హార్టికల్చర్ బోర్డులో తెలుగు వ్యక్తి | centre appoints satya krishnam raju of ap among board of directors for national horticulture | Sakshi
Sakshi News home page

హార్టికల్చర్ బోర్డులో తెలుగు వ్యక్తి

Published Tue, Nov 15 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

హార్టికల్చర్ బోర్డులో తెలుగు వ్యక్తి

హార్టికల్చర్ బోర్డులో తెలుగు వ్యక్తి

జాతీయ హార్టీకల్చర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన చోడరాజు సత్య కృష్ణంరాజును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హార్టీకల్చర్ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఉంటారు. వీరిలో ఒకరిగా ఏపీకు చెందిన సత్య కృష్ణంరాజు ఎంపిక కావడం విశేషం. ఈయన స్వస్ధలం తూర్పుగోదావరి జిల్లా తునిలోని తేటగుంట గ్రామం.

ప్రస్తుతం రాజు కాకినాడ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. గతంలో మూడు సార్లు రాష్ట్ర స్ధాయిలో, ఒక సారి జిల్లా స్ధాయిలో ఉత్తమ రైతుగా అవార్డులు అందుకున్నారు. 2002లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంటు డైరెక్టర్ గా పనిచేశారు. రాజుతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన వేద ప్రకాశ్ శర్మ హార్టీకల్చర్ బోర్డు డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇరువురు మూడేళ్ల పాటు బోర్డు డైరెక్టర్లగా కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement