సాక్షి, హైదరాబాద్: మరో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తొలి విడతలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాలో నిజామాబా ద్ జిల్లా కమ్మర్‌పల్లి, వేల్పూరుతో పాటు మెదక్ జిల్లా సంగారెడ్డి మార్కెట్ కమిటీలకు చోటు దక్కింది. ఒక్కో కమిటీలో చైర్మన్, వైస్‌చైర్మన్, మరో 12 మందిని సభ్యులుగా నామినేట్ చేశా రు.
బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు చేసిన కమ్మర్‌పల్లి కమిటీ చైర్మన్‌గా దొనకంటి నర్సయ్య, వైస్ చైర్మన్‌గా గడ్డం స్వామి, ఎస్టీ మహిళ కేటగి రీలో వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా పుట్ట లలిత, వైస్‌చైర్మన్‌గా ఏలేటి రమేశ్, మెదక్ జిల్లా సంగారెడ్డి కమిటీకి ఓసీ జనరల్ కేటగిరీలో చైర్మన్‌గా తేర్పల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌గా ఎంఏ సుభాన్‌ను నియమిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులిచ్చారు.