Parag Agarwal
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తెరపైకి ట్విటర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్!
భారత సంతతికి చెందిన ట్విటర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ మరోసారి టెక్ వ్యాపార ప్రపంచంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. మస్క్ బాస్‌గా ట్విటర్‌లోకి అడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలో ఆ సంస్థ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత పరాగ్ అగర్వాల్ పేరు ఎక్కడా వినపడలేదు. అయితే ఇన్నాళ్లకు పరాగ్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నట్లు? పరాగ్ అగర్వాల్ చాట్‌జీపీటీ తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల నుంచి 30 మిలియన్ డాలర్లల నిధులను సేకరించినట్లు తెలుస్తోంది. ట్విటర్ మాజీ సీఈఓ నెలకొల్పబోయే వెంచర్లో గతంలో చాట్‌జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ఏఐకి అండగా నిలిచిన ఖోస్లా వెంచర్స్ పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఖోస్లో వెంచర్స్‌తో పాటు ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ కేపిటల్‌లు సైతం పెట్టుబడులు పెట్టాయి. పరాగ్ స్థాపించనున్న కంపెనీ పేరేంటి ?, ఎలాంటి ప్రొడక్ట్‌ను తయారు చేయనున్నారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, పరాగ్ స్టార్టప్‌తో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం చాట్‌జీపీటీ తరహాలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌పై పనిచేస్తున్నట్లు తెలిపారు. పరాగ్ తొలగించడానికి కారణం ఎలాన్ మస్క్ రూ.3.37లక్షల కోట్లు వెచ్చించి మరి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అనంతరం బాస్ అడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలో ట్విటర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి పరాగ్ చాలా మంచి వ్యక్తి.. సీఈఓగా కొనసాగాలంటే అదొక్కటి ఉంటే సరిపోదు. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పరాగ్ అగర్వాల్ అందుకు సరిపోరు’ అని ఎలన్ మస్క్ అన్నారట. ఇదే విషయాన్ని ఎలన్ మస్క్‌పై బయోగ్రఫీ రాసిన రైటర్ వాల్టర్ ఇసాక్సన్ రాసిన ఎలాన్‌మస్క్ పుస్తకంలో ప్రస్తావించారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!
సాక్షి, ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కి మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా తొలగించబడిన మాజీ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఝలక్ ఇచ్చారు. 10 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలంటూ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ పై దావా వేశారు.అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) భారత సంతతికి చెందిన ట్విటర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ సీఎఫ్‌వో సెగల్ ముగ్గురూ చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చేయాలంటూ కోర్టుకెక్కారు. ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ పలు ధపాల విచారణలో భాగంగా తామె వెచ్చించిన లీగల్ ఫీజులకు గాను ట్విటటర్ తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉందని ముగ్గురూ ఆరోపించారు. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్) కాగా గత ఏడాది అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత భారీ ఖర్చు తగ్గించే చర్చల్లో భాగంగా పలుక కీలక మార్పులను చేపట్టిన మస్క్ ప్రధానం అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్, గద్దె,సెగల్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. (Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం రూ. 1,247 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 706 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం అధికం. విదేశీ మారకంపరంగా సానుకూలతలు, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. సమీక్షాకాలంలో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,320 కోట్ల నుంచి రూ. 6,770 కోట్లకు పెరిగినట్లు వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టిన రెవ్లిమిడ్ ఔషధం .. కంపెనీ ఆదాయాలకు అర్ధవంతమైన రీతిలో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టామని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా మార్కెట్లో 25 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. ధరలపరమైన తగ్గుదల ధోరణులు దాదాపుగా గత రెండు త్రైమాసికాల్లో చూసిన విధంగానే ఉన్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. అమెరికా, రష్యా మార్కెట్లలో వృద్ధి తోడ్పాటుతో పటిష్టమైన ఆర్థిక పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ కో–చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్య విశేషాలు.. ► కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఉత్పత్తుల రేట్ల పెంపుతో భారత్ మార్కెట్లో ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,130 కోట్లకు చేరింది. ► కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 64 శాతం వృద్ధి చెంది రూ. 3,060 కోట్లుగా నమోదైంది. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 14 శాతం, యూరప్‌లో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. ► క్యూ3లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 480 కోట్లు వెచ్చించారు. పెట్టుబడి వ్యయాలపై కంపెనీ రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. -
మస్క్ సంచలనం, పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ బోర్డును మొత్తం రద్దు చేశారు. డైరెక్టర్ల బోర్డును రద్దు తరువాత ప్రస్తుతం మాస్క్ ఏకైక డైరెక్టర్‌గా కొనగుతున్నారు. అక్టోబర్ 31, సోమవారం సెక్యూరిటీ ఫైలింగ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిణామంతోమాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఇకపై డైరెక్టర్లుగా ఉండరని.. ఇది వారికి మరో ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: Bank of Baroda కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు -
పరాగ్, విజయపై అయిష్టత ఎందుకు? ట్విటర్ డీల్‌పై భారత్ స్పందన ఏంటి?
