
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే.
తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ బోర్డును మొత్తం రద్దు చేశారు. డైరెక్టర్ల బోర్డును రద్దు తరువాత ప్రస్తుతం మాస్క్ ఏకైక డైరెక్టర్‌గా కొనగుతున్నారు. అక్టోబర్ 31, సోమవారం సెక్యూరిటీ ఫైలింగ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిణామంతోమాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఇకపై డైరెక్టర్లుగా ఉండరని.. ఇది వారికి మరో ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: Bank of Baroda కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు
Comments
Please login to add a commentAdd a comment