రెండవ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి 7.5 శాతం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త వైస్ ఛైర్మన్ గా ఆర్థిక వేత్త రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్లరద్దును సమర్ధించారు. ముఖ్యంగా 99శాతం మాత్రమే రద్దయిననోట్లు తిరిగి వచ్చాయన్న ఆర్‌బీఐ ప్రకటన. క్షీణించిన జీడీపీ వృద్ధి నేపథ్యంలో వెల్లువెత్తిన విమర్శలపై ఆయన మాట్లాడారు.సె కండ్ క్వార్టర్ నాటికి జీడీపీ వృద్ధి 7-7.5నమోదు చేస్తుందని రాజీవ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంచి వర్షపాతం, జీఎస్‌టీ పై క్లారిటీనేపథ్యంలో2017-28 నాటి జూలై- సెప్టెంబర్ రెండవ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక‍్తం చేశారు.
అరవింద్ పనాగరియా స్థానంలో శుక్రవారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల ఈ పదవినుంచి వైదొలగిన పనగరియా ఉద్యోగ సృష్టి ఒక పెద్ద సవాలు అని ఒప్పుకోగా, ఉద్యోగ సృష్టి ప్రాముఖ్యతను కొత్త ఉపాధ్యక్షుడు నొక్కి చెప్పడం విశేషం. ప్రస్తుతం నీతి ఆయోగ్ ప్రధాన దృష్టి ఉద్యోగాల కల‍్పనే అని స్పష్టం చేశారు.
కాగా పనాగరియా మాదిరిగానే రాజీవ్‌కుమార్ మోడినోమిక్స్ పట్ల ఆరాధ్యుడు. మోదీ గుజరాత్ మోడల్‌ను ప్రశంసిస్తూ అనేక పుస్తకాలు, కథనాలు వెలువరించారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ ఫెలోగా, ఆర్ధిక ఆలోచనా ట్యాంక్ ఐసీఆర్‌ఐఈఆర్ సీఈవోగా, ఫిక్కీ సీఐఐ లలో ఉన్నత స్థానాల్లో పనిచేశారు.
మరోవైపు ప్రధాని మోదీ భక్తుడిగా ఆర్థిక వృద్దిపైనే రాజీవ్ కుమార్ దృష్టి ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు. నీతి ఆయోగ్ పై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్ విమర్శలు, జీఎం పంటలపై కి స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర విమర్శలు, పేద వ్యతిరేక, రైతుల వ్యతిరేకం,నిరుద్యోగాన్ని పెంచుతోందంటూ నీతి ఆయోగ్‌పై భారతీయ మజ్దూర్ సంఘ్ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన, ఆర్థికవృద్ధి ఆయన ముందున్న పెద్ద సవాళ్లని భావిస్తున్నారు.