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో తనను బాగా ఇబ్బంది పెట్టారని భావిస్తున్న ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రవాల్, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగాల్, జనరల్ కౌన్సిల్ షాన్ ఎడ్జెట్‌లపై తక్షణం వేటు వేసిన సంగతివ తెలిసిందే.. వారిలో ఒకరిని అవమానకరమైన రీతిలో .. ట్విటర్ ఆఫీసు నుండి దాదాపు గెంటివేసినంత పని చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరాగ్, విజయ అంటే అందుకే అయిష్టం అయితే ఉద్వాసనకు గురైన పరాగ్ అగ్రవాల్ .. గతేడాది నవంబర్లోనే సంస్థ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. బాంబే ఐఐటీలోనూ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనూ విద్యాభ్యాసం చేసిన అగ్రవాల్ .. దాదాపు దశాబ్దం క్రితం ట్విటర్లో చేరారు. తర్వాత సీఈవోగా ఎదిగారు. ట్విటర్ టేకోవర్ వ్యవహారంలో మస్క్‌తో బహిరంగంగాను, ప్రైవేట్‌గాను అగ్రవాల్ పోరాటం సాగించారని, అందుకే ఆయనపై మస్క్ కత్తిగట్టారని న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ పేర్కొంది. అలాగే హైదరాబాదీ అయిన లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె (48) విషయానికొస్తే .. అభ్యంతరకర ట్వీట్లు చేస్తున్నారంటూ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను రద్దు చేయడం ద్వారా ఆమె వార్తల్లోకెక్కారు. ’కంటెంట్‌ను క్రమబద్ధీకరించడంలో ట్విటర్ నిర్ణయాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నారు’ అంటూ విజయపై కూడా మస్క్ విమర్శలు గుప్పించారు. కంపెనీ తన చేతికి వచ్చీ రాగానే ఆమెను తప్పించారు. అయితే, ఉద్వాసనకు గురైన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే పరిహారం ముట్టనుంది. వారి వాటాలను కొనుగోలు చేసేందుకు, అర్ధాంతరంగా తొలగించినందుకు గాను పరిహారం కింద ఆయా ఉద్యోగులకు మస్క్ దాదాపు 200 మిలియన్ డాలర్లు చెల్లించుకోవాల్సి రానుంది. (Parag Agrawal పరాగ్ అగర్వాల్‌కు ఎన్ని వందల కోట్లు వస్తాయంటే?) కాగా దాదాపు ఆరేడు నెలలకు పైగా నడుస్తున్న మస్క్–ట్విటర్ ప్రహసనానికి ఎట్టకేలకు తెరపడింది. 44 బిలియన్ డాలర్ల డీల్‌ను మస్క్ పూర్తి చేశారు. డీల్ పూర్తయిన వెంటనే తన ప్రణాళికలను కూడా చకచకా అమలు చేయడం ప్రారంభించారు. అయితే కంపెనీని కొంటే 75 శాతం మందిని తీసేస్తానంటూ మస్క్ గతంలో చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఇంకా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అలాంటిదేమీ ఉండబోదంటూ మస్క్ హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, మస్క్ చేతికి చేరిన నేపథ్యంలో శుక్రవారం నుండి ట్విటర్ షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. నిబంధనలు పాటించాల్సిందే: భారత్ ట్విటర్ ఎవరి చేతిలో ఉన్నా భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీని మస్క్ టేకోవర్ చేసినంత మాత్రాన దేశంలో నిబంధనలు మారిపోవని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కంపెనీలకు భారత్ భారీ మార్కెట్‌గా ఉంటోంది. అయితే, ఇటీవలి కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్‌కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. టెస్లా కార్ల దిగుమతి సుంకాలు, స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విషయంలో ప్రభుత్వంతో మస్క్‌కు కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,113 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,113 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 992 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. అటు ఆదాయం 9% పెరిగి రూ. 5,763 కోట్ల నుంచి రూ. 