vice chairman
-
తిట్టుకుని.. కొట్టుకుని
ఇల్లెందు: ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్.. సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దూషణలు, పరస్పర దాడులకు దారితీసింది. మూడు నెలల విరామం తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. పట్టణంలో రోడ్లపై వెలసిన దుకా ణాలు, తోపుడు బండ్లను తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందంటూ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆక్రమణలు తొలగిస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడం లేదు కదా.. దీనికి కొత్తగా ఫీజు రూపంలో రూ.2లక్షలు ఎందుకంటూ వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పరస్పరం అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చైర్మన్ వెంకటేశ్వరరావు.. వైస్ చైర్మన్ జానీపాషాపైకి దూసుకొచ్చినట్టు కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి ఘర్షణ జరగడంతో వైస్ చైర్మన్‌పై చైర్మన్ చేయి చేసుకున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎదురుగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ వాసులకు సేవలందించాల్సిన పాలకవర్గ సభ్యులు ఇలా ఘర్షణ పడడం తగదని హితవు పలికారు. ఈ విషయంలో ఇద్దరిదీ తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమావేశంలో నిలదీస్తే ఇలా దాడులు చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారులను ప్రశ్నిస్తుండగా చైర్మన్ జోక్యం చేసుకుని దాడికి దిగారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ వెంకటేశ్వరరావు వివరణ కోరగా.. తనను పలుమార్లు వ్యక్తిగతంగా దూషించినా సహించానని స్పష్టం చేశారు. -
Jayanthi Chauhan: బాధ్యతను సవాల్‌గా తీసుకుంది
మహిళలు ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. అంతకన్నా సమర్థతంగా తమ సత్తా ఏంటో నిరూపించగలరు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ తండ్రి అమ్మాలనుకున్న కంపెనీ బాధ్యతలను చేపట్టి కార్పొరేట్ దిగ్గజాలకు దీటుగా ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మహిళ జయంతి చౌహాన్. ఎవరీమే..? అనేవారికి ఆమె ప్రతిభే ఆమెను పరిచయం చేస్తుంది. రెండేళ్ల క్రితం వరకు జయంతి చౌహాన్ తనకు నచ్చిన రంగమైన ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ఓ అంతర్జాతీయ కంపెనీని విజయవంతంగా నడిపిస్తూ ఉండేది. ఆమె తండ్రి భారతీయ బహుళజాతి కంపెనీ అయిన బిస్లరీకి రమేష్ చౌహాన్ చైర్మన్. కూతురిని మొదట ఈ వ్యాపార రంగంలోకి రమ్మని అడిగాడు. కానీ, వ్యాపార రంగంలో ఆసక్తి లేక ఆమె నిరాకరించింది. రమేష్ చౌహాన్ వయసు పై బడుతుండటం, ఎవరి మద్దతూ లేక΄ోవడంతో కంపెనీని అమ్మాలని పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల యజమానులతో చర్చలు జరిపారు. 2022లో చేసిన చర్చలు సఫలం అయ్యాయి. కానీ, డీల్ అమలు కాలేదు. ఆ సమయంలో జయంతి చౌహాన్ తన తండ్రి కంపెనీకి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చింది. బిస్లరీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో పెద్ద మార్పు కనిపించింది.ఫ్యాషన్ ఐకాన్ఢిల్లీ, ముంబయ్ నగరాలలో జయంతి బాల్యం గడిచింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగం అంటే ఉన్న ఇష్టంతో ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టైలింగ్‌లో పట్టా ΄÷ందింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలింగ్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తనదైన స్టైల్ మార్క్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు ΄÷ందింది. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్‌లో బిఏ కూడా చేసింది.కొత్త పానీయాల పరిచయంబిస్లరీ కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్‌ను చూపింది. వాటర్ కంపెనీ నుంచి కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు సంస్థకు మరింత లాభదాయకంగా మారాయి. డిజిటల్, సోషల్ మీడియా ΄్లాట్ఫారమ్ల ద్వారా ప్రచారం కూడా ఉత్పత్తి వృద్ధిని పెంచింది. శీతల పానీయాల పరిశ్రమలోని దిగ్గజ కంపెనీలకు బిస్లరీ ప్రవేశం ఓ సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు భావించేంతగా కృషి జరిగింది. దీంతో టాటా గ్రూప్‌తో డీల్ కుదిరి, మినరల్ వాటర్ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఇతర కార్పోరేట్ కంపెనీలతో జయంతి చౌహాన్‌కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ ΄ోటీపడుతోంది. జయంతి తన 42 ఏళ్ల వయసులో వైస్ చైర్పర్సన్ హోదాతో కంపెనీని దిగ్విజయంగా నడిపిస్తోంది. సేల్స్, మార్కెటింగ్ బృందానికి కూడా నాయకత్వం వహిస్తోంది. వ్యాపార రంగంలో తన నైపుణ్యాలను చూపలేనేమో అని సందేహించి తొలుత వెనకడుగు వేసినా, తండ్రి మీద ప్రేమతో తీసుకున్న బాధ్యతను మరింత దిగ్విజయంగా నడిపిస్తూ కార్పోరేట్ దిగ్గజాలకే ఔరా అనిపిస్తోంది. ‘సమస్య మనదే, సవాల్ కూడా మనదే’ అని నవ్వుతూ సమాధానమిచ్చే జయంతి లాంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. -
