ట్విటర్ సీఈవోగా లిండా యక్కరినో (Linda Yaccarino) దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాను అనుకుంటున్నట్లుగా ట్విటర్‌ను మరింత లాభదాయంగా మార్చేందుకు లిండా నాయకత్వం అవసరమని మస్క్ భావించినట్లు సమాచారం. కాబట్టే ఆమెను సీఈవోగా నియమించేందుకు మొగ్గు చూపినట్లు పలు నివేదిలకు వెలుగులోకి వచ్చాయి. సీఈవోగా లిండాను ఎంపిక చేయడంపై ఆమెకున్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
►లిండా యక్కరినో ఎన్‌బీసీయూ యూనివర్సల్ (NBCUniversal)లో 10 సంవత్సరాలకు పైగా వివిధ విభాగాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా అడ్వటైజింగ్ సేల్స్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. ఆ సంస్థకు చెందిన పికాక్ స్ట్రీమింగ్ సర్వీస్‌లను లాంచ్ చేయడంలో ఆమెదే కీలక పాత్ర.
►వార్నర్ బ్రదర్స్‌కు చెందిన టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలో దాదాపూ 19 ఏళ్ల పాటు సుధీర్ఘంగా పనిచేశారు. నెట్‌వర్క్ ప్రకటన విక్రయాల కార్యకలాపాలను డిజిటల్ మాద్యమంలో రంగ ప్రవేశం చేయించిన ఘనత లిండాకే దక్కుతుంది
►పెన్ స్టేట్ యూనివర్శిటీలో లిండా లిబరల్ ఆర్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తి చేశారు.
►గత నెలలో మియామీలో జరిగిన అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో యక్కరినో మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. సమావేశంలో, లిండా చప్పట్లతో మస్క్‌ను స్వాగతించారు. అతని పనితీరును ప్రశంసిస్తూనే ‘స్నేహితుడు’, ‘మిత్రుడు’ అని సంబోదిస్తూ అందరికి ఆశ్చర్యానికి గురి చేశారు.
►అయితే, ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు లిండాకు అన్నీ అర్హతలున్నాయి. ఆమె ఎంపిక సరైందేనని యాడ్ ఫోంటెస్ మీడియాలో సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపడుతున్న లౌ పాస్కాలిస్ అన్నారు. లిండాకు ఎలాన్ మస్క్ నాయకత్వంలో పనిచేయాలని ఎందుకు అనిపించిందో అర్ధంకాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చదవండి👉 ఎలాన్ మస్క్ సంచలనం, నా కొడుకు బ్రెయిన్‌లో ఈ చిప్‌ను అమర్చుతా?
Comments
Please login to add a commentAdd a comment