6,306 కోట్లకు చేరింది. శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మార్కెట్లో ఎక్స్‌క్లూజివ్ హక్కులు లభించిన జనరిక్ ఔషధం రెవ్లిమిడ్ సహా కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్పత్తుల ఊతంతో ఆదాయాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని పరాగ్ వివరించారు. అలాగే వ్యయాలను సమర్ధంగా నియంత్రించుకోవడం కూడా దోహదపడిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 25 పైగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు, రెండో త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు సాధించడం సంతృప్తి కలిగించిందని సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయంగా చౌకగా మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కొనసాగిస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రెండో త్రైమాసికంలో కంపెనీ సుమారు రూ. 490 కోట్లు వెచ్చించింది. ఫలితాల్లో ఇతర విశేషాలు.. ► క్యూ2లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయాలు 18 శాతం పెరిగి రూ. 5,595 కోట్లకు చేరాయి. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 48 శాతం వృద్ధి చెంది రూ. 2,800 కోట్లకు పెరిగాయి. కొన్ని ఔషధాల రేట్లు తగ్గినప్పటికీ .. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేట్ల ప్రభావంతో కంపెనీ ఆ ప్రతికూలతలను అధిగమించింది. ► భారత మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ. 1,150 కోట్లకు పరిమితమయ్యాయి. ► ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం 23 శాతం క్షీణించి రూ. 643 కోట్లకు తగ్గింది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 4,461 వద్ద క్లోజయ్యింది. -
భారత్‌పై ఎలాన్ మస్క్ స్వీట్ రివెంజ్!
మూవీ క్లైమాక్స్‌ను తలపించిన బిలియనీర్ ఎలాన్ మస్క్..ట్విట్టర్ కొనుగోలు అంశం ఎట్టకేలకు ముగిసింది. కోర్టు ఇచ్చిన గడువు లోపే భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన మస్క్..భారత్‌పై రివెంజ్ తీర్చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి ట్విట్టర్‌లోని తాజా పరిణమాలు. బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ మస్క్‌కు అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రకారమే మస్క్ 44 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు) మైక్రో బ్లాగింగ్ సంస్థను దక్కించుకున్నారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ సహా మరికొంత మంది టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను మస్క్ తొలగించారు. మస్క్ బాస్ అయితే ట్విట్టర్లో తొలగింపులు ఉంటాయంటూ ముందు నుంచి వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ భారతీయుడైన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని ఫైర్ చేయడం చర్చాంశనీయంగా మారింది. ఈ తరుణంలో మస్క్ భారత్‌పై రివెంజ్ తీర్చుకున్నారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా గతంలో భారత్ విషయంలో మస్క్‌కు ఎదురైన చేదు అనుభవాల్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఎలాన్ మస్క్ తన టెస్లా కార్లను ఇక్కడ అమ్మకాలు జరిగేలా ఏడాది పాటు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో దేశీయంగా టెస్లా షోరూంలు, స్వరీస్ సెంటర్ల కోసం స్థలాల్ని వెతికారు. అయితే చైనాలో తయారైన టెస్లా కార్లను భారత్‌లో దిగుమతి చేసి విక్రయిస్తామని, దిగుమతి సుంకాల్ని తగ్గించాలని ప్రతిపాదించారు. మస్క్ ప్రతిపాదనల్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. తొలత తమ కార్లను ఇక్కడ అమ్మడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తే భారత్‌లో ఎలక్ట్రిక్ వెహిక్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామని మస్క్ తెగేసి చెప్పారు. ఆ తర్వాత శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 32దేశాల్లో అందిస్తున్నారు. ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ అనువైన దేశంగా భావించి.. గతేడాది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సేవల కంటే ముందు బుక్సింగ్ ప్రారంభించింది. లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న మస్క్ ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేయడంతో మస్క్‌కు భంగపాటు ఎదురైంది. అందుకే మస్క్ ట్విట్టర్ కొనుగోలతో ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలను ఫైర్ చేశారని, అలా మస్క్ భారత్‌పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