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వేమిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు. నలుగురు మహిళలు సహా మొత్తం 8 మంది సభ్యులతో కూడిన వైస్ చైర్మన్ల ప్యానెల్‌ను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పునరి్నయామకం చేశారు. ప్యానెల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రమీలాబెన్ బేచర్ భాయ్ బారా, సీమా ద్వివేది, డాక్టర్ అమీ యాజి్ఞక్, మౌసమ్ నూర్, కనకమేడల రవీంద్ర కుమార్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, లెఫ్టినెంట్ జనరల్ డీపీ వత్స్ (రిటైర్డ్) ఉన్నారు. చైర్మన్ ధన్‌ఖడ్ గైర్హాజరైన సందర్భాల్లో వీరు సభను నిర్వహిస్తారు. -
పీటీఐ చైర్మన్‌గా శాంత్ కుమార్
న్యూఢిల్లీ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్(మైసూర్)కు చెందిన కేఎన్ శాంత్ కుమార్(62) ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా హిందుస్తాన్ టైమ్స్ సీఈవో ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారు. అవీక్ సర్కార్ స్థానంలో శాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు. శుక్రవారం ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీటీఐ బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. శాంత్ కుమార్ 1983 నుంచి ది ప్రింటర్స్ (మైసూర్) ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
ఏఐపై చర్చల్లో భారత్‌కు సాధికారత
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు సంబంధించిన అంశాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు .. ప్రస్తుతం జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కి ’సముచిత స్థాయి’ ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ బ్రాడ్ స్మిత్ వ్యాఖ్యానించారు. బీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన స్మిత్.. ఈ మేరకు ఒక బ్లాగ్ రాశారు. ఏఐ నియంత్రణ విషయంలో భారత్ సారథ్యం వహించగలదని, ఉదాహరణగా నిలవగలదని పలు దేశాలు ఎదురుచూస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏఐని అంతర్జాతీయంగా బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా వ్యవహరించడం ద్వారా గరిష్టంగా ప్రయోజనాలు పొందవచ్చని స్మిత్ తెలిపారు. భారత్ దృష్టి కోణం నుంచి పాలసీపరంగా తీసుకోతగిన కొన్ని చర్యలను ఆయన సూచించారు. కొత్త టెక్నాలజీల రాక వల్ల సమాజంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐని సమర్ధంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పనులను వేగవంతంగా, సులువుగా, మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడటంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు కొత్త పరిష్కారాలను కనుగొనేందుకు కూడా ఏఐ సహాయపడగలదని స్మిత్ చెప్పారు. -
కారుణ్య బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్ భారత్ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి. 2023–24 కేంద్ర బడ్జెట్ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్ కాల్ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్ మ్యాప్‌ని అందించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్ అనే ఈ డాక్యుమెంట్ 2047లో భారత్ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్ 100 (వందేళ్ల భారత్) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్ చర్య లను ప్రతిపాదించింది. సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ (పీఎమ్–వికాస్) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్ ఆక్సిలేటర్ ఫండ్ కల్పన, ‘దేఖో అప్నా దేశ్ ఇనిషి యేటివ్’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా, అమృత్ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్’ గుండా మార్కెటింగ్ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం. అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్ ఎకానమీ వంటి క్రాస్ కటింగ్ థీమ్‌లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్ మ్యాప్‌లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం. అదేవిధంగా ‘పంచామృత్’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా నూతన ప్లాంట్లను నెలకొల్పే గోవర్ధన్ స్కీమ్ (10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్లో నొక్కి చెప్పడమైనది. సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్ సపోర్ట్ మిషన్ ద్వారా నీతి ఆయోగ్ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది వేస్తాయి. సుమన్ బెరీ వ్యాసకర్త నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, పీటీ ఉష నియమితులయ్యారు. రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, పిటీ ఉషను ఎంపీలు అభినందించారు. తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. చదవండి: Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో.. -
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నియమించారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్ చైర్మన్ ప్యానల్లో అవకాశం కల్పించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ('నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు') -
భారత్‌ను శ్రీలంకతో పోల్చడం హాస్యాస్పదం!!
