న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సేవల కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌కుమార్ ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) కార్యదర్శిగా అంజిలీ చిప్ దుగ్గల్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ కుమార్ కు పరిపాలనా విభాగంలో 30 ఏళ్ళ కుపైగా అనుభవం ఉంది. ముఖ్యంగా తన సొంత రాష్ట్రం జార్ఖండ్ పరిపాలనా విభాగంలో కీలకబాధ‍్యతలు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు, పర్సనల్ పబ్లిక్ గ్రీవ్వెన్సెస్ అండ్ పెన్షన్ మంత్రిత్వశాఖ, స్పెషల్ సెక్రటరీ, ఎస్టాబ్లిష్ మెంట్ అధికారిగా ఉన్నారు. సిబ్బంది, శిక్షణ శాఖ. అతను కేంద్ర ప్రభుత్వంలో వివిధ సామర్థ్యాలలో పనిచేశారు. మార్చి 19, 2012 - మార్చ్ 12, 2015 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిత్వశాఖలోని వ్యయాల విభాగానికి జాయింట్ సెక్రటరీగా, అనంతరం అడిషనల్ సెక్రటరీ గా తన సేవలందించారు.