తొలగింపు తరువాత పరాగ్ అగర్వాల్‌కు ఎన్ని వందల కోట్లు వస్తాయంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్, ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ డీల్‌ను పూర్తి చేసిన వెంటనే కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేయడం సంచలనం సృష్టించింది. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.37 లక్షల కోట్లు)టేకోవర్ డీల్ తరువాత ట్విటర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెడ్ సెగల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె తొలగింపు తర్వాత భారీ మొత్తం అందుకోబోతున్నారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌కు సుమారు 42 మిలియన్ డాలర్ల అత్యధిక చెల్లింపును అందుకోబోతోన్నారు. మొత్తంగా తొలగించిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 88 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పరిశోధనా సంస్థ ఈక్విలర్ ప్రకారం, 42 మిలియన్లు డాలర్లు (రూ.3,457,145,328) పరాగ్ అగర్వాల్ సొంతం చేసుకుంటారు. పరాగ్ వార్షిక బేసిక్ సాలరీ, ఈక్విటీ అవార్డు ప్రకారం దీన్ని అంచనా వేసింది. అలాగే కంపెనీకి సంబంధించిన ప్రాక్సీ స్టేట్మెంట్ నిబంధనల మేరకు ఈ పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని రాయిటర్స్ అంచనా వేసింది. ఇన్సైడర్ ప్రకారం మాజీ సీఎఫ్‌వోకు 25.4 మిలియన్ డాలర్లు, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె 12.5 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు. అలాగే చీఫ్ కస్టమర్ ఆఫీసర్ సారా పెర్సోనెట్ 11.2 మిలియన్ల డాలర్లు పొందుతారు. దశాబ్దం క్రితం ట్విటర్లో పరాగ్ ఎంట్రీ ఐఐటీ బాంబే , స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థి పరాగ్ అగర్వాల్ 2011లో ట్విటర్లో చేరారు. 2017 నుంచి ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా ఉన్న ఆయననకు గత ఏడాది నవంబరులో సీఈవో నియమించింది కంపెనీ. 2021 నాటికి పరాగ్ మొత్తం పరిహారం $30.4 మిలియన్లు కాగా ట్విటర్ స్వాధీనం తరువాత ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ సిబ్బందిలో 75 శాతం లేదా 5,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గతంలో నివేదికలు పేర్కొన్నాయి. ట్విటర్ పునర్వ్యవస్థీకరణతోపాటు, ఉద్యోగులపై వేటు తప్పదనే అంచనాలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల ట్విటర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్భించిన సందర్బంగా మస్క్ ట్విటర్ ఉద్యోగులతో హామీ ఇచ్చారు. అయితే మస్క్ టేకోవర్, కీలక ఉద్యోగులపై వేటు తరువాత ఉద్యోగులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. -
ఎవరొస్తారో రండి.. తేల్చుకుందాం, పరాగ్ అగర్వాల్‌కు ఎలాన్ మస్క్ సవాల్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్..ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు సవాల్ విసిరారు. ఫేక్ అకౌంట్ల విషయంలో ట్విట్టర్ బహిరంగ చర్చకు రావాలని పిలుపు నిచ్చారు. నిరూపణలో మీరు సఫలమైతే.. ట్విట్టర్ కొనుగోలు చేసే ప్రాసెస్‌ను ముందుకు కొనసాగుతుందంటూ మస్క్ అవకాశం ఇచ్చారు ఫేక్ అకౌంట్ల విషయంలో ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కౌంటర్ సూట్‌పై ట్విట్టర్ సైబర్ సెక్యూరిటీ రెసెర్చర్ ఆండ్రియా స్ట్రోపా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్‌కు ఎలాన్ మస్క్ ధీటుగా స్పందించారు. తాను పెట్టే ప్రపోజల్‌కు ట్విట్టర్ అంగీకరిస్తే..44 బిలియన్ డాలర్ల డీల్‌కు సిద్ధమేనని రిప్లయ్ ఇచ్చారు. I hereby challenge @paraga to a public debate about the Twitter bot percentage. Let him prove to the public that Twitter has -
'ఇదేం పద్ధతయ్యా.. ఎలాన్ మస్క్ కొత్త రగడ'
ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ల మధ్య కొనుగోలు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మస్క్‌ను ట్విట్టర్ తరుపు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందారని మస్క్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం లేదంటూ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్విట్టర్.. మస్క్‌కు వ్యతిరేకంగా కోర్ట్‌లో దావా వేసింది. ప్రస్తుతం డెలావేర్‌లోని ఛాన్సరీ కోర్టులో దావాపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మస్క్..ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు, సీఎఫ్ఓ నెడ్ సెగల్‌కు వ్యక్తిగతంగా మెసేజ్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్‌ను కొనుగోలును రద్దు చేయడంపై ఆ సంస్థ తరుపు లాయర్లు.. ఎలాన్ మస్క్‌ను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. మీ లాయర్లు నన్ను ఇబ్బందులు పెట్టేలా ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందుతున్నారని నన్ను అడిగారు. ఇది మంచి పద్దతి కాదంటూ ఆ మెసేజ్‌లో ఎలన్ ప్రస్తావించినట్లు సమాచారం. చదవండి: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్!
అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు అంశంలో ప్రతి సీను ఓ సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా ట్విటర్లో అధిక స్టేక్‌ను కొనుగోలు చేయడం దగ్గర నుంచి..ఆ సంస్థ ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగింపు వరకు ఇలా ప్రతి సందర్భం వ్యాపార దిగ్గజాల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. అయితే తాజాగా ట్విటర్లో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ట్విటర్ కొనుగోలులో..ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య వినీతా అగర్వాల్ కీ రోల్ ప్లే చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదెలా అంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా మెన్లో పార్క్ కేంద్రంగా ఆండ్రీసీన్ హోరోవిట్జ్ అనే సంస్థ వెంచర్ క్యాప్టలిస్ట్ (వీసీ)గా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే మెటాకు భారీ ఎత్తున ఆండ్రీసీన్ హోరోవిట్జ్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అదే సంస్థ ..ట్విటర్‌ను టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్‌కు 400 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. అయితే ట్విటర్లో పెట్టుబడుల అంశంపై వినీతా అగర్వాల్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆండ్రీసీన్ హోరోవిట్జ్‌కు వినీతా అగర్వాల్ జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. దీంతో పాటు డ్రగ్స్ డెవలప్మెంట్, లైఫ్ సైసెన్స్ టూల్స్, డయోగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్, రోగి సంరక్షణ కోసం ప్రత్యేక డేటాసెట్ లు వంటి హెల్త్ కేర్ విభాగంగా పెట్టుబడులు పెట్టే అంశంలో ముఖ్యపాత్రపోషిస్తున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడంలో ఆర్ధికంగా ఆండ్రీసీన్ హోరోవిట్జ్‌కు సాయం చేస్తుండడం, ఆ సంస్థకు జనరల్ పార్ట్నర్గా వినీతా అగర్వాల్ ఉండడం' ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిగ్గా మారింది. ట్విటర్ కొనుగోలులో ఎలన్‌మస్క్‌కు ఆర్ధికంగా సాయం చేయడంతో వినీతా అగర్వాల్ వార్తల్లో నిలుస్తున్నారు. చదవండి👉మస్క్ ట్విటర్ కొనుగోలు: రాజుగారి ట్యూన్ ఇలా మారిందేంటబ్బా! -
ఎలన్ మస్క్ చేతిలో ట్విటర్.. సీఈవో పరాగ్కి పొగ?