న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో భారత ఆర్థిక పరిస్థితులను పోల్చి చూడటం హాస్యాస్పదమేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. అయితే, శ్రీలంక సంక్షోభం నుంచి నేర్చుతగిన పాఠాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 1991లో దేశీయంగా చెల్లింపుల సంక్షోభం తలెత్తినప్పట్నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ స్థూల ఆర్థిక పరిస్థితులు కట్టుతప్పకుండా, దేశాన్ని సంరక్షిస్తున్నాయని పనగారియా చెప్పారు. మరోవైపు, భారత్ ప్రధాన సమస్య నిరుద్యోగం కాదని .. ఉత్పాదకత, జీతాల స్థాయి తక్కువగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు మెరుగైన జీతాలు లభించే ఉద్యోగాలను సృష్టించే దిశగా కృషి చేయల్సిన అవసరం ఉందన్నారు. 2017–18లో 6.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు .. కోవిడ్‌పరంగా కష్టకాలం అయినప్పటికీ 2020–21లో 4.2 శాతానికి దిగి వచ్చిందని పనగారియా చెప్పారు. 2017–18లో నిరుద్యోగిత రేటుపై ఆందోళనలు చేసిన వారంతా తాజా గణాంకాల తర్వాత మౌనం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ విషయాలపై భారత అధికారిక డేటాపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తుండటంపై స్పందిస్తూ .. దేశ జీడీపీ, కీలక గణాంకాల సేకరణ అంతా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే జరుగుతోందని పనగరియా స్పష్టం చేశారు. సహేతుకమైన కొన్ని విమర్శలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలను తప్పక ఖండించాలని ఆయన స్పష్టం చేశారు. -
రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్లో విజయసాయిరెడ్డికి చోటు
ఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్ నూతన ప్యానల్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది. తాజాగా రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునర్మించారు. దీనిలో భాగంగా విజయసాయిరెడ్డికి ప్యానల్లో చోటు లభించింది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్లో విజయసాయిరెడ్డితో పాటు భువనేశ్వర్ కలిత, ఇందు బాలగోస్వామి, హనుమంతయ్య, తిరుచి శివ, డాక్టర్ సస్మిత్ పాత్రలకు సభ్యులుగా చోటు దక్కింది. Rajya Sabha Chairman & Vice-President M Venkaiah Naidu reconstituted the panel of Vice Chairmen Rajya Sabha MPs Bhubaneswar Kalita, Indu Bala Goswami, Dr L Hanumanthaiah, Tiruchi Siva, V Vijayasai Reddy and Dr Sasmit Patra are now members of the panel of Vice Chairmen — ANI (@ANI) July 17, 2022 -
‘ధర్మవరం’ వైస్ చైర్మన్ పదవులకు 14న ఎన్నిక
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మునిసిపాలిటీలోని రెండు వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని, కౌన్సిలర్లకు ఈ నెల 10లోగా నోటీసులు జారీ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. -
‘కే’ తరహా అభివృద్ధి మంచిది కాదు..ఎందుకంటే ?
