Twitter CEO
-
ఎవరీ లిండా? ట్విటర్ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి?
ట్విటర్ సీఈవోగా లిండా యక్కరినో (Linda Yaccarino) దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాను అనుకుంటున్నట్లుగా ట్విటర్‌ను మరింత లాభదాయంగా మార్చేందుకు లిండా నాయకత్వం అవసరమని మస్క్ భావించినట్లు సమాచారం. కాబట్టే ఆమెను సీఈవోగా నియమించేందుకు మొగ్గు చూపినట్లు పలు నివేదిలకు వెలుగులోకి వచ్చాయి. సీఈవోగా లిండాను ఎంపిక చేయడంపై ఆమెకున్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►లిండా యక్కరినో ఎన్‌బీసీయూ యూనివర్సల్ (NBCUniversal)లో 10 సంవత్సరాలకు పైగా వివిధ విభాగాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా అడ్వటైజింగ్ సేల్స్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. ఆ సంస్థకు చెందిన పికాక్ స్ట్రీమింగ్ సర్వీస్‌లను లాంచ్ చేయడంలో ఆమెదే కీలక పాత్ర. ►వార్నర్ బ్రదర్స్‌కు చెందిన టర్నర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో దాదాపూ 19 ఏళ్ల పాటు సుధీర్ఘంగా పనిచేశారు. నెట్వర్క్ ప్రకటన విక్రయాల కార్యకలాపాలను డిజిటల్ మాద్యమంలో రంగ ప్రవేశం చేయించిన ఘనత లిండాకే దక్కుతుంది ►పెన్ స్టేట్ యూనివర్శిటీలో లిండా లిబరల్ ఆర్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తి చేశారు. ►గత నెలలో మియామీలో జరిగిన అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో యక్కరినో మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. సమావేశంలో, లిండా చప్పట్లతో మస్క్‌ను స్వాగతించారు. అతని పనితీరును ప్రశంసిస్తూనే ‘స్నేహితుడు’, ‘మిత్రుడు’ అని సంబోదిస్తూ అందరికి ఆశ్చర్యానికి గురి చేశారు. ►అయితే, ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు లిండాకు అన్నీ అర్హతలున్నాయి. ఆమె ఎంపిక సరైందేనని యాడ్ ఫోంటెస్ మీడియాలో సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపడుతున్న లౌ పాస్కాలిస్ అన్నారు. లిండాకు ఎలాన్ మస్క్ నాయకత్వంలో పనిచేయాలని ఎందుకు అనిపించిందో అర్ధంకాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్ సంచలనం, నా కొడుకు బ్రెయిన్లో ఈ చిప్‌ను అమర్చుతా? -
ట్విటర్‌కు మహిళా సీఈవో, ఎంపిక చేసిన ఎలాన్ మస్క్.. ఆమె ఎవరంటే?
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ట్విటర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారా? ఆయన స్థానంలో మహిళను సీఈవోగా నియమించనున్నారా? ఆరు నెలలుగా నాన్చుతూ వచ్చిన మస్క్ కొత్త సీఈవో పదవిపై క్లారిటీ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నారు ట్విటర్ బాస్. మరో ఆరు వారాల్లో కొత్త మహిళా సీఈవోని నియమించనున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఆమె ఎవరు? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks! My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops. — Elon Musk (@elonmusk) May 11, 2023 ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఎన్బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటీవ్ లిండా యక్కరినో త్వరలో ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. నియామకంపై ఆమెను సంప్రదించగా.. వివరణ ఇవ్వలేదు. రూ.3.37లక్షల కోట్లు పెట్టి.. గత ఏడాది మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసింది. నాటి నుంచి ట్విటర్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఒకానొక సమయంలో సంస్థలోని మార్పులు కారణంగా ఆఫీస్‌లోనే నిద్రపోవాల్సి వస్తుంది అంటూ వర్క్‌పై తన డెడికేషన్ ఎలా ఉందో చెప్పకనే చెప్పారు. సీఈవో పదవి నుంచి వైదొలగాలా? మార్పులు చేర్పులు కొనసాగుతుండగా.. డిసెంబర్ నెలలో మస్క్ చేసిన ట్విట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాను ట్విటర్ సీఈవో పదవి నుంచి వైదొలగాలా? అని నెటిజన్లను ప్రశ్నించగా.. అందుకు 57.5 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ఆ పోల్ దెబ్బకు ట్విటర్ 50 శాతానికి పైగా నష్టపోయింది. Should I step down as head of Twitter? I will abide by the results of this poll. — Elon Musk (@elonmusk) December 18, 2022 చర్చాంశనీయంగా ఎలాన్ మస్క్ ప్రకటన 2022 ప్రారంభం నుండి రోజువారీ వినియోగదారులలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రకటనలలు భారీగా తగ్గాయి. ఫలితంగా అక్టోబర్ నుండి ట్విటర్ ఆదాయం 50శాతానికి తగ్గిందని మస్క్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పాటు ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అట్టర్ ప్లాప్ అయ్యింది. వేలాది ఉద్యోగులను తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గతంలో నిషేధించబడిన ఖాతాలను తిరిగి రావడానికి అనుమతించారు. ఇలా ట్విటర్ స్వరూపాన్ని మార్చేసిన మస్క్ తాజాగా కొత్త సీఈవోని తెస్తున్నట్లు ప్రకటన చేయడం చర్చానీయాంశంగా మారింది. చదవండి👉 ‘నిద్ర పోండి..సంపాదించండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం! -
టీమిండియా క్రికెటర్లకు షాక్ ఇచ్చిన మస్క్ మామ
-
సెలబ్రిటీలకు షాకిచ్చిన ఎలన్ మస్క్
-
ఏఐ పై ఎలాన్ మస్క్ ఆందోళన, త్వరలో ‘ట్రూత్‌జీపీటీ’...
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాటింగ్ టెక్నాలజీ పెరిగిపోతుండడం పట్ల ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కార్లు, రాకెట్ల కంటే ఏఐ మరింత ప్రమాదకరం. దీనివల్ల మానవాళికి ముప్పు తప్పదు. మానవాళిని నిర్వీర్యం చేసే శక్తి ఏఐకి ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దానికి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’ పేరిట సొంత చాట్‌బాట్ తెస్తామన్నారు. మానవాళిని ధ్వంసం చేసే టెక్నాలజీ వద్దని, అర్థం చేసుకొనేది కావాలని అన్నారు. కృత్రిమ మేధను నియంత్రించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించారు. -
ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం... ట్విట్టర్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం
-
మోదీ వివాదాస్పద వ్యక్తి!: మస్క్‌తో కలిపి ఒకేగాటన కట్టిన చాట్‌జీపీటీ
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీని ‘వివాదాస్పద వ్యక్తి’గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ పేర్కొంది! ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను ‘అత్యంత వివాదాస్పద వ్యక్తి’గా అది ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖుల్లో వివాదాస్పదుల జాబితాను చాట్‌జీపీటీ తాజాగా వెల్లడించింది. అందులో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితరులున్నారు. వీరందరినీ ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా చాట్‌జీపీటీ పేర్కొనడం విశేషం. వివాదాస్పదులు కాని వారి జాబితాలో అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, మాక్రాన్, కుబేరులు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ తదితరులను పేర్కొంది. -
Layoffs: ట్విటర్లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా మరికొంత మంది ఉద్యోగులను తొలగించిందని ‘ది ఇన్ఫర్మేషన్’ అనే వార్తా వెబ్సైట్ నివేదించింది. భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసేసి ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని చెప్పడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. ఈసారి సేల్స్ టీమ్ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు నివేదికను సూచించింది. అయితే ఎంతమందిని తొలగించింది స్పష్టత లేనప్పటికీ నెల రోజుల్లోనే ట్విటర్ సుమారు 800 మంది సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. గతేడాది చివర్లో భారత్‌లో దాదాపు 200 మందికిపైగా ఉన్న తమ సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన ట్విటర్ న్యూఢిల్లీ, ముంబైలోని కార్యాలయాలను మూసివేసినట్లు తెలిసిందే. దేశ దక్షిణ టెక్ హబ్‌గా పేర్కొనే ఇంజనీర్లు ఎక్కువగా ఉండే బెంగళూరులోని కార్యాలయాన్ని మాత్రం కొనసాగిస్తోంది. సీఈవో ఎలాన్ మస్క్ 2023 చివరి నాటికి ట్విటర్‌ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తొలగిస్తూ కార్యాలయాలను మూసివేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ రంగంలో మెటా (ఫేస్బుక్), ఆల్ఫాబెట్ (గూగుల్) వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు దీర్ఘకాలిక వ్యూహాలతో దూసుకెళ్తుంటే ఎలాన్ మస్క్ చర్యలు మాత్రం విస్మయాన్ని కలిగిస్తున్నాయి. -
భారత్‌లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
ట్విటర్ కొత్త సీఈవోగా ఆమె! మస్క్‌కు థ్యాంక్స్, కానీ..
