక మరిన్ని పేమెంట్ సొల్యూషన్ సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. ఇవేమీ మాస్టర్‌కార్డుకు పోటీ కానే కాదు. ఇప్పటికీ దేశంలో 95 శాతం నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ లావాదేవీల విలువ 200 బిలియన్ డాలర్ల లోపే. ఇది వచ్చే ఐదేళ్ల లో ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థకు భూతం లాంటి నగదు లావాదేవీలను తరిమికొట్టడానికి మరింత మంది రావాలి. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగం గా రూపే కార్డుతో సబ్సిడీలివ్వటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది చాలామంచి పరిణామం. మాస్టర్ కార్డు అనేది ఇంటర్నేషనల్ కార్డు. ఈ కార్డు ను ప్రపంచంలో మూడు దేశాలు (ఇరాన్, నార్త్‌కొరియా, సిరియా) తప్ప అన్ని దేశాల్లో వాడొచ్చు. ఏ కార్డునైనా బ్యాంకులు జారీ చేసే అవకాశం ఉంది కనక మాకు ఇబ్బందేమీ లేదు. ఇప్పటికీ దేశీయ డెబిట్ కార్డు విభాగంలో మాది అగ్రస్థానమే. డిజిటల్ లావాదేవీలకు ఫీజులు ఇబ్బందికరమే కదా? దీన్ని గుర్తించే ప్రభుత్వం రూ.2,000 లోపు డెబిట్‌కార్డు లావాదేవీలపై ఫీజులను రద్దు చేసింది. రూ.2,000 లోపు లావాదేవీలపై మర్చెంట్ ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. మొత్తం కార్డు లావాదేవీల్లో 85 శాతం రూ.2,000 లోపు ఉండటంతో చాలామందికి ఉపయోగకరంగా ఉంది. చిన్న లావాదేవీలపై మేం కూడా 99 శాతం చార్జీలను తగ్గించాము. మరి డిజిటల్ మోసాల సంగతో..? కార్డు భద్రత చాలా ప్రధానం. గత నాలుగేళ్లలో మేం ఇందుకోసం రూ.6,800 కోట్లు ఖర్చు చేశాం. గతంలో స్వైపింగ్ కార్డు స్థానంలో చిప్ కార్డులు తేగా... ఇపుడు అంతకంటే సెక్యూరిటీతో కూడిన వైఫై (కాంటాక్ట్ లెస్) కార్డులను ప్రవేశపెట్టాం. చిప్, కాంటాక్ట్ లెస్ కార్డుల్లో టోకెనైజేషన్ టెక్నాలజీ వాడటం వల్ల మీ 16 నెంబర్ల కార్డు నెంబరు అల్గోరిథమ్‌లో 50–60 నెంబర్లుగా మారిపోతుంది. ఈ కార్డుల వివరాలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరు. వైఫై కార్డుల్లో రూ.2,000 లోపు లావాదేవీలను మూడుసార్లు వరకు ఎలాంటి పిన్ లేకుండా వాడవచ్చు. అంతకంటే ఎక్కువైతే రూ.2,000లోపు లావాదేవీ అయినా సరే పిన్ నెంబర్‌ను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డును ఎవరు దొంగిలించినా అధిక లావాదేవీలు నిర్వహించడానికి వీలుండదు. ఇకపై అన్నీ వైఫై కార్డులనే జారీ చేస్తాం. పాస్ మెషీన్లు కూడా కాన్టాక్ట్లెస్ టెక్నాలజీతోనే విడుదల చేస్తున్నాం. వాలెట్, జేబుల్లో ఉన్న కార్డుల డేటాను కూడా హ్యాక్ చేయొచ్చునంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. నిజమా? బస్సులో, షాపింగ్ మాల్స్‌లో వాలెట్ లేదా జేబును టచ్ చేయడం ద్వారా మీ కార్డులోని డేటాను మొత్తం తెలుసుకోవచ్చునంటూ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో వాస్తవం లేదు. కేవలం వాలెట్‌ను టచ్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోలేరు. దీనిపై అవగాహన కల్పించే వీడియోను రూపొ ందిస్తున్నాం. త్వరలోనే విడు దల చేస్తాం. ఇక ఏటీఎం మెషీన్లు స్కిమ్మింగ్ చేసి కొత్త కార్డులను తయారు చేయడమనేది ఆయా ఏటీఎంలు నిర్వహిస్తున్న బ్యాంకులు తీసుకునే పటిష్టమైన చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఇండియా కార్యకలాపాల్లో వృద్ధి ఎలా ఉంది? ఇక్కడ డిజిటల్ బ్యాంకింగ్‌లో అపార అవకాశాలున్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 90 శాతం లావాదేవీలు డిజిటల్లో జరుగుతుంటే ఇక్కడ 5 శాతం కూడా లేవు. అందుకే ఇండియాను ప్రధానమైన మార్కెట్‌గా చూస్తున్నాం. ఇక్కడ 2013లో 29 మందిగా ఉన్న ఉద్యోగులు ఇపుడు 2వేలు దా టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 15 శా తం మంది ఇక్కడే ఉన్నారు. ఆదాయంలో చూస్తే మూడు శాతం ఇక్కడ నుంచి వస్తోంది. కాబట్టి రా నున్న కాలంలో మరింతగా పెట్టుబడులు పెడతాం. -