ముంబై: దేశానికి ‘సమ సమాజ’ వృద్ధి చాలా అవసరమని, అసమానతలు పెంచే వృద్ధి రేటు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. వృద్ధి ఫలాలు సమాజంలో కొందరికే లభించి, మెజారిటీ వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమయ్యే ధోరణియే ‘కే’ (K) తరహా వృద్ధి మనకు వద్దన్నారు. గతంలో తరహాలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ‘కే’ (K) తరహా వృద్ధిని అనుమతించబోదని అన్నారు. బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... - భారతదేశంలో పెరుగుతున్న అసమానతలు మన సమాజంలో ఉద్రిక్తతలు, సమస్యలను సృష్టిస్తుంది. వాటిని మనం భరించలేము. మన వృద్ధిని మరింత విస్తృతపరిచి అందరికీ ఫలాలు లభించేలా సమానమైనదిగా చేయడానికి మనం ఇప్పుడు మార్గాలను కనుగొనాలి. - సమానమైన వృద్ధి అనేది ప్రజలను శక్తివంతం చేస్తుంది. వారు రాణించడానికి సరైన అవకాశాన్ని కల్పిస్తుంది. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22)ఆర్థిక వ్యవస్థ 9.2 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 8.5 లేదా 8.7 శాతం, 2023–24 ఆర్థిక సంవత్సరం 7.5 శాతం వృద్ధిని భారత్ నమోదుచేసే అవకాశం ఉంది. తద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. - అయితే మన యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ స్థాయి వృద్ధి రేట్లు సరిపోతాయా అన్నది మనం సంధించుకోవాల్సిన ప్రశ్న. అందుకు ఈ స్థాయి వృద్ధి రేటు సరిపోదన్నది సుస్పష్టం. భారీ వృద్ధి దిశలో ఉన్న అడ్డంకులను మనం తక్షణం తొలగించాల్సి ఉంది. ఇది అంత తేలికకాదు. అయితే అసాధ్యమే కాదు. - రాబోయే రెండు లేదా మూడు దశాబ్దాల పాటు మనం స్థిరమైన, వేగవంతమైన, రెండంకెల వృద్ధిని సాధించాలి. ఈ స్థాయి వృద్ధి రేటు వల్ల యువత సామర్థ్యం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉండదు. - కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనడానికి రెండంకెల స్థాయి వృద్ధి రేటు సాధన దోహదపడుతుంది. అయితే, దేశం సాధించాలనుకునే అభివృద్ధి పర్యావరణాన్ని పణంగా పెట్టకూడదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మన వృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతర్జాతీయ నియమ నిబంధనలు, ప్రమాణాలను పరిరక్షించడానికి కూడా ఇది ఎంతో అవసరం. - ఇక దేశంలో ప్రైవేటు రంగం పెట్టుబడులు ఎంతో కీలకం. ప్రైవేటు రంగ పెట్టుబడులు భవిష్యత్తులో దేశంలో వృద్ధికి చోదకశక్తిని అందిస్తాయి. -
2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు. వచ్చే ఐదేళ్లూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్ తెలిపారు. -
విషాదం: జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. జిల్లా పరిషత్‌లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా గుర్తింపు పొందారు. అంబటి అనిల్.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు. అనిల్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అనిల్ సొంతూరు సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్పీ వైస్ చైర్మన్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనిల్ మృతిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..! -
పటిష్టంగా ఎకానమీ పునాదులు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వాస్తవ జీడీపీ గణాంకాలు.. కరోనా పూర్వ స్థాయిని అధిగమించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కోవిడ్–19 మహమ్మారి సమస్యను సాధ్యమైన వేగంగా, నిర్మయాత్మకంగా దేశం అధిగమించాలని పనగారియా పేర్కొన్నారు. దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికే పుంజుకున్నాయని ఆయన వివరించారు. మరోవైపు, సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఉపశమన ప్యాకేజీల (క్యూఈ) వల్లే భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. భారత్‌లోకి పెట్టుబడులకు క్యూఈతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు. ‘క్యూఈ అనేది సంపన్న దేశాల నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులు మరలడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నిధులన్నీ ఇతర వర్ధమాన మార్కెట్లలోకి కాకుండా మొత్తం భారత్‌లోకే వస్తాయన్న హామీ లేదు. అత్యధికంగా రాబడులు వస్తాయన్న భరోసా కారణంగానే ఇన్వెస్టర్లు భారత్‌ను ఎంచుకుంటున్నారు‘ అని పనగారియా చెప్పారు. సంపన్న దేశాలు క్రమంగా ప్యాకేజీలను ఉపసంహరించే కొద్దీ పెట్టుబడుల్లో కొంత మొత్తం వెనక్కి వెళ్లడం సాధారణమేనన్నారు. అయితే, ఆయా సంపన్న దేశాల్లో వచ్చే రాబడులకన్నా ఎంత అధికంగా అందించగలదన్న అంశంపైనే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని పనగారియా చెప్పారు. హేతుబద్ధంగానే స్టాక్ మార్కెట్ల తీరు .. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేనట్లుగా ఆర్థిక వృద్ధి మందగించిన తరుణంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిపోతుండటం అసాధారణమేమీ కాకపోవచ్చని పనగారియా చెప్పారు. భవిష్యత్ రాబడుల అంచనాలపైనే స్టాక్ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో షేర్ల రేట్ల విషయంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు హేతుబద్ధంగానే వ్యవహరిస్తున్నారని భావించవచ్చన్నారు. -
