board of directors
-
కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారీగా రూ.2,10,874 కోట్ల డివిడెండ్‌ను అందించనుంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ కాగా.. బడ్జెట్ అంచనాలకన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3 శాతానికి సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేంద్రానికి ఆర్బీఐ నుంచి అందిన అత్యధిక నిధుల బదలాయింపు విలువ( 2018–19) రూ. 1.76 లక్షల కోట్లు. తాజా నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు..⇢ 2024–25లో ఆర్బీఐ, ప్రభు త్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. అయితే దీనికి రెట్టింపు మొత్తాలు రావడం గమనార్హం. ⇢ తాజా బోర్డ్ సమావేశం దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించింది. వృద్ధి అవుట్‌లుక్‌కు ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించింది. ద్రవ్యలోటు, బాండ్ ఈల్డ్ తగ్గే చాన్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం కేంద్ర ఖజానాకు పెద్ద ఊరటకానుంది. తాజా నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గడానికి దోహదపడే అంశం. కేంద్రంపై రుణ భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా బాండ్ మార్కెట్ విషయంలో కేంద్రానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేశ బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4 శాతం తగ్గి 7 శాతం వద్ద స్థిరపడే వీలుంది.భారీ మిగులుకు కారణం? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపులకు ఒక ప్రధాన కారణం. దేశీయ, అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు, ఫారిన్ ఎక్సే్చంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఎకానమీపై భరోసాతో 6.5 శాతానికి సీఆర్‌బీఐ పెంపు మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను (సీఆర్బీ) ఆర్బీఐ బోర్డ్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.50 శాతానికి పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. సీఆర్‌బీఐ 5.5% – 6.5 % శ్రేణిలో ఉండాలని ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి వంటి పరిణామాల నేపథ్యంలో 2018–19 నుంచి 2021–22 వరకూ 5.50 శాతం సీఆర్బీ నిర్వహణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రానికి అధిక మిగులు నిధులు అందించి ఆర్థిక పురోగతి, ఎకానమీ క్రియాశీలతకు దోహదపడాలన్నది సెంట్రల్ బ్యాంక్ ఉద్దేశం. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022–23లో సీఆర్బీని 6 శాతానికి, తాజాగా 6.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ పెంచింది. -
తాన్లా బోర్డులోకి ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మిని్రస్టేషన్ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్–19 టీకా కార్యక్రమానికి డిజిటల్ వెన్నెముక అయిన కో–విన్ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. -
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 40 శాతం మహిళలే.. స్పెయిన్ కీలక నిర్ణయం
ఒక దేశ పురోగతిని ప్రభావితం చేసే అంశాల్లో లింగ సమానత్వం ముఖ్యమైంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు ఆర్థికంగానే కాకుండా అన్నీ రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. లింగ వివక్ష కనబరుస్తున్న దేశాలు చతికిలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ దేశంలో లింగ సమానత్వంలో మరో అడుగు ముందుకు వేసింది. కంపెనీ బోర్డ్‌లలో మహిళల నియామకంపై కొత్త చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది. స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ వివరాల మేరకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు స్పెయిన్ అధికార పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో మహిళల ప్రాధాన్యతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని సాంచెజ్ తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 7న జరిగే కేబినెట్ మీటింగ్‌లో కంపెనీ బోర్డ్‌లలో 40 శాతం మహిళలు ప్రాతినిథ్యం వహించేలా కొత్త చట్టం అమలు చేసేందుకు కేబినేట్ సమావేశంలోని సభ్యులు ఆమోదం తెలపనున్నారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం.. చట్టం ప్రకారం 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, 50 మిలియన్ యూరోలు ($53 మిలియన్లు) వార్షిక టర్నోవర్ ఉన్న ప్రతి లిస్టెడ్ సంస్థ తప్పనిసరిగా 40 శాతం మహిళలు బోర్డ్ ఆఫ్ డైరక్టర్లగా నియమించాలని స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వం స్త్రీవాదానికి అనుకూలంగా మాత్రమే కాకుండా, మొత్తం స్పానిష్ సమాజానికి ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అన్నారు. -