న్యూయార్క్: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు ఎలన్ మస్క్. దీంతో ట్విటర్ బాస్‌గా బాధ్యతలు మూణ్ణాళ్ల ముచ్చటేనా? అనే ప్రశ్న, ఒకవేళ అదే నిజమైతే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చా జోరందుకుంది. ఈలోపు తనను సీఈవోగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలంటూ ఒకావిడ చేసిన ట్వీట్.. ఈ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్‌కు కారణమైంది. బెస్ కాల్బ్(35).. తనకు ట్విటర్ కొత్త సీఈవోగా అవకాశం ఇచ్చినందుకు ఎలన్ మస్క్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు తాము(ఎలన్ మస్క్) కలుసుకోనేలేదని, ఈ పరిణామం తనకు ఆశ్చర్యం కలిగిందని చెబుతూనే.. సీఈవో బాధ్యతలను తాను ఒక గౌరవంగా భావిస్తానని పోస్ట్ చేసింది. ఆపై వరుసగా ఐదు పోస్టులు చేశారామె. అంతేకాదు..ఆపై మొదటి రోజు బాధ్యతలు నిర్వర్తించానని, అద్భుతంగా ఉందని పోస్ట్ కూడా చేసింది. అయితే.. Can finally announce: I am humbled, honored, and frankly still in shock to be the new CEO of @twitter. Though we haven't always seen eye to eye (Edgelord memes! Verification fiasco! The "sink" joke being the full extent of his business plan!) I am thrilled @elonmusk took a chan— Bess Kalb (@bessbell) December 21, 2022 బెస్ కాల్బ్.. ఎవరో కాదు. పాపులర్ టీవీ షో ‘జిమ్మీ కుమ్మెల్’కు స్క్రిప్ట్ రైటర్. ఎమ్మీ అవార్డుకు సైతం నామినేట్ అయ్యారామె. హ్యూమర్‌తో కూడిన రైటింగ్‌కు ఆమె పెట్టింది పేరు. దీంతో ఆమె సరదాగా, వ్యంగ్యంగా అలా ట్వీట్లు చేసి ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆమె ఎలన్ మస్క్‌ను విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. Whether he has failed to rescue people from a cave and then called the actual rescuer a pedophile, sent CPAP machines to hospitals instead of direly needed ventilators, or spent $44 billion to ruin his reputation and legacy, @elonmusk has always been on the forefront of— Bess Kalb (@bessbell) December 21, 2022 ఇక కొత్త సీఈవో బాధ్యతలపైనా తొలుత సరదాగా స్పందించిన మస్క్.. ఆ తర్వాత సీరియస్‌గా సమాధానం ఇచ్చారు. తాము కేవలం సీఈవోగా గురించి వెతకడం లేదని.. బాధ్యతతో ట్విటర్‌ను నిలబెట్టే వ్యక్తి కోసం వెతుకుతున్నామని తెలిపారు. మరోవైపు ట్విటర్ కొత్త సీఈవో కోసం వేటలో ఆ సంస్థ ఉన్నట్లు అనధికార సమాచారం. I will resign as CEO as soon as I find someone foolish enough to take the job! After that, I will just run the software & servers teams. — Elon Musk (@elonmusk) December 21, 2022 -
మస్క్... నువ్వు మాకొద్దు!
వాషింగ్టన్: సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. ‘ ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా ?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్’ చెబుతూ ఓట్లు వేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఓటింగ్ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. మస్క్ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని సీఎన్ఎన్ పేర్కొంది. ఓటింగ్ ఫలితంపై మస్క్ ఇంకా స్పందించలేదు. దాదాపు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతుండటం తెల్సిందే. భారీగా సిబ్బంది కోతలకు సిద్దమవడం, ఎక్కువ గంటలు చెమటోడ్చి పనిచేయాలని ఒత్తిడి తేవడం వంటి నిర్ణయాలతో మస్క్ పేరు చెబితేనే ట్విటర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ట్విటర్ విధానపర నిర్ణయాల్లో మార్పులపైనా ఆన్లైన్ ఓటింగ్ చేపడతానని మస్క్ ప్రకటించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, మాస్టోడోన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ వంటి ఇతర సోషల్‌మీడియా సంస్థల ఖాతాలకు వాడుతున్న అవే యూజర్ఐడీలతో కొనసాగుతున్న/అనుసంధానమైన ట్విట్టర్ ఖాతాలను తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నన్ను ఫాలో అవ్వండి’, ‘ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చెక్ చేయండి’ వంటి వాటికీ ట్విట్టర్ చెక్ పెట్టనుంది. -
అయ్యో! ఇది అసలు ఊహించలేదు.. ట్విటర్ చీఫ్‌గా తప్పుకోనున్న ఎలాన్ మస్క్?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్వీట్ చేసినా సరే అది సంచలనంగా మారుతుంది. అనుహ్య పరిణామాల నడుమ మస్క్ ట్విటర్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ట్వీటర్ సంస్థలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు మస్క్. మరో వైపు తన నిర్ణయాలకు సంబంధించి ట్విటర్ పోలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వాటిలో కొన్నింటిని ఈ పోలింగ్ ద్వారానే తీసుకోవడం గమనార్హం. తాజాగా ఎలాన్ మస్క్ మరో సంచలన ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ట్విటర్ నుంచి తప్పుకోమంటారా? ఎలాన్ మస్క్ ఇటీవల ఈ పేరు వార్తల్లో విపరీతంగా వినపడుతోంది. ట్విటర్ సీఈఓగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి అందులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ సంస్థ భవిష్యత్తుపై నీలనీడలు కమ్ముకుంటున్నాయి. ఇదిలా ఉండగాఈ ఏడాదిలో ఏకంగా 107 బిలియన్ డాలర్లు అంటే రూ.8.84 లక్షల కోట్లను కోల్పోయి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు మస్క్. ఇన్నీ అనుహ్య సమస్యలతో సతమవుతున్న మస్క్ తాజాగా మరో ట్వీట్‌తో నెటిజన్ల ముందుకు వచ్చారు. అందులో .. తాను ట్విటర్ చీఫ్‌గా కొనసాగాలా వద్దా అని పోలింగ్ పెట్టారు. వచ్చే ఫలితాలు ఏవైనా తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ పోలింగ్‌లో దాదాపు 58 శాతం మంది మస్క్ చీఫ్‌గా తప్పుకోవాలని ఓటు వేశారు. దీనిపై స్పందిస్తూ కొందరు నెటిజన్లు అయ్యా ఎలాన్ మస్క్ చేసిన అరాచకాలు చాలు ఇక దయ చెయ్ అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ట్వీటర్‌తో ఆటలాడకు తొందరగా తప్పుకోవాలని కామెంట్ చేశాడు. అయితే ఈ ఫలితాన్ని మస్క్ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. Should I step down as head of Twitter? I will abide by the results of this poll. — Elon Musk (@elonmusk) December 18, 2022 చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే
న్యూయార్క్: అంతర్జాల ప్రపంచంలో అత్యంత ఆసక్తిదాయకమైన వేదిక అంటూ ఏదైనా ఉందంటే అది ట్విట్టర్ మాత్రమేనని ఆ సంస్థ నూతన అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ ఖాతా అధీకృతమైనదని తేల్చి చెప్పే ‘బ్లూ’ టిక్ గుర్తు సదుపాయంతో కొనసాగే ప్రీమియం ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్ల రుసుము అమలుచేయాలన్న ఆలోచనల నడుమ తన ట్విట్టర్ సంస్థ ప్రాధాన్యతను మస్క్ గుర్తుచేశారు. ‘ ట్విట్టర్ అనేది ఇంటర్నెట్లో అత్యంత ఇంట్రెస్టింట్ ప్లేస్. అందుకే నేను చేసిన ఈ ట్వీట్‌ను వెంటనే ఇప్పటికిప్పుడే చదివేస్తున్నారు’అని అన్నారు. ‘బ్లూ టిక్కు చార్జ్ చేస్తే అత్యంత క్రియాశీలకమైన వ్యక్తులు ఇకపై ట్విట్టర్‌ను వదిలేస్తారు. డబ్బులు రాబట్టేందుకు మీడియా, వ్యాపార సంస్థలే ఖాతాలు కొనసాగిస్తాయి. చివరకు ట్విట్టర్ ఒక బిల్బోర్డ్లాగా తయారవుతుంది’ అని బ్లూ టిక్ యూజర్ కస్తూరి శంకర్ ట్వీట్ చేశారు. ‘ తాము ఏ(సెలబ్రిటీ) ఖాతాను ఫాలో అవుతున్నామో సాధారణ యూజర్లకు తెలుసు. ప్రత్యేకంగా బ్లూ టిక్ అక్కర్లేదు’ అని మరొకరు ఎద్దేవాచేశారు. -
Twitter: మస్క్ ఎంట్రీ.. సీఈఓ ఔట్!
సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ ఎట్టకేలకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతమైంది. కొన్ని నెలలుగా సాగదీతకు గురైన డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు మస్క్.. ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఇక ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరావడంతో ఆయన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. ఇతర కార్యనిర్వాహక సభ్యులను కూడా తొలగించారు. మొత్తంమీద ట్విటర్ కొనుగోలు ప్రక్రియ సందిగ్దంలో పడటంతో కంపెనీ వ్యాపార వ్యవహరాలపై ఆ మేరకు ప్రభావం పడింది. దాంతోపాటు ఉద్యోగులు, వాటాదారుల్లో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ ప్రక్రియ ముగియడంతో పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: సీసీఐ జరిమానాలపై తదుపరి చర్యలు పరిశీలిస్తున్నాం: గూగుల్) నాటకీయ పరిణామాలు ఏప్రిల్ నెలలో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, స్పామ్, నకిలీ బాట్ అకౌంట్ల సంఖ్యను ట్విటర్ తప్పుగా చూపించిందని ఆరోపిస్తూ ఆయన వెనక్కి తగ్గారు. దీంతో ట్విటర్ దావాకు వెళ్లడం.. ఆ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లతో ఈ డీల్ గట్టెక్కదని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మస్క్ మనసు మార్చుకుని లైన్లోకి వచ్చారు. మరోవైపు ట్విటర్ కొనుగోలు ప్రక్రియ పూర్తవడానికి ముందు ఆయన విభిన్న రీతిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సింక్‌ను మోసుకెళ్తూ లోనికి ఎంట్రీ ఇచ్చారు. ‘లెట్ ద సింక్ ఇన్’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డీల్ ఓకే అయిందని సూచిస్తూ ఆయన సింక్‌ను మోసుకెళ్లారని కొందరు అంటుంటే.. తేడా కొడితే మునిగిపోవడం ఖాయం అంటూ ట్వీట్ చేశారని మరికొందరు కామెంట్ చేశారు. (చదవండి: మస్క్‌కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్?) -
ఈలాన్‌మస్క్ వర్సెస్ పరాగ్.. ట్విటర్లో ముదురుతున్న వివాదం
Elon Musk Vs Parag Agrawal: ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ ప్రపంచ కుబేరుడు ఈలాన్మస్క్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఆది నుంచి ట్విటర్ మేనేజ్మెంట్పై విమర్శలు, విసుర్లతో విరుచుకుపడుతున్నాడు ఈలాన్ మస్క్. అలా వ్యవహరిస్తూనే ఏకమొత్తంగా ట్విటర్ కొనుగోలుకు ముందుకు వచ్చాడు. రేపో మాపో ట్విటర్ ఈలాన్ మస్క్ సొంతమవుతుందని తెలిసినా ప్రస్తుత ఈసీవో పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవంటూ ఆ సంస్థ మేనేజ్మెంట్ చెప్పిన వివరాలపై ఈలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో స్పస్టత రాని పక్షంలో ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయం పునరాలోచించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చిరకాలు జారీ చేశాడు. ట్విటర్ కొనుగోలు డీల్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించినా పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. తమ టీమ్ ఫేక్/స్పాన్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతం శ్రమిస్తుందని చెబుతున్నారు. ఫేక్ అకౌంట్లను సృష్టించేది మనిషో/ లేక యంత్రమో కాదు. ఈ రెండు కలిసి అధునాతన పద్దతుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులుజిత్తులు వేస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. మా శాయశక్తుల వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ విషయంలో ఎవరికో సందేహాలు ఉన్నాయని ఫేక్ అకౌంట్ల నిగ్గు తేల్చేందుకు బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని పని అంటూ పరాగ్ అగర్వాల్ తేల్చి చెప్పాడు. Let’s talk about spam. And let’s do so with the benefit of data, facts, and context… — Parag Agrawal (@paraga) May 16, 2022 ట్విటర్లో స్పామ్ అకౌంట్ల ఎన్ని ఉన్నాయనేది నిర్థారించేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ అనేక ట్వీట్లు చేశాడు పరాగ్ అగ్రవాల్. అయితే వాటన్నింటికి వ్యంగంగా కామెడీ చేసే ఓ ఈమోజీని రిప్లైగా ఇస్తూ మరింత వెటకారం చేశారు ఈలాన్ మస్క్. పరాగ్ అగ్రవాల్, ఈలాన్ మస్క్ వివాదంపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ట్విటర్ కనుక పారదర్శకంగా ఉండాలనుకుంటే స్పామ్ అకౌంట్ల విషయంలో బయటి వాళ్ల చేత వెరిఫై చేయించాలంటున్నారు చాలా మంది. మరికొందరు ట్విటర్ సీఈవోను ఈలాన్ మస్క్ దారుణంగా అవమానిస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు -
ట్విటర్లో భారీ కుదుపు.. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకి ఉద్వాసన
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ పేరు నెల రోజులుగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ కంపెనీ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. త్వరలోనే ఈలాన్ మస్క్ చేతిలోకి ఈ సంస్థ వెళ్లనుండగా టాప్ మేనేజ్మెంట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను బయటకు సాగనంపారు. దయచేసి వెళ్లిపోండి ఈలాన్ మస్క్ భారీ డీల్‌తో ట్విటర్‌ను సొంతం చేసుకుంది మొదలు వరుసగా ఏదో ఘటన ఆ సంస్థలో జరుగుతూనే ఉంది. ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్‌ను బయటకు పంపుతారని, పాలసీ హెడ్ గద్దె విజయకు ఎగ్జిట్ తప్పదంటూ వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటీవ్ బెక్పూర్ని సంస్థను వీడ వెళ్లాల్సిందిగా సీఈవో పరాగ్ అగర్వాల్ కోరాడు. అదే విధంగా రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్‌ను పక్కన పెట్టారు. ఊహించలేదు ట్విటర్ సీఈవో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడంటూ బెక్‌పూర్ వాపోయాడు. ఇంత కాలంలో ట్విటర్లో పని చేసినందుకు, సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ బెక్‌పూర్ ట్వీట్ చేశాడు. ట్విటర్‌ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు బెక్‌పూర్. While I’m disappointed, I take solace in a few things: I am INSANELY proud of what our collective team achieved over the last few years, and my own contribution to this journey. — Kayvon Beykpour (@kayvz) May 12, 2022 బ్రూస్ ఫలాక్ కూడా మరోవైపు ట్విటర్ రెవెన్యూ హెడ్‌గా బ్రూస్ ఫలాక్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్టు తొలుత ట్విటర్లో ప్రకటించారు. అయితే ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించినా ఫలాక్‌ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్కి అప్పగించారు. ఇకపై ప్రొడక్ట్ హెడ్‌గా జే సల్లివాన్ బాధ్యతలు నిర్వర్తిసారు. రెవెన్యూ హెడ్‌గా మరొకరు వచ్చే వరకు ఆ బాధ్యతలకు ఇంఛార్జీగా ఉంటారు. I wanted to take a moment to thank all the teams and partners I’ve been lucky enough to work with during the past 5 years. Building and running these businesses is a team sport — bruce.falck() 🦗 (@boo) May 12, 2022 సమర్థుడు ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపుపై సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. సరైన సమయంలో సరైన లీడర్లు వస్తారని చెప్పారు. ప్రొడక్ట్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన సల్లివాన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో అత్యంత సమర్థుడంటూ పరాగ్ కొనియాడారు. చదవండి: Elon Musk: నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్ ట్వీట్‌కి కారణం ఇదే! -
ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్!
అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు అంశంలో ప్రతి సీను ఓ సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా ట్విటర్లో అధిక స్టేక్‌ను కొనుగోలు చేయడం దగ్గర నుంచి..ఆ సంస్థ ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగింపు వరకు ఇలా ప్రతి సందర్భం వ్యాపార దిగ్గజాల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. అయితే తాజాగా ట్విటర్లో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ట్విటర్ కొనుగోలులో..ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య వినీతా అగర్వాల్ కీ రోల్ ప్లే చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదెలా అంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా మెన్లో పార్క్ కేంద్రంగా ఆండ్రీసీన్ హోరోవిట్జ్ అనే సంస్థ వెంచర్ క్యాప్టలిస్ట్ (వీసీ)గా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే మెటాకు భారీ ఎత్తున ఆండ్రీసీన్ హోరోవిట్జ్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అదే సంస్థ ..ట్విటర్‌ను టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్‌కు 400 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. అయితే ట్విటర్లో పెట్టుబడుల అంశంపై వినీతా అగర్వాల్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆండ్రీసీన్ హోరోవిట్జ్‌కు వినీతా అగర్వాల్ జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. దీంతో పాటు డ్రగ్స్ డెవలప్మెంట్, లైఫ్ సైసెన్స్ టూల్స్, డయోగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్, రోగి సంరక్షణ కోసం ప్రత్యేక డేటాసెట్ లు వంటి హెల్త్ కేర్ విభాగంగా పెట్టుబడులు పెట్టే అంశంలో ముఖ్యపాత్రపోషిస్తున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడంలో ఆర్ధికంగా ఆండ్రీసీన్ హోరోవిట్జ్‌కు సాయం చేస్తుండడం, ఆ సంస్థకు జనరల్ పార్ట్నర్గా వినీతా అగర్వాల్ ఉండడం' ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిగ్గా మారింది. ట్విటర్ కొనుగోలులో ఎలన్‌మస్క్‌కు ఆర్ధికంగా సాయం చేయడంతో వినీతా అగర్వాల్ వార్తల్లో నిలుస్తున్నారు. చదవండి👉మస్క్ ట్విటర్ కొనుగోలు: రాజుగారి ట్యూన్ ఇలా మారిందేంటబ్బా! -
Parag Agrawal: పరాగ్ అగర్వాల్ తొలగింపు ఖాయం
ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ తొలగింపు దాదాపు ఖాయమైంది!. ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఈ మేరకు యూకేకు చెందిన న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అటుపై ఉద్యోగులతో జరిగిన ఇంటెరాక్షన్‌లో ట్విటర్ భవితవ్యంపై ట్విటర్ సీఈవో పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదన్న పరాగ్.. సోషల్ మీడియా దిగ్గజం మాత్రం అనిశ్చితిలోకి అడుగుపెట్టిందని మాత్రం సంచలన కామెంట్లు చేశాడు. దీంతో పరాగ్ ఉంటాడా? ఉద్వాసనకు గురవుతాడా? అనే దానిపై విపరీతమైన చర్చ జరిగింది. అయితే తన గురించి బెంగ పడొద్దని, కంపెనీ మెరుగ్గా పని చేస్తే చాలంటూ కొందరి ట్వీట్లకు నేరుగా బదులిచ్చాడు పరాగ్. అయితే.. ట్విటర్ మేనేజ్మెంట్పై తనకు ఎలాంటి విశ్వాసం లేదంటూ ఇంతకు ముందు నేరుగా ట్విటర్ చైర్మన్ బ్రెట్టేలర్ వద్దే ఎలన్ మస్క్ ప్రస్తావించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో మార్పు తప్పదనే సంకేతాలను స్పష్టంగా పంపించాడు. బోర్డు సభ్యులతో పాటు షేర్ హోల్డర్స్‌కు దక్కుతున్న ప్రతిఫలాలపై భారీ కోత విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఎలన్ మస్క్ తేల్చేశాడు. ఇక ట్విటర్లో కీలక పదవులతో మార్పులుంటాయని చెప్పిన ఆయన.. ఆ మార్పు ఎలా ఉండబోతోంది? అయితే కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టేది ఎవరు? లాంటి ప్రశ్నలపై మాత్రం ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. కిందటి ఏడాది నవంబర్లోనే పరాగ్ అగర్వాల్.. ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. పరాగ్ తొలగింపు దాదాపు ఖాయమైన తరుణంలో.. ఆయనకు ఒప్పందం ప్రకారం 42 మిలియన్ డాలర్ల చెల్లించాల్సి వస్తుంది ట్విటర్. ఎలన్ మస్క్ అధికారికంగా ట్విటర్ చేజిక్కించుకున్న ప్రకటన తర్వాత.. ఉద్యోగులతో పరాగ్ అగర్వాల్ అంతర్గత సమావేశం జరపడం పట్ల బోర్డు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక పూర్తిస్థాయిలో ట్విటర్ ఎలన్ మస్క్ చేతికి వెళ్లడానికి ఇంకా ఆరునెలల టైం ఉంది. చదవండి: పరాగ్ తర్వాత మరో ఇండియన్ లేడికి ఎసరు? -
ఎలన్ మస్క్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్ సీఈవో
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చర్యలు ఊహాతీతం. నాటుగా చెప్పాలంటే తిక్కతిక్కగా అతని ప్రవర్తన కనిపిస్తున్నా ప్రతీదానికి ఓ కచ్చితమైన లెక్క ఉంటుంది. అందుకే అతనితో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగ్రావాల్. మీకు ఎడిట్ బటన్ కావాలా అంటూ ట్విట్టర్లో 2022 ఏప్రిల్ 5న పోల్ పెట్టారు ఎలన్ మస్క్. పోల్ ప్రారంభించడం ఆలస్యం వేలాదిగా యూజర్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఎడిట్ బటన్ ఉండాలని చెప్పగా మరికొందరు ఎడిట్ బటన్‌తో మజా పోతుందంటున్నారు. అయితే ఈ ట్వీట్ ఎలన్ మస్క్ నుంచి వచ్చిన గంట సేపటికే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ స్పందించారు. ఎలన్ మస్క్ నిర్వహించే పోల్, ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి జాగ్రత్తగా పోల్ చేయండి అంటూ పరాగ్ అగ్రావాల్ తెలిపారు. ఈ మేరకు ఎలన్ మస్క్ పోల్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ కామెంట్ జత చేశారు. ఎందుకంటే ఎలన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్లో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. మూడో కంటికి తెలియకుండా ట్విట్టర్లో 9.2 శాతం వాటాలు చేజిక్కించుకున్నారు. 2022 మార్చి 24న నిర్వహించిన పోల్‌లో ఫ్రీ స్పీచ్ స్ఫూర్తికి ట్విట్టర్ కట్టుబడి ఉందా అంటూ ఎలన్ మస్క్ ప్రశ్నించారు. ఆ తర్వాత వెంటనే ట్విట్టర్ లాంటి మరో ప్లాట్‌ఫామ్ అవసరమా అంటూ నెటిజన్లు కోరాడు. ఈ రెండు పోల్స్ నిర్వహించిన రెండు వారాల వ్యవధిలోనే ట్విట్టర్లో మేజర్ షేర్ హోల్డర్‌గా అవతరించాడు ఎలన్‌మస్క్. ఎలన్ మస్క్ చేసే కామెంట్స్ పైకి సరదాగా అనిపించినా ప్రతీ చర్య వెనుక మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంటుంది. అందువల్లే ట్విట్టర్లో ఎడిట్ ఫీచర్‌పై ఎలన్ మస్క్ పెట్టిన పోల్‌లో ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పరాగ్ అగ్రావాల్ యూజర్లను కోరారు. కాగా ఇప్పటికే ఎడిట్ బటన్‌పై ట్విట్టర్ వర్క్ చేస్తోంది. The consequences of this poll will be important. Please vote carefully. https://t.co/UDJIvznALB — Parag Agrawal (@paraga) April 5, 2022 చదవండి: ఎలన్ మస్క్ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్‌పై కాసులవర్షం..! -
వర్క్ ఫ్రం హోంపై ట్విట్టర్ సంచలన నిర్ణయం ! ఇకపై..
Twitter CEO Parag Agarwal: కరోనా భయాలు వీడుతుండటంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉన్నా కూడా వ్యాక్సిన్ ఇచ్చిన భరోసా ముందు మరిన్ని వేవ్స్ రావొచ్చన హెచ్చరికలు బలాదూర్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంత కాలం అందరి నోళ్లలో నానుతూ వచ్చిన వర్క్ ఫ్రం హోం ఇకపై ఉంటుందా ? లేక ఉద్యోగులు ఆఫీసులకే రావాలా? అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. వీటికి తొలిసారి తెర దించిన కంపెనీగా ట్విట్టర్ నిలిచింది. వర్క్ ఫ్రం హోంపై ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కాలం నాటి గడ్డు పరిస్థితులు.. ఆ రోజుల్లో సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులు, భవిష్యత్తు అవసరాలను వివరిస్తూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు లేఖ రాశారు. అందులో వర్క్ ఫ్రం హోం పట్ల కంపెనీ అభిప్రాయాన్ని తేటతెల్లం చేశారు. వర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేసే విషయంలో మేనేజ్మెంట్ అభిప్రాయాన్ని ఉద్యోగులపై రుద్దేందుకు ట్విట్టర్ విముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగుల అభిప్రాయానికే ట్విట్టర్ సీఈవో పరాగ్ పెద్ద పీట వేశారు. ఫ్లెక్సిబుల్ పద్దతికి జై కొట్టారు... ఆఫీసుకి రావడం, పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం చేయడం , కొన్నాళ్లు ఆఫీసు నుంచి కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం ఇలా మూడు ఆప్షన్లు ఉద్యోగులు ఎంచుకోవచ్చంటూ ట్విట్టర్ సీఈవో పరాగ్ ప్రకటించారు. ఉద్యోగులు ఏ విధానంలో పని చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు. అయితే ఏ పద్దతిలో ఎక్కువ సేఫ్‌గా క్రియేటివ్‌గా, ప్రొడక్టివ్‌గా పని చేయగలమనేదాన్ని ఉద్యోగులే నిర్ణయించుకోవాలన్నారు. పనికి సంబంధించి వర్క్ కల్చర్‌లో తేడాలు ట్రావెల్ ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగులకు సూచించాడు. Here’s the announcement to the company about our approach and commitment to truly flexible work. pic.twitter.com/XPl86HuQqG — Parag Agrawal (@paraga) March 3, 2022 గత రెండేళ్లుగా అనేక కష్టాల నడుమ వర్క్ ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగులు అందరూ ఎంతో కష్టపడి పని చేశారని పరాగ్ వివరించారు. వర్క్ ఫ్రం హోం పద్దతిలో పని విభజన ఎంతో కష్టంగా ఉండేదన్నారు. రెగ్యులర్ మీటింగ్స్ , పార్టీలు కూడా మిస్ అయ్యామంటూ ఉద్యోగుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు పరాగ్. కష్ట కాలంలో ఉన్నో ఇబ్బందులు పడుతూ ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు పరాగ్. చదవండి: Work from Home: ఎందుకండీ వర్క్ ఫ్రం హోం ? ఉద్యోగులకు ఫ్రీడం ఇద్దాం!! -
Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్.. రచ్చ
ట్విటర్ సీఈవోగా ఒక భారతీయుడు ఎంపిక కావడంపై మన దేశంలోనే కాదు.. మేధావి వర్గం నుంచీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా జాక్ డోర్సే తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో స్వతహాగా ఇలాంటి అంశాల్లో తల దూర్చే ఎలన్ మస్క్.. ఓ ట్వీట్ చేసి కాక రేపాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ఓ ఫొటో ట్వీట్ చేశాడు. అది ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ ఫొటో. పై ఫ్రేమ్‌లో యూఎస్ఎస్ఆర్ నియంత జోసెఫ్ స్టాలిన్, స్టాలిన్ అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.. పక్కపక్కనే ఉంటారు. కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్ ఫొటో మాత్రమే ఉంటుంది. అందుకు కారణం ఉంది. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న నికోలాయ్-స్టాలిన్ మధ్య.. రాజకీయ పరిణామాలతో వైరం మొదలవుతుంది. ఈ తరుణంలో స్టాలిన్ ఆదేశాల మేరకే నికోలాయ్ హత్య కూడా జరిగిందని చెప్తారు. ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌షిప్‌కు గురైంది. అలా స్టాలిన్ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు. అయితే ఈ సీరియస్ అంశాన్ని.. తర్వాతి రోజుల్లో సరదా కోణంలో వాడేసుకుంటున్నారు కొందరు. ఇక మస్క్ దానిని మరీ మించి వాడేశాడు. స్టాలిన్ బాడీకి ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ తలను, నికోలాయ్ బాడీకి ట్విటర్ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు. పైగా రెండో టెంప్లేట్లో డోర్సే పక్కనే ఉన్న కాలువలోకి విసిరివేయబడ్డట్లు ఫన్నీ కోణంలో ఉంది. దీంతో నెటిజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. అదే టైంలో మస్క్‌కు తగ్గట్లుగానే కౌంటర్ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. pic.twitter.com/OL2hnKngTx — Elon Musk (@elonmusk) December 1, 2021 ఇదిలా ఉంటే ఎలన్ మస్క్‌కు, జాక్ డోర్సేకు మాంచి స్నేహం ఉంది. ఇద్దరూ క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడమే కాదు.. గంజాయి ప్రియులు కూడా అంటూ గతంలో బోలెడు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు కిందటి ఏడాది జాక్ ట్విటర్ సీఈవో పదవికి గండం ఏర్పడినప్పుడు.. జాక్కి మద్దతుగా నిలిచాడు కూడా. Just want say that I support @Jack as Twitter CEO. He has a good ❤️. — Elon Musk (@elonmusk) March 3, 2020 pic.twitter.com/IYAQasGJg3 — Patel Meet (@mn_google) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 ఇదీ చదవండి: పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఏమన్నాడంటే.. -
ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. అలా అందేంటీ ?