ఏపీ: జెడ్పీల్లోనూ ‘సామాజిక’ రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శనివారం జరిగిన జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. 13 జిల్లాల జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. రాజకీయాల్లో సామాజిక విప్లవం సృష్టిస్తున్న ఆ పార్టీ మరోసారి జెడ్పీ పదవుల్లోనూ రెపరెపలాడించింది. ఇక ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఒకే పార్టీ చేజిక్కించుకోవడం దేశంలో ఇదే తొలిసారి. ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ 630 జెడ్పీటీసీ స్థానాల్లో చారిత్రక విజయం సాధిం చింది. విపక్ష పార్టీలైన టీడీపీ కేవలం ఆరు, జనసేన రెండు, సీపీఎం 1, ఇతరులు ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి. కో–ఆప్షన్ సభ్యుల పదవులకూ శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులోనూ అన్ని పదవులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదీ సామాజిక న్యాయమంటే.. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్/చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. అలాగే.. ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. ►కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేస్తే.. ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. ►ఇలా జనరల్, జనరల్ (మహిళ) విభాగాలకు ప్రభుత్వం రిజర్వు చేసిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక ఢంకా మోగించారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. ►మరోవైపు.. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరింటిలో ఓసీలకు అవకాశం కల్పించారు. ►అంతేకాక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏడుగురికి.. వైస్ చైర్పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్దపీట వేశారు. ►ఇక రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయిస్తే.. 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. ‘జనరల్’లో బీసీలకు అవకాశం ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు రిజర్వు చేస్తే.. బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. -
Andhra Pradesh: జెడ్పీ వైస్ ఛైర్మన్లు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైఎస్సార్సీపీనే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తికాగా, వారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారిగా జెడ్పీ వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన వారు.... తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి ( విశాఖ), బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత (తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ ( పశ్చిమ గోదావరి), గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ), బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ, సుజ్ఞానమ్మ (ప్రకాశం), శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు), కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న ( అనంతపురం), దిల్షాద్ నాయక్, కురువ బొజ్జమ్మ ( కర్నూలు), సిరిపురపు జగన్మోహన్రావు, పాలిన శ్రావణి ( శ్రీకాకుళం), జేష్టాది శారద, పిట్టు బాలయ్య (వైఎస్సార్), అంబటి అనిల్‌కుమార్, బాపూజీ నాయుడు(విజయనగరం). చదవండి: AP ZPTC Chairman Election: 13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లగా ఎంపికైన వారు -
ఆటోవాలా.. నేడు నిడదవోలు వైస్ చైర్మన్‌గా
నిడదవోలు: ఆయన ఆటో డ్రైవర్.. ఇప్పుడు నిడదవోలు పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ యలగాడ బాలరాజును వైస్ చైర్మన్‌గా ఎంపికచేయడంపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘాల్లో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉండాలనే నూతన ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో నిడదవోలు పట్టణంలో బాలరాజును పదవి వరించింది. యలగాడ వెంకన్న, రాములమ్మ ఆరుగురు సంతానంలో మూడో కుమారుడు బాలరాజు. చిన్నతనం కష్టాలు ఎదుర్కొంటూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. చిన్నతనంలో సైకిల్ మెకానిక్‌గా పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుక్కొని డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆపదలో తోటివారికి సాయం చేస్తూ అందరి మన్ననలు పొందేవారు. 2008 నుంచి 2014 వరకు హరిజన యువజన సేవా సంఘం అధ్యక్షుడిగా.. 2015లో మదర్ థెరిస్సా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో తిరిగిన అతను 2014లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసి 350 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి వార్డులో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుండేవారు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూనే మరోపక్క ప్రజాప్రతినిధినిగా తన బాధ్యతల్ని సమర్ధవంతంగా పోషించారు. బాలరాజు పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించి రెండోసారి కౌన్సిలర్ సీటు ఇచ్చారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి 385 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా ఏఎన్ నారాయణమూర్తి
సాక్షి, విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్‌రావు నియామకం ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ సీఎండీగా హరనాథ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వృద్ధి రేటుపై కీలక వ్యాఖ్యలు చేసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్...!
