![Musk Fired A Warning Message To Twitter Ceo Parag Agrawal And Ceo Ned Segal - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/17/Elon%20Musk_Parag%20Agarwal.jpg.webp?itok=k2I9Gut6)
ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్‌ల మధ్య కొనుగోలు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మస్క్‌ను ట్విట్టర్ తరుపు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందారని మస్క్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం లేదంటూ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్విట‍్టర్.. మస్క్‌కు వ్యతిరేకంగా కోర్ట్‌లో దావా వేసింది. ప్రస్తుతం డెలావేర్‌లోని ఛాన్సరీ కోర్టులో దావాపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మస్క్..ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు, సీఎఫ్‌ఓ నెడ్ సెగల్‌కు వ్యక్తిగతంగా మెసేజ్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ట్విట్టర్‌ను కొనుగోలును రద్దు చేయడంపై ఆ సంస్థ తరుపు లాయర్లు.. ఎలాన్ మస్క్‌ను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. మీ లాయర్లు నన్ను ఇబ్బందులు పెట్టేలా ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందుతున్నారని నన్ను అడిగారు. ఇది మంచి పద్దతి కాదంటూ ఆ మెసేజ్‌లో ఎలన్ ప్రస్తావించినట్లు సమాచారం.
చదవండి: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment