ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ | On track to achieve 30pc women in workforce by 2030 says Vedanta | Sakshi
Sakshi News home page

ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇస్తున్నాం: వేదాంత

Published Sun, Mar 9 2025 7:01 PM | Last Updated on Sun, Mar 9 2025 7:07 PM

On track to achieve 30pc women in workforce by 2030 says Vedanta

న్యూఢిల్లీ: సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్‌ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది.

అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్‌ జింక్‌ ఉమెన్‌ ఆఫ్‌ జింక్‌ క్యాంపేయిన్‌ ప్రారంభించింది. మెటల్‌ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement