Twitter CEO Parag Agarwal: కరోనా భయాలు వీడుతుండటంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉన్నా కూడా వ్యాక్సిన్ ఇచ్చిన భరోసా ముందు మరిన్ని వేవ్స్ రావొచ్చన హెచ్చరికలు బలాదూర్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంత కాలం అందరి నోళ్లలో నానుతూ వచ్చిన వర్క్ ఫ్రం హోం ఇకపై ఉంటుందా ? లేక ఉద్యోగులు ఆఫీసులకే రావాలా? అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. వీటికి తొలిసారి తెర దించిన కంపెనీగా ట్విట్టర్ నిలిచింది.
వర్క్ ఫ్రం హోంపై ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కాలం నాటి గడ్డు పరిస్థితులు.. ఆ రోజుల్లో సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులు, భవిష్యత్తు అవసరాలను వివరిస్తూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు లేఖ రాశారు. అందులో వర్క్ ఫ్రం హోం పట్ల కంపెనీ అభిప్రాయాన్ని తేటతెల్లం చేశారు.
వర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేసే విషయంలో మేనేజ్‌మెంట్ అభిప్రాయాన్ని ఉద్యోగులపై రుద్దేందుకు ట్విట్టర్ విముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగుల అభిప్రాయానికే ట్విట్టర్ సీఈవో పరాగ్ పెద్ద పీట వేశారు. ఫ్లెక్సిబుల్ పద్దతికి జై కొట్టారు... ఆఫీసుకి రావడం, పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం చేయడం , కొన్నాళ్లు ఆఫీసు నుంచి కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం ఇలా మూడు ఆప్షన్లు ఉద్యోగులు ఎంచుకోవచ్చంటూ ట్విట్టర్ సీఈవో పరాగ్ ప్రకటించారు.
ఉద్యోగులు ఏ విధానంలో పని చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు. అయితే ఏ పద్దతిలో ఎక్కువ సేఫ్‌గా క్రియేటివ్‌గా, ప్రొడక్టివ్‌గా పని చేయగలమనేదాన్ని ఉద్యోగులే నిర్ణయించుకోవాలన్నారు. పనికి సంబంధించి వర్క్ కల్చర్‌లో తేడాలు ట్రావెల్ ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగులకు సూచించాడు.
Here’s the announcement to the company about our approach and commitment to truly flexible work. pic.twitter.com/XPl86HuQqG
— Parag Agrawal (@paraga) March 3, 2022
గత రెండేళ్లుగా అనేక కష్టాల నడుమ వర్క్ ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగులు అందరూ ఎంతో కష్టపడి పని చేశారని పరాగ్ వివరించారు. వర్క్ ఫ్రం హోం పద్దతిలో పని విభజన ఎంతో కష్టంగా ఉండేదన్నారు. రెగ్యులర్ మీటింగ్స్ , పార్టీలు కూడా మిస్ అయ్యామంటూ ఉద్యోగుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు పరాగ్. కష్ట కాలంలో ఉన్నో ఇబ్బందులు పడుతూ ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు పరాగ్.
చదవండి: Work from Home: ఎందుకండీ వర్క్ ఫ్రం హోం ? ఉద్యోగులకు ఫ్రీడం ఇద్దాం!!
Comments
Please login to add a commentAdd a comment