Kangana Ranaut Comment On New Twitter CEO: కంగనా రనౌత్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా కూడా మారిన నటి. కానీ కంగనా పని చేయనప్పుడు, ఆమె ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఎప్పుడూ ప్రతిదాని గురించి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది మరియు చాలా తరచుగా తన వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తిస్తుంది. ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సీ స్థానంలో పరాగ్ అగర్వాల్ నియమితులవుతున్నట్లు ప్రకటించినప్పుడు ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఢాకాడ్ నటి ఈ వార్తలపై త్వరగా స్పందించింది మరియు అనేక మంది అభివృద్ధిని మరియు గర్వించదగిన క్షణాన్ని జరుపుకుంటున్నట్లుగా, కంగనా కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా 'బై చాచా జాక్' అని రాసుకొచ్చింది. అయితే ఇంతకుముందు తన అభ్యంతరకరమైన ట్వీట్ల వల్ల ఆమెను ట్విటర్ నుంచి నిషేంధించారు. ఈ కొత్త అధికార మార్పుతో కంగనా మళ్లీ ట్విటర్‌లోకి అడుగుపెడుతుందేమో చూడాలి. ఇటీవల కూడా ఆమె ఒక పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక జంట ఒకరినొకరు తమ చేతుల్లో పట్టుకున్న స్కెచ్‌ను షేర్ చేస్తూ 'నీ కోసమే మేము జీవిస్తున్నాం' అంటూ తన ప్రేమ జీవితం గురించి హింట్ ఇచ్చింది. ఇది చూసిన కంగనా అభిమానులు ఆమె ఎవర్నో ఒకర్ని మిస్ అవుతుందని అనుకుంటున్నారు. అంతకుముందు కూడా తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని, రాబోయే కొన్నేళ్లలో తాను పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలనుకుంటున్నానని పోస్ట్ చేసింది కంగనా. ఇది చదవండి: మిస్టర్ కంగనా రనౌత్ గురించి త్వరలోనే చెబుతా -
ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు క్రికెట్ అంటే పిచ్చి
Twitter CEO Parag Agrawal Huge Cricket Fan.. ట్విటర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికైనప్పటి నుంచి నెటిజన్లు ఆయన కోసం గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరాగ్ గురించి ఆసక్తికర ఫోటోలు, విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 29న జాక్ డోర్సీ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాల్‌కు క్రికెట్ అంటే ప్రాణం. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పరాగ్ అగర్వాల్ టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్‌ను ఎంకరేజ్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన తర్వాత పరాగ్ భారత్ జెండా పట్టుకొని వీధుల్లో తిరిగిన ఫోటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Twitter CEO Parag Agarwal: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్ఫిట్ అమెరికాది! -
Anand Mahindra: ఇది మరో ప్యాండెమిక్.. ఇండియన్ వైరస్.. వ్యాక్సిన్ కూడా లేదు
Indian industrialist Anand Mahindra Counter To Irish Billionaire: ట్విట్టర్ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ పగ్గాలు చేపడుతున్నారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారతీయులే కాకుండా అనేక దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఎలన్‌మస్క్ లాంటి వారు ట్విట్టర్లో కంగ్రాట్స్ తెలిపారు. ఇదే సమయంలో ఐరీష్ బిలియనీర్, స్ట్రైప్ కో ఫౌండర్ ప్యాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్ తదితర ఇంటర్నేషనల్ సంస్థలకు ఇండియన్లు సీఈవోలు అయ్యారంటూ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. టెక్నాలజీ ప్రపంచంలో ఇండియనల్లు అద్భుతాలు చేస్తున్నాడని ప్రశంసించాడు. అయితే అంతటితో ఆగకుండా ఇంకో మాట జోడించారు. వలస వచ్చిన వారికి అమెరికా అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందనే విషయాని గుర్తు చేస్తున్నానంటూ ముక్తాయించారు. ప్యాట్రిక్ వ్యాఖ్యలకు ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో బదులిచ్చారు. ప్యాట్రిక్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆ రీట్వీట్ క్యాప్షన్‌లో ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్ సీఈవో వైరస్. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు’ అంటూ దీటుగా బదులిచ్చారు. This is one pandemic that we are happy & proud to say originated in India. It’s the Indian CEO Virus… No vaccine against it. 😊 https://t.co/Dl28r7nu0u — anand mahindra (@anandmahindra) November 29, 2021 చదవండి: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్ఫిట్ అమెరికాది! -
పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
Elon Musk On Parag Agrawal Twitter CEO Announcement: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్.. ఇలా ఏ కంపెనీని చూసుకున్నా ‘భారత్’ అనే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే.. ప్రతీ కంపెనీ ఉన్నత హోదాలో మనవాళ్లే ఉన్నారు కదా! ఇప్పుడు ఆ జాబితాలో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. ఈ క్రమంలో భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే.. తాజా పరిణామాలపై ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అమెరికాలో అగ్రకంపెనీలు ఆరింటిలో భారతీయుల(భారత సంతతికి చెందిన వాళ్లు) డామినేషన్ ఉందని ప్రస్తావిస్తూ.. సాంకేతిక ప్రపంచంలో భారతీయుల అమోఘమైన విజయం అద్భుతంగా ఉందని, వలసదారులకు ఇది మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందనడానికి సంకేతమంటూ ప్యాట్రిక్ ట్వీట్ చేశాడు. అంతేకాదు పరాగ్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అయితే ఈ ట్వీట్‌కు ప్రపంచంలో అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్ స్పందించాడు. USA benefits greatly from Indian talent! — Elon Musk (@elonmusk) November 29, 2021 భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఎలన్ మస్క్ రీట్వీటేశాడు. గతంలో టెక్ రంగంలో ఉన్న గూగుల్ పెద్ద కంపెనీలు ‘యంగ్ టాలెంట్’ను తొక్కిపడేస్తున్నాయని కామెంట్లు చేసిన మస్క్.. ఇప్పుడు ఇలా భారత మేధోసంపత్తి వంకతో ఏకంగా అమెరికా పైనే సెటైర్లు వేయడం విశేషం. Companies that have/had an Indian CEO IBM Pepsi Nokia Adobe Microsoft Cognizant Mastercard Deutsche Bank Alphabet (Google) And now Twitter — Save Invest Repeat 📈 (@InvestRepeat) November 29, 2021 చదవండి: పరాగ్ అగర్వాల్ ప్రొఫైల్ .. ఆసక్తికరమైన విషయాలివే -
Parag Agrawal : అడిషనల్ పేపర్ కోసం గొడవ.. ఆ సింగర్ క్లోజ్ ఫ్రెండ్ కూడా!
మైక్రో బ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పరాగ్ అగర్వాల్ నియమితుడైనప్పటి నుంచి అతను ఎవరూ? ఎక్కడ చదివాడు ? అతని కుటుంబ వివరాల గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే వ్యక్తిగత వివరాల విషయంలో పరాగ్ అగర్వాల్ చాలా గోప్యతను పాటిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఆయన జీవితానికి సంబంధించి సేకరించిన కొన్ని విశేషాలు... పరాగ్ అగర్వాల్ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్లోనే పరాగ్ చదువుకున్నారు. శ్రేయా ఘోషల్ క్లాస్మేట్ ముంబైలోని అటామిక్ ఎనర్జీస్కూల్‌లో పరాగ్ అగర్వాల్, నేటి ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ కలిసే చదువుకున్నారు. పరాగ్ పుస్తకాల పురుగుగా మారి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకుంటుంటే శ్రేయ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది. ముందుగా శ్రేయా ఇండియన్ సెలబ్రిటీగా మారగా.. ఆ తర్వాత కొంత కాలానికి పరాగ్ ఇంటర్నేషన్ ఫేమస్ పర్సన్‌గా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఇప్పటీకీ స్నేహం కొనసాగుతోంది. పరాగ్ ఇండియా వచ్చినా.. శ్రేయా అమెరికా వెళ్లినా కలుస్తుంటారు. ట్విట్టర్లో తరచుగా చాట్ చేస్తుంటారు కూడా. ఇంటర్‌లోనే గోల్డ్ మెడల్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2001లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జేఈఈ ఎగ్జామ్‌లో గొడవ ఐఐటీలో సీటు లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ వచ్చిన పరాగ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఇన్విజిలేటర్లతో గొడవ పడ్డాడు. పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల్లోనే తనకు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిన పరాగ్.. ఆ తర్వాత అడిషనల్ పేపర్లు కావాలంటూ ఇన్విజిలేటర్‌ని కోరాడు.. ‘ ఈ పరీక్షలో అడిషనల్ పేపర్ల కాన్సెప్ట్ లేదు’ అంటూ ఇన్విజిలేటర్ సమాధానం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇన్స్ట్రక్షన్ బుక్‌లెట్‌లో ‘‘టై ఆల్ ది సప్లిమెంట్స్ కరెక్ట్‌లీ ఇన్ రైట్ ఆర్డర్’’ అనే నిబంధన ఎందుకు చేర్చినట్టు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో పరీక్షలో విలువైన సమయం వృథా అయ్యిందని ఇప్పటికీ పరాగ్ గుర్తు చేసుకుని బాధపడతారు. ముంబై టూ స్టాన్ఫోర్డ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో చిన్న గొడవ జరిగినా.. ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరాడు. 2005లో పట్టా పుచ్చుకుని ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడే డాక్టరేట్ పట్టా సైతం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మైక్రోసాఫ్ట్‌తో మొదలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పరాగ్ బయటకు వచ్చిన తర్వాత మొదటి సారి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యాహూ, ఏటీ అండ్ టీల మీదుగా 2011లో ట్విట్టర్లో చేరారు పరాగ్. ఆ సమయంలో ట్విట్టర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి అటుఇటుగా ఉంది. అప్పటి నుంచి టీమ్ వర్క్ చేస్తూ ట్విట్టర్ ఉన్నతిలో కీలక భూమిక పోషించారు. తొలిచూపులు అక్కడే స్టాన్‌ఫోర్డ్‌లో చదివేప్పుడే వినీతతో పరిచయం. అమె అక్కడ మెడికల్ సైన్స్ విద్యార్థిగా చేరింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి అన్ష్ అగర్వాల్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం అండర్సన్ హారోవిట్జ్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థలో భాగస్వామిగా ఆమె ఉన్నారు. చదవండి: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్.. యంగెస్ట్ సీఈవో ఘనత,కానీ చిన్న మెలిక! -
Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ..