పెట్రోల్ ధరలు : నీతి ఆయోగ్ నిర్లక్ష్య వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నాయి. గ్లోబల్‌గా క్రూడాయిల్ ధరలు పెరగడంతో, పెట్రో మంట వినియోగదారులకు వాత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ సెగ ఇప్పుడు అన్ని వాటిపై చూపుతుంది. స్కూల్ వ్యాన్ ఫీజులు పెరిగిపోయాయి. అటు స్టాక్ మార్కెట్లకు దీని సెగ తగిలి, కుప్పకూలుతున్నాయి. రూపాయి అయితే ఏకంగా పాతాళంలోకి పడిపోయింది. అయితే ఇంత మేర ప్రభావం చూపుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు. రోజూ, వారం మారే ఆయిల్ ధరలపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఆయిల్ ధరలు రోజువారీగా, వారంవారీగా, పిరియాడిక్గా మారుతూనే ఉంటాయని, కమోడిటీ ధరలను గమనించాలని, కానీ వీటిపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదని అన్నారు. ‘జూన్‌లో ధరలు పెరిగాయి. జూలైలో తగ్గిపోయాయి. అవునా కాదా? ఇదే పరిస్థితి మరోసారి జరుగుతుంది’ అంటూ కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పన్నులు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.79.31గా రికార్డు స్థాయిలో నమోదైంది. డీజిల్ కూడా ఆల్-టైమ్ గరిష్టంలో రూ.71.34గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు వాత పెడుతున్న, ప్రభుత్వం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదనడం గమనార్హం. -
వాణిజ్యలోటు ఆందోళనకరం..!
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడం కన్నా అంతకంతకూ పెరిగిపోతున్న వాణిజ్య లోటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎగుమతులు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని రంగాలకు రూపాయి పతనం లబ్ధి చేకూర్చేదే అయినప్పటికీ, కొంతకాలం వాటిని పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. ‘రూపాయి మారకం విలువ బలంగా ఉండాలని నేను అనుకోను. అది వాస్తవ పరిస్థితికి తగ్గట్లుగా ఉండాలి. కొన్ని దేశాలు కావాలనే తమ కరెన్సీ విలువను తగ్గించేసుకుంటూ ఉంటాయి. ఇది చాలా తప్పు. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయిని పటిష్టపర్చడమనేది భారత్‌కు చాలా కష్టతరమైన అంశం‘ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో మన ఎగుమతుల వాటా చాలా తక్కువగా ఉంటుంది. సేవల రంగంలో కూడా చైనా కన్నా మన వాటా తక్కువే ఉంటోంది. దీన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది‘ అని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 16న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్టమైన 70.32 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది జూలైలో దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు అయిదేళ్ల గరిష్ట స్థాయి 18.02 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ప్రభుత్వ వ్యయాలతో డిమాండ్‌కు ఊతం.. ప్రైవేట్ పెట్టుబడులు కనిష్టస్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో డిమాండ్‌ను మెరుగుపర్చడానికి ప్రభుత్వ వ్యయాలను పెంచడానికే దోహదపడుతోందని రాజీవ్ కుమార్ తెలిపారు. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా పెరగకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన చెప్పారు. అటు, భారత్ 9–10 శాతం స్థాయిలో వృద్ధి రేటును సాధించడం మొదలైన తర్వాత నుంచి వాణిజ్య ఒప్పందాలు మనకు అనుకూలంగా ఉండేలా బేరమాడేందుకు పటిష్టమైన స్థితిలో ఉండగలదని ఆయన తెలిపారు. ఉద్యోగాల కల్పన లేని వృద్ధి అంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
విదేశాలకు ఎగిరి పోకుండా ఆంక్షలు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని, విదేశాలకు వెళ్తున్న ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోంది. ఇక మీదట ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా కఠిన వైఖరి అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం పైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ పలు సూచనలను కేంద్రం ముందు ఉంచింది. వాటిలో ఒకటి దేశీయ పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 10లో సవరణ. ఈ చట్టం పాస్‌పోర్ట్‌ల రద్దుకు సంబంధించింది. అంతేకాక రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకునే వారి పాస్‌పోర్టు వివరాలను కూడా తప్పనిసరిగా