ఎలన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తోన్న పరాగ్ అగర్వాల్ బయటకు వెళ్లక తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో పరాగ్ బయటకు వెళితే ఎంత మొత్తం పరిహారంగా చెల్లిస్తారనే అంశంపై ఈక్విలర్ సంస్థ ఓ అంచనా వేసింది. ప్రీ స్పీచ్ విషయంలో ట్విటర్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు, విధిస్తున్న ఆంక్షలు సరిగా లేవంటూ ఎలన్ మస్క్ 2022 ఏప్రిల్ 14న సెక్యూరిటీస్ దగ్గర దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏకమొత్తంగా ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ ఆఫర్ చేశాడు. అన్నట్టుగానే సాధించాడు. దీంతో 2013 నుంచి పబ్లిక్ లిమిలెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్ త్వరలో ప్రైవేట్ లిమిటెడ్ కానుంది. మరోవైపు 2021 నవంబరులో ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆయన ట్విటర్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. సీఈవో హోదాలో కంపెనీలో కొన్ని షేర్లతో పాటు వార్షిక వేతనంగా 30.4 మిలియన్ డాలర్ల ప్యాకేజీని పరాగ్ పొందారు. ఎలన్ మస్క్ ట్విటర్‌కి కొత్త సీఈవోని తీసుకువస్తే పరాగ్కి పరిహారంగా 42 మిలియన్లు చెల్లించాల్సి వస్తుందంటూ ఈక్విలర్ సంస్థ తెలిపింది. చదవండి: మస్క్ చేతికి ట్విటర్.. సీఈవో పరాగ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు -
ట్విటర్ బోర్డులో ఎలన్ మస్క్!
శాన్ఫ్రాన్సిస్కో: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఇంక్ బోర్డులో చేరనున్నారు. బోర్డులో సీటు కేటాయించేందుకు మస్క్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ట్విటర్ తాజాగా పేర్కొంది. బోర్డు పదవీకాలం 2024 వార్షిక సమావేశంతో ముగియనున్నట్లు తెలియజేసింది. మస్క్ వ్యక్తిగతంగా లేదా గ్రూప్ సభ్యునిగా కంపెనీలో 14.9 శాతం వాటాను మించి సొంతం చేసుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ట్విటర్లో 9 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించిన మర్నాడే బోర్డులో చేరనున్నట్లు వెల్లడికావడం గమనార్హం. ఇటీవల కొద్ది వారాలుగా మస్క్‌తో చర్చలు నిర్వహించినట్లు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ట్వీట్లో ప్రస్తావించారు. మస్క్ బోర్డులో చేరడం ద్వారా మరింత విలువ చేకూరనున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్పట్ల అత్యంత విశ్వాసంగల మస్క్ అత్యుత్తమ విమర్శకుడని వ్యాఖ్యానించారు. నిజానికి ఇది దీర్ఘకాలంలో కంపెనీతోపాటు.. బోర్డు బలోపేతానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మస్క్ 3 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా 73.5 మిలియన్ ట్విటర్ షేర్లను కొనుగోలు చేశారు. కాగా.. రానున్న నెలల్లో ట్విటర్‌ను భారీస్థాయిలో మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు మస్క్ ట్వీట్ చేయడం ప్రస్తావించదగ్గ అంశం! -
వర్క్ ఫ్రం హోంపై ట్విట్టర్ సంచలన నిర్ణయం ! ఇకపై..