మస్క్ సంచలనం, పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ బోర్డును మొత్తం రద్దు చేశారు. డైరెక్టర్ల బోర్డును రద్దు తరువాత ప్రస్తుతం మాస్క్ ఏకైక డైరెక్టర్‌గా కొనగుతున్నారు. అక్టోబర్ 31, సోమవారం సెక్యూరిటీ ఫైలింగ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిణామంతోమాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఇకపై డైరెక్టర్లుగా ఉండరని.. ఇది వారికి మరో ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: Bank of Baroda కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు -
ఆనంద్ మహీంద్రాకు బంపరాఫర్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ బోర్డ్‌లో పార్ట్ టైం నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా ఆనంద్ మహీంద్రా, పంకజ్ పటేల్, వేణు శ్రీనివాసన్, ఐఐఎం - అహ్మదాబాద్ ప్రొఫెసర్ రవీంద్ర డొలాకియాలను నిర్మిస్తూ అధికారంగా ప్రకటించింది. జూన్ 14 వ్యాపార వేత్తలతో పాటు, ఫ్రొఫెసర్లను ఉన్నత బాధ్యతలు అప్పగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, జైడూస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్ పంకజ్ పటేల్‌లతో పాటు రిటైర్డ్ ఐఐఎం - ఏ ప్రొఫెసర్లను నాలుగేళ్ల పాటు ఆర్బీఐ ఈ కీలక బాధ్యతల్ని అప్పగించింది. -
ఎన్ఐఐటీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ లిమిటెడ్ కంపెనీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం లభించింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 98.75 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.240 ధరకు రూ.237 కోట్లకు మించకుండా కంపెనీ కొనుగోలు చేయనున్నది. టెండర్ ఆఫర్ మార్గంలో షేర్లను బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని కంపెనీ తెలిపింది. గురువారం బీఎస్ఈలో ఎన్ఐఐటీ లిమిటెడ్ షేర్ రూ.200 వద్ద ముగిసింది. ఇటీవలే టీసీఎస్, విప్రో కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న మొదలై వచ్చే నెల 1న ముగిసే టీసీఎస్ కంపెనీ షేర్ల బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లు, ఇక రూ.9,550 కోట్ల విప్రో కంపెనీ షేర్ల బైబ్యాక్ ఈ నెల 29న మొదలై జనవరి 11న ముగుస్తుంది. -
టీవీఎస్ మోటార్ కంపెనీ రెండో డివిడెండ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.1.40 చొప్పున(140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20లోపు ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నామని పేర్కొంది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ను ప్రకటించింది. -
‛దివాన్’..దివాలా!
ముంబై: తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్ఎఫ్ఎల్)పై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్ఎఫ్సీలు) దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్సీఎల్టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్బీఐకి కట్టబెడుతూ కేంద్ర సర్కారు గత వారమే నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే డీహెచ్ఎఫ్ఎల్ విషయంలో ఆర్బీఐ తన అధికారాల అమలును ఆరంభించింది. దీంతో దివాలా చర్యల పరిష్కారానికి వెళ్లనున్న తొలి ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ డీహెచ్ఎఫ్ఎల్ కానుంది. ‘‘బ్యాంకు రుణాలు, మార్కెట్ రుణాలకు చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ విఫలమైంది. కంపెనీ నిర్వహణ తీరుపై ఇది తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. అందుకే డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును రద్దు చేయడమైంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద డీహెచ్‌ఎఫ్‌కు పరిష్కారం కోసం త్వరలోనే చర్యలను ప్రారంభిస్తాం’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. 2019 జూలై నాటికి బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బోర్డ్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్ హోల్డర్స్‌కు రూ.88,873 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.74,054 కోట్లు సెక్యూర్డ్ కాగా, రూ.9,818 కోట్లు అన్సెక్యూర్డ్ రుణాలు. వీటిలో బ్యాంకులకు చెల్లించాల్సినది రూ. 