సాక్షి, న్యూ ఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రెండంకెల వృద్ధి రేటును నమోదుచేస్తోందని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ కూగా సాఫీగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా మొదటి, రెండో వేవ్‌లో రాష్ట్రాలు ఎదుర్కొన్న తీరు రాబోయే కాలంలో వచ్చే కోవిడ్-19 వేవ్‌లను దేశం, రాష్ట్రాలు ఎదుర్కొనే స్థితి వస్తోందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కోవిడ్-19 సెకండ్‌వేవ్ నుంచి ఇబ్బందులను అధిగమించామని, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఎకనామిక్ రికవరీ చాలా బలంగా ఉందని తెలిపారు. ఫిచ్ లాంటి పలు రేటింగ్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తగ్గించాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న రికవరీతో అదే సంస్థలు తిరిగి వృద్ధి రేటును సవరించే అవకాశాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 2021 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం కుదించింది. ప్రముఖ రేటింగ్ ఏజన్సీలు ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగా, ఫిచ్ రేటింగ్స్ అంతకుముందు జీడీపీ వృద్ధి రేటు 12.8 శాతం నమోదు చేస్తోందని తెలుపగా తిరిగి వృద్ధిరేటును 10 శాతానికి సవరించింది. ఉక్కు, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కొన్ని రంగాలలో సామర్థ్య విస్తరణలో గణనీయమైన పెట్టుబడులు ఇప్పటికే జరుగుతున్నాయాని పేర్కొన్నారు. కన్యూసమర్ డ్యురాబుల్ సెక్టార్లో కరోనాతో వినియోగదారుల్లో అనిశ్చితి నెలకొలడంతో పెట్టుబడులను పెట్టేందుకు కాస్త సంకోచాలకు గురవౌతున్నారని తెలిపారు. పూర్తిస్తాయి ప్రైవేట్ పెట్టుబడి రికవరీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అదనంగా 23,123 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. దీంతో కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వారి ప్రకటనలు ప్రస్తుతానికి ద్రవ్యోల్బణ అంచనాలను అధిక స్థాయిలో ఉంచలేదని చాలా స్పష్టంగా తెలియజేశాయి. ప్రస్తుతం ఇది తాత్కాలికమైన, ఆర్బిఐ నిర్ధేశించిన ద్రవ్యోల్భణ స్థాయి లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటామని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు, -
మహిళలకే అగ్రతాంబూలం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలను ఏకగ్రీవంగా దక్కించుకున్న టీఆర్ఎస్.. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసింది. రిజర్వేషన్స్థానాల్లోనే గాక రిజర్వేషన్వర్తించని చోట్ల కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 14 పదవుల్లో పదింటిని వారికే ఇచ్చి అగ్రతాంబూలం వేసింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీలకు గత నెల 30న పోలింగ్జరగ్గా.. ఈ నెల 3న ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. వీటిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ పదవులన్నింటినీ టీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. కార్పొరేషన్లలో.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లుగా మహిళలకే టీఆర్ఎస్ప్రాధాన్యం ఇచ్చింది. వరంగల్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు అయినా.. ఇక్కడ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళ, మాజీ ఎంపీ గుండు సుధారాణికి అవకాశం లభించింది. ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వుకాగా.. కమ్మ సామాజికవర్గానికి చెందిన నీరజను అధిష్టానం ఎంపిక చేసింది. రెండు కార్పొరేషన్లలోనూ ఎలాంటి రిజర్వేషన్ వర్తించని డిప్యూటీ మేయర్పదవులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఇచ్చింది. వరంగల్‌లో 36వ డివిజన్ నుంచి ఎన్నికైన రిజ్వానా షమీమ్, ఖమ్మంలో 37వ డివిజన్ నుంచి గెలిచిన షేక్ ఫాతిమా జోహ్రాకు పదవి దక్కింది. మున్సిపాలిటీల్లోనూ మహిళలకే.. సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల్లోనూ టీఆర్ఎస్ మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. జడ్చర్ల మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు రెండూ మహిళలకు దక్కాయి. అచ్చంపేట, నకిరేకల్‌లో వైస్ చైర్పర్సన్ పదవులకు మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు మున్సిపాలిటీల్లో ముగ్గురు చైర్పర్సన్లుగా, ముగ్గురు వైస్ చైర్ పర్సన్లుగా పీఠం అధిష్టించారు. ఎంపికలో ఎమ్మెల్యేలకే స్వేచ్ఛ 63 మంది కార్పొరేటర్లు ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో మేయర్ అభ్యర్థి పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నామినేషన్ల సమయంలోనే ఎంపీ గుండు సుధారాణికి అవకాశమిస్తామని కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆమెను ఎంపిక చేశారు. వరంగల్ మినహా ఖమ్మం, ఐదు మున్సిపాలిటీల్లో పదవుల ఎంపికలో పార్టీ స్థానిక ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వేచ్చనిచ్చారు. పరిశీలకులు సీల్డ్ కవర్లలో పేర్లను తీసుకెళ్లినా ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ఎంపకి జరిగినట్టు జాబితా స్పష్టం చేస్తోంది. మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదన మేరకు.. సిద్దిపేట మున్పిపల్ చైర్మన్‌గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన కడవేర్గు రాజనర్సు భార్య మంజుల తాజాగా చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ బాలరాజు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నకిరేకల్‌లో ఎమ్మెల్యే లింగయ్య, షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రతిపాదించిన వారికే పదవులు దక్కాయి. ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ అజయ్ ప్రతిపాదన మేరకే నీరజకు మేయర్‌గా అవకాశం దక్కినట్టు తెలిసింది. అన్ని జాగ్రత్తల మధ్య ఎన్నిక రెండు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించారు. అన్ని పదవులు టీఆర్ఎస్కు దక్కడం ఖాయమవడంతో పార్టీ పరిశీలకులుగా వెళ్లిన మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలు.. ముందుగానే పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఎన్నిక జరిగే తీరును వివరించడంతోపాటు పార్టీ ఖరారు చేసిన వారినే ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల కోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరిగిన ప్రత్యేక సమావేశాలకు.. కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమే సమావేశ మందిరంలోకి అనుమతించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు అందజేశారు. రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే విజయోత్సవ ర్యాలీలు, పూల దండలు, షాలువాలు, బొకేలపై అధికారులు నిషేధం విధించారు. వీడియో కాల్ 17 మంది ద్వారా ప్రమాణ స్వీకారం ఎన్నికల తర్వాత కోవిడ్ బారినపడిన 17 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీడియా కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలోనూ వారు వీడియో కాల్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఒక్క వరంగల్ కార్పొరేషన్లోనే గెలిచిన 48 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లలో.. కరోనా బారినపడ్డ ఎనిమిది మంది వీడియో కాల్ ద్వారానే ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కార్పొరేషన్/మున్సిపాలిటీ మేయర్/చైర్మన్ డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ వరంగల్ (బీసీ జనరల్) గుండు సుధారాణి రిజ్వానా షమీమ్ ఖమ్మం (జనల్ మహిళ) పొనుకొల్లు నీరజ షేక్ ఫాతిమా జోహ్రా సిద్దిపేట (జనరల్ మహిళ) కడవేర్గు మంజుల జంగిటి కనకరాజు జడ్చర్ల (బీసీ మహిళ) దొరపల్లి లక్ష్మి పాలాది సారిక నకిరేకల్ (బీసీ జనరల్) రాచకొండ శ్రీనివాస్ ఎం.ఉమారాణి అచ్చంపేట (జనరల్) ఎడ్ల నర్సింహగౌడ్ పోరెడ్డి శైలజ కొత్తూరు (జనరల్ మహిళ) బి.లావణ్య డోలి రవీందర్ నంబర్ వన్ చేస్తా.. కార్పొరేటర్ల అందరి సహకారంతో ఖమ్మం కార్పొరేషన్‌ను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తా. ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్లు నన్ను సంప్రదించవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటూ వారి డివిజన్లకు కావాల్సిన పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనిస్తా. – ఖమ్మం మేయర్ నీరజ రాజకీయ పునర్జన్మ.. బీసీ జనరల్ స్థానంలో మహిళనైన నాకు అవకాశమిచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ అభివృద్ధికి పాటుపడతా. కేటీఆర్‌కు వరంగల్‌పై ప్రత్యేక విజన్ ఉంది భవిష్యత్ తరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తా. – వరంగల్ మేయర్ సుధారాణి చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..? వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే.. -
డిప్యూటీ మేయర్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం
తాడేపల్లి: డిప్యూటీ మేయర్లపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది.ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. చదవండి : (మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్) (AP Municipal Elections Results: వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు) -