Twitter Parag Agrawal Youngest CEO In Top 500 Companies: మరో భారతీయుడు అత్యున్నత పదవిలో కొలువు దీరాడు. పరాగ్ అగర్వాల్ పేరును సోమవారం సోషల్ మీడియా జెయింట్ ‘ట్విటర్’కు సీఈవోగా ప్రకటించారు. ఈ ఫీట్‌తో సీఈవో హోదాలో పరాగ్ మరో అరుదైన ఘనత సాధించాడు!. ఎస్ అండ్ పీ(అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్) టాప్-500 కంపెనీల్లో యంగెస్ట్ సీఈవో ఘనత Parag Agrawal సాధించినట్లు తెలుస్తోంది. మెటా (గతంలో ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వయసు 37 ఏళ్లు. పరాగ్ వయసు కూడా 37 ఏళ్లే! అని రిపోర్టులు చెప్తున్నాయి. కానీ, జుకర్‌బర్గ్(మే 14, 1984) పరాగ్ కంటే చిన్నవాడంట!. అయినప్పటికీ ఇద్దరి వయసు ఒకటే కావడంతో యంగెస్ట్ సీఈవో హోదాలో ఈ ఇద్దరూ నిలిచినట్లు అమెరికా మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. విశేషం ఏంటంటే.. సెక్యూరిటీ కారణాలతో ఆయన పూర్తి ఐడెంటిటీని, ఇతర బయోడేటాను రివీల్ చేసేందుకు ట్విటర్ కంపెనీ అంగీకరించలేదు. అయితే పరాగ్ అగర్వాల్ 1984 ముంబైలో పుట్టినట్లు కొన్ని చోట్ల ప్రొఫైల్‌ను సెట్ చేస్తున్నారు కొందరు. సో.. అధికారికంగా ఆయన చిన్నవయస్కుడని ప్రకటన వెలువడాల్సి ఉంది. The Standard and Poor's 500(S&P 500) టాప్ 500 కంపెనీల్లో బెర్క్‌షైర్ హత్వే సీఈవో వారెన్ బఫెట్(95) అత్యధిక వయస్కుడిగా నిలిచారు. ఇక 500 పెద్ద కంపెనీల సీఈవో జాబితాను పరిశీలిస్తే సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. డైరెక్టర్ల వయసు సగటున 63 ఏళ్లుగా ఉంది. కానీ, విశాల కోణంలో పరిశీలిస్తే చిన్నవయసు వాళ్లు సీఈవో అర్హతలకు దూరంగానే ఉన్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా కంపెనీలను సమర్థవంతంగా నడిపేందుకు వయసు పెద్ద ఆటంకం కాకపోవచ్చని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ డేవిడ్ లార్కర్ అభిప్రాయపడుతున్నారు. ట్విటర్ ఫౌండర్, సీఈవో జాక్ డోర్సే(45).. ఫైనాన్షియల్ సర్వీస్-డిజిటల్ పేమెంట్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటి బాధ్యతలు చేపట్టడం కష్టతరమవుతున్న తరుణంలో ఆయన ట్విటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పరాగ్‌కు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక.. జాక్ డోర్సే ట్విటర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవచ్చనే అంటున్నారు. కానీ, 2022 వరకు(తన కాంట్రాక్ట్ ముగిసేవరకు) బోర్డులో మాత్రం మెంబర్‌గా కొనసాగనున్నాడు. -
భారతీయుడి చేతికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ ప్రపంచంపై మరో భారతీయ అమెరికన్ తనదైన ముద్ర వేయనున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే సోమవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీతోపాటు.. డార్సే సైతం ట్విట్టర్లో ప్రకటించారు. పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పనిచేశారు. ఫైనాన్షియల్ పేమెంట్స్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. దీంతో సంస్థలో వాటాలు కలిగిన పెద్ద ఇన్వెస్టర్లు.. డార్సే రెండు బాధ్యతలను సమర్థవంతంగా నడిపించగలరా? అన్న సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వెళ్లిపోయే సమయం వచ్చింది ‘‘కంపెనీ వ్యవస్థాపకుడి నుంచి సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వరకు 16 ఏళ్లలో ఎన్నో బాధ్యతల్లో పనిచేశాను. కంపెనీని వీడే సమయం వచ్చిందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకని? వ్యవస్థాపకుల నేతృత్వంలోని సంస్థ ప్రాముఖ్యం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అంతిమంగా ఇది ఎన్నో పరిమితులకు దారితీస్తుందని, వైఫల్యానికి ఏకైక అంశంగా మారుతుందని భావిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్ పేజీలోని తన పోస్ట్‌లో డార్సే వివరించారు. ఏకాభిప్రాయంతో ఎంపిక: ‘‘బోర్డు విస్తృత ప్రక్రియ, అన్ని ఆప్షన్లను పరిశీలించి ఏకాభిప్రాయంతో పరాగ్‌ను సీఈవోగా నియమించింది. కంపెనీని ఎంతో లోతుగా అర్థం చేసు కున్న పరాగ్ ముందు నుంచి నా ఎంపికే. సంస్థలో ప్రతీ కీలక నిర్ణయం వెనుక ఆయన ఉన్నా రు. పరాగ్ ఎంతో ఆసక్తి, పరిశీలన, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం కలిగిన వ్యక్తి. మనస్ఫూర్తిగా సంస్థను నడిపిస్తారు. నేను నిత్యం ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. సీఈవోగా ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది’’అని డార్సే అన్నారు. 2022 లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి.. పరాగ్ అగర్వాల్ ఐఐటీ బోంబేలో బీటెక్ విద్య పూర్తయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు. సీఈవోగా ఎంపిక కావడం తనకు గర్వకారణమని పరాగ్ ప్రకటించారు. ‘‘మీ (జాక్‌డార్సే) మార్గదర్శకత్వం, స్నేహానికి జోహార్లు. మీరు నిర్మించిన పని విధానం, సంస్కృతికి ధన్యుడను. సంస్థను కీలకమైన సవాళ్ల మధ్య నడిపించారు. దశాబ్దం క్రితం.. ఆ రోజులను నిన్నటిగానే భావిస్తాను. మీ అడుగుల్లో నడిచాను. ఉద్దాన, పతనాలు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను స్వయంగా చూశాను. వీటన్నింటినీ మించి గొప్ప విజయాలను చూస్తున్నాను. గొప్ప అవకాశాలు మా ముందున్నాయి’’అని అగర్వాల్ ప్రకటించారు. భారతీయుల ముద్ర భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్‌పాల్ సింగ్ బంగా తదితరులు తమ సత్తా చాటుతుండడం గమనార్హం. -
లేహ్ చైనాలో భాగం.. ట్విట్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత్ భూభాగాలను తప్పుగా చూపించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీకి లేఖ రాసింది. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు చేసే ఏ ప్రయత్నము ఆమోదయోగ్యం కాదని తీవ్రంగా హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్ భూభాగాన్ని ట్విట్టర్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా చూపించడంతో ప్రభుత్వం ట్విట్టర్ సీఈఓకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఐటి కార్యదర్శి అజయ్ సాహ్నీ మాట్లాడుతూ.. ‘లేహ్ లద్దాఖ్‌కు ప్రధాన కార్యాలయం. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లు రెండు కూడా భారత రాజ్యాంగం పాలించే ఇండియాలోని సమగ్ర, విడదీయరాని భాగాలు. మ్యాప్‌ల ద్వారా ప్రతిబింబించే భారతదేశం సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు ట్విట్టర్ చేసే ఏ ప్రయత్నమైనా పూర్తిగా చట్టవిరుద్ధం.. ఆమోదయోగ్యం కాదు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. (చదవండి: లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను) See this Twitter! When I put Hall of Fame Leh as the location, see what it shows. I tested it deliberately.@Twitter @TwitterIndia @TwitterSupport pic.twitter.com/sGMbmjJ60c — Nitin A. Gokhale (@nitingokhale) October 18, 2020 అంతేకాక ఇలాంటి ప్రయత్నాలు ట్విట్టర్‌కు అపఖ్యాతిని కలిగించడమే కాక మధ్యవర్తిగా దాని తటస్థత గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. దీనిపై ట్విట్టర్ ప్రతినిధి స్పందిస్తూ.. భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ విషయంలోని సున్నితత్వాన్ని మేము గౌరవిస్తాము. లేఖను అంగీకరిస్తాము’ అని తెలిపారు. -
కరోనా : ట్విటర్ సీఈఓ భారీ విరాళం
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారిపై పోరుకు మద్దుతుగా ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సే ముందుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో తన వంతు బాధ్యతగా వంద కోట్ల (ఒక బిలియన్) డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్-19 సహాయక చర్యలకు మద్దతుగా ఈ నిధులను అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన సంపదలో 28 శాతం తన ఛారిటీ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్ఎల్సి ద్వారా గ్లోబల్ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు డోర్సే ట్వీట్ చేశారు. ప్రజలకు సహాయపడటానికి ఈ రోజు మనం చేయగలిగినదంతా చేద్దామని, తన నిర్ణయం ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తున్నానంటూ వరుస ట్వీట్లలో వెల్లడించారు. డిజిటల్ పేమెంట్ గ్రూప్‌నకు సంబంధించిన తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జాక్ డోర్సీ ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు. తన సంపదలో నాలుగింట ఒక వంతు మొత్తాన్ని అతని ఛారిటీ ఫండ్‌కు విరాళంగా ఇస్తానని, అన్ని విరాళాల వివరాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాంటూ దీనికి సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు జాక్ డేర్సే. ఈ మహమ్మారి నుంచి బయటపడిన అనంతరం తాము కనీస ఆదాయం పథకం, బాలికల ఆరోగ్యం , విద్యపై దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు. I’m moving $1B of my Square equity (~28% of my wealth) to #startsmall LLC to fund global COVID-19 relief. After we disarm this pandemic, the focus will shift to girl’s health and education, and UBI. It will operate transparently, all flows tracked here: https://t.co/hVkUczDQmz — jack (@jack) April 7, 2020 -
రాజకీయ ప్రచారానికి ట్విట్టర్ నో!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ చెప్పారు. -
ట్విట్టర్‌కి అల్టిమేటం జారీ చేసిన పార్లమెంటరీ కమిటీ
-
హ్యాండిచ్చిన ట్విటర్ అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి ట్వీటర్ సీఈవో, ఇతర అధికారులు గైర్హాజరు కానున్నారు. కమిటీ ముందు హాజరు కావడానికి తమకు సమయం తక్కువగా వుందంటూ ఈ ప్రతిపాదనను ట్విటర్ అధికారులు తిరస్కరించారు. ఈ మేరకు ట్విటర్ ప్రతినిధి విజయా గద్దే ఫిబ్రవరి 7న బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీకి ఒక లేఖ రాశారు. సామాజిక మాధ్యమ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణ కోసం లోక్‌సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో ఒక కమిటీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే సహా మరోటాప్ అధికారి హాజరు కావాలని పార్లమెంటరీ ఐటీ కమిటీ సమన్లు జారీ చేసింది. వీరితో ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధును కమిటీ ఆదేశించింది. ఫిబ్రవరి 1న సమావేశానికి హాజరు కావాలని కమిటీ అధికారిక లేఖ రాసింది. ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న సమావేశం అజెండాను ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై సాధారణ ప్రజల అభిప్రాయాలు, సమీక్షలను కూడా కోరతామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఈ సమాశం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా పడింది. కాగా సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా భద్రతపై చెలరేగుతున్న ఆందోళనలు, రానున్న ఎన్నికలు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ట్విటర్ డేటా భద్రతపై గ్లోబల్‌గా విచారణను ఎదుర్కొంటోంది. ఈ కోవలో అమెరికా, సింగపూర్, ఈయూ తర్వాత, ఇండియా నాలుగదేశంగా నిలిచింది. -
ట్విటర్ సీఈవోపై భగ్గుమన్న బ్రాహ్మణులు
న్యూఢిల్లీ : ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ ప్రదర్శించిన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. భారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఓ ఫొటోకు ఫోజిస్తూ.. ఓ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్ తన ట్విటర్ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమయ్యాను. భారత్‌లో ట్విటర్ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది.. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో జాక్ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది. దీంతో బ్రాహ్మణుల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం వామపక్షవాదులతోనే ఎందుకు సమావేశమయ్యారని నిలదీస్తున్నారు. ట్విటర్ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాటు కామెంట్లతో స్పందించిన ట్విటర్.. జాక్ డోర్సీ కావాలని ఆ పోస్టర్ ప్రదర్శించలేదని, ఆ సమావేశానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త ఆమె అనుభవాలు పంచుకోవడంతో పాటు.. ఆ పోస్టర్‌ను ఆఫర్ చేయడంతో పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ట్విటర్ అందరి వాదనలు వింటుందని స్పష్టం చేసింది. -
షాకింగ్ : ట్విటర్ సీఈవో దగ్గర ల్యాప్‌టాప్ లేదట!
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ తెలుసుగా.. ఈ కంపెనీకి సీఈవో అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు. ఆయన వాడని గాడ్జెట్స్ అంటూ ఉండవు. ఆయన దగ్గర లేని వస్తువంటూ ఉండదు. కానీ ట్విటర్ సీఈవోగా పనిచేస్తున్న జాక్ డోర్సే ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. అది వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. డోర్సే దగ్గర ల్యాప్‌టాప్ లేదట. ప్రపంచాన్ని ఏలే ఓ అతిపెద్ద టెక్ కంపెనీ సీఈవో ల్యాప్‌టాప్ లేకపోవడమేంటని చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నిజంగానే జాక్ డోర్సే దగ్గర ల్యాప్‌టాప్ లేదట. దీనికి గల కారణం ఆయన ల్యాప్‌టాప్ వాడకపోవడమేనట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ల్యాప్‌టాప్ వాడననని, ప్రతీది తన ఫోన్ ద్వారానే నిర్వహిస్తానని చెప్పారు. తన సొంత ఆన్లైన్ సెక్యురిటీ ప్రాక్టిస్ విషయాలపై మాట్లాడుతున్న సమయంలో డోర్సే ఈ విషయాన్ని రివీల్ చేశారు. నోటిఫికేషన్లన్నింటినీ ఆపివేసి, ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తానని, తన ముందున్న దానిపైనే దృష్టిపెట్టడం తనకు అలవాటని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌పై అన్ని ఒకేసారి చేయడం కంటే ఇదే బెస్ట్ అని చెప్పారు. అయితే చిన్న ఫోన్ స్క్రీన్‌పై టైప్ చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించగా.. ల్యాప్‌టాప్‌లాగా ఫోన్‌ను వాడటానికి పలు వాయిస్ టైపింగ్ టూల్స్ ఉన్నాయన్నారు. కేవలం మైక్రోబ్లాగింగ్ కంపెనీని నిర్వహించడమే కాకుండా.. తన డిజిటల్ జీవితాన్ని, నిజ జీవితాన్ని తగిన విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ.. పలువురి మన్ననలు పొందుతున్నారు. ప్రైవసీ, సెక్యురిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలని, మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి, మీ వద్ద ఉన్న కంపెనీ డేటాకు రక్షణ కలిగించడానికి అవసరమైన టూల్స్ గురించి తెలుసుకుని ఉండాలని చెప్పారు. 2015లో జాక్ డోర్సే రెండోసారి ట్విటర్ సీఈవోగా ఎంపికయ్యారు. -
'ట్రంప్ ను ఆపడానికి వీలులేదు'
శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు వారధి ట్విట్టర్. ఈ సామాజిక మాధ్యమం ద్వారానే ట్రంప్ తన అభిప్రాయాలను, ఆదేశాలను ఎక్కువగా జారీచేస్తుంటారు. అయితే ట్వీట్ చేయకుండా ట్రంప్ ను ఎవరూ ఆపడానికి వీలులేదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ట్వీట్లు ఎంతో ముఖ్యమైనవనిగా ఆయన అభివర్ణించారు. జవాబుదారీ కోసమన్నా ఆయన చెప్పేది వినడం ఎంతో ముఖ్యమని చెప్పారు. విల్లీ గీస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోర్సే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ''మన నాయకుడి నుంచి డైరెక్టుగా అభిప్రాయాలు వినడం మనకెంతో అవసరమని నేను నమ్ముతున్నా. జవాబుదారీతనానికి ఇది ఎంతో అవసరం. మూసి ఉన్న గదుల మధ్య మాట్లాడుకోవడం కంటే, ఓపెన్ గా చర్చించుకోవడం ఎంతో ముఖ్యమని నేను విశ్వసిస్తా. ఒకవేళ ఈ ప్లాట్ ఫామ్స్ నుంచి హఠాత్తుగా వైదొలిగితే, ఎక్కడి వెళ్లేది, ఏం జరుగుతుంది? అంతా చీకటిమయమవుతుంది. ఇది అందరికీ మంచిదని నేను అనుకోవడం లేదు'' అని జాక్ డోర్సే చెప్పారు. ట్విట్టర్ యూజర్లు 328 మిలియన్లకు పెరిగారని, దీనికి గల ప్రధాన కారణం రాజకీయ ఉనికి బలపడటం, ట్రంప్ ట్వీట్లేనని చెప్పారు. కొన్ని సార్లు ట్రంప్ ట్వీట్లు చాలా వివాదాస్పదంగా, నొచ్చుకోలేనివిగా కూడా ఉంటున్నాయని చెప్పారు. ట్రంప్ ట్వీట్లు అంతా మంచికేనని అంత సులభతరంగా చెప్పలేమని కూడా తెలిపారు. కానీ ట్రంప్ ను ట్వీట్ చేయకుండా ఆపలేమని స్పష్టంచేశారు. ఇన్ ఛార్జ్ ల నుంచి ప్రత్యక్షంగా సంభాషణలు నిర్వర్తించడమే మంచిదని జాక్ డోర్సే చెప్పారు. -
ట్రంప్‌పై యుద్ధానికి ట్విట్టర్ సై
-
ట్రంప్‌పై యుద్ధానికి ట్విట్టర్ సై
శాన్ ఫ్రాన్సిస్కో: వివాదాస్పద నిర్ణయాలతో సంచలనంగా మారి విమర్శలు పాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా టెక్ దిగ్గజాలు వరుసగా రంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఏడు ముస్లిందేశాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై తమ పోరును ఎక్కుపెట్టాయి. తాజాగా ట్విట్టర్ కూడా ట్రంప్ పై యుద్ధానికి సై అంటోంది. ప్రముఖ హక్కుల సంస్థ చేపట్టిన ఆన్ లైన్ క్యాంపెయిన్ లో ట్విట్టర్ ఉద్యోగులు ,ట్విట్టర్ సీవీఓ జాక్ డోర్సే , ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఒమిడ్ కొర్ దేస్తానీ స్పందించారు . ఈ మేరకు గత కొన్ని రోజులుగా విరాళాల సేకరణ లో భాగంగా, ఉద్యోగులు, ట్విట్టర్ సీఈవో, ఈడీ ద్వారా మొత్తం 1.5 మిలియన్ డాలర్లను సేకరించి ఇచ్చారు. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు 53వేల డాలర్లను సేకరించారు. మొత్తం 1.59 మిలియన్ డాలర్ల విరాళాన్ని సేకరించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారంలో సూచించింది. మానవత, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావాన్ని పడవేయనున్న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై డోర్సే విచారం వ్యక్తం చేశారు. పౌర స్వేచ్ఛకు ఆటంకానికి వ్యతిరేకంగా అందరూ దృఢంగా నిలబడాలని ట్విట్టర్ జనరల్ కౌన్సెల్ విజయ గద్దే మేమో పేర్కొన్నారు. స్వేచ్ఛను రక్షించడానికి తమ వంతు పని పూర్తి చేశామని, వచ్చే నెలల్లో న్యాయపరంగా తమ పోరాటాన్ని సాగించనున్నట్టు చెప్పారు. ఏడు ముస్లిం దేశాలలో నుండి వచ్చే శరణార్థులు మరియు వలసదారుపై ట్రంప్ తాత్కాలిక నిషేధంపై పోరాటంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యే) ఆన్లైన్ క్యాంపెన్ చేపట్టింది. దీని ద్వారా మొత్తం విరాళాల సంఖ్య సుమారు 24 మిలియన్ (సుమారు రూ.161 కోట్లు) డాలర్లకు చేసింది. దేశాన్ని సురక్షితంగా ఉంచాలి... అదే సందర్భంలో దేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్న అసలైన శక్తులపై దృష్టిపెట్టాలంటూ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల కూడా ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై ప్రతికూలంగా స్పందించారు. అలాగే మైక్రోసాఫ్ట్ ట్రంప్ పై ఫెడరల్ కోర్టుపై దావా కూడా వేసింది. యాపిల్, నెట్ ఫ్లిక్స్, తెస్లా, ఉబెర్ లు కూడా ఇదే బాటలో పయనించాయి. మరోవైపు అధ్యక్ష పదవిని చేపట్టిన వారం వ్యవధిలోనే విధానాలపై ప్రపంచ దేశాలతోపాటు అమెరికాలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.. -
ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా..