38,342 కోట్లుగా అంచనా. ఒక్క ఎస్బీఐకే రూ.10,000 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ బకాయి పడింది. చాలా బ్యాంకులు డీహెచ్ఎఫ్ఎల్ రుణ ఆస్తులను నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)గా గుర్తించడంతోపాటు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ఈ పనిని మొదలు పెట్టాయి. ఆల్టికో సైతం.. ఆల్టికో క్యాపిటల్, రెలిగేర్ ఫిన్వెస్ట్లను సైతం దివాలా పరిష్కార చర్యలకు ప్రతిపాదించాలని ఆర్బీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ, దీనిపై ప్రకటనేమీ వెలువడలేదు. ఆల్టికో రుణ భారం 2019 మార్చికి రూ.5,319 కోట్లు. మాష్‌రెక్ బ్యాం కుకు రూ.347 కోట్ల అసలు, రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ చేరొచ్చు: త్యాగి ఐబీసీ కింద పరిష్కారంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ భాగం కావొచ్చని సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి పేర్కొన్నారు. ‘‘ఐబీసీ కింద మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా రుణదాతలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంతకుమించి చెప్పేదేమీ లేదు’’ అని త్యాగి అన్నారు. అందలం నుంచి పాతాళానికి... హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అయిన డీహెచ్ఎఫ్ఎల్ను రాజేష్ కుమార్ వాధ్వాన్ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. దివాన్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గాను, ఆ తర్వాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గాను పేర్లు మార్చుకుంది. దేశీయంగా 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఏకంగా రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీ ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ మళ్లించిందంటూ కోబ్రాపోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. అయితే, జూన్‌లో జరపాల్సిన రుణ చెల్లింపు విషయంలో డిఫాల్ట్ కావడంతో సంస్థపై సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కంపెనీలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. కేంద్రం ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇప్పుడు ఆర్బీఐ కంపెనీని తన గుప్పిట్లోకి తీసుకొని దివాలా ప్రక్రియను ప్రారంభించనుండటంతో డీహెచ్ఎఫ్ఎల్ కథ ముగిసినట్లేనన్నది పరిశీలకుల అభిపారయం. ఎప్పుడేం జరిగిందంటే... ► 2018 సెప్టెంబర్ 21: డీహెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన డెట్ పేపర్లు రూ.300 కోట్ల విలువైన వాటిని సెకండరీ మార్కెట్లో డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ విక్రయించింది. డీహెచ్ఎఫ్ఎల్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న ఆరోపణలు వచ్చాయి. ► 2019 జనవరి 29: డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు వారికి సంబంధించిన షెల్ కంపెనీలకు రుణాలు ఇవ్వగా, ఆ నిధులను దేశీయంగా, విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రమోటర్లు వినియోగించినట్టు ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రాపోస్ట్’ సంచలనాత్మ క కథనాన్ని ప్రచురించింది. యథావిధిగా దీన్ని సైతం కంపెనీ ఖండించింది. ► జనవరి 30: కోబ్రాపోస్ట్ ఆరోపణలు అవాస్తవం, హానికారకమని డీహెచ్ఎఫ్ఎల్ ప్రకటించింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారన్న ఆరోపణలను కొట్టిపడేసింది. ► జనవరి 31: డీహెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన ఆరోపణలపై విచారణ మొదలు పెట్టిన కార్పొరేట్ శాఖ. ► ఫిబ్రవరి 4: కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను విక్రయించడం ద్వారా నిధుల లభ్యతను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ► ఫిబ్రవరి 11: కొన్ని ఖాతాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ. ► ఫిబ్రవరి 13: కంపెనీ సీఈవో హర్షిల్ మెహతా రాజీనామా ► మార్చి 7: డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన డెట్ ఇన్స్ట్రుమెంట్ల రేటింగ్ ను ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేయడంతో షేరు ధర మరింత క్షీణత. ► మే 21: ఫిక్స్డ్ డిపాజిట్ల స్వీకరణ, రెన్యువల్‌ను డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసింది. అప్పటికే ఉన్న డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడాన్ని కూడా నిలిపివేసింది. ► జూన్ 4: రూ.960 కోట్ల మేర బాండ్లపై వడ్డీ చెల్లింపులు, బాండ్ల చెల్లింపుల్లో విఫలమైంది. ► జూన్ 5: ఇక్రా, క్రిసిల్, కేర్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ సంస్థలు డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన కమర్షియల్ పేపర్ల రేటింగ్‌ను డీ (డిఫాల్ట్) రేటింగ్‌కు తగ్గించేశాయి. ► జూన్ 7: 750 కోట్ల కమర్షియల్ పేపర్లకు చెల్లింపుల్లో విఫలం. ► అక్టోబర్ 10: అన్సెక్యూర్డ్ క్రెడిటర్లు, డిపాజిట్ హోల్డర్లకు డీహెచ్ఎఫ్ఎల్ చెల్లింపులు చేయకుండా బాంబే హైకోర్టు ఆదేశాలు. ► నవంబర్ 1: నిధుల దారి మళ్లింపునకు ఆధారాలు ఉండడంతో తీవ్ర నేరాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ శాఖ ఆదేశం. అప్పుడు 692... ఇప్పుడు 20 కుప్పకూలిన షేరు ధర... డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభంతో కంపెనీ షేరు ధర కుప్పకూలింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ. 692ని తాకింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 30న కనిష్ట స్థాయి రూ. 15కి పడిపోయింది. బీఎస్ఈలో బుధవారం సుమారు 4% క్షీణించి రూ. 20 వద్ద ముగిసింది. -
4 ఏళ్లలో 47 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కార్పొరేట్ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,536 కోట్లుగా ఉన్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం సీఎస్ఆర్ వ్యయాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్ఆర్ రిపోర్టింగ్ సర్వే వెల్లడించింది. సీఎస్ఆర్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.., 2014–15 నుంచి 2017–18 మధ్య కాలానికి టాప్ 100 కంపెనీల మొత్తం సీఎస్ఆర్ వ్యయాలు రూ.26,385 కోట్లకు పెరిగాయి. ఒక్కో కంపెనీ సగటు సీఎస్ఆర్ వ్యయం 2014–15లో రూ.59 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 29 శాతం వృద్ధితో రూ.76 కోట్లకు ఎగసింది. సీఎస్ఆర్ కోసం కేటాయించి వ్యయం చేయని సొమ్ములు 2014–15లో రూ.1,738 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.749 కోట్లు తగ్గి రూ.989 కోట్లకు పడిపోయింది. సీఎస్ఆర్ వ్యయాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. సీఎస్ఆర్ కమిటీ కార్యకలాపాలు చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. డైరెక్టర్ల బోర్డ్ సమావేశాల్లో కూడా సీఎస్ఆర్ వ్యయాల ప్రస్తావన పెరుగుతోంది. ఇంధన, విద్యుత్తు రంగ కంపెనీలు అధికంగా సీఎస్ఆర్ కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ రంగంలోని కంపెనీలు సీఎస్ఆర్ కోసం రూ.2,465 కోట్లు ఖర్చు చేశాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీఎఫ్ఎస్ఐ(రూ.1,353 కోట్లు), వినియోగ వస్తు కంపెనీలు(రూ.635 కోట్లు), ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ కంపెనీలు, లోహ కంపెనీలు నిలిచాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను అధికంగా ఖర్చు చేసిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలు నిలిచాయి. -
ఓఎన్జీసీ బైబ్యాక్ రూ.4,022 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ కంపెనీ రూ.4,022 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఓఎన్జీసీ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 1.97 శాతం వాటాకు సమానమైన 25.29 కోట్ల షేర్లను, ఒక్కో షేర్‌ను రూ.159కు కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఓఎన్జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ఉండటంతో ఓఎన్జీసీ షేర్ల బైబ్యాక్ కారణంగా ప్రభుత్వానికి రూ.2,640 కోట్ల నిధులు వస్తాయని అంచనా. కాగా మూలధన పెట్టుబడుల కోసం నిధులు ఖర్చుకాగా ఈ సారి మధ్యంతర డివిడెండ్‌ను ఓఎన్జీసీ చెల్లించడం లేదని సమాచారం. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా కంపెనీ తాను జారీ చేసిన షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇటీవలే ఇండియన్ ఆయిల్ కార్పొ (ఐఓసీ) కంపెనీ రూ.4,435 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రూ.6,556 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. కేంద్రం ఒత్తిడి... నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను బైబ్యాక్ చేయాలని, అధిక డివిడెండ్‌ను చెల్లించాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ సంస్థల్లో అధిక వాటా ఉండటంతో షేర్ల బైబ్యాక్ కారణంగా ప్రభుత్వానికి భారీగా నిధులు లభిస్తాయి. ఈ నిధులను బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డజనుకు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఐఓసీ, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్, కేఐఓసీఎల్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల బైబ్యాక్ కారణంగా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల 1 నుంచి ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్ ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్ వచ్చే నెల 1 నుంచి ప్రా రంభమవుతోంది. అదే నెల 14న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 2.09% వాటాకు సమానమైన 21.42 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.28 ధరకు ఈ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్ తేదీగా గత నెల 30ని కంపెనీ నిర్ణయించింది. -
భారీగా పడిపోయిన జెట్ ఎయిర్వేస్ షేర్
ముంబై : దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ షేరు భారీగా పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో జెట్ ఎయిర్వేస్ షేరు 14.5 శాతం మేర కిందకి దిగ జారింది. ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి. తొలి క్వార్టర్ ఫలితాలను కంపెనీ వాయిదా వేయడంతో, షేర్ ధర తీవ్ర ఒడిదుడుకులు పాలవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరపు జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడానికి ఆ కంపెనీ ఆడిటర్లు ఆమోదం తెలుపలేదు. కొన్ని విషయాల మూసివేత కారణంతో ఆడిట్ కమిటీ, కంపెనీ బోర్డుకు ఫలితాల ప్రకటన గురించి ఎలాంటి ఆమోదం పంపించలేదు. దీంతో కంపెనీ ఫలితాల ప్రకటన వాయిదా వేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే గత ముగింపుకు 6.53 శాతం నష్టంలో జెట్ ఎయిర్వేస్ షేరు ఎంట్రీ ఇచ్చింది. ఆ అనంతరం మరింత కిందకి పడిపోతూ వస్తోంది. జెట్ ఎయిర్వేస్ షేరు ఇంతలా పడిపోతూ ఉంటే.. దీని ప్రత్యర్థి కంపెనీలు ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్, స్పైస్‌జెట్‌లు 1.7 శాతం, 2.2 శాతం పైకి ఎగుస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఫలితాలపై ఇప్పటికే విశ్లేషకులు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఎలరా క్యాపిటల్ అంచనాల ప్రకారం జెట్ ఎయిర్వేస్ రూ.490 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలుస్తోంది. ఇంధన ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో ఈ సారి ఏవియేషన్ సెక్టార్ అవుట్‌లుక్ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇండిగో తాను ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 97 శాతాన్ని కోల్పోయింది. ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ తన ఫలితాలను వచ్చే వారంలో ప్రకటించబోతుంది. మరోవైపు ఇంధన ధరలు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి మరలింది. తొలుత ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత పెట్టాలని చూసింది. ఆ ప్రతిపాదనకు పైలెట్లు ఒప్పుకోకపోవడంతో, 500 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అంతేకాక తన క్యారియర్ వాటాను కొంతమేర విక్రయించేందుకు సాయపడాలని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సైతం జెట్ ఎయిర్వేస్ కోరింది. -
హార్టికల్చర్ బోర్డులో తెలుగు వ్యక్తి
జాతీయ హార్టీకల్చర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన చోడరాజు సత్య కృష్ణంరాజును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హార్టీకల్చర్ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఉంటారు. వీరిలో ఒకరిగా ఏపీకు చెందిన సత్య కృష్ణంరాజు ఎంపిక కావడం విశేషం. ఈయన స్వస్ధలం తూర్పుగోదావరి జిల్లా తునిలోని తేటగుంట గ్రామం. ప్రస్తుతం రాజు కాకినాడ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. గతంలో మూడు సార్లు రాష్ట్ర స్ధాయిలో, ఒక సారి జిల్లా స్ధాయిలో ఉత్తమ రైతుగా అవార్డులు అందుకున్నారు. 2002లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంటు డైరెక్టర్ గా పనిచేశారు. రాజుతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన వేద ప్రకాశ్ శర్మ హార్టీకల్చర్ బోర్డు డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇరువురు మూడేళ్ల పాటు బోర్డు డైరెక్టర్లగా కొనసాగనున్నారు. -
కేతకీ కీరిటం ఎవరికో?