బ్యాంక్‌లు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ వీరు ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవాలనుకుంటే, ఎయిర్‌పోర్టుల వద్దనే వారికి చెక్ పెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్బీఐ ప్రతినిధులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పీఎన్బీలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీతో పాటు, విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకునేందుకు, వారు అసలు భారత్‌కు రావడం లేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్పీఏ అకౌంట్లు ఏమేమీ ఉన్నాయో విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదేశించింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే రూ.100 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులను జప్తు చేయడానికి కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ఎగవేతదారులు పారిపోకుండా అడ్డుకట్ట ఎలా?
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ బడా రుణ ఎగవేతదారులు, ప్రమోటర్లు దేశం వదిలి పారిపోకుండా నిరోధించడం ఎలా అన్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో సవరణలు, సూచనలు ఇవ్వడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వం వహిస్తారు. దేశీయ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల విషయంలో భారత్ కాకుండా ఏ ఇతర దేశంలో పౌరసత్వం ఉంది? ఆ కంపెనీ రుణాల పరిస్థితి ఏమిటి? చెల్లింపులు ఎలా ఉన్నాయి? లాభనష్టాల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్ని అంశాలపై ముందే దృష్టి సారించాలని పలువురు భావిస్తున్నారు. తద్వారా విజయ్ మాల్యా, మెహుల్ చోక్సి, నీరవ్‌మోదీ తరహా వ్యక్తుల ఉదంతాల పరిస్థితిని నివారించవచ్చన్నది వీరి అభిప్రాయం. ఇదే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. ఈ కమిటీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ప్రతినిధులు కూడా ఉంటారు. అలాగే హోమ్, విదేశీ వ్యవహారాల శాఖల అధికారులూ సభ్యులుగా ఉంటారు. -
తలసరి ఆదాయంలో వెనుకే ఉన్నాం!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఊహించినదేనని, తలసరి ఆదాయ పరంగా ఇప్పటికీ మనం తక్కువ స్థాయిలోనే ఉన్నామని, ఈ విషయంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. అంతర్జాతీయంగా భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో జోక్యం చేసుకునే విధంగా ఉండాలని కుమార్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే మన దేశం బ్రిటన్ను అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ‘‘చాలా ఎక్కువగా అంచనా వేసిందే. అధిక వృద్ధి రేటు ఫలితమే ఇది. త్వరలోనే బ్రిటన్ను అధిగమిస్తాం. 2018లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఐదో స్థానానికి చేరుకుంటాం. కానీ, మన తలసరి ఆదాయం ఫ్రాన్స్‌తో పోలిస్తే 20 రెట్లు తక్కువ. కనుక మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు’’ అని రాజీవ్ కుమార్ అన్నారు. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్ పాత్ర అంతర్జాతీయ వేదికపై మరింత ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తగిన విధంగా సన్నద్ధమై, జాతి ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా అర్థవంతమైన పాత్ర పోషించాలన్నారు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన గణాంకాల ఆధారంగా 2017లో మన దేశం 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఆరో స్థానికి చేరుకున్న విషయం గమనార్హం. -
బ్యాంకులిక గట్టెక్కినట్లే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గడ్డుకాలం దాటిపోయినట్లేనని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. మొండిబాకీల ప్రక్షాళన నేపథ్యంలో మరో ఒకటి రెండు త్రైమాసికాలు కొంత నష్టాలు నమోదైనా ఫర్వాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోని ఏ బ్యాంకూ దివాలా తీసే పరిస్థితి ఉండబోదని, వాటికి అవసరమైన స్థాయిలో కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ స్పష్టం చేశారు. ‘బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనలో భాగంగా మొండిబాకీలను పారదర్శక రీతిలో గుర్తించడం జరుగుతోంది. ఈ క్రమంలో బ్యాంకులు అధిక కేటాయింపులు జరపాల్సి వచ్చినా.. ఒకటి రెండు త్రైమాసికాల్లో నష్టాలు నమోదు చేసినా ఫర్వాలేదు. ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం. బ్యాంకులకు ఇక కష్టకాలం దాటిపోయినట్లే. ఇక నుంచి అంతా సానుకూలంగానే ఉండగలదు‘ అని ఆయన చెప్పారు. మొండిబాకీల భారంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాకీల ఎగవేత సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని కుమార్ చెప్పారు. బ్యాంకులను గట్టెక్కించేందుకు ప్రతిపాదించిన రూ. 2.11 లక్షల కోట్లలో ఇంకా రూ. 65,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ప్రభుత్వం ఏ బ్యాంకునూ దివాలా తియ్యనివ్వదని ఆయన చెప్పారు. పీఎస్‌బీలు అమలు చేసే సంస్కరణల ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వనున్నామని కుమార్ వివరించారు. మరోవైపు, పలు పీఎస్బీల్లో సీఈవో, ఎండీల స్థానాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ జాబితాలో ఆంధ్రా బ్యాంక్ సహా దేనా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఈ–కామర్స్ సంస్థలతో ఆర్థిక శాఖ భాగస్వామ్యం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ–కామర్స్ సంస్థలతో జతకట్టింది. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలను అందించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓలా, ఉబెర్ సహా 24కుపైగా సంస్థలతో చేతులు కలిపామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. చిన్న వ్యాపార రుణాలను అందించడమే ఈ త్రిముఖ (రుణదాత, పరిశ్రమ, ప్రభుత్వం) భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణాలను అందించాలనే లక్ష్యంతో పీఎంఎంవై పథకాన్ని ఆవిష్కరించింది. బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను జారీచేస్తాయి. ‘ఓలా, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, డబ్బావాలాలు, కేబుల్ ఆపరేటర్లు, జొమోటొ వంటి పలు కంపెనీలున్నాయి. ఇవి చిన్న వ్యాపార భాగస్వాములను కలిగి ఉంటాయి. వీరికి రుణ సదుపాయం అవసరముంటుంది. ముద్రా స్కీమ్ కింద వీరికి సాయం చేయాలని భావిస్తున్నాం’ అని రాజీవ్ కుమార్ తెలిపారు. -
పీఎన్బీ కేసులో కేంద్రం కొరడా..
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసం కేసులో కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి అలహాబాద్ బ్యాంక్ సీఈవో ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు పీఎన్బీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు దిశగా ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లకి ఉన్న ఆర్థికపరమైన, ఎగ్జిక్యూటివ్‌పరమైన అధికారాలకు పీఎన్బీ బోర్డు కత్తెర వేసింది. ఇదే తరహాలో పీఎన్బీ మాజీ చీఫ్ కూడా అయిన ఉషా అనంత సుబ్రమణియన్ అధికారాలను కూడా తొలగించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అలహాబాద్ బ్యాంకు బోర్డుకు ప్రభుత్వం సూచించినట్లు కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయా బ్యాంకుల బోర్డుల నుంచి డైరెక్టర్ల తొలగింపునకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందని, ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వివరించారు. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ సూచనల ప్రకారం సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించిన పీఎన్బీ బోర్డు.. ఇద్దరు ఈడీలకు ఉన్న అధికారాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉషా అనంతసుబ్రమణియన్ విషయంలో ఒకట్రెండు రోజుల్లో అలహాబాద్ బ్యాంకు బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.13,000 కోట్ల పీఎన్బీ స్కామ్‌కు సంబంధించి సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసిన గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ చర్యలు ప్రకటించడం గమనార్హం. అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత సీఈవో, ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్.. 