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ కూడా శనివారం హ్యాకింగ్‌కు గురయింది. ఇటీవలే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల సోషల్ మీడియా అకౌంట్లను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసి, అదే అకౌంట్లో హ్యక్ చేసినట్టు వెల్లడించింది. జాక్ డార్సీ ఫాలోవర్స్ 3.73 మిలియన్ల మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది. కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది. -
లండన్ స్టార్టప్ ను ట్విట్టర్ కొనుగోలు
న్యూయార్క్ : మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, లండన్ కు చెందిన 18నెలల స్టార్టప్ మ్యాజిక్ పోని టెక్నాలజీని కొనుగోలు చేసింది. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించేందుకు ట్విట్టర్ ఈ కొనుగోలు చేపట్టింది. నిలిచిపోయిన వృద్ధిని పెంచడం కోసం ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు సౌండ్ క్లౌడ్ లో 700లక్షల డాలర్ల పెట్టుబడులు ప్రకటించిన తర్వాతి వారంలోనే ఈ కొనుగోలును ప్రకటించడం విశేషం. మిషన్ లెర్నింగ్ సామర్థ్యాలను విస్తరించుకోవడం కోసం మ్యాజిక్ పోని కొనుగోలు సాయపడుతుందని, 2014లో ఇమేజ్ సెర్చ్ స్టార్టప్ మ్యాడ్ బిట్స్ కొనుగోలుతో ఈ విస్తరణ ప్రారంభించామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే బ్లాగ్ లో పోస్టు చేశారు. 2015 జూన్ లో మరో మిషన్ లెర్నింగ్ స్టార్టప్ వెట్ ల్యాబ్ ను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. మ్యాజిక్ పోని టెక్నాలజీ కొనుగోలుకు ట్విట్టర్ ఎంతమొత్తంలో చెల్లించబోతుందో పేర్కొనలేదు. అయితే బోనస్ లతో కలిపి దాదాపు 1500లక్షల డాలర్లను ట్విట్టర్ ఆ కంపెనీకి చెల్లించస్తుందని టెక్నాలజీ వెబ్ సైట్ టెక్ క్రంచ్.కామ్ తెలిపింది. లైవ్, వీడియోల్లో తమ బలాన్ని విస్తరించేందుకు, ఉత్తేజపూర్వకమైన సృజనాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మ్యాజిక్ పోని టెక్నాలజీ ద్వారా ట్విట్టర్ కు ద్వారాలు తెరుచుకుంటాయని కంపెనీ పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రతిభతో లెర్నింగ్ టీమ్స్ బలాన్ని నిరంతరంగా పెంచడం కోసం ఇది ట్విట్టర్ కు సహకరిస్తుందని డోర్సే తెలిపారు. లోతైన లెర్నింగ్ రీసెర్చ్ అనేది తమ ప్రపంచాన్ని మెరుగుపరుస్తుందని, తమ పనిని, లెర్నింగ్స్ ను కమ్యూనిటీలతో పెంచుకోవడం కోసం తోడ్పడుతుందని డోర్సే పేర్కొన్నారు. మరోవైపు నుంచి ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ను టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంతంచేసుకోబోతుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్ ను సొంతం చేసుకునే రేసులో గూగుల్ ముందంజలో ఉందని, దాని తర్వాతి స్థానంలో ప్రపంచ మీడియా ప్లేయర్ కంకాస్ట్ పోటీపడుతుందని తెలుస్తోంది. అంతేకాక ఇంటర్నెట్ ఆధారిత సంస్థ యాహులోనైనా దీన్ని విలీనం చేయాలని ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు ఆ కంపెనీతో సంప్రదింపులు జరిపినట్టు రిపోర్టులు వచ్చాయి. -
ఈ సీఈవో సేవలు ఉచితం...!
ట్వీటర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయన కంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ. 62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్వీటర్కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అయితే ఫేస్‌బుక్‌కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్వీటర్ కంటే ఫేస్బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్వీటర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్వీటర్లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సి అన్నారు. దీనివల్లే ట్వీటర్కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు. -
ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయనకంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ.62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనతంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్విట్టర్‌కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. అయితే ఫేస్‌బుక్‌కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లున్నారు. దాంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్విట్టర్ కంటే ఫేస్బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లుండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్విట్టర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్విట్టర్లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సీ అన్నారు. దీనివల్లే ట్విట్టర్‌కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు. -
బాస్ అంటే ఇతడేరా!
కాలిఫోర్నియా: జీవితాల్లో వెలుగులు నింపే తల్లి, తండ్రి, గురువు, అతిథుల తర్వాతి స్థానాన్ని బాస్కే ఇచ్చేయాలని ట్విట్టర్ ఉద్యోగులు కోరుతూ ఉండొచ్చు! ఎందుకంటారా.. వాళ్ల బాస్, అదేనండీ ట్విట్టర్ కంపెనీ సీఈవో జాక్ డోర్సీఉద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించాడు. కంపెనీలో తనకున్న షేర్లలో 33 శాతాన్ని ఉద్యోగుల సహాయ నిధికి ధారాదత్తం చేశాడు. ఉద్యోగుల పేరిట బదిలీ చేసిన ఆ షేర్ల విలువ 197 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 1,277 కోట్ల రూపాయలు! షేర్లు ఇవ్వడాన్ని ఉద్యోగులపై తిరిగి పెట్టుబడిపెడుతున్నట్లు (రీఇన్వెస్ట్మెంట్)గా జాక్ అభివర్ణించినా, అతడి నిర్ణయం వేలాది ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పులకు నాంది పలకడం ఖాయం. వేలకోట్ల విలువైన ట్విట్టర్ కంపెనీలో అతడికి 3.2 శాతం వాటా ఉంది. అందులో నుంచి 33 శాతం అంటే కంపెనీలో 1 శాతం విలువైన షేర్లు ఉద్యోగులకు పంచేయడం ద్వారా అతని వాటా 2.2 శాతానికి తగ్గింది. అయినా సరే ఉద్యోగుల సంక్షేమమే ప్రధానమన్నది ఆయన తలంపు. అయితే సీఈవోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులైనా గడవక ముందే జాక్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబూ ఉంది! గత వారమే 336 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. మిగతా ఉద్యోగులకు తనపట్ల నమ్మకాన్ని, పని పట్ల మరింత ప్రేమను కల్గించేందుకే షేర్ల గాలం వేసినట్లు తెలిసింది. లోగుట్టు ఏదైనా.. ఉద్యోగులు మాత్రం మంచి ఖుషీగా ఉన్నారు. -
ట్వీటర్లో 336 ఉద్యోగాల కోత
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్వీటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ లో మొత్తం 4,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో తొలగిస్తున్న ఉద్యోగులు 8%గా ఉన్నారు. కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా ట్వీటర్ సీఈవో జాక్ డార్సే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్వీటర్ నిధుల కొరతతో సతమతమౌతోంది. ట్వీటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సే ఇటీవలనే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. వ్యయాలను తగ్గించుకోవడం వల్ల లాభాలు పెరగొచ్చు కానీ అదే సమయంలో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడటం, కం పెనీ భవిష్యత్తు వంటి తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. -
ట్విట్టర్ సీఈవో రేసులో తెలుగు మహిళ
విజయవాడ: ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌కు సీఈవోగా విజయవాడకు చెందిన ఎల్లపద్ది పద్మశ్రీ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. నలుగురి పేర్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలనకు తీసుకుంది. ఇందులో పద్మశ్రీ పేరు కూడా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. పద్మశ్రీ ఎలిమెంటరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు విజయవాడలోనే చదువుకున్నారు. అనంతరం ముంబై, అమెరికాల్లో విద్యాభ్యాసం చేశారు. మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో 23 ఏళ్ల పాటు పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో పద్మశ్రీ 1961లో జన్మించారు. పదో తరగతి వరకు చిల్డ్రన్స్ మాంటిస్సోరిలో.. మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్ చదివారు. ఐఐటీ, ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలో కార్నెల్లి యూనివర్సిటీలో పీజీ చేసిన అనంతరం మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో 1984లో ఉద్యోగంలో చేరిపోయారు. 2007 వరకు పనిచేశారు. 2007లో సిస్కో ఎనర్జీ సిస్టమ్స్‌లో సీటీవోగా చేరారు. 2015 జూన్‌లో సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ఆమెకు భర్త మోహన్‌దాసు వారియర్, కుమారుడు కర్నా వారియర్ ఉన్నారు.