శాన్‌ఫ్రాన్సిస్కో: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఇంక్ బోర్డులో చేరనున్నారు. బోర్డులో సీటు కేటాయించేందుకు మస్క్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ట్విటర్ తాజాగా పేర్కొంది. బోర్డు పదవీకాలం 2024 వార్షిక సమావేశంతో ముగియనున్నట్లు తెలియజేసింది.
మస్క్ వ్యక్తిగతంగా లేదా గ్రూప్ సభ్యునిగా కంపెనీలో 14.9 శాతం వాటాను మించి సొంతం చేసుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ట్విటర్‌లో 9 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించిన మర్నాడే బోర్డులో చేరనున్నట్లు వెల్లడికావడం గమనార్హం.
ఇటీవల కొద్ది వారాలుగా మస్క్‌తో చర్చలు నిర్వహించినట్లు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ట్వీట్‌లో ప్రస్తావించారు. మస్క్ బోర్డులో చేరడం ద్వారా మరింత విలువ చేకూరనున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్‌పట్ల అత్యంత విశ్వాసంగల మస్క్ అత్యుత్తమ విమర్శకుడని వ్యాఖ్యానించారు. నిజానికి ఇది దీర్ఘకాలంలో కంపెనీతోపాటు.. బోర్డు బలోపేతానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మస్క్ 3 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా 73.5 మిలియన్ ట్విటర్ షేర్లను కొనుగోలు చేశారు. కాగా.. రానున్న నెలల్లో ట్విటర్‌ను భారీస్థాయిలో మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు మస్క్ ట్వీట్ చేయడం ప్రస్తావించదగ్గ అంశం!
Comments
Please login to add a commentAdd a comment