శాంసంగ్‌కు ఎదురుదెబ్బ : షేర్లు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌కు సియోల్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, లంచం కేసులో సంస్థ వైస్ చైర్మన్ జే వై లీ(52) కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శాంసంగ్ మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్-హే సహచరుడికి లంచం ఇచ్చారన్న ఆరోపణలను విచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పును వెలువరించింది. దాదాపు 7.8 మిలియన్ డాలర్ల విలువైన లంచం, అవినీతి , ఆదాయాన్ని దాచడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు విశ్వసించింది. అయితే దీనిపై ఏడు రోజులలోగా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు.మరోవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిపై ఒకసారి తీర్పు ఇచ్చినందున, తీర్పును సమీక్షించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే లీ ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలాన్ని పరగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు దీంతో శాంసంగ్ షేర్లు 4 శాతం వరకు పడిపోయాయి. అలాగే శాంసంగ్ సీ అండ్ టీ, శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, శాంసంగ్ ఎస్డీఐ లాంటి వంటి అనుబంధ సంస్థల షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. కాగా ఈ కేసులో 2017లో దోషిగా తేలడంతో లీకు ఐదేళ్ల జైలు శిక్షవిధించింది సియోల్ హైకోర్టు అయితే తానెలాంటి నేరానికి పాల్పడలేదని ఈ ఆరోపణలను ఖండించిన లీ శిక్షను తగ్గించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షను ఒక ఏడాదికి తగ్గించడంతో ఫిబ్రవరి 2018 లో విడుదలయ్యాడు. ఆ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసి, 2019 లో తిరిగి విచారణకు ఆదేశిస్తూన సియోల్ హైకోర్టుకు తిరిగి పంపింది. దీంతో తాజా తీర్పు వెలువడింది. కోవిడ్ -19 మహమ్మారి అమెరికా చైనాల సంబంధాలమధ్య అనిశ్చితి నేపథ్యంలో ప్రత్యేక వ్యూహాలతో వ్యాపారంలో దూసుకొస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్ దిగ్గజానికి భారీ షాక్తప్పదని అంచనా. లీ లేకపోతే భారీ పెట్టుబడులు నిలిచిపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తక్కువ వ్యవధిలో ఫలితం ఇచ్చే ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ వ్యవధిలో మంచి ఫలితాలను అందించే మౌలిక రంగం ప్రాజెక్టులపై తదుపరి దఫా ఉద్దీపనా చర్యలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వివిధ ఆర్థిక వ్యవస్థలు అంచనావేసిన తీవ్ర స్థాయిలో (10 నుంచి 15 శాతం వరకూ క్షీణ అంచనాలు) భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణత ఉండదని భావిస్తున్నాను. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) స్వల్ప వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ద్రవ్యపరమైన ప్రత్యక్ష మద్దతు సాధ్యంకాదు. ప్రభుత్వం అందించే పలు ఉద్దీపన చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి సత్వర సాధనకు దోహదపడతాయి. కరోనా కష్టాల్లో ఉన్న పేద ప్రజలను రక్షించడానికి మార్చిలో కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేపీ) పథకాన్ని ప్రకటించింది. తరువాత మేలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించింది. వారం క్రితం మూడవ ప్యాకేజీ ప్రకటించింది. దీనిప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సమయంలో విహార యాత్రలకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. అందుకోసం ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) మొత్తాన్ని నగదుగా చెల్లించాలని నిర్ణయించింది. ఇది కాకుండా కేంద్రం వివిధ రంగాల మీద పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజ్ విలువ దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. మరో దఫా ఉద్దీపన ప్యాకేజ్ సంకేతాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇస్తున్నారు. మౌలిక రంగ ప్రాజెక్టులపై భారీ వ్యయాల ద్వారా వృద్ధికి తోడ్పాటును అందించవచ్చని పలు వర్గాలు కేంద్రానికి సలహాలను ఇస్తున్న నేపథ్యంలో రాజీవ్ కుమార్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి
సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న(56) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత నెల చివరి వారంలో రాజన్నకు కోవిడ్ నిర్ధారణ కావడంతో కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. పది రోజులపాటు వైద్యానికి స్పందించిన ఆయన శరీరం గత రెండు రోజులుగా సహకరించలేదు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా(టి) గ్రామం రాజన్న స్వస్థలం. ఈయన గతంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌రూరల్ జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మృతిపై జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. పలువురు నాయకులు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. సోమవారం చాందా(టి)లో అంత్యక్రియలు నిర్వహించగా.. అదనపు కలెక్టర్ డేవిడ్, జెడ్పీ సీఈవో కిషన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఆదిలాబాద్ ఎంపీపీ సెవ్వ లక్ష్మీ, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, పార్టీ నేతలు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆర్టీసీ కండక్టర్ నుంచి జెడ్పీ వైస్ చైర్మన్ వరకు.. ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన రాజన్న రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిçష్కరించేలా చొరవ చూపేవారని పలువురు పేర్కొన్నారు.