2015 నుంచి 2017 దాకా పీఎన్బీ చీఫ్‌గా వ్యవహరించారు. పది రోజుల క్రితం షోకాజ్ నోటీసులు.. పీఎన్బీ కుంభకోణం కేసుకు సంబంధించి ఇటీవలే ఉషను ప్రశ్నించిన సీబీఐ.. సదరు వివరాలను చార్జిషీటులో పొందుపర్చింది. కేంద్ర ఆర్థిక శాఖ వీరందరికీ పది రోజుల క్రితం షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2016లో ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఆర్థిక సంస్థల మధ్య లావాదేవీలకు ఉపయోగించే స్విఫ్ట్, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయాల్సి ఉందని, అది జరగకపోవడం వల్లే ప్రస్తుత కుంభకోణం చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)ల ద్వారా ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ సంస్థలు .. ఈ కుంభకోణానికి పాల్పడ్డాయి. ‘వ్యవస్థకు రిస్కును తగ్గించేలా చూడటం సీనియర్ మేనేజ్మెంట్ బాధ్యత. ఇప్పటికే ఆయా బ్యాంకుల టాప్ మేనేజ్మెంట్ నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చాం. తొలగింపునకు సంబంధించి చర్యలు కూడా చేపట్టాం. కేవలం వదంతుల ఆధారంగా కాకుండా పక్కా ఆధారాలతోనే చర్యలు తీసుకుంటాం’ అని రాజీవ్ కుమార్ చెప్పారు. సీబీఐ తొలి చార్జిషీటులో 22 మంది నీరవ్ మోదీ, చోక్సీ సహా పలువురు బ్యాంక్ అధికారులు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో సీబీఐ సోమవారం చార్జిషీటు దాఖలు చేసింది. స్కామ్ సూత్రధారి, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ, అలహాబాద్ బ్యాంక్ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు మొత్తం 22 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ముంబైలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ ఈ చార్జిషీటు దాఖలు చేసింది. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణంలో పీఎన్బీ మాజీ చీఫ్, అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ పాత్ర గురించిన వివరాలను పొందుపర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసు విషయంలో సీబీఐ ఇటీవలే ఆమెను ప్రశ్నించింది. మరోవైపు, పీఎన్బీ ఈడీలు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్, జనరల్ మేనేజర్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) నేహల్ అహద్, నీరవ్ మోదీ సోదరుడు నిషాల్ మోదీ పేర్లు చార్జిషీటులో ఉన్నాయి. అయితే, మోదీ భార్య అమీ, ఆయన మేనమామ..వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీ పేర్లు మాత్రం లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్ కేసు దర్యాప్తునకు సంబంధించి దాఖలు చేసే అనుబంధ చార్జిషీట్లలో ఆయన పాత్ర వివరాలు రావొచ్చని వివరించాయి. మోదీ సంస్థలైన డైమండ్స్ ఆర్ అజ్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్.. బ్యాంకు వర్గాలతో కుమ్మక్కై రూ. 6,498 కోట్ల విలువ చేసే లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (ఎల్వోయూ)ను మోసపూరితంగా పొందాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. తొలి ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ ఈ చార్జిషీటు దాఖలు చేసింది. సప్లిమెంటరీ చార్జిషీట్లలో షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంకులు, విదేశాల్లోని భారత బ్యాంకు శాఖల ఉద్యోగుల పాత్ర మొదలైన విషయాలు కూడా ఉంటాయి. క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఈ చార్జిషీటులో ఉన్నాయి. 2011–17 మధ్య కాలంలో పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ సంస్థలు .. మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ) పొందాయి. వీటి ఆధారంగా విదేశాల్లోని బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుని వాడుకున్నాయి. ఇది బైటపడేటప్పటికే మోదీ, చోక్సీ దేశం విడిచి వెళ్లిపోయారు. సీబీఐ చార్జిషీటులో అభియోగాలివీ.. ♦ పీఎన్బీ సిబ్బంది ఎలాంటి నగదు మార్జిన్లు, పరిమితులు లేకుండా మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా మోసబుద్ధితో ఎల్వోయూలు జారీ చేశారు. వాటి ఆధారంగా విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మోదీ సంస్థలు దారిమళ్లించాయి. ♦ ఇలాంటి మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్స్‌ను అప్పటి పీఎన్బీ ఎండీ ఉషాతో పాటు ఇతర సీనియర్ అధికారులు పట్టించుకోలేదు. స్విఫ్ట్, సీబీఎస్‌లను అనుసంధానం చేయాలంటూ ఆర్బీఐ పదే పదే సర్క్యులర్లు, నోటీసులు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. బ్యాంకులో అంతా సవ్యంగానే ఉందని నివేదికలిస్తూ ఆర్బీఐని తప్పుదోవ పట్టించారు. ♦ బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లోని గోకుల్‌నాథ్ శెట్టి ఏడేళ్లు డిప్యూటీ మేనేజర్ హోదాలోనే కొనసాగారు. ఎలాంటి జంకూ లేకుండా మోసపూరిత ఎల్వోయూల జారీ కొనసాగించారు. ♦ చార్జిషీటులో ఉష పేరు ఉన్నంత మాత్రాన ఆమెకు ముందు ఆ హోదాల్లో పనిచేసిన వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదు. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
రెండవ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి 7.5 శాతం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త వైస్ ఛైర్మన్ గా ఆర్థిక వేత్త రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్లరద్దును సమర్ధించారు. ముఖ్యంగా 99శాతం మాత్రమే రద్దయిననోట్లు తిరిగి వచ్చాయన్న ఆర్బీఐ ప్రకటన. క్షీణించిన జీడీపీ వృద్ధి నేపథ్యంలో వెల్లువెత్తిన విమర్శలపై ఆయన మాట్లాడారు.సె కండ్ క్వార్టర్ నాటికి జీడీపీ వృద్ధి 7-7.5నమోదు చేస్తుందని రాజీవ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంచి వర్షపాతం, జీఎస్టీ పై క్లారిటీనేపథ్యంలో2017-28 నాటి జూలై- సెప్టెంబర్ రెండవ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అరవింద్ పనాగరియా స్థానంలో శుక్రవారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల ఈ పదవినుంచి వైదొలగిన పనగరియా ఉద్యోగ సృష్టి ఒక పెద్ద సవాలు అని ఒప్పుకోగా, ఉద్యోగ సృష్టి ప్రాముఖ్యతను కొత్త ఉపాధ్యక్షుడు నొక్కి చెప్పడం విశేషం. ప్రస్తుతం నీతి ఆయోగ్ ప్రధాన దృష్టి ఉద్యోగాల కల్పనే అని స్పష్టం చేశారు. కాగా పనాగరియా మాదిరిగానే రాజీవ్‌కుమార్ మోడినోమిక్స్ పట్ల ఆరాధ్యుడు. మోదీ గుజరాత్ మోడల్‌ను ప్రశంసిస్తూ అనేక పుస్తకాలు, కథనాలు వెలువరించారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ ఫెలోగా, ఆర్ధిక ఆలోచనా ట్యాంక్ ఐసీఆర్ఐఈఆర్ సీఈవోగా, ఫిక్కీ సీఐఐ లలో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. మరోవైపు ప్రధాని మోదీ భక్తుడిగా ఆర్థిక వృద్దిపైనే రాజీవ్ కుమార్ దృష్టి ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు. నీతి ఆయోగ్ పై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ విమర్శలు, జీఎం పంటలపై కి స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర విమర్శలు, పేద వ్యతిరేక, రైతుల వ్యతిరేకం,నిరుద్యోగాన్ని పెంచుతోందంటూ నీతి ఆయోగ్‌పై భారతీయ మజ్దూర్ సంఘ్ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన, ఆర్థికవృద్ధి ఆయన ముందున్న పెద్ద సవాళ్లని భావిస్తున్నారు. -
ఆర్థిక సేవల కార్యదర్శిగా రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సేవల కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌కుమార్ ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) కార్యదర్శిగా అంజిలీ చిప్ దుగ్గల్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ కుమార్ కు పరిపాలనా విభాగంలో 30 ఏళ్ళ కుపైగా అనుభవం ఉంది. ముఖ్యంగా తన సొంత రాష్ట్రం జార్ఖండ్ పరిపాలనా విభాగంలో కీలకబాధ్యతలు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు, పర్సనల్ పబ్లిక్ గ్రీవ్వెన్సెస్ అండ్ పెన్షన్ మంత్రిత్వశాఖ, స్పెషల్ సెక్రటరీ, ఎస్టాబ్లిష్ మెంట్ అధికారిగా ఉన్నారు. సిబ్బంది, శిక్షణ శాఖ. అతను కేంద్ర ప్రభుత్వంలో వివిధ సామర్థ్యాలలో పనిచేశారు. మార్చి 19, 2012 - మార్చ్ 12, 2015 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిత్వశాఖలోని వ్యయాల విభాగానికి జాయింట్ సెక్రటరీగా, అనంతరం అడిషనల్ సెక్రటరీ గా తన సేవలందించారు.