Twitter CEO Parag Agarwal: కరోనా భయాలు వీడుతుండటంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉన్నా కూడా వ్యాక్సిన్ ఇచ్చిన భరోసా ముందు మరిన్ని వేవ్స్ రావొచ్చన హెచ్చరికలు బలాదూర్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంత కాలం అందరి నోళ్లలో నానుతూ వచ్చిన వర్క్ ఫ్రం హోం ఇకపై ఉంటుందా ? లేక ఉద్యోగులు ఆఫీసులకే రావాలా? అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. వీటికి తొలిసారి తెర దించిన కంపెనీగా ట్విట్టర్ నిలిచింది. వర్క్ ఫ్రం హోంపై ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కాలం నాటి గడ్డు పరిస్థితులు.. ఆ రోజుల్లో సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులు, భవిష్యత్తు అవసరాలను వివరిస్తూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు లేఖ రాశారు. అందులో వర్క్ ఫ్రం హోం పట్ల కంపెనీ అభిప్రాయాన్ని తేటతెల్లం చేశారు. వర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేసే విషయంలో మేనేజ్మెంట్ అభిప్రాయాన్ని ఉద్యోగులపై రుద్దేందుకు ట్విట్టర్ విముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగుల అభిప్రాయానికే ట్విట్టర్ సీఈవో పరాగ్ పెద్ద పీట వేశారు. ఫ్లెక్సిబుల్ పద్దతికి జై కొట్టారు... ఆఫీసుకి రావడం, పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం చేయడం , కొన్నాళ్లు ఆఫీసు నుంచి కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం ఇలా మూడు ఆప్షన్లు ఉద్యోగులు ఎంచుకోవచ్చంటూ ట్విట్టర్ సీఈవో పరాగ్ ప్రకటించారు. ఉద్యోగులు ఏ విధానంలో పని చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు. అయితే ఏ పద్దతిలో ఎక్కువ సేఫ్‌గా క్రియేటివ్‌గా, ప్రొడక్టివ్‌గా పని చేయగలమనేదాన్ని ఉద్యోగులే నిర్ణయించుకోవాలన్నారు. పనికి సంబంధించి వర్క్ కల్చర్‌లో తేడాలు ట్రావెల్ ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగులకు సూచించాడు. Here’s the announcement to the company about our approach and commitment to truly flexible work. pic.twitter.com/XPl86HuQqG — Parag Agrawal (@paraga) March 3, 2022 గత రెండేళ్లుగా అనేక కష్టాల నడుమ వర్క్ ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగులు అందరూ ఎంతో కష్టపడి పని చేశారని పరాగ్ వివరించారు. వర్క్ ఫ్రం హోం పద్దతిలో పని విభజన ఎంతో కష్టంగా ఉండేదన్నారు. రెగ్యులర్ మీటింగ్స్ , పార్టీలు కూడా మిస్ అయ్యామంటూ ఉద్యోగుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు పరాగ్. కష్ట కాలంలో ఉన్నో ఇబ్బందులు పడుతూ ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు పరాగ్. చదవండి: Work from Home: ఎందుకండీ వర్క్ ఫ్రం హోం ? ఉద్యోగులకు ఫ్రీడం ఇద్దాం!! -
ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. అలా అందేంటీ ?
Kangana Ranaut Comment On New Twitter CEO: కంగనా రనౌత్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా కూడా మారిన నటి. కానీ కంగనా పని చేయనప్పుడు, ఆమె ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఎప్పుడూ ప్రతిదాని గురించి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది మరియు చాలా తరచుగా తన వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తిస్తుంది. ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సీ స్థానంలో పరాగ్ అగర్వాల్ నియమితులవుతున్నట్లు ప్రకటించినప్పుడు ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఢాకాడ్ నటి ఈ వార్తలపై త్వరగా స్పందించింది మరియు అనేక మంది అభివృద్ధిని మరియు గర్వించదగిన క్షణాన్ని జరుపుకుంటున్నట్లుగా, కంగనా కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా 'బై చాచా జాక్' అని రాసుకొచ్చింది. అయితే ఇంతకుముందు తన అభ్యంతరకరమైన ట్వీట్ల వల్ల ఆమెను ట్విటర్ నుంచి నిషేంధించారు. ఈ కొత్త అధికార మార్పుతో కంగనా మళ్లీ ట్విటర్‌లోకి అడుగుపెడుతుందేమో చూడాలి. ఇటీవల కూడా ఆమె ఒక పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక జంట ఒకరినొకరు తమ చేతుల్లో పట్టుకున్న స్కెచ్‌ను షేర్ చేస్తూ 'నీ కోసమే మేము జీవిస్తున్నాం' అంటూ తన ప్రేమ జీవితం గురించి హింట్ ఇచ్చింది. ఇది చూసిన కంగనా అభిమానులు ఆమె ఎవర్నో ఒకర్ని మిస్ అవుతుందని అనుకుంటున్నారు. అంతకుముందు కూడా తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని, రాబోయే కొన్నేళ్లలో తాను పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలనుకుంటున్నానని పోస్ట్ చేసింది కంగనా. ఇది చదవండి: మిస్టర్ కంగనా రనౌత్ గురించి త్వరలోనే చెబుతా