ఆశలపల్లికిలో నాయకులు ఝరాసంగం రూరల్: కేతకీ ఆలయ పాలక మండలి నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల కావడంత పోటీ తీవ్రమైంది. జిల్లాలో అతిపెద్ద శివాలయమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల పాలక మండలి ఏర్పాటు కోసం గత నేల 18న నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఏస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఝరాసంగంలోని కార్యానిర్వహణాధికారి కార్యాలయం, సంగారెడ్డిలోని అసిస్టెంట్ కమిష్నర్ కార్యాలయం, హైదరాబాద్‌లోని దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ధర్మకర్తల కోసం దాదాపు 50 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీ వరకు మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆశల పల్లకిలో నాయకులు కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్, దర్మకర్తల కోసం గతం కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో దరాఖాస్తు చేసుకుంటున్నారు. ఎడాది పాటు నుంచి పాలక మండలి ఖాళి ఉండడం వల్ల మండలంతో పాటు నియోజర్గంకు చెందిన టీఆర్ఏస్ నాయకులు చైర్మన్, దర్మకర్తల పదవులను దక్కించుకునేందుకు ఎవరికి వారే ప్రయాత్నాలు ముమ్మరంగా సాగిస్తు్న్నారు. కేతకీ ఆలయ మాజీ చైర్మన్ ఎం.పి.బస్వరాజ్‌పాటిల్, టీఆర్ఏస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహగౌడ్, టీఆర్ఏస్ మండల కార్యాదర్శి రాచయ్యస్వామి, టీఆర్ఏస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కేతన్ చౌతాయి, జహీరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నీలం వెంకటేశంలతో పాటు ఝరాసంగంకు చెందిన రాజేందర్‌సింగ్, కమాల్పల్లికి చెందిన సుభాష్‌రావు, మాచునూర్‌కు చెందిన ఎం.వెంకటేశం, కుప్పానగర్కు చెందిన జి.నర్సింహులు చైర్మన్ పదవి కోసం ప్రయాత్నాలు సాగిస్తున్నారు. జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, సంగారెడ్డిలతో పాటు పటన్చేరువుకు చెందిన మొట్టమొదటి ఆలయ ఈవో మల్లయ్య, సదాశివపేటకు చెందిన కొంత మంది నాయకులు పాలక మండలిలో చోటు కోసం రాష్ర్ట మంత్రి హరీష్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్, మాజీ మంత్రి ఫరిదొద్ధిన్, టీఆర్ఏస్ నియోజవర్గ ఇంచార్జీ మానిక్‌రావు, రాష్ర్ట నాయకులు ఎం.శివకుమార్, ఉమకాంత్పాటిల్ల వద్దకు వెళ్లి పదవులు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టుబట్టి.. బదిలీ చేసి..!
♦ ఎట్టకేలకు కార్పొరేషన్ కమిషనర్ బదిలీ ♦ నూతన పాలక వర్గంతో వైరమే కారణమా? ♦ పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు ఖమ్మం : కార్పొరేషన్ కమిషనర్ బదిలీ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆరేళ్లుగా పాలక మండలి లేకపోవడంతో వ్యవహరించిన మాదిరిగానే.. పాలక మండలి ఏర్పడిన తర్వాత కమిషనర్ వ్యవహరించడం.. కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ.. మేయర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారనే తదితర ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఆయన బదిలీ కావడం చర్చనీయాంశమైంది. కొత్త పాలక మండలి ఏర్పడిన నాటి నుంచే కమిషనర్ బదిలీ అవుతారనే గుప్పుమన్నాయి. అయితే సీఎం పర్యటకు ముందుగానే కమిషనర్ బదిలీపై పలు రకాల చర్చలు జరిగాయి. అయితే సాధారణంగానే బదిలీ అయ్యారా? లేదా కావాలని ప్రజాప్రతినిధులు పట్టుపట్టి బదిలీ చేయించారా? అనే చర్చ సాగుతోంది. పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి.. ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం.. కొత్త పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి కమిషనర్‌కు, పలువురు కార్పొరేటర్ల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. రాజకీయ అనుభవం లేని మేయర్ పాపాలాల్‌ను కమిషనర్ తన గుప్పిట్లో పెట్టుకుని అంతా తానై నడిపిస్తున్నాడని, దశాబ్దాలపాటు కార్పొరేషన్లో వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నాయకులను కావాలనే పక్కన పెట్టారనే విమర్శలొచ్చాయి. ఇటీవల జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు 46 మంది ఉన్నా.. కమిషనర్ మాత్రం ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా మేయర్, ఒకరిద్దరు కార్పొరేటర్లను వెంట పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే తమ పరువుతోపాటు పార్టీ పరువు కూడా పోతుందని పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న నాయకులు గతంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులకు వివరించి.. ఆయనను బదిలీ చేయాలని పట్టుపట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్‌రెడ్డి బదిలీ అయి.. నూతనంగా ఉపేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఏమైందో కాని.. కమిషనర్ బదిలీ కాకుండానే ఉండిపోయారు. అనంతరం ఈనెల 14న నిర్వహించే కౌన్సిల్ సమావేశంపై కార్పొరేటర్లతో చర్చించలేదని, స్థానిక ఎమ్మెల్యేకు సైతం సమాచారం లేకుండా కౌన్సిల్ తేదీని ఖరారు చేశారనే విమర్శలొచ్చాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం మెజార్టీ కార్పొరేటర్లు సమావేశమై కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు, చేసే తీర్మానాల వల్ల తాము అభాసుపాలు అవుతామని, తమకు తెలియకుండానే తమ డివిజన్లలో పనులు కేటాయించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కమిషనర్‌ను బదిలీ చేస్తే తప్ప పార్టీ పరువు నిలవదని ఎమ్మెల్యేకు, ఇతర నాయకులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అవసరమైతే 14న జరిగే కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరయ్యే ప్రసక్తి లేదని కార్పొరేటర్లు ముక్తకంఠంతో తీర్మానం చేసినట్లు సమాచారం. ఇది జరిగి నాలుగు రోజులు గడవకముందే కౌన్సిల్ సమావేశానికి ఒక్కరోజు ముందు కమిషనర్ బదిలీ కావడం.. గతంలో పనిచేసిన బోనగిరి శ్రీనివాస్‌ను నూతన కమిషనర్‌గా జిల్లాకు తీసుకురావడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు
సాక్షి, హైదరాబాద్: మరో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తొలి విడతలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాలో నిజామాబా ద్ జిల్లా కమ్మర్పల్లి, వేల్పూరుతో పాటు మెదక్ జిల్లా సంగారెడ్డి మార్కెట్ కమిటీలకు చోటు దక్కింది. ఒక్కో కమిటీలో చైర్మన్, వైస్‌చైర్మన్, మరో 12 మందిని సభ్యులుగా నామినేట్ చేశా రు. బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు చేసిన కమ్మర్పల్లి కమిటీ చైర్మన్‌గా దొనకంటి నర్సయ్య, వైస్ చైర్మన్‌గా గడ్డం స్వామి, ఎస్టీ మహిళ కేటగి రీలో వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా పుట్ట లలిత, వైస్‌చైర్మన్‌గా ఏలేటి రమేశ్, మెదక్ జిల్లా సంగారెడ్డి కమిటీకి ఓసీ జనరల్ కేటగిరీలో చైర్మన్‌గా తేర్పల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌గా ఎంఏ సుభాన్‌ను నియమిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. -
ఇన్ టాక్ పాలక మండలి సభ్యుడిగా వేదకుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాక్) పాలక మండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణ, హెరిటేజ్ కార్యకర్త ఎం.వేదకుమార్ ఎన్నికయ్యారు. చారిత్రక వారసత్వ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికిగాను ఇన్టాక్ సభ్యులు ఆయనను పాలక మండలికి ఎన్నుకున్నారు. వేదకుమార్ వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ.. ప్రవృత్తి రీత్యా హెరిటేజ్ కార్యకర్త. గత రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో కృషి చేస్తున్నారు. ఎన్నో చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం ఉద్యమించారు. 2014 సెప్టెంబర్ వరకు ఇన్టాక్ ఏపీ రాష్ట్ర శాఖకు కో-కన్వీనర్‌గా పని చేశారు. ఈ సమయంలో అనేక ప్రహరీలు, శిలల సహజ సిద్ధ ఆకృతులు, కట్టడాలు, స్థానిక నిర్మాణ శైలులను కాపాడేందుకు కృషి చేశారు. చారిత్రక, వారసత్వ కట్టడాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. హెరిటేజ్ కార్యకర్తగా రోమ్, పారిస్, బెర్లిన్, ఇన్‌ఫాహాస్, హమెదాస్ (ఇరాన్), ఇస్తాంబుల్ తదితర నగరాల్లో పర్యటించారు. జర్మనీకి చెందిన హమ్‌బోల్డ్ యూనివర్సిటీతో కలసి మూసీ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్టుకు సారథ్యం వహించారు. -
ఎన్నిక ఏకగ్రీవం
* జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్ * డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్ సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఆ వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌కు వీరిద్దరు తప్ప వేరెవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. వారిద్దరికీ ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించింది. దాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం అరగంట లోపే పూర్తయింది. తొలుత ప్రమాణం.. తర్వాత ఎన్నిక ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 11.10 నిమిషాలకు సమావేశానికి సరపడా కోరం ఉన్నట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత తెలుగులో అనంతరం ఉర్దూ, హిందీ, ఇంగ్లిషుల్లో ప్రమాణం చేయాలనుకున్న వారితో ప్రమాణం చేయించారు. కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు మొత్తం 217 మంది ఉండగా, 109 మందికి పైగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక కోరం ఉన్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తొలుత మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్‌గా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ప్రతిపాదించగా, మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో రామ్మోహ న్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తర్వాత డిప్యూటీ మేయర్‌గా బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రామ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. వెంటనే అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయేషా రూబినా(ఎంఐఎం) లేచి.. మేయర్, డిప్యూటీ మేయర్లకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె లేవగానే తొలుత పోటీకి వేరే పేరు ప్రతిపాదిస్తారేమోనని కొందరు భావించారు. కానీ తాము కూడా మద్దతిస్తున్నట్లు చెప్పడంతో అధికారులు దాన్ని రికార్డు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన రామ్మోహన్, ఫసియుద్దీన్లకు ప్రిసైడింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.44 మంది ఎక్స్ అఫీషియోలు హాజరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 150 మంది కార్పొరేటర్లు హాజరుకాగా 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులకుగాను 44 మంది మాత్రమే హాజరయ్యారు. లోక్‌సభ ఎంపీల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులెవరూ రాలేదు. 26 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులెవరూ రాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని తదితరులు హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులు అశోక్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు కమిషనర్ (ఎన్నికలు) సురేంద్రమోహన్ ఇతర అధికారులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌ను కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ ప్రొఫైల్ పేరు: బొంతు రామ్మోహన్ (42) తండ్రి: బొంతు వెంకటయ్య భార్య: శ్రీదేవి; కుమార్తెలు: కుజిత, ఉషశ్రీ విద్యార్హతలు: ఎంఏ, ఎల్ఎల్బీ రాజకీయ అరంగేట్రం: 2001, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి.. నిర్వహించిన పదవులు, నేపథ్యం: టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓయూ విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు సన్నిహితుడిగా పేరుంది. డిప్యూటీ మేయర్ ప్రొఫైల్ పేరు: బాబా ఫసియుద్దీన్(34) విద్య: బీకాం భార్య: హబీబా సుల్తానా పిల్లలు: కుమార్తె, కుమారుడు తండ్రి: బాబా షరీఫుద్దీన్ తల్లి: రజియా ఫాతిమా రాజకీయ అనుభవం: 2001లో టీఆర్ఎస్లో చేరిన బాబా పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. -
ఉద్యమ నేతలకు మహా కిరీటం
మేయర్‌గా బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కొలువుదీరిన కొత్త పాలక మండలి తెలంగాణ ఉద్యమాన్ని కదం తొక్కించిన ఇద్దరు నేతలకు ‘మహా’ అవకాశం. ఒకరికి మేయర్‌గా... మరొకరికి డిప్యూటీ మేయర్‌గా పట్టాభిషేకం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అపూర్వ బహుమానం.మేయర్ బొంతు రామ్మోహన్... డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్... ఇద్దరిదీ ఉద్యమ నేపథ్యమే. టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా రామ్మోహన్ పని చేశారు. ఓయూ విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక ఫసియుద్దీన్ గతంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ 25వ మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి మేయర్‌గా ఆయన గుర్తింపు పొందారు. 26వ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి కానీ, ఇతర అభ్యర్థుల నుంచి కానీ నామినేషన్లు రాకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఇద్దరు యువకులు.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలుపొంది... ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నిక వడం విశేషం. వీరి ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీలోనూ అభ్యంతరాలు రాకపోవడమే కాక... నిజమైన ఉద్యమ వీరులకు సముచిత స్థానం లభించిందని పలువురు అభివర్ణించారు. నేడు బాధ్యతల స్వీకరణ జీహెచ్ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు చేపడతారు. ముగిసిన స్పెషలాఫీసర్ పాలన.. జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన ముగిసింది. గత పాలక మండలి గడువు 2014 డిసెంబర్ 3తో ముగియగా...ఆ మరుసటి రోజు (4న) నుంచి స్పెషలాఫీసర్ పాలన అమల్లోకి వచ్చింది. స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ గత అక్టోబర్ 30న బదిలీ అయ్యారు. అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టిన డా.బి.జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా, స్పెషలాఫీసర్‌గా కొనసాగుతున్నారు. కొత్త పాలకమండలి రావడంతో ఇకపై ఆయన కమిషనర్‌గానే కొనసాగనున్నారు.